Lanka
-
శతక నీతి – సుమతి: మహనీయుల పుస్తకాలే మంచి నేస్తాలు
మనిషి తన జీవన ప్రయాణంలో అనుక్షణం గుర్తుంచుకోవలసిన విషయం ఒకటి ఉంది...‘త్యజదుర్జన సంసర్గమ్ భజ సాధు సమాగమమ్’.. ప్రయత్న పూర్వకంగా మానేయవలసినది... దుర్జనులతో స్నేహం. అది ఎప్పటికయినా కొంప ముంచేస్తుంది. ఏదో ప్రమాదాన్ని తెస్తుంటుంది. అలాగే కోరికోరి చేయవలసిన పని... మంచి మార్గంలో నడిచేవారితో కలిసి మెలిసి ఉండడం. మంచి మనుషులు అంటే నాకెవరూ అందుబాటులో లేరని అనుకోవద్దు. రామకృష్ణ పరమహంస, వివేకానంద స్వామిలాంటి మహనీయుల పుస్తకాలు, చంద్రశేఖర సరస్వతీ మహాస్వామివారి అనుగ్రహ భాషణాలవంటివి ఇంట్లో ఉంచుకుని వాటిని చదువుతూ, వింటూఉంటే వారు మనతో ఉన్నట్లే.. మనమూ వారివేలు పట్టుకుని నడుస్తున్నట్టే. సత్పురుషుల మాటలు వినడం, వారి జీవిత చరిత్రలు చదవడం, వారి జీవన విధానాన్ని పరిశీలించడం వంటివి క్రమం తప్పకుండా చేస్తుంటే... మనం మంచి మార్గంలో ప్రయాణించడానికి అవసరమైన స్ఫూర్తిని అవి ప్రతి క్షణం కలిగిస్తుంటాయి. మారీచుడు రావణాసురుడితో ఓ మాటంటాడు – ‘కొన్ని తప్పులు చేస్తే కొన్నే పోతాయి. కానీ మహాత్ముల జోలికి వెళ్ళావనుకో ఎంత ప్రమాదం వస్తుందో తెలుసా! నీ ఒక్కడితో పోదు. నువ్వు పరిపాలిస్తున్న లంకా పట్టణం నాశనమయిపోతుంది. నిన్ను నమ్ముకున్నందుకు రాక్షసులు ఒక్కరు కూడా మిగలరు. ఆఖరికి నీ కొడుకులు, నీ తోడబుట్టినవారుకూడా పోతారు. నీ భార్యలతో నువ్వు సంతోషంగా హాయిగా బతకాలనుకుంటే సీతమ్మ జోలికి వెళ్ళకు’ అన్నాడు. రావణుడు వినకపోగా ఏమన్నాడంటే – ‘‘సీతాపహరణానికి సహకారం చేస్తే రాముడి చేతిలో చచ్చిపోతావు. నా మాట వినకపోతే నా చేతిలో చస్తావు. నీకు ఎవరి చేతిలో చావాలనుంది’’ అని అడిగాడు. దుర్మార్గుడయిన నీ చేతిలో చచ్చేకన్నా మహాపురుషుడు రాముడి చేతిలో చచ్చిపోతానని చెప్పి వెళ్ళిపోయాడు మారీచుడు. ఏమయింది చివరకు ...? మారీచుడు చెప్పినట్టే ఒక్క దుర్మార్గుడి వల్ల మొత్తం లంకారాజ్యం అంతా నశించిపోయింది. రాక్షసులు నశించిపోయారు. కొడుకు ఇంద్రజిత్ పోయాడు. ఆఖరికి భార్య రావణాసురుడి శవాన్ని చూసి –‘‘అందరూ నిన్ను రాముడు చంపాడనుకుంటున్నారు, కాదు. నిజానికి నిన్ను చంపింది ఎవరో తెలుసా! నీ ఇంద్రియాలే, వాటి లోలత్వమే నిన్ను చంపేసాయి.’’ అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ముందు ఒక మేకల మంద వెడుతుంటుంది. వాటి వెనుక ఒక వ్యక్తి వెళ్లాడనుకోండి. మేకలను రక్షిస్తాడు. అలా కాక ఒక తోడేలో, నక్కో వెళ్లిందనుకోండి. అప్పుడు మేకలకు ప్రమాదం బయటినుంచేమీ ఉండదు. వాటికి రక్షణగా ఉన్నవే వాటిని భక్షించేస్తాయి. నీవు కూడా దుర్మార్గులతో కలిసి ఉంటే నిన్ను పాడుచేయడానికి బయటినుంచి ఎవరూ రానక్కరలేదు. ఆ దుర్మార్గులతో కలిసి ఉన్న కారణమే నిన్ను నాశనం చేసేస్తుంది. అదే ఒక సత్పురుషుడితో కలిసి ఉంటే నీవు మంచి పనులు చేస్తున్నా చేయకపోయినా నీలో ఉన్న దుర్గుణాలన్నీ ఒక్కొక్కటిగా తొలగిపోతుంటాయి. సుమతీ శతకకారుడి ఆవేదనాభరిత సందేశం కూడా ఇదే. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
రూ.80 కోట్లతో అయోధ్యలంకకు వంతెన
సాక్షి, పెనుగొండ: గోదావరి జిల్లాల ప్రజల చిరకాల కోరిక నెరవేర్చడానికి అయోధ్యలంక, పుచ్చల్లంక మధ్య గోదావరిపై రూ.80 కోట్లతో బ్రిడ్జి నిర్మాణానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆమోదం తెలిపారని, లంక గ్రామాల పరిరక్షణే ధ్యేయంగా పక్కా ప్రణాళిక రూపొందిస్తున్నట్లు రాష్ట్ర గృహనిర్మాణశాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు తెలిపారు. జలవనరుల శాఖ చీఫ్ ఇంజినీర్ సీహెచ్ శ్రీధర్‌తో కలిసి శుక్రవారం ఉభయ గోదావరి జిల్లా ల్లోని పల్లిపాలెం, రావిలంక, అయోధ్యలంక తీరంలో కోతకు గురవుతున్న ప్రాంతాలను పరిశీలించా రు. వంతెన నిర్మాణంతో ఉభయగోదావరి జిల్లాల మధ్య రవాణా సదుపాయం మరింత మెరుగవుతుందని మంత్రి అన్నారు. వశిష్ట, వైనతేయ గోదా వరి పాయలు కలిసే ప్రాంతంలో కోత ఎక్కువగా ఉందని, శాశ్వత పరిష్కారం కోసం పరిశీలన జరిపి ఇరిగేషన్ అధికారులు, నిపుణుల కమిటీ నివేదిక సమర్పిస్తారని చెప్పారు. వచ్చే నవంబర్ చివరిలో పనులు ప్రారంభమవుతాయన్నారు. ఎస్ఈ ప్రకాశ్‌రావు, ఈఈ మోహనరావు, డీఈఈ జి.శ్రీనివాసు, ఎంపీడీఓ శ్రీనివాసరావు, ఏఈఈలు సీహెచ్ఎన్వీ సుబ్రహ్మణ్యం, పవన్‌కుమార్, సుబ్బారావుతో పా టు పార్టీ నాయకులు సుంకర సీతారాం, కొప్పాడి సత్యనారాయణ, గొల్లపల్లి బాలకృష్ణ, అడ్డాల గంగరాజు పాల్గొన్నారు. -
90 నిమిషాల్లోనే...
దుబాయ్: పాకిస్తాన్ విజయలక్ష్యం 317 పరుగులు... ఓవర్‌నైట్ స్కోరు 198/5. నాలుగో రోజు చివర్లో ఆ జట్టు సాగించిన పోరాటాన్ని బట్టి చూస్తే విజయం దిశగా సాగుతున్నట్లు అనిపించింది. అయితే చివరి రోజు మంగళవారం శ్రీలంక ఆ అవకాశం ఇవ్వలేదు. గంటన్నర వ్యవధిలోనే మిగతా ఐదు వికెట్లు పడగొట్టి పాక్ కథ ముగించింది. 68 పరుగుల తేడాతో రెండో టెస్టులో విజయం సాధించి 2–0తో సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో పాకిస్తాన్ 248 పరుగులకు ఆలౌటైంది. అసద్ షఫీఖ్ (176 బంతుల్లో 112; 10 ఫోర్లు) సెంచరీతో పాటు కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ (130 బంతుల్లో 68; 5 ఫోర్లు) కలిసి ఆరో వికెట్‌కు 173 పరుగులు జోడించినా... అది జట్టును రక్షించడానికి సరిపోలేదు. ఆఫ్‌స్పిన్నర్ దిల్రువాన్ పెరీరా (5/98) పాక్‌ను దెబ్బ తీశాడు. దిముత్ కరుణరత్నేకు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’, ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు లభించాయి. తొలి టెస్టులో శ్రీలంక 21 పరుగులతో నెగ్గింది. ఈ రెండు జట్ల మధ్య ఐదు వన్డేల సిరీస్ ఈనెల 13న మొదలవుతుంది. ►1 యూఈఏని తమ సొంత మైదానంగా మార్చుకున్న తర్వాత (2010) పాకిస్తాన్ అక్కడ టెస్టు సిరీస్ ఓడిపోవడం ఇదే తొలిసారి. ఇంతకు ముందు పాక్ 9 సిరీస్‌లు ఆడగా...5 గెలిచి మరో 4 డ్రా చేసుకుంది. -
'లంక' మూవీ రివ్యూ
టైటిల్ : లంక జానర్ : సస్పెన్స్ థ్రిల్లర్ తారాగణం : రాశి. సాయి రోనక్, ఈన సాహా, సంగీతం : శ్రీ చరణ్ దర్శకత్వం : శ్రీ ముని నిర్మాత : నమన విష్ణు కుమార్, నమన దినేష్ ఒకప్పుడు హీరోయిన్ గా స్టార్ హీరోలతో సినిమాలు చేసిన నటి రాశి, లాంగ్ గ్యాప్ తరువాత కళ్యాణ వైభోగమే సినిమాతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రీ ఎంట్రీ ఇచ్చింది. అయితే రీ ఎంట్రీలోనూ తన మార్క్ చూపించేందుకు భర్త శ్రీముని దర్శకత్వంలో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రతో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన లంక సినిమా రాశి అనుకున్న విజయాన్ని అందించిందా..? థ్రిల్లర్ జానర్ లో తెరకెక్కిన సినిమాలు వరుస సక్సెస్ సాధిస్తున్న నేపథ్యంలో లంక మరో హిట్ సినిమా అనిపించుకుందా..? కథ : సాయి (సాయి రోనక్), సుధా( సుదర్శన్) ఎలాగైన సినీ రంగంలో స్థిరపడాలన్న కోరికతో తల్లితండ్రులు ఎంత తిడుతున్నా పట్టించుకోకుండా సినిమా ప్రయత్నాలు చేస్తుంటారు. సిల్వర్ స్క్రీన్ మీద ఛాన్స్ కొట్టాలంటే ముందు షార్ట్ ఫిలింతో ప్రూవ్ చేసుకోవాలని నిర్ణయించుకుంటారు. ఆ షార్ట్ ఫిలింను తానే నిర్మిస్తానని మాట ఇవ్వటంతో పాత సామాన్ల వ్యాపారం చేసే సత్యను హీరోగా తీసుకుంటారు. హీరోయిన్ కోసం వెతుకుతుండగా.. ఓ షాపింగ్ మాల్ స్వాతి(ఈన సాహా)ను చూసి ఆమెనే హీరోయిన్ గా ఫిక్స్ అవుతాడు. అప్పటికే మలయాళ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ అయిన స్వాతి ముందు కాదన్న అప్పటికే తాను ఓ పెద్ద ప్రమాదంలో ఉండటంతో దాని నుంచి తప్పించుకోవడానికి షార్ట్ ఫిలిం లో నటించేందుకు ఒప్పుకుంటుంది. అయితే స్వాతి హీరోయిన్ అని తెలియని సాయి, సుధాలు రెబాకా విలియమ్స్(రాశి) బంగ్లాలో షూటింగ్ స్టార్ట్ చేస్తారు. ఎవరూ లేని ఇంట్లో ఒక్కతే ఉండే రెబాకా ప్రవర్తన అందరికీ వింతగా అనిపిస్తుంది. చనిపోయిన తన పిల్లలను ఉన్నట్టుగా ఊహించుకొని బతుకుతున్న రెబాకాకు స్వాతి దగ్గరవుతుంది. రెబాకాతో ఉన్న సమయంలో తన బాధలన్ని మర్చిపోయి హాయిగా ఉంటుంది. ఆ సమయంలో అనుకోకుండా స్వాతి కనిపించకుండా పోయిందన్న వార్త నేషనల్ మీడియాలో ప్రసారమవుతుంది. స్టార్ హీరోయిన్ మిస్ అవ్వటంతో పోలీస్ డిపార్ట్మెంట్ కేసు ను సీరియస్ గా తీసుకుంటుంది. స్వాతితో షార్ట్ ఫిలిం తీసిన సాయి టీంను అరెస్ట్ చేసి ఇంటరాగేట్ చేస్తారు. అదే సమయంలో స్వాతికి దగ్గరైన రెబాకాను అనుమానిస్తారు. అసలు స్వాతి ఎలా మిస్ అయ్యింది..? స్వాతి ఏ ప్రమాదం నుంచి తప్పించుకోవడానికి షార్ట్ ఫిలిం చేసేందుకు ఒప్పుకుంది..? రెబాకాకు స్వాతికి సంబంధం ఏంటి..? చివరకు స్వాతి రెబాకాలు ఏమయ్యారు...? అన్నదే మిగతా కథ. నటీనటులు : ఒకప్పటి హీరోయిన్లందరూ రీ ఎంట్రీలో అత్త అమ్మ పాత్రలకు పరిమితమవుతుంటే, రాశీ మాత్రం ప్రయోగాత్మక చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో సెటిల్ పర్ఫామెన్స్ తో ఆకట్టుకుంది. ఉన్నంతలో తన పరిథి మేరకు సినిమా స్థాయిని పెంచే ప్రయత్నం చేసింది. హీరో హీరోయిన్లుగా సాయి రోనక్, ఈన సాహాలు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. ముఖ్యంగా హీరోయిన్ ఈన సాహా మంచి వేరియేషన్స్ చూపించింది. ఒకే సినిమాలో రెండు డిఫరెంట్ వేరియషన్స్ ఉన్న పాత్రల్లో కనిపించిన శిజు రెండు పాత్రలకు పూర్తి న్యాయం చేశాడు. సుప్రీత్, సత్యం రాజేష్, సుదర్శన్, సత్యలు పాత్రకు తగ్గ నటనతో ఆకట్టుకున్నారు. సాంకేతిక నిపుణులు : భార్య రీ ఎంట్రీ కోసం దర్శకుడు శ్రీ ముని తయారు చేసుకున్న లైన్ బాగున్నా.. కథనం నడిపించిన తీరు మాత్రం ఆకట్టుకునేలా లేదు. ముఖ్యంగా చాలా సన్నివేశాలను జరగనివి జరిగినట్టుగా చూపించే ప్రయత్నంలో కన్య్ఫూజన్ క్రియేట్ అయ్యింది. కథకు మూలమైన రాశి పాత్రను డిజైన్ చేసిన తీరు ఆకట్టుకుంటుంది. అనవసరమైన పాటలను ఇరికించకుండా సినిమా రన్ టైం ను తగ్గించటం సినిమాకు ప్లస్ అయ్యింది. శ్రీ చరణ్ సంగీతం ఓకె. సినిమాటోగ్రఫి, ఎడిటింగ్, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ : రాశి నటన స్టోరి లైన్ మైనస్ పాయింట్స్ : కథనం అసలు కథకు సంబంధం లేని ఊహలు - సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్ -
ఇప్పటి హీరోయిన్లు చాలా లక్కీ!
‘‘హీరోయిన్గా చేస్తున్నప్పుడు నాకొస్తున్న పాత్రలు, సినిమాలను బట్టి నా క్రేజ్ తగ్గుతోందనే సంగతి అర్థమైంది. వెంటనే పెళ్లి చేసుకుని లైఫ్‌లో సెటిల్ అయ్యాను. క్రేజ్ ఉన్నప్పుడే సినిమాల నుంచి గ్యాప్ తీసుకోవడంతో ప్రేక్షకుల్లో నా ఇమేజ్ బాగుంది. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్‌లో మంచి ఛాన్సులు రావడానికి కారణమదే’’ అన్నారు రాశి. సాయిరోనక్, ఇనసహ, రాశి ప్ర«ధాన పాత్రల్లో శ్రీముని దర్శకత్వంలో నామన దినేష్, నామన విష్ణుకుమార్ నిర్మించిన సినిమా ‘లంక’ ఈ నెల 21న విడుదలవుతోంది. రాశి మాట్లాడుతూ – ‘‘ఎక్కడ చూసినా సమాజంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, దారుణాలకు సంబంధించిన వార్తలే. ‘లంక’ వంటి ఈ లోకంలో ఓ మహిళ ఎలాంటి సమస్యలు ఎదుర్కొందనేది కథ. టెలీపతి నేపథ్యంలో సినిమా సాగుతుంది. నేను 35 ఏళ్ల వయసున్న ఒంటరి మహిళగా నటించా. టెలీపతి ద్వారా నేనో అమ్మాయిని ఆవహించానా? లేదా తను నన్ను ఆవహించిందా? అనేది సస్పెన్స్. ఈ చిత్రానికి దర్శకుడు మా ఆయనే అయినా కథ, నా పాత్ర నచ్చడంతో చేశా’’ అన్నారు. సినిమా ఇండస్ట్రీలో మార్పుల గురించి... ‘‘నేను హీరోయిన్గా చేసినప్పుడు తీసుకున్న పారితోషికాన్ని ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఒక్క రోజుకు తీసుకుంటున్నారు. అప్పట్లో హీరోయిన్లకు కేర్‌వ్యాన్‌లు, గట్రా లేవు. బట్టలు మార్చుకోవడానికి సరైన సదుపాయాలు ఉండేవి కాదు. ఎండల్లో, కొండల్లో షూటింగ్ చేసి చెట్ల కింద విశ్రాంతి తీసుకునేవాళ్లం. ఇప్పటి హీరోయిన్లు చాలా లక్కీ’’ అన్నారు. -
లంకలో థ్రిల్
నటి రాశీ ప్రధాన పాత్రలో తెరకెక్కిన సస్పెన్స్ థ్రిల్లర్ ‘లంక’. శ్రీముని దర్శకత్వంలో నామన దినేష్–నామన విష్ణు కుమార్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 14న విడుదల కానుంది. నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘వైవిధ్యమైన కథాంశంతో సైంటిఫిక్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన చిత్రమిది. టెలీపతి నేప«థ్యంలో రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతి పంచుతుంది. ఇటీవల విడుదల చేసిన ట్రైలర్‌కు మంచి స్పందన వస్తోంది. కథానాయిక ఐనా సాహాపై చిత్రీకరించిన పాట సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది’’ అన్నారు. సాయి రోనక్, ఐనా సాహా, సిజ్జు, సుప్రీత్, లీనా సిద్ధు తదితరులు నటించిన ఈ చిత్రానికి సమర్పణ: నామన శంకర్రావు, సుందరి. -
లంకలో టెలీపతి
‘‘బడ్జెట్ తక్కువని ఏ సినిమా పడితే అది తీసేసి విడుదల చేస్తున్నారు. అలాంటి సినిమాలు రెండు మూడు షోలు కూడా ఆడడం లేదు. కొత్త నిర్మాతలు బడ్జెట్ కంటే ఎక్కువ కథపై జాగ్రత్తలు తీసుకోవాలి. చిన్న సినిమాల కాన్సెప్ట్ డిఫరెంట్‌గా ఉండడం చాలా ముఖ్యం. ‘కల్యాణ వైభోగం’తో రీ–ఎంట్రీ ఇచ్చిన రాశి ఈ చిత్రంలో మంచి పాత్ర చేశారు’’ అన్నారు నిర్మాత కేఎల్ దామోదర ప్రసాద్. రాశి, సాయిరోనక్, ఇనసహ ముఖ్య తారలుగా శ్రీముని దర్శకత్వంలో దినేశ్ నామన, విష్ణు నామన నిర్మిస్తున్న సినిమా ‘లంక’. శనివారం సీనియర్ ఫొటో జర్నలిస్టులు జనార్థన్‌రెడ్డి, సాయిరమేశ్, సీఎం ప్రవీణ్‌కుమార్, భూషణ్ ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ – ‘‘ఇప్పటివరకూ భారతీయ సినిమాల్లో రాని టెలీపతి పాయింట్‌తో చేసిన సైంటిఫిక్ థ్రిలర్ చిత్రమిది. ఎలాంటి సాధనాలు, వస్తువులు లేకుండా మైండ్ టు మైండ్ కమ్యునికేషన్ జరపడమే టెలీపతి. రాశి, సాయిరోనక్, ఇనసహ పాత్రల మధ్య కథ నడుస్తుంది. సినిమాలో ఒక్క పాటే ఉంటుంది. ఏప్రిల్‌లో చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు. ‘సత్యం’ రాజేశ్, ముత్యాల రామదాసు, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. -
లంకలో ఏం జరిగింది?
