అక్షతా మూర్తి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒక దేశ ప్రధాని భార్య అయినా చాలా సాదాసీదాగానే ఉంటారు. ఇక ఆమె తల్లిదండ్రులు నారాయణ మూర్తి దంపతులు గురించి అస్సలు చెప్పాల్సిన పనిలేదు. అంత పెద్ద టెక్ కంపెనీ వ్యవస్థాపకులై కూడా నారాయణ మూర్తి దంపతులిద్దరూ ఎంత సింపుల్‌గా ఉంటారో అందరికి తెలిసిందే. ఇక వాళ్ల పెంపకంలో పెరిగిన కూతురు అక్షతా వారిలానే కదా! ఉండేది.
ఆ కుటుంబం అంతా రాఘవేంద్ర స్వామి ఆలయాన్ని దర్శించుకోవడానికి వచ్చారు. అక్కడ ఎలాంటి సెక్యూరిటీ గార్డులు లేకుండా సాధారణ వ్యక్తుల్లా మెలిగారు. పైగా ఎవ్వరూ వారిని గుర్తుపట్ట లేనంతగా చాలా సాధార వ్యక్తుల్లా వ్యవహరించడమ గ్రేట్ కదా!. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. కొంతమంది బిలియనర్లు, పలుకు బడిన వ్యక్తులు అలాంటి దేవాలయాలకు వస్తే హడావిడి ఓ రేంజ్‌లో ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే సాధారణ భక్తులకు కూడా వీళ్ల హడావిడి కారణంగా దర్శనం కూడా దొరకపోగా గంటల తరబడి వెయింట్ చేస్తు ఉండాపోవాల్సిన పరిస్థితి ఎదురవ్వుతుంది.
కానీ ఇక్కడ యూకే ప్రధాని భార్య అక్షతామూర్తి, తన ఇద్దరు కూతుళ్లు అనౌష్క, కృష్ణ, తల్లిదండ్రులు నారాయణమూర్తి, సుధా మూర్తిలతో కలిసి రాఘవేంద్ర స్వామి ఆలయంలో సందడి చేశారు. అక్కడ మఠంలోని పుస్తకాలను వెతుకుతూ కనిపించారు. అంత పెద్ద స్థాయిలో ఉండి కూడా సాధారణ భక్తుల్లా వ్యవహరించిన తీరు నెటిజన్లను ఆకర్షించడమే గాక వాళ్ల సింపుల్ సిటీకి ఫిదా అవ్వుతూ గ్రేట్ అంటూ నెట్టింట ప్రశంసల జల్లు కురిపించారు
కాగా, ఈ నెలలోనే అక్షత తల్లిదండ్రులతో కలిసి రచయిత్రి చిత్ర బెనర్జీ దివాకరుణి తాజా పుస్తకం 'యాన్ అన్‌కామన్ లవ్': ది ఎర్లీ లైఫ్ ఆఫ్ సుధా అండ్ నారాయణ మూర్తి' ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇక అక్షతామూర్తి ఆమె భర్త రిషి సునాక్ గతేడాది సెప్టెంబర్‌లో జీ20 సదస్సు కోసం భారతదేశాన్ని సందర్శించడం జరిగింది. అప్పుడు ఈ దంపతులిద్దరూ అక్షరధామ్ మందిర్ దర్శనం చేసుకుని పూజలు చేశారు.
UK PM Rishi Sunak's wife and kids spotted at Raghavendra Mutt in Bengaluru, accompanied by Infosys Founder Narayanamurthy. Their simplicity shines through, with no security in sight. pic.twitter.com/WxIAvHh40w
— M.R. Guru Prasad (@GuruPra18160849) February 26, 2024
Comments
Please login to add a commentAdd a comment