'ఖైమర్‌ అప్సర'గా భారత దౌత్యవేత్త! | Devyani Khobragade Dresses As 'Khmer Apsara' On Cambodia's New Year | Sakshi
Sakshi News home page

'ఖైమర్‌ అప్సర'గా భారత దౌత్యవేత్త!

Published Sun, Apr 14 2024 10:36 AM | Last Updated on Sun, Apr 14 2024 11:04 AM

Devyani Khobragade Dresses As Khmer Apsara On Cambodians New Year  - Sakshi

భారత రాయబారి దేవయాని ఖోబ్రోగాడే 'ఖైమర్‌ అప్సర'గా దుస్తులు ధరించి సందడి చేశారు. అందుకు సంబంధించిన ఫోటోలను కంబోడియాలోని భారత రాయబార కార్యాలయం సోషల్‌ మీడియా ఎక్స్‌లో పంచుకుంది. ఖైమర్ న్యూ ఇయర్ సందర్భంగా కంబోడియన్‌లకు శుభాకాంక్షలు తెలియజేసేందుకు భారత దౌత్యవేత్త దేవయాని ఇలా కంబోడియన్‌ సంప్రదాయ దుస్తులను ధరించి ఖైమర్‌ అప్సరగా కనిపించారు. ఆమెకు ఖైమర్ సంస్కృతి, సంప్రదాయం పట్ల ప్రగాఢమైన అభిమానం ఉంది. అందువల్ల ఆమె ఇలా ఆ దుస్తుల్లో ధరించి ఆ నాగరికత పట్ల ఉన్న అభిమానాన్ని చాటుకుంటూ.. కాంబోడియన్‌ వాసులకు ఖైమర్‌ నూతర సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

అంతేగాదు మా కాంబోడియా స్నేహితులందరూ ఈ ఖైమర్‌ నూతన సంవత్సర వేడుకలను ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాని కాంబోడియా భారత రాయబార కార్యాలయం అధికారిక సోషల్‌ మీడియా ఎక్స్‌లో పేర్కొంది. ఈ దౌత్యవేత్త ధరించి సంప్రదాయ కంబోడియన్‌ వస్త్రధారణ పురాణాల్లో ఉన్న పురాత ఖైమర్‌ కళకు నిలువెత్తు నిదర్శనంలా ఉంటుంది. ఈ వస్త్రధారణకు తగ్గట్టు ధరించిన ఖైమర్ సాంపాట్ అనే బంగారు ఆభరణం ఒక రకమైన ర్యాప్-ఎరౌండ్ స్కర్ట్‌తో కూడిన కిరీటం మాదిరిగా ఉంది.

కాగా, దేవయాని 1999-బ్యాచ్ ఇండియన్ ఫారిన్ సర్వీస్ అధికారి. తన 24 ఏళ్ల కెరీర్‌లో బెర్లిన్, ఇస్లామాబాద్, రోమ్,  న్యూయార్క్‌లోని భారతీయ దౌత్యకార్యాలయాల్లో పనిచేశారు. అలాగే పాకిస్తాన్‌, ఆఫ్ఘనిస్తాన్‌, ఇరాన్‌ వంటి దేశాల్లో విదేశాంగ మంత్రిత్వ ప్రధాన కార్యాలయంలో పనిచేశారు. అంతేగాక సెంట్రల్ యూరప్‌లో ఫైనాన్స్ అండ్‌ సీపీవీ (కాన్సులర్ పాస్‌పోర్ట్, వీసా) విభాగాలతో సహా అనేక విభాగాలలో పనిచేశారు దేవయాని.

(చదవండి: ఒడిస్సీ బాలినీస్‌ నృత్యాల వందేమాతర సంగమం!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement