Actress Raasi Interesting Comments On Rebal Star Prabhas, Reveals She Wants To Act With Him - Sakshi
Sakshi News home page

Raasi Comments On Prabhas: ప్రభాస్ పక్కన హీరోయిన్‌గా చేయాలనుంది.. కానీ: రాశి

Published Fri, Aug 18 2023 4:14 PM | Last Updated on Fri, Aug 18 2023 4:47 PM

Actress Raasi Interesting Comments On Rebal Star Prabhas - Sakshi

సీనియర్ హీరోయిన్ రాశి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. సూపర్ హిట్ సినిమాలతో స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. బాలనటిగా ఎంట్రీ ఇచ్చి అగ్ర హీరోలందరీ సరసన నటిచింది. గోకులంలో సీత, శుభాకాంక్షలు చిత్రాలతో మరింత గుర్తింపు తెచ్చుకుంది. అయితే  ఆ తర్వాత పెళ్లి చేసుకున్న రాశి కొన్నేళ్ల పాటు సినిమాలకు దూరమైంది. అయితే ఆ తర్వాత రీ ఎంట్రీ ఇచ్చిన రాశి.. పలు చిత్రాల్లోనూ కనిపించింది. 

(ఇది చదవండి: జైలర్‌ సినిమాలో మెగాస్టార్‌ ఉండాల్సింది, సైడ్‌ చేసిన రజనీకాంత్‌!)

రీ ఎంట్రీ ఇచ్చిన రాశి.. సినిమాలతో పాటు సీరియల్స్‌లోనూ నటించింది.  జానకి కలగనలేదు సీరియల్ రాశికి గుర్తింపు తీసుకొచ్చింది. ప్రస్తుతం ఆమె నటిస్తోన్న ఈ సీరియల్ చివరిదశకు చేరుకుంది. ఈ సందర్భంగా నటీనటులంతా యూట్యూబ్ ద్వారా తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా రాశి ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఇండస్ట్రీలో తన ఆల్ టైం ఫేవరెట్ హీరో శోభన్‌ బాబు, చిరంజీవి అని వెల్లడించింది. అయితే ప్రస్తుతం యంగ్ హీరోల్లో ప్రభాస్ అంటే ఇష్టమని తెలిపింది. ఆయనతో నటించాలని ఎంతో ఆసక్తిగా ఉందని రాశి చెప్పుకొచ్చింది. 

రాశి మాట్లాడుతూ.. 'ప్రభాస్ అంటే నాకు చాలా ఇష్టం. ఆయనతో నటించాలనేది నా కోరిక.  అది కూడా హీరోయిన్‌గా అయితే నటిస్తా.  తల్లి లాంటి పాత్రలంటే మాత్రం ఒప్పుకోను.  ఇప్పటివరకు నేను ప్రభాస్‌తో ఎప్పుడు మాట్లాడలేదు. అడవి రాముడు షూటింగ్ సమయంలో ఒకే హోటల్‌లో ఉన్నాం. ఆ విషయం తెలిసి నేను ఎగిరి గంతేశా. అయితే  ప్రభాస్‌ను కలవాలని అనుకున్నా. కానీ కుదరలేదు. అయితే.. ఆయన ఉన్న రూమ్‌కు కాల్ చేసి మాట్లాడా.   అయితే ప్రభాస్ సీనియర్స్‌కు చాలా మర్యాద ఇస్తారని విన్నా.' అని తెలిపింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 

(ఇది చదవండి: కొత్త కారు కొన్న రణబీర్ కపూర్ - ధర తెలిస్తే అవాక్కవుతారు!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement