
లంకలో థ్రిల్
నటి రాశీ ప్రధాన పాత్రలో తెరకెక్కిన సస్పెన్స్ థ్రిల్లర్ ‘లంక’. శ్రీముని దర్శకత్వంలో నామన దినేష్–నామన విష్ణు కుమార్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 14న విడుదల కానుంది. నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘వైవిధ్యమైన కథాంశంతో సైంటిఫిక్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన చిత్రమిది. టెలీపతి నేప«థ్యంలో రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతి పంచుతుంది.
ఇటీవల విడుదల చేసిన ట్రైలర్‌కు మంచి స్పందన వస్తోంది. కథానాయిక ఐనా సాహాపై చిత్రీకరించిన పాట సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది’’ అన్నారు. సాయి రోనక్, ఐనా సాహా, సిజ్జు, సుప్రీత్, లీనా సిద్ధు తదితరులు నటించిన ఈ చిత్రానికి సమర్పణ: నామన శంకర్రావు, సుందరి.