gsk pharma
-
ఏడు టీకాలతో 7-స్టార్ రక్షణ : పిల్లల టీకాలపై జీఎస్కే ప్రచారం
ప్రముఖ ఫార్మా సంస్థ గ్లాక్సో స్మిత్‌క్లైన్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ (GSK) పిల్లలకు క్లిష్టమైన రక్షణను అందించే టీకాల గురించి అవగాహన కల్పిస్తోంది. ఒకటి నుండి రెండేళ్ల మధ్య వయస్సున్న పిల్లలకు అందించాల్సిన టీకాలపై జనవరి 25 నుంచి ప్రచారాన్ని ప్రారంభించింది. 1-2 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు ఏడు కీలకమైన టీకాల ద్వారా '7-స్టార్ ప్రొటెక్షన్' అందించాలంటూ తల్లిదండ్రులను కోరుతోంది. ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ (IAP) పిల్లలకు ఏడు టీకాలును సిఫార్సు చేస్తోంది, చికెన్‌పాక్స్ హెపటైటిస్ ‘ఏ’ తొలి డోస్ , ఎంఎంఆర్ (MMR) మెనింజైటిస్ రెండో డోస్, పీసీవీ DTP Hib IPV బూస్టర్ డోస్, ఫ్లూ వార్షిక మోతాదు ప్రధానంగా ఉన్నాయి. పలు రకాల ఇన్ఫెక్షన్లనుంచి కాపాడి, రోగ నిరోధక వ్యవప్తను బలోపేతం చేసే టీకాలు వేయవలసిన అవసరంపై తల్లిదండ్రుల్లో అవగాహన కల్పిస్తోంది. బిడ్డ పుట్టిన తొలి ఏడాదిలో టీకాలపై ఎక్కువ ఆసక్తి ఉన్నప్పటికీ, రెండో సంవత్సరంలో టీకాలు వేయించుకోని వారి సంఖ్య పెరుగుతోందని జీఎస్కే తెలిపింది. దీంతో పాక్షికంగా టీకాలు తీసుకుంటున్న పిల్లల సంఖ్య దేశంలో బాగా పెరుగుతోందని పేర్కొంది. అంటే తొలి ఏడాది శ్రద్దగా వాక్సీన్లు వేయించిన తల్లిదండ్రులు, రెండో ఏడాదికి వచ్చేసరికి మునుపటి శ్రద్ధ చూపించడలేదు. అలా కాకుండా క్రమంగా తప్పకుండా పిల్లలకు టీకాలు వేయిస్తే వారి ఆరోగ్య భవిష్యత్తుకు బంగారు బాట వేసినట్టు అవుతుందనే సందేశంతో జీఎస్కే ఈ ప్రచారాన్ని చేపట్టింది. పాక్షికవ్యాక్సినేషన్ వల్ల పిల్లల్ని తీవ్రమైన సమస్యలకు గురి చేస్తుందని జీఎస్కే చెబుతోంది. అందుకే రెండో సంవత్సరంలో కూడా క్రమం తప్పకుండా టీకాలు వేయించాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతుంది. ఇది పిల్లల్ని చాలా రోగాల నుంచి పిల్లలను కాపాడుతుందంటోంది. అలాగే రెండో ఏడాదిలో టీకాలను తీసుకోని పిల్లలు స్వయంగా ప్రమాదంలో పడటంతోపాటు, ఇంట్లో వారి మిగిలిన తోబుట్టువులను, అమ్మమ్మ తాత,నానమ్మ తదితర వృద్ధులకు ఇన్ఫెక్షన్ వ్యాపించి వారిని మరింత ప్రమాదంలో పడేసే అవకాశం ఉందని కంపెనీ పత్రికా ప్రకటన తెలిపింది. టీకాలతో నివారించగలిగే చికెన్‌పాక్స్, మీజిల్స్ , ఫ్లూ వంటి వ్యాధులు గత మూడేళ్లలో దేశంలో బాగా వ్యాపించాయని జీఎస్కే ఇండియా ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ , మెడికల్ అఫైర్స్, డాక్టర్ రష్మీ హెగ్డే తెలిపారు. పిల్లల అభివృద్ధిపై టీకాల దీర్ఘకాలిక ప్రభావాన్ని నొక్కి వక్కాణించిన ఆయన సంబంధిత టీకాలను పూర్తి చేయడం ద్వారా ఆరోగ్య కరమైన సంతోషకరమైన బాల్యం అందించినట్టు అవుతుందన్నారు. రెండేళ్ల వయసున్న పిల్లల ఎదుగుదలకు భరోసా ఇచ్చే టీకాల గురించి తెలిదండ్రులకు అవగాహన కల్పించడమే తమ ప్రచార లక్ష్యమని హెగ్డే వెల్లడించారు. దేశవ్యాప్తంగా ఉన్న పిల్లల వైద్యుల క్లినిక్‌లలో టెలివిజన్, సోషల్ మీడియా, పోస్టర్లు వంటి బహుళ ఛానెల్‌లలో ప్రచారాన్ని ప్రారంభించింది. అలాగే తల్లిదండ్రులు తమ పిల్లలకు టీకా వివరాలపై మరింత సమాచారం కోసం శిశు వైద్యులను సంప్రదించాలి. 7 కీలకమైన VPDల గురించి అదనపు సమాచారాన్ని MyVaccinationHub.inలో కూడా పొందవచ్చు. -
జీఎస్కే ఫార్మా, సనోఫిలపై రూ.64 కోట్ల జరిమానా
న్యూఢిల్లీ: ఔషధ తయారీ కంపెనీలైన గ్లాక్సోస్మిత్‌క్లెయిన్ ఫార్మా (జీఎస్కే ఫార్మా), సనోఫిలపై కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) రూ.64 కోట్ల జరిమానా విధించింది. ఈ రెండు ఫార్మా కంపెనీలు హజ్ యాత్రికుల కోసం ప్రభుత్వానికి సరఫరా చేయాల్సిన మెనింజైటీస్ వాక్సిన్ బిడ్డింగ్ విషయంలో అక్రమాలకు పాల్పడినందుకు సీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ రూ.64 కోట్ల జరిమానాలో రూ.61 కోట్లను జీఎస్కే, రూ.3 కోట్లను సనోఫి చెల్లించనున్నాయి. కంపెనీల మూడేళ్లలో సగటు టర్నోవర్‌ను పరిగణలోకి తీసుకొని జరిమానాను విధించడం జరిగింది. మెనింజైటీస్ వాక్సిన్ సరఫరాకు సంబంధించిన ఈ అంశంపై బయో-మెడ్ ప్రైవేట్ లిమిటెడ్ ఆ రెండు ఫార్మా కంపెనీలతోపాటు కుటుంబ ఆరోగ్య సంక్షేమ మంత్రిత్వ శాఖలపై సీసీఐకు ఫిర్యాదు చేసింది. ప్రభుత్వం ప్రతి ఏడాది కూడా మెనింజైటీస్ వాక్సిన్ కొనుగోలుకు టెండర్లను ఆహ్వానిస్తుంది. -
జీఎస్కే బంపర్ ఆఫర్..
భారత్ సబ్సిడరీ జీఎస్కే ఫార్మా ఇన్వెస్టర్లకు రూ.6,389 కోట్ల ఓపెన్ ఆఫర్ 24.3% వాటా కొనుగోలుకు ప్రకటన షేరుకి రూ.3,100 చెల్లించనున్నట్లు వెల్లడి వచ్చే ఫిబ్రవరిలో ఆఫర్ ప్రారంభమయ్యే చాన్స్ ముంబై: విదేశీ బహుళజాతి సంస్థలు భారత్‌లో తమ అనుబంధ సంస్థలను పూర్తిగా తమ చెప్పుచేతల్లోకి తీసుకోవడానికి ఉవ్విళ్లూరుతున్నాయి. బ్రిటిష్ ఫార్మా దిగ్గజం గ్లాక్సోస్మిత్‌క్లైన్(జీఎస్కే)... దేశీ కంపెనీ జీఎస్కే ఫార్మాలో 24.33 శాతం వాటాను కొనుగోలు చేయడంకోసం సోమవారం ఓపెన్ ఆఫర్‌ను ప్రకటించింది. షేరుకి రూ. 3,100 చొప్పున చెల్లించేందుకు ముందుకొచ్చింది. ఇందుకోసం మొత్తం రూ. 6,389 కోట్లను వెచ్చించనున్నట్లు తెలిపింది. కాగా, యూరప్ ఎఫ్ఎంసీజీ దిగ్గజం యూనిలీవర్ కూడా భారతీయ అనుబంధ సంస్థ హిందుస్థాన్ యూనిలీవర్(హెచ్‌యూఎల్)లో ఈ ఏడాది ఓపెన్‌ఆఫర్ ద్వారా భారీగా వాటాను కొనుగోలు చేయడం తెలిసిందే. 52.48% నుంచి 67.28 శాతానికి వాటా పెంచుకుంది. దీనికోసం రూ. 19,180 కోట్లను వెచ్చించింది. వాస్తవానికి 75%కి వాటా పెంచుకోవడానికి ఆఫర్ ఇవ్వగా.. ఇన్వెస్టర్ల నుంచి ఆశించిన స్పందనలేకపోవడంతో లక్ష్యాన్ని చేరలేకపోయింది. 75 శాతానికి జీఎస్కే వాటా...! ప్రస్తుతం జీఎస్కే ఫార్మాలో జీఎస్కేకు 50.67% వాటా ఉంది. ప్రతిపాదిత ఓపెన్ ఆఫర్ ద్వారా రూ.10 ముఖ విలువ గల 2.609 కోట్ల జీఎస్కే ఫార్మా షేర్లను కొనుగోలు చేయాలని నిర్ణయించింది. తద్వారా తన వాటాను 75% వరకూ పెంచుకోవాలనేది జీఎస్కే ప్రణాళిక. కాగా, నియంత్రణ అనుమతులకు లోబడి.. వచ్చేఏడాది ఫిబ్రవరిలో ఆఫర్ ప్రారంభమయ్యే అవకాశాలున్నాయని జీఎస్కే ఒక ప్రకటనలో పేర్కొంది. మా నిబద్ధతకు నిదర్శనం...: జీఎస్కే ‘భారత్‌కు జీఎస్కే ఇస్తున్న వ్యూహాత్మక ప్రాధాన్యానికి ఈ ఆఫర్ నిదర్శనం. ఇక్కడి మార్కెట్‌పై దీర్ఘకాలిక ప్రణాళిక, నిబద్ధతలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నాం’ అని జీఎస్కే గ్రూప్ చీఫ్ స్ట్రాటజిక్ ఆఫీసర్ డేవిడ్ రెడ్‌ఫెర్న్ ఈ ఓపెన్ ఆఫర్‌పై స్పందించారు. భారత్‌లో కార్యకలాపాలపై ఈ ఆపర్ ఎలాంటి ప్రభావం చూపదని, ఇక్కడ తమ పెట్టుబడులు యథావిధిగా కొనసాగుతాయని ఆయన స్పష్టం చేశారు. భారత్‌లో విక్రయిస్తున్న ఫార్మా ఉత్పత్తులన్నింటినీ దాదాపు ఇక్కడే తయారుచేస్తున్నట్లు చెప్పారు. నాసిక్‌లో తమకు భారీ ప్లాంట్ ఉందని.. బెంగళూరులో మరో ప్లాంట్ ఏర్పాటు ప్రణాళికల్లో ఉన్నామని వెల్లడించారు. కాగా, జీఎస్కే ఫార్మాలో దాదాపు 5,000 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. జీఎస్కే కన్జూమర్‌లో ఇప్పటికే... మరో భారతీయ అనుబంధ సంస్థ జీఎస్కే కన్జూమర్ హెల్త్‌కేర్‌లో కూడా జీఎస్కే తన వాటాను ఈ ఏడాది జనవరిలో 43.2% నుంచి 72.5%కి ఓపెన్ ఆఫర్ ద్వారానే పెంచుకుంది. ఇందుకు రూ.4,800 కోట్లను వెచ్చించింది. హార్లిక్స్, బూస్ట్, మాల్టోవా, క్రోసిన్, ఈనో, అయొడెక్స్ వంటి ఉత్పత్తులను జీఎస్కే కన్జూమర్ భారత్‌లో విక్రయిస్తోంది. షేరు.. 20% జంప్ జీఎస్కే ఆఫర్ ప్రభావంతో జీఎస్కే ఫార్మా షేరు ధర సోమవారం బీఎస్ఈలో దాదాపు 20 శాతం వరకూ దూసుకెళ్లింది. రూ. 2,952 వద్ద 52 వారాల గరిష్టాన్ని కూడా తాకింది. చివరకు క్రితం ముగింపు(రూ.2,468)తో పోలిస్తే రూ.459 (18.6%) ఎగబాకి రూ.2,927 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈలో రూ.465(18.60%) లాభపడి రూ.2,925 వద్ద ముగిసింది. శుక్రవారం నాటి షేరు ముగింపు ధరతో పోలిస్తే తాజా ఓపెన్ ఆఫర్లో ప్రకటించిన ధర 26 శాతం అధికం కావడం గమనార్హం.