మధ్యప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు ఇటీవలే ముగిసిన సంగతి తెలిసిందే. ఇక డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు జరగనుంది కూడా. ఐతే ఈలోపు మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్ జిల్లాలో పోస్టల్ బ్యాలెట్‌ని కొందరూ అధికారులు ఓపెన్ చేసినట్లు కలకలం రేగింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ బాలఘాట్‌లో పోస్టల్ బ్యాలెట్లు వ్యవహారంలో ట్యాపరింగ్‌కు పాల్పడే అవకాశం ఉందంటూ ఎన్నికాల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఇది చాల తీవ్రమైన విషయం అని, బాధ్యలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరింది.
అలాగే తమ కాంగ్రెస్ కార్యకర్తలు ఈ విషయమై అప్రమత్తంగా ఉండాలని ఎటువంటి వివాదాలు జరగకుండా చూసుకోవాలని ట్విట్టర్‌లో పేర్కొంది కాంగ్రెస్. ఇక ఆ వీడియోలో కొందరూ అధికారులు స్ట్రాంగ్ రూమ్‌లో పోస్టల్ బ్యాలెట్‌లను తెరిచినట్లు కనిపించింది. దీంతో కాంగ్రెస్ ఆ జిల్లా కలెక్టరే స్ట్రాంగ్ రూంని ఓపెన్ చేశారని, ఇతర అధికారులు అభ్యర్థులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా పోస్ట్ బ్యాలెట్లు ఓపెన్ చేశారని ఆరోపణలు చేసింది.
ఇదిలా ఉండగా ఈ వివాదం చెలరేగిన కాసేపటికి కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుడు షఫ్‌ఖత్ ఖాన్ మాట్లాడుతూ..డ్యూటీలో ఉన్న సిబ్బంది ఈ విషయం గురించి మా పార్టీ ప్రతినిధికి సంతృప్తికరమైన రీతిలో సమాధానం ఇవ్వకపోవడం ఈ గందరగోళం ఏర్పడిందని తెలిపారు. అయితే సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ ఈ కన్‌ఫ్యూజ్‌ని క్లియర్ చేసిందని వివరించారు. ఈ వివాదం విషయమై బాలాఘాట్‌లో పోస్టల్ బ్యాలెట్ నోడల్ అధికారిని డివిజనల్ కమిషనర్ సస్పెండ్ చేసినట్లు అధికారిక వర్గాల సమాచారం.
దీంతో వివాదం సద్దుమణిందింది. ఈ మేరకు స్థానిక మేజిస్ట్రేట్ గోపాల్ సోనీ విలేకరులతో మాట్లాడుతూ.."ఈటీపీబీఎస్ (ఎలక్ట్రానికల్ ట్రాన్స్‌మిటెడ్ పోస్టల్ బ్యాలెట్ సిస్టమ్)ని ఉంచడం, వాటిని 50 బండిల్స్‌గా క్రమబద్ధీకరించడం అనేది సాధారణ ప్రక్రియ. ఈ ప్రక్రియ అంతా సీసీటీవీ కెమెరాల సమక్షంలోనే జరుగుతుందని, అలాగే బయట సెక్యూరిటీ సిబ్బంది కూడా ఉన్నారని తెలిపారు. వాస్తవానికి స్థానిక తహసీల్ కార్యాలయంలోని ఒక గది పోస్టల్ బ్యాలెట్ల కోసం స్ట్రాంగ్ రూమ్‌గా కేటాయించారు. ఇక్కడ బాలాఘాట్ అసెంబ్లీ స్థానాల పోస్టల్ బ్యాలెట్లు తోపాటుఇతర ఐదు అసెంబ్లీ సెగ్మెంట్ల పోస్టల్ బ్యాలెట్లను కూడా సీసీటీవీ నిఘాలోనే భద్రపరచడమే జరుగుతుంది.
అందువల్ల ప్రతీరోజు అందుకు సంబంధించిన ఎలక్ట్రానిక్ పోస్టల్ బ్యాలెట్లు ఇక్కడకు రావడం జరుగతుంది. కాబట్టి తాము ఈ స్ట్రాంగ్ రూమ్‌ని ఆయా రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలోనే తెరవడం జరుతుంది. తదనంతరం ఒక్కొక్క అసెంబ్లీ స్థానాల వారీగా పోస్టల్ బ్యాలెట్లను క్రమబద్ధీకరించడం జరుగుతుందని వివరించారు స్థానిక మెజిస్ట్రేట్. కాగా, నవంబర్ 17న ముగిసిన పోలింగ్‌లో మళ్లీ కాంగ్రెస్ అధికారం దక్కించుకోవాలని తీవ్రంగా యత్నిస్తుంది.
2018లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం దక్కించుకున్నప్పటికీ సీనియర్ నాయకుడు జ్యోతిరాదిత్య సింధియా 20 మందికి పైగా విధేయులైన ఎమ్మెల్యేలతో బీజేపీలోకి చేరడంతో ఒక్కసారిగా కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయింది. దీంతో ఈ ఎన్నికల్లో గెలిచి ఎలాగైన తన ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తోంది కాంగ్రెస్. కానీ బీజేపీ మాత్రం కాంగ్రెస్‌ని మట్టికరిపించేలా ప్రజలు తమనే గెలిపిస్తారని దీమా వ్యక్తం చేస్తుండడం గమనార్హం.
निर्वाचन को कलंकित करते बालाघाट कलेक्टर
— MP Congress (@INCMP) November 27, 2023
मध्यप्रदेश के बालाघाट जिले के कलेक्टर डॉ. गिरीश मिश्रा ने आज 27 नवंबर को ही स्ट्रांग रूम खुलवाकर बिना अभ्यर्थियों को सूचना दिए डाक मतपत्रों की पेटियां खोल दी है।
अंतिम साँसें गिनती शिवराज सरकार और सरकार की अंधभक्ति में लीन कलेक्टर… pic.twitter.com/I1UrKmHK5B
(చదవండి: వారిని ప్రజలు పట్టించుకోలేదు.. సీఎం గెహ్లాట్ ధీమా!)
Comments
Please login to add a commentAdd a comment