Raasi
-
హీరోయిన్‌గానే కాదు విలన్‌గానూ సూపర్.. రాశి బర్త్‌డే స్పెషల్ (ఫొటోలు)
-
కల్కి సినిమా చూసి థ్రిల్ అయ్యా: టాలీవుడ్ హీరోయిన్!
ప్రభాస్- నాగ్ అశ్విన్ కాంబోలో వచ్చిన ఎపిక్ సైన్స్ ఫిక్షన్ చిత్రం కల్కి 2898 ఏడీ. గతనెల 27న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. విడుదలైన రెండు వారాల్లోనే రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ చిత్రంలో అమితాబ్, దీపికా, కమల్ హాసన్, దిశాపటానీ కీలకపాత్రల్లో నటించారు. ఈ మూవీ బ్లాక్‌బస్టర్ కావడంతో సినీ ప్రముఖులు సైతం చిత్రబృందంపై ప్రశంసలు కురిపించారు.తాజాగా కల్కి సినిమాపై టాలీవుడ్ హీరోయిన్ రాశి ప్రశంసలు కురిపించారు. కల్కి మూవీ అద్భుతంగా ఉందని ఆమె కొనియాడారు. చూస్తున్నంతసేపు చాలా థ్రిల్లింగ్‌గా అనిపించిందని అన్నారు. తన కూతురితో కలిసి వెళ్లి కల్కి సినిమా చూశానని వెల్లడించారు. 3డీ అద్దాల్లో చూసి ఫుల్‌గా ఎంజాయ్ చేశామని.. ఈ మూవీని చిన్నపిల్లలు ఎక్కువగా ఇష్టపడతారని తెలిపింది. కాగా.. రాశి టాలీవుడ్లో అగ్ర హీరోల సరసన సినిమాల్లో నటించారు. Old telugu golden actress #Raasi garu sharing her opinion about #Kalki2898AD movie 🎬 💥 Family audience lo darling mass ❤️#Prabhas #Kalki pic.twitter.com/yhYzZ4G6o4— Cinema Factory (@Cinema__Factory) July 20, 2024 -
హైదరాబాద్ : వస్త్ర ప్రదర్శనలో మెరిసిన నటి రాశి (ఫొటోలు)
-
Raghava Reddy Review: ‘రాఘవరెడ్డి’ మూవీ రివ్యూ
టైటిల్: రాఘవరెడ్డి నటీనటులు: శివ కంఠంనేని, రాశి, నందిత శ్వేత, అన్నపూర్ణ, రఘుబాబు, శ్రీనివాస్ రెడ్డి , అజయ్ , పోసాని కృష్ణమురళి, ప్రవీణ్ , అజయ్ ఘోష్, బిత్తిరి సత్తి తదితరులు నిర్మాణ సంస్థ: లైట్ హౌస్ సినీ మ్యాజిక్ నిర్మాతలు: కేఎస్ శంకర్ రావ్, జీ.రాంబాబు యాదవ్, ఆర్.వెంకటేశ్వర్ రావు స్టోరీ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం : సంజీవ్ మేగోటి సంగీతం: సంజీవ్ మేగోటి - సుధాకర్ మారియో విడుదల తేది: జనవరి 5, 2024 కథేంటంటే.. రాఘవ రెడ్డి(శివ కంటంనేని) ఓ క్రిమినాలాజీ ప్రొఫెసర్. డిగ్రీ విద్యార్థులకు పాఠాలు చెప్పడం తో పాటు క్రిమినల్ కేసులు సాల్వ్ చేయడంలో పోలీసులకు సహాయం చేస్తుంటాడు. రాఘవ రెడ్డి పాఠాలు చెప్పే కాలేజీ లోకి మహాలక్ష్మి అలియాస్ లక్కీ ( నందిని శ్వేత) స్టూడెంట్ గా వస్తుంది. లక్కీ చాలా అల్లరి అమ్మాయి. తన యాటిట్యూడ్ తో రాఘవరెడ్డి తో గొడవ పడుతుంది. కాలేజీ లో అంతా రాఘవ రెడ్డికి భయపడతారు కానీ లక్కీ మాత్రం రౌడీ బేబీ లా ప్రవర్తిస్తూ ప్రొఫెసర్ ని లెక్కచేయదు. ఒక సందర్భంలో రాఘవ రెడ్డికి లక్కీకి పెద్ద గొడవ జరుగుతుంది. ఇదిలా ఉంటే...లక్కీ తల్లి దేవకీ(రాశి) ఒకసారి కాలేజీ కి వచ్చి వెళ్తుంటే...ఆమె వెనుక పరుగెత్తుతాడు రాఘవ. అసలు దేవకిని చూసి రాఘవ ఎందుకు పరుగెత్తాడు? వారిద్దరి మధ్య ఉన్న సంబంధం ఏంటి? లక్కీ నీ కిడ్నాప్ చేసిందెవరు? ఎందుకు చేశారు? క్రిమినల్ కేసులను సాల్వ్ చేసే రాఘవ్.. కిడ్నాపర్ల ను ఎలా కనిపెట్టాడు? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. హీరో తన డ్యూటీ కోసం ఫ్యామిలీని దూరం చేసుకోవడం..ఆపద వచ్చినప్పుడు మళ్లీ ఫ్యామిలీ కోసం పోరాటం చేసి రక్షించుకోవడం చాలా సినిమాల్లో చూశాం. రాఘవరెడ్డి కథ కూడా ఇదే పంథాలో సాగుతుంది. డాటర్ సెంటిమెంట్‌తో ప్యామిలీ ఎమోషనల్‌గా ఈ కథను తీర్చిదిద్దాడు దర్శకుడు. యూత్‌ను ఆకట్టుకోవడం కోసం కాలేజీ నేపథ్యాన్ని జోడించాడు. కథ పాతదే అయినా కాస్త కమర్శియల్ అంశాలను జోడించి కాస్త డిఫరెంట్‌గా సినిమాను తెరకెక్కించాడు. దర్శకుడు ఎంచుకున్న పాయింట్..దాని చుట్టు అల్లుకున్న సన్నివేశాలు బాగున్నప్పటికీ..తెరపై ఆకట్టుకునేలా తీయడంలో కాస్త తడబడ్డాడు. స్క్రీన్‌ప్లేని మరింత బలంగా రాసుకుంటే మెరుగైన ఫలితం ఉండేది. ఫస్టాఫ్‌లో హీరోకి కావాల్సినంత ఎలివేషన్ ఇచ్చాడు. ప్రారంభంలోనే హీరో పాత్ర ఎంత పవర్‌ఫుల్‌గా ఉండబోతుందో చూపించాడు. కాలేజీ ప్రొఫెసర్‌గా ఉంటూనే.. క్రిమినల్ కేసులను పరిష్కరించడం. దోషులను గుర్తించే విధానాన్ని విశ్లేషించడం అన్ని ఆకట్టుకుంటాయి. ఇక నందిని శ్వేత పాత్ర ఎంట్రీ తర్వాత కథనం ఫన్ వేలో సాగుతుంది. కాలేజీలో ఆమె చేసే అల్లరి, శ్రీనివాస్ రెడ్డి చేసే కామెడీ నవ్వులు పూయిస్తాయి. ఇంటర్వెల్ సీన్ సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. ఇక ద్వితియార్థంలో కథను ఫ్యామిలీ ఎమోషన్స్ వైపు మలిచాడు. తన కూతురు ఎవరో తెలుసుకునేందుకు హీరో చేసే ప్రయత్నం.. ఈ క్రమంలో వచ్చే ప్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతుంది. కొన్ని చోట్ల నాటకీయత ఎక్కువైనట్లు అనిపిస్తుంది. కిడ్నాపర్లను కనిపెట్టేందుకు హీరో చేసే ప్రయత్నం కూడా అంతగా ఆకట్టుకోదు. స్లో నెరేషన్.. సాగదీత సన్నివేశాలు ఎక్కువగా ఉండడం సినిమాకు మైనస్. క్లైమాక్స్ రొటీన్‌గా ఉంటుంది. ఎవరెలా చేశారంటే.. టైటిల్ పాత్ర పోషించిన శివ కంఠంనేని తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. యాక్షన్ సీన్లతో పాటు ఎమోషనల్ సన్నివేశాల్లో కూడా చక్కగా నటించాడు. డైలాగ్ డెలివరీ కూడా బాగుంది. లక్కీ పాత్రలో నందిని శ్వేత అదరగొట్టేసింది. ఇక చాలా రోజుల తర్వాత వెండితెరపై కనిపించిన రాశి.. దేవకి పాత్రకి పూర్తి న్యాయం చేసింది. బిత్తిరి సత్తి, శ్రినివాస్ రెడ్డిల కామెడీ సినిమాకు ప్లస్ అయింది. అజయ్ ఘోష్ విలనిజం పర్వాలేదు. అజయ్, ప్రవీణ్‌లతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతిక పరంగా సినిమా పర్వాలేదు. బీజీఎం, పాటలు ఓకే. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టు ఉన్నతంగా ఉన్నాయి. -
విడాకులంటూ బ్రేకింగ్ ఇచ్చేశారు.. వెంటనే ఫోన్ చేసి చెప్పా: శ్రీకాంత్
టాలీవుడ్ హీరో శ్రీకాంత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండస్ట్రీలో హీరోగా, ప్రతినాయకుడిగా తనకుంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని స్టార్‌గా ఎదిగారు. ఇటీవలే కోటబొమ్మాళి పీఎస్‌తో అభిమానులను అలరించిన శ్రీకాంత్ తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరయ్యారు. ఈ సందర్భంగా తన కెరీర్ గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. అవేంటో ఓ లుక్కేద్దాం. ఇటీవలే ఓ మూవీ కార్యక్రమంలో శ్రీకాంత్ పాల్గొన్నారు. అక్కడే సీనియర్ హీరోయిన్ రాశి కూడా కనిపించింది. ఈవెంట్లో వీరిద్దరూ చాలా సరదాగా పలకరించుకున్నారు. అంతేకాకుండా ఈవెంట్లో పాల్గొన్న రాశి.. శ్రీకాంత్ భుజంపై కొట్టి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. వేదికపై హిట్ పెయిర్‌గా గుర్తింపు తెచ్చుకున్న వీరిద్దరు చిన్నప్పటి స్నేహితుల్లా సందడి చేశారు. ఆ వీడియో పెద్దఎత్తున సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. తాజా ఇంటర్వ్యూలో శ్రీకాంత్ ఈ విషయాన్ని వెల్లడించారు. రాశి కొట్టడంపై శ్రీకాంత్ స్పందిస్తూ.. 'చాలా ఏళ్ల తర్వాత మేమిద్దరం ఫంక్షన్లో కలిశాం. అక్కడ ఉన్న హీరోయిన్ రాశిని అమ్మ అన్నది. దీంతో నేను కూడా సరదాగా రాశి అమ్మా అన్నా.. దానికే తను సరదాగా నవ్వుతూ కొట్టింది. అంతకు మించి ఏం లేదు. నేను నటించిన వారిలో సౌందర్య, ఉమతో చాలా కంఫర్ట్‌గా ఫీలయ్యేవాన్ని. మా ఇంటికి కూడా ఒక ఫ్యామిలీలాగా వచ్చేవారు. సైడ్ ఆర్టిస్టులతో అందరితో బాగా ఉండేవాన్ని' అని అన్నారు. విడాకుల రూమర్స్‌పై మాట్లాడుతూ.. 'ఊహాతో నాకు విడాకులు అంటూ వార్తలొచ్చాయి. టీవీలలో బ్రేకింగ్‌లు కూడా వేశారు. అప్పుడే నేను, నా భార్య అరుణాచలం వెళ్తున్నాం. అప్పుడు వెంటనే ప్రభుకు ఫోన్ చేసి చెప్పా. చూడరా బాబు మేమిద్దరం అరుణాచలం వెళ్తున్నామని చెప్పా. వెంటనే ఆ వార్తలను ఖండించాం.' అని తెలిపారు. పెళ్లికి ముందు మీకు ఇండస్ట్రీలో ఎఫైర్స్ ఏమైనా ఉన్నాయా? అని ప్రశ్నించగా సరదాగా నవ్వుతూ ఆన్సరిచ్చారు. బయట ఎవరో ఏదో రాసింది అడిగితే కాదు?.. మీకు తెలిస్తే చెప్పండని నవ్వుతూ మాట్లాడారు. బాలీవుడ్ చిత్రాల్లో అవకాశమొస్తే తప్పకుండా చేస్తానని శ్రీకాంత్ అన్నారు. పోలీస్ ఆఫీసర్‌గా నచ్చిన చిత్రాల్లో ఖడ్గం అని తెలిపారు. ఇటీవలే పోలీస్‌గా కొటబొమ్మాళి అనే సినిమాను చేశా.. పోలీసులు స్ట్రగుల్స్ ఎలా ఉంటాయో చూపించామని అన్నారు. -
ఫుల్ మాస్ ఎంటర్టైనర్గా వస్తోన్న 'రాఘవ రెడ్డి'!
శివ కంఠనేని, రాశి, నందితా శ్వేత ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘రాఘవ రెడ్డి’. ఈ చిత్రానికి సంజీవ్ మేగోటి దర్శకత్వం వహిస్తున్నారు. లైట్ హౌస్ సినీ మ్యాజిక్ బ్యానర్‌పై శివ శంకర్ రావ్, రాంబాబు యాదవ్, వెంకటేశ్వర్ రావు నిర్మిస్తున్నారు. పక్కా మాస్ అండ్ కమర్షియల్ చిత్రంగా రూపొందిస్తున్న ఈ చిత్రం ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ‘రాఘవ రెడ్డి ట్రైలర్ చూస్తే ఫుల్ మాస్ అండ్ కమర్షియల్ ఎంటర్టైనర్గా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో సిన్సియర్ పోలీస్ ఆఫీసరైన హీరో డ్యూటీ పరంగా మంచి పేరు తెచ్చుకుంటాడు. అయితే ఆయన వ్యక్తిగత జీవితంలో కొన్ని సమస్యలు వస్తాయి. ఆ సమస్యలేంటి? నిజాయతీగా ఉండటం వల్ల అతనేం కోల్పోయాడు? అన్న కథాంశంతో తెరకెక్కించారు. ఈ ట్రైలర్లో ఎమోషనల్, యాక్షన్ సన్నివేశాలు కూడా బాగానే ఉన్నట్లు కనిపిస్తోంది. కాగా.. ఈ చిత్రంలో పోసాని, అజయ్ ఘోష్, అజయ్, రఘుబాబు, శ్రీనివాస్ రెడ్డి కీలక పాత్రలు పోషించారు. జనవరిలో ఈ చిత్రాన్ని విడుదల చేయటానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. -
రాశి కూతురు రిధిమ ముద్దు ముద్దు మాటలు
-
రాశితో లవ్ స్టోరీ ఫస్ట్ టైమ్ రివీల్ చేసిన భర్త శ్రీనివాస్
-
మాది 15 రోజుల లవ్ స్టోరీ...!
-
యూట్యూబ్ లోకి రావడానికి కారణం అదే
-
నిజం సినిమాలో అలాంటి క్యారెక్టర్ చెయ్యడానికి కారణం..!
-
ఆ స్థితి లో నా భార్యను అలా చూసి షాక్ అయ్యా
-
నేను సినిమాలకు దూరమయ్యాను అంటే ఆ ఒక్క క్యారెక్టర్ వల్ల
-
టాలీవుడ్లో సూపర్ హిట్ జోడీ.. ఎంత చిలిపిగా ఉన్నారో చూడండి!!
శ్రీకాంత్, రాశి ఈ జోడీ వెండితెరపై ఎన్నో చిత్రాల్లో నటించింది. ప్రేయసి రావే, అమ్మో! ఒకటో తారీఖు, దీవించండి, పండగ, గిల్లికజ్జాలు, సరదా సరదాగా, మా ఆవిడమీద ఒట్టు.. మీ ఆవిడ చాలామంచిది లాంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. అయితే చాలా రోజుల తర్వాత ఇటీవలే వీరిద్దరు జంటగా కనిపించారు. అప్పట్లో సూపర్ హిట్ పెయిర్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఈ జంట.. ఓకే వేదికపై కనిపించడంతో అభిమానులు వీరి కాంబినేషన్‌పై వచ్చిన సినిమాలను గుర్తు చేసుకుంటున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన రుద్రంకోట సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికగా నిలిచింది. ఈవెంట్లో పాల్గొన్న రాశి, శ్రీకాంత్ వేదికపై సందడి చేశారు. ఈ సందర్భంగా ఆ నాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు. (ఇది చదవండి: అందుకే ‘పెదకాపు’ అని టైటిల్ పెట్టాం: నిర్మాత) అయితే ఈ వేడుకలో పాల్గొన్న వీరిద్దరు చాలా చిలిపిగా ప్రవర్తించారు. పక్క పక్కనే నిలబడి రాశి, శ్రీకాంత్ వేదికపై నవ్వుతూ కనిపించారు. ఒకరి వైపు ఒకరు చూస్తూ ముసి ముసి నవ్వులు నవ్వారు. అయితే వారిద్దరి మధ్య సంభాషణ పక్కనపెడితే.. ఆ జోడీ ఓకే వేదికపై కనిపించడం అభిమానులకు కనువిందు చేసింది. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు. అయితే ఈవెంట్లో రాశి పలు ఆసక్తికర కామెంట్స్ కూడా చేసింది. తాము ఓకే ఏడాదిలో ఇద్దరం వేరు వేరుగా ఏకంగా ఎనిమిది చిత్రాల్లో నటించామని తెలిపింది. 2000 సంవత్సరంలో రాశి నటించిన పోస్ట్‌మ్యాన్, ఒకే మాట, మూడు ముక్కలాట, దేవుళ్లు సహా 8 తెలుగు చిత్రాలు, మూడు తమిళ సినిమాలు విడుదలయ్యాయి. క్షేమంగా వెళ్లి లాభంగా రండి!, ‘చాలా బాగుంది..!, చూసొద్దాం రండి, సకుటుంబ సపరివార సమేతం లాంటి చిత్రాలతో అదే ఏడాదిలో శ్రీకాంత్ ప్రేక్షకుల ముందుకొచ్చారు. (ఇది చదవండి: తెలుగు సీరియల్ నటి.. ఇంతలా రెచ్చిపోవడానికి కారణం!) కాగా.. రాశి ప్రస్తుతం జానకీ కలగనలేదు సీరియల్‌తో బుల్లితెరపై సందడి చేస్తోంది. శ్రీకాంత్ సైతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న దేవర, రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న గేమ్ ఛేంజర్‌లో కీలక పాత్రలు పోషిస్తున్నారు. శ్రీకాంత్ కీలక పాత్రలో నటించిన రామ్ పోతినేని స్కంద ఈ నెల 28న విడుదల కానుంది. చాలా రోజుల తర్వాత కలిస్తే ఇలానే ఉంటది ఏం మాట్లాడుకున్నారో కానీ....చూస్తుంటే ముచ్చటేస్తుంది 😍 #Srikanth #Raasi pic.twitter.com/bOhP9TnICf — Rajesh Manne (@rajeshmanne1) September 25, 2023 -
ఆ హీరోతో నటించాలని కోరిక.. కానీ ఆ పాత్ర చేయను: రాశి
సీనియర్ హీరోయిన్ రాశి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. సూపర్ హిట్ సినిమాలతో స్టార్ హీరోయిన్గా ఎదిగింది. బాలనటిగా ఎంట్రీ ఇచ్చి అగ్ర హీరోలందరీ సరసన నటిచింది. గోకులంలో సీత, శుభాకాంక్షలు చిత్రాలతో మరింత గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఆ తర్వాత పెళ్లి చేసుకున్న రాశి కొన్నేళ్ల పాటు సినిమాలకు దూరమైంది. అయితే ఆ తర్వాత రీ ఎంట్రీ ఇచ్చిన రాశి.. పలు చిత్రాల్లోనూ కనిపించింది. (ఇది చదవండి: జైలర్ సినిమాలో మెగాస్టార్ ఉండాల్సింది, సైడ్ చేసిన రజనీకాంత్!) రీ ఎంట్రీ ఇచ్చిన రాశి.. సినిమాలతో పాటు సీరియల్స్‌లోనూ నటించింది. జానకి కలగనలేదు సీరియల్ రాశికి గుర్తింపు తీసుకొచ్చింది. ప్రస్తుతం ఆమె నటిస్తోన్న ఈ సీరియల్ చివరిదశకు చేరుకుంది. ఈ సందర్భంగా నటీనటులంతా యూట్యూబ్ ద్వారా తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా రాశి ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఇండస్ట్రీలో తన ఆల్ టైం ఫేవరెట్ హీరో శోభన్ బాబు, చిరంజీవి అని వెల్లడించింది. అయితే ప్రస్తుతం యంగ్ హీరోల్లో ప్రభాస్ అంటే ఇష్టమని తెలిపింది. ఆయనతో నటించాలని ఎంతో ఆసక్తిగా ఉందని రాశి చెప్పుకొచ్చింది. రాశి మాట్లాడుతూ.. 'ప్రభాస్ అంటే నాకు చాలా ఇష్టం. ఆయనతో నటించాలనేది నా కోరిక. అది కూడా హీరోయిన్గా అయితే నటిస్తా. తల్లి లాంటి పాత్రలంటే మాత్రం ఒప్పుకోను. ఇప్పటివరకు నేను ప్రభాస్‌తో ఎప్పుడు మాట్లాడలేదు. అడవి రాముడు షూటింగ్ సమయంలో ఒకే హోటల్లో ఉన్నాం. ఆ విషయం తెలిసి నేను ఎగిరి గంతేశా. అయితే ప్రభాస్‌ను కలవాలని అనుకున్నా. కానీ కుదరలేదు. అయితే.. ఆయన ఉన్న రూమ్‌కు కాల్ చేసి మాట్లాడా. అయితే ప్రభాస్ సీనియర్స్‌కు చాలా మర్యాద ఇస్తారని విన్నా.' అని తెలిపింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. (ఇది చదవండి: కొత్త కారు కొన్న రణబీర్ కపూర్ - ధర తెలిస్తే అవాక్కవుతారు!) -
Actress Raasi Unseen Photos: అందాల తార రాశి .. ఇలా ఎప్పుడైనా చూశారా? (ఫొటోలు)
-
ఆ సినిమా చూసి నన్ను తిట్టారు..
-
చివరికి మదర్ క్యారెక్టర్ అయినా చేస్తాను.. |
-
నన్ను అలా చూసేవారికి ఇదే నా సమాధానం.. |
-
ఆర్థిక ఇబ్బందులపై స్పందించిన సీనియర్ నటి రాశి
-
నన్ను బుట్టలో వేసుకున్నా వ్యక్తి ఎవరో తెలుసా...!
-
డెవిల్ కపుల్స్.. భర్తతో కలిసి దుర్మార్గాలు చేసే భ ‘లేడీ విలన్స్’
విలన్.. హీరోయిన్ వెంట పడ్డాడు. లేకపోతే హీరోతో గొడవ పడ్డాడు. ఏదో ఒకటి. హీరోయిన్ విల న్ అసహ్యయించుకుంటుంది. అతన్ని ఛీ కొడుతుంది. హీరో ఏమో చావకొడతాడు. మూకీ నుంచి టాకీ వరకు ఒకటే స్టోరీ లైన్. విలన్ని చూసి భయపడే ఆడవాళ్లు ఉంటారు. చీదరించు కునే ఆడవాళ్లు ఉంటారు…మరి…విలన్‌కి జోడీ మాటేంటి ? ఈడూ జోడూ అంటే హీరో హీరో యిన్స్ మాత్రమేనా ? ఈ డౌట్ సహజంగా అందరికీ వస్తుంది కదా. ఇంతకీ తెలుగు సినిమాల్లో విలన్ జోడీలు లేరా? చిలకాగోరింకల్లా అనోన్యంగా ఉంటూ…కలిసికట్టుగా దుర్మార్గాలు చేసే డెవిల్ కపుల్స్ మీద ఒక లుక్ వేసేద్దామా.. ఏ సినిమా చూసినా హీరోకే జోడి. అది లవర్ కావచ్చు. లేదా భార్య కావచ్చు. కానీ…విలన్ కి మాత్రం జోడి ఉండదు. హీరోయిన్ చేత ఛీ కొట్టించుకునే విలన్లే అందరూ. ఒకవేళ భార్య రూపం లో జోడి ఉన్నా…ఆమె విలన్ని…విలన్ లానే చూస్తుంది. అలా కాకుండా విలన్ చేసే ప్రతి దుర్మార్గాన్ని సపోర్ట్ చేసే జోడి ఉంటే ? ఆమె భార్య కావచ్చు. ప్రేయసి కావచ్చు. తెలుగు సినిమాల్లో చాలా అరుదుగా విలన్‌కి అలాంటి జోడి దొరుకుతూ ఉంటుంది. అతను చేసే వెధవ పనున్నింటికీ సపోర్ట్ చేస్తూ ఉంటుంది. విలన్ని ఎంతో ప్రేమగా చూసుకుంటుంది. క్రాక్ సినిమా తో మరోసారి ఈ ట్రెండ్ ఫోకస్‌లోకి వచ్చింది. కఠారి కృష్ణకి అన్ని రకాలుగా అండగా ఉండే జయమ్మ క్యారెక్టర్ అందరినీ ఆకర్షించింది. ఈ చిత్రంలో కటారి కృష్ణ పాత్రని సముద్రఖని పోషించగా, జయమ్మగా వరలక్ష్మీ శరత్‌కుమార్ నటించింది. అర్జున్.. ఒక్కడు తర్వాత గుణశేఖర్, మహేష్ బాబు కాంబినేషన్ లో వచ్చిన చిత్రం. అక్కా తమ్ముళ్ల సెంటిమెంట్ బ్యాగ్రౌండ్లో వచ్చిన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. మధుర మీనాక్షి టెంపుల్ సెట్ గురించి అప్పట్లో పెద్ద చర్చ జరిగింది. ఈ సినిమాలో విలన్ బాల నాయ గర్ అయితే, అంతకు మించి అన్న టైప్‌లో విలనీజాన్ని పండించింది ఆండాల్ పాత్ర. బాల నాయగర్గా ప్రకాష్ రాజ్, ఆయన సతీమణి ఆండాల్గా సరిత నటించారు. భర్త మనసు తెలు సుకుని మరీ దుర్మార్గపు పనులు చేసే భార్యగా సరిత నటన ప్రశంసలు అందుకుంది. మహేశ్ బాబుతో పాటుగా సరితకు కూడా నంది స్పెషల్ జ్యూరీ అవార్డు లభించింది. విలన్‌కి జోడిగా ఉంటూ యాంటీ సోషల్ యాక్టివిటీస్ చేసే ఆడవాళ్లు తెలుగు సినిమాల్లో తక్కు వే. మహేశ్‌బాబు హీరోగా, తేజ దర్శకత్వంలో వచ్చిన నిజం చిత్రంలో అలాంటి క్యారెక్టర్ని డిజై న్ చేశారు. నిజంలో విలన్‌గా గోపిచంద్ నటించారు. దేవుడు పాత్రలో గోపిచంద్ ప్రదర్శించిన విలనీజం అప్పట్లో పెద్ద సంచలనమైంది. ఈ సినిమాలో గోపిచంద్‌కి జంటగా రాశి నటించింది. హీరోయిన్ పాత్రల నుంచి లేడీ విలన్ క్యారెక్టర్లోకి రాశి జంప్ చేయడంపై కాస్త డిస్కషన్ కూడా సాగింది. మల్లి పాత్రలో గ్లామర్‌కి క్రూరత్వం మిక్స్ చేసి సిల్వర్ స్క్రీన్ మీద ప్రెజెంట్ చేసింది రాశి. సినిమాకి, సినిమాకి పూర్తి భిన్నమైన జానర్స్‌ని ఎంపిక చేసుకునే హీరోల్లో రానా ఒకడు. నేనే రాజు, నేనే మంత్రి అందుకో ఉదాహరణ. జోగేంద్ర, రాధ చూడముచ్చటైన జంట. చివరి వరకు మూవీలో ఈ కపుల్ ట్రావెల్ చేయక పోయినా…కథ మలుపు తిరగడానికి మాత్రం కారణమౌ తుంది. అదే ఊరి సర్పంచ్ జంట. సర్పంచ్‌గా ప్రదీప్ రావత్ నటిస్తే…అతని భార్యగా బిందు చంద్రమౌళి నటించారు. ప్రదీప్ రావత్, బిందు చంద్రమౌళి ఇద్దరూ నెగిటివ్ రోల్స్‌లో తెగ జీవించేశారు. ఒక సినిమా. పది విభిన్నమైన క్యారెక్టర్లు. దశావతారంతో నట విశ్వరూపం చూపించేశారు కమలహాసన్. ఒక్కో పాత్ర పూర్తి భిన్నమైన నేపథ్యంతో సాగుతోంది. కథానాయకుడు, ప్రతికథా నాయకుడుతో పాటుగా కథని మలుపు తిప్పే కీలక పాత్రలన్నీ తానే పోషించారు. అందులో విలన్ పాత్ర ఫ్లెచర్కి జంటగా మల్లికా షరావత్ నటించింది. గోవింద్‌ని పట్టుకునే క్రమంలో ఫ్లెచర్కి మల్లికా షరావత్ అన్ని రకాలుగా సహకరిస్తుంది. అమ్మోరు. పాతికేళ్ల క్రితమే వి.ఎఫ్.ఎక్స్ తో సిల్వర్ స్క్రీన్ మీద అద్భుతాన్ని ఆవిష్కరించిన చిత్రం. అసలే స్పెషల్ ఎఫెక్ట్స్. ఆ పైన భక్తి చిత్రం. ఒకవైపు భక్తి భావోద్వేగం. మరోవైపు తొలి సారిగా కళ్ల ముందు కనిపిస్తున్న సరికొత్త సాంకేతిక మాయజాలం. అందుకే…అమ్మోరు అం తటి ఘన విజయం సాధించింది. దేశంలోని అన్ని భాషా చిత్ర పరిశ్రమల్లో చర్చ జరిగే చేసింది. అమ్మోరు చిత్రంలో ప్రధాన విలన్‌గా గోరఖ్ పాత్రలో రామిరెడ్డి నటించారు. అదే చిత్రంలో మరో విలన్‌గా బాబూమోహన్ నటించారు. బాబూ మోహన్‌కి జంటగా వడివుక్కరసి నటించారు. హీరో కుటుంబంలో చిచ్చు పెట్టడం దగ్గర నుంచి ప్రతి విషయంలోనూ భార్యా, భర్తలిద్దరూ కలిసికట్టుగా ప్లాన్ చేస్తూ ఉంటారు. వీరిద్దరి మధ్య కుట్రల కోణంలో కెమిస్ట్రీ చాలా బాగా పండింది. టాలీవుడ్లో దాదాపు పదేళ్ల పాటు ఏలేసిన హీరోయిన్స్‌గా ఒకరు సిమ్రాన్. సహజంగా హీరో యిన్‌గా ఫేడౌట్ అయిన తర్వాత ఏ వదినగానో, అక్కగానో రీఎంట్రీ ఉంటుంది. కానీ…సిమ్రాన్ మాత్రం లేడీ విలన్‌గా కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. తమిళ మూవీ సీమరాజా తెలుగులోనూ అదే పేరుతో విడుదలైంది. ఈ చిత్రంలో విలన్ లాల్ భార్యగా నెగివిట్ షేడ్స్ ఉన్న రోల్ ప్లే చేసింది సిమ్రాన్. హీరోయిన్ సమంతాతో పాటుగా లాల్, సిమ్రాన్ ల విలనీజం కూడా సినిమాకి హైలెట్ గా నిలిచింది. -
ఒకే ఒక్క సినిమా.. విలనిజంతో భయపెట్టిన హీరోయిన్లు
హీరోయిన్గా కెరీర్‌ని ప్లాన్ చేసుకోవడం ఎంత కష్టమో… కంటిన్యూ చేయడం కూడా అంతే కష్టం. అందులోనూ అసలు హీరోయిన్ లైఫ్ స్పాన్ ఐదారేళ్లు. అంతకు మించి కష్టం. ఇలా అన్ని వైపుల నుంచి ఎంతో జాగ్రత్తగా చూసుకోవాల్సిన కెరీర్ అది. అలాంటిది…ఇంకా హీరో యిన్‌గా కంటిన్యూ అవుతూనే విలనిజం వైపు ఒక లుక్ వేయడం అంటే చిన్న విషయం కాదు. సాహసమనే చెప్పాలి. ఇలాంటి సాహసాలు చేసి శభాష్ అనిపించుకునే తారమణులూ ఉన్నారు. అటు గ్లామర్ పాత్రల్లోనూ, ఇటు ఫెర్ఫార్మెన్స్ స్కోప్ ఉన్న పాత్రల్లోనూ సత్తా చాటిన నటి రమ్య కృష్ణ. చంద్రలేఖలో కోమాలో ఉన్నపేషెంట్ పాత్ర నుంచి, బాహుబలిలో శివగామి దాకా అద్భుతంగా చేసిన క్యారెక్టర్స్ చాలానే ఉన్నాయి. కానీ… నరసింహాలో నీలాంబరి పాత్ర మాత్రం చాలా ప్రత్యేకం. ఫుల్ నెగిటివ్ రోల్ క్యారెక్టర్ అది. పైగా రజినీకాంత్‌తో ఢీ అంటే ఢీ అనే పాత్ర. ఆ క్యారెక్టర్లో రమ్యకృష్ణ జీవించింది. నరసింహ అటు తమిళంలోనూ, ఇటు తెలుగులోనూ ఘన విజయం సాధించింది. ఆ సక్సెస్‌లో రజినీకాంత్‌తో సమాన వాటా రమ్యకృష్ణది కూడా. నీలాంబరి అన్న పేరుకే ఒక సీరియస్ అటెన్షన్ ఇచ్చేసింది తన నటనతో. చాలా కాలం పాటు ఆ పేరు బ్రాండ్‌గా నిలిచింది. టాలీవుడ్లో దశాబ్దానికి పైగా స్టార్ హీరోయిన్ స్టేటస్‌ని ఎంజాయ్ చేసిన అతి తక్కువ హీరోయిన్స్‌లో సౌందర్య ఒకరు. తెలుగులో టాప్ హీరోలందరితోనూ సౌందర్య నటించింది. అటు తమిళంలోనూ స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది సౌందర్య. హీరోయిన్గా కెరీర్ కొనసాగు తున్న సమయంలోనే… నెగిటివ్ రోల్ ప్లే చేసింది సౌందర్య. నా మనసిస్తా రా చిత్రంలో శ్రీకాంత్ , రిచా హీరో, హీరోయిన్లుగా నటిస్తే…విలన్‌గా సౌందర్య యాక్ట్ చేసింది. నెగిటివ్ రోల్ లోనూ మంచి మార్కులను కొట్టేసింది. మహేశ్ బాబు హీరోగా, తేజ దర్శకత్వంలో వచ్చిన నిజం చిత్రంలో విలన్‌గా గోపిచంద్ నటించారు. దేవుడు పాత్రలో గోపిచంద్ ప్రదర్శించిన విలనీజం అప్పట్లో పెద్ద సంచలనమైంది. గోపిచంద్‌తో పాటుగా ఉంటూ అతను చేసే ప్రతి పనికి సహకరిస్తూ ఉంటుంది రాశి. హీరోయిన్ పాత్రల నుంచి లేడీ విలన్ క్యారెక్టర్లోకి రాశి జంప్ చేయడంపై కాస్త డిస్కషన్ కూడా సాగింది. మల్లి పాత్రలో గ్లామర్‌కు క్రూరత్వం మిక్స్ చేసి సిల్వర్ స్క్రీన్ మీద ప్రెజెంట్ చేసింది రాశి. -
బాలయ్య మూవీ ఆఫర్ వదులకున్న నటి రాశి, ఆ సీన్‌పై అభ్యంతరంతోనేనట..
నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా ఫ్యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో 90ల్లో తెరకెక్కిన హిట్ చిత్రాల్లో ‘సమరసింహారెడ్డి’ ఒకటి. బాలకృష్ణ-సిమ్రాన్ జంటగా రూపొందిన ఈ చిత్రం ఎంతటి ఘనవిజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బి. గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కిన సమరసింహారెడ్డి 1999లో సంక్రాంతి సందర్భంగా విడుదలైంది. రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యం, బాలయ్య నటనా విశ్వరూపం, బి.గోపాల్ డైరెక్షన్ ప్రతిభతో ఈ సినిమా బాక్సాఫీసు వద్ద ప్రభంజనం సృష్టించింది. చదవండి: బ్రేకప్ చెప్పుకున్న లవ్‌బర్డ్స్!, క్లారిటీ ఇచ్చిన హీరో రూ.6 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం ఏకంగా రూ.16 కోట్లు వసూలు చేసిందంటే ఏ రేంజిలో ఆడిందో అర్థం చేసుకోవచ్చు. అప్పట్లో కొన్ని థియేటర్లలో 200 రోజులకు పైగా ఆడింది. ఈ సినిమా విడుదల నిన్న జనవరి 14కు 23 ఏళ్లు. ఈ సందర్భంగా గతంలో ఈ హిట్ చిత్రంపై సీనియర్ నటి, ఒకప్పటి ఫ్యామిలీ హీరోయిన్ రాశి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 1999లో సంక్రాంతి సందర్బంగా విడుదలైన ఈ చిత్రంలో మొదట హీరోయిన్గా రాశిని సంప్రదించగా దీనికి ఆమె నో చెప్పిందట. చదవండి: ఏపీ ప్రభుత్వానికి ఆ హక్కు ఉంది: తమ్మారెడ్డి భరద్వాజ అయితే రాశి ఈ మూవీ వదులుకోవడానికి గల కారణాలను గతంలో ఓ ఇంటర్య్వూలో చెప్పుకొచ్చింది. దీంతో ఈ సంక్రాంతి సందర్భంగా గతంలో ఈ సినిమాపై ఆమె చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. ఇంతకి రాశి ఏం చెప్పిందో మరోసారి చూద్దాం. కాగా సమరసింహారెడ్డి మూవీలో హీరోయిన్లుగా సిమ్రాన్, సంఘవి, అంజలా జవేరి నటించారు. ఇందులో మెయిన్ హీరోయిన్గా సిమ్రాన్ నటించింది. అయితే సిమ్రాన్ స్థానంలో మొదట హీరోయిన్ రాశిని అనుకున్నారట. అంతేకాదు దర్శకుడు ఆమెను సంప్రదించి కథ కూడా వివరించాడట. చదవండి: సల్మాన్ ఖాన్‌తో సీక్రెట్ డేటింగ్, క్లారిటీ ఇచ్చిన నటి సమంత.. అయితే ఆ సినిమాలో ఓ సీన్ నచ్చకపోవడంతో రాశి అంత పెద్ద చిత్రాన్ని వదులుకుంది. అందులో హీరోయిన్‌తో సీతాకోకచిలుక సీన్ ఉంటుంది. ఆ సీన్ పట్ల రాశి అభ్యంతరం వ్యక్తం చేయడంతో దర్శకుడు నటి సిమ్రాన్‌ను కలిసి స్క్రిప్ట్ చెప్పాడట. ఆమెకు కథ నచ్చడంతో వెంటనే ఒకే చెప్పిందట సిమ్రాన్. అలా రాశి స్టార్ హీరోయిన బాలయ్య సినిమానే వదులుకుంది. అప్పట్లో ఇది కాస్తా ఆసక్తికిర సంతరించుకుంది. బాలయ్య సినిమాను వదులుకోవడంతో ఓ వర్గం వారి నుంచి రాశి అప్పట్లో విమర్శలు కూడా ఎదుర్కొందట. -
బుల్లితెరపై శివగామిలా అదరగొడుతున్న రాశీ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
సీనియర్ నటి రాశీ అంటే తెలియని సినీ ప్రేక్షకులు ఉండరంటే అతిశయోక్తి కాదు. చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన రాశీ తన అందం, అభినయంతో ఎంతోమంది అబిమానులను సొంతం చేసుకుంది. శ్రీదేవి, మీనల తర్వాత ఆ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న రాశీ స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగింది. అతి తక్కువ సమయంలోనే టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా మారిపోయింది. 1997లో జగపతిబాబుతో నటించిన శుభాకాంక్షలు సూపర్ హిట్ కావడంతో ఇండస్ర్టీని తన వైపుకు తిప్పుకుంది. ఆ తర్వాత బాలకృష్ణ, పవన్ కల్యాణ్, శ్రీకాంత్ వంటి స్టార్ హీరోలతో జతకట్టిన రాశీ 90వ దశకంలో స్టార్ హీరోయిన్గా చక్రం తిప్పింది. టాప్ డైరెక్టర్లు కూడా ఈమె డేట్స్ కోసం వెయిట్ చేసేవారంటే రాశీ పాపులారిటీ ఏంటో అర్థం చేసుకోవచ్చు. హీరోయిన్గా నటిస్తూనే మరోవైపు విలన్ పాత్రలతోనూ మెప్పించింది. తేజ దర్శకత్వంలో వచ్చిన నిజం సినిమాలో నెగిటివ్ రోల్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. అప్పటివరకు ఫ్యామిలీ ఆడియోన్స్‌కు దగ్గరైన రాశీ నిజ సినిమాతో ఓ వర్గం నుంచి విమర్శలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఇక పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైన రాశీ ప్రస్తుతం ఓ బుల్లితెర ద్వారా మరోసారి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. మాటీవీలో ప్రసారమవుతున్న 'జానకి కలగనలేదు' అనే సీరియల్లో జ్ఞానాంబగా అలరిస్తుంది. ప్రస్తుతం ఈ సీరియల్ టీఆర్పీ రేటింగులో దూసుకుపోతుంది. ముఖ్యంగా రాశీ పాత్రకు ఆడియోన్స్ బాగా కనెక్ట్ అవుతున్నారట. హిందీ సీరియల్ దియా ఔర్ బాతి హమ్కు రీమేక్‌గా వచ్చిన ఈ సీరియల్‌తో తెలుగులో రీఎంట్రీ ఇచ్చిన రాశీకి మరోసారి అభిమానులు బ్రహ్మరథం పడుతున్నారు. తన నటనతో బుల్లితెర శివగామిగా పేరు గాంచిన రాశీ ఈ సీరియల్ కోసం భారీ రెమ్యునరేషనే తీసుకుంటుందట. ఆమెకున్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకొని వారానికి దాదాపు లక్ష రూపాయల రెమ్యునరేషన్ అందుకుంటుందని టాక్ వినిపిస్తోంది. ఇక ఆర్థిక ఇబ్బందుల వల్లే సీరియల్లో నటిస్తుందనే వార్తలను రాశీ ఖండించినట్లు సమాచారం. చదవండి : సంచలన నిర్ణయం తీసుకున్న 'నువ్వు నేను' హీరోయిన్ అనిత అందుకే అనసూయ పాత్రను తిరస్కరించాను: రాశి -
అందుకే అనసూయ పాత్రను తిరస్కరించాను: రాశి
సాక్షి, హైదరాబాద్: బాలనటిగా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన రాశి ఆ తర్వాత హీరోయిన్గా రాణించారు. తెలుగుదనం ఉట్టిపడేలా ముద్ద మొహంతో హీరోయిన్గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు రాశి. అయితే కొన్నాళ్లకు సినిమా అవకాశాలు తగ్గడంతో ‘వెంకి’ లాంటి సినిమాలో ఐటెం సాంగ్స్ చేశారు. ఆ తర్వాత చిన్న చిన్న పాత్రలు చేస్తున్న తరుణంలో పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమయ్యారు. ఈ నేపథ్యంలో రాశికి మళ్లీ సినిమా ఆఫర్లు వస్తుండటంతో నటిగా తన సెకండ్ ఇన్నింగ్‌ను ప్రారంబించారు. ఈ క్రమంలో ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రాశి మాట్లాడుతూ.. రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన సూపర్ హిట్ మూవీ ‘రంగస్థలం’ చిత్రంలోని రంగమ్మత్త పాత్రకోసం మొదట తననే సంప్రదించినట్లు వెల్లడించారు. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలోని రంగమ్మత్త పాత్ర ఎంత పాపులర్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఎందుకంటే ఈ పాత్రను పోషించిన అనసూయ భరద్వాజ్‌కు ఆ తర్వాత మంచి గుర్తింపు వచ్చింది. అయితే రంగమ్మత్త కోసం మొదట ‘రంగస్థలం’ యూనిట్ రాశిని సంప్రదించారంట. అయితే ఆ పాత్రలో మోకాళ్ల వరకు చీర కట్టుకోవాలనే కారణంతో తిరస్కరించానని రాశి చెప్పారు. (చదవండి: ‘ఆచార్య’లో అనసూయ.. చరణ్‌తో?) దీనిపై ఆమె మాట్లాడుతూ.. ‘రంగస్థలం సూపర్ హిట్ సాధించింది. ఇందులోని రంగమ్మత్త క్యారెక్టర్‌కు మంచి గుర్తింపు వచ్చింది. దర్శకుడు నాకు ఈ పాత్ర గురించి వివరించినప్పుడు నాకు కూడా రంగమ్మత్త నచ్చింది. కానీ ఇందులో ఆమె మోకాళ్లపై వరకు చీర కట్టుకోవాలి. ఆ లుక్ నాకు నప్పదని భావించి రంగమ్మత్త పాత్రను తిరస్కరించాను’ అని ఆమె స్పష్టం చేశారు. అయితే మహేశ్ బాబు ‘నిజం’ సినిమాలో రాశి నెగిటివ్ రోల్ చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఈ సినిమాలో తన పాత్రను గుర్తుచేసుకుంటూ... ఇందులో నెగిటివ్ రోల్ చేసి తప్పు చేశానన్నారు. ఇందులో గోపీచంద్‌కు తను లవర్‌గా నటించాలని దర్శకుడు తేజ కథ వివరించారని చెప్పారు. అయితే షూటింగ్ తొలి రోజే ఆ పాత్ర ఎలాంటిదో తనకు అర్థమైందని, దీంతో సినిమా నుంచి తప్పుకుందామని నిర్ణయించుకున్నానన్నారు. ఇదే విషయాన్ని తన పీఆర్వో బాబూరావుకు చెప్పగా... సడన్‌గా సినిమా మధ్యలో ఇలా చేస్తే ఇండస్ట్రీలో తప్పుగా ప్రచారం అవుతుందని ఆయన చెప్పారు. అందుకే ‘నిజం’లో నటించానని రాశి చెప్పుకొచ్చారు. (చదవండి: లుక్ బాగుందంటే ఆనందంగా ఉంది) -
లుక్ బాగుందంటే ఆనందంగా ఉంది
రీల్ లైఫ్‌లో నటిగా నా లక్ష్యాన్ని చేరుకున్నాను. రియల్ లైఫ్‌లో నాకంటూ ఓ లక్ష్యం ఉంది.. అమ్మమ్మ పాత్ర వరకూ ఉండాలనుకుంటున్నా (నవ్వుతూ). నా కూతురి పిల్లలతో అమ్మమ్మ అనిపించుకుంటే నా లక్ష్యం తీరినట్టే. ‘‘ప్రస్తుతం తెలుగులో రెండు పెద్ద సినిమాలు ఒప్పుకున్నాను. తమిళ్లో కూడా ఓ సినిమా చేయబోతున్నా. తమిళ్, తెలుగు భాషల్లో మా ఆయన దర్శకత్వం వహించనున్న ఓ వెబ్ సిరీస్‌లో నటిస్తాను. లాక్డౌన్ తర్వాత ఈ వెబ్ సిరీస్ స్టార్ట్ అవుతుంది’’ అని నటి రాశి అన్నారు. నేడు ఆమె పుట్టినరోజు. ఈ సందర్భంగా సాక్షితో మాట్లాడుతూ పలు విశేషాలు పంచుకున్నారు రాశి. ► ఈ పుట్టినరోజు అనే కాదు.. నేను ఏ పుట్టిన రోజునీ ప్రత్యేకంగా చూడను.. వేడుకలు జరుపుకోను. బర్త్ డేకి గుడికి వెళ్లి వచ్చి, ఇంట్లోనే కుటుంబంతో కలిసి సంతోషంగా ఉంటాను. మా నాన్న చనిపోయారు. ప్రస్తుతం కరోనా లాక్డౌన్ వల్ల మా అమ్మ నా దగ్గరే ఉంటున్నారు. అమ్మ, నేను, నా భర్త శ్రీనివాస్, పాప కలిసి ఇంట్లోనే ఉంటున్నాం. లాక్డౌన్ సమయంలో కొందరు అక్కడక్కడ చిక్కుకుపోయారని విన్నాను. అదృష్టవశాత్తూ మేమంతా ఇంట్లోనే హాయిగా ఉన్నాం. ఈ లాక్డౌన్లో ‘రాశి విజన్స్’ అనే యూట్యూబ్ చానల్ ఓపెన్ చేశాం. ► మా పాప రిధిమా మొదటి పుట్టినరోజు సమయంలో వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిగారిని కలిసి ఆశీస్సులు తీసుకున్నాం. ఆయన ముఖ్యమంత్రి అయ్యాక కలవలేదు. జగన్‌గారిని కలిసినప్పుడు నేను రాజకీయాల్లోకి వస్తున్నాననే పుకార్లు బాగా వచ్చాయి. అయితే రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన ఏమాత్రం లేదు. ► ఇన్నేళ్లు నటనలో గ్యాప్ రాలేదు.. నేనే ఇచ్చాను. రిధిమాని చూసుకునేందుకే సమయం సరిపోయేది.. ఇక నటించేందుకు తీరిక ఎక్కడిది? తను 1వ తరగతికి వెళ్లే వరకు సినిమాలు చేయొద్దని నిర్ణయించుకుని నటనకు దూరంగా ఉన్నాను. ఇప్పుడు మా పాపకి ఐదేళ్లు వచ్చాయి. ఇప్పుడు నటించేందుకు వీలు కుదురుతోంది. ఇలాంటి పాత్రలే చేయాలనుకోవడం లేదు. నా మనసుకి నచ్చిన ఏ పాత్ర అయినా చేస్తాను. ► ఓ సీరియల్ షూటింగ్లో నేను పోలీస్ యూనిఫామ్‌లో ఉన్న నా వీడియో, ఫొటోలు బాగా వైరల్ అయ్యాయి. ‘బాగా సన్నబడ్డట్టున్నారే.. మీ లుక్ బాగుంది’ అని చాలామంది అంటుంటే సంతోషంగా ఉంది. నేను నటించిన మొదటి సీరియల్ ఇది. నాలుగు రోజులు షూటింగ్లో పాల్గొన్నాను. ఈ చిత్రీకరణలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం కోవిడ్ నివారణ చర్యలు తీసుకున్నాం. వెండితెరకి, బుల్లితెరకి పెద్ద తేడా అనిపిం^è లేదు. ప్రస్తుతం సినిమాకి ఉపయోగించే టెక్నాలజీ బాగుంది. సీరియల్‌కి కొంచెం హార్డ్ వర్క్ ఉంటుంది. -
సాక్షితో గోకులపు సీత
-
అమ్మాయికి నచ్చక్కర్లేదా?
‘‘ఎవరూ ఎక్కువ కాదు.. ఎవరూ తక్కువ కాదు. ఆడ, మగ ఇద్దరూ సమానమే’’ అన్నారు రాశీ. సమానత్వం గురించి, ఇతర విశేషాలను ‘సాక్షి’తో ఇలా పంచుకున్నారు. ► సినిమా ఇండస్ట్రీ ‘మేల్ డామినేటెడ్’ అంటారు. చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి హీరోయిన్గా మీది లాంగ్ కెరీర్. ఈ డామినేషన్ గురించి మీరేమంటారు? ఈ పరిస్థితిలో ఎప్పుడు మార్పు వస్తుందా? అని ఎదురు చూస్తున్నా. నేను, తమిళ్, మలయాళ సినిమాలు కూడా చేశాను. మలయాళంలో అంతగా డామినేషన్ కనిపించదు. అక్కడ అందరూ ఈక్వల్ అన్నట్లుగానే వ్యవహరిస్తారు. మనతో పోల్చితే తమిళంలో డామినేషన్ తక్కువ. మనకు చాలా ఎక్కువ. ► ‘పెళ్లి చూపులు’ అప్పుడు ‘అమ్మాయి నచ్చిందా’ అని అబ్బాయిని అడుగుతారు. కొన్ని చోట్ల ‘అబ్బాయి నచ్చాడా’ అని అడగకుండానే సంబంధం ఖాయం చేసేస్తారు. అమ్మాయి అభిప్రాయం అవసరంలేదా? ఎగ్జాక్ట్లీ. అది మాత్రం చాలా దయనీయమైన స్థితి. జీవితాంతం కలిసి బతకాల్సిన వ్యక్తిని సెలెక్ట్ చేసుకునే హక్కు అమ్మాయికి ఉండదా? అబ్బాయికి నచ్చితే చాలా? అమ్మాయికి నచ్చక్కర్లేదా? పుట్టినప్పటి నుంచి జాగ్రత్తగా పెంచి, అత్తింటికి పంపాల్సి వచ్చినప్పుడు మాత్రం అమ్మాయి నిర్ణయం గురించి పట్టించుకోకపోవడం దారుణం అనే చెప్పాలి. జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకునే హక్కు అబ్బాయికి ఉన్నప్పుడు అమ్మాయికి కూడా ఉండాలి. ఒకప్పటితో పోల్చితే ఇప్పుడు ఫర్వాలేదు. ఇంకా మారాలి. ► డిపెండెంట్ ఉమన్‌కి ఇండిపెండెంట్ ఉమన్‌కి తేడా ఏంటి? నేను మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ గురించి మాట్లాడుతున్నా. నాకు ఊహ తెలిసినప్పుడు భర్త జాబ్ చేయాలి భార్య ఇంట్లో వంట చేయాలి, ఇంట్లో విషయాలు చూసుకోవాలి అనుకునేదాన్ని. కానీ ఇప్పుడు పెరిగిన ధరల వల్ల కావచ్చు, ఇంట్లో ఏమీ తోచక.. ఇంకేదైనా రీజన్ వల్ల కావచ్చు ఆడవాళ్లు ఇండిపెండెంట్‌గా ఉండాలనుకుంటున్నారు. వాళ్లు చదువుకున్న చదువుకి తగ్గ జాబ్ లేదా ఏది చేయగలిగితే ఆ పని చేసి సంపాదించాలనుకుంటున్నారు. అది మంచి పరిణామం. నాకు తెలిసినంత వరకు ఉమన్ ఇండిపెండెంట్‌గానే ఉండాలి. ఉండటమే మంచిది. డిపెండెన్సీలో ఓ ఇన్‌సెక్యూర్టీ ఉంటుంది. ఏది చేయాలన్నా ఇతరుల మీద ఆధారపడాల్సిందే. సొంతంగా నిర్ణయాలు తీసుకునే ధైర్యం చేయలేరు. ఇండిపెండెంట్ ఉమన్‌లో కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఇండిపెండెంట్‌గా ఉంటూనే ఫ్యామిలీ మెంబర్స్ మీద డిపెండ్ అవ్వడం తప్పు కాదు. ► రెమ్యునరేషన్ హీరోలకు ఎక్కువ.. హీరోయిన్లకు తక్కువ. దీని గురించి ఏమంటారు? ఒకప్పటితో పోల్చితే ఇప్పుడు కొంచెం బెటర్. నేను హీరోయిన్ గా చేసినప్పుడు హీరోకి ఓ 70 లక్షలు ఇచ్చారనుకోండి.. మాకు 8 నుంచి 10 లక్షలు ఇచ్చేవారు. అంత డిఫరెన్స్ ఉండేది. ఇప్పుడు హీరోకి 3 కోట్లు ఇస్తే హీరోయిన్‌కి కూడా దగ్గర దగ్గర కోటి రూపాయలు ఇస్తున్నారు. ఆ మార్పు వచ్చినందుకు హ్యాపీ. అయితే ఎప్పుడూ హీరోకే ఇంపార్టె ఉంటుంది. ఎందుకంటే సినిమా బిజినెస్ జరిగేదే హీరో మార్కెట్‌ని బేస్ చేసుకుని అంటారు కదా. అలాగని హీరోయిన్ లేని సినిమా ఉంటుందా? నెవర్. హీరో లేని సినిమాలు వస్తున్నాయి కదా. అందుకే హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలు బాగా ఆడాలని కోరుకుంటాను. ► కొందరు హీరోయిన్లు ‘ఫైనాన్షియల్ మేటర్స్’ని మీలా అమ్మకో, నాన్నకో, అన్నయ్యకో అప్పజెప్పేస్తారు. ఎందుకలా? ‘ఫైనాన్షియల్ మేనేజ్మెంట్’ చేత కాకపోవడం వల్లనా? చేత కాదని కాదు. నేను చైల్డ్ ఆర్టిస్ట్‌గా వచ్చి, ఆ తర్వాత హీరోయిన్ అయ్యాను. చిన్నప్పుడు అమ్మానాన్న చూసుకున్నారు. పెద్దయ్యాక అదే కంటిన్యూ అయింది. నేను ఏ సినిమాలు చేయాలి? ఎంత బాగా యాక్ట్ చేయాలి? అనే విషయాల మీదే దృష్టి పెట్టేదాన్ని. నేనంటే చిన్నప్పుడే ఇండస్ట్రీకి వచ్చేశాను కాబట్టి నేను ‘డిపెండ్’ అయ్యాను. ఇప్పుడు కొందరు హీరోయిన్లు ‘ఇండిపెండెంట్’గా ఉంటున్నారు. అది మంచిదే. మా జనరేషన్ హీరోయిన్స్ కంటే ఇప్పుడు హీరోయిన్స్ చాలా బెస్ట్. మాలా 14, 15 ఇయర్స్, 20 ఇయర్స్ లోపు రావటం లేదు. చాలా బ్రాడ్ మైండెడ్‌గా ఉంటున్నారు. మాలాగా రైట్ సైడ్‌లో అమ్మ, లెఫ్ట్ సైడ్‌లో నాన్న ఉండాలనుకోవడంలేదు. వాళ్లంతట వాళ్లే షూటింగ్స్‌కు వెళ్లిపోతున్నారు. కేవలం స్టాఫ్ ఉంటే చాలు. మొత్తం వాళ్లే మేనేజ్ చేసుకుంటున్నారు. ఎవరి మీదా ఆధారపడటంలేదు. అలానే ఉండాలి. ఎలా ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుందో తెలుసుకుంటున్నారు. ‘సేఫ్’గా లైఫ్‌ని ప్లాన్ చేసుకుంటున్నారు. హీరోయిన్లనే కాదు.. ఆడవాళ్లందరూ చాలా తెలివిగా ఉండాలి. మనకెందుకులే? మగవాళ్లు చూసుకుంటారు అనుకోకూడదు. ‘ఆధారపడటం’ అంటే మన లైఫ్‌ని వేరేవాళ్ల చేతిలో పెట్టేసినట్లే. ఉన్న ఒక్క లైఫ్ మన చేతుల్లో లేకపోతే ఎలా? ► ‘నీకేం తెలుసులే’ అని భార్యను భర్త అనడం చాలా ఇళ్లల్లో చూస్తుంటాం. ఇంట్లో ‘డెసిషన్ మేకింగ్’ ఎవరిదైతే బాగుంటుంది? ఆడవాళ్లదైతేనే బాగుంటుంది. ఎందుకంటే పుట్టినింటి బంధువులను, మెట్టినింటి బంధువులను కలిపి ఉంచగలిగేది ఆడవాళ్లే. ఇంటి మేనేజ్మెంట్ ఆడవాళ్ల చేతుల్లోనే ఉండాలి. మా ఇంటికి సంబంధించినంతవరకూ చాలావరకు నా నిర్ణయాలే. అయినా డెసిషన్ అనేది ‘విషయం’ మీద ఆధారపడి ఉంటుంది. ఆ విషయం మీద భర్తకు పట్టు ఉంటే తనే డెసిషన్ తీసుకోవాలి. ఒకవేళ భార్యకు ఉంటే ఆమెకే వదిలేయాలి. అంతేకానీ నేను మగాణ్ణి.. నేనే డెసిషన్ తీసుకోవాలి. నేననుకున్నదే జరగాలనుకోకూడదు. ఎందుకంటే ‘రాంగ్ డెసిషన్ ’ ఇంటిని ఛిన్నాభిన్నం చేస్తుంది. ఇద్దరూ ఓ అండర్‌స్టాండింగ్‌కి వచ్చి, ‘ఇదిగో ఈ విషయంలో నువ్వైతే బెటర్. నువ్వు ఏ డెసిషన్ తీసుకున్నా ఫర్వాలేదు’ అని మాట్లాడుకుంటే ప్రాబ్లమ్స్ ఉండవు. ► భార్య కన్నా భర్త ఎక్కువ సంపాదిస్తే భర్తకు డైజెస్ట్ కాదు. సొసైటీ ఆ భర్తకు పెద్దగా విలువ ఇవ్వదు. ఏం.. భార్య ఎక్కువ సంపాదించకూడదా? సొసైటీ దాకా ఎందుకు? భార్యాభర్త.. ఇద్దరూ సంపాదిస్తున్న ఒక ఇంటిని తీసుకుందాం. భార్యకు భర్త కంటే ఎక్కువ ఇన్కమ్ ఉంటే.. ఇంట్లో పని చేసేవాళ్లు కూడా ‘మేడమ్ మేడమ్’ అని భార్యకే ఎక్కువ విలువ ఇస్తారు. భార్య ఆ విషయాన్ని మామూలుగా తీసుకుంటే ఓకే... తన గురించి తాను ఎక్కువ అనుకుని, భర్తను డామినేట్ చేయడానికి ప్రయత్నిస్తే అప్పుడు ప్రాబ్లమ్స్ మొదలవుతాయి. ఆటోమేటిక్‌గా పిల్లలకు, రిలేటివ్స్‌కు కూడా ఆ భర్త చులకన అయిపోతాడు. అలా కాకుండా ‘మన కుటుంబం కోసం సంపాదిస్తున్నాం’ అనే ఫీలింగ్‌తో భార్య ఉండాలి. బాగా సంపాదించే భర్త కూడా అలానే అనుకోవాలి. అప్పుడా సంసారం బాగుంటుంది. ఆడవాళ్లు ఎక్కువ సంపాదిస్తే తప్పేం కాదు. ఇద్దరూ సమానం అనుకోగలిగితే ఎటువంటి సమస్యలూ రావు. – డి.జి. భవాని -
'లంక' మూవీ రివ్యూ
టైటిల్ : లంక జానర్ : సస్పెన్స్ థ్రిల్లర్ తారాగణం : రాశి. సాయి రోనక్, ఈన సాహా, సంగీతం : శ్రీ చరణ్ దర్శకత్వం : శ్రీ ముని నిర్మాత : నమన విష్ణు కుమార్, నమన దినేష్ ఒకప్పుడు హీరోయిన్ గా స్టార్ హీరోలతో సినిమాలు చేసిన నటి రాశి, లాంగ్ గ్యాప్ తరువాత కళ్యాణ వైభోగమే సినిమాతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రీ ఎంట్రీ ఇచ్చింది. అయితే రీ ఎంట్రీలోనూ తన మార్క్ చూపించేందుకు భర్త శ్రీముని దర్శకత్వంలో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రతో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన లంక సినిమా రాశి అనుకున్న విజయాన్ని అందించిందా..? థ్రిల్లర్ జానర్ లో తెరకెక్కిన సినిమాలు వరుస సక్సెస్ సాధిస్తున్న నేపథ్యంలో లంక మరో హిట్ సినిమా అనిపించుకుందా..? కథ : సాయి (సాయి రోనక్), సుధా( సుదర్శన్) ఎలాగైన సినీ రంగంలో స్థిరపడాలన్న కోరికతో తల్లితండ్రులు ఎంత తిడుతున్నా పట్టించుకోకుండా సినిమా ప్రయత్నాలు చేస్తుంటారు. సిల్వర్ స్క్రీన్ మీద ఛాన్స్ కొట్టాలంటే ముందు షార్ట్ ఫిలింతో ప్రూవ్ చేసుకోవాలని నిర్ణయించుకుంటారు. ఆ షార్ట్ ఫిలింను తానే నిర్మిస్తానని మాట ఇవ్వటంతో పాత సామాన్ల వ్యాపారం చేసే సత్యను హీరోగా తీసుకుంటారు. హీరోయిన్ కోసం వెతుకుతుండగా.. ఓ షాపింగ్ మాల్ స్వాతి(ఈన సాహా)ను చూసి ఆమెనే హీరోయిన్ గా ఫిక్స్ అవుతాడు. అప్పటికే మలయాళ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ అయిన స్వాతి ముందు కాదన్న అప్పటికే తాను ఓ పెద్ద ప్రమాదంలో ఉండటంతో దాని నుంచి తప్పించుకోవడానికి షార్ట్ ఫిలిం లో నటించేందుకు ఒప్పుకుంటుంది. అయితే స్వాతి హీరోయిన్ అని తెలియని సాయి, సుధాలు రెబాకా విలియమ్స్(రాశి) బంగ్లాలో షూటింగ్ స్టార్ట్ చేస్తారు. ఎవరూ లేని ఇంట్లో ఒక్కతే ఉండే రెబాకా ప్రవర్తన అందరికీ వింతగా అనిపిస్తుంది. చనిపోయిన తన పిల్లలను ఉన్నట్టుగా ఊహించుకొని బతుకుతున్న రెబాకాకు స్వాతి దగ్గరవుతుంది. రెబాకాతో ఉన్న సమయంలో తన బాధలన్ని మర్చిపోయి హాయిగా ఉంటుంది. ఆ సమయంలో అనుకోకుండా స్వాతి కనిపించకుండా పోయిందన్న వార్త నేషనల్ మీడియాలో ప్రసారమవుతుంది. స్టార్ హీరోయిన్ మిస్ అవ్వటంతో పోలీస్ డిపార్ట్మెంట్ కేసు ను సీరియస్ గా తీసుకుంటుంది. స్వాతితో షార్ట్ ఫిలిం తీసిన సాయి టీంను అరెస్ట్ చేసి ఇంటరాగేట్ చేస్తారు. అదే సమయంలో స్వాతికి దగ్గరైన రెబాకాను అనుమానిస్తారు. అసలు స్వాతి ఎలా మిస్ అయ్యింది..? స్వాతి ఏ ప్రమాదం నుంచి తప్పించుకోవడానికి షార్ట్ ఫిలిం చేసేందుకు ఒప్పుకుంది..? రెబాకాకు స్వాతికి సంబంధం ఏంటి..? చివరకు స్వాతి రెబాకాలు ఏమయ్యారు...? అన్నదే మిగతా కథ. నటీనటులు : ఒకప్పటి హీరోయిన్లందరూ రీ ఎంట్రీలో అత్త అమ్మ పాత్రలకు పరిమితమవుతుంటే, రాశీ మాత్రం ప్రయోగాత్మక చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో సెటిల్ పర్ఫామెన్స్ తో ఆకట్టుకుంది. ఉన్నంతలో తన పరిథి మేరకు సినిమా స్థాయిని పెంచే ప్రయత్నం చేసింది. హీరో హీరోయిన్లుగా సాయి రోనక్, ఈన సాహాలు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. ముఖ్యంగా హీరోయిన్ ఈన సాహా మంచి వేరియేషన్స్ చూపించింది. ఒకే సినిమాలో రెండు డిఫరెంట్ వేరియషన్స్ ఉన్న పాత్రల్లో కనిపించిన శిజు రెండు పాత్రలకు పూర్తి న్యాయం చేశాడు. సుప్రీత్, సత్యం రాజేష్, సుదర్శన్, సత్యలు పాత్రకు తగ్గ నటనతో ఆకట్టుకున్నారు. సాంకేతిక నిపుణులు : భార్య రీ ఎంట్రీ కోసం దర్శకుడు శ్రీ ముని తయారు చేసుకున్న లైన్ బాగున్నా.. కథనం నడిపించిన తీరు మాత్రం ఆకట్టుకునేలా లేదు. ముఖ్యంగా చాలా సన్నివేశాలను జరగనివి జరిగినట్టుగా చూపించే ప్రయత్నంలో కన్య్ఫూజన్ క్రియేట్ అయ్యింది. కథకు మూలమైన రాశి పాత్రను డిజైన్ చేసిన తీరు ఆకట్టుకుంటుంది. అనవసరమైన పాటలను ఇరికించకుండా సినిమా రన్ టైం ను తగ్గించటం సినిమాకు ప్లస్ అయ్యింది. శ్రీ చరణ్ సంగీతం ఓకె. సినిమాటోగ్రఫి, ఎడిటింగ్, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ : రాశి నటన స్టోరి లైన్ మైనస్ పాయింట్స్ : కథనం అసలు కథకు సంబంధం లేని ఊహలు - సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్ -
ఇప్పటి హీరోయిన్లు చాలా లక్కీ!
‘‘హీరోయిన్గా చేస్తున్నప్పుడు నాకొస్తున్న పాత్రలు, సినిమాలను బట్టి నా క్రేజ్ తగ్గుతోందనే సంగతి అర్థమైంది. వెంటనే పెళ్లి చేసుకుని లైఫ్‌లో సెటిల్ అయ్యాను. క్రేజ్ ఉన్నప్పుడే సినిమాల నుంచి గ్యాప్ తీసుకోవడంతో ప్రేక్షకుల్లో నా ఇమేజ్ బాగుంది. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్‌లో మంచి ఛాన్సులు రావడానికి కారణమదే’’ అన్నారు రాశి. సాయిరోనక్, ఇనసహ, రాశి ప్ర«ధాన పాత్రల్లో శ్రీముని దర్శకత్వంలో నామన దినేష్, నామన విష్ణుకుమార్ నిర్మించిన సినిమా ‘లంక’ ఈ నెల 21న విడుదలవుతోంది. రాశి మాట్లాడుతూ – ‘‘ఎక్కడ చూసినా సమాజంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, దారుణాలకు సంబంధించిన వార్తలే. ‘లంక’ వంటి ఈ లోకంలో ఓ మహిళ ఎలాంటి సమస్యలు ఎదుర్కొందనేది కథ. టెలీపతి నేపథ్యంలో సినిమా సాగుతుంది. నేను 35 ఏళ్ల వయసున్న ఒంటరి మహిళగా నటించా. టెలీపతి ద్వారా నేనో అమ్మాయిని ఆవహించానా? లేదా తను నన్ను ఆవహించిందా? అనేది సస్పెన్స్. ఈ చిత్రానికి దర్శకుడు మా ఆయనే అయినా కథ, నా పాత్ర నచ్చడంతో చేశా’’ అన్నారు. సినిమా ఇండస్ట్రీలో మార్పుల గురించి... ‘‘నేను హీరోయిన్గా చేసినప్పుడు తీసుకున్న పారితోషికాన్ని ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఒక్క రోజుకు తీసుకుంటున్నారు. అప్పట్లో హీరోయిన్లకు కేర్‌వ్యాన్‌లు, గట్రా లేవు. బట్టలు మార్చుకోవడానికి సరైన సదుపాయాలు ఉండేవి కాదు. ఎండల్లో, కొండల్లో షూటింగ్ చేసి చెట్ల కింద విశ్రాంతి తీసుకునేవాళ్లం. ఇప్పటి హీరోయిన్లు చాలా లక్కీ’’ అన్నారు. -
లంకలో థ్రిల్
నటి రాశీ ప్రధాన పాత్రలో తెరకెక్కిన సస్పెన్స్ థ్రిల్లర్ ‘లంక’. శ్రీముని దర్శకత్వంలో నామన దినేష్–నామన విష్ణు కుమార్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 14న విడుదల కానుంది. నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘వైవిధ్యమైన కథాంశంతో సైంటిఫిక్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన చిత్రమిది. టెలీపతి నేప«థ్యంలో రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతి పంచుతుంది. ఇటీవల విడుదల చేసిన ట్రైలర్‌కు మంచి స్పందన వస్తోంది. కథానాయిక ఐనా సాహాపై చిత్రీకరించిన పాట సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది’’ అన్నారు. సాయి రోనక్, ఐనా సాహా, సిజ్జు, సుప్రీత్, లీనా సిద్ధు తదితరులు నటించిన ఈ చిత్రానికి సమర్పణ: నామన శంకర్రావు, సుందరి. -
లంకలో టెలీపతి
‘‘బడ్జెట్ తక్కువని ఏ సినిమా పడితే అది తీసేసి విడుదల చేస్తున్నారు. అలాంటి సినిమాలు రెండు మూడు షోలు కూడా ఆడడం లేదు. కొత్త నిర్మాతలు బడ్జెట్ కంటే ఎక్కువ కథపై జాగ్రత్తలు తీసుకోవాలి. చిన్న సినిమాల కాన్సెప్ట్ డిఫరెంట్‌గా ఉండడం చాలా ముఖ్యం. ‘కల్యాణ వైభోగం’తో రీ–ఎంట్రీ ఇచ్చిన రాశి ఈ చిత్రంలో మంచి పాత్ర చేశారు’’ అన్నారు నిర్మాత కేఎల్ దామోదర ప్రసాద్. రాశి, సాయిరోనక్, ఇనసహ ముఖ్య తారలుగా శ్రీముని దర్శకత్వంలో దినేశ్ నామన, విష్ణు నామన నిర్మిస్తున్న సినిమా ‘లంక’. శనివారం సీనియర్ ఫొటో జర్నలిస్టులు జనార్థన్‌రెడ్డి, సాయిరమేశ్, సీఎం ప్రవీణ్‌కుమార్, భూషణ్ ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ – ‘‘ఇప్పటివరకూ భారతీయ సినిమాల్లో రాని టెలీపతి పాయింట్‌తో చేసిన సైంటిఫిక్ థ్రిలర్ చిత్రమిది. ఎలాంటి సాధనాలు, వస్తువులు లేకుండా మైండ్ టు మైండ్ కమ్యునికేషన్ జరపడమే టెలీపతి. రాశి, సాయిరోనక్, ఇనసహ పాత్రల మధ్య కథ నడుస్తుంది. సినిమాలో ఒక్క పాటే ఉంటుంది. ఏప్రిల్‌లో చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు. ‘సత్యం’ రాజేశ్, ముత్యాల రామదాసు, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. -
లంకలో ఏం జరిగింది?
సీతను అపహరించిన రావణుడు లంకకు తీసుకువెళ్లి అశోకవనంలో బందీగా ఉంచుతాడు. అప్పుడు రాముడు తన సతీమణి కోసం యుద్ధం చేస్తాడు. రామాయణం విన్నోళ్లకూ, చదివినోళ్లకూ ఈ కథ, ‘లంక’ అనే ఊరి పేరు బాగా తెలుసు. ఇప్పుడీ కథ ఎందుకంటే... ‘లంక’ పేరుతో ఓ సస్పెన్స్ థ్రిల్లర్ రూపొందుతోంది. రాశి కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ ‘లంక’లో సీతారాములు ఎవరు? రావణుడు ఎవరు? అని దర్శకుడు శ్రీమునిని అడిగితే... ‘‘ఈ రోజే టీజర్ విడుదల చేశాం కదా. కొన్ని రోజులు వెయిట్ చేస్తే, ఆ విషయాన్నీ చెప్పేస్తాం’’ అన్నారు. నామన దినేశ్, నామన విష్ణుకుమార్ నిర్మిస్తున్న ఈ సినిమా టీజర్‌ను మంగళవారం దర్శకుడు మారుతి విడుదల చేశారు. ‘‘నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ నెలాఖరున పాటల్ని, వచ్చే నెలలో చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: శ్రీచరణ్ పాకాల, సమర్పకులు: నామన శంకర్రావు–సుందరి. -
సినీనటి రాశి ప్రత్యేక పూజలు
ఏలూరు : ద్వారకాతిరుమల చినవెంకన్నను సంక్రాంతి పర్వదినం రోజున సినీనటి రాశి దర్శించారు. కుటుంబ సమేతంగా ఆలయానికి విచ్చేసిన ఆమె స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలుచేశారు. అంతకుముందు జంగారెడ్డిగూడెం మండలం గుర్వాయిగూడెం శ్రీ మద్ది ఆంజనేయస్వామిని సినీ నటి రాశి కుమార్తెతో సహా వచ్చి దర్శించుకున్నారు. స్వామి వారి సన్నిధిలో రాశి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ సిబ్బంది స్వామి చిత్రపటాన్ని ప్రసాదాలకు అందజేశారు. రాశి మాట్లాడుతూ మహిమాన్వితమైన శ్రీ మద్ది ఆంజనేయస్వామిని దర్శించుకోవడం తనకు చాలా ఆనందంగా ఉందన్నారు. -
డాటరాఫ్ రాశి
ఈ ఫొటోలో రాశితో ఉన్న పాప ఎవరో ఈపాటికి ఊహించే ఉంటారు. అవును.. రాశి కూతురే. పేరు... ‘రిథిమ’. ముద్దులొలికే ఈ బుజ్జి పాపాయి వయసు తొమ్మిది నెలలు. ముద్దుల తనయతో రాశి ఇటీవల కొన్ని ఫొటోలు దిగారు. వాటిలో చిరునవ్వులు చిందిస్తూ దిగిన ఈ ఫొటో చూడముచ్చటగా ఉంది కదూ. అన్నట్లు.. రాశి మళ్లీ సినిమాల్లో నటించనున్నారు. ఇప్పటికే మూడు చిత్రాలు అంగీకరించారట. త్వరలో వాటి వివరాలు తెలియజేయనున్నారు. -
రాశికి కూతురు పుట్టింది
ప్రముఖ సినీ నటి రాశి తల్లి అయింది. శుక్రవారం చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఓ పాపకు జన్మనిచ్చారు. తల్లి, బిడ్డా ఇద్దరూ క్షేమంగా ఉన్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. శుక్రవారం నాడు తమ ఇంటికి సాక్షాత్తూ ఆ మహాలక్ష్మి వచ్చినట్లుగా ఉందని రాశి ఆనందం వ్యక్తం చేసింది. -
సాగర్‌కి 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్'
బుల్లితెరపై ‘మొగలి రేకులు’ సీరియల్కితో స్టార్ ఇమేజ్ తెచ్చుకున్న సాగర్ హీరోగా ఓ చిత్రం రూపొందుతోంది. పి.ఏ.అరుణ్‌ప్రసాద్ దర్శకుడు. అభి స్టూడియోస్ పతాకంపై బి.సత్యనారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాజేంద్రప్రసాద్, రాశి ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఓ పాటను చిత్రీకరిస్తున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో ఈ చిత్రానికి ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ -‘‘విపత్కర పరిస్థితులనైనా ఎదిరించి చాకచక్యంగా తన పనిని పూర్తి చేసే సామర్థ్యం కలవాడు మా హీరో. అందుకే ఈ టైటిల్ పెట్టాం’’ అని చెప్పారు. ఈ పాటతో షూటింగ్ పూర్తవుతుంది. త్వరలో పాటలను, చిత్రాన్ని విడుదల చేస్తామని నిర్మాత తెలిపారు. ఈ సినిమాతో తనకు మంచి గుర్తింపు వస్తుందని సాగర్ అన్నారు.