మూఢ నమ్మకాల నేపథ్యంలో వస్తోన్న ఎర్రచీర! | Sri Ram and Suman Babu Erracheera Official Trailer Out Now | Sakshi
Sakshi News home page

Erracheera Official Trailer: కామెడీ -హారర్‌ చిత్రంగా ఎర్రచీర.. అసక్తి పెంచుతోన్న ట్రైలర్!

Published Tue, Jan 30 2024 8:02 PM | Last Updated on Tue, Jan 30 2024 8:10 PM

Sri Ram and Suman Babu Erracheera Official Trailer Out Now  - Sakshi

శ్రీరామ్, కారుణ్య చౌదరి ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న చిత్రం 'ఎర్ర చీర'.  పద్మాలయ ఎంటర్టైన్మెంట్స్, సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సుమన్ బాబు దర్శకత్వం వహిస్తుండగా.. ఎన్‌వీవీ సుబ్బారెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ప్రముఖ టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు చేతుల మీదుగా విడుదల చేశారు. 

ట్రైలర్‌ చూస్తే స్వామీజీలు, మూఢ నమ్మకాల నేపథ్యంలో తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ‍ట్రైలర్‌ చూడగానే హారర్‌, కామెడీ చిత్రంగా రూపొందించినట్లు కనిపిస్తోంది. ఈ ట్రైలర్‌ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు పెంచేసింది. ఈ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్ మనవరాలు బేబీ సాయి తేజస్విని నటించింది. ఈ చిత్రంలో అయ్యప్ప పి.శర్మ , కమల్ కామరాజు, సాయి తేజస్విని, రఘుబాబు, ఆలీ, అన్నపూర్ణమ్మ, గీత సింగ్, సత్య కృష్ణ, మహేష్, భద్రం, జీవ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి ప్రమోద్ పులిగార్ సంగీతమందించారు.  ఈ సినిమా శివరాత్రి సందర్భంగా మార్చి 8న విడుదల కానుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement