arun govil
-
Lok Sabha Election Results 2024: ఏకంగా 280 కొత్త ముఖాలు
న్యూఢిల్లీ: పద్దెనిమిదో లోక్‌సభలో ఏకంగా 280 మంది ఎంపీలు మొదటిసారిగా దిగువసభకు ఎన్నికైన వారున్నారు. ఇందులో మాజీ సీఎంలు, సినీ తారలు, వారసులు, హైకోర్టు మాజీ జడ్డి తదితరులున్నారు. అత్యధికంగా 80 లోక్‌సభ స్థానాలున్న ఉత్తరప్రదేశ్ నుంచి ఏకంగా 45 కొత్తముఖాలు కనిపించునున్నాయి. వీరిలో టీవీ రాముడు అరుణ్ గోవిల్, జెయింట్ కిల్లర్ కిశోరీలాల్ శర్మ, దళిత హక్కుల ఉద్యమకారుడు చంద్రశేఖర్ ఆజాద్ తదితరులున్నారు. మహారాష్ట్రలో 48 స్థానాలుండగా 33 మంది తొలిసారిగా ఎంపీలుగా గెలిచారు. స్కూల్ టీచర్ భాస్కర్ భాగ్రే ఎన్సీపీ (పవార్) తరఫున ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గం డిండోరి నుంచి గెలుపొందారు. పీయూష్ గోయల్ కూడా లోక్‌సభకు రావడం ఇదే తొలిసారి. మాజీ ముఖ్యమంత్రులు నారాయణ్ రాణే (మహారాష్ట్ర), త్రివేంద్ర సింగ్ రావత్ (ఉత్తరాఖండ్), మనోహర్‌లాల్ ఖట్టర్ (హరియాణా), బిప్లవ్‌కుమార్ దేవ్ (త్రిపుర), జితిన్‌రామ్ మాంఝి (బిహార్), బస్వరాజ బొమ్మై (కర్నాటక), జగదీశ్ షెట్టర్ (కర్నాటక), చరణ్‌జిత్ సింగ్ చన్నీ (పంజాబ్)లు తొలిసారిగా దిగువసభలో అడుగుపెట్టనున్నారు. సినీ తారల్లో సురేష్ గోపి (త్రిసూర్), కంగనా రనౌత్ (మండి)లు తొలిసారి నెగ్గినవారే. రాజకుటుంబీకుల్లో ఛత్రపతి సాహు (కొల్హాపూర్), యదువీర్ కృష్ణదత్త చామరాజ వడయార్ (మైసూర్), కీర్తి దేవి దేవ్బర్మన్ (త్రిపుర ఈస్ట్)లు, ఎన్నికలకు ముందు హైకోర్టు జడ్జి పదవికి రాజీనామా చేసి బీజేపీ టికెట్‌పై పశి్చమబెంగాల్‌లోని తమ్లుక్ నుంచి పోటీ చేసిన గెలిచిన అభిజిత్ గంగోపాధ్యాయ్లు మొదటిసారి ఎంపీలుగా గెలిచిన వారే. ముస్లిం ఎంపీలు 24 మంది నూతన లోక్‌సభకు 24 మంది ముస్లిం ఎంపీలు ఎన్నికయ్యారు. మాజీ క్రికెటర్ యూసుఫ్ పఠాన్ (టీఎంసీ), అసదుద్దీన్ ఓవైసీ, అస్సాంలో 10 లక్షల పైచిలుకు మెజారిటీతో నెగ్గిన కాంగ్రెస్ అభ్యర్థి రకీబుల్ హుస్సేన్‌లు ఉన్నారు. ఈసారి మొత్తం 78 మంది ముస్లిం అభ్యర్థులు పోటీచేయగా 24 మంది గెలిచారు. కిందటి లోక్‌సభలో 26 మంది ముస్లిం ఎంపీలు ఉండగా.. ఈసారి వారి సంఖ్య రెండు తగ్గింది. కాంగ్రెస్ నుంచి అత్యధికంగా ఏడుగురు ముస్లిం ఎంపీలు ఎన్నికకాగా, తృణమూల్ కాంగ్రెస్ నుంచి ఐదుగురు, సమాజ్‌వాది నుంచి నలుగురు, ఇండియన్ ముస్లిం లీగ్ నుంచి ముగ్గురు ముస్లింలు ఎంపీలుగా గెలిచారు. -
‘రామాయణం’ రామునికి టీవీ సీత శుభాకాంక్షలు
రామానంద్ సాగర్ రూపొందించిన ‘రామాయణం’లో రాముని పాత్ర పోషించిన అరుణ్ గోవిల్ ప్రపంచవ్యాప్తంగా అభిమానులకు సంపాదించుకున్నారు. తాజాగా యూపీలోని మీరట్ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసిన ఆయన విజయం సాధించారు. దీంతో అరుణ్ గోవిల్‌కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.టీవీ షో ‘రామాయణం’లో సీత పాత్రలో కనిపించిన దీపికా చిఖాలియా కూడా అరుణ్ గోవిల్‌కు అభినందనలు తెలిపారు. అలాగే తన ఇన్‌స్టాలో ఒక వీడియోను షేర్ చేశారు. ఇందులో ఆమె అరుణ్ గోవిల్‌తో ముచ్చటిస్తున్న దృశ్యాలున్నాయి. క్యాప్షన్‌లో అరుణ్ గోవిల్‌కు అభినందనలు తెలిపారు.తన విజయం తర్వాత అరుణ్ గోవిల్ ఒక పోస్ట్‌ను షేర్ చేశారు. దాని క్యాప్షన్‌లో ‘మీరట్ లోక్‌సభ నియోజకవర్గపు ఓటర్లు, కార్యకర్తలు, అగ్ర నాయకత్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు. మీరందరూ నాపై నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ఇందుకు హృదయ పూర్వక ధన్యవాదాలు. నేను మీ నమ్మకాన్ని నిలబెట్టేందుకు ప్రయత్నిస్తాను...జై శ్రీరామ్’ అని పేర్కొన్నారు.బీజేపీ అభ్యర్థి అరుణ్ గోవిల్ తన సమీప ప్రత్యర్థి సమాజ్ వాదీ పార్టీకి చెందిన సునీతా వర్మపై 10,585 ఓట్ల తేడాతో గెలుపొందారు. అరుణ్ గోవిల్‌కు మొత్తం 5,46,469 ఓట్లు వచ్చాయి. -
వెంటనే ముంబైకి.. ‘టీవీ రాముడు’పై కాంగ్రెస్ విమర్శలు
ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ నుంచి పోటీ చేసిన నటుడు, బీజేపీ అభ్యర్థి అరుణ్ గోవిల్ ఎన్నికలు ముగిసిన వెంటనే ముంబైకి వెళ్లిపోవడంపై కాంగ్రెస్ విమర్శల దాడి చేసింది. ఆయన 'పారాచూట్ రాజకీయాలు' చేస్తున్నారని ఆరోపించింది.“మీరట్ నుంచి బీజేపీ అభ్యర్థిగా ఉన్న అరుణ్ గోవిల్ ఎన్నికలు ముగిసిన మరుసటి రోజునే ముంబైకి బయలుదేరినట్లు తెలిసింది. బహుశా ఆయన ప్రజల మధ్య ఉండడానికి కష్టపడి ఉండవచ్చు. ఈ వ్యక్తి నిన్న పోలింగ్ బూత్ లోపల వీడియోగ్రఫీ చేస్తున్నారు” అని యూపీ కాంగ్రెస్ చీఫ్ అజయ్ రాయ్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు.“అలాంటి నాయకుడు, నటుడి నుంచి దేవుడే మనల్ని రక్షించగలడు! చాలా మంది బీజేపీ నేతల విధానం ఇదే. వీరికి ప్రజల పట్ల, ప్రాంతం పట్ల పట్టింపు లేదు. వారు పారాచూట్ రాజకీయాలను మాత్రమే నమ్ముతారు” అని రాసుకొచ్చారు.టీవీ సీరియల్స్‌లో రాముడి పాత్రధారిగా ప్రసిద్ధి చెందిన అరుణ్ గోవిల్ కాంగ్రెస్ ఆరోపణలపై స్పందించారు. “మార్చి 24న హోలీ నాడు భారతీయ జనతా పార్టీ నా పేరును ప్రకటించింది. వారి సూచనల మేరకు నేను మార్చి 26న మీ మధ్యకు వచ్చాను. నెల రోజుల పాటు మీతో ఉండి మీ మద్దతుతో ఎన్నికల ప్రచారం చేశాను. ఎన్నికలు పూర్తయ్యాయి. మీ ప్రేమ, మద్దతు, గౌరవానికి నేను మీకు చాలా కృతజ్ఞుడను” అంటూ ‘ఎక్స్’ ద్వారా పేర్కొన్నారు.“ఇప్పుడు, పార్టీ సూచనల మేరకు, ఇక్కడ నా బాధ్యతలను నెరవేర్చడానికి నేను ముంబైలో ఉన్నాను. ఎన్నికల ప్రచారానికి నన్ను ఇతర ప్రాంతాలకు పంపాలని పార్టీ యోచిస్తోంది. ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే, మీరట్ ప్రజలు, కార్యకర్తలతో కలిసి మీ మధ్యే ఉంటాను” అన్నారు. -
రాముడికి ఓ బెంజ్.. 10 కోట్ల ఆస్తులు!
సాక్షి, నేషనల్ డెస్క్ : రఘుకులసోముడైన జగదభిరామునికి బెంజ్ కారేమిటా అనుకుంటున్నారా? ఇది జగదేక చక్రవర్తి శ్రీరాముడి గురించి కాదు. టీవీ రామాయణంలో రాముని పాత్రధారి అరుణ్ గోవిల్ గురించి! 80వ దశకంలో దూరదర్శన్‌లో వచ్చిన రామాయణం సీరియల్‌కు లభించిన ఆదరణ అంతా ఇంతా కాదు. ఆదివారమొస్తే చాలు.. ఉదయాన్నే దేశమంతా ‘వినుడు వినుడు రామాయణ గాథ’ను వింటూ టీవీలకు అతుక్కుపోయిన రోజలవి. ఇప్పటికీ అరుణ్ గోవిల్ ఎక్కడ కన్పించినా రామున్నే చూసినంత ఆనందంతో కాళ్లకు నమస్కరించి భక్తి పారవశ్యంలో మునిగిపోతుంటారు. ఇటీవలే బీజేపీలో చేరిన ఈ 72 ఏళ్ల టీవీ రాముడు యూపీలోని మీరట్ నుంచి లోక్‌సభ బరిలో ఉన్నారు. తనకు రూ.62.99 లక్షల విలువైన మెర్సిడెస్ బెంజ్‌తో పాటు రూ.3.19 కోట్ల చరాస్తులు, రూ.5.67 కోట్ల స్థిరాస్తులు, బ్యాంకులో రూ.1.03 కోట్లు, చేతిలో రూ.3.75 లక్షల నగదు ఉన్నట్టు ఎన్నికల అఫిడవిట్లో గోవిల్ వెల్లడించారు. రూ.14.64 లక్షల కారు రుణముందని చెప్పారు. సీరియల్లో రాక్షససంహారం చేసిన ఈ టీవీ రామునిపై ఎలాంటి క్రిమినల్ కేసులూ లేవండోయ్! 17 ఏళ్లకు సొంతూరికి... గోవిల్ పుట్టింది మీరట్లోనే. ముంబైలో స్థిరపడ్డారు. రాముడు 14 ఏళ్ల వనవాసం తర్వాత అయోధ్యలో అడుగుపెడితే ఈ టీవీ రాముడు 17 ఏళ్ల ‘సిటీ’వాసం తర్వాత సొంతూరికి చేరారు. ఆయన కోసం మీరట్‌లో 2009 నుంచి వరుసగా మూడుసార్లు గెలిచిన రాజేంద్ర అగర్వాల్‌ను బీజేపీ పక్కనబెట్టింది! సమాజ్‌వాదీ నుంచి అతుల్ ప్రధాన్, బీఎస్పీ తరఫున దేవవ్రత్ త్యాగి గోవిల్ ప్రత్యర్థులు. ‘‘ఈ ఎన్నికలతో నేను కొత్త ఇన్నింగ్స్ ప్రారంభిస్తున్నా. రాముడి ఆశీ్వర్వాదం తప్పకుండా ఉంటుంది’’ అని విశ్వాసం వెలిబుచ్చారు గోవిల్. అయోధ్య రామమందిర ప్రారంభ వేడుకల్లో ఆయన సీరియల్ సీత దీపికా చిఖలియా, లక్ష్మణుడు సునీల్ లాహరితో సహా పాల్గొనడం విశేషం. – -
స్మృతి ఇరానీని ప్రశంసిస్తూ అరుణ్ గోవిల్ ఏమన్నారు?
రామాయణం సీరియల్లో రాముని పాత్రలో నటించి జనాదారణ పొందిన నటుడు అరుణ్ గోవిల్ యూపీలోని మీరట్ నుంచి లోక్‌సభ ఎన్నికల బరిలోకి దిగారు. తనకు ప్రజల నుంచి మద్దతు లభిస్తున్నని అరుణ్ గోవిల్ తెలిపారు. తాజాగా మీడియాతో మాట్లాడిన ఆయన కేంద్ర మంత్రి స్మృతి ఇరానీని ప్రశంసించారు. ఆమెను కలుసుకోవడం ఆనందంగా ఉందని, ఆమె మంచి వక్తగా రాణిస్తున్నారని అన్నారు. మీరట్‌లో బీజేపీ అభ్యర్థి అరుణ్ గోవిల్, సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ)కి చెందిన సునీతా వర్మ, బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) అభ్యర్థి దేవవ్రత్ త్యాగి (బీఎస్పీ) మధ్య ప్రధాన పోటీ నెలకొంది. ఏప్రిల్ 26న మీరట్‌లో రెండో దశలో లోక్‌సభ ఓటింగ్ జరగనుంది. మీరట్‌లో సమాజ్‌వాదీ పార్టీ తన అభ్యర్థిని రెండుసార్లు మార్చింది. ముందుగా భాను ప్రతాప్ సింగ్‌ను రంగంలోకి దించింది. తరువాత అతుల్ ప్రధాన్‌ను ఎంపిక చేసినట్లు ప్రకటించింది. చివరిగా సునీతా వర్మకు టికెట్ కన్ఫర్మ్ చేసింది. #WATCH | Meerut, Uttar Pradesh: BJP leader Arun Govil says, "I am getting very good response from the public..." On his meeting with Union Minister Smriti Irani, he says, "It was nice to meet her... She is a very good speaker..." pic.twitter.com/vDybXaoMH7 — ANI (@ANI) April 7, 2024 అరుణ్ గోవిల్ టీవీ సీరియల్ రామాయణంలో శ్రీరాముని పాత్రను పోషించారు. ఈ సీరియల్ తర్వాత, అరుణ్ గోవిల్ ప్రేక్షకాదరణ పొందారు. ముగ్గురు దిగ్గజ నేతలు బరిలోకి దిగిన మీరట్ లోక్‌సభ స్థానానికి గట్టిపోటీ నెలకొనే అవకాశం ఉంది. ఎస్పీ అభ్యర్థి సునీతా వర్మ మాజీ ఎమ్మెల్యే యోగేష్ వర్మ భార్య. సునీతా వర్మ 2017లో బీఎస్పీ నుంచి మీరట్ మేయర్‌గా ఎన్నికయ్యారు. త్యాగి వర్గం నుండి వచ్చిన దేవవ్రత్ త్యాగిని బిఎస్పీ తన అభ్యర్థిగా ఎన్నిక చేసింది. -
నామినేషన్‌కు ‘శ్రీరాముడు’.. వెంట వచ్చిన జనం!
ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి అరుణ్ గోవిల్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు, కార్యకర్తలు ఆయన వెంటవచ్చారు. టీవీ రామాయణంలో శ్రీరాముని పాత్ర పోషించిన అరుణ్ గోవిల్‌ను చూసేందుకు జనం రోడ్లపైకి చేరారు. అరుణ్ గోవిల్ తన నామినేషన్‌కు ముందు రోడ్‌షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అరుణ్ గోవిల్ ఒక ట్వీట్లో ‘ఈ రోజు నా జీవితంలో అత్యంత ముఖ్యమైన రోజు. మీరట్‌కు సేవ చేసే అవకాశాన్ని ఆ శ్రీరాముడు నాకు కల్పించాడు. లోక్‌సభ నామినేషన్ వేసేందుకు బయలుదేరుతున్నాను..జై శ్రీరామ్’ అని రాశారు. దీనికి ముందు అరుణ్ గోవిల్ స్థానిక ఔఘద్‌నాథ్ ధామ్ ఆలయాన్ని సందర్శించారు. నామినేషన్ అనంతరం అరుణ్ గోవిల్ మీడియాతో మాట్లాడుతూ ‘ఇది నాకు కొత్త ఇన్నింగ్స్‌కు నాంది. నా స్వస్థలం నుంచి నన్ను అభ్యర్థిగా నిలబెట్టారు. ఇప్పుడు నేను నా ప్రజల కోసం పని చేయగలుగుతాను. రాముని ప్రతి రూపంలో నాకు ప్రజల నుంచి లభించిన ప్రేమ కంటే ఒక నేతగా మరింత ఆదరణ దొరుకుతుందని భావిస్తున్నాను’ అని పేర్కొన్నారు. -
ఎన్నికల్లో ‘శ్రీరాముడు’.. మీరఠ్‌లో జన్మించి..
టీవీ సీరియల్ ‘రామాయణం’లో శ్రీరాముని పాత్ర పోషించి ప్రేక్షకులను అలరించిన నటుడు అరుణ్ గోవిల్ యూపీలోని మీరట్ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ తరపున బరిలోగి దిగాడు. అరుణ్ గోవిల్కి స్టార్డమ్తో పాటు మీరఠ్తో అనుబంధం కూడా ఉంది. అరుణ్ గోవిల్ మీరఠ్ కాంట్‌లో 1958 జనవరి 12న జన్మించారు. అతని తండ్రి చంద్రప్రకాష్ గోవిల్ మీరట్ మునిసిపాలిటీలో హైడ్రాలిక్ ఇంజనీర్‌గా పనిచేశారు. అరుణ్ ప్రారంభ విద్యాభ్యాసం సరస్వతి శిశు మందిర్‌లో సాగింది. తరువాత ఆయన ప్రభుత్వ ఇంటర్ కళాశాలలో చదువుకున్నారు. అనంతరం చౌదరి చరణ్ సింగ్ విశ్వవిద్యాలయం నుంచి ఇంజినీరింగ్ విద్యను పూర్తి చేశారు. అరుణ్‌ను ప్రభుత్వ ఉద్యోగిగా చూడాలని అతని తండ్రి భావించారు. అయితే అరుణ్ నటనారంగంలోకి ప్రవేశించారు. ఆరుగురు సోదరులు, ఇద్దరు సోదరీమణులలో అరుణ్ నాల్గవవాడు. గోవిల్ నటి శ్రీలేఖను వివాహం చేసుకున్నారు. వీరికి సోనిక, అమల్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. 17 ఏళ్ల వయసులోనే అరుణ్ గోవిల్ ముంబైకి వెళ్లి నటునిగా అవకాశాల కోసం ప్రయత్నించారు. 1977లో హిందీ సినిమా 'పహేలీ' సినిమాలో అరుణ్‌కు అవకాశం దక్కింది. అయితే అరుణ్ గోవిల్‌కు ‘రామాయణం’ సీరియల్ ఎంతో పేరును తీసుకువచ్చింది. అరుణ్ పోషించిన రాముని పాత్ర ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయింది. ఆయనను సాక్షాత్తూ రామునిగా చూసినవారు కూడా ఉన్నారట. రామాయణం తర్వాత అరుణ్ గోవిల్ టీవీ ఇండస్ట్రీలో యాక్టివ్‌గా మారారు. పలు పౌరాణిక సీరియల్స్‌లో నటించారు. ఇప్పుడు మీరఠ్ నుంచి లోక్‌సభ ఎన్నికల బరిలోకి దిగిన అరుణ్ గోవిల్ భవితవ్యాన్ని కాలమే తేల్చి చెప్పనుంది. -
Lok sabha elections 2024: కంగనా రనౌత్, నవీన్ జిందాల్‌కు బీజేపీ టికెట్లు
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి మరో 111 మంది అభ్యర్థులతో అధికార బీజేపీ ఆదివారం ఐదో జాబితా విడుదల చేసింది. కేంద్ర మంత్రి అశి్వనీకుమార్ చౌబే, ఎంపీ వరుణ్ గాం«దీకి ఈసారి టికెట్లు నిరాకరించింది. బాలీవుడ్ నటి కంగనా రనౌత్, ప్రఖ్యాత టీవీ నటుడు అరుణ్ గోవిల్ అభ్యర్థిత్వం ఖరారయ్యింది. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఒడిశాలోని సంబాల్పూర్ నుంచి, బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా పూరీ నుంచి పోటీ చేయబోతున్నారు. సీనియర్ నేత మేనకా గాంధీ ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్పూర్ నుంచి, పిలిభిత్ నియోజకవర్గంలో వరుణ్ గాంధీ స్థానంలో ఉత్తరప్రదేశ్ మంత్రి జితిన్ ప్రసాద, ఇటీవల బీజేపీలో చేసిన సీతా సోరెన్ జార్ఖండ్‌లోని దుమ్కా స్థానం నుంచి పోటీకి దిగబోతున్నారు. టీవీ సీరియల్ రామాయణంలో రాముడి పాత్ర ధరించిన అరుణ్ గోవిల్ ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ నుంచి పోటీ చేయనున్నారు. ఆదివారమే బీజేపీలో చేరిన కాంగ్రెస్ మాజీ ఎంపీ నవీన్ జిందాల్ హరియాణాలోని కురు క్షేత్ర నుంచి, కలకత్తా హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అభిజిత్ బందోపాధ్యాయ పశ్చిమ బెంగాల్‌లోని తమ్లూక్ నుంచి పోటీ చేయబోతున్నారు. కేరళలోని వయనాడ్‌లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాం«దీపై కేరళ బీజేపీ అధ్యక్షుడు కె.సురేంద్రన్ పోటీకి దిగబోతున్నారు. కేంద్ర మాజీ మంత్రి అనంతకుమార్ హెగ్డేకు ఈసారి అవకాశం కలి్పంచలేదు. తన అభ్యరి్థత్వాన్ని బీజేపీ ఖరారు చేయడం పట్ల బాలీవుడ్ నటి, జాతీయ అవార్డు గ్రహీత కంగనా రనౌత్ ఆనందం వ్యక్తం చేశారు. ప్రజలకు సేవ చేసే అవకాశం కోసం ఎదురు చూస్తున్నానని ఆదివారం చెప్పారు. ఆమె తన స్వస్థలమైన హిమాచల్ ప్రదేశ్‌లోని మండీ నుంచి బీజేపీ టికెట్‌పై పోటీచేయబోతున్నారు. బీజేపీలో చేరడాన్ని గొప్ప గౌరవంగా భావిస్తున్నానని కంగనా రనౌత్ పేర్కొన్నారు. -
Ayodhya Ram Mandir: మరలా ఆ ముగ్గురి దర్శనం
రామానంద సాగర్ ‘రామాయణ్’ సీరియల్ రామాయణ గాధను ఇంటింటికీ తెచ్చింది. 1987లో ప్రసారమైన ఈ సీరియల్ ఆ రోజుల్లో ప్రపంచంలోనే ఎక్కువ మంది చూసిన సీరియల్. రాముడిగా అరుణ్ గోవిల్, సీతగా దీపికా చిక్లియా, లక్ష్మణుడిగా సునీల్ లహరీ ప్రేక్షకుల గుండెల్లో చెరగని స్థానం పొందారు. వీరు ముగ్గురూ మళ్లీ కనిపిస్తే? అదే ఆలోచన వచ్చింది అభిషేక్ ఠాకూర్ అనే నిర్మాతకు. అయోధ్యలో రామ మందిర ప్రతిష్ఠాపన సందర్భంగా ‘హమారే రామ్ ఆయేహై’ అనే పాటను సోను నిగమ్ గొంతులో రికార్డు చేయించి, అయోధ్య రామమందిర ప్రాంగణంలో, సరయూ నది ఒడ్డున చిత్రీకరించి విడుదల చేశాడు. ఆ పాటలో అరుణ్ గోవిల్, దీపిక, సునీల్ లహరీ... అయోధ్య ప్రాంగణంలో తిరుగాడటం... సాక్షాత్తు ఆ సీతారామ లక్ష్మణులు తిరిగిన భావనను భక్తులకు కలిగించింది. ‘హమారే రామ్ ఆయేహై’ పాట ఇప్పటికే కోటి వ్యూస్ దాటిపోయింది. ఇంకా ఎన్ని కోట్ల వ్యూస్ వస్తాయో చెప్పలేము. అరుణ్ గోవిల్, దీపికలు ఇప్పటికీ ఎక్కడ కనిపించినా పాద నమస్కారాలు చేసే ప్రేక్షకులు ఉన్నారు. ఇప్పుడు రామమందిర ప్రతిష్ఠాపన తర్వాత వారి కీర్తి మరింతగా విరాజిల్లనుంది. -
‘టీవీ రాముడి’ పాదాల చెంత అనారోగ్యంతో బాధపడుతున్న పిల్లాడిని ఉంచగానే..
‘ఆది పురుష్’ సినిమాపై జరుగుతున్న హంగామా ఇప్పట్లో చల్లారేలా లేదు. రామాయణం ఆధారంగా రూపొందించిన ఈ సినిమాను చూసినవారంతా దర్శకనిర్మాత రామానంద్‌సాగర్ రూపొందించిన టీవీ రామాయణాన్ని గుర్తు చేసుకుంటున్నారు. టీవీ రామాయణంలో రాముని పాత్ర పోషించిన నటుడు అరుణ్ గోవిల్ కూడా ‘ఆది పురుష్’ సినిమాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము రామాయణం రూపొందించినప్పుడు దానిని ఆధ్యాత్మికత ఉట్టిపడేలా తీర్చిదిద్దామని, అందుకే ఇప్పటికీ నాటి రామాయణం సీరియల్ ప్రజల హృదయాల్లో నిలిచిపోయిందన్నారు. సోషల్ మీడియాలో ‘ఆది పురుష్’సినిమాపై స్పందించిన ఆయన గతంలో తనకు ఎదురైన ఒక అనుభవాన్ని వివరించారు. గతంలో ఒకసారి తనను సాక్షాత్తూ శ్రీరామునిగా భావించిన ఒక మహిళ తన పాదాల చెంత అనారోగ్యంతో బాధపడుతున్న కుమారుడిని ఉంచిందన్నారు. అప్పుడు తాను అనారోగ్యంతో బాధపడుతున్న ఆ పిల్లివాడిని ఆసుపత్రికి తీసుకువెళ్లాలలని చెబుతూ, పిల్లాడి ఆరోగ్యం కోసం ప్రార్థించానన్నారు. తరువాత ఆమె తన చేతిని ఆ కుర్రాడి తలపై ఉంచాలని కోరిందన్నారు. తరువాత ఆమె ఆ పిల్లాడిని తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయిందన్నారు. మూడు రోజుల తరువాత ఆ మహిళ తన పిల్లాడిని తీసుకుని తిరిగి సెట్‌కు వచ్చిందని, అప్పుడు అక్కడున్నవారంతా ఆశ్చర్యపోయారన్నారు. ఆ పిల్లాడు అనారోగ్యం నుంచి కోలుకుని ఆడుకుంటున్నాడని అరుణ్ గోవిల్ తెలిపారు. దేశంలో శ్రీరామునిపై ప్రజలకు భక్తిశ్రద్ధలు ఆ స్థాయిలో ఉంటాయని అరుణ్ గోవిల్ దీనిని ఉదహరించారు. ఏ మతానికి సంబంధించిన సినిమా రూపొందించినా, అది విలువలతో కూడి ఉండాలని ఆయన సూచించారు. దేశంలోని ప్రజలు శ్రీరాముని పాత్రను ఎంతో గొప్పగా చూస్తారని, అందుకే ఓం రౌత్ రూపొందించిన రామాయణంలో విలువలు లేవని విమర్శిస్తున్నారన్నారు. రామాయణం రూపకల్పన విషయంలో తగిన విధంగా ఆలోచించి ఉంటే, ఇన్ని విమర్శలు వచ్చేవికావని, పైగా ప్రేక్షకులు మెచ్చుకునేవారన్నారు. ఇది కూడా చదవండి: ‘ఆదిపురుష్’ హనుమంతుని కండల రహస్యం ఇదేనట! -
‘ఆది పురుష్’ను చీల్చిచెండాడిన ‘టీవీ రాముడు’
దర్శకనిర్మాత రామానంద్ సాగర్ రూపొందించిన రామాయణం గతంలో టీవీలో ప్రసారమై, కొన్నేళ్ల పాటు ప్రేక్షకులను అమితంగా అలరించింది. దానిలో రాముని పాత్ర పోషించి, కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న నటుడు అరుణ్ గోవిల్ తాజాగా విడుదలైన ‘ఆది పురుష్’ సినిమాపై తన అభిప్రాయాన్ని నిర్మొహమాటంగా వెల్లడించారు. హీరో ప్రభాస్ నటించిన ‘ఆది పురుష్’ జూన్ 16న భారీ స్థాయిలో విడుదలయ్యింది. ఇది మొదలు ఈ సినిమాపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొందరికి రాముని లుక్ నచ్చకపోగా, మరికొందరికి హనుమంతుని భాష నచ్చలేదు. మరికొందరు అభిమానులు ‘ఆది పురుష్’లో కొన్ని సీన్స్‌పై లెక్కలేన్ని అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. తాజాగా అలనాడు టీవీలో ప్రసారమైన రామాయణంలో రాముని పాత్ర పోషించిన అరుణ్ గోవిల్ ‘ఆది పురుష్’ సినిమాపై తన అభిప్రాయం వ్యక్తం చేశారు. రామాయణం భారతీయ సంస్కృతికి ప్రతిబింబమని, అయితే ఇప్పుడు ఈ రామాయణం(సినిమా) గురించి రరకాల వాదనలు వినిపిస్తున్నాయన్నారు. రామాయణ కథను, రాముని స్వరూపాన్ని మార్చి చూపించాల్సిన అవసరం లేదన్నారు. ‘ఆధ్యాత్మికతకు అపహాస్యం’ రామాయణం మనకు ఒక ఆధ్యాత్మిక మార్గం. మనకు ధైర్యన్ని అందించే ఉత్తమ గ్రంథం. దీనిని ఎవరైనా అపహాస్యం చేస్తే, స్వీకరించాల్సిన అవసరం లేదు. రామాయణాన్ని ఆధునికమని, సంప్రదాయమని విడదీయడం తగదు. సినిమాలో స్పెషల్ ఎఫెక్ట్స్, ప్రెజెంటేషన్ విషయాన్ని పక్కన పెడితే, క్యారెక్టర్లను సరైన రీతిలో చూపించడం తప్పనిస అని అరుణ్ గోవిల్ పేర్కొన్నారు. రాముడు, సీత, హనుమంతుడు మొదలైన క్యారెక్టర్ల విషయంలో ఆధునికం, సంప్రదాయం అని విడదీయడం తగదు. ఈ క్యారెక్టర్ ఆద్యనంతాలు. అంటే ఎప్పటికీ ఒకేలా ఉండేవి. అందుకే అదే స్వరూపాన్ని ఈ సినిమాలో చూపిస్తే తప్పేముంది? అని ప్రశ్నించారు. ‘ఆది పురుష్’ సినిమా నిర్మాతలు దీనిని రూపొందించేముందు ఏ తరహా ప్రేక్షకులకు ఈ కథను చూపించాలనుకుంటున్నారో నిర్ణయించుకుని ఉండాల్సిందన్నారు. ‘ఇటువంటి భాష తగదు’ ‘ఆది పురుష్’ సినిమాలో వాడిన భాషపై పలు విమర్శలు వస్తున్నాయని అరుణ్ గోవిల్ ఆరోపించారు. ‘ఆది పురుష్’ సినిమాలో గౌరవప్రదమైన భాష వాడాలని అన్నారు. రామాయణ మూల భావనను తొలగించాల్సిన అవసరం ఏమివచ్చిందన్నారు. హాలీవుడ్ సినిమాల స్ఫూర్తితో రామాయణాన్ని చూపించాలనుకోవడం సరైనది కాదన్నారు. ఇది కూడా చదవండి: ‘మేం తీసింది రామాయణం కాదు’ -
బీజేపీలోకి ‘రాముడు’
న్యూఢిల్లీ: రామాయణం సీరియల్లో రాముడి పాత్రధారిగా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన నటుడు అరుణ్ గోవిల్(63) గురువారం బీజేపీలో చేరారు. బీజేపీ జనరల్ సెక్రటరీ దేవశ్రీ చౌదరి సమక్షంలో అరుణ్ గోవిల్ బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జైశ్రీరామ్ అనేది రాజకీయ నినాదం కాదన్నారు. భారతీయులకు అదొక జీవన విధానమని చెప్పారు. మన సంస్కృతి, సంప్రదాయాలను జైశ్రీరామ్ నినాదం ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు. -
నా పేరుతో ట్విటర్లో నకిలీ ఖాతా: గోవిల్
తన అసలు ప్రొఫైల్ ఫొటోతో సోషల్ మీడియా నకిలీ ఖాతా ఉందని నటుడు అరుణ్ గోవిల్ అభిమానులకు స్పషం చేశాడు. ఈ విషయాన్ని తన అసలు ట్విటర్ ఖాతాలో వీడియో ద్వారా గురువారం వెల్లడించారు. ‘కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు నేను ఇచ్చిన సందేశాన్ని చూసిన ప్రధాని నరేంద్ర మోదీ ట్విటర్లో కృతజ్ఞతలు తెలిపారు. ఈ క్రమంలో ఆయన నా పేరుపై ఉన్న నకిలీ ట్విటర్ ఖాతాకు ట్యాగ్ చేశారు. అప్పుడే తెలిసింది నా పేరుపై నకిలీ ట్విటర్ అకౌంట్ ఉందని’ అంటూ వీడియోలో చెప్పుకొచ్చారు. అంతేగాక తన పేరుపై ఉన్న నకిలీ ఖాతాను ఫాలో అవుతున్న అభిమానులు వెంటనే అన్‌ఫాలో కావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. (ఎక్తా కపూర్‌పై విరుచుకుపడ్డ ‘శక్తిమాన్’ హీరో) नमस्कार भाइयों एवं बहनो, एक आवश्यक सूचना आपको इस विडीओ के माध्यम से देना चाहता हूँ । आशा करताहूँ आप अवश्य समर्थन करेंगे !@realarungovil से विनती करें कि वो ऐसा ना करें ! pic.twitter.com/k7k9j8eWvi — Arun Govil (@arungovil12) April 6, 2020 కాగా రామనంద సాగర్ నిర్మించిన రామాయణంలో రాముడి పాత్ర పోషించాడు గోవిల్. రాముడి పాత్రతో ఆయన మంచి పేరు తెచ్చున్నారు. ప్రేక్షకుల నుంచి కూడా ఆయనకు అదరణ లభించింది. తన పేరుపై నకిలీ ఖాతా @realarungovil పేరుతో ఉందని.. తన అసలు ఖాతా @arungovil12 అని కూడా చెప్పారు. ఇక కరోనా వైరస్ మహమ్మారిని అరికట్టేందుకు దేశంలో లాక్డౌన్ అమలవుతున్న సంగతి తెలిసిందే. దీంతో సామాన్య ప్రజల నుంచి సెలబ్రిటీల వరకూ ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ క్రమంలో సినిమాలకు, సీరియల్స్‌కు సంబంధించిన షూటింగ్‌లు ఆగిపోవడంతో సిరియల్స్ను పునఃప్రసారం చేస్తున్న సంగతి తెలిసిందే. ‘మహభారతం’, ‘శక్తిమాన్’, ‘రామయణం’ కూడా మళ్లీ ప్రసారం చేస్తున్నారు. ఈ క్రమంలో తన ‘రామాయణాన్ని’ కూడా ప్రజలు తప్పకుండా చూస్తారని ఆశిస్తున్నట్లు గోవిల్ పేర్కొన్నారు. (‘నా భార్యకు హెల్ప్ చేస్తున్న జానీ సార్’) -
కార్పొరేటర్ హత్య.. ముంబై హైకోర్టు సంచలన తీర్పు
సాక్షి, ముంబై: ముంబై మాఫియా డాన్, మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్ స్టర్ అరుణ్ గావ్లీకి ముంబై హైకోర్టులో భారీ ఎదురుదెబ్బ తగిలింది. శివసేన కార్పొరేటర్ హత్య చేసులో అతనికి యావజ్జీవ కారాగార శిక్షను విధించింది. ఈ మేరకు దిగువ కోర్టు గతంలో ఇచ్చిన తీర్పును సోమవారం హైకోర్టు సమర్థించింది. హత్యకేసులో దాదాపు 11 ఏళ్లుగా నాగపూర్ సెంట్రల్ జైల్లో శిక్షను అనుభవిస్తున్న విషయం తెలిసిందే. కార్పొరేటర్‌ను అత్యంత దారుణంగా హత్య చేసినందుకు అరుణ్ మరణించే వరకు జైలు జీవితం గడపాలని కోర్టు తీర్పును వెలువరించింది. కాగా 2008లో హత్య రాజకీయ వివాదంలో శివసేన కార్పొరేటర్‌ను గావ్లీ హత్య చేసిన విషయం తెలిసిందే. ముంబైలో డాన్‌గా పేరొందిన ఆయన.. తొలుత శివసేనలో చేరి రాజకీయంగా ఎదగాలని విశ్వ ప్రయత్నాలు చేశాడు. అయితే కొద్ది కాలంలోనే ఆయన శివసేన నుంచి బహిష్కరణకు గురికావడంతో.. అఖిల భారతీయ సేన పేరుతో ఓ పార్టీని స్థాపించాడు. అదే పార్టీ నుంచి పోటీ చేసి 2004లో ఎమ్మెల్యేగా గెలుపొంది అసెంబ్లీలో అడుగుపెట్టాడు. అనంతరం 2008లో పోలీసులు అరెస్ట్ చేయడంతో అప్పటి నుంచి జైలు జీవితం అనుభవిస్తున్నాడు. తాజా శిక్షతో జీవితాంతం జైలు జీవితానికే పరిమితం కానున్నాడు. -
ఇరువురు జానకీలు ఒక్కచోట చేరిన వేళ...
దూర్‌దర్శన్‌లో ధారవాహికలు ప్రారంభమయిన తొలి నాళ్లలో వచ్చిన సంచలనం ‘రామాయణ్’. వాల్మీకి మహర్షి రచించిన ఆ అపురూప కావ్యాన్ని దృశ్యంగా మలచి ఏడాదిన్నర కాలం పాటు ప్రేక్షకులను అలరించింది. ఆదివారం వచ్చిందంటే చాలు ఎన్ని పనులున్నా ‘రామాయణ్’ ప్రసార సమయానికి మాత్రం టీవీల ముందు వాలిపోయేవారు. అంతలా జనాల్ని అలరించిన ఆ దృశ్యకావ్యంలో అరుణ్ గోవిల్ ‘శ్రీరాముడి’గా నటించగా, దీపికా చిఖాలియా ‘జానకి’గా అలరించింది . ‘రామాయణ్’లో వారు ప్రేక్షకులను ఎంతలా అలరించారంటే, వారనేదో టీవీ నటుల్లా కాక, దేవతా మూర్తులు ‘సీతారాముల్లా’నే ప్రేక్షకుల మదిలో నిలిచిపోయారు. నేటి కాలంలో కూడా పలు ఇతిహాసాలను తెరకెక్కితోన్నా, అలనాటి ‘రామాయణ్’ స్థానం ప్రత్యేకం. ఈ కాలం నటినటులతో 2008లో కూడా ‘రామాయణ్’ ధారావాహిక ప్రారంభమయ్యింది. ఇది కూడా ప్రేక్షకులను బాగానే అలరించింది. ఇందులో బొన్నెర్జి సీతా దేవి పాత్రలో నటించింది. అయితే ఈ మధ్య ముంబైలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆ నాటి సీత దీపికా చిఖాలియా, ఈ నాటి సీత బొన్నెర్జిలు ఇద్దరు ఒక్క చోట చేరడం జరిగింది. ఇంకేముంది ఇద్దరు జానకీలను తమ కెమరాల్లో బంధించేందుకు ఫోటోగ్రాఫర్లు పోటి పడ్డారు. ఈ సందర్భంగా బొన్నెర్జి, చిఖలియాతో దిగిన ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. దాంతో పాటు ‘ఈ నాటి సీత, ఆ నాటి సీతను కలిసింది. చాలా అద్భుతమైన, అరుదైన సందర్భం. నేను రామాయణలో నటించడానికి ఒప్పుకున్నప్పుడు మీ(చిఖాలియా) డీవీడీలను చూసి, అర్ధం చేసుకుని, తెలుసుకొని నటించాను. నిజంగా మీరోక లెజెండ్. ప్రేమతో’ అనే సందేశాన్ని పోస్టు చేశారు బొన్నెర్జి. ఇలా ఇద్దరు సీతలను ఒక్క చోట చూసిన అభిమానులు కూడా తెగ సంతోషిస్తున్నారు. వీరిద్దరి ఫోటోలను తెగ షేర్ చేస్తోన్నారు. When #Sita meets Sita ........ How I savoured this moment of meeting you @dipikkatopiwala my first work #ramayana was on the foundation of seeing your DVDs , understanding, forming knowledge. #legend................ lots of looooove. 🙏🏻🙏🏻🙏🏻 A post shared by Debina Bonnerjee (@debinabon) on Jul 29, 2018 at 2:07am PDT ఏనాటికైనా చెడుపై మంచే విజయం సాధిస్తుందనే ఇతివృత్తంతో వాల్మీకి రచించిన ఇతిహాసం రామాయణాన్ని సుభాష్ సాగర్, రామానంద్ సాగర్, ప్రేమ్ సాగర్లు నిర్మాతలుగా, రామానంద్, ఆనంద్ సాగర్, మోతీ సాగర్ దర్శకత్వంలో రామాయణ్‌ను తెరకెక్కించారు. దాదాపు 78 వారాలపాటు ప్రసారమయిన ఈ ధారావాహిక తొలి ఎపిసోడ్ 1986, జనవరి 25న ప్రారంభం అయ్యింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సీరియల్‌ను దాదాపు 65 కోట్ల మంది వీక్షించారు. -
రాముడు, సీత, రావణుడు.. అంతా ఒకటే పార్టీ!
రామాయణంలో సీతారాములు ఇద్దరూ ఒక చోట ఉంటారు కానీ, వాళ్లతో కలిసి రావణుడు ఉండటం ఎప్పుడైనా చూశారా? పురాణాలతో పాటు సినిమాల్లో కూడా ఎక్కడా అలా జరగదు కానీ.. రామానంద్ సాగర్ తీసిన సూపర్ హిట్ టీవీ సీరియల్ రామాయణంలోని రాముడు, సీత, రావణాసురుడు పాత్రధారులు ముగ్గురూ ఇప్పుడు ఒకటే పార్టీ.. బీజేపీలో ఉండబోతున్నారు. రావణాసురుడి పాత్ర ధరించిన అరవింద్ త్రివేదీ ఇప్పటికే బీజేపీ సభ్యుడు. ఆయన గుజరాత్ నుంచి రెండుసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. అలాగే సీత పాత్రధారిణి దీపికా చికాలియా కూడా రెండుసార్లు బీజేపీ తరఫున గుజరాత్ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. ఇక ఇప్పుడు తాజాగా.. రాముడి పాత్రధారి అరుణ్ గోవిల్ సైతం బీజేపీలో చేరుతున్నారు. మహాభారతంలో ధర్మరాజు పాత్ర పోషించిన గజేంద్ర చౌహాన్ కూడా ఇప్పటికే బీజేపీ సభ్యుడు. ఆయన ప్రస్తుతం పుణె ఫిలిం ఇన్స్టిట్యూట్ చైర్మన్‌గా ఉన్నారు. బీహార్ లేదా యూపీ అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది ముందు అరుణ్ గోవిల్ బీజేపీలో చేరుతారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇంతకుముందు బీజేపీతో పాటు కాంగ్రెస్ నుంచి కూడా ఆహ్వానాలు వచ్చినా.. అరుణ్ గోవిల్ తిరస్కరించారు. కానీ ఇప్పుడు ఆయన రాజకీయాల్లోకి రావడంతో పాటు.. బీజేపీలోనే చేరుతానని కూడా చెబుతున్నారు.