సాగర్‌కి 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్'
సాగర్‌కి 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్'
Published Fri, Sep 6 2013 1:42 AM | Last Updated on Fri, Sep 1 2017 10:28 PM
బుల్లితెరపై ‘మొగలి రేకులు’ సీరియల్‌కితో స్టార్ ఇమేజ్ తెచ్చుకున్న సాగర్ హీరోగా ఓ చిత్రం రూపొందుతోంది. పి.ఏ.అరుణ్‌ప్రసాద్ దర్శకుడు. అభి స్టూడియోస్ పతాకంపై బి.సత్యనారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాజేంద్రప్రసాద్, రాశి ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.
ప్రస్తుతం హైదరాబాద్‌లో ఓ పాటను చిత్రీకరిస్తున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో ఈ చిత్రానికి ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ -‘‘విపత్కర పరిస్థితులనైనా ఎదిరించి చాకచక్యంగా తన పనిని పూర్తి చేసే సామర్థ్యం కలవాడు మా హీరో.
అందుకే ఈ టైటిల్ పెట్టాం’’ అని చెప్పారు. ఈ పాటతో షూటింగ్ పూర్తవుతుంది. త్వరలో పాటలను, చిత్రాన్ని విడుదల చేస్తామని నిర్మాత తెలిపారు. ఈ సినిమాతో తనకు మంచి గుర్తింపు వస్తుందని సాగర్ అన్నారు.
Advertisement
Advertisement