ప్రముఖ ఫార్మా సంస్థ గ్లాక్సో స్మిత్‌క్లైన్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ (GSK) పిల్లలకు క్లిష్టమైన రక్షణను అందించే టీకాల గురించి అవగాహన కల్పిస్తోంది. ఒకటి నుండి రెండేళ్ల మధ్య వయస్సున్న పిల్లలకు అందించాల్సిన టీకాలపై జనవరి 25 నుంచి ప్రచారాన్ని ప్రారంభించింది. 1-2 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు ఏడు కీలకమైన టీకాల ద్వారా '7-స్టార్ ప్రొటెక్షన్' అందించాలంటూ తల్లిదండ్రులను కోరుతోంది.
ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ (IAP) పిల్లలకు ఏడు టీకాలును సిఫార్సు చేస్తోంది, చికెన్‌పాక్స్ హెపటైటిస్ ‘ఏ’ తొలి డోస్ , ఎంఎంఆర్ (MMR) మెనింజైటిస్ రెండో డోస్, పీసీవీ DTP Hib IPV బూస్టర్ డోస్, ఫ్లూ వార్షిక మోతాదు ప్రధానంగా ఉన్నాయి. పలు రకాల ఇన్ఫెక్షన్లనుంచి కాపాడి, రోగ నిరోధక వ్యవప్తను బలోపేతం చేసే టీకాలు వేయవలసిన అవసరంపై తల్లిదండ్రుల్లో అవగాహన కల్పిస్తోంది.
బిడ్డ పుట్టిన తొలి ఏడాదిలో టీకాలపై ఎక్కువ ఆసక్తి ఉన్నప్పటికీ, రెండో సంవత్సరంలో టీకాలు వేయించుకోని వారి సంఖ్య పెరుగుతోందని జీఎస్‌కే తెలిపింది. దీంతో పాక్షికంగా టీకాలు తీసుకుంటున్న పిల్లల సంఖ్య దేశంలో బాగా పెరుగుతోందని పేర్కొంది. అంటే తొలి ఏడాది శ్రద్దగా వాక్సీన్లు వేయించిన తల్లిదండ్రులు, రెండో ఏడాదికి వచ్చేసరికి మునుపటి శ్రద్ధ చూపించడలేదు. అలా కాకుండా క్రమంగా తప్పకుండా పిల్లలకు టీకాలు వేయిస్తే వారి ఆరోగ్య భవిష్యత్తుకు బంగారు బాట వేసినట్టు అవుతుందనే సందేశంతో జీఎస్‌కే ఈ ప్రచారాన్ని చేపట్టింది.
పాక్షికవ్యాక్సినేషన్ వల్ల పిల్లల్ని తీవ్రమైన సమస్యలకు గురి చేస్తుందని జీఎస్‌కే చెబుతోంది. అందుకే రెండో సంవత్సరంలో కూడా క్రమం తప్పకుండా టీకాలు వేయించాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతుంది. ఇది పిల్లల్ని చాలా రోగాల నుంచి పిల్లలను కాపాడుతుందంటోంది. అలాగే రెండో ఏడాదిలో టీకాలను తీసుకోని పిల్లలు స్వయంగా ప్రమాదంలో పడటంతోపాటు, ఇంట్లో వారి మిగిలిన తోబుట్టువులను, అమ్మమ్మ తాత,నానమ్మ తదితర వృద్ధులకు ఇన్ఫెక్షన్ వ్యాపించి వారిని మరింత ప్రమాదంలో పడేసే అవకాశం ఉందని కంపెనీ పత్రికా ప్రకటన తెలిపింది.
టీకాలతో నివారించగలిగే చికెన్‌పాక్స్, మీజిల్స్ , ఫ్లూ వంటి వ్యాధులు గత మూడేళ్లలో దేశంలో బాగా వ్యాపించాయని జీఎస్‌కే ఇండియా ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ , మెడికల్ అఫైర్స్, డాక్టర్ రష్మీ హెగ్డే తెలిపారు. పిల్లల అభివృద్ధిపై టీకాల దీర్ఘకాలిక ప్రభావాన్ని నొక్కి వక్కాణించిన ఆయన సంబంధిత టీకాలను పూర్తి చేయడం ద్వారా ఆరోగ్య కరమైన సంతోషకరమైన బాల్యం అందించినట్టు అవుతుందన్నారు. రెండేళ్ల వయసున్న పిల్లల ఎదుగుదలకు భరోసా ఇచ్చే టీకాల గురించి తెలిదండ్రులకు అవగాహన కల్పించడమే తమ ప్రచార లక్ష్యమని హెగ్డే వెల్లడించారు.
దేశవ్యాప్తంగా ఉన్న పిల్లల వైద్యుల క్లినిక్‌లలో టెలివిజన్, సోషల్ మీడియా, పోస్టర్లు వంటి బహుళ ఛానెల్‌లలో ప్రచారాన్ని ప్రారంభించింది. అలాగే తల్లిదండ్రులు తమ పిల్లలకు టీకా వివరాలపై మరింత సమాచారం కోసం శిశు వైద్యులను సంప్రదించాలి. 7 కీలకమైన VPDల గురించి అదనపు సమాచారాన్ని MyVaccinationHub.inలో కూడా పొందవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment