దర్శకనిర్మాత రామానంద్ సాగర్ రూపొందించిన రామాయణం గతంలో టీవీలో ప్రసారమై, కొన్నేళ్ల పాటు ప్రేక్షకులను అమితంగా అలరించింది. దానిలో రాముని పాత్ర పోషించి, కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న నటుడు అరుణ్ గోవిల్ తాజాగా విడుదలైన ‘ఆది పురుష్’ సినిమాపై తన అభిప్రాయాన్ని నిర్మొహమాటంగా వెల్లడించారు.
హీరో ప్రభాస్ నటించిన ‘ఆది పురుష్’ జూన్ 16న భారీ స్థాయిలో విడుదలయ్యింది. ఇది మొదలు ఈ సినిమాపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొందరికి రాముని లుక్ నచ్చకపోగా, మరికొందరికి హనుమంతుని భాష నచ్చలేదు. మరికొందరు అభిమానులు ‘ఆది పురుష్’లో కొన్ని సీన్స్‌పై లెక్కలేన్ని అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.
తాజాగా అలనాడు టీవీలో ప్రసారమైన రామాయణంలో రాముని పాత్ర పోషించిన అరుణ్ గోవిల్ ‘ఆది పురుష్’ సినిమాపై తన అభిప్రాయం వ్యక్తం చేశారు. రామాయణం భారతీయ సంస్కృతికి ప్రతిబింబమని, అయితే ఇప్పుడు ఈ రామాయణం(సినిమా) గురించి రరకాల వాదనలు వినిపిస్తున్నాయన్నారు. రామాయణ కథను, రాముని స్వరూపాన్ని మార్చి చూపించాల్సిన అవసరం లేదన్నారు.
‘ఆధ్యాత్మికతకు అపహాస్యం’
రామాయణం మనకు ఒక ఆధ్యాత్మిక మార్గం. మనకు ధైర్యన్ని అందించే ఉత్తమ గ్రంథం. దీనిని ఎవరైనా అపహాస్యం చేస్తే, స్వీకరించాల్సిన అవసరం లేదు. రామాయణాన్ని ఆధునికమని, సంప్రదాయమని విడదీయడం తగదు. సినిమాలో స్పెషల్ ఎఫెక్ట్స్, ప్రెజెంటేషన్ విషయాన్ని పక్కన పెడితే, క్యారెక్టర్లను సరైన రీతిలో చూపించడం తప్పనిస అని అరుణ్ గోవిల్ పేర్కొన్నారు.
రాముడు, సీత, హనుమంతుడు మొదలైన క్యారెక్టర్ల విషయంలో ఆధునికం, సంప్రదాయం అని విడదీయడం తగదు. ఈ క్యారెక్టర్ ఆద్యనంతాలు. అంటే ఎప్పటికీ ఒకేలా ఉండేవి. అందుకే అదే స్వరూపాన్ని ఈ సినిమాలో చూపిస్తే తప్పేముంది? అని ప్రశ్నించారు. ‘ఆది పురుష్’ సినిమా నిర్మాతలు దీనిని రూపొందించేముందు ఏ తరహా ప్రేక్షకులకు ఈ కథను చూపించాలనుకుంటున్నారో నిర్ణయించుకుని ఉండాల్సిందన్నారు.
‘ఇటువంటి భాష తగదు’
‘ఆది పురుష్’ సినిమాలో వాడిన భాషపై పలు విమర్శలు వస్తున్నాయని అరుణ్ గోవిల్ ఆరోపించారు. ‘ఆది పురుష్’ సినిమాలో గౌరవప్రదమైన భాష వాడాలని అన్నారు. రామాయణ మూల భావనను తొలగించాల్సిన అవసరం ఏమివచ్చిందన్నారు. హాలీవుడ్ సినిమాల స్ఫూర్తితో రామాయణాన్ని చూపించాలనుకోవడం సరైనది కాదన్నారు.
ఇది కూడా చదవండి: ‘మేం తీసింది రామాయణం కాదు’
Comments
Please login to add a commentAdd a comment