Sri Ram
-
రామ రామ.. ఏమిటీ డ్రామా!.. బొక్కబోర్లా పడ్డ కూటమి
-
మాక్ పోలింగ్ సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధం
సాక్షి, అమరావతి : ఈవీఎంలు, వీవీ ప్యాట్ల పరిశీలన చేయకుండా, వాటి స్థానంలో మాక్ పోలింగ్ నిర్వహించడం సుప్రీం కోర్టు తీర్పునకు విరుద్ధమని సీనియర్ న్యాయవాది సుబ్రహ్మణ్య శ్రీరామ్ హైకోర్టుకు నివేదించారు. ఈవీఎంలు, వీవీ ప్యాట్ల తనిఖీలు, పరిశీలన స్థానంలో మాక్ పోలింగ్ నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) జారీ చేసిన టీ–ఎస్వోపీ సుప్రీం కోర్టు తీర్పునకు విరుద్ధమంటూ వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి హైకోర్టులో దాఖలు చేసిన వ్యాజ్యంపై జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు మంగళవారం విచారణ జరిపారు. బాలినేని తరఫున సీనియర్ న్యాయవాది శ్రీరామ్ దాదాపు అరపూట వాదనలు వినిపించారు. సుప్రీం కోర్టు తీర్పు ఉద్దేశం, ప్రధాన సారాంశం, దానికి ఈసీఐ ఏ విధంగా వక్ర భాష్యం చెబుతోందో వివరించారు. మాక్ పోలింగ్ నిర్వహించాలని సుప్రీంకోర్టు ఎక్కడా చెప్పలేదని తెలిపారు. ఈవీఎంలు, వీవీ ప్యాట్ల పరిశీలన చేయకుంటే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఉద్దేశం నెరవేరదని అన్నారు. మాక్ పోలింగ్ వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని, ఈవీఎం, వీవీప్యాట్ల పనితీరు మాత్రమే తెలుస్తుందని తెలిపారు. ఈవీఎం, వీవీ ప్యాట్ల పరిశీలన వల్ల ఎన్నికల ప్రక్రియ మరింత పారదర్శకంగా ఉంటుందని సుప్రీం కోర్టు స్పష్టంగా చెప్పిందన్నారు. వాటి పరిశీలన వల్ల ఓడిపోయిన అభ్యర్థులకు ఓట్ల గురించి తెలుసుకునే అవకాశం, ఈవీఎంల ట్యాంపరింగ్ బయటపడే అవకాశం ఉందని తెలిపారు. ఇందుకే సుప్రీం కోర్టు ఎన్నికల ఫలితాలు వెల్లడైన తరువాత 45 రోజుల వరకు ఈవీఎంలు, వీవీ ప్యాట్లను భద్రపరచాలని ఆదేశించిందన్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో, పార్లమెంట్ నియోజకవర్గంలోని ఒక్కో అసెంబ్లీ సెగ్మెంట్లో 1 ఈవీఎం, వీవీ ప్యాట్‌ను ఎన్నికల సంఘం భౌతికంగా పరిశీలించేదని, నారా చంద్రబాబు నాయుడు 2019లో దాఖలు చేసిన వ్యాజ్యాన్ని విచారించిన సుప్రీం కోర్టు ఆ సంఖ్య 5కు పెంచిందని వివరించారు. పోలింగ్ సమయంలో ఓట్ల గురించి తెలుసుకునేందుకే ఈవీఎంలు, వీవీ ప్యాట్లు పరిశీలన చేయాలని సుప్రీం కోర్టు చెప్పిందన్నారు. అంతే తప్ప అప్పటి ఓట్లను పక్కన పెట్టేసి ఇప్పుడు మాక్ పోలింగ్ నిర్వహించడం వల్ల ఏమీ ప్రయోజనం ఉండదని స్పష్టంచేశారు. ఎన్నికల సంఘం చిత్తశుద్దిని తాము ప్రశ్నించడం లేదని, దాని వ్యవహారశైలిని మాత్రమే ప్రశ్నిస్తున్నామని శ్రీరామ్ చెప్పారు. ఈ వాదనలను కేంద్ర ఎన్నికల సంఘం తరపు సీనియర్ న్యాయవాది అవినాష్ దేశాయ్ తోసిపుచ్చారు. సుప్రీం కోర్టు తీర్పును పిటిషనర్ తప్పుగా అర్థం చేసుకున్నారని తెలిపారు. ఈవీఎం, వీవీ ప్యాట్ల లెక్కింపు సాధ్యం కాదన్నారు. ఒకవేళ ఇదే సుప్రీం కోర్టు ఉద్దేశం అయి ఉంటే నేరుగా చెప్పేదే తప్ప, బరŠట్న్ మెమొరీ (ఈవీఎం మైక్రో కంట్రోలర్‌లో శాశ్వతంగా నిక్షిప్తం చేసిన మెమొరీ) గురించి మాట్లాడేది కాదన్నారు. బరŠట్న్ మెమొరీని మాత్రమే పరిశీలించమని సుప్రీం కోర్టు చెప్పిందని తెలిపారు. అందుకే ఆ బాధ్యతలను ఈవీఎంల తయారీ సంస్థల ఇంజనీర్లకు అప్పగించిందన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి కోర్టు సమయం ముగియడంతో విచారణను బుధవారానికి వాయిదా వేశారు. -
పశ్చిమ బెంగాల్లో హై అలర్ట్!
పశ్చిమ బెంగాల్లో నేడు(బుధవారం) జరిగే శ్రీరామనవమి వేడుకల్లో ఎటువంటి ఉద్రిక్తతలు తలెత్తకుండా పోలీసులు పహారా కాస్తున్నారు. హిందూ జాగరణ్ మంచ్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో సుమారు ఐదువేల శోభాయాత్రలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) కోల్‌కతాలోని బరాసత్, సిలిగురి బరాబజార్‌లలో కూడా భారీ ఊరేగింపులు నిర్వహించే సన్నాహాల్లో ఉంది. మీడియాకు అందిన వివరాల ప్రకారం గతంలో శ్రీరామనవమి పండుగ సందర్భంగా మతపరమైన ఉద్రిక్తతలు తలెత్తాయి. ఈ నేపధ్యంలో ఇప్పుడు హూగ్లీ, హౌరా, ఉత్తర,దక్షిణ దినాజ్‌పూర్, అసన్సోల్, బరాక్పూర్లలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఎవరైనా శాంతిభద్రతలను ఉల్లంఘించినట్లు కనిపిస్తే కఠినంగా వ్యవహరిస్తామని పోలీసులు హెచ్చరించారు. ఈ సందర్భంగా ఒక ఒక పోలీసు అధికారి మాట్లాడుతూ నేటి ఊరేగింపులో ఆయుధాల బహిరంగ ప్రదర్శనకు అనుమతించబోమని, ఊరేగింపులను వీడియోగ్రాఫ్ చేయనున్నామన్నారు. గత ఏడాది మార్చి 30న హౌరాలో జరిగిన శోభాయాత్రలో పరిస్థితి అదుపు తప్పింది. ఆ తర్వాత జరిగిన హింసాకాండ రెండు జిల్లాలకు వ్యాపించింది. పలు ఘటనల్లో పది మంది గాయపడ్డారు. తాజాగా కలకత్తా హైకోర్టు .. విశ్వహిందూ పరిషత్, అంజనీ పుత్ర సేనకు కొన్ని షరతులు విధిస్తూ హౌరాలో రామనవమి శోభా యాత్రను నిర్వహించేందుకు అనుమతినిచ్చింది. నేడు (బుధవారం) జరిగే శ్రీరామనవమి శోభాయాత్రలో లక్షలాది మంది భక్తులు పాల్గొంటారని హిందూ జాగరణ్ మంచ్ తెలిపింది. హిందూ జాగరణ్ మంచ్ సభ్యుడు సుభాజిత్ రాయ్ మంచ్ మీడియాతో శాంతిభద్రతల పరిరక్షణ విషయంలో పోలీసులు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. -
తిరుమలలో తెలుగు హీరో సతీమణి.. హీరోయిన్లా ఉందంటూ కాంప్లీమెంట్స్
రోజా పూలు, ఒకరికొకరు సినిమాలతో తెలుగువారికి పరిచయమయ్యాడు శ్రీకాంత్ శ్రీరామ్. వాస్తవంగా ఆయన పేరు శ్రీకాంత్.. అప్పటికే టాలీవుడ్లో ఆ పేరుతో స్టార్ హీరో ఇక్కడ ఉండటంతో శ్రీరామ్‌గా వెండితెరకు పరిచయం అయ్యాడు. తమిళ్లో మొదట 'రోజా కూటం' అనే పేరుతో వచ్చిన ఈ సినిమా 'రోజా పూలు'గా తెలుగులోకి వచ్చింది. అందులో భూమిక హీరోయిన్ కావడంతో ఈ సినిమాకు మంచి క్రేజ్ వచ్చింది. వాస్తవంగా శ్రీరామ్ తెలుగువాడు కానీ ఆయన కోలీవుడ్‌లో స్థిరపడ్డారు. శ్రీరామ్ తాజాగా తిరుమలకు వచ్చారు. ఆయన సతీమణితో పాటు శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీరామ్ వివాహం 2008లో వందనతో జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు. కొడుకు ఆహిల్ వయసు 15 ఏళ్లు కాగా, కూతురు అహానా వయసు 13 ఏళ్లు.. శ్రీరామ్ తండ్రి చిత్తూరుకి చెందినవారు కాగా.. తల్లి స్వస్థలం తమిళనాడులోని కుంభకోణం. ఆయన ఎక్కువగా తమిళ చిత్రాల్లోనే నటించారు. కొన్నేళ్ల తర్వాత తాము మళ్లీ తిరుమలకు వచ్చామంటూ.. అందుకు సంబంధించిన ఫోటోలను వందన తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. దీంతో వందనను హీరోయిన్లా ఉన్నారంటూ నెటిజన్లు కాంప్లీమెంట్స్ ఇస్తున్నారు. ఒక షోలో శ్రీరామ్ తన భార్య వందన గురించి చెప్పుకొచ్చాడు. మీ భార్య మీకన్నా అందంగా ఉంటుంది కదా.. మీకెప్పుడైనా అసూయగా అనిపించిందా.. ? అన్న ప్రశ్నకు శ్రీరామ్ మాట్లాడుతూ.. అలా ఏం లేదు. నేను చాలా గర్వంగా ఫీల్ అవుతాను. అలాంటి అందమైన అమ్మాయి ప్రేమను పొందినందుకు.. అందరూ నన్ను చూసి కుళ్ళుకుంటారు కదా అని చెప్పుకొచ్చాడు. శ్రీరామ్ సినిమా విషయాలకొస్తే.. ఈ మధ్య పిండం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ప్రస్తుతం హీరోగా, సపోర్టివ్ రోల్స్ చేస్తూ బిజీగా మారాడు. View this post on Instagram A post shared by Vandana Srikanth (@vandanasrikanth) -
నామినేషన్‌కు ‘శ్రీరాముడు’.. వెంట వచ్చిన జనం!
ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి అరుణ్ గోవిల్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు, కార్యకర్తలు ఆయన వెంటవచ్చారు. టీవీ రామాయణంలో శ్రీరాముని పాత్ర పోషించిన అరుణ్ గోవిల్‌ను చూసేందుకు జనం రోడ్లపైకి చేరారు. అరుణ్ గోవిల్ తన నామినేషన్‌కు ముందు రోడ్‌షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అరుణ్ గోవిల్ ఒక ట్వీట్లో ‘ఈ రోజు నా జీవితంలో అత్యంత ముఖ్యమైన రోజు. మీరట్‌కు సేవ చేసే అవకాశాన్ని ఆ శ్రీరాముడు నాకు కల్పించాడు. లోక్‌సభ నామినేషన్ వేసేందుకు బయలుదేరుతున్నాను..జై శ్రీరామ్’ అని రాశారు. దీనికి ముందు అరుణ్ గోవిల్ స్థానిక ఔఘద్‌నాథ్ ధామ్ ఆలయాన్ని సందర్శించారు. నామినేషన్ అనంతరం అరుణ్ గోవిల్ మీడియాతో మాట్లాడుతూ ‘ఇది నాకు కొత్త ఇన్నింగ్స్‌కు నాంది. నా స్వస్థలం నుంచి నన్ను అభ్యర్థిగా నిలబెట్టారు. ఇప్పుడు నేను నా ప్రజల కోసం పని చేయగలుగుతాను. రాముని ప్రతి రూపంలో నాకు ప్రజల నుంచి లభించిన ప్రేమ కంటే ఒక నేతగా మరింత ఆదరణ దొరుకుతుందని భావిస్తున్నాను’ అని పేర్కొన్నారు. -
రఘురామ అమాయకుడేమీ కాదు..
సాక్షి, అమరావతి : సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డితో పాటు రాష్ట్ర ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుంటూ నర్సాపురం ఎంపీ కె.రఘురామకృష్ణరాజు ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేయడం వెనుక దురుద్దేశాలున్నాయని రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) శ్రీరామ్ హైకోర్టుకు నివేదించారు. ఆయన తన వ్యక్తిగత కక్షతోనే ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారని తెలిపారు. అంతేకాక.. తన గురించి అనేక వాస్తవాలను తొక్కిపెట్టి ఆయన ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. రఘురామ దాఖలు చేసిన వ్యాజ్యం రిట్, పిల్ నిబంధనలకు విరుద్ధంగా ఉందన్నారు. తనపై కేసుల గురించి కనీస స్థాయిలో కూడా ఆయన ప్రసా్తవించలేదన్నారు. లోక్‌సభ స్పీకర్‌కు వైఎస్సార్సీపీ ఇచ్చిన ఫిర్యాదు గురించి, జాతీయ కంపెనీ లా అప్పీలేట్ ట్రిబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ) ముందున్న కోర్టు ధిక్కార ప్రోసీడింగ్స్‌ను కూడా తన వ్యాజ్యంలో పేర్కొనలేదన్నారు. పైపెచ్చు తనపై ఎలాంటి సివిల్, క్రిమినల్ కేసులు లేవంటూ డిక్లరేషన్ కూడా ఇచ్చారని ఏజీ శ్రీరామ్ ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. అసలు రఘురామ చట్ట నిబంధనల గురించి తెలియని అమాయకుడేమీ కాదన్నారు. కోర్టుల్లో ఏం జరుగుతుందో ఆయన బాగా తెలుసన్నారు. అలాగే, కోర్టుల్లో జరిగే కేసుల విచారణలపై వ్యాఖ్యలు చేయడం కూడా ఆయనకు తెలుసునని తెలిపారు. పైగా ఆయన పార్లమెంట్ సభ్యుడని, అలాంటి వ్యక్తికి చట్ట నిబంధనల గురించి తెలియకపోవడానికి ఏముంటుందని శ్రీరామ్ చెప్పారు. అన్నీ తెలిసే ఆయన ఉద్దేశపూర్వకంగా తనకు సంబంధించిన కీలక విషయాలను పిటిషన్లో బహిర్గతం చేయకుండా తొక్కిపెట్టారని కోర్టుకు వివరించారు. ముఖ్యమంత్రి, ఇతర ప్రభుత్వ పెద్దలపై విషం చిమ్ముతూ తప్పుడు ప్రచారం చేయడాన్నే రఘురామకృష్ణరాజు పనిగా పెట్టుకున్నారన్నారు. కోర్టులు ఒకవైపు కేసులను విచారిస్తుంటే మరోపక్క ఆయన మీడియా ముందు ఆ కేసుల గురించి మాట్లాడటమే కాక, వ్యక్తులపై విషం చిమ్ముతూ ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతుంటారని ఏజీ వివరించారు. ఆయన పలు మీడియా ఛానెళ్లతో ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రభుత్వం, ఇతర ప్రభుత్వ పెద్దల గురించి మాట్లాడిన మాటల తాలూకు వీడియోలను పరిశీలించాలని ఆయన కోర్టును కోరారు. ఆ వీడియాలను తమ కౌంటర్‌తోపాటు జతచేశామని తెలిపారు. వాటిల్లో మాట్లాడిన మాటలను యథాతథంగా కౌంటర్లో పొందుపరిచామన్నారు. ఈ సందర్భంగా హైకోర్టు స్పందిస్తూ.. ఈ వీడియోలను తాము ఇంటి వద్ద చూస్తామని, కౌంటర్లో రాసిన అంశాలను చూస్తామని తెలిపింది. తదుపరి విచారణను మార్చి 4కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ ఉప్మాక దుర్గాప్రసాదరావు, జస్టిస్ మండవ కిరణ్మయి ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీచేసింది. సంక్షేమ పథకాల నిర్ణయాలపై పిల్.. రాష్ట్ర ప్రజల సంక్షేమ కోసం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అమలుచేస్తున్న పలు ప్రజా సంక్షేమ పథకాలకు దురుద్దేశాలను ఆపాదించడంతోపాటు వాటివల్ల పలువురికి లబ్ధిచేకూర్చేలా ప్రభుత్వ నిర్ణయాలు, విధానాలున్నాయని, వాటిపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ రఘురామ పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీని విచారణార్హతపై రాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం లేవనెత్తింది. దీంతో ధర్మాసనం కౌంటర్లు దాఖలు చేయాలని ప్రతివాదులందరినీ ఆదేశించింది. ఈ ఆదేశాల మేరకు ప్రతివాదులు కౌంటర్లు దాఖలు చేశారు. తాజాగా.. ఈ వ్యాజ్యంపై జస్టిస్ దుర్గాప్రసాదరావు నేతృత్వంలోని ధర్మాసనం గురువారం మరోసారి విచారించింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏజీ శ్రీరామ్ వాదనలు వినిపించారు. రఘురామ దురుద్దేశంతోనే పిల్ దాఖలు చేశారని, ఇలాంటి వ్యాజ్యానికి విచారణార్హతే లేదన్నారు. అడ్వొకేట్ జనరల్‌గా తాను కోర్టులకు సహకరిస్తుంటానని, తాను మొదట కోర్టు ఆఫీసర్నని, తనపై కూడా ఆయన నిందారోపణలు చేశారని తెలిపారు. ఆ వీడియోలనూ పరిశీలించాలని ఆయన ధర్మాసనాన్ని కోరారు. అందుకు ధర్మాసనం అంగీకరించింది. విచారణార్హతపై వాదనలకే పరిమితం కావాలి అంతకుముందు.. రఘురామ తరఫు న్యాయవాది ఉన్నం మురళీధరరావు నాయకులంటే ఎలా ఉండాలో వివరించడం మొదలుపెట్టారు. ధర్మాసనం ఆయన్ను వారిస్తూ, కేసు గురించి వాదనలు చెప్పాలని స్పష్టంచేసింది. దీంతో సీఎం అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, అందుకే తాము ఈ పిల్ దాఖలు చేశామన్నారు. ఈ వ్యాజ్యం దాఖలు వెనుక ఎలాంటి దురుద్దేశాలు లేవన్నారు. -
మూఢ నమ్మకాల నేపథ్యంలో వస్తోన్న ఎర్రచీర!
శ్రీరామ్, కారుణ్య చౌదరి ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న చిత్రం 'ఎర్ర చీర'. పద్మాలయ ఎంటర్టైన్మెంట్స్, సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సుమన్ బాబు దర్శకత్వం వహిస్తుండగా.. ఎన్వీవీ సుబ్బారెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ప్రముఖ టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు చేతుల మీదుగా విడుదల చేశారు. ట్రైలర్ చూస్తే స్వామీజీలు, మూఢ నమ్మకాల నేపథ్యంలో తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ట్రైలర్ చూడగానే హారర్, కామెడీ చిత్రంగా రూపొందించినట్లు కనిపిస్తోంది. ఈ ట్రైలర్ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు పెంచేసింది. ఈ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్ మనవరాలు బేబీ సాయి తేజస్విని నటించింది. ఈ చిత్రంలో అయ్యప్ప పి.శర్మ , కమల్ కామరాజు, సాయి తేజస్విని, రఘుబాబు, ఆలీ, అన్నపూర్ణమ్మ, గీత సింగ్, సత్య కృష్ణ, మహేష్, భద్రం, జీవ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి ప్రమోద్ పులిగార్ సంగీతమందించారు. ఈ సినిమా శివరాత్రి సందర్భంగా మార్చి 8న విడుదల కానుంది. -
మోదీ కఠోర దీక్ష విరమణ
-
బాలరాముడి నుదుటిన వజ్రనామం
-
Ayodhya Ram mandir: ‘భరతవర్ష’ పునర్నిర్మాణానికి నాంది
న్యూఢిల్లీ: అయోధ్యలోని జన్మస్థలానికి శ్రీరాముడి ప్రవేశం, ఆలయ ప్రాణప్రతిష్ట ఉత్సవం ‘భరతవర్ష’పునర్నిర్మాణానికి నాంది అని రాష్ట్రీయ స్వయం సేక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భాగవత్ పేర్కొన్నారు. ‘భరతవర్ష’లో సమాజంలోని ప్రతి ఒక్కరి సంక్షేమం, శాంతి, అభివృద్ధి, ఐక్యత, సామరస్య సాధ్యమవుతుందని ఆయన తెలిపారు. ఆర్ఎస్ఎస్ వెబ్సైట్లో ఆదివారం ఆయన రాసిన వ్యాసం పోస్ట్ అయ్యింది. అయోధ్యలో రామాలయ నిర్మాణం కోసం హిందూ సమాజం పోరాటం, సంక్షోభాలు ఇక ముగిసి పోవాలని ఆయన ఆకాంక్షించారు. అయోధ్య పునర్నిర్మాణం ఇక మనందరి బాధ్యతని పేర్కొన్నారు. ప్రపంచంలో అత్యధికులు పూజించే దైవం శ్రీరాముడేనని ఆయన తెలిపారు. మందిర నిర్మాణం ‘జాతి గౌరవానికి పునరుజ్జీవనం’గా ఆయన అభివర్ణించారు. ‘‘రామజన్మభూమిలో రామ్ లల్లా ప్రవేశం, ప్రాణ ప్రతిష్ట భరతవర్ష పునర్నిర్మాణానికి నాంది. ఇది అందరి శ్రేయస్సు కోసం, భేదభావం లేకుండా అందరినీ అంగీకరించడం, సామరస్యం, ఐక్యత, పురోగతి, శాంతి మార్గాన్ని చూపుతుంది. యావత్ ప్రపంచ పునర్నిర్మాణానికి బాటలు వేస్తుంది’’ అని భాగవత్ అన్నారు. -
Ram Mandir Ayodhya: పాలనలో రాముడే స్ఫూర్తి: మోదీ
షోలాపూర్/: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం శ్రీరాముని స్ఫూర్తితో నిజాయితీతో కూడిన పారదర్శక పాలన అందిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. సోమవారం అయోధ్యలో జరగనున్న రామ్‌లల్లా ప్రాణప్రతిష్ఠను చరిత్రాత్మక సందర్భంగా అభివరి్ణంచారు. ఆ రోజున దేశమంతటా ఇంటింటా రామజ్యోతిని వెలిగించాలని మరోసారి పిలుపునిచ్చారు. అది పేదరిక నిర్మూలనకు స్ఫూర్తిగా నిలుస్తుందని ఆశాభావం వెలిబుచ్చారు. ప్రధానిగా తాను మూడోసారి విజయం సాధించాక ‘మోదీ హామీ’ల దన్నుతో భారత్‌ను ప్రపంచంలో మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతానని ప్రకటించారు. శుక్రవారం మహారాష్ట్రలోని షోలాపూర్‌లో రూ.2,000 కోట్ల విలువైన 8 అమృత్ ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపన చేశారు. పీఎం ఆవాస్ యోజన పథకం కింద రాష్ట్రంలో నిర్మాణం పూర్తయిన 90 వేలకు పైగా ఇళ్లను లాంఛనంగా పేదలకు అందజేశారు. పీఎం స్వానిధి పథకం కింద 10 వేల మంది లబ్ధిదారులకు ఒకటో, రెండో వాయిదాల చెల్లింపుకు శ్రీకారం చుట్టారు. అనంతరం బహిరంగ సభలో మాట్లాడారు. ‘‘దేశమంతటా గొప్ప ఆధ్యాతి్మక వాతావరణం నెలకొని ఉంది. నాసిక్‌లో గత వారం అనుష్టానం మొదలు పెట్టాను. మీ ఆశీస్సులతో అయోధ్య వెళ్తున్నా’’ అని ప్రకటించారు. ఇళ్లు పొందిన లబ్ధిదారులను చూస్తుంటే తన హృదయం ఆనందంతో నిండిపోతోందంటూ భావోద్వేగానికి లోనయ్యారు. బాల్యంలో తనకిలాంటి ఇంట్లో ఉండే అవకాశం లేకపోయిందని చెమర్చిన కళ్లతో గుర్తు చేసుకున్నారు. ‘‘ప్రజల కలలు నెరవేరినప్పుడే నిజమైన ఆనందం. వారి ఆశీస్సులే నాకు అతి పెద్ద పెట్టుబడి. గత ప్రభుత్వాల్లో పేదల సంక్షేమానికి కావాల్సిన నియత్ (ఉద్దేశం), నీతి (విధానం), నిష్ట (చిత్తశుద్ధి) లోపించాయి. పేదల సంక్షేమం, శ్రామికుల గౌరవం కోసం 4 కోట్లకు పైగా పక్కా ఇళ్లు, 10 కోట్లకు పైగా టాయ్లెట్లు నిర్మించాం’’ అని చెప్పారు. బోయింగ్ క్యాంపస్ ప్రారంభం దొడ్డబళ్లాపురం/సాక్షి, చెన్నై: భారత్ శరవేగంగా సాధిస్తున్న ప్రగతిని అందిపుచ్చుకోవాల్సిందిగా అంతర్జాతీయ పెట్టుబడిదారులకు మోదీ పిలుపునిచ్చారు. పాతికేళ్లలో సంపన్న భారత నిర్మాణమే ప్రతి భారతీయుని లక్ష్యంగా మారిందన్నారు. ఆ దిశగా 25 కోట్ల భారతీయులను గత తొమ్మిదేళ్లలో పేదరికం నుంచి బయటికి తీసుకొచి్చనట్టు చెప్పారు. వైమానిక రంగంలోనూ దేశం శరవేగంగా ప్రగతి సాధిస్తోందని హర్షం వెలిబుచ్చారు. బెంగళూరు శివార్లలో దేవనహల్లి హైటెక్ డిఫెన్స్, ఏరోస్పేస్ పార్క్ క్యాంపస్‌లో రూ.1,600 కోట్లతో నిర్మించిన బోయింగ్ నూతన గ్లోబల్ ఇంజనీరింగ్, టెక్నాలజీ కేంద్రాన్ని మోదీ ప్రారంభించారు. భారత సామర్థ్యంపై ప్రపంచం పెట్టుకున్న నమ్మకానికి ఈ క్యాంపస్ తాజా నిదర్శనమన్నారు. భారత్ గత కొన్నేళ్లలో ప్రపంచంలో మూడో అతి పెద్ద దేశీయ వైమానిక మార్కెట్‌గా ఎదిగిందని గుర్తు చేశారు. అనంతరం మూడు రోజుల తమిళనాడు పర్యటన నిమిత్తం మోదీ చెన్నై చేరుకున్నారు. అభిమానులు, బీజేపీ మద్దతుదారుల స్వాగతం నడుమ నెహ్రూ స్టేడియం దాకా 4 కిలోమీటర్ల మేర రోడ్ షో జరిపారు. అక్కడ ఖేలో ఇండియా యూత్ గేమ్స్–2023ను ప్రారంభించారు. 2029 యూత్ ఒలింపిక్స్, 2036 ఒలింపిక్స్ నిర్వహణకు వేదికగా భారత్‌ను తీర్చిదిద్దుతామని ప్రధాని ప్రకటించారు. మహిళలే వృద్ధి సారథులు భారత్‌లో ప్రతి రంగంలోనూ మహిళల సారథ్యానికి పెద్దపీట వేస్తున్నట్టు మోదీ చెప్పారు. వైమానిక రంగంలోనూ మహిళలకు నూతన అవకాశాలు కలి్పంచేందుకు కేంద్రం కట్టుబడి ఉందన్నారు. ఇందుకుద్దేశించిన ‘బోయింగ్ సుకన్య’ పథకాన్ని ఈ సందర్భంగా మోదీ ప్రారంభించారు. భారత పైలట్లలో 15 శాతం మహిళలేనని మోదీ గుర్తు చేశారు. అంతర్జాతీయ సగటు కంటే ఇది మూడు రెట్లు ఎక్కువన్నారు. సుకన్య పథకం కింద సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ (స్టెమ్) తదితరాల్లో విద్యాభ్యాసానికి అమ్మాయిలకు అవకాశం కలి్పంచి వైమానిక రంగ ఉద్యోగాలకు అర్హులుగా తీర్చిదిద్దుతామని బోయింగ్ ప్రకటించింది. పైలట్ శిక్షణకు మహిళలకు స్కాలర్íÙప్లు ఇస్తామని పేర్కొంది. సిద్ధూ, అది సహజం! ‘మోదీ.. మోదీ’ నినాదాలపై ప్రధాని బెంగళూరు బోయింగ్ క్యాంపస్ ప్రారం¿ోత్సవం అనంతరం జరిగిన సభలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ప్రధాని ప్రసంగిస్తుండగా సభికులంతా మోదీ, మోదీ అంటూ పెద్దపెట్టున నినాదాలతో హోరెత్తించారు. దాంతో ఆయన కాసే పు ప్రసంగాన్ని ఆపేసి వింటూ ఉండిపోయారు. వేదికపై కూర్చు ని దీనంతటినీ తిలకిస్తున్న కర్ణాటక సీఎం సిద్ధరామయ్య వైపు తిరిగి, ‘‘ముఖ్యమంత్రీ జీ! ఐసా హోతా రహతా హై (అలా జరుగుతూంటుంది) అంటూ చమత్కరించారు. దాంతో సీఎంతో పాటు వేదికపై ఉన్న గవర్నర్ తదితరులు చిరునవ్వులు చిందించారు. -
ఆ రోజు ప్రపంచ వ్యాప్తంగా ‘రామోత్సవం’
సాక్షి, న్యూఢిల్లీ: అయోధ్య రామాలయంలో శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ట రోజు ప్రపంచ వ్యాప్తంగా వేడుకలు జరగనున్నాయి. అమెరికా, బ్రిటన్ సహా 50కిపైగా దేశాల్లో ‘రామోత్సవం’నిర్వహించనున్నారు. ఆయా దేశాల్లో నివసిస్తున్న రామభక్తులు ఇప్పటికే కొన్ని దేశాల్లో శోభాయాత్రలకు కూడా శ్రీకారం చుట్టారు. విశ్వహిందూ పరిషత్ (విశ్వ విభాగం) ఆధ్వర్యంలో మరి కొన్ని దేశాల్లో భారీగా సన్నాహాలు జరుగుతున్నాయి. జనవరి 22న అమెరికాలో 300, జర్మనీలో 100, మారిషస్‌లో 100, కెనడా, ఆ్రస్టేలియాల్లో 30, బ్రిటన్‌లో 25 కార్యక్రమాలు నిర్వహించనున్నారు. హిందువులు తక్కువగా ఉన్న ఐర్లాండ్‌తో పాటు మరికొన్ని దేశాల్లో ఒక్కో కార్యక్రమం ఉంటుంది. ఇలా మొత్తం 50కి పైగా దేశాల్లో 500 పైగా ధారి్మక, వైదిక, సాంస్కృతిక పరమైన సామూహిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు విశ్వహిందూ పరిషత్ వర్గాలు తెలిపాయి. -
2023లో బాగా భయపెట్టిన చిత్రం ఓటీటీలోకి వచ్చేస్తుంది
టాలీవుడ్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో శ్రీరామ్, ఖుషీ రవి జంటగా నటించిన చిత్రం ‘పిండం’. ఈ సినిమాతో సాయికిరణ్ దైదా దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఈ సినిమా డిసెంబర్ 15వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదల అయి బాక్సాఫీస్ వద్ద అంచనాలకు మించి కలెక్షన్స్ రాబట్టింది. టైటిల్, ఫస్ట్‌లుక్‌తోనే ఆసక్తి కలిగించిన ఈ చిత్రం 1930, 1990.. వర్తమానం.. ఇలా మూడు కాలక్రమాల్లో జరిగే కథగా అద్భుతంగా డైరెక్టర్ చూపించారు. ఇందులో అవసరాల శ్రీనివాస్, ఈశ్వరీ రావు, రవివర్మ కీలకపాత్రలు పోషించారు. ఇదిలా ఉంటే ఈ హారర్ మూవీ పిండం ఇప్పుడు ఓటీటీలోకి స్ట్రీమింగ్ కానుంది. తాజాగా ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. థియేటర్లలో ప్రేక్షకులను బాగా భయపెట్టిన పిండం చిత్రాన్ని వచ్చే ఏడాది అంటే 2024 జనవరి మొదటి వారంలో నెట్‌ఫ్లిక్స్‌లోకి రానున్నట్లు సమాచారం. 2023లో బాగా భయపెట్టిన చిత్రంగా పిండం గుర్తింపు పొందింది. ఈ సినిమా టైటిల్ 'పిండం' అని ఎందుకు పెట్టారో దర్శకుడు గతంలో ఇలా చెప్పారు. మొదటి సినిమానే ఇలాంటి పేరుతో ఎందుకు తీస్తున్నావని అందరూ ప్రశ్నించారు. అది నెగెటివ్ పదమని అంతా అనుకుంటారు. కానీ, పిండం అంటే ఆరంభం.. అంతం రెండూ ఉంటాయి. అందుకే ఆ పేరు పెట్టాను.' అని ఆయన అన్నారు. సినిమా చూశాక ఇదే సరైన టైటిల్ అని అందరికీ అనిపించింది.. హరర్ సినిమాలను అమితంగా ఇష్టపడే వారు తప్పక చూడాల్సిన సినిమా అని చెప్పవచ్చు. -
జనవరిలో అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ట
అయోధ్య: అయోధ్యలో నిర్మిస్తున్న రామమందిరంలో శ్రీరాముడి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాన్ని వచ్చే ఏడాది జనవరిలో నిర్వహించడానికి శ్రీ రామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు సన్నాహాలు చేస్తోంది. జనవరి 21, 22, 23 తేదీల్లో ఒక రోజు రామ్‌లల్లా విగ్రహ ప్రతిష్టాపన జరుగుతుందని ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ శుక్రవారం వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నారు. ఇక ఈ కార్యక్రమానికి సాధువులు, హిందూ పీఠాధిపతులు కూడా హాజరుకానున్నారు. 136 పీఠాలకు చెందిన 25 వేల మందికి పైగా సభ్యుల్ని విగ్రహ ప్రతిష్టాపనకు ఆహ్వానిస్తున్నట్టు తెలిపారు. జనవరి నెల అంతా అన్నదానం ఏర్పాటు చేస్తున్నారు. -
బౌద్ధాన్ని కలిపేసుకున్నారు!
బౌద్ధం బలంగా ఉన్న దేశాలలో రాముణ్ణి, రావణుణ్ణి ఇప్పటికీ బౌద్ధులు గానే పరిగణిస్తారు. వేల సంవత్సరాలుగా అక్కడ ప్రచారంలో ఉన్న సాహిత్య ప్రభావం అక్కడి ప్రజల మీద ఉంది. ఇతర దేశాలలో మనువాదుల ప్రభావం లేదు కాబట్టి, మార్పులకు లోను కాని మూల రచనలే అక్కడ కొనసాగుతున్నాయి. బౌద్ధుల ‘వైఫల్య సూత్రా’లలో ‘లంకావతార’ అనే ఒక పేరు తటస్థ పడుతుంది. అందులో బుద్ధుడు బౌద్ధ రాజు రావణుడికి ఉపదేశం ఇస్తాడు. అలాగే ‘దశరథ’ జాతక కథ అనేది మరొకటి ఉంది. ఈ రెండు కథలను జోడించి, సీతాపహరణం రావణుడితో చేయించి బ్రాహ్మణ వాదులు ఒక కొత్త కథకు రూపకల్పన చేశారని పరిశీలకులు చెబుతున్నారు. ఐదవ శతాబ్దంలో బుద్ధ ఘోషుడు ఈ సీతాపహరణాన్ని తన రచనలో వ్యతిరేకించాడని కూడా చెబు తారు. విష్ణువు, ఈశ్వరుడు, వ్యాసుడు, ఇంద్రుడు, బలి, వరుణుడు వంటి పేర్లన్నీ ఇప్పటికీ బ్రాహ్మణ సమా జంలో చలామణిలో ఉన్నాయి. అయితే ఈ పదాలు ఎక్క డివి? అని ప్రశ్నించుకుంటే – ఇవన్నీ పాలి, ప్రాకృత భాషల సమ్మేళనంతో మహా యానంలో ఏర్పడ్డవి. సంస్కృతం ఒక భాషగా అప్పటికి పూర్తిగా రూపుదిద్దుకోని సమ యంలో బ్రాహ్మణవాదులు పాలి, ప్రాకృత భాషా పదాల మిశ్రమాన్ని తమ సంస్కృత భాషలోకి స్వీకరించి వ్యవహా రంలోకి తెచ్చారు. అందువల్ల, సంస్కృతం – బౌద్ధ హైబ్రిడ్ సంస్కృతం (బీహెచ్ఎస్)గా నిలిచిపోయింది. దేశం ముస్లింల పాలనలో ఉన్నప్పుడు, బ్రాహ్మణా ర్యులు బౌద్ధ సాహిత్యాన్ని మార్చి తమ బౌద్ధ హైబ్రిడ్ సంస్కృత భాషలో అమోఘంగా తిరగరాసుకున్నారు. పాలి, ప్రాకృతాలు ముడి భాషలైతే అందులోంచి సంస్కరించబడిందే సంస్కృతమని భారతీయ పరిశోధకులు తేల్చి చెప్పారు. తమ పొట్ట కూటి కోసం బోధిసత్వుడి పేర్లు మార్చి, హిందూ దేవీ దేవతలకు ఆపాదించుకుని, తమకు లెక్కలేనంత మంది దేవతలున్నారని ఒక భ్రమ కల్పించారు. మహాయాన్ ‘వైపుల్య సుత్తం’లో భగవాన్ బుద్ధుడికి అనేకానేక పేర్లున్నాయి. ‘లలిత్ విస్తార్’ అనే గ్రంథంలో బుద్ధుడికి ఒక పెద్ద పేర్ల పట్టికే ఉంది. అలాగే, ‘మహా వస్తు’ అనే గ్రంథంలో పేర్ల జాబితా మరింత పెరిగి వంద దాటింది. ఎలాగైతే ఒక వస్తువుకు ఉన్న ఆకృతి, ఉపయో గాలను బట్టి, వేరు వేరు పేర్లతో పిలవబడుతుందో... అలాగే, బుద్ధుడి అనుయాయులు ఆయనను అనేక పేర్లతో పిలుచుకున్నారు. ‘లంకావతార్’ సూత్రంలో కొందరు ఆయనను ‘తథాగతుడు’ అని పిలిస్తే, మరికొందరు ‘స్వయంభూ నాయక్’ అనీ, ‘వినాయక్’ అనీ, ‘పరిణా యక్’ అనీ, బుద్ధుడు, రుషీ, వృషమ్, బ్రాహ్మణ, విష్ణు, ఈశ్వర్, ప్రథాన కపిల్, భూతాంత్, రామ్, వ్యాస్, శుక్ర్, ఇంద్ర్, బలి, వరుణ వంటి అనేక పేర్లతో పిలుచుకునే వారు. అనిరోధానుప్పాదం, శూన్యత, సత్యం, ధర్మధాతు, నిర్వాణ్ – అని కూడా అన్నారు. బుద్ధుణ్ణి దశావతారాలలో తొమ్మిదో అవతారంగా చేర్చుకుని, ఆయన గురించి వాస్తవాలు దాచేసి, బ్రాహ్మణా ర్యులు అబద్ధాలు ప్రచారం చేశారు. బుద్ధుడు ఇల్లువిడిచి వెళ్లి చెట్టుకింద ధ్యానముద్రలో ఉండగా ‘నాగ ముచిళిందు’డనే నాగుపాము వచ్చి, పడగ విప్పి ఆయనకు నీడ నిచ్చింది వంటి కల్పనలు ప్రచారం చేశారు. నాగుపాము అనేది కల్పన. అక్కడ వాస్తవమేమంటే, నాగజాతి ఆదివా సులు బుద్ధుని బోధనలకు ఆకర్షితులయ్యారు. ఆయన వెన్నంటే రక్షణగా ఉండేవారు. బుద్ధావతారానికి ముందున్న ఎనిమిది అవతారాలలో అభూత కల్పనలున్నట్టే, బుద్ధుడి నిజ జీవితాన్ని కూడా కల్పనలతో నింపేశారు. బుద్ధుడు ఒక చారిత్రక పురుషుడు. ఈ నేల మీద వాస్తవంగా తిరిగిన ఒక మహానుభావుడు. ఇది చాలా సున్నితమైన అంశం. అర్థం చేసుకోవడానికి అవగాహన కొంచెం పెంచుకోవాల్సి ఉంటుంది. వైదిక ధర్మాన్ని విశ్వసించే మునులు, రుషులు చేసే తపస్సుకూ, బుద్ధుడు చేసిన ధ్యానానికీ చాలా తేడా ఉంది. వైదికులు చేసే తపస్సు దైవాన్ని తలపోస్తూ చేసేది. దైవాన్ని విశ్వసించని బుద్ధుడు చేసింది తనలోకి తాను చేసిన ప్రయాణం! సమాజ హితం కోరి చేసిన తీవ్రమైన ఆలోచన. మనిషి జీవితంలో నైతికత ప్రాధాన్యత గురించిన అంతర్మథనం. ఈ లోకంలోని దుఃఖాన్ని పోగొట్టడమెలాగా? అని తీవ్రంగా మథనపడటం. జాగ్రత్తగా అవలోకిస్తేగానీ,రెండు ధర్మాల మధ్య తేడా ఏమిటో బోధపడదు. బుద్ధుణ్ణి ‘భగవాన్’ అని ఎందుకు పిలుచుకుంటారూ? అనే అనుమానం చాలామందికి వస్తుంది. బౌద్ధ ధమ్మం ప్రకారం భగవాన్ అంటే పరిపూర్ణతను సాధించినవాడు అని అర్థం. ఆ పదాన్ని కూడా కాపీ కొట్టి వైదిక ప్రచారకులు వాడుకున్నారు. ఉనికిలో లేని ఒక శూన్యాన్ని దేవుడిగా భావించి, పిలుచుకున్నారు. సర్వాంతర్యామి, జగద్రక్షకుడు లాంటి అర్థాలు చెప్పి, కొన్ని శతాబ్దాలుగా జనాన్ని నమ్మిస్తూ వస్తున్నారు. కనపడని ‘దేవుణ్ణి’ బ్రాహ్మణార్యులు భగవాన్ అంటే, ఒకప్పుడు ఈ నేల మీద జీవించిన ఒక మహా మానవుణ్ణి బౌద్ధులు భగవాన్ – పరిపూర్ణతను సాధించిన వాడా అని గౌరవించుకుంటున్నారు. ఆ తేడాను మనం గమనించాలి. డా‘‘ దేవరాజు మహారాజు వ్యాసకర్త కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కార గ్రహీత, జీవశాస్త్రవేత్త -
ఏ పనికి వెళ్లినా రామలక్ష్మణులను తలుచుకోవాలి
-
Bharat Jodo Yatra: వారివి రాముని ఆదర్శాలు కావు: రాహుల్
అగర్ మాల్వా(మధ్యప్రదేశ్): ఆర్ఎస్ఎస్, బీజేపీ నాయకులు శ్రీరాముడి నైతిక జీవనాన్ని అనుకరించడం లేదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శించారు. భారత్ జోడో యాత్రలో భాగంగా శుక్రవారం ఆయన అగర్‌మాల్వాలో జరిగిన ర్యాలీలో మాట్లాడారు. ‘మహాత్మాగాంధీ తరచూ ఉచ్ఛరించే ‘హే రామ్’అంటే ఒక జీవన విధానమని అర్థం. ప్రేమ, సోదరభావం, గౌరవం, తపస్సు అర్థాన్ని ప్రపంచానికి నేర్పింది’ అని ఒక సాధువు తనకు చెప్పారని రాహుల్ చెప్పారు. అదేవిధంగా, జై సియా రామ్ అర్థం సీత, రాముడు ఒక్కరేనని, శ్రీరాముడు సీత గౌరవం కోసం పోరాడారని ఆ సాధువు చెప్పారని పేర్కొన్నారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ నేతలు మాత్రం శ్రీరాముని అడుగుజాడల్లో నడవడం లేదని, ఆయన ఆదర్శాలను పాటించడం లేదని విమర్శించారు. మహిళలకు గౌరవం కల్పించేందుకు బీజేపీ నేతలు పాటుపడటం లేదని అన్నారు. -
ఆ యాత్ర ఉద్దేశమే వేరు
సాక్షి, అమరావతి: అమరావతి మాత్రమే రాజధానిగా ఉండాలంటూ పాదయాత్ర చేపట్టిన రైతులు.. ఇతర ప్రాంతాలకు వెళ్లి అక్కడి ప్రజలను రెచ్చగొడుతూ, వారి మనోభావాలను దెబ్బ తీస్తున్నారని అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్ హైకోర్టుకు నివేదించారు. హైకోర్టు విధించిన షరతులను అమరావతి రైతులు ఉల్లంఘిస్తున్నందున వారి యాత్రకు ఇచ్చిన అనుమతిని రద్దు చేయాలని కోరుతూ డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి.. యాత్రలో 600 మంది రైతులు మాత్రమే ఉండాలని, సంఘీభావం పేరుతో ఇతరులెవ్వరూ యాత్రలో పాల్గొనడానికి వీల్లేదంటూ ఇచ్చిన ఆదేశాలను సవరించాలని రైతులు దాఖలు చేసిన అనుబంధ పిటిషన్లపై న్యాయమూర్తి జస్టిస్ రఘునందన్‌రావు శుక్రవారం విచారణ జరిపారు. అది ముమ్మాటికీ రాజకీయ యాత్రే పోలీసుల తరఫున ఏజీ శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ.. ‘యాత్రలో పాల్గొనే 600 మంది రైతులకు పోలీసులు గుర్తింపు కార్డులు సిద్ధం చేశారు. వాటిని జారీ చేసేందుకు ప్రత్యేక కౌంటర్లు కూడా ఏర్పాటు చేశాం. అయితే కొద్ది మంది మాత్రమే గుర్తింపు కార్డులు తీసుకున్నారు. కోర్టు ఆదేశాల మేరకు గుర్తింపు కార్డులు చూపాలని పోలీసులు అడిగితే, కోర్టు విధించిన షరతులను సడలించాలని వారు అడుగుతున్నారు. యాత్ర వెంట నాలుగు వాహనాలకు బదులుగా 200 వాహనాలు వెంట ఉన్నాయి. అసలు అమరావతి రైతులు తలపెట్టిన యాత్ర ఉద్దేశమే వేరు. ఇటీవల గుడివాడలో అక్కడి ప్రజా ప్రతినిధులను ఉద్దేశించి.. గుడివాడ వచ్చాం.. తేల్చుకుందాం రా అంటూ తొడలు కొడుతూ తీవ్రంగా రెచ్చగొట్టారు. వారికి కోర్టు ఉత్తర్వులంటే గౌరవం లేదు. దైవ దర్శనం కోసం వెళుతున్నామని చెప్పి రాజకీయ యాత్రగా మార్చేశారు. అందువల్ల అమరావతి టు అరసవల్లి పాదయాత్రకు ఇచ్చిన అనుమతిని రద్దు చేయాలి’ అని ఆయన కోర్టును అభ్యర్థించారు. న్యాయ వ్యవస్థ ప్రతిష్టను దిగజారుస్తున్నారు.. మంత్రులు గుడివాడ అమర్నాథ్, కారుమూరి నాగేశ్వరరావు, ధర్మాన ప్రసాదరావు, బొత్స సత్యనారాయణ తరఫున సీనియర్ న్యాయవాదులు కేజీ కృష్ణమూర్తి, ఆర్.ఎన్.హేమేంద్రనాథ్‌రెడ్డి, చిత్తరవు రఘు, వీఆర్ఎన్ ప్రశాంత్ వాదనలు వినిపిస్తూ.. కొందరు రైతులు న్యాయ వ్యవస్థ, న్యాయమూర్తుల ప్రతిష్టను దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేయడం, టీవీల్లో చర్చలు పెట్టడం చేస్తున్నారని తెలిపారు. మంత్రులపై పలు ఆరోపణలు చేసిన నేపథ్యంలో వాటికి కౌంటర్ రూపంలో సమాధానం ఇస్తామన్నారు. రైతుల తరఫు న్యాయవాదులు ఉన్నం మురళీధరరావు, పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపిస్తూ.. సంఘీభావం పేరుతో యాత్రలో ఇతరులు పాల్గొనడానికి వీల్లేదన్న ఆదేశాలు యాత్రలో పాల్గొనాలనుకుంటున్న వారి హక్కులను హరించేలా ఉన్నాయన్నారు. గుర్తింపు కార్డులు పొందిన వారే కాకుండా ఇతరులు కూడా యాత్రలో పాల్గొంటారని, రొటేషన్ పద్దతిలో యాత్రను కొనసాగించేందుకు అనుమతి ఇవ్వాలన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. అవేం మాటలు? రైతులు దాఖలు చేసిన పిటిషన్లో ఉపయోగించిన భాషపై న్యాయమూర్తి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పాదయాత్ర చేస్తున్నది జంతువుల్లా అలా నడుచుకుంటూ వెళ్లడానికి కాదంటూ పిటిషన్లో పేర్కొనడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టును శాసించేలా పదజాలం ఉపయోగించడంపై కూడా మండిపడ్డారు. దీంతో రైతుల తరఫు న్యాయవాది ఉన్నం మురళీధరరావు క్షమాపణలు కోరారు. -
మతసామరస్యం.. ముస్లిం మతపెద్ద చేతులమీదుగా రాములోరి పెళ్లి
జగిత్యాల జోన్: జగిత్యాల మండలం లక్ష్మీపూర్ రామాలయంలో ఆదివారం మతసామరస్యం వెల్లివిరిసింది. ముస్లిం మతపెద్ద ఎండీ హబీబ్ సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని ఘనంగా జరిపించారు. గ్రామ ఆదర్శ బలహీన వర్గాల సంఘం ఆధ్వర్యంలో రామాలయం నిర్మించి ఏటా సీతారాముల కల్యాణం ఘనంగా జరిపిస్తున్నారు. సంఘం అధ్యక్షుడు స్వామివారి కల్యాణం దగ్గరుండి జరిపించడం ఆనవాయితీ. అయితే ఇటీవల జరిగిన ఎన్నికల్లో ముస్లిం మతపెద్ద ఎండీ హబీబ్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. దీంతో ఆయన వేదమంత్రాల సాక్షిగా రాములోరి పెళ్లి జరిపించారు. అనంతరం జరిగిన శోభాయాత్రలో భక్తులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా హబీబ్ మాట్లాడుతూ కుల, మతాలకు అతీతంగా తమ గ్రామంలో అన్ని పండుగలు జరుపుకుంటామన్నారు. వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లోనూ పాలు పంచుకుంటామని చెప్పారు. -
రారండోయ్ రాములోరి వేడుక చూద్దాం!
సాక్షి, అబిడ్స్/బహదూర్‌పురా: శ్రీరామ శోభాయాత్రకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆదివారం భాగ్యనగర్ శ్రీరామ నవమి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో వేడుకలు పెద్ద ఎత్తున నిర్వహించనున్నారు. సీతారామ్‌బాగ్ ద్రౌపది గార్డెన్ నుంచి వేలాది మందితో శోభాయాత్ర ప్రారంభం కానుంది. అధికారుల సంయుక్తాధ్వర్యంలో అన్ని ఏర్పాట్లూ చేసినట్లు భాగ్యనగర్ శ్రీరామ నవమి శోభాయాత్ర సమితి అధ్యక్షుడు డాక్టర్ భగవంతరావు తెలిపారు. శ్రీరామ నవమి శోభాయాత్రను పురస్కరించుకొని నగర పోలీసు కమిషనర్ సి.వి.ఆనంద్ శాంతి భద్రతలపై పోలీసు అధికారులు, సిబ్బందితో శనివారం సాలార్జంగ్ మ్యూజియంలో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. సీసీ టీవీలు, డ్రోన్లు, సమస్యాత్మక ప్రాంతాలు, మతపరమైన ప్రదేశాలు, అత్యంత రద్దీగా ఉండే షాపింగ్ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పోలీసులను మోహరిస్తున్నామన్నారు. శోభాయాత్ర కొనసాగే దారి పొడవునా సీసీ కెమెరాలతో నిఘా ముమ్మరం చేస్తామని, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే డయల్ ‘100’ లేదా స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని గోషామహల్ ఏసీపీ సతీష్ కుమార్ సూచించారు. రూట్‌మ్యాప్ ఇలా.. సీతారామ్‌బాగ్ ద్రౌపది గార్డెన్ నుంచి సీతారామ్‌పేట్ మీదుగా బోయిగూడ కమాన్, ప్రకాష్ టాకీస్, మంగళ్‌హాట్ పోలీస్‌స్టేషన్ మీదుగా ధూల్‌పేట్ ప్రధాన రోడ్డు వెంబడి శోభాయాత్ర కొనసాగుతుంది. పురానాపూల్ చౌరస్తా, జుమ్మెరాత్ బజార్, చుడీబజార్, బేగంబజార్ ఛత్రి, సిద్ధి అంబర్ బజార్, గౌడలిగూడ, కోఠి మీదుగా హనుమాన్ టేక్డీకి చేరుకుంటుంది. ఎమ్మెల్యే రాజాసింగ్ ఆధ్వర్యంలో ధూల్‌పేట్ గంగాబౌలి నుంచి శోభాయాత్ర నిర్వహిస్తారు. ధూల్‌పేట్ మాగ్రా నుంచి ఆనంద్‌సింగ్ ఆధ్వర్యంలో పాల్కి యాత్ర నిర్వహిస్తారు. (చదవండి: శ్రీరాముడు భారతీయుల ఇష్ట దైవం: సీఎం) -
అవకాశాలొస్తే తప్పకుండా తెలుగు సినిమాలు చేస్తా: శ్రీరామ్
శ్రీరామ్, సంచితా పదుకునే జంటగా, యధార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన తాజా చిత్రం ‘అసలేం జరిగింది’. ఎన్వీఆర్ దర్శకత్వం వహించగా, ఎక్సోడస్ మీడియా పతాకంపై మైనేని నీలిమా చౌదరి, కొయ్యాడ కింగ్ జాన్సన్ సంయుక్తంగా నిర్మించారు. గ్రామీణ నేపథ్యంతో కూడిన ఈ సినిమా ఈ నెల 22న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో శ్రీరామ్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే.. ► రాఘవ (ఎన్వీఆర్) మంచి దర్శకుడు, కథకుడు. అసలేం జరిగింది సినిమా కథ నాకు చెప్పేటప్పుడే దాంతో ప్రేమలో పడిపోయాను. కథ వినేటప్పుడే ఇది మంచి ప్రాజెక్టు అయినా, ఇందులో చాలా పరిమితులుంటాయని అర్థమైంది. సినిమాలు చేయడంలో ఈ బృందం మొత్తం చాలా ఉత్సాహంగా ఉండి, నిజాయితీగా ప్రయత్నాలు చేస్తుందని నాకు తెలియడంతో.. ఇందులో చేసి తీరాలని నిర్ణయించుకున్నాను. ► ఇంతకుముందు నా సినిమాలకు తెలుగు డబ్బింగ్ చెప్పుకునేటప్పుడు కొన్ని పదాలు ఇలా కాదు, అలా అనాలని చెప్పేవారు. నాకు హైదరాబాదీ తెలుగు బాగా వచ్చు. అది తెలంగాణ యాసకు దగ్గరగా ఉండటంతో నా పని సులువైంది. హైదరాబాదీని కావడంతో ఈ సినిమా డబ్బింగ్ చెప్పగలిగాను. అదొక్కటే కాదు, తెలంగాణ పల్లెల్లో షూటింగ్ జరగడంతో ఇప్పటివరకూ ఎప్పుడూ చూడని ప్రాంతాలకు వెళ్లగలిగాను. నాపై నమ్మకం ఉంచినందుకు నిర్మాత జాన్సన్ కు కృతజ్ఞతలు. ► చెన్నై నుంచి ఇక్కడకు షూటింగ్ రావడం ఇబ్బంది అవుతుందని అందరూ అనుకున్నారు. కానీ చకచకా సింగిల్ టేక్‌లలోనే షాట్లన్నీ ఓకే అవుతున్న తీరు చూసి మా యూనిట్ అంతా ఆశ్చర్యపోయింది. మరిన్ని తెలుగు సినిమాలు చేయాలని అందరూ కోరారు. నిజంగానే అవకాశాలొస్తే తప్పకుండా తెలుగు సినిమాలు చేస్తా. రొమాన్స్, ప్రేమ, ఫిక్షన్.. అన్నీ కలగలిసి ఉన్న ఈ సినిమాలో పాటల్లోని సాహిత్యం నాకు చాలా బాగా నచ్చింది. ► హీరోయిన్ సంచిత సినిమాలకు కొత్తే అయినా చాలా కష్టపడి పనిచేసే తత్వం ఆమెది. భాష తెలియకపోయినా, తన శాయశక్తులా కష్టపడింది. ఈ సినిమా షూటింగ్ బాగా వేడివాతావరణంలో జరగడం, కొన్నిసార్లు అసలు గ్యాప్ లేకుండా చేయడం.. ఇలాంటివి ఎన్నో ఉన్నా అన్నింటినీ సులభంగా తట్టుకుంది. కొన్ని లొకేషన్లు అసలు అమ్మాయిలకు సరిపోయేవి కావు. అయినా ఆమె ముందుకు రావడం నాకు చాలా నచ్చింది. -
సోషల్ మీడియా పోస్టింగ్స్ : వాడీవేడి వాదనలు
సాక్షి, అమరావతి : న్యాయస్థానంపై సోషల్ మీడియా వేదికగా వెలుగుచూసిన పోస్టింగులపై గురువారం హైకోర్టు విచారణ జరిపింది. కోర్టుపై వ్యాఖ్యలు చేసిన వారికి మంత్రి పదవులు ఇస్తున్నారని పిటిషనర్ తరపు న్యాయవాది న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చారు. కోర్టులపై పోస్టులు పెట్టిన వారికి గ్రామ సెక్రటేరియట్ ఉద్యోగాలివ్వాలని హైకోర్టు వ్యాఖ్యానించింది. ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన అడ్వకేట్ జనరల్ శ్రీరామ్, సీఐడీ తరఫు న్యాయవాది నిరంజన్‌రెడ్డి హైకోర్టు వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అంతేకాకుండా కోర్టులపై వ్యాఖ్యలు చేసేవారికి మంత్రి పదవులు ఇస్తున్నారని పిటిషనర్ తరఫు న్యాయవాది అభిప్రాయంపై ఏజీ ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయస్థానంలో ఇలాంటి వ్యాఖ్యలు సరికాదని కొట్టిపారేశారు. టీడీపీ టికెట్‌పై పోటీచేసి ఓడిపోయిన శివానందరెడ్డికి ఈ కేసులో ఇంప్లీడ్ అయ్యే అర్హతలేదని వాదించారు. (అమరావతి అభివృద్ధే రాష్ట్రాభివృద్ధా?) హైకోర్టులు మూసేయడానికి ఎవరో ప్రయత్నిస్తున్నారంటూ చేసిన వ్యాఖ్యలు న్యాయవ్యవస్థ నుంచి రావడం సరికాదన్నారు. ఇలాంటి వాటికి న్యాయ, రాజ్యాంగ ప్రక్రియల్లో చోటు లేదన్నారు. న్యాయమూర్తులు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సముచితం కాదని, సోషల్‌మీడియా పోస్టుల వెనుక ప్లాన్ ఉందడానికి దాఖలాలు లేవని వివరించారు. ప్రభుత్వ పెద్దలకు, ప్రభుత్వానికి ఆపాదిస్తూ వ్యాఖ్యలు చేయడం, ఆరోపణలు చేయడం సరికాదని పేర్కొన్నారు. హైకోర్టు పరిపాలనా వ్యవస్థనుంచి ఇలాంటి ఆరోపణలు రావడం దురదృష్టకరమని విచారం వ్యక్తం చేశారు. (న్యాయమూర్తులపై పోస్టులను తొలగించండి) న్యాయమూర్తులన్నా, కోర్టులన్నా తమకు అత్యంత గౌరవం ఉందని ఏజీ శ్రీరామ్, నిరంజన్‌రెడ్డి తెలిపారు. కోర్టు ఎవరైనా వ్యక్తులపై ఆరోపణలు చేసినప్పుడు వారిని పార్టీలుగా చేయాలని, వారి వాదనలు వినాలని కోరారు.న్యాయస్థానంపై సోషల్ మీడియా పోస్టుల వెనుక ఏదో కోణం ఉందన్న ఆలోచన అనవసరమని కొట్టిపారేశారు. మరోవైపు సీఐడీ విచారణ సరిగా చేయడం లేదంటూ రిజిస్ట్రార్ జనరల్ రిట్ పిటిషన్ దాఖలు చేశారు.స్పీకర్, కొందరు మంత్రులు, ఎంపీలు వ్యాఖ్యలు చేశారని పిటిషన్లో పేర్కొన్నారు. అంతేకాకుండా హైకోర్టుపై దాడిగానే పరిగణించాలంటూ రిజిస్ట్రార్ జనరల్ అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. తాజా పిటిషన్‌పై వాదనలు వినిపించి ఏజీ శ్రీరాం... న్యాయమూర్తులు వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. అయితే సోషల్ మీడియా పోస్టుల్లో రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి ప్రమేయం లేదన్న స్టేట్మెంట్ను రికార్డు చేయాలని కోరారు. ప్రభుత్వం, సీఐడీలపై హైకోర్టు ఎలాంటి ప్రతికూల వ్యాఖ్యలు, అభిప్రాయాలు, ఫైండింగ్స్ చెప్పని పక్షంలో సీబీఐకి అప్పగించేందు తమకు ఎలాంటి అభ్యంతరంలేదని న్యాయస్థానానికి ఏజీ విన్నవించారు. అయితే సోషల్ మీడియా సంస్థలు బహుళదేశాల్లో ఉన్నందున కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని సంస్థతో విచారణపై పరిశీలన చేస్తామని హైకోర్టు అభిప్రాయడింది. దీనికి కూడా తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ఏజీ పేర్కొన్నారు. కాగా న్యాయమూర్తులపై అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ, వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో వచ్చిన పోస్టులను చట్ట ప్రకారం తొలగించాలని హైకోర్టు మంగళవారం ఆయా సామాజిక మాధ్యమ కంపెనీలను ఆదేశించింది. ఆ పోస్టులకు సంబంధించిన యూఆర్ఎల్ను ఆయా కంపెనీలకు అందచేయాలని సీఐడీకి సూచించింది. -
నేపాల్ తప్పుడు ప్రచారాన్ని మానుకోవాలి
సాక్షి, విశాఖపట్నం : శ్రీరాముని జన్మభూమిపై నేపాల్ ప్రధాని ఓలీ చేసిన వ్యాఖ్యలను విశాఖ శారదా పీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర తీవ్రంగా ఖండించారు. రాముడు భారతదేశంలో జన్మించాడనేందుకు ఎన్నో చారిత్రక సాక్ష్యాలున్నాయని వాటిని వక్రీకరించడం సరికాదని పేర్కొన్నారు. చైనా ప్రధాని కుట్రలకు అనుగుణంగా నేపాల్ ప్రధాని నడుచుకోవడం దారుణమని, ఇకనైనా నేపాల్ తప్పుడు ప్రచారాన్ని మానుకోవాలని హితవు పలికారు. శ్రీరాముని జన్మస్థలం గురించి తెలిసీ తెలియని మాటలు సరికాదని పేర్కొన్నారు.భారత్‌లో జన్మించిన రాముడు ఎంతోమందికి ఆరాధ్య దైవమన్న స్వరూపానందేంద్ర.. ధర్మబద్ధమైన జీవితాన్ని సమాజానికి అందించిన దివ్యమూర్తి శ్రీరాముడని కొనియాడారు. రాముడి జన్మస్థలం అయోధ్య నేపాల్‌లోనే ఉందని, శ్రీరాముడు నేపాల్ దేశస్తుడంటూ నేపాల్ ప్రధాని సోమవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. గతంలోనూ భారత భూభాగంలోని లిపులెఖ్, కాలాపానీ ప్రాంతాలు తమవేనంటూ నేపాల్ ప్రధాని ఓలీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. . -
నేపాల్ ప్రధానికి మతి భ్రమించింది : అభిషేక్ సింగ్వి
ఢిల్లీ : రాముడి జన్మస్థలం అయోధ్య నేపాల్‌లోనే ఉందని, శ్రీరాముడు నేపాల్ దేశస్తుడంటూ ప్రకటించిన నేపాల్ ప్రధానిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పీఎం ఓలి కి మతి భ్రమించి ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని కాంగ్రెస్ నాయకుడు అభిషేక్ మను సింగ్వి ఫైర్ అయ్యారు. చైనా ప్రధాని ఆదేశాల మేరకే ఓలీ ఇలాంటి నీతిమాలిన ఆరోణలు చేస్తున్నారంటూ దుయ్యబట్టారు. గతంలోనూ భారత భూభాగంలోని లిపులెఖ్, కాలాపానీ ప్రాంతాలు తమవేనంటూ నేపాల్ ప్రధాని ఓలీ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఇప్పడు రాముడు నేపాలీ దేశస్తుడంటూ చేస్తున్న వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. (శ్రీరాముడు నేపాలీ.. అయోధ్య ఇక్కడే ఉంది! ) సోమవారం ఓ మీడియాతో ఓలీ మాట్లాడుతూ.. సాంస్కృతికంగా మేం అణచివేతకు గురయ్యాం. వాస్తవాలు మరుగునపడ్డాయి. మా సీతకు భారతీయ యువరాజు రాముడితో వివాహం అయిందని మేం నమ్ముతున్నాం. అయితే, అప్పటి అయోధ్య భారత్‌లో లేదు. అది నేపాల్‌లోని బిర్గుంజ్ దగ్గర్లో గ్రామం. భారత్‌లో ఇప్పుడున్న అయోధ్య కల్పితం’అని పేర్కొన్నారు. అంతేకాకుండా ఎలాంటి కమ్యూనికేషన్ లేని కాలంలో సీతను వివాహం చేసుకోవడానికి రాముడు జనక్‌పూర్‌కు ఎలా వచ్చాడంటూ ప్రశ్నించారు. ప్రస్తుత భారతదేశంలోని ఆయోధ్య నుంచి రాముడు జనక్‌పూర్‌కు రావడం అసాధ్యమంటూ పేర్కొన్నాడు. అయితే నేపాల్ కొత్త రాజకీయ మ్యాప్‌ను ప్రచురించడంతో రెండు దేశాల మధ్య దౌత్యపరమైన విభేదాలు కొనసాగుతున్న సమయంలో ఓలి ఈ విషయం తెరపైకి తేవడం గమనార్హం. తనను పదవీచ్యుతుడిని చేసేందుకు భారత్ ప్రోద్బలంతో ప్రయత్నాలు జరుగుతున్నాయని కూడా ఆయన ఇటీవల ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. #Oli #NepalPM seems 2hv lost his mental balance or is puppet &parrot like mouthing lines scripted by desperate #Chinese. 1st he claimed territories never earlier claimed by #Nepal. Now he relocates #Ram #Sita #Ayodhya & #RamRajya a few hundred miles from Ayodhya inside Nepal! — Abhishek Singhvi (@DrAMSinghvi) July 14, 2020 -
శ్రీరాముడు నేపాలీ.. అయోధ్య ఇక్కడే ఉంది!
కఠ్మాండు: భారత భూభాగంలోని లిపులెఖ్, కాలాపానీ ప్రాంతాలు తమవేనంటూ వివాదం రేపిన నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘అసలైన అయోధ్య నేపాల్‌లో ఉంది. శ్రీరాముడు నేపాల్ దేశస్తుడు’ అని ప్రకటించారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ..‘సాంస్కృతికంగా మేం అణచివేతకు గురయ్యాం. వాస్తవాలు మరుగునపడ్డాయి. మా సీతకు భారతీయ యువరాజు రాముడితో వివాహం అయిందని మేం నమ్ముతున్నాం. అయితే, అప్పటి అయోధ్య భారత్‌లో లేదు. అది నేపాల్‌లోని బిర్గుంజ్ దగ్గర్లో గ్రామం. భారత్‌లో ఇప్పుడున్న అయోధ్య కల్పితం’అని పేర్కొన్నారు. నేపాల్ కొత్త రాజకీయ మ్యాప్‌ను ప్రచురించడంతో రెండు దేశాల మధ్య దౌత్యపరమైన విభేదాలు కొనసాగుతున్న సమయంలో ఓలి ఈ విషయం తెరపైకి తేవడం గమనార్హం. తనను పదవీచ్యుతుడిని చేసేందుకు భారత్ ప్రోద్బలంతో ప్రయత్నాలు జరుగుతున్నాయని కూడా ఆయన ఇటీవల ఆరోపణలు చేశారు. ప్రధాని ఓలి తాజా వ్యాఖ్యలపై అధికార పార్టీ సీనియర్ నేత, మాజీ ప్రధాని ప్రచండ స్పందించారు. భారత్ వ్యతిరేక వ్యాఖ్యలు రాజకీయంగా గానీ, దౌత్యపరంగా గానీ సరికావన్నారు.