కోతకు గురైన ప్రాంతాలను పరిశీలిస్తున్న మంత్రి శ్రీరంగనాథరాజు, ఇంజినీరింగ్ అధికారులు
సాక్షి, పెనుగొండ: గోదావరి జిల్లాల ప్రజల చిరకాల కోరిక నెరవేర్చడానికి అయోధ్యలంక, పుచ్చల్లంక మధ్య గోదావరిపై రూ.80 కోట్లతో బ్రిడ్జి నిర్మాణానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆమోదం తెలిపారని, లంక గ్రామాల పరిరక్షణే ధ్యేయంగా పక్కా ప్రణాళిక రూపొందిస్తున్నట్లు రాష్ట్ర గృహనిర్మాణశాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు తెలిపారు. జలవనరుల శాఖ చీఫ్ ఇంజినీర్ సీహెచ్ శ్రీధర్‌తో కలిసి శుక్రవారం ఉభయ గోదావరి జిల్లా ల్లోని పల్లిపాలెం, రావిలంక, అయోధ్యలంక తీరంలో కోతకు గురవుతున్న ప్రాంతాలను పరిశీలించా రు. వంతెన నిర్మాణంతో ఉభయగోదావరి జిల్లాల మధ్య రవాణా సదుపాయం మరింత మెరుగవుతుందని మంత్రి అన్నారు.
వశిష్ట, వైనతేయ గోదా వరి పాయలు కలిసే ప్రాంతంలో కోత ఎక్కువగా ఉందని, శాశ్వత పరిష్కారం కోసం పరిశీలన జరిపి ఇరిగేషన్ అధికారులు, నిపుణుల కమిటీ నివేదిక సమర్పిస్తారని చెప్పారు. వచ్చే నవంబర్ చివరిలో పనులు ప్రారంభమవుతాయన్నారు. ఎస్‌ఈ ప్రకాశ్‌రావు, ఈఈ మోహనరావు, డీఈఈ జి.శ్రీనివాసు, ఎంపీడీఓ శ్రీనివాసరావు, ఏఈఈలు సీహెచ్‌ఎన్‌వీ సుబ్రహ్మణ్యం, పవన్‌కుమార్, సుబ్బారావుతో పా టు పార్టీ నాయకులు సుంకర సీతారాం, కొప్పాడి సత్యనారాయణ, గొల్లపల్లి బాలకృష్ణ, అడ్డాల గంగరాజు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment