![Karonya Kathrin Cute Speech At Uttara Movie - Sakshi](/styles/webp/s3/article_images/2019/12/25/Untitled-1.jpg.webp?itok=BRb-Qor7)
శ్రీరామ్, కారుణ్య కత్రేన్ జంటగా తిరుపతి యస్. ఆర్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఉత్తర’. తిరుపతి, శ్రీపతి గంగదాస్ నిర్మించిన ఈ చిత్రం జనవరి 3న విడుదల కానుంది. ఈ సందర్భంగా కారుణ్య మాట్లాడుతూ – ‘‘నేను తెలుగు అమ్మాయినే. చిన్నతనం నుంచే నటన అంటే ఇష్టం. మా అమ్మగారి సపోర్ట్‌తో సినిమాలు చేస్తున్నాను. ‘పెళ్లి పుస్తకం (2013)’, ‘దానవీరశూర కర్ణ’ (2015) చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా చేశాను. ‘ఆట 5’, ‘రాములమ్మ’ సీరియల్ మంచి టర్నింగ్ పాయింట్
. నా నటనకు నంది అవార్డు వచ్చింది. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీగారి చేతుల మీదగా మల్టీటాలెంటెడ్‌గా జాతీయ అవార్డు అందుకున్నాను. కథానాయికగా ‘బంగారి బాలరాజు’ నా తొలి చిత్రం. ‘ఉత్తర’ నా రెండో చిత్రం. ఇందులో నా పాత్ర పేరు స్వాతి. అందమైన అమ్మాయిలకు పొగరు ఉంటే తప్పుకాదని నమ్మే వ్యక్తిత్వం స్వాతిది. ప్రతి ఊరిలోనూ ఉత్తరలాంటి వారు ఒకరుంటారు. నేను టైటిల్ రోల్ చేయలేదు. ప్రస్తుతం ‘ఇట్లు శ్రీమతి’తో పాటు మరో తెలుగు సినిమా, తమిళంలో ఒక సినిమా చేస్తున్నాను’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment