ఇప్పటి హీరోయిన్లు చాలా లక్కీ! | Lanka Movie Release on 21st April | Sakshi
Sakshi News home page

ఇప్పటి హీరోయిన్లు చాలా లక్కీ!

Published Wed, Apr 19 2017 11:43 PM | Last Updated on Tue, Sep 5 2017 9:11 AM

ఇప్పటి హీరోయిన్లు చాలా లక్కీ!

ఇప్పటి హీరోయిన్లు చాలా లక్కీ!

‘‘హీరోయిన్‌గా చేస్తున్నప్పుడు నాకొస్తున్న పాత్రలు, సినిమాలను బట్టి నా క్రేజ్‌ తగ్గుతోందనే సంగతి అర్థమైంది. వెంటనే పెళ్లి చేసుకుని లైఫ్‌లో సెటిల్‌ అయ్యాను. క్రేజ్‌ ఉన్నప్పుడే సినిమాల నుంచి గ్యాప్‌ తీసుకోవడంతో ప్రేక్షకుల్లో నా ఇమేజ్‌ బాగుంది. ఇప్పుడు సెకండ్‌ ఇన్నింగ్స్‌లో మంచి ఛాన్సులు రావడానికి కారణమదే’’ అన్నారు రాశి. సాయిరోనక్, ఇనసహ, రాశి ప్ర«ధాన పాత్రల్లో శ్రీముని దర్శకత్వంలో నామన దినేష్, నామన విష్ణుకుమార్‌ నిర్మించిన సినిమా ‘లంక’ ఈ నెల 21న విడుదలవుతోంది.

రాశి మాట్లాడుతూ – ‘‘ఎక్కడ చూసినా సమాజంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, దారుణాలకు సంబంధించిన వార్తలే. ‘లంక’ వంటి ఈ లోకంలో ఓ మహిళ ఎలాంటి సమస్యలు ఎదుర్కొందనేది కథ. టెలీపతి నేపథ్యంలో సినిమా సాగుతుంది. నేను 35 ఏళ్ల వయసున్న ఒంటరి మహిళగా నటించా. టెలీపతి ద్వారా నేనో అమ్మాయిని ఆవహించానా? లేదా తను నన్ను ఆవహించిందా? అనేది సస్పెన్స్‌. ఈ చిత్రానికి దర్శకుడు మా ఆయనే అయినా కథ, నా పాత్ర నచ్చడంతో చేశా’’ అన్నారు.

 సినిమా ఇండస్ట్రీలో మార్పుల గురించి... ‘‘నేను హీరోయిన్‌గా చేసినప్పుడు తీసుకున్న పారితోషికాన్ని ఇప్పుడు క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌ ఒక్క రోజుకు తీసుకుంటున్నారు. అప్పట్లో హీరోయిన్లకు కేర్‌వ్యాన్‌లు, గట్రా లేవు. బట్టలు మార్చుకోవడానికి సరైన సదుపాయాలు ఉండేవి కాదు. ఎండల్లో, కొండల్లో షూటింగ్‌ చేసి చెట్ల కింద విశ్రాంతి తీసుకునేవాళ్లం. ఇప్పటి హీరోయిన్లు చాలా లక్కీ’’ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement