
ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి అరుణ్ గోవిల్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు, కార్యకర్తలు ఆయన వెంటవచ్చారు. టీవీ రామాయణంలో శ్రీరాముని పాత్ర పోషించిన అరుణ్ గోవిల్‌ను చూసేందుకు జనం రోడ్లపైకి చేరారు.
అరుణ్ గోవిల్ తన నామినేషన్‌కు ముందు రోడ్‌షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అరుణ్ గోవిల్ ఒక ట్వీట్‌లో ‘ఈ రోజు నా జీవితంలో అత్యంత ముఖ్యమైన రోజు. మీరట్‌కు సేవ చేసే అవకాశాన్ని ఆ శ్రీరాముడు నాకు కల్పించాడు. లోక్‌సభ నామినేషన్ వేసేందుకు బయలుదేరుతున్నాను..జై శ్రీరామ్’ అని రాశారు. దీనికి ముందు అరుణ్ గోవిల్ స్థానిక ఔఘద్‌నాథ్ ధామ్ ఆలయాన్ని సందర్శించారు.
నామినేషన్ అనంతరం అరుణ్ గోవిల్ మీడియాతో మాట్లాడుతూ ‘ఇది నాకు కొత్త ఇన్నింగ్స్‌కు నాంది. నా స్వస్థలం నుంచి నన్ను అభ్యర్థిగా నిలబెట్టారు. ఇప్పుడు నేను నా ప్రజల కోసం పని చేయగలుగుతాను. రాముని ప్రతి రూపంలో నాకు ప్రజల నుంచి లభించిన ప్రేమ కంటే ఒక నేతగా మరింత ఆదరణ దొరుకుతుందని భావిస్తున్నాను’ అని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment