Campain
-
బీజేపీపై వసుంధరా రాజే అలక?
దేశవ్యాప్తంగా ఏడు దశల్లో లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నాయి. వీటిలో ఇప్పటికే నాలుగు దశల పోలింగ్ ముగిసింది. పలువురు నేతలు ఎన్నికల ప్రచారాల్లో తలమునకలై ఉన్నారు. అయితే రాజస్థాన్‌లో బీజేపీకి చెందిన ఓ మహిళా నేత ఇందుకు భిన్నమైన పరిస్థితిలో కనిపిస్తున్నారు.రాజస్థాన్‌కు చెందిన బీజేపీ రాష్ట్ర స్థాయి నేతలంతా వివిధ రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు. అయితే మాజీ సీఎం, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు వసుంధర రాజే ఏ రాష్ట్రంలోనూ ఎన్నికల ప్రచారానికి వెళ్లకపోవడం విశేషం. రాజస్థాన్‌లోని ఏ లోక్‌సభ స్థానంలోనూ ప్రచారం చేసేందుకు ఆమె ఆసక్తి చూపలేదు. రాష్ట్ర అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి, ఉపాధ్యక్షుడు, కార్యదర్శి, రాష్ట్ర అధికార ప్రతినిధి సైతం ఇతర రాష్ట్రాల్లో జరుగుతున్న ప్రచారాల్లో పాల్గొంటున్నారు.వసుంధర రాజే రాజస్థాన్‌లోని బరన్-జలావర్ లోక్‌సభ స్థానంలో మినహా మరెక్కడా ప్రచారం నిర్వహించలేదు. గత లోక్‌సభ ఎన్నికల్లో ఆమె రాష్ట్రంలోని అన్ని లోక్‌సభ ఎన్నికల్లో యాక్టివ్‌గా వ్యవహరించారు. ఇప్పుడు ఆమె పచారపర్వానికి దూరంగా ఉండటం పలు చర్చలకు దారితీస్తోంది.రాజస్థాన్‌లో లోక్‌సభకు రెండు దశల్లో పోలింగ్ జరిగింది. మొదటి దశలో కొన్ని సీట్లలో వసుంధర రాజే సమావేశాలు, ర్యాలీల గురించి చర్చ జరిగింది. అక్కడి నేతలు వసుంధర రాజే రాకను కోరుకున్నారు. అయితే అది కార్యరూపం దాల్చలేదు. రెండవ దశలో ఝలావర్లోనే ఓటింగ్ ఉండటంతో పైగా అది తన కుమారుని సీటు కావడంతో ఆమె ప్రచారం నిర్వహించారు. అయితే మూడో దశలో ఆమెను మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రలలో జరిగే ప్రచారాలకు పంపేందుకు బీజేపీ సన్నాహాలు చేసింది. అయినా ఆమె ఏ సమావేశంలోనూ కనిపించలేదు.రాజస్థాన్‌కు చెందిన బీజేపీ నేతలు దక్షిణాది రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో జరిగిన ఎన్నికల ప్రచారాల్లో పాల్గొన్నారు. రాజస్థాన్ బీజేపీ అధ్యక్షుడు సీపీ జోషి నెల రోజులు ఒడిశాలోనే ఉంటూ ప్రచారం సాగించారు. పశ్చిమ బెంగాల్లోనూ రాజస్థాన్‌కు చెందిన ఒక మంత్రి ప్రచారం నిర్వహించారు. హర్యానాలోనూ రాజస్థాన్ బీజేపీ నేతలు ప్రచారాలు సాగించారు. ఢిల్లీ, యూపీలలోనూ బీజేపీ మహిళా నేతలు ప్రచార విధులను చేపట్టారు. వీటిలో ఎక్కడా వసుంధరా రాజే కనిపించకపోవడం పలు చర్చలకు దారితీస్తోంది. -
షీలా లేని లోటు.. ఢిల్లీ కాంగ్రెస్‌కు గడ్డుకాలం?
సుదీర్ఘకాలం పాటు ఢిల్లీ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించిన కాంగ్రెస్ నేత షీలా దీక్షిత్ సారధ్యం లేకుండా తొలిసారిగా ఆ పార్టీ లోక్‌సభ ఎన్నికల బరిలోకి దిగుతోంది. 2019 జూలై 20న షీలా దీక్షిత్ కన్నుమూశారు. రెండున్నర దశాబ్దాల తర్వాత తొలిసారిగా ఢిల్లీలో కాంగ్రెస్ ఈ విధమైన పరిస్థితిని ఎదుర్కొంటోంది. షీలా దీక్షిత్ కన్నుమూయడం, పార్టీ సీనియర్ నేతల్లో చాలామందికి వయసు మీద పడటంతో రాబోయే లోక్‌సభ ఎన్నికల నిర్వహణ బాధ్యత రాష్ట్ర అధ్యక్షుడు అరవిందర్ సింగ్ లవ్లీ భుజస్కంధాలపై పడింది. ఢిల్లీలోని మూడు లోక్‌సభ స్థానాల అభ్యర్థుల గెలుపు బాధ్యత లవ్లీపైననే ఉంది. దీనితోపాటు ఇండియా కూటమిలోని నాలుగు సీట్ల విషయంలో అతను ‘ఆప్’కు సహకరించాల్సి ఉంటుంది. 1984 నవంబర్ నాటి అల్లర్ల కేసులో కాంగ్రెస్ నేత సజ్జన్ కుమార్ దోషిగా తేలడంతో జైలులో ఉన్నారు. ఇదే కేసులో మరో నేత జగదీష్ టైట్లర్ దశాబ్దన్నర కాలంగా పలు సమస్యలను ఎదుర్కొంటున్నారు. రాష్ట్ర కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు సుభాష్ చోప్రాతో పాటు షీలా ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న నేతలలోని పలువురు వృద్ధాప్య దశకు చేరారు. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీని రాబోయే ఎన్నికల్లో ముందుకు నడిపించే బాధ్యత లవ్లీపైనే ఉంది. గతంలో ఈశాన్య ఢిల్లీ స్థానం నుంచి లవ్లీ పోటీ చేస్తారనే వార్తలు వినిపించాయి. అయితే ఎన్నికల బాధ్యతలు చేపట్టాల్సి రావడంతో లవ్లీ తాను రాబోయే ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నారు. ఆయనతో పాటు కేంద్ర మాజీ మంత్రి, రాష్ట్ర కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు అజయ్ మాకెన్ కూడా ఎన్నికల బాధ్యతలు చేపట్టి జాతీయ రాజకీయాల్లో క్రియాశీలకంగా మారారు. షీలా దీక్షిత్ నాయకత్వంలో ఢిల్లీ కాంగ్రెస్ 1999 లోక్‌సభ ఎన్నికలు మొదలుకొని అన్ని ఎన్నికల్లోనూ పోటీచేస్తూ వచ్చింది. 2004, 2009 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఆమె భారీ విజయాన్ని అందించారు. 2014లో ఆమె కేరళ గవర్నర్‌గా ఉన్నందున ఆమె నేరుగా లోక్‌సభ ఎన్నికల్లో జోక్యం చేసుకోలేకపోయారు. అయితే ఆమె కుమారుడు సందీప్ దీక్షిత్ తూర్పు ఢిల్లీ స్థానం నుంచి పోటీ చేశారు. ఆరోగ్యం సహకరించకపోయినా షీలా 2019 లోక్‌సభ ఎన్నికల బాధ్యతలు చేపట్టారు. రాష్ట్ర అధ్యక్షురాలిగా ఉంటూనే ఈశాన్య ఢిల్లీ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎన్నికల్లో ఆమె పోటీ చేశారు. షీలాతో సహా కాంగ్రెస్ అభ్యర్థులంతా ఓడిపోయినా, షీలా నాయకత్వంలో పార్టీకి జవసత్వాలు వచ్చాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓట్ల శాతం పెరిగింది. ఐదు లోక్‌సభ స్థానాల్లో కాంగ్రెస్ రెండో స్థానంలో నిలిచింది. అంతకు ముందు 2014 ఎన్నికల్లో మొత్తం ఏడు స్థానాల్లో కాంగ్రెస్ మూడో స్థానంలో ఉంది. -
నామినేషన్‌కు ‘శ్రీరాముడు’.. వెంట వచ్చిన జనం!
ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి అరుణ్ గోవిల్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు, కార్యకర్తలు ఆయన వెంటవచ్చారు. టీవీ రామాయణంలో శ్రీరాముని పాత్ర పోషించిన అరుణ్ గోవిల్‌ను చూసేందుకు జనం రోడ్లపైకి చేరారు. అరుణ్ గోవిల్ తన నామినేషన్‌కు ముందు రోడ్‌షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అరుణ్ గోవిల్ ఒక ట్వీట్లో ‘ఈ రోజు నా జీవితంలో అత్యంత ముఖ్యమైన రోజు. మీరట్‌కు సేవ చేసే అవకాశాన్ని ఆ శ్రీరాముడు నాకు కల్పించాడు. లోక్‌సభ నామినేషన్ వేసేందుకు బయలుదేరుతున్నాను..జై శ్రీరామ్’ అని రాశారు. దీనికి ముందు అరుణ్ గోవిల్ స్థానిక ఔఘద్‌నాథ్ ధామ్ ఆలయాన్ని సందర్శించారు. నామినేషన్ అనంతరం అరుణ్ గోవిల్ మీడియాతో మాట్లాడుతూ ‘ఇది నాకు కొత్త ఇన్నింగ్స్‌కు నాంది. నా స్వస్థలం నుంచి నన్ను అభ్యర్థిగా నిలబెట్టారు. ఇప్పుడు నేను నా ప్రజల కోసం పని చేయగలుగుతాను. రాముని ప్రతి రూపంలో నాకు ప్రజల నుంచి లభించిన ప్రేమ కంటే ఒక నేతగా మరింత ఆదరణ దొరుకుతుందని భావిస్తున్నాను’ అని పేర్కొన్నారు. -
ఓటు వేయకుంటే రూ. 350 జరిమానా? నిజమెంత?
దేశంలో ఒకవైపు లోక్‌సభ, కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సన్నాహాలు జరుగుతుండగా, మరోవైపు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ వైరల్‌గా మారింది. రాబోయే ఎన్నికల్లో ఓటు వేయని వారికి రూ. 350 జరిమానా ఉంటుందని, ఈ మెత్తం సదరు ఓటరు బ్యాంకు ఖాతా నుంచి కట్ అవుతుందని ఆ పోస్టులో తెలిపారు. బ్యాంకు ఖాతాల్లో డబ్బు లేని ఓటర్లు.. వారు మొబైల్ రీఛార్జ్ చేసుకునేటప్పుడు వారి నగదు జరిమానా కింద కట్ అవుతుందని కూడా ఆ పోస్ట్‌లో తెలియజేస్తున్నారు. ఈ ఉదంతంపై ఎన్నికల సంఘం స్పందించింది. ఇది పూర్తిగా అవాస్తవమని, కమిషన్ అలాంటి నిర్ణయం ఏదీ తీసుకోలేదని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. భారత ప్రభుత్వ ప్రెస్ ఏజెన్సీ అయిన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) కూడా ఈ ప్రచారం అబద్ధమని పేర్కొంది. ఇలాంటి తప్పుదోవ పట్టించే ప్రకటనలను షేర్ చేయవద్దని పీఐబీ ప్రజలను కోరింది. 𝗙𝗮𝗹𝘀𝗲 𝗰𝗹𝗮𝗶𝗺 : नहीं दिया वोट तो बैंक अकाउंट से कटेंगे 350 रुपएः आयोग 𝗥𝗲𝗮𝗹𝗶𝘁𝘆 : यह दावा फर्जी है, चुनाव आयोग द्वारा ऐसा कोई निर्णय नहीं लिया गया है।#FakeNews #ECI #VerifyBeforeYouAmplify pic.twitter.com/yqnzWwrw6E — Election Commission of India (@ECISVEEP) April 2, 2024 -
పాక్ ఎన్నికల్లో హిందూ మహిళ.. ముస్లింల మద్దతు!
ఫిబ్రవరి 8న పాకిస్తాన్లో సాధారణ ఎన్నికలు జరగనున్నాయి. అభ్యర్థులంతా విరివిగా ప్రచారాలు సాగిస్తున్నారు. ఈ నేపధ్యంలో ఎన్నికల బరిలో నిలిచిన హిందూ మహిళ సవీరా ప్రకాష్ వార్తల్లో నిలిచారు. పాక్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న తొలి హిందూ మహిళగా ఆమె గుర్తింపు పొందారు. హిందువు అయినప్పటికీ, ముస్లిం ప్రాబల్యం కలిగిన ప్రాంతాలలో ఆమె ప్రచారం సాగించినప్పుడు ఆమెకు విపరీతమైన ఆదరణ లభిస్తోంది. సవీరా ప్రకాష్ పాకిస్తాన్‌లోని ఖైబర్ పఖ్తున్ఖ్వాలోని బునెర్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) ఆమెకు టికెట్ ఇచ్చింది. సవీరా వృత్తిరీత్యా వైద్యురాలు. ఆమె తండ్రి పేరు ఓం ప్రకాష్. ఆయన పీపీపీలో సభ్యునిగా ఉన్నారు. ఆయన వైద్య వృత్తిలో రాణిస్తున్నారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా మీడియాతో సవీరా ప్రకాష్ మాట్లాడుతూ తాను భారత్-పాక్ మధ్య సత్సంబంధాలకు వారధిగా పని చేయాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. తాను డాక్టర్‌నని, పాక్‌లోని ఆసుపత్రుల్లో పరిస్థితులను మెరుగుపరిచేందుకే రాజకీయాల్లోకి వచ్చానని ఆమె తెలిపారు. సవీరా 2022లో మెడికల్ కాలేజీ నుండి పట్టా పుచ్చుకున్నారు. బునర్ అసెంబ్లీలో పీపీపీ పార్టీ మహిళా విభాగానికి ప్రధాన కార్యదర్శిగా కూడా వ్యవహరిస్తున్నారు. ఆమె చాలా కాలంగా తండ్రితోపాటు పలు సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. పాకిస్తాన్లో మహిళల అభ్యున్నతి, ఆరోగ్య సేవలను మెరుగుపరిచేందుకు ఆమె కృషి చేస్తున్నారు. ఇదిలావుండగా పాక్ ఎన్నికలకు ముందు గత మూడు రోజులుగా కరాచీ, బలూచిస్థాన్‌లోని ఎన్నికల సంఘం కార్యాలయాల వెలుపల పేలుళ్లు జరిగాయి. -
ఏడు టీకాలతో 7-స్టార్ రక్షణ : పిల్లల టీకాలపై జీఎస్కే ప్రచారం
ప్రముఖ ఫార్మా సంస్థ గ్లాక్సో స్మిత్‌క్లైన్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ (GSK) పిల్లలకు క్లిష్టమైన రక్షణను అందించే టీకాల గురించి అవగాహన కల్పిస్తోంది. ఒకటి నుండి రెండేళ్ల మధ్య వయస్సున్న పిల్లలకు అందించాల్సిన టీకాలపై జనవరి 25 నుంచి ప్రచారాన్ని ప్రారంభించింది. 1-2 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు ఏడు కీలకమైన టీకాల ద్వారా '7-స్టార్ ప్రొటెక్షన్' అందించాలంటూ తల్లిదండ్రులను కోరుతోంది. ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ (IAP) పిల్లలకు ఏడు టీకాలును సిఫార్సు చేస్తోంది, చికెన్‌పాక్స్ హెపటైటిస్ ‘ఏ’ తొలి డోస్ , ఎంఎంఆర్ (MMR) మెనింజైటిస్ రెండో డోస్, పీసీవీ DTP Hib IPV బూస్టర్ డోస్, ఫ్లూ వార్షిక మోతాదు ప్రధానంగా ఉన్నాయి. పలు రకాల ఇన్ఫెక్షన్లనుంచి కాపాడి, రోగ నిరోధక వ్యవప్తను బలోపేతం చేసే టీకాలు వేయవలసిన అవసరంపై తల్లిదండ్రుల్లో అవగాహన కల్పిస్తోంది. బిడ్డ పుట్టిన తొలి ఏడాదిలో టీకాలపై ఎక్కువ ఆసక్తి ఉన్నప్పటికీ, రెండో సంవత్సరంలో టీకాలు వేయించుకోని వారి సంఖ్య పెరుగుతోందని జీఎస్కే తెలిపింది. దీంతో పాక్షికంగా టీకాలు తీసుకుంటున్న పిల్లల సంఖ్య దేశంలో బాగా పెరుగుతోందని పేర్కొంది. అంటే తొలి ఏడాది శ్రద్దగా వాక్సీన్లు వేయించిన తల్లిదండ్రులు, రెండో ఏడాదికి వచ్చేసరికి మునుపటి శ్రద్ధ చూపించడలేదు. అలా కాకుండా క్రమంగా తప్పకుండా పిల్లలకు టీకాలు వేయిస్తే వారి ఆరోగ్య భవిష్యత్తుకు బంగారు బాట వేసినట్టు అవుతుందనే సందేశంతో జీఎస్కే ఈ ప్రచారాన్ని చేపట్టింది. పాక్షికవ్యాక్సినేషన్ వల్ల పిల్లల్ని తీవ్రమైన సమస్యలకు గురి చేస్తుందని జీఎస్కే చెబుతోంది. అందుకే రెండో సంవత్సరంలో కూడా క్రమం తప్పకుండా టీకాలు వేయించాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతుంది. ఇది పిల్లల్ని చాలా రోగాల నుంచి పిల్లలను కాపాడుతుందంటోంది. అలాగే రెండో ఏడాదిలో టీకాలను తీసుకోని పిల్లలు స్వయంగా ప్రమాదంలో పడటంతోపాటు, ఇంట్లో వారి మిగిలిన తోబుట్టువులను, అమ్మమ్మ తాత,నానమ్మ తదితర వృద్ధులకు ఇన్ఫెక్షన్ వ్యాపించి వారిని మరింత ప్రమాదంలో పడేసే అవకాశం ఉందని కంపెనీ పత్రికా ప్రకటన తెలిపింది. టీకాలతో నివారించగలిగే చికెన్‌పాక్స్, మీజిల్స్ , ఫ్లూ వంటి వ్యాధులు గత మూడేళ్లలో దేశంలో బాగా వ్యాపించాయని జీఎస్కే ఇండియా ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ , మెడికల్ అఫైర్స్, డాక్టర్ రష్మీ హెగ్డే తెలిపారు. పిల్లల అభివృద్ధిపై టీకాల దీర్ఘకాలిక ప్రభావాన్ని నొక్కి వక్కాణించిన ఆయన సంబంధిత టీకాలను పూర్తి చేయడం ద్వారా ఆరోగ్య కరమైన సంతోషకరమైన బాల్యం అందించినట్టు అవుతుందన్నారు. రెండేళ్ల వయసున్న పిల్లల ఎదుగుదలకు భరోసా ఇచ్చే టీకాల గురించి తెలిదండ్రులకు అవగాహన కల్పించడమే తమ ప్రచార లక్ష్యమని హెగ్డే వెల్లడించారు. దేశవ్యాప్తంగా ఉన్న పిల్లల వైద్యుల క్లినిక్‌లలో టెలివిజన్, సోషల్ మీడియా, పోస్టర్లు వంటి బహుళ ఛానెల్‌లలో ప్రచారాన్ని ప్రారంభించింది. అలాగే తల్లిదండ్రులు తమ పిల్లలకు టీకా వివరాలపై మరింత సమాచారం కోసం శిశు వైద్యులను సంప్రదించాలి. 7 కీలకమైన VPDల గురించి అదనపు సమాచారాన్ని MyVaccinationHub.inలో కూడా పొందవచ్చు. -
హిమాలయాలు క్యాన్సిల్.. ప్రచారం షురూ: ఉమాభారతి యూటర్న్!
మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఉమాభారతి తన హిమాలయాల పర్యటనను రద్దు చేసుకుని, రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి సిద్ధమయ్యారు. నవంబర్ 9 నుంచి ఆమె ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఆమె సిల్వానీలోని బమ్‌హోరీ, సాగర్‌లోని సుర్ఖీలో ఎన్నికల ర్యాలీలు నిర్వహించనున్నారు. అయితే దీనికి ముందు ఉమాభారతి ఎన్నికల ప్రచారాన్ని నిరాకరించి, తాను హిమాలయాలకు వెళుతున్నట్లు ప్రకటించారు. దీంతో బీజేపీ స్టార్ క్యాంపెయినర్ లిస్టులో ఆమె పేరు నమోదు కాలేదు. అయితే ఆ తరువాత ఆమె మనసు మార్చుకుని, ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ అభ్యర్థన మేరకు ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలని నిర్ణయించుకున్నారు. కొద్దిరోజుల క్రితం ఉమాభారతి లలిత్పూర్ రైల్వే స్టేషన్లో స్వల్పంగా గాయపడ్డారు. ఆమె ఎడమ కాలికి గాయం అయ్యింది. తరువాత ఆమె ఝాన్సీలో ఫిజియోథెరపీ చేయించుకున్నారు. తరువాత వైద్యుల సూచన మేరకు భోపాల్‌లో చికిత్స పొందుతున్నారు. కాగా ఆమె వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్నారు. తాను 2019 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయలేదని, రాబోయే 2024 లోక్‌సభ ఎన్నికల్లో తాను పోటీ చేయాలనుకుంటున్నానని ఇటీవల స్పష్టం చేశారు. ఇది కూడా చదవండి: దీపోత్సవానికి అయోధ్య ముస్తాబు -
Video: డెలివరీ బాయ్ స్కూటర్‌పై రాహుల్ గాంధీ చక్కర్లు..
-
కర్నాటక ఎన్నికల వేళ బీజేపీ కీలక నిర్ణయం..
సాక్షి, హైదరాబాద్: కర్నాటకలో అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయం రసవత్తరంగా మారిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అధికార బీజేపీతో సహా కాంగ్రెస్, జేడీఎస్ వ్యూహాలు రచిస్తోంది. ఇక, అసెంబ్లీ ఎన్నికల వేళ బీజేపీ సంచలన నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రంలో పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు, సీనియర్లను కాదని కొత్త వారికి అవకాశం కల్పించింది. ఇదిలా ఉండగా.. ఎన్నికల ప్రచారం కోసం బీజేపీ సరికొత్త ప్రయోగానికి తెర లేపింది. కాగా కర్నాటక ఎన్నికల ప్రచారానికి బీజేపీ జాతీయ నాయకత్వం తెలంగాణ నేతలను ఎంపిక చేసింది. మొత్తం 13 రాష్ట్రాల నుంచి కర్నాటక ఎన్నికల ప్రచారానికి నేతలను ఎంపిక చేయగా.. 20 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్‌ఛార్జ్‌లుగా తెలంగాణ నేతలను నియమిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో, వీరంతా వారికి కేటాయించిన నియోజకవర్గాలకు బయలుదేరారు. ఎన్నికల ప్రచారంలో దూసుకుపోనున్నారు. అయితే, ఇన్‌ఛార్జ్‌లుగా నియమించిన వారిలో బీజేపీ నేతలు లక్ష్మణ్, అర్వింద్, జితేందర్‌రెడ్డి, వివేక్ వెంకటస్వామి, రఘునందన్‌రావు, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, ఇంద్రసేనారెడ్డి, గరికపాటి, బండ కార్తీకరెడ్డి, కొల్లి మాధవి, ఎస్ కుమార్ ఉన్నారు. ఇక, లక్ష్మణ్‌తో సహా మరికొందరికి నియోజకవర్గంతో పాటు ఆ జిల్లాలో ఉన్న మరో 5 నియోజకవర్గాల సమన్వయ బాధ్యతలను కూడా అధిష్టానం అప్పగించింది. మరోవైపు.. కర్నాటకలోని 224 నియోజకవర్గాలకు 224 మందిని ఇతర రాష్ట్రాల నుంచి ఇన్‌ఛార్జ్‌లుగా నియామకం అయ్యారు. -
ప్రతిపక్షాలకు బుద్ధి రావాలి: ఆర్కే రోజా
-
‘తల్లిదండ్రుల అనుమతి లేకుండా పెళ్లిళ్లు చేసుకోవడం వల్లే’
Parents Must Teach Good Values To Children, Know Why బీహార్: తల్లిదండ్రుల అనుమతి లేకుండా ఇళ్లు వదిలి వెళ్లి వివాహాలు చేసుకుంటున్న యువతుల్లో చాలా మంది హత్యకు గురౌతున్నారు. మరి కొందరు బలవంతంగా అక్రమ రవాణాకు బలి అవుతున్నారని బీహార్ డీజీపీ గురువారం సంచలన వ్యాఖ్యలు చేశారు. డీజీపీ మాటల్లో.. ‘తల్లిదండ్రుల అనుమతి లేకుండా ఆడపిల్లలు వివాహం చేసుకోవడానికి ఇళ్లు వదిలి వెళ్లిపోయిన ఉదంతాలు మనం ఎన్నో చూశాం. ఐతే వారిలో చాలా మంది హత్యకు గురవుతున్నారు. మరికొందరు బలవంతంగా అమ్మకానికి గురవుతున్నారు. ఇలాంటి నిర్ణయాలకు మూల్యం చెల్లించేది తల్లిదండ్రులేనని’ బీహార్ డీజీపీ ఎస్కే సింఘాల్ సమస్తిపూర్‌లో నిర్వహించిన సమాజ్ సుందర్ అభియాన్ కార్యక్రమంలో అన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలతో తరచూ సంభాషిస్తూ ఉండాలి, మంచి విలువలు నేర్పించాలని, వారి భావాలను గుర్తించి అర్థమయ్యేలా వివరించి, కుటుంబ బంధాల్లో వారిని బంధించాలని ఈ సందర్భంగా సూచించారు. కాగా బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అభివృద్ధి చేస్తున్న సామాజిక సంస్కరణ ప్రచారం (సమాజ్ సుధార్ అభియాన్)లో డీజీపీ సింఘాల్ ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. చదవండి: మీరు వెలకట్టలేని మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది: అమెరికాకు చైనా వార్నింగ్ #WATCH We've seen cases where girls left their homes for marriage without parents' consent. Many of them get killed while others are forced into the flesh trade. It is parents who pay price for such decisions: Bihar DGP SK Singhal at 'Samaj Sudhar Abhiyan' event in Samastipur pic.twitter.com/wai9jNrnG1 — ANI (@ANI) December 30, 2021 -
పాచిపోయిన లడ్డూలు పవన్‌కు రుచిగా ఉన్నాయా?
నెల్లూరు: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడికి సినిమా టికెట్లు తప్ప.. పెరిగిన పెట్రోలు, డీజిల్ ధరలు కనపడట్లేదని మంత్రి అప్పలరాజు ఎద్దేవా చేశారు. చంద్రబాబు, లోకేష్‌లకు బడుగు, బలహీన వర్గాలంటే చిన్నచూపని అన్నారు. మంత్రి అప్పలరాజు ఆదివారం గూడూరు నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు, లోకేష్‌ల తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వారికి డాక్టర్లంటే గౌరవంలేదని, అందుకే వారిని హేళన చేస్తూ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పాచిపోయిన లడ్డూలు ఇప్పుడు పవన్ కల్యాణ్‌కు రుచిగా ఉన్నాయా? అని ప్రశ్నించారు. విభజన హమీలపై కేంద్రం మాటతప్పితే పవన్ ఇప్పుడేందుకు నోరు మూసుకున్నారని మండిపడ్డారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రజలు బ్రహ్మారథం పడుతున్నారని అన్నారు. తమ ప్రభుత్వం ప్రతి గడపకు సంక్షేమ పథకాలను అందిస్తొందని అన్నారు. తాము 22 నెలల పాలనకాలాన్ని రెఫరెండంగా భావించి ప్రజల్లోకి వెళ్తున్నామని చెప్పారు. టీడీపీకి ప్రజల్లో నమ్మకం పోయిందని పేర్కొన్నారు. తాము తిరుపతి ఉపఎన్నికను రెఫరెండంగా తీసుకుంటున్నామని అన్నారు. ఒకవేళ ‘ మేం ఓడిపోతే మా 22 మంది ఎంపీలు రాజీనామా చేస్తారు.. టీడీపీ ఓడిపోతే నలుగురు ఎంపీలూ రాజీనామా చేస్తారా?’’ అంటూ పెద్దిరెడ్డి చేసిన సవాల్‌ను చంద్రబాబుకు స్వీకరించే దమ్ముందా! అని తీవ్ర స్థాయిలో ధ్వజమేత్తారు. -
గురుమూర్తి ఫై నారాలోకేష్ వ్యాఖ్యలు దారుణం
-
బీజేపీ నేతలు జాతర్లకు వచ్చినట్లు వస్తున్నారు..
సాక్షి, హైదరాబాద్: మ్యానిఫెస్టోలు, ప్రొగ్రెస్ రిపోర్టులు వెబ్సైట్లో పెట్టి తీసేయడం టిఆర్ఎస్కు మాత్రమే సాధ్యమని మాజీ టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అన్నారు. మేడిపండు కంటే దారుణంగా టీఆర్ఎస్ ప్రొగ్రెస్ రిపోర్టు ఉందని ఎద్దేవా చేశారు. ఎవరి సొమ్మని 17,500 కోట్లు మెట్రోరైలుకు ఖర్చు చేశారని ప్రశ్నించారు. నిజానికి మెట్రో ప్రాజెక్టును కాంగ్రెస్ పార్టీ ప్రారంభించగా, కేసీఆర్ దాన్ని ఆపేశారన్నారు. 'నీవల్ల ప్రజలకు అసౌకర్యం కలిగింది. ముక్కు నేలకు రాస్తావా? తప్పు ఒప్పుకుంటావా?' అంటూ కేసీఆర్‌ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ విడుదల చేసింది అభివృద్ధి ప్రణాళిక కానే కాదని, అదొక అవినీతి నివేదిక అని, దీనిపై విచారణ జరిపించి నిజనిజాలు బయటకు తేల్చాలని తెలిపారు. 'రాష్ట్రంలో ఒక్క మెగావాట్ విద్యుత్ ఉత్పత్తి చేయలేదు. యాదాద్రి, భద్రాద్రి ఎక్కడ ఉంది?అన్నీ గత కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించిన విద్యుత్ ప్రాజెక్టులే. విద్యుత్ కొనుగోలు చేయడం కూడా ప్రగతేనా? ఐటికి 2100 కోట్లు ఖర్చు చేశామంటున్న టీఆర్ఎస్.. యానిమేషన్ గేమింగ్ 400 కోట్లతో కాంగ్రెస్ ఏర్పాటు చేసింది. ఏడు సంవత్సరాల నుంచి దాన్ని ఎందుకు పూర్తి చేయలేదు. చర్చకు రమ్మంటే ముఖం చాటేసిన టీఆర్ఎస్ నాయకులు ప్రజలకు క్షమాపణలు చెప్పాలి' అని డిమాండ్ చేశారు. (సీఎం దొరగారు మాస్టర్ ప్లాన్: విజయశాంతి) గ్రేటర్ ఎన్నికల కోసం బీజేపీ నాయకులు జాతరలు, సంతలకు వచ్చినట్లు వస్తున్నారని, ఒక్క నవోదయ స్కూల్ తెలంగాణకు కేటాయించని స్మృతి ఇరానీ ఏ ముఖం పెట్టుకుని వచ్చారంటూ విమర్శించారు. తెలంగాణకు ఏం చేశారో చెప్పుకుని కేంద్ర మంత్రులు ఓట్లు అడిగితే బాగుండేదన్నారు. ఉత్తరప్రదేశ్‌లో అశాంతి పాలన చేసిన యోగిఆదిత్య తెలంగాణలో కూడా అలానే ఉండాలని ఇక్కడకు వస్తున్నారా అంటూ ప్రశ్నించారు. కాంగ్రెస్ ఎప్పుడూ మతపరమైన వ్యాఖ్యలు చేయదు, వాటిని సమర్దించదని పేర్కొన్నారు. విద్యుత్ చార్జీలు చెల్లించడంలో రైతులు ఆలస్యం చేశారని ట్రాన్స్ ఫార్మర్కు తాళం వేసిన పరిస్థితులు తెలంగాణలో నెలకొనడం దౌర్భాగ్యమని అన్నారు. ('అలా మాట్లాడితే బీజేపీని మతతత్వ పార్టీ అంటున్నారు') -
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మేము..
రాజకీయాల్లోకి రావాలంటే తగినంత పరిజ్ఞానం ఉండాలి.. అంతకుమించి ధైర్యం ఉండాలి.. వెనుక అండదండలు ఉండాలని లెక్కలు వేస్తుంటారు. కానీ, ఇప్పటి వరకు ఒక లెక్క.. ఇక ముందు ఒక లెక్క అంటోంది నగర యువ నారి. ఈ ఏడాది మహిళలు ముఖ్యంగా యువతులు తమ సత్తా ఏంటో నిరూపించుకోవడానికి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీచేస్తున్నారు. చదువుకున్న యువతులు డిగ్రీ పట్టా చేతబట్టుకొని మరీ రంగంలోకి దిగారు. సమస్యలు ఎందుకు పరిష్కారం కావో తేల్చుకుంటాం అంటున్నారు. చూసేవారికి వీరు వేసే అడుగు చిన్నదిగానే అనిపించవచ్చు. ‘మేం ఈ రోజు వేసే మొదటి అడుగు తర్వాత రాబోయే వారిలో స్ఫూర్తిని నింపాలి. చిన్నవయసులో రాజకీయాల్లోకి వస్తేనే సమాజ సేవలో మరింత చురుకుగా పాల్గొనగలం. మమ్మల్ని చూసి అమ్మాయిలు ఇంకా ఈ రంగంలోకి రావడం పెరగాలి. అప్పుడే సమాజానికి మేలు జరుగుతుంది’ అంటున్న యువతుల స్వరం ఇది. జాబ్ వదులుకున్నా ఇన్నాళ్లూ జనం ఎలా ఉన్నారో ఇప్పుడు కాలనీల్లో తిరుగుతుంటే అర్థమవుతోంది. ప్రచారంలో భాగంగా ఎక్కడకు వెళ్లినా కనీస సౌకర్యాలు లేక ప్రజలు అల్లాడటం చూస్తున్నాను. సమాజసేవ చేయడానికి ఇప్పటికే లేట్ చేశాను అనిపించింది. నిన్ననే నేను కలగన్న పెద్ద కంపెనీలో 40 వేల రూపాయల జీతంతో జాబ్‌లో జాయిన్ అవ్వమని ఆఫర్ లెటర్ వచ్చింది. కానీ, వదిలేసుకున్నాను. అందుకు ఇంట్లో అమ్మనాన్నలు ఏమీ అనలేదు. వాళ్లు నా ఇష్టానికే ప్రాధాన్యం ఇచ్చారు. నాన్న రాజకీయాల్లో ఉన్నారు. నాకూ అలా ఆసక్తి పెరిగింది. గెలుస్తాననే నమ్మకం ఉంది. ఫలితం ఏదైనా పూర్తి సమయం సమాజ సేవకే కేటాయిస్తాను. – టి.వి.తపస్విని యాదవ్ (21), మీర్జాల్గూడ, మల్కాజిగిరి డిగ్రీ చేసి ఇటొచ్చా పొలిటీషియన్ అవ్వాలనే ఆలోచన నాకు జూనియర్ కాలేజీ నుంచి ఉండేది. బిబిఏ చేశాను. రాజకీయాలంటే ఆసక్తితోపాటు యూత్ ఈ రంగంలోకి వస్తే మోడర్న్ ఐడియాలజీతో ఈ కాలానికి తగ్గట్టు పనులు చేయగలరు. మా నాన్నగారికి జీడిమెట్లలో వ్యవసాయ మోటార్లకు అవసరమైన ఎలక్ట్రికల్ బాక్సులు తయారుచేసే యూనిట్ ఉంది. ఎవరిపైనా ఆధారపడాల్సిన పని లేదు. మా ఇంట్లో ఎవరూ రాజకీయాల్లో లేరు. నా ఇంట్రస్ట్ పాలిటిక్స్ అని చెప్పినప్పుడు నాన్న ఎంకరేజ్ చేశారు. ప్రచారానికి నా స్నేహితులతో కలిసి వెళుతున్నాను. ‘ఇంత చిన్న వయసులో మాకేం సాయం చేస్తావు?’ అనే మాటలు కూడా అక్కడక్కడా వింటున్నాను. ఏం చేయగలనో వివరంగా చెబుతున్నాను. – పెరుమాళ్ల వైష్ణవి (21), సుభాష్‌నగర్, సనత్‌నగర్ రెండిట్లోనూ ఉంటాను డాక్టర్ని అయ్యి పేదవాళ్లకు ఉచితంగా చికిత్స చేయాలన్నది చిన్నప్పటి నుంచీ నా కల. ఆ లక్ష్యంతోనే ఎంబీబిఎస్ చేస్తున్నాను. ఇప్పుడు థర్డ్ ఇయర్లో ఉన్నాను. మా నాన్న ఏసీ టెక్నిషియన్‌గా పనిచేస్తారు. మాకు చిన్న షాప్ ఉంది. మా అన్న మహమ్మద్ ఫాజిల్ చాలా చిన్న వయసులోనే పాలిటిక్స్‌లోకి వచ్చారు. తన లక్ష్యం చూస్తూ పెరిగాను. మా ఏరియాలో పేదల పరిస్థితులను స్వయంగా చూస్తూ ఉన్నాను. గెలిస్తే పేదలకు ఉపయోగపడే పనులు చేయవచ్చు. రాజకీయాల్లో ఉంటే సర్వీస్ ఇంకా బాగా చేయవచ్చు అనిపించింది. ఎంబీబిఎస్ పూర్తి చేసి డాక్టర్‌గా రాణిస్తాను. అలాగే, రాజకీయ నాయకురాలిగానూ పేదలకు అండగా ఉంటాను. – అమీనా సమ్రీన్ (21), నల్లకుంట వివక్ష తొలగిస్తాను! నేను ఎంబీయే చేశాను. బాస్కెట్‌బాల్‌లో జాతీయస్థాయి పోటీల్లో పాల్గొన్నాను. అంతర్జాతీయ స్థాయి క్రీడాకారిణిగా ఎదగాలనుకున్నాను. కానీ, స్పోర్ట్స్ అకాడమీలో చాలా సమస్యలు ఫేస్ చేశాను. అబ్బాయిలకైతే ఇద్దరేసి కోచ్లుంటారు. అమ్మాయిలకు ఒక కోచ్ దొరకడం కూడా గగనం. ఎవరికైనా చెప్పినా సరిగ్గా పట్టించుకోరు. చాలా విసుగ్గా అనిపించింది. మా నాన్న ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్. ఎన్నికల్లో నిలబడతానని నాన్నతో చెప్పినప్పుడు వెంటనే ‘ఓకే’ చెప్పారు. అంతేకాదు, మా ప్రాంతం మొన్నటి వరదలకి బాగా దెబ్బతింది. సామాన్యురాలిగా కంటే కార్పోరేటర్ స్థాయిలో మెరుగైన సేవలు అందించవచ్చు. క్రీడావిభాగంలో అమ్మాయిలకు ప్రోత్సాహం అందించాలి, మా ప్రాంతంలో కనీస అవసరాలు ప్రజలకు అందేలా చూడాలి. ఈ లక్ష్యంతో ఎలక్షన్లో పోటీ చేస్తున్నాను. – ఎ.మౌనిక (26), రామ్‌గోపాల్‌పేట్, సికింద్రాబాద్ మంచి చేసే అవకాశం డిగ్రీ వరకు చదువుకున్నాను. ఈ మధ్యే నాకు పెళ్లయ్యింది. మా వారు కారు డ్రైవర్‌గా పని చేస్తారు. అద్దె ఇంట్లో ఉంటున్నాం. మాది లో క్లాస్ ఫ్యామిలీ. కరోనా వల్ల ఫుడ్‌కు కూడా చాలా కష్టపడాల్సి వచ్చింది. పస్తులున్న రోజులు కూడా ఉన్నాయి. ప్రభుత్వ పథకాల కోసం అప్లయ్ చేయడానికి ఆఫీసులకు వెళితే అక్కడ ఎలాంటి రెస్పాన్స్ ఉండటం లేదు. లీడర్ ఉన్నారు కదా అని కార్పోరేటర్ దగ్గరకు ఎన్నిసార్లు తిరిగినా పనులు కాలేదు. పైగా, ఫలానా పథకం నుంచి లబ్ధి పొందాలంటే లంచం అడిగారు. చదువుకున్న నాలాంటివారి పరిస్థితే ఇలా ఉంటే.. చదువురాని వారి పరిస్థితి ఏంటి అనుకున్నాను. నలుగురికి మంచి చేసే అవకాశం వస్తే బాగుండు అనుకున్నాను. అప్పుడే ఈ ఎలక్షన్లో పోటీ చేయాలనే ఆలోచన వచ్చింది. ఇండిపెండెంట్‌గా పోటీచేస్తున్నాను. – మౌనిక రాజేష్ (25), ఇందిరానగర్, ఉప్పల్ -
బండి సంజయ్‌కు మంత్రి హరీష్ సవాల్
సిద్దిపేట : దుబ్బాకలో టిఆర్ఎస్కు మద్దతుగా మహిళలతో సంఘీబావ ర్యాలీ నిర్వహించారు. దుబ్బాక బస్ డిపో నుంచి అంబేద్కర్ సర్కిల్ మీదుగా తెలంగాణ తల్లి విగ్రహం వరకు ర్యాలీ కొనసాగింది. మంగళ హరతులు, డప్పు చప్పుళ్లతో మహిళలు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభకు మంత్రి హరీష్ రావు, టిఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాత, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి, మాజీ మంత్రి సునీతాలక్ష్మారెడ్డి, సహా పలువురు టిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. బీడి పెన్షనర్లకు 1600 రూపాయలు ఇస్తున్నామని బీజేపీ చేస్తోందంతా పచ్చి అబద్దమని మంత్రి హరీష్ రావు అన్నారు. బీడీ కార్మికులకు 1600 పెన్షన్ ఇస్తున్నట్లు సాక్ష్యాలు, ఆధారాలతో నిరూపిస్తే మంత్రి పదవికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా అని హరీష్ రావు అన్నారు. ఒకవేళ ఇవ్వకపోతే నువ్వు రాజీనామాకు సిద్దామా అంటూ బండి సంజయ్‌కి సవాల్ విసిరారు. చింతమడక ల పుట్టిదుబ్బాకలో చదువుకున్న కేసీఆర్‌కు దుబ్బాక పైన ప్రేమ ఉంటది కానీ.. పరాయి నాయకులకు ప్రేమ ఉంటాదా అని ప్రశ్నించారు. సోలీపేట సుజాతక్క గెలుపు మహిళలు గెలుపన్నారు. మోదీ సొంత రాష్ట్రంలో 500 రూపాయల పెన్షన్ ఇస్తే కేసీఆర్ 2000 రూపాయలు ఇస్తున్నారని, బీజేపీ, కాంగ్రెస్ చేసే అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మరని తెలిపారు. రాష్ర్ట ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ కార్యక్రమాలకు కేంద్రమే నిధులు ఇస్తోందని బీజేపీ దుష్ప్రచారం చేస్తోందని మంత్రి హరీష్ అన్నారు. బీజేపీ అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలోనైనా రైతులకు ఉచిత కరెంట్, బీడీ పెన్షన్లు, రైతు బంధు, కళ్యాణలక్ష్మీ స్కీము ఇస్తోందా అని ప్రశ్నించారు. 'బీజేపీ ఏమి చేస్తామని ప్రచారం చేస్తారు ? విద్యుత్ మీటర్లు పెడతామని ఓట్లు అడుగుతారా ? విదేశీ మక్కలు తెచ్చి రైతుల పొట్టలు కొడతామని అడుగుతారా ? ఎవరి ప్రయోజనాల కోసం విదేశీ మక్కలు తెస్తున్నారో బీజేపీ చెప్పాలి' అని మంత్రి హరీష్ డిమాండ్ చేశారు. దుబ్బాక ప్రజలు అభివృద్ధిని, సంక్షేమాన్ని కోరుకుంటున్నారని కాంగ్రెస్, బీజేపీలను నమ్మితే మోసపోతామని తెలిపారు. రామలింగారెడ్డి తన చివరి శ్వాస వరకు ప్రజాసేవలోనే గడిపారని అభ్యర్థి సోలీపేట సుజాత అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక తండ్రి లాగా నన్ను ఆశీర్వదించి మీ సేవ కోసం పంపారు. దుబ్బాక ప్రజల ఆశీస్సులతో రామలింగారెడ్డి అడుగుజాడల్లో నడిచి ఆయన ఆశయాలను కొనసాగిస్తాను అని పేర్కొన్నారు. -
ప్రజ్ఞా సింగ్‌కు ఈసీ షాక్
భోపాల్ బీజేపీ పార్లమెంటరీ అభ్యర్థి ప్రజ్ఞా సింగ్‌కు ఎలక్షన్ కమిషన్ షాక్ ఇచ్చింది. ముంబై టెర్రర్ దాడి సందర్భంగా అసువులు బాసిన మాజీ ఏటీఎస్ చీఫ్ హేమంత్ కర్కరే మరణంపైనా, బాబ్రీ మసీదు కూల్చివేతపై ప్రజ్ఞాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో ఆమెను 72 గంటల (మూడు రోజులలు) పాటు ప్రచారంనుంచి నిషేధించింది. మాలేగావ్ బాంబు పేలుళ్ల కేసులో తనను హేమంత కర్కరే తీవ్రంగా వేధించారని, ఆ సందర్భంగా తాను శపించిన కారణంగా చనిపోయారంటూ వివాదాన్ని సృష్టించారు. అలాగే ముస్లింలమనోభావాలను దెబ్బతీసిన మతపరమైన వ్యాఖ్యలు చేశారు. బాబ్రీమసీదు కూల్చిన బృందంలో తానూ ఉన్నాననీ, ఈ ఉద్యమంలో పాలుపంచుకున్నందుకు గర్వపడుతున్నానంటూ ప్రజ్ఞా సింగ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. కాగా భోపాల్ కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్‌కు పోటీగా మాలేగావ్ బాంబు పేలుళ్ల కేసులో నిందితురాలైన ప్రజ్ఞా సింగ్‌ను బీజేపీ నిలిపిన సంగతి తెలిసిందే. ఆరవ దశ ఎన్నికల్లో భాగంగా మే 12న భోపాల్‌లో పోలింగ్ జరగనుంది. -
నేటి నుంచి కేటీఆర్ ప్రచారం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పూర్తిస్థాయి ఎన్నికల ప్రచారంలోకి దిగుతున్నారు. సొంత నియోజకవర్గం సిరిసిల్ల నుంచి బుధవారం ప్రచారం మొదలుపెడుతున్నారు. సికింద్రాబాద్, మల్కాజ్గిరి, చేవెళ్ల, నల్లగొండ, మహబూబాబాద్, భువనగిరి, కరీంనగర్లో కేటీఆర్ ప్రచారం నిర్వహించనున్నారు. మార్చి 27 నుంచి ఏప్రిల్ 9 వరకు కేటీఆర్ ప్రచార షెడ్యూల్ ఖరారైంది. టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి ఈ మేరకు మంగళవారం కేటీఆర్ ప్రచార షెడ్యూల్ విడుదల చేశారు. సికింద్రాబాద్, మల్కాజ్గిరి, చేవెళ్ల లోక్‌సభ సెగ్మెంట్ల పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ కేటీఆర్ రోడ్ షోలు నిర్వహించనున్నా రు. పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ రోడ్ షో నిర్వహణ ప్రక్రియను సమన్వయం చేయనున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో 16 సీట్లలో గెలుపే లక్ష్యంగా టీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది. అన్ని స్థానాల్లో భారీ ఆధిక్యంతో గెలుపు కోసం సీఎం కేసీఆర్, కేటీఆర్ పూర్తిస్థాయిలో ప్రచారం నిర్వహించాలని నిర్ణయించారు. టీఆర్ఎస్ ఇప్పటి వరకు గెలుచుకోని సికింద్రాబాద్, మల్కాజ్గిరి, నల్లగొండ సెగ్మెంట్లపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. తాను టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత జరుగుతున్న మొదటి ఎన్నికలు కావ డంతో కీలక నియోజకవర్గాలపై స్వయంగా కేటీఆర్ దృష్టి సారించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రచార ప్రక్రియ ను సమన్వయం చేస్తూనే ఏడు లోక్‌సభ నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించనున్నారు. ముఖ్యంగా నల్లగొండ, సికింద్రాబాద్, మల్కాజ్గిరి, చేవెళ్ల సెగ్మెంట్లలో అసెంబ్లీ ఎన్నికల తరహాలో ప్రచారం నిర్వహించేలా షెడ్యూల్‌ను రూపొందించుకున్నారు. కేటీఆర్ ప్రచార షెడ్యూల్ ఇదీ... ► మార్చి 27న సిరిసిల్ల నియోజకవర్గం ముస్తాబాద్ నుంచి ప్రచారం ప్రారంభిస్తారు. ఆ రోజు స్థానికం గా జరగనున్న పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ► మార్చి 29న సిరిసిల్ల నియోజకవర్గం ఎల్లారెడ్డిపేట, వీరన్నపల్లె మండలాల్లో స్థానిక సమావేశాల్లో పాల్గొంటారు. సాయంత్రం 6 గంటలకు కరీంనగర్లో రోడ్‌షో నిర్వహించి అక్కడే బహిరంగ సభకు హాజరవుతారు. ► మార్చి 30న ఉదయం నర్సంపేట, ములుగు నియోజక వర్గాల్లో బహిరంగ సభలో పాల్గొంటారు. సాయంత్రం 5 గంటల నుంచి తాండూరు, వికారాబాద్‌లో రోడ్ షోల్లో పాల్గొంటారు. ► మార్చి 31న సిరిసిల్ల నియోజకవర్గం గంభీరావుపేటలో స్థానిక కార్యక్రమాలకు హాజరవుతారు. సాయంత్రం 5 గంటల నుంచి పరిగి, చేవెళ్లలో రోడ్‌షోలు నిర్వహిస్తారు. ► ఏప్రిల్ 1న సాయంత్రం ఐదున్నర గంటల నుంచి ఎల్బీనగర్, మహేశ్వరం నియోజకవర్గాల్లో రోడ్ షోలో పాల్గొంటారు. ► ఏప్రిల్ 2న సిరిసిల్లలో స్థానికంగా నిర్వహించే కార్యక్రమాలకు హాజరవుతారు. సాయంత్రం ఐదున్నర గంటల నుంచి ఉప్పల్, మల్కాజ్గిరి రోడ్ షోలో పాల్గొంటారు. ► ఏప్రిల్ 3న మధ్యాహ్నం 12 గంటలకు హుజూర్‌నగర్‌లో జరుగనున్న బహిరంగ సభలో పాల్గొంటారు. సాయంత్రం ఐదున్నర గంటల నుంచి సికింద్రాబాద్ కంటోన్మెంట్, మేడ్చల్‌లో రోడ్ షో నిర్వహిస్తారు. ► ఏప్రిల్ 4న మధ్యాహ్నం 12 గంటలకు ఇబ్రహీంపట్నంలో బహిరంగ సభకు హాజరవుతారు. సాయంత్రం ఐదున్నర గంటల నుంచి అంబర్‌పేట, ముషీరాబాద్‌లో రోడ్ షో నిర్వహిస్తారు. ► ఏప్రిల్ 5న ఉదయం 10 గంటలకు కోదాడలో జరగనున్న బహిరంగ సభలో ప్రసంగిస్తారు. సాయంత్రం ఐదు గంటల నుంచి సికింద్రాబాద్, సనత్‌నగర్‌లో రోడ్‌షోలో పాల్గొంటారు. ► ఏప్రిల్ 6న సాయంత్రం జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, నాంపల్లి నియోజక వర్గాల్లో రోడ్ షో నిర్వహిస్తారు. ► ఏప్రిల్ 7న ఉదయం 10 గంటలకు మహబూబ్‌నగర్, జడ్చర్ల, షాద్‌నగర్‌లలో జరగనున్న బహిరంగ సభల్లో పాల్గొంటారు. సాయంత్రం ఐదున్నర నుంచి రాజేంద్రనగర్, శేరిలింగంపల్లిలో రోడ్ షోలు నిర్వహిస్తారు. ► ఏప్రిల్ 8న ఇల్లందు, పినపాక నియోజకవర్గాల్లో వేర్వేరుగా జరగనున్న బహిరంగ సభలకు హాజరవుతారు. సాయంత్రం ఐదున్నర గంటల నుంచి కూకట్పల్లి, కుత్బుల్లాపూర్ సెగ్మెంట్లలో రోడ్‌షోలో పాల్గొంటారు. ► ఏప్రిల్ 9న నల్లగొండలో రోడ్ షో నిర్వహించి ప్రచారం పూర్తి చేస్తారు. లోక్‌సభ బాధ్యుల మార్పు... లోక్‌సభ ఎన్నికల టీఆర్ఎస్ బాధ్యుల విషయంలో స్వల్ప మార్పులు జరిగాయి. మొదట నల్లగొండ లోక్‌సభకు నూకల నరేశ్‌రెడ్డి, ఖమ్మం లోక్‌సభకు తక్కళ్లపల్లి రవీందర్‌రావుకు పార్టీ బాధ్యతలు అప్పగించారు. తాజాగా వీరిద్దరి సెగ్మెంట్లను పరస్పరం మార్చుతూ టీఆర్ఎస్ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. దీంతో రవీందర్రావు నల్లగొండ లోక్‌సభకు, నరేశ్‌రెడ్డికి ఖమ్మం లోక్‌సభ సెగ్మెంట్ బాధ్యతలను అప్పగించారు. -
నమస్కారం.. మీ ఓటు ఎవరికి..?
సాక్షి, తిరువూరు : ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యంత కీలకమైన ఓటును ఎవరికీ వేస్తారో చెప్పాలంటూ నియోజకవర్గాల వారీగా ఓటర్లకు ఫోన్ కాల్స్ వస్తున్నాయి. నమస్కారం ఇది ప్రజాభిప్రాయ సేకరణ. అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ అభ్యర్థికి మీరు ఓటు వేస్తారు. టీడీపీ అయితే ఒకటి, వైఎస్సార్సీపీ అయితే రెండు, జనసేన లేక ఇతర పార్టీలకు అయితే మూడు నొక్కండి అంటూ నిత్యం ఫోన్లు చేస్తున్నారు. 83339 99999 నంబరు నుంచి రికార్డ్ వాయిస్‌తో ఫోన్ కాల్స్ వస్తున్నాయి. ఒక సారి ఫోన్ లిఫ్ట్ చేయకపోతే అరగంట తర్వాత లేదా ఫోన్ లిఫ్ట్ చేసి సమాధానం చెప్పేంత వరకు ఈ విధమైన ఫోన్‌కాల్స్ వస్తున్నాయి. ఫ్యాన్సీ నంబరు కావడంతో కాల్ వచ్చిన ప్రతి ఒక్కరూ ఫోన్ లిఫ్ట్ చేస్తున్నారు. తిరిగి ఈ నంబరుకు డయల్ చేస్తే నంబరు ఉపయోగంలో లేదు అనే రికార్డ్‌డెడ్ వాయిస్ వస్తోంది. గతంలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు వాయిస్‌తో మీ నియోజకవర్గంలో టీడీపీకీ చెందిన ఏ అభ్యర్థికి మద్దతు తెలియజేస్తారో చెప్పాలంటూ అభిప్రాయాలు సేకరిస్తున్నారు. అది పార్టీకి సంబంధించిన వ్యవహారంగా ఉండేదని, కాని ఇప్పుడు ఏకంగా ఏ పార్టీకి ఓటు వేస్తారో ముందుగానే చెప్పాలంటూ ఫోన్ కాల్స్ చేస్తున్నారని ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇలా చేయడం సరికాదని ఓటర్లు వాపోతున్నారు. పోలింగ్ బూత్‌లో రహస్యంగా ఉండాల్సిన వివరాలను ఈ విధంగా నిత్యం బహిరంగంగా అడగడం ఏమిటంటూ ఓటర్లు ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల అధికారులు కోడ్ ఉల్లంఘనులపైనే కాకుండా ఇలాంటి అంశాలపై కూడా దృష్టి పెట్టాల్సిందిగా కోరుతున్నారు. -
మోదీ సర్కార్ ఏపీకి తీవ్ర అన్యాయం చేస్తుంది
-
పీవోకే విముక్తికి ప్రచారం చేపట్టండి..!
రోఠక్ః పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) విముక్తికోసం భారీ ఎత్తున ప్రచారం చేపట్టాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి.. యోగాగురు రామ్ దేవ్ బాబా విన్నవించారు. ఎన్నికల్లో ఐఎస్ ఐ రిగ్గింగ్ చేసిందని ఆరోపిస్తూ స్థానికుల ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో పీవోకే విముక్తికోసం ప్రయత్నించాలని రామ్ దేవ్ ప్రధానిని కోరారు. పాకిస్తాన్ లాంటి దేశమే కశ్మీర్ ను ఆక్రమించగల్గినప్పుడు గొప్ప దేశమైన భారత్ ఎందుకు చూస్తూ ఊరుకోవాలని బాబా ప్రశ్నించారు. జూలై లో జరిగిన ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందంటూ పాక్ ఆక్రమిత కశ్మీర్ స్థానికులు ఆందోళనలకు దిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో యోగా గురు రామ్ దేవ్ స్పందించారు. పీవోకే విముక్తికోసం ప్రయత్నించేందుకు వెంటనే ప్రచారం చేపట్టాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కోరారు. కశ్మీర్ ఎలాగైనా తమ సొంతమేననడానికి నవాజ్ షరీఫ్ కు ఎన్నిగుండెలంటూ ప్రశ్నించారు. కశ్మీర్ లోని మన ప్రజలు కేవలం చెప్పుకోడానికేనన్నట్లుందని, పాకిస్తాన్ వారిని ఇప్పటికే ఆక్రమించేంసిందని అన్నారు. గొప్పదేశమైన భారత్ లోని భూభాగాన్ని పాక్ ఆక్రమిస్తుంటే చూస్తూ నెమ్మదిగా ఊరుకునేది లేదన్నారు. పీవోకే ఎలక్షన్లలో రిగ్గింగ్ జరిగిందంటూ ఆగ్రహించిన నీలం వ్యాలీ ప్రాంతంలోని స్థానికులు ఏకంగా పాకిస్తానీ జెండాను సైతం తగులబెట్టి, ఆందోళనలు చేపట్టిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో స్థానికులకు సహకరించి, ఆక్రమిత కశ్మీర్ విముక్తికి ప్రచారం చేపట్టాలని రామ్ దేవ్ బాబా ప్రధానిని కోరారు. -
గడువు తర్వాత ప్రచారం నిర్వహించరాదు: ఖమ్మం కలెక్టర్
పాలేరు: ఖమ్మం జిల్లా పాలేరు ఉప ఎన్నిక ప్రచార గడువు శనివారం సాయంత్రం 6 గంటలకు ముగియనుంది. గడువు తర్వాత అభ్యర్థులు ఎలాంటి ప్రచారం నిర్వహించరాదని జిల్లా కలెక్టర్ దానకిషోర్ సూచించారు. నియోజకవర్గానికి చెందని వ్యక్తులు, స్థానికేతరులు 14వ తేదీ సాయంత్రం 6 గంటల తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ పాలేరు నియోజకవర్గం పరిధిలో ఉండరాదని ఆదేశించారు. భద్రత దృష్ట్యా ఇప్పటికే ఉన్న ఎనిమిది ఫ్లయింగ్ స్క్వాడ్లకు తోడు మరో 21 బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.