
భోపాల్ బీజేపీ పార్లమెంటరీ అభ్యర్థి ప్రజ్ఞా సింగ్‌కు ఎలక్షన్ కమిషన్ షాక్ ఇచ్చింది. ముంబై టెర్రర్ దాడి సందర్భంగా అసువులు బాసిన మాజీ ఏటీఎస్ చీఫ్ హేమంత్ కర్కరే మరణంపైనా, బాబ్రీ మసీదు కూల్చివేతపై ప్రజ్ఞాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో ఆమెను 72 గంటల (మూడు రోజులలు) పాటు ప్రచారంనుంచి నిషేధించింది.
మాలేగావ్ బాంబు పేలుళ్ల కేసులో తనను హేమంత కర‍్కరే తీవ్రంగా వేధించారని, ఆ సందర్భంగా తాను శపించిన కారణంగా చనిపోయారంటూ వివాదాన్ని సృష్టించారు. అలాగే ముస్లింలమనోభావాలను దెబ్బతీసిన మతపరమైన వ్యాఖ్యలు చేశారు. బాబ్రీమసీదు కూల్చిన బృందంలో తానూ ఉన్నాననీ, ఈ ఉద్యమంలో పాలుపంచుకున్నందుకు గర్వపడుతున్నానంటూ ప్రజ్ఞా సింగ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి.
కాగా భోపాల్ కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్‌కు పోటీగా మాలేగావ్ బాంబు పేలుళ్ల కేసులో నిందితురాలైన ప్రజ్ఞా సింగ్‌ను బీజేపీ నిలిపిన సంగతి తెలిసిందే. ఆరవ దశ ఎన్నికల్లో భాగంగా మే 12న భోపాల్‌లో పోలింగ్ జరగనుంది.
Comments
Please login to add a commentAdd a comment