‘లంక’లో ప్రేమకథ | Love Story in 'Lanka' | Sakshi
Sakshi News home page

‘లంక’లో ప్రేమకథ

Published Thu, Nov 14 2013 12:18 AM | Last Updated on Sat, Sep 2 2017 12:34 AM

‘లంక’లో ప్రేమకథ

‘లంక’లో ప్రేమకథ

లంక అనగానే మనకు గుర్తొచ్చేది రాముడు, సీత, రావణుడు. సీతను తనదాన్ని చేసుకోవడానికి రావణుడు పన్నిన కుట్ర మనకు తెలిసిందే. కానీ, ఈ లంక కథ వేరు అంటున్నారు వెంకట్‌రాజ్. రవి, అక్షత జంటగా ఆయన దర్శకత్వంలో శ్రీనివాస్ బి. నిర్మిస్తున్న చిత్రం ‘లంక’. ఈ సినిమా పాటల రికార్డింగ్ ఇటీవలే ప్రారంభమైంది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ -‘‘రామాయణంలోని లంకలో రావణుడు రాక్షసుడై సీతను చెరబట్టాడు. కానీ, ఈ లంకలో ఏం జరుగుతుందనేది ఆసక్తికరంగా ఉంటుంది’’ అని చెప్పారు. ఈ చిత్రానికి కెమెరా: రఘు ఆర్. బళ్ళారి, సంగీతం: మణి జెన్న, ఫైట్స్: జాషువా, సహనిర్మాతలు: బద్దెల నాగరాజు, ఎమ్. అల్లూరమ్మ అచ్చయ్య.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement