Akshata
-
రాఘవేంద్ర స్వామి మఠంలో రిషి సునాక్ దంపతుల పూజ
బెంగళూరు: బ్రిటన్ మాజీ ప్రధాని రిషి సునాక్, ఆయన సతీమణి అక్షతా మూర్తితో కలిసి బెంగళూరులో పర్యటించారు. కార్తీక మాసం పవిత్రమైన మాసం కావడంతో గురురాఘవేంద్ర స్వామి ఆశీస్సులు పొందేందుకు ఈ దంపతులు మఠాన్ని సందర్శించారు. జయనగర్‌లో ఉన్న రాఘవేంద్ర స్వామి మఠంలో ప్రత్యేక పూజలు చేశారు. వీరితో పాటు సునక్ అత్తమామలు ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణమూర్తి, రాజ్యసభ సభ్యురాలు సుధామూర్తి ఉన్నారు. గురు రాఘవేంద్ర స్వామి ఆశీస్సులు తీసుకుంటున్న ఫోటోలు సోషల్ మీడియా వేదికగా దర్శనమిచ్చాయి. స్వామివారి దర్శనం సందర్భంగా ఆలయ సంప్రదాయ పూజల్లో వారు పాల్గొన్నారు. భారతీయ సంప్రదాయాలపై తన విశ్వాసం గురించి బహిరంగంగానే ప్రకటించే రిషి సునాక్.. గతంలో దేశంలో పర్యటించినప్పుడు అనేక దేవాలయాలను సందర్శించారు. ఈ ఏడాది జనవరిలో సునాక్ లండన్‌లోని ప్రఖ్యాత బీఏపీఎస్ స్వామినారాయణ్ మందిర్‌ను సందర్శించారు. ‘‘నేను హిందువును. అందరిలాగే, నేనూ నా విశ్వాసం నుంచి ప్రేరణను, ఓదార్పును పొందుతాను. పార్లమెంటు సభ్యుడిగా ‘భగవద్గీత’పై ప్రమాణ స్వీకారం చేసినందుకు గర్వంగా ఉంది’ అని వ్యాఖ్యానించారు. -
British Parliament Election 2024: ఆ డ్రెస్సేంటి?
లండన్: బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీ ఓడిపోయింది. ఆ పార్టీ నేత రిషి సునాక్ ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేశారు. లండన్‌లోని తన అధికారిక నివాసమైన 10 డౌనింగ్ స్ట్రీట్ గుమ్మం ఎదుట మీడియాతో మాట్లాడారు. ప్రధానిగా చివరి మాటలు చెప్పేసి వెళ్లిపోయారు. ఆయన భార్య అక్షతా మూర్తి వ్యవహారమే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆమెను విమర్శిస్తూ సోషల్ మీడియాలో చాలామంది పోస్టులు పెడుతున్నారు. జోకులు సైతం విసురుతున్నారు. ఆమె ధరించిన డ్రెస్సు ధరపై కూడా చర్చ జరుగుతోంది. రిషి సునాక్ మీడియాతో మాట్లాడుతున్న సమయంలో అక్షతా మూర్తి ఆయన వెనుకే గొడుగు పట్టుకొని నిల్చున్నారు. నీలం, తెలుపు, ఎరుపు రంగులతో కూడిన నిలువు, అడ్డం చారల డ్రెస్సును ధరించారు. ఈ డ్రెస్సు చాలామందికి నచ్చలేదు. ఆ సందర్భానికి అలాంటి వ్రస్తాలు నప్పలేదని అంటున్నారు. చూడడానికి ఎబ్బెట్టుగా ఉందని చెబుతున్నారు. డెస్సుపై క్యూఆర్ కోడ్ మాదిరిగా ఆ చారలేంటి అని ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు అక్షతా మూర్తి డెస్సు ఖరీదు 395 పౌండ్లు(రూ.42,000). రిషి సునాక్ వెనుక ఆమె అలా గొడుగు పట్టుకొని నిల్చోవడం అస్సలు బాగా లేదని నెటిజన్లు విమర్శిస్తున్నారు. అక్షతా మూర్తి ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి, భారత రాజ్యసభ సభ్యురాలు సుధామూర్తి దంపతుల కుమార్తె అనే సంగతి తెలిసిందే. -
UK PM Rishi Sunak: హిందూ ధర్మమే నాకు స్ఫూర్తి
లండన్: హిందూ ధర్మమే తనకు ప్రేరణను, సాంత్వనను అందిస్తుందని భారత సంతతికి చెందిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ చెప్పారు. ’’భగవద్గీతపై పార్లమెంట్ సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేసినందుకు గర్వంగా ఉంది. ఫలితాన్ని గురించి ఆలోచించకుండా మన కర్తవ్యాన్ని నిర్వర్తించాలని భగవద్గీత బోధిస్తుంది’ అని ఆయన అన్నారు. ఆదివారం రిషి సునాక్ భార్య అక్షతా మూర్తితో కలిసి లండన్‌లోని నియాస్డెన్ ప్రాంతంలో ఉన్న స్వామి నారాయణ్ మందిరాన్ని సందర్శించుకున్నారు. వచ్చే 4వ తేదీన బ్రిటన్ పార్లమెంట్‌కు ఎన్నికలు జరగనున్న వేళ వారు ఆలయంలో పూజలు చేశారు. అంతకుముందు రిషి సునాక్ దంపతులకు ఆలయంలోకి ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా జై స్వామినారాయణ్ అంటూ ప్రసంగాన్ని ప్రారంభించిన సునాక్ టీ20 ప్రపంచ కప్‌ను భారత జట్టు గెలుచుకున్న విషయాన్ని ప్రస్తావించడం విశేషం. చీర ధరించిన అక్షతా మూర్తి అక్కడి మహిళలు, చిన్నారులతో ముచ్చటించారు. ఎన్నికల ప్రచారం తుది అంకానికి చేరుకుంటున్న వేళ ప్రతిపక్ష లిబరల్ పార్టీ నేత కీర్ స్టార్మర్ హిందూ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు శుక్రవారం లండన్‌లోని కింగ్స్బరీ ప్రాంతంలో ఉన్న స్వామి నారాయణ్ ఆలయాన్ని సందర్శించుకున్నారు. జై స్వామి నారాయణ్ అంటూ స్టార్మర్ ప్రసంగించారు. అధికారంలోకి వస్తే భారత్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తామని ప్రకటించారు. 2021 గణాంకాల ప్రకారం బ్రిటన్‌లో హిందువులు సుమారు 10 లక్షల మంది ఉన్నారు. దాంతో ప్రధాన పార్టీలు హిందువుల ఓట్లపై కన్నేశాయి. -
అరుదైన ప్రతిభ.. అక్షత!
చిన్న వయసులోనే కృత్రిమ మేధా(ఏఐ) రంగంలో పెద్ద పేరు తెచ్చుకుంది అక్షతా కిశోర్ మొహరిర్. అభిరుచితో మొదలైన ప్రయాణం...అధ్యయనం, పట్టుదలతో మెషిన్ లెర్నింగ్ రంగంలో అక్షతను అగ్రగామిగా నిలిపింది.కర్నాటకలోని విశ్వేశ్వరయ్య టెక్నాలజికల్ యూనివర్శిటీ(విటీయు–బెళగావీ)లో కంప్యూటర్ సైన్స్‌లో అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ పూర్తి చేసింది. ఆ తరువాత డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్‌లకు సంబంధించిన ఆసక్తి మరింత పెరిగింది. యూనివర్శిటీ ఆఫ్ మేరీల్యాండ్ కాలేజ్పార్క్(యూఎంసీపీ)లో మెషిన్ లెర్నింగ్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది.ఇంటర్ప్రెటబుల్ అండ్ ఇంటరాక్టివ్ మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో అక్షతకు ఏడు యూఎస్ పేటెంట్లు లభించాయి. యూజర్ ఫ్రెండ్లీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సోల్యూషన్లను రూ΄÷ందించడంపై అక్షత దృష్టి పెట్టింది.ఇవి చదవండి: డెనిమ్ న్యూ లుక్ డిజైన్..! -
అంతకంతకూ పెరిగిపోతున్న ఆస్తులు.. రిచ్‌లిస్ట్‌లో రిషి సునాక్ దంపతులు
ఇంతింతై.. వటుడింతై అన్న చందంగా యూకే ప్రధాని రిషి సునాక్, ఆయన భార్య అక్షతా మూర్తి వ్యక్తిగత సందప అంతకంతకూ పెరుగుతున్నట్లు తెలుస్తోంది. రిషిసునాక్ దంపతుల వ్యక్తిగత ఆస్తి 120 మిలియన్ యూరోలకు పెరిగింది. ‘సండే టైమ్స్ రిచ్ లిస్ట్’ వార్షిక నివేదికను విడుదల చేసింది. ఆ వార్షిక నివేదికలో రిషి సునాక్ దంపతుల ఆస్తుల వివరాల్ని వెల్లడించింది. అయితే యూకేలో ఆర్ధిక అనిశ్చితి నెలకొన్న వారి ఆస్తులు పెరిగిపోతుండడం గమనార్హం.ఇన్ఫోసిస్‌లో2023లో రిషి సునాక్ దంపతుల సంపద 529 యూరోల నుంచి 651 మిలియన్ యూరోలకు చేరింది. ఈ మొత్తం సంపద పెరుగుదల ఇన్ఫోసిస్‌లోని వాటానే కారణమని సమాచారం. ఇన్ఫోసిస్‌లో అక్షతా మూర్తి వాటా విలువ 55.3 బిలియన్ యూరోలు. ఆమె షేర్ల విలువ 108.8 మిలియన్ యూరోలకు పెరగ్గా.. ఏడాది కాలానికి ఆ విలువ 590 యూరోలకు చేరింది. కింగ్ చార్లెస్ సంపదఇదిలా ఉండగా, కింగ్ చార్లెస్ సంపద ఏడాది కాలంలో పెరిగిందని, 600 మిలియన్ యూరోల నుండి 610 మిలియన్ యూరోలకు పెరిగినట్లు సండే టైమ్స్ రిచ్ లిస్ట్ నివేదించింది. అదే సమయంలో బ్రిటీష్ బిలియనీర్ల సంఖ్య తగ్గిపోయిందని ఈ నివేదిక హైలెట్ చేసింది. తగ్గిపోతున్న బిలియనీర్లు2022లో బిలియనీర్ల గరిష్ట సంఖ్య 177 కాగా.. ఈ ఏడాది 165కి పడిపోయింది. ఈ క్షీణతకు కారణం కొంతమంది బిలియనీర్లు అధిక రుణ రేట్లు కారణంగా వారి సంపద మంచులా కరిగిపోగా.. మరికొందరు దేశం విడిచిపెట్టారని బ్రిస్టల్ లైవ్ నివేదించింది .యూకేలోనూ భారతీయుల హవాబ్రిటన్లోని 350 మంది కుబేరులు ఉండగా.. ఆ కుటుంబాల మొత్తం సంపద 795.36 బిలియన్లుగా ఉందని తాజా గణాంకాలు చూపిస్తున్నాయి. ఈ సంవత్సరం యూకే బిలియనీర్ల జాబితాలో హిందుజా గ్రూప్ అధినేత గోపీచంద్ హిందూజా, అతని కుటుంబం నిలిచింది. హిందూజా కుటుంబం సంపద ఈ ఏడాది 35 బిలియన్ యూరోల నుండి 37.2 బిలియన్ యూరోలకు పెరిగింది. -
నాసా ఏరో స్పేస్ ఇంజనీర్‌గా తొలి భారతీయ యువతి!
అమెరికాలోని నాసా (నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్)లో ఉద్యోగం... ఈ కల చాలా మందికే ఉండి ఉంటుంది. ఈ కలను సాకారం చేసుకున్న తొలి భారతీయ యువతి అక్షత కృష్ణమూర్తి. నాసా అనగానే మనకు అంతరిక్షంలోకి వెళ్లి గ్రహాలను అధ్యయనం చేసిన రాకేశ్ శర్మ గుర్తు వస్తారు. అలాగే కల్పనా చావ్లా, సునీత విలియమ్స్ కూడా గుర్తుకు వస్తారు. కల్పనా చావ్లా, సునీత విలియమ్స్ ఇద్దరూ భారతీయ సంతతికి చెందిన వారే కానీ భారత పౌరసత్వం ఉన్న వాళ్లు కాదు. అమెరికా పౌరసత్వమే వారి అంతరిక్ష పథాన్ని సుగమం చేసింది. ఇక అక్షత విషయానికి వస్తే... ఆకాశానికి ఆవల బెంగళూరుకు చెందిన అక్షతా కృష్ణమూర్తికి చిన్నప్పటి నుంచి ఆకాశానికి ఆవల ఏముంటుంది అనే ఆలోచనే. ఆమె బాల్యం ఆకాశంలో నక్షత్రాలను చూడడంతో, చుక్కల్లో చందమామ వెలుగుతో సంతృప్తి చెందలేదు. అంతరిక్షం అంటే మనకు కనిపించేది మాత్రమే కాదు, ఇంకా ఏదో ఉంది, అదేంటో తెలుసుకోవాలనే ఆసక్తి ఉండేది. బాల్యంలో మొదలైన ఆసక్తిని పెద్దయ్యేవరకు కొనసాగించింది. తన పయనాన్ని అంతరిక్షం వైపుగా సాగాలని కోరుకుంది. అందుకోసం తీవ్రంగా శ్రమించింది, నేడు నాసాలో ఏరో స్పేస్ ఇంజనీర్‌గా ఉద్యోగం సంపాదించింది. ఆ వివరాలను తెలియచేస్తూ ‘‘ఇది కేవలం అదృష్టం అని కానీ, కాకతాళీయంగా జరిగిపోయిందని చెప్పను. పూర్తిగా పదిహేనేళ్ల కఠోర శ్రమతోనే, అంతకు మించిన ఓర్పుతోనే సాధ్యమైంది’’ అంటుంది అక్షత. అలాగే అంతరిక్షంలో కెరీర్‌ని వెతుక్కోవాలంటే పాటించాల్సిన కొన్ని సూత్రాలను కూడా పంచుకుంది. నక్షత్రశాల నుంచి అంతరిక్షం వరకు... ‘‘నాసాలోని జెట్ ప్రోపల్షన్ లాబొరేటరీలో స్పేస్ మిషన్లకు ‘ప్రిన్సిపల్ నావిగేటర్ అండ్ స్పేస్ సిస్టమ్స్ ఇంజనీర్’గా విధులు నిర్వర్తిస్తున్నాను. నాసా–ఇస్రో సంయుక్తంగా నిర్వహించిన సింథటిక్ ఆపెర్చర్ రాడార్ మిషన్‌లో ఫేజ్ లీడ్‌గానూ, మార్స్ 2020 మిషన్‌లో రోబోటిక్స్ సిస్టమ్స్ ఇంజనీర్‌గానూ బాధ్యతలు నిర్వర్తించాను. నేను చదివింది స్టేట్ బోర్డ్ సిలబస్‌లోనే. మాది సంపన్న కుటుంబం కూడా కాదు. అయితే చిన్నప్పుడు నా వీకెండ్ ఎంజాయ్మెంట్లో ప్లాలానిటేరియం విజిట్స్, బెంగుళూరులో ఎయిర్షోస్ ఎక్కువగా ఉండేవి. నా ఆసక్తిని గమనించిన మా అమ్మానాన్న నేనడిగిన ప్రతిసారీ తీసుకెళ్లేవారు. హబుల్ టెలిస్కోప్ గురించి తెలుసుకోవడం నా జీవితంలో గొప్ప మలుపు. బహుశా 2000 సంవత్సరంలో అనుకుంటాను. నాకప్పుడు పదేళ్లు. వ్యోమగాములు అంతరిక్షంలో నడవడం గురించి తెలిసి చాలా ఆనందం కలిగింది. అంతరిక్షం నుంచి భూమిని చూడాలనే కోరిక కూడా. కెరీర్ గురించిన ఆలోచనలకు స్పష్టమైన రూపం వచ్చింది కూడా అప్పుడే. అంతరిక్షంలోకి వెళ్లే మార్గాల గురించి అధ్యయనం చేయగా చేయగా వ్యోమగాముల్లో ఎక్కువమంది ఎమ్ఐటీలోనే చదివారని తెలిసింది. నేను అదే సంస్థలో చదవాలని నిర్ణయించుకున్నాను. దాంతో బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్‌లో చేరాను. బెంగళూరులోని ఆర్ కాలేజ్‌లో మెకానికల్ ఇంజినీరింగ్ 2010 బ్యాచ్‌లో నేను మాత్రమే అమ్మాయిని. యూనివర్సిటీ ఆఫ్ ఇల్లినాయీలో ఏరోస్పేస్లో మాస్టర్స్ చేశాను. పీహెచ్‌డీకి ఎమ్ఐటీ (మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ) నుంచి స్కాలర్‌షిప్‌తో సీటు వచ్చింది. అయితే యూఎస్‌లో అంతరిక్షంలో ఉద్యోగం రావాలంటే ఆ దేశ పౌరసత్వం ఉండాలి కనీసం గ్రీన్‌కార్డ్ అయినా ఉండాలి. సెమినార్లలో నేను సమర్పించిన పేపర్లకు ప్రశంసలు వచ్చినప్పటికీ ఉద్యోగం వచ్చేది కాదు. అయినా నా పరిశోధనలను మాత్రం ఆపలేదు. ప్రొఫెసర్లకు వారితో కలిసి పని చేసే అవకాశం ఇవ్వమని వినతులు పోస్ట్ చేయడం కూడా ఆపలేదు. నా అప్లికేషన్ ఎప్పుడూ వెయిల్ లిస్టులోనే ఉండేది. వీసా సమయం పూర్తి కావస్తున్న సమయంలో ఒక పేపర్ ప్రెజెంటేషన్ సారా సీగర్ అనే ఆస్ట్రో ఫిజిసిస్ట్ దృష్టిని ఆకర్షించింది. అలా ఒక ఏడాదికి ఇంటర్న్‌షిప్‌కి అవకాశం వచ్చింది. ఆ ఏడాది పూర్తవుతున్న సమయంలో మరో పీహెచ్‌డీకి అప్లయ్ చేశాను. నాసా – ఇస్రో సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమాల్లో కూడా పని చేశాను. మొత్తం మీద మూడవ ప్రయత్నంలో నాసాలో ఫుల్‌టైమ్ ఉద్యోగినయ్యాను. మేధ ఉంది– పాదు లేదు మనదేశంలో అంతరిక్షంలో పరిశోధన చేయగలిగిన మేధ ఉంది. మొక్క ఎదగాలంటే అందుకు అనువైన పాదు ఉండాలి. అలాంటి పాదును తల్లిదండ్రులు బాల్యంలోనే వేయాలి. అలాంటి ప్రోత్సాహం మన దగ్గర ఉండాల్సినంతగా లేదనే చెప్పాలి. అందుకే లక్ష్యాన్ని సాధించడంలో నాకు ఎదురైన సవాళ్లతోపాటు అవకాశాలను వివరిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నాను. నేను సూచించేదేమిటంటే... స్కూల్లో సైన్స్ ప్రాజెక్టుల్లో పాల్గొనాలి. అంతరిక్షంలో కూడా ఆస్ట్రో ఫిజిక్స్, ఆ్రస్టానమీ, టెక్నాలజీ, ఇంజినీరింగ్ వంటి చాలా విభాగాలుంటాయి. మన ఆసక్తి ఎందులో అనేది తెలుసుకోవాలి. అంతరిక్షరంగంలో స్థిరపడాలంటే బాచిలర్స్ సరిపోదు. బాచిలర్స్లో సైన్స్, ఇంజినీరింగ్‌తోపాటు పీహెచ్డీ తప్పనిసరి. అలాగే ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్, మెషీన్ లెర్నింగ్, కోడింగ్ వంటి నైపుణ్యాలను కూడా మెరుగుపరుచుకోవాలి. అంతరిక్షానికి సంబంధించి వీలైనంత ఎక్కువ సదస్సులు, సమావేశాల్లో పాల్గొనాలి. నిపుణులను సంప్రదిస్తూ మన సందేహాలను నివృత్తి చేసుకుంటూ జ్ఞానాన్ని పెంచుకోవాలి. ఇవన్నీ అంతరిక్షయానాన్ని సుగమం చేసే మార్గాలు’’ అంటోంది అక్షత. View this post on Instagram A post shared by Dr. Akshata Krishnamurthy | NASA Rocket Scientist (@astro.akshata) (చదవండి: వీల్‌చైర్‌కి పరిమితమైన వెనక్కి తగ్గలేదు..వ్యాపారవేత్తగా..!) -
'సింప్లిసిటీకి కేరాఫ్ సింబల్ వాళ్లు'!దటీజ్ అక్షత మూర్తి!
అక్షతా మూర్తి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒక దేశ ప్రధాని భార్య అయినా చాలా సాదాసీదాగానే ఉంటారు. ఇక ఆమె తల్లిదండ్రులు నారాయణ మూర్తి దంపతులు గురించి అస్సలు చెప్పాల్సిన పనిలేదు. అంత పెద్ద టెక్ కంపెనీ వ్యవస్థాపకులై కూడా నారాయణ మూర్తి దంపతులిద్దరూ ఎంత సింపుల్‌గా ఉంటారో అందరికి తెలిసిందే. ఇక వాళ్ల పెంపకంలో పెరిగిన కూతురు అక్షతా వారిలానే కదా! ఉండేది. ఆ కుటుంబం అంతా రాఘవేంద్ర స్వామి ఆలయాన్ని దర్శించుకోవడానికి వచ్చారు. అక్కడ ఎలాంటి సెక్యూరిటీ గార్డులు లేకుండా సాధారణ వ్యక్తుల్లా మెలిగారు. పైగా ఎవ్వరూ వారిని గుర్తుపట్ట లేనంతగా చాలా సాధార వ్యక్తుల్లా వ్యవహరించడమ గ్రేట్ కదా!. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. కొంతమంది బిలియనర్లు, పలుకు బడిన వ్యక్తులు అలాంటి దేవాలయాలకు వస్తే హడావిడి ఓ రేంజ్లో ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే సాధారణ భక్తులకు కూడా వీళ్ల హడావిడి కారణంగా దర్శనం కూడా దొరకపోగా గంటల తరబడి వెయింట్ చేస్తు ఉండాపోవాల్సిన పరిస్థితి ఎదురవ్వుతుంది. కానీ ఇక్కడ యూకే ప్రధాని భార్య అక్షతామూర్తి, తన ఇద్దరు కూతుళ్లు అనౌష్క, కృష్ణ, తల్లిదండ్రులు నారాయణమూర్తి, సుధా మూర్తిలతో కలిసి రాఘవేంద్ర స్వామి ఆలయంలో సందడి చేశారు. అక్కడ మఠంలోని పుస్తకాలను వెతుకుతూ కనిపించారు. అంత పెద్ద స్థాయిలో ఉండి కూడా సాధారణ భక్తుల్లా వ్యవహరించిన తీరు నెటిజన్లను ఆకర్షించడమే గాక వాళ్ల సింపుల్ సిటీకి ఫిదా అవ్వుతూ గ్రేట్ అంటూ నెట్టింట ప్రశంసల జల్లు కురిపించారు కాగా, ఈ నెలలోనే అక్షత తల్లిదండ్రులతో కలిసి రచయిత్రి చిత్ర బెనర్జీ దివాకరుణి తాజా పుస్తకం 'యాన్ అన్‌కామన్ లవ్': ది ఎర్లీ లైఫ్ ఆఫ్ సుధా అండ్ నారాయణ మూర్తి' ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇక అక్షతామూర్తి ఆమె భర్త రిషి సునాక్ గతేడాది సెప్టెంబర్‌లో జీ20 సదస్సు కోసం భారతదేశాన్ని సందర్శించడం జరిగింది. అప్పుడు ఈ దంపతులిద్దరూ అక్షరధామ్ మందిర్ దర్శనం చేసుకుని పూజలు చేశారు. UK PM Rishi Sunak's wife and kids spotted at Raghavendra Mutt in Bengaluru, accompanied by Infosys Founder Narayanamurthy. Their simplicity shines through, with no security in sight. pic.twitter.com/WxIAvHh40w — M.R. Guru Prasad (@GuruPra18160849) February 26, 2024 (చదవండి: వింత పెళ్లి!.. వధూవరులెవరో తెలిస్తే కంగుతింటారు!) -
వివాదంలో యూకే ప్రధాని.. కాంట్రాక్ట్‌లన్నీ ‘మామకే’ అప్పనంగా కట్టబెట్టేస్తున్నాడు!?
యూకే ప్రతిపక్ష ‘లేబర్ పార్టీ’, పలు మీడియా సంస్థలు బాంబు పేల్చాయి. భారత్‌కు చెందిన రెండవ అతిపెద్ద ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ యూకేలో వృద్ది సాధించేలా, అందుకు తాను సహాయం చేయడంపై సంతోషంగా ఉన్నట్లు ఆ దేశ వాణిజ్య శాఖ మంత్రి లార్డ్ డొమినిక్ జాన్సన్ అన్నారని, అందుకు ఊతం ఇచ్చేలా కొన్ని ఫోటోల్ని, పలు కీలక డాక్యుమెంట్లను బహిర్గతం చేశాయి. ఇంతకి ఆ ఫోటోలు ఎవరివి? ఆ డాక్యుమెంట్లలో ఏముంది? లేబర్ పార్టీ విడుదల చేసిన డాక్యుమెంట్లలో.. యూకేలో ప్రైవేట్, ప్రభుత్వ కాంట్రాక్ట్‌లు ప్రైవేట్ సంస్థలకు అప్పగించాలంటే అందుకు తప్పని సరిగా ప్రభుత్వ అనుమతులు ఇవ్వడంతో పాటు బిడ్డింగ్ నిర్వహించాల్సి ఉంటుంది. అవేం లేకుండా నేరుగా యూకే ప్రభుత్వం ఇన్ఫోసిస్‌కు ప్రైవేట్,ప్రభుత్వ కాంట్రాక్ట్‌లను అప్పనంగా కట్టబెడుతున్నాయి ప్రతిపక్ష పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇన్ఫోసిస్‌కు 750 మిలియన్ పౌండ్స్ కాంట్రాక్ట్ యూకేలో 750 మిలియన్ పౌండ్ల విలువైన కాంట్రాక్ట్‌ను రిషిసునాక్, ఆయన భార్య, ఇన్ఫోసిస్ కో ఫౌండర్ నారాయణ కుమార్తెకు వాటాలున్నా ఇన్ఫోసిస్‌కు అప్పగించే ప్రయత్నం చేస్తున్నట్లు మీడియా సంస్థలు జరిపిన అంతర్గత విచారణలో తేలినట్లు పేర్కొన్నాయి. ఇటీవల 750 మిలియన్ పౌండ్ల కంటే ఎక్కువ విలువైన యూకే ప్రభుత్వ కాంట్రాక్టులను పేరున్న ఐటీ కంపెనీలకు అందించేలా రిషి సునాక్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ప్రభుత్వం ఆమోదం తెలిపిన జాబితాలో ఇన్ఫోసిస్ ఉన్నట్లు సమాచారం. 250 మిలియన్ పౌండ్స్ కాంట్రాక్ట్ అంతేకాదు ‘ఇంటెలిజెంట్ ఆటోమేషన్’ అని పిలవబడే కాంట్రాక్ట్‌ను ఎన్హెచ్ఎస్ షేర్డ్ బిజినెస్ సర్వీసెస్ అనే సంస్థ యూకేలో 250 మిలియన్ పౌండ్ల కాంట్రాక్ట్‌ను 25 ఐటీ కంపెనీలకు అప్పగించినట్లు, వాటిల్లో భారత ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ ఉన్నట్లు లేబర్ పార్టీ విడుదల చేసిన ఆ డాక్యుమెంట్లలో ఉంది. నేరుగా కాంట్రాక్ట్‌లు కట్టబెట్టి రిషి సునాక్ ప్రభుత్వ ఫైనాన్షియల్ కండక్ట్ అథారిటీ (ఎఫ్సీఏ) విభాగానికి ఐటీ సేవలు అత్యవసరం. ఇందుకోసం 562.5మిలియన్ల విలువైన కాంట్రాక్ట్ కోసం 62 సంస్థలు పోటీ పడ్డాయి. వాటిల్లో ఇన్ఫోసిస్ ఉన్నట్లు సమాచారం. ఇవన్నీ ‘ఫ్రేమ్‌వర్క్ అగ్రిమెంట్’ కిందకి వస్తాయి. అంటే టెండరింగ్ లేకుండా ప్రభుత్వ సంస్థలు నేరుగా కాంట్రాక్టులను ప్రైవేటు సంస్థలకు ఇచ్చేందుకు అనుమతిస్తాయి. ఇక యూకే ప్రభుత్వం నుంచి కాంట్రాక్ట్‌లు పొందినందుకు ఎలాంటి చెల్లింపులు జరపలేదని, ట్యాక్స్ చెల్లించే అవకాశం ఉందని పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఎఫ్సీఏ ప్రతినిధులు మాత్రం తాజా డిజిటల్ సర్వీసెస్ ఫ్రేమ్‌వర్క్ ఒప్పందం ప్రకారం కుదుర్చుకున్నవే తప్పా.. మేం ఇంకా ఎవరికి ఎలాంటి కాంట్రాక్టులను ఇవ్వలేదని తెలిపారు. ఇన్ఫోసిస్‌కు సాయం.. సంతోషంలో యూకే మంత్రి పైన పేర్కొన్నట్లుగా 750 మిలియన్ల పౌండ్ల ప్రభుత్వ కాంట్రాక్ట్‌ను ఇన్ఫోసిస్‌కు అప్పగించే సమయంలో యూకే వాణిజ్య శాఖ మంత్రి లార్డ్ డొమినిక్ జాన్సన్ కీలక వ్యాఖ్యలు చేసినట్లు లేబర్ పార్టీ విడుదల చేసిన డాక్యుమెంట్లలో హైలెట్ చేసింది. తమ దేశంలో ఇన్ఫోసిస్ వృద్ది సాధించేందుకు తన వంతు చేస్తున్న ‘సహాయం’పై జాన్సన్ సంతోషం వ్యక్తం చేసినట్లు విమర్శలు కురిపిస్తుంది. అంతే కాదు, యూకేలో ఇన్ఫోసిస్ బిజినెస్ పరంగా తనవల్ల ఎంత మేరకు లాభం చేకూరుతుందో అంత చేయాలని ఇన్ఫోసిస్ ప్రతిధినిధులు జాన్సన్‌తో చెప్పారని పేర్కొన్నాయి. బెంగళూరులో ఇన్ఫోసిస్ మంత్రి ప్రత్యక్షం యూకేలో వ్యాపార వ్యవహారాలకు సంబంధించిన అంశంలో భారత్‌లోని ఇన్ఫోసిస్ ప్రధాన కార్యాలయంలో బెంగళూరులో యూకే వాణిజ్య శాఖ మంత్రి డొమినిక్ జాన్సన్ ఆ సంస్థ ప్రతినిధులతో భేటీ అయిన ఫోటోల్ని విడుదల చేసింది. ఈ అంశంపై ఇన్ఫోసిస్, అటు రిషి సునాక్‌లు స్పందించాల్సి ఉంటుంది. -
రిషి సునాక్ ఇంట దీపావళి వేడుక
లండన్: భారత సంతతికి చెందిన బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్, అక్షతా మూర్తి దంపతులు 10 డౌనింగ్ స్ట్రీట్‌లోని తమ అధికార నివాసంలో దీపావళి వేడుకలు జరుపుకున్నారు. బుధవారం జరిగిన ఈ వేడుకల్లో పలువురు ప్రవాస భారతీయులు, పార్లమెంటేరియన్లు, పారిశ్రామిక వేత్తలు, బాలీవుడ్ ప్రముఖులు పాల్గొ న్నారు. ప్రధానిగా సునాక్ బాధ్యతలు స్వీకరించి ఏడాది పూర్తయిన సందర్భంగా బుధవారం సాయంత్రం ప్రధానమంత్రి నివాసాన్ని రంగురంగుల దీపాలతో అలంకరించారు. ప్రధాని రిషి సునాక్, అక్షతామూర్తి దంపతులు కలిసి దీపాలు వెలిగిస్తున్న దృశ్యాలను ప్రధాని కార్యాలయం ‘ఎక్స్’లో పోస్టు చేసింది. ప్రధాని రిషి సునాక్ అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. కమలా హ్యారిస్ నివాసంలోనూ.. వాషింగ్టన్: భారత సంతతికి చెందిన అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ మంగళవారం వాషింగ్టన్‌లోని తన అధికార నివాసంలో దీపావళి వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో పలువురు భారతీయ అమెరికన్లు సహా 300 మంది వరకు పాల్గొన్నారు. దీపాలు వెలిగించిన అనంతరం చట్టసభల ప్రతినిధులైన రో ఖన్నా, శ్రీ థానెదార్, రాజా కృష్ణమూర్తి, ప్రమీలా జయపాల్ తదితరులతో ఆమె మాట్లాడారు. ఈసందర్భంగా ఆమె ఇజ్రాయెల్, హమాస్ మధ్య పోరును ప్రస్తావించారు. పాలస్తీనియన్లకు సాయం అందించేందుకు అమెరికా ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. -
Rishi Sunak : డౌనింగ్ స్ట్రీట్‌లో ఘనంగా దీపావళి వేడుకలు (ఫొటోలు)
-
అయోధ్యలో అక్షత పూజ
అయోధ్య: అయోధ్యలో శ్రీరామ మందిరంలో ప్రతిష్టాపన పూజలు ఆదివారం సంప్రదాయం ప్రకారం అక్షత పూజతో మొదలయ్యాయి. ఆలయంలోని రామదర్బార్, శ్రీరాముని ఆస్థానంలో పసుపు, దేశవాళీ నెయ్యి కలిపిన 100 క్వింటాళ్ల బియ్యంతో అక్షత పూజ నిర్వహిస్తున్నట్లు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ తెలిపింది. దేశంలోని 45 ప్రాంతాల నుంచి ఇక్కడకు వచ్చిన విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్‌పీ)కు చెందిన 90 మంది ముఖ్యులకు 5 కిలోల మేర అక్షతలను పంపిణీ చేస్తారు. వీరు వీటిని జిల్లాలు, బ్లాకులు, తహసీల్లు, గ్రామాల ప్రతినిధులకు అందజేస్తారని ట్రస్ట్ కార్యదర్శి చంపత్‌రాయ్ చెప్పారు. మిగతా అక్షతలను ఆలయంలోని శ్రీరాముని విగ్రహం ఎదురుగా కలశంలో ఉంచుతారు. వీరు ఈ అక్షతలను వీరు వచ్చే జనవరి 22వ తేదీన అయోధ్యలో శ్రీరాముని ప్రతిష్టాపన జరిగేలోగా దేశవ్యాప్తంగా ప్రజలకు పంపిణీ చేయనున్నారని ట్రస్ట్ తెలిపింది. -
జీ20 సమ్మిట్: ఆకట్టుకున్న అక్షత, గ్రాండ్‌గా గుడ్‌బై, రిషీ వీడియో వైరల్
జీ 20 సమ్మిట్ లో యూకే ప్రథమ మహిళ అక్షతా మూర్తి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. భారతదేశంలో మూడు రోజుల పాటు జరిగిన G20 సమ్మిట్‌లో UK ప్రధాన మంత్రి రిషి సునక్ ,భార్య అక్షతా మూర్తి హాజరు కావడం అందరి దృష్టిని ఆకర్షించింది. ముఖ్యంగా భారతీయ కుటుంబానికి చెందిన అక్షతామూర్తి కట్టు బొట్టుతో తనదైన శైలితో మరింత ఆకట్టుకున్నారు. రెండు రోజులపాటు సాగిన భారత్ అధ్యక్షతన జరిగిన జీ20 శిఖరాగ్ర సదస్సు ముగిసింది. An important trip to India for the G20, delivering for the UK on the world stage 🇬🇧 👇 pic.twitter.com/H3MvrCJ7zg — Rishi Sunak (@RishiSunak) September 11, 2023 ఈ సందర్బంగా భారతదేశానికి వీడ్కోలు పలుకుతున్నప్పుడు సంప్రదాయ చీరలో అత్యంత మనోహరంగా కనిపించారు అక్షత. రా మ్యాంగో లేబుల్ నుండి పింక్ చీర,చెవిపోగులు, చిన్న బిందీతో ఇండియన్ లుక్‌తో అక్షతా మూర్తి తన భారత పర్యటనను ముగించారు. అంతేకాదు భారత సంతతికి చెందిన ఈ జంట ఢిల్లీలోని అక్షరధామ్ ఆలయాన్ని సందర్శించి అక్కడ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. భారత గడ్డపై అడుగుపెట్టినప్పటి నుంచి ముఖ్యంగా అక్షత సాంప్రదాయ చీర లుక్ చర్చనీయాంశంగా నిలిచింది. యూకే ఆధారిత సస్టైనబుల్ లేబుల్ విత్ నథింగ్ అండర్ నీత్తో కూడిన తెల్లటి బటన్ డౌన్ షర్ట్‌ను ధరించాలరు. ఢిల్లీలో పూల ప్రింటెడ్ స్కర్ట్‌తో భారత మండపంలో ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము నిర్వహించిన G20 డిన్నర్లో ఇండో-వెస్ట్రన్ మ్యాక్సీ డ్రెస్ ధరించారు. పర్యటన ముగించుకొని వెడుతున్న సందర్బంగా రిషి సునక్ సోషల్ మీడియాలో కొన్ని చిత్రాలను,వీడియోను పంచుకున్నారు.దీంతో వైరల్‌గా మారింది. View this post on Instagram A post shared by Rishi Sunak (@rishisunakmp) దేశ రాజధాని నుండి బయలుదేరే ముందు, అక్షత , రిషి సునక్ అక్షరధామ్ ఆలయంలో పూజలు చేశారు. ఇక్కడ కూడా ఆమె పింక్ పలాజో , పింక్ దుపట్టాతో కూడిన ఆకుపచ్చ కుర్తాతో కనిపించగా, మరోవైపు, బ్రిటన్ ప్రధాని అధికారిక దుస్తులు ధరించారు. ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో జరిగిన మిల్లెట్ ఎగ్జిబిషన్‌కు హాజరైనప్పుడు, అక్షత లిలక్ మార్బుల్-ప్రింట్ డ్రెస్‌లో కనిపించారు. కాగా ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి , రచయిత్రి సుధా మూర్తి కుమార్తె అక్షత అన్న సంగతి తెలిసిందే. -
అక్షతామూర్తి ధరించే చెప్పుల ధర తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే!
ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు, బిలియనీర్ నారాయణమూర్తి కుమార్తె అక్షత మూర్తి విభిన్నమైన దుస్తులతో ఫ్యాషన్‌కే ఐకాన్‌గా ఉంటుంది. ఆమెకూడా ఫ్యాషన్ డిజైనర్ కావడంతో ఆమె ధరించే దుస్తులు దగ్గర నుంచి చెప్పులు వరకు బ్రిటన్ అంతటా ఓ హాట్‌టాపిక్ ఉంటుంది. బ్రిటన్‌లో మంచి ఫ్యాషన్ డిజైనర్‌వేర్‌లతో ఆకట్టుకునే ప్రుమఖ వ్యక్తుల్లో అక్షతామూర్తి కూడా ఒకరు. యూకేలో మంచి ఫ్యాషన్ బ్రాండ్ దుస్తులతో ఓ ట్రెండ్ సృష్టించిన వ్యక్తిగా అక్షతామూర్తినే ముందుంటారు. యూకేలో మంచి ఫ్యాషన్ ఫాలో అయ్యే ప్రముఖ బాలీవుడ్ హిరోల సరసన ఆమె కూడా ఉండటం విశేషం. ఆమె చెప్పులకు పెట్టే ఖర్చే వేలల్లో ఉంటుందని సమాచారం. ఈవిషయమై ఆమె వార్తల్లో కూడా నిలిచారు. ఈ విషయాన్ని యూకేలోని ప్రఖ్యాతి గాంచిన టాట్లర్ మ్యాగ్జైన్ ఓ కథనంలో పేర్కొంది. ఆమె కేవలం స్కూల్ రన్ కోసం దాదాపు రూ. 60 వేలు ఖరీదు చేసే చెప్పులను ధరించినట్లు వెల్లడించింది. ఆమె బ్రిటన్‌లో వాడే పిల్‌బాక్స్ టోపీలు, లేయర్డ్ ముత్యాలు ధరించకుండా చాల సింపుల్ సిటీతో ఉన్నట్లు కనిపించినప్పటకీ..ఆమె మంచి లగ్జరీతో కూడిన ష్యాషన్ని ఫాలో అవుతుంది. ఆమె ధరించే స్కర్ట్ ధర సైతం రూ. లక్ష రూపాయాల పైనే ఉంటుంది. పెద్ద హడావిడి ఆర్భాటంగా ఉండదు. పైకి ఏదో ఓ సాధారణ స్తీలా ఆమె ఆహార్యం ఉంటుంది . బహుశా దీనినే 'స్టెల్త్ హెల్త్' అంటారు కాబోలు. ఇదిలా ఉండగా ఇలా బ్రిటన్ ప్రధాని రుషి సునాక్, ఆమె భార్య ధరించే ఫ్యాషన్ డిజైనర్ వేర్ రేంజ్ విషయమై తరుచుగా విమర్శపాలయ్యారు. బ్రిటన్ ప్రధాని సునాక్ ప్రచారానికి వెళ్లేటప్పుడూ ధరించే సూట్(కోటు) ధరే రూ. 3 కోట్లుపైనే ఉందని, అతడి ధరించే షూ ధర సైతం రూ. 51 వేలు వరకు ఉంటుందంటూ విమర్శలు వెల్లువెత్తాయి. అలాగే అక్షత మూర్తి బీరువా ర్యాకులన్నీ ఖరీదైన బ్రాండ్లతో ఓ మాల్ని తలిపిస్తుందని బ్రిటన్ వాసులు చర్చించుకోవడం గమనార్హం. View this post on Instagram A post shared by Akshata Murty (@akshatamurty_official) (చదవండి: ఆ గోల్డ్‌కి పెరుగుతున్న క్రేజ్..రోజుకో నగతో మహిళామణులు ధగ ధగ మెరుస్తున్నారు!) -
ఒక్కరోజులో రూ.500 కోట్లు ఆవిరి! భారీగా నష్టపోయిన రుషి సునాక్ భార్య..
బ్రిటన్ ప్రధాన మంత్రి రుషి సునాక్ భార్, భారతీయ ఐటీ వ్యాపార దిగ్గజం ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి కుమార్తె అక్షతా మూర్తి ఇన్ఫోసిస్ షేర్ల పతనంతో భారీగా నష్టపోయారు. ఇన్ఫోసిస్ షేర్లు సోమవారం (ఏప్రిల్ 17) 9.4 శాతం పడిపోయాయి. ఫలితంగా అక్షతా మూర్తి సుమారు రూ. 500 కోట్లు నష్టపోయారు. బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం.. 2020 తర్వాత ఇన్ఫోసిస్ షేర్ల అత్యంత భారీ పతనం ఇదే. ఇన్ఫోసిస్‌లో అక్షతా మూర్తికి 0.94 శాతం షేర్లు ఉన్నాయి. వీటి విలువ ఇప్పటికీ రూ. 4,586 కోట్లకు పైమాటే. ఆమె షేర్లపై లక్షలాది డివిడెండ్లను సంపాదించారు. ఆమె ఎన్నారై కావడంతో తన ఆదాయంలో ఎక్కువ భాగంపై పన్నులు చెల్లించలేదు. ఇది తీవ్ర వివాదాన్ని రేకెత్తించింది. ఆమె యునైటెడ్ కింగ్డమ్లో పన్నులు చెల్లిస్తానని చెప్పడంతో ఏప్రిల్‌లో వివాదానికి తెరపడింది. విలాసవంతమైన జీవనాన్ని గడిపే రుషి సునాక్, అక్షతా మూర్తి దంపతులకు లండన్‌లో 7 మిలియన్ పౌండ్ల విలువైన ఇల్లు ఉంది. అమెరికాలో ఓ ఫ్లాట్ ఉంది. వారు ఒక స్విమ్మింగ్ పూల్ నిర్మాణం కోసం 4 లక్షల డాలర్లు అంటే దాదాపు రూ.3.3 కోట్లు ఖర్చు చేసినట్లు వార్తలు వచ్చాయి. ఇదీ చదవండి: Air India Salaries: జీతాలు పెంచిన ఎయిర్ ఇండియా.. పైలట్ జీతమెంతో తెలుసా? -
సునాక్‌పై పార్లమెంటరీ కమిషనర్ విచారణ!
లండన్: తన భార్య అక్షతా మూర్తి నిర్వహిస్తున్న ‘కొరు కిడ్స్ లిమిటెడ్’ అనే సంస్థకు లబ్ధి చేకూరేలా బడ్జెట్లో కొత్త పథకాన్ని ఉద్దేశపూర్వకంగా ప్రకటించారని బ్రిటిష్ ప్రధానమంత్రి రిషి సునాక్‌పై ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ ఆరోపణల్లో నిజానిజాలు నిగ్గుతేల్చడానికి ‘యూకే పార్లమెంటరీ కమిషనర్ ఫర్ స్టాండర్స్’ విచారణ ప్రారంభించింది. అతి త్వరలో రిషి సునాక్‌ను ప్రశ్నించనుంది. కొరు కిడ్స్ లిమిటెడ్ సంస్థ చిన్నపిల్లల సంరక్షణ సేవలను అందిస్తోంది. -
బ్రిటన్ ప్రధాని సతీమణి చేతికి ఒక్క రోజులో రూ.68 కోట్లు..
బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ సతీమణి అక్షతా మూర్తి ఒక్క రోజులో రూ.68 కోట్లు అందుకోనున్నారు. భారతదేశంలోనే రెండో అతిపెద్ద ఐటీ కంపెనీ అయిన ఇన్ఫోసిస్ ఇటీవల డివిడెండ్లను ప్రకటించింది. వీటి ద్వారా అక్షతా రూ.68.17 కోట్లు ఆర్జించనున్నారు. (Akshay Tritiya 2023: అక్షయ తృతీయ నాడు బంగారం కొంటున్నారా? ఈ విషయాలు గుర్తుంచుకోండి...) ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి కుమార్తె అక్షతా మూర్తి. గత ఏడాది ఆమె కంపెనీకి చెందిన 3.89 కోట్ల షేర్లను కలిగి ఉన్నారు. ఒక్కో షేరుకు రూ.17.50 చొప్పున జూన్ 2 నాడు ఆమె ఈ మొత్తాన్ని అందుకోనున్నారు. అయితే దాని కోసం ఆమె తన స్టాక్ హోల్డింగ్‌ను కొనసాగించాల్సి ఉంటుంది. గతేడాది కంపెనీ డివిడెండ్ కలిపితే ఆమె మొత్తం ఆదాయం రూ.132.4 కోట్లు అవుతుంది. ఇన్ఫోసిస్ అక్టోబర్‌లో ఒక్కో షేరుకు రూ.16.50 మధ్యంతర డివిడెండ్ ప్రకటించింది. గతేడాది మూర్తి ఒక్కో షేరుకు రూ.31 డివిడెండ్‌ను అందుకున్నారు. దీంతో ఆమెకు రూ.120.76 కోట్లు వచ్చాయి. ఇన్ఫోసిస్‌లో ఆమె షేర్ల విలువ రూ.5400 కోట్లు. ఆమె భర్త, భారత సంతతికి చెందిన రుషి సునాక్ గత అక్టోబర్‌లో బ్రిటన్ ప్రధానమంత్రి అయ్యారు. రుషి సునాక్ బ్రిటిష్ పౌరుడు. కానీ అక్షత మాత్రం తన భారత పౌరసత్వాన్ని వదులుకోలేదు. అందుకే ఆమె అక్కడ నివాసితురాలు కాదు. దీని కారణంగా యూకే చట్టాల ప్రకారం.. ఆమె 15 సంవత్సరాల పాటు పన్నులు చెల్లించకుండా దేశంలో నివసించవచ్చు. ఈ అంశం చర్చనీయాంశమైంది. అయితే తన ఆదాయంపై పన్నులు ఉన్నాయని వాటిని ఎప్పుడూ చెల్లిస్తానని ఆమె చెప్పారు. (tata motors: మళ్లీ పెరగనున్న టాటా కార్ల ధరలు.. ఎందుకంటే..) అక్షతా మూర్తి కర్ణాటకలోని హుబ్బళ్లిలో జన్మించారు. బెంగళూరులో ఆమె పాఠశాల విద్యను అభ్యసించించారు. కాలిఫోర్నియాలోని క్లేర్మాంట్ మెక్కెన్నా కాలేజీలో ఎకనామిక్స్ అండ్ ఫ్రెంచ్‌లో డ్యూయల్ మేజర్లు పూర్తి చేశారు. తర్వాత లాస్ ఏంజిల్స్ ఫ్యాషన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ అండ్ మర్చండైజింగ్ నుంచి ఫ్యాషన్ డిజైనింగ్ డిగ్రీని పొందారు. స్టాన్‌ఫోర్డ్‌లో బిజినెస్ మేనేజ్మెంట్ చదువుతున్న సమయంలో ఆమె రుషి సునాక్‌ను కలిశారు. వీరికి 2009లో వివాహం జరిగింది. ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారి పేర్లు కృష్ణ, అనౌష్క. రుషిసునాక్, అక్షత దంపతులు రియల్ ఎస్టేట్‌లో ఎక్కువగా పెట్టుబడులు పెట్టారు. కెన్సింగ్టన్లో వీరికి సొంత ఇల్లు ఉంది. దీని విలువు రూ.71 కోట్లు. వీరికి అక్కడ ఫ్లాట్ కూడా ఉంది. కాలిఫోర్నియాలో ఒక పెంట్‌హౌస్, యార్క్‌షైర్‌లో ఒక భవనం కూడా ఉన్నాయి. అక్షత తల్లి సుధా మూర్తి రచయిత్రి. సామాజిక చైతన్య కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటుంటారు. అక్షతా మూర్తికి అక్షతా డిజైన్స్ అనే ఫ్యాషన్ లేబుల్ ఉంది. మారుమూల గ్రామాల్లోని కళాకారులతో కలిసి ఫ్యూజన్ దుస్తులను ఆమె తయారు చేస్తుంటారు. -
సుధామూర్తికి పద్మభూషణ్.. అత్తపై బ్రిటన్ ప్రధాని ప్రశంసలు
సుధామూర్తి.. భారతీయులకు పరిచయం అక్కర్లేని వ్యక్తి. టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ ఫౌండర్ నారాయణమూర్తి సతీమణిగానే కాకుండా రచయిత్రి, విద్యావేత్త సామాజిక వేత్తగా అందరికీ సుపరిచితురాలే. తన కోసం మాత్రమే కాకుండా సమాజం కోసం ఆలోచించే వారు అతి తక్కువమంది కనిపిస్తుంటారు. అలాంటి వారిలో సుధామూర్తి ముందువరుసలో ఉంటారు. వేల కోట్లకు అధినేత అయినా.. సింప్లీ సిటీకి మారుపేరులా ఉంటారు. కంప్యూటర్ ఇంజనీర్‌గా జీవితాన్ని ప్రారంభించి ఇన్ఫోసిస్ ఫౌండేషన్,. గేట్స్ ఫౌండేషన్ ప్రజారోగ్య విభాగాలలో కీలక పాత్రలను పోషిస్తున్నారు. ఇప్పటికే పలు అనాథాశ్రయాలను ప్రారంభించిన ఆమె.. గ్రామీణాభివృద్ధి, విద్య, ఆరోగ్య రంగాల్లో సేవలందింస్తున్నారు. కర్ణాటకలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు కంప్యూటర్లు అందించి పేద విద్యార్థులు కూడా ఉచితంగా కంప్యూటర్ జ్ఞానాన్ని పొందగలిగేందుకు తోడ్పడుతున్నారు. సుధామూర్తి సమాజానికి చేస్తున్న సేవలను గుర్తించి ఇటీవల భారత ప్రభుత్వం ఆమెను పద్మభూషన్ అవార్డుతో సత్కరించిన విషయం తెలిసిందే. రెండు రోజుల క్రితం ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని అందుకున్నారు. తల్లికి దక్కిన గౌరవంపై మురిసిపోతూ ఆమె కూతురు, యూకే ప్రధాని రిషి సునాక్ భార్య అక్షత మూర్తి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు పెట్టారు. రాష్ట్రపతి నుంచి మా అమ్మ పద్మభూషన్ను అందుకుంటున్న క్షణాలను చూసి ఎంతో గర్వంగా ఫీల్ అయ్యానని అన్నారు. సమాజం కోసం చేసిన సేవకు ఆమెకీ అవార్డు దక్కిందని చెప్పుకొచ్చారు ‘25 సంవత్సరాలుగా స్వచ్చంద సంస్థలను ఏర్పాటు చేసి అక్షరాస్యతను పెంపొందించడానికి వివిధ కార్యక్రమాలలు నిర్వహిస్తుంది. ఆమె జీవితం నాకొక ఉదాహరణ. ఎలా జీవించాలో తనను చూసి నేర్చకున్నాను. గుర్తింపుకోసం అమ్మ ఎప్పుడూ ఎదురు చూడలేదు. కానీ నిన్న దక్కిన గుర్తింపు ప్రత్యేకం. మా తల్లిదండ్రులు మాకు(తమ్ముడు, నాకు) కష్టపడి పనిచేయడం, మానవత్వం చూపడం, నిస్వార్థంగా జీవించడం వంటి ఎన్నో విలువలు నేర్పించారు’ అంటూ తల్లిపై ప్రేమను చాటుకున్నారు. అక్షతమూర్తి పోస్టుపై అల్లుడు రిషి సునాక్ స్పందించారు. సుధామూర్తి ఘనతను కొనియాడుతూ.. ‘గర్వించదగ్గ రోజు’ అంటూ క్లాప్ ఎమోజీని షేర్ చేశారు. కాగా ఇప్పటికే సుధామూర్తి అందించిన సామాజిక కార్యక్రమాలకుగానూ 2006లో ఆమెను పద్మశ్రీ అవార్డు వరించిన విషయం తెలిసిందే. View this post on Instagram A post shared by Akshata Murty (@akshatamurty_official) -
రాధా TMT డైరెక్టర్ - అక్షత్ శరఫ్ కు " సాక్షి ఎక్సలెన్స్ అవార్డు "
-
రిషి సునాక్ భార్య అక్షతకి ఇన్ఫోసిస్ ద్వారా ఎన్ని కోట్లు వచ్చాయంటే?
-
అక్కడ మొదలైన రిషి- అక్షత ప్రేమకథ.. మామగారి గురించి బ్రిటన్ ప్రధాని ఏమన్నారంటే!
Rishi Sunak- Akshata Murthy Interesting Facts: బ్రిటన్ ప్రధాని రిషి సునాక్‌కు అక్షతామూర్తి భార్య మాత్రమే కాదు. తన మనోప్రపంచం తెలిసిన క్లోజ్‌ఫ్రెండ్, గైడ్. సునాక్ ఒత్తిడిని మటుమాయం చేసే మాటల మాంత్రికురాలు. ఐటీ మొదలు ఫ్యాషన్ ప్రపంచం వరకు ఎన్నో రంగాలలో తనను తాను నిరూపించుకున్న ప్రతిభావంతురాలు. కుటుంబ జీవితాన్ని, వ్యాపార జీవితాన్ని తేలికగా ఎలా సమన్వయం చేసుకోవాలో తన చేతల ద్వారా చూపించిన తెలివైన మహిళ.... తన మామగారు నారాయణమూర్తి గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు రిషి సునాక్ కళ్లలో ఒక మెరుపు కనిపిస్తుంది. మూర్తిపై అభిమానం ఆయన మాటల్లో వ్యక్తం అవుతుంది. అది ఒక మామ గురించి అల్లుడి అభిమానం కాదు. గొప్ప వ్యాపారవేత్త గురించి ఒక ఆలోచనపరుడి అభిమానం. మామగారి గురించి.. ‘ఆయన సంపన్న కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన వ్యక్తి కాదు. అయితే అదేమీ తన ప్రతికూలత కాలేదు. ఎందుకంటే ఆయనకు ఆశయాలు ఉన్నాయి. తన మీద తనకు నమ్మకం ఉంది. డబ్బులు లేని పరిస్థితులలో నారాయణమూర్తికి సుధామూర్తి తాను దాచుకున్న డబ్బులు ఇచ్చారు. ఇక అప్పటినుంచి ఆయన వెనక్కి తిరిగి చూసుకోలేదు. సుధామూర్తి ఇచ్చింది డబ్బులు మాత్రమే కాదు అంతులేని ఆత్మస్థైర్యం’ అని ఒకానొక సందర్భంలో తన మామగారు నారాయణమూర్తి గురించి చెప్పారు సునాక్. ఒక స్త్రీ పురుషుడిని ఎలా ముందుకు నడిపించగలదు, విజేతగా నిలపగలదో సునాక్ తన మాటలతో చెప్పకనే చెప్పారు. మరి తన విషయంలో భార్య అక్షతామూర్తి పాత్ర ఏమిటి? సునాక్ మాటల్లో చెప్పాలంటే... ‘కుటుంబానికి తగిన సమయం కేటాయించలేకపోతున్నాను అనే బాధను ఆమె తీరుస్తుంది. అన్ని విషయాల్లో నాకు తోడుగా ఉంటుంది. సమయస్ఫూర్తి ఎక్కువగా ఉన్న మహిళ’ అంటాడు సునాక్. ఎవరీ అక్షతామూర్తి? కర్ణాటకలోని హుబ్లీలో జన్మించిన అక్షతామూర్తి బెంగళూరు శివారులోని జయనగర్‌లో ఎలాంటి ఆడంబరాలు, అట్టహాసాలు లేకుండా మధ్యతరగతి జీవిత విలువలతో పెరిగింది. ఖరీదైన బర్త్‌డే పార్టీలు ఉండేవి కాదు. పరిమితమైన పాకెట్‌మనీ మాత్రమే ఉండేది. అలా అని అక్షతా ఎప్పుడూ తల్లిదండ్రుల మీద అలక పూనలేదు. దీనికి కారణం వారు తనకు చిన్నప్పటి నుంచే నైతిక విలువలు, నిరాడంబర జీవన విధానం గురించి చెబుతూ వచ్చారు. పరిచయం... ప్రేమగా మారి బెంగళూరులోని బాల్డ్విన్ గర్ల్స్ హైస్కూల్లో చదువుకుంది అక్షతామూర్తి. స్కూల్లో ఎప్పుడూ ఆడంబరం ప్రదర్శించేది కాదు. కాలిఫోర్నియాలో ఎకనామిక్స్, ఫ్రెంచ్ చదువుకున్న అక్షత లాస్ ఏంజెల్స్‌లో ఫ్యాషన్ డిజైనింగ్‌లో డిప్లొమా చేసింది. స్టాన్‌ఫర్డ్ యూనివర్శిటీలో ఎంబీఎ చేసింది. ఆ సమయంలోనే సునాక్‌తో పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారింది. 2009లో వీరి వివాహం బెంగళూరులో జరిగింది. సునాక్–అక్షతామూర్తి దంపతులకు ఇద్దరు అమ్మాయిలు... కృష్ణ, అనౌష్క. తనదైన ముద్ర క్లీన్టెక్ సంస్థ ‘టెండ్రీస్’లో మార్కెటింగ్ డైరెక్టర్‌గా చేరిన అక్షతామూర్తి రెండు సంవత్సరాల తరువాత ‘అక్షత డిజైన్స్’ పేరుతో సొంతంగా ఫ్యాషన్ కంపెనీ ప్రారంభించింది. ఆ తరువాత భర్తతో కలిసి మొదలుపెట్టిన ఒక వెంచర్ క్యాపిటల్‌కు డైరెక్టర్‌గా వ్యవహరించింది. ఐటీ బిజినెస్ నుంచి బ్యూటీ డిజైన్స్ వరకు ప్రతి వ్యాపారంలో తనదైన ముద్ర వేసింది అక్షతామూర్తి. తల్లిదండ్రుల వల్లే ‘అక్షతామూర్తి ఒక ఇంట్లో పెరిగింది అనడం కంటే ఒక విశ్వవిద్యాలయంలో పెరిగింది అనడం సబబు’ అంటారు కొందరు ఆమె తల్లిదండ్రులను గుర్తు చేసుకుంటూ. నిజమే మరి... ఆ కుటుంబ విశ్వవిద్యాలయంలో వైజ్ఞానిక విషయాల నుంచి వ్యాపార విజయాల వరకు ఎన్నో విషయాలు నేర్చుకుంది. అవి తనకు ఎంతగానో ఉపయోగపడ్డాయి. ‘నాన్న వ్యాపార నైపుణ్యం, అమ్మ సామాజిక సేవ అనే రెండు ప్రపంచాలను చూస్తూ పెరిగాను. అవి రెండు విడి ప్రపంచాలు కాదు. ఒకదానితో ఒకటి సంబంధం ఉన్న ప్రపంచాలు. వ్యాపారవేత్తగా సామాజిక సేవ ఎంత బాగా చేయవచ్చో తెలుసుకున్నాను’ అంటుంది అక్షతామూర్తి. నీ రుణం తీర్చుకోలేనిది ‘ఆమె నా వెంట ఉంటే చాలు’ అని ఎన్నో ఇంటర్వ్యూలలో అక్షరతామూర్తి గురించి చెప్పకనే చెప్పాడు సునాక్. లండన్‌లోని వెంబ్లీలో జరిగిన మొన్నటి ఎన్నికల ప్రచార సభలో ప్రేక్షకుల్లో కూర్చున్న భార్యను చూస్తూ... ‘నా జీవితంలో నువ్వెంత ముఖ్యమో నాకే కాదు. నీకు కూడా తెలుసు. నీ రుణం తీర్చుకోలేనిది’ అన్నాడు సునాక్. రాజకీయాలు అంటే మాటలు కాదు... ఏ సవాలు ఎటు నుంచి దూసుకువస్తుందో తెలియదు. ఏ అడుగులో ఏ ప్రమాదం దాగి ఉందో తెలియదు. క్షణం తీరిక లేని పనుల్లో ఏది మంచో, ఏది చెడో విశ్లేషించుకునే విచక్షణ అవసరం. ఇలాంటి సమయంలోనే ఆత్మీయులు అత్యవసరం. స్నేహితురాలు, భార్యగా సునాక్ మనోప్రపంచం అక్షతామూర్తికి తెలుసు. అతని పరిమితులు, బలం ఏమిటో అందరికంటే బాగా తెలుసు. అందుకే ఇప్పుడు బ్రిటన్ ప్రధాని రిషి సునాక్‌కు అక్షతామూర్తి బలమైన తోడు ఎంతో అవసరం. చదవండి: రాజకీయాల్లోకి వచ్చిన ఏడేళ్లకే ప్రధాని.. చరిత్రలో ఒకేఒక్కడు రిషి..! బ్రిటన్‌లో అమర్ అక్బర్ ఆంటోనీ..! మూడు పదవుల్లో ఆ ముగ్గురు -
రిషి సతీమణి అక్షతకు ఇన్ఫీ ద్వారా ఎన్ని కోట్లు వచ్చాయో తెలుసా?
న్యూఢిల్లీ: బ్రిటన్ తదుపరి ప్రధాన మంత్రిగా రిషి సునాక్ రికార్డ్ సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ సందర్బంగా ఆయన సతీమణి అక్షతా మూర్తికి సంబంధించిన వ్యాపారాలు, ఆస్తులకు సంబంధించిన వివరాలు వ్యాపార వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. భారతదేశంలోని రెండవ అతిపెద్ద ఐటీ సంస్థ ఇన్ఫోసిస్‌లో వాటాద్వారా భారీ ఆదాయాన్ని ఆర్జించినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా 2022లో ఇన్పీ అందించిన డివిడెండ్ ద్వారా రూ. 126.61 కోట్లు (15.3 మిలియన్ డాలర్లు) సొంతం చేసుకున్నారు. అంతేకాదు 730 మిలియన్ల పౌండ్స్ సంపదతో రిషి సునాక్, అక్షత జంట యూకే ధనవంతుల జాబితా 2022లో 222వ స్థానంలో ఉన్నారు. స్టాక్ ఎక్స్ఛేంజీలకు కంపెనీ దాఖలు చేసిన సమాచారం ప్రకారం ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి కుమార్తె అక్షతమూర్తి సెప్టెంబర్ చివరి నాటికి ఇన్ఫోసిస్‌లో 3.89 కోట్ల షేర్లు లేదా 0.93 శాతం వాటాను కలిగి ఉన్నారు. బీఎస్ఈ మంగళవారం ట్రేడింగ్ రూ. 1,527.40 వద్ద ఆమె వాటా విలువ రూ. 5,956 కోట్లుకు చేరింది. ఇదీ చదవండి: రిషి సునాక్ విజయం: ఇన్ఫీ నారాయణమూర్తి తొలి రియాక్షన్ ఇన్ఫోసిస్ ఈ ఏడాది మే 31న 2021-22 ఆర్థిక సంవత్సరానికి ఒక్కో షేరుకు 16 రూపాయల తుది డివిడెండ్ చెల్లించింది. అలాగే ప్రస్తుత సంవత్సరానికి, ఇటీవల ఫలితంగా సందర్భంగా రూ. 16.5 మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించింది. రెండు డివిడెండ్లు కలిపి మొత్తం రూ. 126.61 కోట్లు అక్షత ఖాతాలో చేరాయి. భారతదేశంలో అత్యుత్తమ డివిడెండ్ చెల్లించే కంపెనీలలో ఇన్ఫోసిస్ ఒకటి. 2021లో, ఇది ఒక్కో షేరుకు మొత్తం రూ. 30 డివిడెండ్‌ని చెల్లించింది. ఫలితంగా అక్షత 119.5 కోట్లను దక్కించుకున్నారు. అలాగే ఇన్ఫోసిస్ ఫైలింగ్స్ ప్రకారం, కంపెనీలో ప్రమోటర్లు 13.11 శాతం వాటా కలిగి ఉన్నారు. ఇందులో మూర్తి కుటుంబానికి 3.6 శాతం (నారాయణ మూర్తికి 0.40 శాతం, ఆయన భార్య సుధకు 0.82 శాతం, కుమారుడు రోహన్‌కు 1.45 శాతం, కుమార్తె అక్షతకు 0.93 శాతం) వాటా ఉంది. కాగా ఉత్తర కర్ణాటకలోని తన తల్లి సుధా మూర్తి స్వస్థలమైన హుబ్బల్లిలో1980లో పుట్టారు అక్షత. కాలిఫోర్నియాలోని క్లేర్మాంట్ మెక్కెన్నా కాలేజీకి వెళ్లడానికి ముందు బెంగళూరులో పాఠశాల విద్యను అభ్యసించారు. అక్కడ ఆమె ఆర్థికశాస్త్రం , ఫ్రెంచ్‌లో డ్యూయల్ మేజర్‌తో పట్టభద్రురాలయ్యారు. తరువాత లాస్ ఏంజిల్స్‌లోని ఫ్యాషన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ అండ్ మర్చండైజింగ్ నుండి ఫ్యాషన్ డిజైనింగ్ డిప్లొమా , స్టాన్‌ఫోర్డ్‌లో ఎంబీఏ పట్టా పొందారు. అక్షత మూర్తి ఎంబీఏ చదువుతున్న సమయంలో స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో సునాక్, అక్షత మూర్తికి పరిచయం పెళ్లికి దారి తీసింది. 2009లో వివాహం చేసుకున్న ఈ దంపతులు కెన్సింగ్టన్లోని నివసిస్తున్నారు. వీరికి కృష్ణ, అనౌష్క అనే ఇద్దరు అమ్మాయిలున్నారు. ప్రస్తుతం అక్షత వ్యాపారవేత్తగా రాణిస్తున్నారు. -
Doctor Death: పెళ్లయి చిన్నపాప ఉందన్నా వినలేదు.. పచ్చబొట్లు వేయించుకొని..
సాక్షి, హిందూపురం: పట్టణంలోని జీఆర్ లాడ్జీలో కొన్ని రోజుల క్రితం అనుమానాస్పదంగా మరణించిన డాక్టర్ అక్షిత కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. ఆమె వెంట వచ్చిన యువకుడే హంతకుడిగా తేల్చారు. దిశ పోలీసుస్టేషన్ డీఎస్పీ శ్రీనివాసులు ఆదివారం స్థానిక టూటౌన్ పోలీసుస్టేషన్లో సీఐ వెంకటేశ్వర్లుతో కలిసి వివరాలు వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రం ఏటూరి నాగరం పట్టణానికి చెందిన పిసింగి మహేశ్ వర్మ 6 నెలల క్రితం బస్సులో ప్రయాణిస్తుండగా వరంగల్ జిల్లా మంగపేటకు చెందిన దేంతనపల్ల డాక్టర్ అక్షిత పరిచయమైంది. ఇన్స్టాగ్రామ్ ద్వారా ఆమె ఫోన్ నెంబర్ తెలుసుకున్న మహేశ్ వర్మ ఆమెకు వీడియో కాల్స్ చేసేవాడు. ప్రేమిస్తున్నానంటూ వేధించేవాడు. ఉన్నత విద్య కోసం కొన్నిరోజుల క్రితం అక్షిత చిక్బళ్లాపురం వెళ్లగా.. అక్కడికే వెళ్లి వేధింపులు మొదలుపెట్టాడు. అరెస్ట్ వివరాలు వెల్లడిస్తున్న ‘దిశ’ డీఎస్పీ శ్రీనివాసులు చదవండి: (పెళ్లయి ఇద్దరు పిల్లలు.. ఇంజనీరింగ్ విద్యార్థితో జంప్) తనకు పెళ్లయి చిన్నపాప ఉందని తిరస్కరించినా వినలేదు. ఒంటిపై ఆమె పేరు, ఫొటోలతో పచ్చబొట్లు వేసుకోవడమే కాకుండా ప్రేమ ఒప్పుకోకుంటే ఆత్మహత్య చేసుకుంటానంటూ బెదిరించినా అక్షిత ఒప్పుకోలేదు. దీంతో ఆమె ఫొటోలు మార్ఫింగ్ చేసిన మహేష్ వర్మ వాటిని సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తానని బెదిరించి బెంగళూరు తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. మళ్లీ ఆ ఫొటోలను అడ్డం పెట్టుకుని ఈ నెల 24న హిందూపురంలోని జీఆర్ లాడ్జీకి రప్పించి అత్యాచారం చేశాడు. ఫొటోలు డిలీట్ చేయాలని కోరితే.. ఆమె ముఖంపై దిండు పెట్టి ఊపిరి ఆడకుండా చేశాడు. అనంతరం లాడ్జీ నిర్వాహకుల వద్ద ఆమెకేమైందో తెలియదని అమాయకుడిలా నటిస్తూ తనే 108కు ఫోన్ చేసి సమాచారం ఇచ్చి పరారయ్యాడు. కేసు నమోదు చేసిన పోలీసులు పక్కా సమాచారంతో ఆదివారం స్థానిక రైల్వే స్టేషన్ వద్ద నిందితుడిని అరెస్టు చేశారు. మహేష్‌వర్మపై గతంలో కూడా ఆ రాష్ట్రంలో వేధింపుల కేసు నమోదైనట్లు పోలీసులు వెల్లడించారు. జైలు శిక్ష కూడా అనుభవించాడన్నారు. -
Doctor Death Mystery: ‘అశ్లీల చిత్రాలతో బెదిరించి చంపేశాడు’
సాక్షి, హిందూపురం (శ్రీసత్యసాయి జిల్లా): తన సోదరి చిత్రాలను మార్ఫింగ్ ద్వారా అశ్లీల చిత్రాలు మార్చి బెదిరించి లాడ్జికి వచ్చేలా చేసి ఆమెను చంపేశాడని పట్టణంలోని జీఆర్ లాడ్జిలో బుధవారం అనుమానాస్పదంగా మృతి చెందిన డాక్టర్ అక్షిత సోదరుడు శషాంక్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ మేరకు గురువారం స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీఐ వెంకటేశ్వర్లు తెలిపిన మేరకు.. వరంగల్ జిల్లా మంగపేటకు చెందిన దేంతనపల్లి అక్షిత కర్ణాటక రాష్ట్రం చిక్‌బళ్లాపూర్ జిల్లాలోని ఓ మెడికల్ కళాశాలలో పీజీ చదువుతోంది. ఈమెకు 6 నెలల క్రితం మెదక్ జిల్లా పటాన్ చెరువుకు చెందిన మహేష్ వర్మ బస్సులో పరిచయమయ్యాడు. అక్షిత ఇన్‌స్ట్రాగామ్ ఫాలో అయ్యి ఆమె ఫొటోలు డౌన్లోడ్ చేసుకున్నాడు. వాటిని అశ్లీలంగా మార్చిన అనంతరం అక్షితకు చూపి బెదిరిస్తూ వచ్చాడు. ఈ క్రమంలోనే బుధవారం ఆమెను హిందూపురంలోని జీఆర్ లాడ్జికి వచ్చేలా చేశాడు. లాడ్జిలోని ఓ రూంలో గొంతు నులిమి హత్య చేశాడు. ఈ మేరకు మృతురాలి తమ్ముడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించినట్లు పేర్కొన్నారు. నిందితుడు మహేష్ వర్మ పరారీలో ఉన్నాడని, అతన్ని పట్టుకుని పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. చదవండి: (లాడ్జిలో ప్రియుడితో దిగిన అక్షిత.. దారుణ హత్య) -
భార్య అక్షతా మూర్తిపై రిషి సునాక్ మనసులో మాట
లండన్: బ్రిటన్ ప్రధాని రేసులో ఉన్న రిషి సునాక్ తన భార్య, ఇన్ఫోసిస్ నారాయణమూర్తి కూతురు అక్షతా మూర్తి గురించి అనేక విషయాలు వెల్లడించారు. వారి తొలి పరిచయం, ఆమె వ్యవహార శైలి, కుటుంబ బాధ్యతలు, పెళ్లి నాటి విషయాలను రిషి సునాక్ మీడియాకు తెలిపారు. ‘వస్తువులను చక్కగా అమర్చే అలవాటు నాది. తానేమో చిందరవందరగా పడేస్తుంది. నేను చాలా క్రమశిక్షణతో ఉంటాను. తనకేమో సమయస్ఫూర్తి ఎక్కువ. ఈ విషయాలు చెప్పడం తనకు ఇష్టముండదు. కానీ, నేను మనస్సులో ఉన్న మాట చెబుతున్నా. ఆమెది పూర్తిగా చక్క బెట్టే తత్వం కాదు. ప్రతి చోటా దుస్తులు, ఎక్కడపడితే అక్కడ షూలు. ఓహ్..గాడ్..!’ అంటూ తన భార్య అక్షత గురించి సునాక్ వివరించారు. ఇంగ్లండ్‌లోని సౌతాంప్టన్‌లో భారత సంతతికి చెందిన దంపతులుకు రిషి సునాక్ జన్మించారు. రిషి స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీలో ఎంబీఏ చదువుతోన్న సమయంలో అక్షతతో పరిచయం ఏర్పడింది. అనంతరం 2006లో వారికి బెంగళూరులో వివాహమైంది. వీరికి ఇద్దరు అమ్మాయిలు. కృష్ణ(11), అనౌష్క(9). ‘ఈ విషయంలో నేను చాలా అదృష్టవంతుడిని. ఎందుకంటే వాళ్లు పుట్టే సమయానికి నేను సొంత బిజినెస్ నడుపుతున్నా. అందుకే వాళ్లతో గడపటానికి సమ యం దొరికేది. అలా వాళ్లతో ప్రతిక్షణాన్ని ఆస్వాదించా’అని కుటుంబ విషయాలను సునాక్ పంచుకున్నారు. అయితే, రిషి సునాక్ మంత్రిగా ఉన్న సమయంలో ఆయన భార్య అక్షతా మూర్తి పన్నుల చెల్లింపు వ్యవహారం వివాదాస్పదమైంది. దీంతో అధికార నివాసం డౌనింగ్ స్ట్రీట్‌లోని నంబర్–10 నుంచి ఖాళీ చేసి మరో చోటుకు వెళ్లిపోయారు. అనంతరం అక్షత వివాదం సద్దుమణిగింది. ఇదే సమయంలో ప్రధాని బోరిస్ జాన్సన్ రాజీనామా చేశారు. అనంతరం కన్జర్వేటివ్ పార్టీ నేతను ఎన్నుకునే ప్రక్రియ మొదలు కావడం వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. దీంతో రిషి సునాక్, లిజ్ ట్రస్ మధ్య తీవ్ర పోటీ నెలకొనగా.. అంతిమ ఫలితం సెప్టెంబర్ 5న తేలనుంది. చదవండి: అయోధ్యలో బీజేపీ నేతల భూ కుంభకోణం.. అఖిలేశ్ యాదవ్ ఫైర్ -
పన్నులన్నీ చెల్లిస్తా
లండన్: భర్త దేశ ఆర్థిక మంత్రిగా ఉండి భార్యే పన్నులు చెల్లించట్లేదనే ఆరోపణలు పక్కదారి పట్టకుండా ఉండేందుకు బ్రిటన్‌లోనూ ఇకపై పన్నులు చెల్లిస్తానని ఆ దేశ ఆర్థిక మంత్రి రిషి సునక్ భార్య అక్షతా మూర్తి స్పష్టంచేశారు. వాస్తవానికి ఆమెకు బ్రిటన్ పౌరసత్వంలేదు. బ్రిటన్ పౌరసత్వం లేనందున విదేశాల్లో వచ్చే ఆదాయంపై పన్నులను బ్రిటన్‌లో చెల్లించాల్సిన పనిలేదు. ప్రసిద్ధ సాఫ్ట్వేర్ సంస్థ ఇన్ఫోసిస్‌లో అక్షతకు 0.9 శాతం వాటా ఉంది. వేర్వేరు సంస్థల్లో పెట్టుబడులతో రూ.కోట్ల మొత్తంలో ఆదాయాన్ని పొందుతున్నారు. అయితే, స్వయంగా ఆర్థిక మంత్రి భార్యే పన్నులు చెల్లించట్లేదని అక్కడి రాజకీయ పార్టీలు విమర్శలు చేయడంపై అక్షత స్పందించారు. ‘బ్రిటన్‌లో వ్యాపారంపై వచ్చే ఆదాయానికి పన్నులను బ్రిటన్‌లో కడుతున్నాను. ఇక అంతర్జాతీయ ఆదాయంపై అంతర్జాతీయ పన్నునూ చెల్లిస్తున్నాను. భారత్‌సహా ప్రపంచవ్యాప్త ఆదాయంపై పన్నులను ఇకపై బ్రిటన్‌లో చెల్లించడం ప్రారంభిస్తా’ అని ట్వీట్ చేశారు.