వెంటాడే ఫీల్‌తో.. | Uttara Movie Trailer Launch | Sakshi

వెంటాడే ఫీల్‌తో..

Jul 21 2019 5:51 AM | Updated on Jul 21 2019 5:51 AM

Uttara Movie Trailer Launch - Sakshi

శ్రీరామ్, కారుణ్య కత్రేన్‌

శ్రీరామ్, కారుణ్య కత్రేన్‌ జంటగా నటిస్తున్న చిత్రం ‘ఉత్తర’. లైవ్‌ ఇన్‌ సి క్రియేషన్స్, గంగోత్రి ఆర్ట్‌ క్రియేషన్స్‌ పతాకాలపై తిరుపతి ఎస్‌.ఆర్‌. దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. ఈ చిత్రం ట్రైలర్‌ ఆవిష్కరణ కార్యక్రమంలో తమ్మారెడ్డి భరద్వాజ, రాజ్‌ కందుకూరి పాల్గొన్నారు. తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ– ‘‘సురేశ్‌ బొబ్బిలి సంగీతం అంటే చాలా ఇష్టం. సినిమా కథలోని ఆత్మను తన సంగీతంతో పలికించే ప్రయత్నం చేస్తాడు’’ అన్నారు. ‘‘ట్రైలర్‌ కొత్త ఫీల్‌ని కలిగించింది. ప్రతిభ ఉన్నవాళ్లంతా కలిసి చేసిన ఈ సినిమా విజయం సాధించాలి’’ అన్నారు రాజ్‌ కందుకూరి.

‘‘ఈ సినిమాలో నన్ను హీరోగా సెలెక్ట్‌ చేసిన దర్శకునికి రుణపడి ఉంటాను. సినిమాలో కొత్తదనం ఉంటే ప్రేక్షకులు, ఇండస్ట్రీ అందరూ ఆదరిస్తారు. అలాంటి మంచి సినిమానే మేం చేశాం’’ అన్నారు శ్రీరామ్‌. తిరుపతి మాట్లాడుతూ– ‘‘సహజమైన పాత్రలతో సినిమా ఉంటుంది. సినిమా విడుదలైన కొన్ని రోజుల వరకు ఆ ఫీల్‌ ప్రేక్షకులను వెంటాడుతుంది’’ అన్నారు. నిర్మాత శ్రీపతి గంగదాస్‌ మాట్లాడుతూ – ‘‘తిరుపతి సినిమాను బాగా తీశారు. అనుకున్నట్లుగానే సినిమా బాగా రావడానికి కారణం టీమ్‌’’ అన్నారు. ‘‘మంచి పాత్ర చేశాను’’ అన్నారు కారుణ్య.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement