Akshata Murty Named Uks Best Dressed for Fashion - Sakshi
Sakshi News home page

అక్షతామూర్తి ధరించే చెప్పుల ధర తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే!

Published Sat, Jul 29 2023 5:07 PM | Last Updated on Sun, Jul 30 2023 6:46 AM

Akshata Murty Named UKs Best Dressed For Fashion  - Sakshi

ఇన్ఫోసిస్‌ వ్యవస్థాపకుడు, బిలియనీర్‌ నారాయణమూర్తి కుమార్తె అక్షత మూర్తి విభిన్నమైన దుస్తులతో ఫ్యాషన్‌కే ఐకాన్‌గా ఉంటుంది. ఆమెకూడా ఫ్యాషన్‌ డిజైనర్‌ కావడంతో ఆమె ధరించే దుస్తులు దగ్గర నుంచి చెప్పులు వరకు బ్రిటన్‌ అంతటా ఓ హాట్‌టాపిక్‌ ఉంటుంది. బ్రిటన్‌లో మంచి ఫ్యాషన్‌‍ డిజైనర్‌వేర్‌లతో ఆకట్టుకునే ప్రుమఖ వ్యక్తుల్లో అక్షతామూర్తి కూడా ఒకరు.

యూకేలో మంచి ఫ్యాషన్‌ బ్రాండ్‌ దుస్తులతో ఓ ట్రెండ్‌ సృష్టించిన వ్యక్తిగా అక్షతామూర్తినే ముందుంటారు. యూకేలో మంచి ఫ్యాషన్‌ ఫాలో అయ్యే ప్రముఖ బాలీవుడ్‌ హిరోల సరసన ఆమె కూడా ఉండటం విశేషం. ఆమె చెప్పులకు పెట్టే ఖర్చే వేలల్లో ఉంటుందని సమాచారం. ఈవిషయమై ఆమె వార్తల్లో కూడా నిలిచారు. ఈ విషయాన్ని యూకేలోని ప్రఖ్యాతి గాంచిన టాట్లర్‌ మ్యాగ్జైన్‌ ఓ కథనంలో పేర్కొంది. ఆమె కేవలం స్కూల్‌ రన్‌ కోసం దాదాపు రూ. 60 వేలు ఖరీదు చేసే చెప్పులను ధరించినట్లు వెల్లడించింది.

ఆమె బ్రిటన్‌లో వాడే పిల్‌బాక్స్‌ టోపీలు, లేయర్డ్‌ ముత్యాలు ధరించకుండా చాల సింపుల్‌ సిటీతో ఉన్నట్లు కనిపించినప్పటకీ..ఆమె మంచి లగ్జరీతో కూడిన ష్యాషన్‌ని ఫాలో అవుతుంది. ఆమె ధరించే స్కర్ట్‌ ధర సైతం రూ. లక్ష రూపాయాల పైనే ఉంటుంది. పెద్ద హడావిడి ఆర్భాటంగా ఉండదు. పైకి ఏదో ఓ సాధారణ స్తీలా ఆమె ఆహార్యం ఉంటుంది . బహుశా దీనినే 'స్టెల్త్‌ హెల్త్‌' అంటారు కాబోలు.

ఇదిలా ఉండగా ఇలా బ్రిటన్‌ ప్రధాని రుషి సునాక్‌, ఆమె భార్య ధరించే ఫ్యాషన్‌ డిజైనర్‌ వేర్‌ రేంజ్‌  విషయమై తరుచుగా విమర్శపాలయ్యారు. బ్రిటన్‌ ప్రధాని సునాక్‌ ప్రచారానికి వెళ్లేటప్పుడూ ధరించే సూట్‌(కోటు) ధరే రూ. 3 కోట్లుపైనే ఉందని, అతడి ధరించే షూ ధర సైతం రూ. 51 వేలు వరకు ఉంటుందంటూ విమర్శలు వెల్లువెత్తాయి. అలాగే అక్షత మూర్తి బీరువా ర్యాకులన్నీ ఖరీదైన బ్రాండ్‌లతో ఓ మాల్‌ని తలిపిస్తుందని బ్రిటన్‌ వాసులు చర్చించుకోవడం గమనార్హం.  

(చదవండి: ఆ గోల్డ్‌కి పెరుగుతున్న క్రేజ్‌..రోజుకో నగతో మహిళామణులు ధగ ధగ మెరుస్తున్నారు!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement