‘ఆది పురుష్’ సినిమాపై జరుగుతున్న హంగామా ఇప్పట్లో చల్లారేలా లేదు. రామాయణం ఆధారంగా రూపొందించిన ఈ సినిమాను చూసినవారంతా దర్శకనిర్మాత రామానంద్‌సాగర్ రూపొందించిన టీవీ రామాయణాన్ని గుర్తు చేసుకుంటున్నారు.
టీవీ రామాయణంలో రాముని పాత్ర పోషించిన నటుడు అరుణ్ గోవిల్ కూడా ‘ఆది పురుష్’ సినిమాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము రామాయణం రూపొందించినప్పుడు దానిని ఆధ్యాత్మికత ఉట్టిపడేలా తీర్చిదిద్దామని, అందుకే ఇప్పటికీ నాటి రామాయణం సీరియల్ ప్రజల హృదయాల్లో నిలిచిపోయిందన్నారు.
సోషల్ మీడియాలో ‘ఆది పురుష్’సినిమాపై స్పందించిన ఆయన గతంలో తనకు ఎదురైన ఒక అనుభవాన్ని వివరించారు. గతంలో ఒకసారి తనను సాక్షాత్తూ శ్రీరామునిగా భావించిన ఒక మహిళ తన పాదాల చెంత అనారోగ్యంతో బాధపడుతున్న కుమారుడిని ఉంచిందన్నారు.
అప్పుడు తాను అనారోగ్యంతో బాధపడుతున్న ఆ పిల్లివాడిని ఆసుపత్రికి తీసుకువెళ్లాలలని చెబుతూ, పిల్లాడి ఆరోగ్యం కోసం ప్రార్థించానన్నారు. తరువాత ఆమె తన చేతిని ఆ కుర్రాడి తలపై ఉంచాలని కోరిందన్నారు. తరువాత ఆమె ఆ పిల్లాడిని తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయిందన్నారు.
మూడు రోజుల తరువాత ఆ మహిళ తన పిల్లాడిని తీసుకుని తిరిగి సెట్‌కు వచ్చిందని, అప్పుడు అక్కడున్నవారంతా ఆశ్చర్యపోయారన్నారు. ఆ పిల్లాడు అనారోగ్యం నుంచి కోలుకుని ఆడుకుంటున్నాడని అరుణ్ గోవిల్ తెలిపారు.
దేశంలో శ్రీరామునిపై ప్రజలకు భక్తిశ్రద్ధలు ఆ స్థాయిలో ఉంటాయని అరుణ్ గోవిల్ దీనిని ఉదహరించారు. ఏ మతానికి సంబంధించిన సినిమా రూపొందించినా, అది విలువలతో కూడి ఉండాలని ఆయన సూచించారు.
దేశంలోని ప్రజలు శ్రీరాముని పాత్రను ఎంతో గొప్పగా చూస్తారని, అందుకే ఓం రౌత్ రూపొందించిన రామాయణంలో విలువలు లేవని విమర్శిస్తున్నారన్నారు. రామాయణం రూపకల్పన విషయంలో తగిన విధంగా ఆలోచించి ఉంటే, ఇన్ని విమర్శలు వచ్చేవికావని, పైగా ప్రేక్షకులు మెచ్చుకునేవారన్నారు.
ఇది కూడా చదవండి: ‘ఆదిపురుష్’ హనుమంతుని కండల రహస్యం ఇదేనట!
Comments
Please login to add a commentAdd a comment