సీతను అపహరించిన రావణుడు లంకకు తీసుకువెళ్లి అశోకవనంలో బందీగా ఉంచుతాడు. అప్పుడు రాముడు తన సతీమణి కోసం యుద్ధం చేస్తాడు. రామాయణం విన్నోళ్లకూ, చదివినోళ్లకూ ఈ కథ, ‘లంక’ అనే ఊరి పేరు బాగా తెలుసు. ఇప్పుడీ కథ ఎందుకంటే... ‘లంక’ పేరుతో ఓ సస్పెన్స్ థ్రిల్లర్ రూపొందుతోంది. రాశి కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ ‘లంక’లో సీతారాములు ఎవరు? రావణుడు ఎవరు? అని దర్శకుడు శ్రీమునిని అడిగితే... ‘‘ఈ రోజే టీజర్ విడుదల చేశాం కదా. కొన్ని రోజులు వెయిట్ చేస్తే, ఆ విషయాన్నీ చెప్పేస్తాం’’ అన్నారు. నామన దినేశ్, నామన విష్ణుకుమార్ నిర్మిస్తున్న ఈ సినిమా టీజర్‌ను మంగళవారం దర్శకుడు మారుతి విడుదల చేశారు. ‘‘నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ నెలాఖరున పాటల్ని, వచ్చే నెలలో చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: శ్రీచరణ్ పాకాల, సమర్పకులు: నామన శంకర్రావు–సుందరి. -
లంక టీజర్ రిలీజ్ చేసిన మారుతి
టాలీవుడ్లో హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకున్న రాశీ, పెళ్లి తరువాత సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. చాలా కాలం తరువాత ఇప్పుడు ఓ హర్రర్ థ్రిల్లర్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది ఈ సీనియర్ హీరోయిన్. రాశీ భర్త శ్రీముని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను రోలింగ్ రాక్స్ బ్యానర్‌పై తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్‌తో పాటు నిర్మాణాంతర కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకున్న ఈ సినిమా ఫస్ట్ టీజర్‌ను దర్శకుడు మారుతి రిలీజ్ చేశారు. ఈ నెలలో ఆడియో రిలీజ్ చేసి, వచ్చే నెల సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. -
లంక టీజర్ రిలీజ్ చేసిన మారుతి
-
ఎవరు రక్ష?
సీతను రావణుడు ఎత్తుకెళితే రాముడు విడిపించాడు. ప్రస్తుత సమాజంలో స్త్రీలపై జరిగే అన్యాయాలను ఏ రాముడు వచ్చి తీరుస్తాడు? రక్షణ లేని స్త్రీలకు ఎవరు ర క్ష? ఇక్కడ రక్షించేదెవరు? శిక్షించేదెవరు? అనే కథాంశంతో రూపొందుతున్న చిత్రం ‘లంక’. రాశి లీడ్ రోల్ చేస్తోన్న ఈ చిత్రాన్ని నామన శంకరరావు, సుందరి సమర్పణలో రోలింగ్ రాక్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థపై దినేష్ నామన, విష్ణుకుమార్ నామన ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘‘సప్త సముద్రాల అవతల ఉన్న వాళ్ళను కూడా మన పూర్వీకులు మైండ్ టూ మైండ్ కమ్యూనికేట్ చేసేవారు. ఈ విద్యను టెలీపతి అనేవారు. కనుమరుగైన ఈ విద్యను ప్రస్తుత సమాజానికి ‘లంక’ సినిమా ద్వారా పరిచయం చేయబోతున్నాం. రాశిని దృష్టిలో పెట్టుకుని కథ రాశాను’’ అని చిత్రదర్శకుడు శ్రీముని. ‘‘ఇది సైంటిఫిక్ థ్రిల్లర్. టెలీపతి అనే విద్య ద్వారా లంక లాంటి ప్రస్తుత సమాజంలో స్త్రీలపై జరిగే అన్యాయాన్ని ఏ విధంగా ఓ స్త్రీ సమర్థవంతంగా ఎదుర్కొంది అనేది కథ’’ అని కూడా దర్శకుడు తెలిపారు. ‘క్షణం’ చిత్రానికి సంగీత సారథ్యం వహించిన శ్రీచరణ్ స్వరాలను సమకూరుస్తున్నారు. ఐనా సాహా, సాయి రోనిక్, సిజ్జు, సుప్రీత్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. -
సుంకాల్లో మార్పులు.. చిన్న కార్లకు లాభం
కొలంబో : శ్రీలంక ప్రభుత్వం దిగుమతి సుంకాల్లో మార్పులు తీసుకొచ్చింది. 800 నుంచి 1000 సీసీ కార్లపై దిగుమతి సుంకాన్ని తగ్గించింది. అదేవిధంగా ఎక్కువ ఇంజిన్ సామర్థ్యం కార్లపై మాత్రం దిగుమతి డ్యూటీని పెంచేసింది. శ్రీలంక తీసుకున్న ఈ నిర్ణయంతో భారత్ లో తయారయ్యే చిన్న కార్ల కంపెనీలు ఎక్కువగా లాభపడనున్నాయి. ఆర్థిక మంత్రిత్వశాఖ శుక్రవారం ఈ గెజిట్ నోటిఫికేషన్ ను విడుదలచేసింది. శ్రీలంకకు 800 నుంచి 1000 సీసీ వెహికిల్స్ ఎక్కువగా ఎగుమతి చేస్తున్నది భారత మార్కెటే కావడంతో, ఈ వెహికిల్స్ కు లాభం చేకూరనుందని డీలర్లు తెలిపారు. ప్రస్తుతం శ్రీలంక రూపాయల్లో 1.5 నుంచి 1.6 మిలియన్లగా ఉన్న టాక్స్ రేంజ్, ఈ దిగుమతి సుంకం తగ్గింపుతో ఆ కార్లకు టాక్స్ రేంజ్ 1.35 మిలియన్లు ఉండనుందని కారు డీలర్లు చెప్పారు. అయితే ఎస్ యూవీ లాంటి ఎక్కువ రేంజ్ ఉన్న వెహికిల్స్ కు దిగుమతి సుంకాలు పెరిగాయి. ఈ సుంకాలు శ్రీలంక రూపాయల్లో 5.4 మిలియన్ నుంచి 7.6 మిలియన్లకు పైగా పెరిగాయి. 1000 క్యూబిక్ సెంటీమీటర్ పైగా ఇంజీన్ సామర్థ్యమున్న వెహికిల్స్ పన్ను రేట్లను పెంచడంతో, ఆ కార్ల ధరలు కూడా పన్నులతో పాటు పైకి ఎగబాకనున్నాయని శ్రీలంక వాహన దిగుమతిదారుల అసోసియేషన్ తెలిపింది. త్రీ వీలర్ ఆటో టాక్సీలకు కూడా కస్టమ్ డ్యూటీ రేట్లను పెంచినట్టు డీలర్లు పేర్కొన్నారు. శ్రీలంక తీసుకున్న ఈ నిర్ణయంతో క్షీణిస్తున్న విదేశీ నిల్వలు ఆ ప్రభుత్వం పెంచుకోనుంది. -
ఉడతాభక్తి
నానుడి రామాయణంలోని చిన్న ఉదంతం నుంచి పుట్టిన నానుడి ఇది. లంకలో ఉన్న సీతను తీసుకు రావడానికి రామలక్ష్మణులు సుగ్రీవుని అధీనంలోని వానరసైన్యంతో యుద్ధానికి బయలుదేరతారు. సముద్రానికి ఆవల ఉన్న లంకను చేరుకునే శక్తి వానర యోధుల్లో కొద్ది మందికి తప్ప అందరికీ లేదు. సుగ్రీవుడి సేనాని నీలుడికి సముద్రంపై ఎలాంటి పదార్థాన్నయినా తేలియాడేలా నిలిపే శక్తి ఉంది. లంక వరకు వారధి నిర్మించడానికి వానర యోధులు యథాశక్తి పెద్దపెద్ద బండరాళ్లను సముద్రంలో పడవేస్తుంటారు. అది చూసిన ఓ ఉడతకు రామునికి సాయం చేయాలనిపిస్తుంది. తన శక్తి మేరకు నోటితో చిన్న చిన్న మట్టిబెడ్డలను తీసుకొచ్చి సముద్రంలో పడవేయసాగింది. బృహత్తర కార్యక్రమానికి ఆ స్థాయిలో కాకున్నా, శక్తివంచన లేకుండా చిత్తశుద్ధితో చేసే తన వంతు సాయాన్ని ఉడతాభక్తి అనడం వాడుకగా మారింది. -
కట్టుకోమన్నారు.. కనికరించడం లేదు
కట్టుకోమన్నారు.. కనికరించడం లేదు ఉండి, : ఉండి మండలంలోని వాండ్రం గ్రామ శివారు ప్రాంతమైన వాండ్రం లంకలో 30 కుటుంబాలు నివాసం ఉంటున్నారుు. వీరంతా పేదలు. వీరు 11 వ్యక్తిగత మరుగు దొడ్లు నిర్మించుకొని సుమారు రెండేళ్లు గడుస్తున్నా ఇప్పటికీ బిల్లులు మంజూరు కాలేదు. అప్పట్లో మరుగు దొడ్లు నిర్మించుకోలేదనే కారణంతో పంచాయతీ అధికారులు 4 నెలలపాటు రేషన్ సరుకులను ఇవ్వలేదు. మరుగుదొడ్లు నిర్మించుకుంటేనే ఇస్తామని చెప్పారు. దీంతో దిక్కుతోచని పేదలు అప్పో సప్పో చేసి దొడ్ల నిర్మాణం చేపట్టారు. ఎలాగోలా నానా తంటాలు పడి వాటి నిర్మాణం పూర్తి చేసుకున్నారు. ఇది జరిగి నెలలు గడుస్తున్నా వీరికి ఇప్పటికీ మరుగుదొడ్ల నిర్మాణానికి సంబంధించిన బిల్లులు మంజూరు కాలేదు. వీరిని పలకరించిన అధికారిగానీ, ప్రజా ప్రతినిధిగానీ లేరు. దీనిపై ఎన్నిసార్లు పంచాయతీ అధికారికి విన్నవించుకున్నా ప్రయోజనం లేకుండా పోయిందని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తీసుకొచ్చిన అప్పులకు వడ్డీలు పెరిగిపోతున్నాయని వారు వాపోతున్నారు. బిల్లులు మంజూరు కాకపోవడంతో వీటిని ఉపయోగించుకునే అవకాశం లేక లబ్ధిదారులు నానా ఇబ్బందులు పడుతున్నారు. బహిర్భూమికి వెళ్లాలంటే చుట్టూ అడవిలాంటి ప్రదేశం ఉన్న ప్రాంతానికి వెళ్లాల్సి వస్తోంది. అక్కడ విష సర్పాలు, పురుగుల సంచారం ఎక్కువ. మరోపక్క రైల్వే ట్రాక్ ఉంది. దీంతో ఎప్పుడు ఏం ప్రమాదం వాటిల్లుతుందోనని వారు భయపడుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తమ సమస్యను పరిష్కరించాలని లబ్ధిదారులు వేడుకుంటున్నారు. -
‘లంక’లో ప్రేమకథ
లంక అనగానే మనకు గుర్తొచ్చేది రాముడు, సీత, రావణుడు. సీతను తనదాన్ని చేసుకోవడానికి రావణుడు పన్నిన కుట్ర మనకు తెలిసిందే. కానీ, ఈ లంక కథ వేరు అంటున్నారు వెంకట్రాజ్. రవి, అక్షత జంటగా ఆయన దర్శకత్వంలో శ్రీనివాస్ బి. నిర్మిస్తున్న చిత్రం ‘లంక’. ఈ సినిమా పాటల రికార్డింగ్ ఇటీవలే ప్రారంభమైంది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ -‘‘రామాయణంలోని లంకలో రావణుడు రాక్షసుడై సీతను చెరబట్టాడు. కానీ, ఈ లంకలో ఏం జరుగుతుందనేది ఆసక్తికరంగా ఉంటుంది’’ అని చెప్పారు. ఈ చిత్రానికి కెమెరా: రఘు ఆర్. బళ్ళారి, సంగీతం: మణి జెన్న, ఫైట్స్: జాషువా, సహనిర్మాతలు: బద్దెల నాగరాజు, ఎమ్. అల్లూరమ్మ అచ్చయ్య.