లంకలో టెలీపతి | Raasi starrer Lanka movie trailer released | Sakshi
Sakshi News home page

లంకలో టెలీపతి

Published Sun, Mar 26 2017 12:01 AM | Last Updated on Tue, Sep 5 2017 7:04 AM

లంకలో టెలీపతి

లంకలో టెలీపతి

‘‘బడ్జెట్‌ తక్కువని ఏ సినిమా పడితే అది తీసేసి విడుదల చేస్తున్నారు. అలాంటి సినిమాలు రెండు మూడు షోలు కూడా ఆడడం లేదు. కొత్త నిర్మాతలు బడ్జెట్‌ కంటే ఎక్కువ కథపై జాగ్రత్తలు తీసుకోవాలి. చిన్న సినిమాల కాన్సెప్ట్‌ డిఫరెంట్‌గా ఉండడం చాలా ముఖ్యం. ‘కల్యాణ వైభోగం’తో రీ–ఎంట్రీ ఇచ్చిన రాశి ఈ చిత్రంలో మంచి పాత్ర చేశారు’’ అన్నారు నిర్మాత కేఎల్‌ దామోదర ప్రసాద్‌. రాశి, సాయిరోనక్, ఇనసహ ముఖ్య తారలుగా శ్రీముని దర్శకత్వంలో దినేశ్‌ నామన, విష్ణు నామన నిర్మిస్తున్న సినిమా ‘లంక’.

 శనివారం సీనియర్‌ ఫొటో జర్నలిస్టులు జనార్థన్‌రెడ్డి, సాయిరమేశ్, సీఎం ప్రవీణ్‌కుమార్, భూషణ్‌ ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ – ‘‘ఇప్పటివరకూ భారతీయ సినిమాల్లో రాని టెలీపతి పాయింట్‌తో చేసిన సైంటిఫిక్‌ థ్రిలర్‌ చిత్రమిది. ఎలాంటి సాధనాలు, వస్తువులు లేకుండా మైండ్‌ టు మైండ్‌ కమ్యునికేషన్‌ జరపడమే టెలీపతి. రాశి, సాయిరోనక్, ఇనసహ పాత్రల మధ్య కథ నడుస్తుంది. సినిమాలో ఒక్క పాటే ఉంటుంది. ఏప్రిల్‌లో చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు. ‘సత్యం’ రాజేశ్, ముత్యాల రామదాసు, రవికుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement