Dressed
-
'ఖైమర్ అప్సర'గా భారత దౌత్యవేత్త!
భారత రాయబారి దేవయాని ఖోబ్రోగాడే 'ఖైమర్ అప్సర'గా దుస్తులు ధరించి సందడి చేశారు. అందుకు సంబంధించిన ఫోటోలను కంబోడియాలోని భారత రాయబార కార్యాలయం సోషల్ మీడియా ఎక్స్‌లో పంచుకుంది. ఖైమర్ న్యూ ఇయర్ సందర్భంగా కంబోడియన్లకు శుభాకాంక్షలు తెలియజేసేందుకు భారత దౌత్యవేత్త దేవయాని ఇలా కంబోడియన్ సంప్రదాయ దుస్తులను ధరించి ఖైమర్ అప్సరగా కనిపించారు. ఆమెకు ఖైమర్ సంస్కృతి, సంప్రదాయం పట్ల ప్రగాఢమైన అభిమానం ఉంది. అందువల్ల ఆమె ఇలా ఆ దుస్తుల్లో ధరించి ఆ నాగరికత పట్ల ఉన్న అభిమానాన్ని చాటుకుంటూ.. కాంబోడియన్ వాసులకు ఖైమర్ నూతర సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అంతేగాదు మా కాంబోడియా స్నేహితులందరూ ఈ ఖైమర్ నూతన సంవత్సర వేడుకలను ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాని కాంబోడియా భారత రాయబార కార్యాలయం అధికారిక సోషల్ మీడియా ఎక్స్‌లో పేర్కొంది. ఈ దౌత్యవేత్త ధరించి సంప్రదాయ కంబోడియన్ వస్త్రధారణ పురాణాల్లో ఉన్న పురాత ఖైమర్ కళకు నిలువెత్తు నిదర్శనంలా ఉంటుంది. ఈ వస్త్రధారణకు తగ్గట్టు ధరించిన ఖైమర్ సాంపాట్ అనే బంగారు ఆభరణం ఒక రకమైన ర్యాప్-ఎరౌండ్ స్కర్ట్‌తో కూడిన కిరీటం మాదిరిగా ఉంది. కాగా, దేవయాని 1999-బ్యాచ్ ఇండియన్ ఫారిన్ సర్వీస్ అధికారి. తన 24 ఏళ్ల కెరీర్లో బెర్లిన్, ఇస్లామాబాద్, రోమ్, న్యూయార్క్‌లోని భారతీయ దౌత్యకార్యాలయాల్లో పనిచేశారు. అలాగే పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్ వంటి దేశాల్లో విదేశాంగ మంత్రిత్వ ప్రధాన కార్యాలయంలో పనిచేశారు. అంతేగాక సెంట్రల్ యూరప్‌లో ఫైనాన్స్ అండ్ సీపీవీ (కాన్సులర్ పాస్‌పోర్ట్, వీసా) విభాగాలతో సహా అనేక విభాగాలలో పనిచేశారు దేవయాని. Ambassador Devyani Khobragade has a deep admiration for Khmer culture and tradition. Embracing the spirit of Khmer New Year, she elegantly dressed as a Khmer Apsara, embodying the rich bond of our civilizations. Wishing all our 🇰🇭 friends a joyous Khmer New Year celebration pic.twitter.com/5SfQ42g5ln — India in Cambodia (@indembcam) April 13, 2024 (చదవండి: ఒడిస్సీ బాలినీస్ నృత్యాల వందేమాతర సంగమం!) -
అక్షతామూర్తి ధరించే చెప్పుల ధర తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే!
ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు, బిలియనీర్ నారాయణమూర్తి కుమార్తె అక్షత మూర్తి విభిన్నమైన దుస్తులతో ఫ్యాషన్‌కే ఐకాన్‌గా ఉంటుంది. ఆమెకూడా ఫ్యాషన్ డిజైనర్ కావడంతో ఆమె ధరించే దుస్తులు దగ్గర నుంచి చెప్పులు వరకు బ్రిటన్ అంతటా ఓ హాట్‌టాపిక్ ఉంటుంది. బ్రిటన్‌లో మంచి ఫ్యాషన్ డిజైనర్‌వేర్‌లతో ఆకట్టుకునే ప్రుమఖ వ్యక్తుల్లో అక్షతామూర్తి కూడా ఒకరు. యూకేలో మంచి ఫ్యాషన్ బ్రాండ్ దుస్తులతో ఓ ట్రెండ్ సృష్టించిన వ్యక్తిగా అక్షతామూర్తినే ముందుంటారు. యూకేలో మంచి ఫ్యాషన్ ఫాలో అయ్యే ప్రముఖ బాలీవుడ్ హిరోల సరసన ఆమె కూడా ఉండటం విశేషం. ఆమె చెప్పులకు పెట్టే ఖర్చే వేలల్లో ఉంటుందని సమాచారం. ఈవిషయమై ఆమె వార్తల్లో కూడా నిలిచారు. ఈ విషయాన్ని యూకేలోని ప్రఖ్యాతి గాంచిన టాట్లర్ మ్యాగ్జైన్ ఓ కథనంలో పేర్కొంది. ఆమె కేవలం స్కూల్ రన్ కోసం దాదాపు రూ. 60 వేలు ఖరీదు చేసే చెప్పులను ధరించినట్లు వెల్లడించింది. ఆమె బ్రిటన్‌లో వాడే పిల్‌బాక్స్ టోపీలు, లేయర్డ్ ముత్యాలు ధరించకుండా చాల సింపుల్ సిటీతో ఉన్నట్లు కనిపించినప్పటకీ..ఆమె మంచి లగ్జరీతో కూడిన ష్యాషన్ని ఫాలో అవుతుంది. ఆమె ధరించే స్కర్ట్ ధర సైతం రూ. లక్ష రూపాయాల పైనే ఉంటుంది. పెద్ద హడావిడి ఆర్భాటంగా ఉండదు. పైకి ఏదో ఓ సాధారణ స్తీలా ఆమె ఆహార్యం ఉంటుంది . బహుశా దీనినే 'స్టెల్త్ హెల్త్' అంటారు కాబోలు. ఇదిలా ఉండగా ఇలా బ్రిటన్ ప్రధాని రుషి సునాక్, ఆమె భార్య ధరించే ఫ్యాషన్ డిజైనర్ వేర్ రేంజ్ విషయమై తరుచుగా విమర్శపాలయ్యారు. బ్రిటన్ ప్రధాని సునాక్ ప్రచారానికి వెళ్లేటప్పుడూ ధరించే సూట్(కోటు) ధరే రూ. 3 కోట్లుపైనే ఉందని, అతడి ధరించే షూ ధర సైతం రూ. 51 వేలు వరకు ఉంటుందంటూ విమర్శలు వెల్లువెత్తాయి. అలాగే అక్షత మూర్తి బీరువా ర్యాకులన్నీ ఖరీదైన బ్రాండ్లతో ఓ మాల్ని తలిపిస్తుందని బ్రిటన్ వాసులు చర్చించుకోవడం గమనార్హం. View this post on Instagram A post shared by Akshata Murty (@akshatamurty_official) (చదవండి: ఆ గోల్డ్‌కి పెరుగుతున్న క్రేజ్..రోజుకో నగతో మహిళామణులు ధగ ధగ మెరుస్తున్నారు!) -
వైరల్ వీడియో: లవర్‌ను కలిసేందుకు వచ్చి బుక్కయిన యువకుడు
-
వైరల్: లవర్‌ను కలిసేందుకు వచ్చి బుక్కైన ప్రియుడు
లక్నో: ప్రేమించుకున్నారు.. వారి ప్రేమ విషయం అమ్మాయి ఇంట్లో తెలిసిపోయింది. దీంతో అతడి నుంచి ఆమెను దూరం చేశారు. అమ్మాయిని ఇంట్లో నుంచి బయటకు వెళ్లకుండా చేశారు. దీంతో ఆ యువకుడు తన ప్రేయసిని కలిసేందుకు అన్నీ విధాల ప్రయత్నించాడు. చివరకు ఇలా అయితే కుదరదని వేషం మార్చాడు. అబ్బాయి కాస్త అమ్మాయిలా తయారై తన లవర్ ఇంటికి వెళ్లాడు. అయితే అక్కడే తప్పు చేశాడు. బదౌహీ జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన ఇద్దరు ప్రేమించుకున్నారు. తరచూ వీరిద్దరు కలుసుకుంటుండడంతో అమ్మాయి ఇంట్లో తెలిసింది. తన ప్రేయసిని ఎలాగైనా చూడాలని ఆ యువకుడు పై విధంగా చేశాడు. అచ్చం అమ్మాయి మాదిరి తయారయ్యాడు. జుట్టు మొదలుకుని వస్త్రధారణ, పాదరక్షలు, అమ్మాయిలు వాడే వస్తువులు ఇలా మొత్తం అమ్మాయి మాదిరి తయారయ్యాడు. అయితే సాధారణంగా తయారైతే ఎవరూ గుర్తు పట్టకపోయి ఉండవచ్చు. కానీ నవ వధువు మాదిరి తయారై తమ ఇంటికి రావడంతో కుటుంబసభ్యులు అనుమానించారు. ఏం కావాలి అని ప్రశ్నించగా తన ప్రేయసి పేరు చెప్పాడు. అయితే అప్పటికే కుటుంబసభ్యులు గుమిగూడడంతో అతడు కొంత కంగారుపడ్డాడు. ఈ క్రమంలో ముఖం కనిపించకుండా చున్నీ వేసుకుంటుండడంతో జుట్టు పక్కకు జరిగింది. ముఖం చూపించాలని కుటుంబీకులు పట్టుబట్టి తీసేందుకు ప్రయత్నించగా జుట్టు కిందపడిపోయింది. దీంతో అందరూ షాక్‌కు గురయ్యారు. చున్నీ తీసి చూడగా ఆ యువకుడు కనిపించాడు. వెంటనే ఆ యువకుడు అక్కడి నుంచి పరారయ్యాడు.దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వార్త చదివిన వారంతా పగలబడి నవ్వుకుంటున్నారు. మరికొందరు జాలి పడుతున్నారు. ఇంకొందరు ప్రేమ కోసం ఈ మాత్రం తిప్పలు పడాల్సిందే అని కామెంట్లు చేస్తున్నారు. ఏమున్నా ఆ అమ్మాయి కోసం అంత కష్టపడ్డాడంటే ఆ అబ్బాయి అమ్మాయిని ఎంత ప్రేమిస్తున్నాడోనని నెటిజన్లు చెబుతున్నారు. ఇచ్చేయండి మీ పిల్లను అని సూచనలు చేస్తున్నారు. సినిమాలో మాదిరి సీన్ నిజ జీవితంలో జరగడంతో ఆ వీడియో వైరలయ్యింది. మీరు చూసేయండి. -
ముద్దొచ్చే అబ్బాయిలు
స్టేజీ మీద ఈ అబ్బాయిలను చూసి అమ్మాయిలే అనుకుంటారని, ప్రేక్షకులలో నుంచి మహిళలు వచ్చి, వారిని హత్తుకుని, బుగ్గమీద ముద్దుల వర్షం కురిపిస్తారని ‘లావణి’ నాట్య బృందాలలో ఒక బృందానికి సారథి అయిన హంకారే చిరునవ్వుతో చెబుతున్నారు. స్త్రీ వేషం ధరించి, థీమ్‌ని మార్చి యువకులు చేస్తున్న ప్రాచీన ‘లావణి’ నాట్య రూపకాలకు మహారాష్ట్రలో ఇప్పుడు అమితమైన ప్రేక్షకాదరణ లభిస్తోంది. పాటలు పాడుతూ, నాట్యం చేసే జానపద కళకు ‘లావణి’ అని పేరు. ఇటీవల కొంతకాలంగా మహారాష్ట్ర యువకులు స్త్రీ వేషధారణతో ఈ కళను పండిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తూ ‘లావణి’ తో ప్రేక్షకులను రంజింపజేస్తున్నారు. ‘నాట్యం చేస్తున్న ఆ మూడు గంటలూ మమ్మల్ని మేం మరచిపోతాం’ అంటాడు ఆనంద్ సతామ్ అనే లావణి నాట్యకారుడు. మహారాష్ట్ర పట్టణప్రాంతాల్లో అమ్మాయి రూపంలో నాట్యం చేస్తున్న వందలాదిమందిలో ఆనంద్ సతామ్ ఒకరు. జనవరి 25న ముంబైలోని ‘నేషనల్ సెంటర్ ఫర్ ద పెర్ఫార్మింగ్ ఆర్ట్స్’ లో సావిత్రి మేధాతుల్ రచించిన సంగీత రూపకం ‘సంగీత బరి’లో ఆనంద్ సతామ్ తో పాటు కామ్తే అనే యువకుడు ‘లావణి’ ని ప్రదర్శించాడు. ఈ నాట్యం చేసేవారి కదలికలు.. వేదిక మీదే కాదు, వేదిక బయట కూడా స్త్రీలాగే మారుతుంటాయి. దాంతో మగపిల్లలు ఆడపిల్లలుగా మారిపోతారేమోననే భయంతో కుటుంబ సభ్యులు వారిని ఈ పాత్రలు వెయ్యొద్దని నిరోధించేవారు. కాని సతామ్, కామ్తే ఇద్దరూ లావణి నాట్యాన్ని ప్రదర్శించడానికే ఉత్సాహం చూపించారు. ‘‘ఒకప్పుడు నన్ను ఈ నాట్యం చేయొద్దని చెప్పినవారే, ఇప్పుడు నా నాట్యం చూసి గర్వపడుతున్నారు, నా నైపుణ్యం చూసి ఆశ్చర్యపోతున్నారు’ అంటాడు కామ్తే. ఉన్నవి రెండు విధానాలు పట్ణణ ప్రేక్షకులు లావణి కళారూపాన్ని మోహవాంఛకు రిఫ్లెక్షన్గా భావిస్తుంటారు. వాస్తవానికి ఈ నాట్యంలో ఆధ్యాత్మికత, వేదాంతం, నిరక్షరాస్యత, రైతుల ఆత్మహత్యల గురించి కూడా ఉంటుంది. ప్రధానంగా అయితే ‘లావణి’ని రెండు రకాలుగా ప్రదర్శిస్తారు. ‘దోల్కీ ఫాడ్ తమాషా’, ‘సంగీత్ బరి’. దోల్కీ ఫాడ్ తమాషాలో లావణి ప్రదర్శన నాలుగు నుంచి ఎనిమిది గంటలపాటు నడుస్తుంది. ఇందులో కళాకారులు గుంపులు గుంపులుగా ప్రయాణిస్తూంటారు. గ్రామాలలో వారంవారం పెట్టే గ్రామసంతలో, పశువుల సంతలలో ఎక్కువమంది ప్రేక్షకుల ఎదుట ప్రదర్శిస్తారు. సంగీత్ బరిలో.. గుంపులుగా, సంచరిస్తూ, కొద్దిమంది ప్రేక్షకుల ముందు కూడా నటిస్తారు. వీరికి ఏడాదికి సరిపడా కాంట్రాక్టు ఉంటుంది. సాధారణంగా ఆడవారు మాత్రమే సంగీత్ బరిలో నటిస్తు్తంటారు. ముఖ్యంగా భాటు కోల్హాటి లేదా కళావంతుల కుటుంబాలకు చెందినవారు ఈ నాట్యాన్ని ప్రదర్శిస్తారు. వారి ఆచారం ప్రకారం ఈ కుటుంబాలలోని మహిళలు వివాహానికి అనర్హులు. వీరు కేవలం వేశ్యావృత్తిలో మాత్రమే జీవించాలి. కొత్తగా మూడో విధానం కామ్తే, సతామ్ల ప్రదర్శనలు మూడోరకానికి చెందినవి. వీటిని బ్యానర్ ప్రదర్శనలు అంటారని చెబుతారు జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయానికి చెందిన పి.హెచ్డీ స్కాలర్ సేజల్ యాదవ్. ఈయన లావణి ప్రదర్శకుల మీద విస్తృతంగా పరిశోధన చేశారు. 2016లో ‘లావణి లైవ్’ పేరున ఒక ప్రదర్శన సైతం ఏర్పాటు చేశారు. లావణి ప్రదర్శనలాంటివే సమకాలీనంగా ఎన్నో ఉన్నాయి. ప్రతివారికి వారి సొంత ఆలోచన ఉంటుంది. లావణిలోని అసలు విషయాన్ని వీరు పక్కకు తోసేసి, సొంతంగా రూపొందించుకుంటూ, అందరినీ వారి గుంపులో చేర్చుకుంటున్నారు. లావణిని ప్రదర్శించేవారిలో ఒకరైన ‘హంకారే బృందం’ సుమారు మూడుమాసాల పాటు లావణిలా నటించడానికి సాధన చేస్తుంది. అమ్మాయిలా నడవటం, అమ్మాయిలా మాట్లాడటం వంటివి రంగస్థలం మీద ప్రదర్శించడానికి ముందే నేర్చుకుంటారు. వారిని చూసి అమ్మాయిలే అనుకుంటారని, ప్రేక్షకులలో నుంచి మహిళలు వచ్చి, వారిని హత్తుకుని, బుగ్గ మీద ముద్దుల వర్షం కురిపిస్తారని చెబుతారు బృంద సారథి హంకారే. ఇక ‘బిన్ బేకాంచా తమాషా’ అనే మరో విధానం అయితే చాలా కాలం విజయవంతంగా నడిచింది. కాని నిర్మాణ వ్యయం పెరిగిపోవడం, బుకింగ్స్ తగ్గిపోవడంతో ఈ కార్యక్రమం ముగిసిపోయింది. ఈ క్రమంలోనే లావణిలో వినూత్న శైలులకు బీజాలు పడ్డాయి. కామ్తే, సతామ్ సంగీత్ బరి విధానంలో ఇస్తున్న ప్రదర్శనలైతే పట్టణ ప్రజలలో వివిధ వర్గాల వారి మధ్య ఉన్న దూరాన్ని తుడిచివేస్తున్నాయి. – జయంతి తొమ్మిది గజాల చీర ఢోల్కీ అనే వాద్య పరికరం వాయిస్తూంటే ఈ లావణి నాట్యం చేస్తుంటారు. తొమ్మిది గజాల చీర ధరించి మహిళలు ఈ నాట్యం చేస్తారు. నాట్యానికి పాడే పాటలో వేసే దరువు చాలా వేగంగా ఉంటుంది. లావణ్య అనే పదం నుంచి లావణి పదం వచ్చింది. ఈ పదానికి ‘అందమైన’ అని అర్థం. మరాఠీలోని లావణే అనే పదం నుంచి వచ్చినట్టు చెబుతారు. -
కోకిల గీతం... తుమ్మెద రాగం
‘అన్వేషణ’ సినిమాలో భానుప్రియ, కార్తీక్ లాంటివాళ్లు.. అక్షిత, పీయూష్! ఆ సినిమాలో భానుప్రియ చెట్టూ పుట్టా తిరిగి శ్రావ్యమైన శబ్దాలను అన్వేషిస్తూ ఉంటే, కార్తీక్ ఆమెకు హెల్ప్ చేస్తుంటాడు. ఇక్కడా అంతే. అక్షితకు ఆమె భర్త పీయూష్ పరిశోధన సహకారం అందిస్తున్నారు. ఈ దంపతులకు వినాయక్ అనే మరో ప్రకృతి ప్రేమికుడు కూడా తోడయ్యాక.. అంతరించిపోతున్న గిరిజన గీతాలన్నీ ఒకటొకటిగా మళ్లీ ప్రాణం పోసుకుంటున్నాయి. భారతదేశంలో కొన్ని వేల గిరిజన జాతులు ఉన్నాయి. వారి సంప్రదాయాలు, వేషధారణ, సంగీతం అన్నీ వేటికవే ప్రత్యేకం. అటువంటి జాతులలో కొన్ని జాతులు రానురాను అంతరించిపోతున్నాయి. వాటికి సంబంధించిన సమాచారాన్ని ఎవరో ఒకరు జాగ్రత్త చేయకపోతే, కొంతకాలానికి ఈ జాతుల గురించి ప్రపంచానికి తెలిసే అవకాశం ఉండదనే ఉద్దేశంతో పీయూష్ గోస్వామి, అక్షిత దంపతులు ‘ది పార్గాటెన్ సాంగ్స్’ అనే ఒక ప్రణాళిక రూపొందించారు! బియాట్ పాట ‘బీట్’ ఆగింది! పీయూష్, అక్షిత దంపతులు నిరంతరం ప్రయాణిస్తూనే ఉంటారు. అలా ఒకసారి అస్సాంలోని డిమో హసావ్ జిల్లాను సందర్శించారు. అక్కడ ‘ఎపా లల్లురా’ అనే బియాట్ గిరిజన తెగ నాయకుడిని కలిశారు.ఆయనతో మాట్లాడుతూండగా ఆ తెగ వారి సంగీతం కాలగర్భంలో కలిసిపోతోందన్న బాధ ఆ నాయకుడి ముఖంలో కనిపించింది. వారు బియాట్ భాషతో పాటుగా యాసతో కూడిన హిందీ, బెంగాలీ, అస్సామీ, థింసా భాషలు, నాగాలాండ్‌లోని మాండలికాలు మాట్లాడగలరని లల్లూరా మాటల నుంచి తెలుసుకున్నారు. వారి భాష కేవలం మౌఖికంగా మాత్రమే మిగిలే స్థితికి వచ్చింది. వారిలోని కొత్తతరానికి.. బియాట్ భాష రాకపోవడం వల్ల సంప్రదాయ సంగీతానికి కాలం చెల్లుతోందని ఈ దంపతులకు లల్లూరా చెప్పారు. బియాట్ జాతి వారు ఈశాన్య భారతంలో ఉంటారు. వీరు చైనా నుంచి ఇక్కడకు వలస వచ్చినట్లుగా భావిస్తారు. అక్కడ వారు మైనారిటీలే అయినప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం ఇంకా గుర్తించలేదు. ఈ విషయం గోస్వామి దంపతులను కదిలించింది. వీరు అప్పటికే ‘రెస్ట్ ఆఫ్ మై ఫ్యామిలీ’ (ఈ ఊరు, ఈ నేల) అనే ఒక లాభాపేక్ష లేని సంస్థను స్థాపించారు. గ్రామీణ ప్రజలు ఎదుర్కొంటున్న సాంఘిక, ఆర్థిక సమస్యలను తెలుసుకుని, పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నారు. లల్లూరా మాటలు విన్నాక ‘‘ఏదో ఒకటి చేద్దాం’’ అన్నారు గోస్వామి. ఎక్కడ దొరికితే అక్కడ 2018 లో ఈ దంపతులు గిరిజన సంప్రదాయ గీతాల కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. ఎక్కడ బియాట్ పాటలు దొరికితే అక్కడ, ఎవరు పాడుతుంటే వారివి అక్కడికక్కడే రికార్డు చేయడం మొదలుపెట్టారు.ఈ జాతి వారికి సంబంధించి తాము సేకరించినవాటిని ఒక డాక్యుమెంటరీ సినిమాగా రూపొందించారు. ‘ద ఫర్గాటెన్ సాంగ్స్’ అని పేరు పెట్టి ఈ ఏడాది జనవరి 8వ తేదీన విడుదల చేశారు. గోస్వామి దంపతులతో గ్రామీణ కళాకారులు చాలామంది ప్రయాణిస్తున్నారు. దారిలో వారు వింటున్న కొత్త కొత్త శబ్దాలను, కథలను రికార్డు చేస్తూ, పాటలకు జోడిస్తున్నారు. అలాగే ఆయా జాతుల వారు ఎదుర్కొంటున్న సమస్యలను కూడా తెలుసుకుంటున్నారు. గిరిజనుల జానపదాలను షార్ట్ ఫిల్మ్‌లుగా తీసి, ఆడియో రిలీజ్లు కూడా పెడుతున్నారు. సంగీత శంఖంలో కథల తీర్థం చెన్నైలో నివసిస్తున్న వినాయక్ అనే మరో యువకుడు గోస్వామి దంపతులతో కలిసి, వారు చేపట్టిన ప్రాజెక్టును విజయవంతంగా నడుపుతున్నారు. ప్రకృతిలో ఉండే శబ్దాలను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కలిపి, జానపదులకు సంబంధించిన కథలను సంగీతం ద్వారా చెబితే అందరికీ త్వరగా చేరుతుందని, సమాజంలో అందరికీ అవేర్నెస్ కలుగుతుందని భావించాడు వినాయక్. బియాట్ తర్వాత.. బోండా, బస్తర్ కనుమరుగైపోతున్న సంస్కృతిని కాపాడటం కోసం లల్లూరా పాడుతున్న పాటలను ఒకచోట పొందుపరచడం కోసం గోస్వామి, వినాయక్‌లు అడవుల్లో అడుగులు వేస్తున్నారు. భయంకరమైన రోడ్ల మీద ప్రేమగా ప్రయాణిస్తున్నారు. వినాయక్‌కి వారి గురించిన విశేషాలు అర్థమయ్యాక, పాటలు, వివిధ శబ్దాలను సేకరించారు. అనేకమంది గాయకులను కలుసుకుంటున్నారు. బియాట్ సంప్రదాయ గీతాలను ఎపా లల్లూరా, ఎపా రొయిలియానాలు పాడుతుండగా వినాయక్ రికార్డు చేస్తున్నారు. ఇక్కడ పని పూర్తయ్యాక, ఒరిస్సాకు చెందిన బోండా జాతివారి గురించి, బస్తర్‌లో ఉన్న గోండు జాతి గురించి పరిశోధన చేయనున్నారు. – జయంతి -
గినీస్ బుక్ రికార్డ్: 5149 విద్యార్ధులు గాందీ వేషధారణ
-
70వ స్వాతంత్ర్యదినోత్సవం వేడుకకు ముస్తాబైన ఢిల్లీ
-
ఆకట్టుకుంటున్న స్పైడర్ మ్యాన్ టీచర్!
మెక్సికోః విద్యార్థులకు అర్థమయ్యేట్టు పాఠాలు బోధించడం అంటే అంత సులభం కాదు. అందులోనూ సైన్స్ పాఠాలు బోధించడం ఉపాధ్యాయులకు కత్తిమీద సామే. అందుకే ఓ టీచర్ పాఠాలు చెప్పేందుకు సింపుల్ సొల్యూషన్ కనిపెట్టాడు. విద్యార్థులు పాఠాలు శ్రద్ధగా వినేందుకు, వారిలో అవగాహన పెంచడంతోపాటు పాఠం వినడంలో పిల్లలు నిమగ్నమయ్యేందుకు సైన్స్ ను చక్కగా వివరించేందుకు కొత్త మార్గాన్ని అవలంబించాడు. పాఠం చెప్పేందుకు క్లాస్ రూం కు స్పైడర్ మ్యాన్ డ్రెస్ ధరించి వెళ్ళాడు. క్లాసులో పిల్లలు పాఠాలు శ్రద్ధగా, ఇష్టంగా వినాలంటే టీచర్ చెప్పే విధానం బాగుండాలి. అయితే ఎంతో అనుభవం ఉన్న టీచర్లు కూడ ఒక్కోసారి విద్యార్థులను ఆకట్టుకోవడంలో విఫలమౌతుంటారు. అయితే పిల్లలకు పుస్తకాలంటే బోర్ కొట్టకుండా, పాఠం శ్రద్ధగా వినేందుకు మెక్సికోకు చెందిన 26 ఏళ్ళ సైన్స్ టీచర్.. మోజెస్ వాజ్ క్వెజ్ వినూత్న పద్ధతిలో ప్రయత్నించాడు. వాస్తవ జీవితంలో సూపర్ హీరోలా విద్యార్థులముందు స్పైడర్ మ్యాన్ దుస్తులు ధరించి ప్రత్యక్షమయ్యాడు. కంప్యూటర్ సైన్స్ పట్ల వారిలో ఆసక్తిని రేకెత్తించాడు. మోజెస్ మెక్సికో నేషనల్ అటానమస్ విశ్వవిద్యాలయం (యుఎన్ ఏఎమ్) లో సైన్స్ ఫ్యాకల్టీగా పనిచేస్తున్నాడు. విద్యార్థులు కంప్యూటర్ సైన్స్ పాఠాలపట్ల విసుగు చెందకుండా ఉండేందుకు మోజెస్ పలు స్పైడర్ మ్యాన్ కామిక్స్ ను ప్రయోగించి పాఠాలు బోధిస్తున్నాడు. పార్ట్ టైం సైన్స్ టీచర్, ఫ్రీలాన్స్ ఫొటోగ్రాఫర్ పీటర్ పార్కర్ స్ఫూర్తితో విద్యార్థులు సూపర్ హీరోగా భావించే స్పైడర్ మ్యాన్ సూట్ ధరించి పాఠాలు చెప్పేందుకు నిర్ణయించుకున్నాడు. ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలనో, ఉత్తమ శ్రేణి ఉపాధ్యాయుడిగా పేరు తెచ్చుకోవాలనో తాను ప్రయత్నించడం లేదని, నిజాయితీగా విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో పాఠాలు బోధించి, క్లాస్ రూం అంటే బెటర్ ప్లేస్ అన్న ఫీలింగ్ విద్యార్థుల్లో కలిగేట్లు ప్రయత్నిస్తున్నానని మోజెస్ చెప్తున్నాడు. తూర్పు మెక్సికోలో తన తల్లితోపాటు నివసిస్తున్న మోజెస్... స్పైడర్ మ్యాన్ డ్రెస్ ధరించి ప్రజారవాణా వాహనాల్లోనే యూనివర్శిటీకి వెడుతుంటాడు. తోటి ప్రయాణీకులు అతన్ని సూపర్ హీరోగా భావించినప్పటికీ తాను విశ్వవిద్యాలయంలో సైన్స్ టీచర్ ను మాత్రమే అని వివరిస్తుంటాడు. స్పైడర్ మ్యాన్ ఆలోచనపై మోజెస్ కుటుబం మొదట్లో అతడి కెరీర్ కు హాని కలిగిస్తుందేమోనని భయపడింది. కానీ మోజెస్ తనదైన రీతిలో స్పైడర్ మ్యాన్ డ్రెస్ ధరించి తరగతులకు వెళ్ళి విద్యార్థుల్లో ప్రత్యేక ఆసక్తిని రేకెత్తించాడు. తన ఆలోచనతో ఒక్క విద్యార్థులనే కాక వర్శిటీలోని ఇతర ఉపాధ్యాయులనూ ఆకట్టుకున్నాడు. మొదటి రోజు వారంతా స్పైడర్ మ్యాన్ డ్రెస్ లో చూసి ఆశ్చర్యపోయినా... తర్వాత సంతోషంగా నవ్వుతూ ఆహ్వానించారని, చేసే పనిపట్ల బాధ్యత కలిగి ఉంటే, శక్తి అదే వస్తుందని మోజెస్ చెప్తున్నాడు. -
సంధ్యావర్ణ సరిగమలు
క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలు సాయంకాలాలకు కొత్త మెరుపులు అద్దుతుంటాయి. ఆ వేడుకల ఆనందాన్ని రెట్టింపు చేసేలా వస్త్రాలంకరణ ఉండాలని ప్రతి మహిళా కోరుకుంటుంది. అందుకు తగినట్టుగానే మార్కెట్లో లెక్కకు మించి దుస్తులు రకరకాల డిజైన్లలో కనువిందు చేస్తున్నాయి. శాంటాక్లాజ్ కలర్స్ అయిన ఎరుపు, తెలుపుల్లో డ్రెస్ చేసుకుంటారా.. న్యూ ఇయర్‌కి నలుపు, తెలుపులో హుందాగా కనిపించడానికి సిద్ధమవుతున్నారా... ఈ సందర్భంగా వస్త్రాలంకరణ ఏ విధంగా ఉండాలో తెలుసుకుందాం... ఇవీ నేటి ట్రెండ్... ముందు భాగంలో షార్ట్ లెంగ్త్, వెనక ఫుల్ లెంగ్త్ ఉండే గౌనులు ఆకర్షణీయంగా ఉంటాయి. పొట్ట భాగం కనిపించేలా క్రాప్ టాప్స్ యువతను మరింతగా ఆకర్షిస్తున్నాయి. నలుపు రంగు, వాల్ పెయింట్ ఆర్ట్, ప్లెయిన్ డ్రెస్సులు.. ప్రస్తుతం ట్రెండ్‌లో ఉన్నాయి. ప్రతి ఏడాది ఫ్యాషన్‌లో ఎన్నో మార్పులు వస్తుంటాయి. వాటిలో నుంచి ఎంచుకోవడంపైనే దృష్టి పెట్టడం సరైనది కాదు. మనదైన స్టైల్ కూడా ఆ ఎంపికకు జోడించాలి. అప్పుడే సందర్భానికి తగ్గట్టుగా వస్త్రాలంకరణ మేనికి నప్పుతుంది. సౌకర్యవంతంగా, ఆత్మవిశ్వాసంగా ఉండే ఆ వస్త్రాలంకరణ చూపరులను ఆకట్టుకుంటుంది. రంగుల ఎంపిక ప్రధానం కిందటేడాది పండగకు డిజైనర్స్ కూడా ఎరుపు, తెలుపు రంగుల డ్రెస్సులనే సూచించారు. కానీ, ఈ సంవత్సరం అలా కాదు. ఇప్పుడు కాంతిమంతంగా కనిపించే అన్ని రంగు దుస్తులను ధరించవచ్చు. అలాగే గతంలో క్రిస్మస్కు నలుపు-తెలుపు మిక్స్ అండ్ మ్యాచ్‌గా ఉండే డ్రెస్సులను ఎక్కువ ఉపయోగించేవారు. ఇప్పుడు డ్రెస్ పూర్తి నలుపు లేదా పూర్తి ఎరుపు ఉండేలా ధరించడం ఫ్యాషన్. బొద్దుగా ఉన్నవారు ఈ రంగుల్లో సన్నగా కనిపించే అవకాశమూ ఉంటుంది. ఈ రెండు రంగుల దుస్తులు క్రిస్మస్, న్యూ ఇయర్‌కు వేసుకోవచ్చు. ఎరుపు-తెలుపు కూడా వేషధారణలో బాగా ఉపయోగించవచ్చు. సాయంకాలం పార్టీ గనుక పేస్టల్ కలర్స్ ఉపయోగించవచ్చు. సింపుల్‌గా.. స్మార్ట్‌గా..! ‘వేడుకలో గ్రాండ్‌గా కనిపించాలి, ఎక్కువ ఖర్చు కాకూడదు’ అనుకునేవారు సింపుల్‌గా ప్లెయిన్ లాంగ్ గౌన్ వేసుకున్నా అందంగా కనిపిస్తారు. ట్యూబ్ గౌన్స్, హై కాలర్ నెక్స్, డీప్ కట్ స్లీవ్స్ సాయంకాలం పార్టీలకు చాలా బాగుంటాయి. మేనికాంతిని ఇనుమడింపజేసే మంచి కాంతిమంతమైన రంగు, కట్స్.. ఉండే ఏ డ్రెస్ అయినా చక్కగా సరిపోతుంది. ఆకర్షణీయంగా! గౌను ధరించినప్పుడు సంప్రదాయ ఆభరణాలు ధరించకూడదు. ప్లెయిన్ డ్రెస్, చంకీ జ్యుయెలరీ సాయంకాలపు పార్టీలకు బాగా నప్పుతాయి. డ్రెస్‌లకు పూర్తిగా భిన్నమైన రంగు ఆభరణాలు, కొద్దిగా సిమిలర్ కలర్‌వి ధరించవచ్చు. పెద్ద ఇయర్ రింగ్స్ పెట్టుకున్నప్పుడు మెడలో ఎలాంటి హారాలను ధరించవద్దు. ప్లెయిన్ లాంగ్ గౌన్ లేదా వెస్ట్రన్ డ్రెస్ ధరించినప్పుడు నడుముకు పెద్ద బెల్ట్ బాగా కనిపించేలా ధరించాలి. ఇంకే ఆభరణాలూ అవసరం ఉండదు. మనదైన స్టైల్‌తో లుక్ ఆకర్షణీయంగా కనబడుతుంది. ఫ్యాషన్ జువెల్రీలో భాగంగా చేతిపట్టీలు, ఇతర ఫంకీ జువెల్రీ వాడచ్చు. ఆధునిక వస్త్రధారణలో సింపుల్‌గా కనిపించాలంటే ఒక చిన్న స్మార్ట్ క్లచ్ చేత పట్టుకుంటే చాలు. పెద్ద పెద్ద హ్యాండ్‌బ్యాగ్‌లను ధరించవద్దు. పార్టీని పూర్తిగా ఎంజాయ్ చేయడానికి పూర్తి ఆహార్యం ఫ్రీగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి.