
‘1940లో ఒక గ్రామం, కమలతో నా ప్రయాణం, జాతీయ రహదారి’ వంటి చిత్రాలతో అవార్డులు అందుకున్న దర్శకుడు నరసింహ నంది తెరకెక్కించిన తాజా చిత్రం ‘అమ్మాయిలు అర్థంకారు’. అల్లం శ్రీకాంత్, ప్రశాంత్, కమల్, మీరావలి హీరోలుగా, సాయిదివ్య, ప్రియాంక, స్వాతి, శ్రావణి హీరోయిన్లుగా నటించారు. శ్రీ లక్ష్మీ నరసింహ సినిమా పతాకంపై నందిరెడ్డి విజయలక్ష్మి రెడ్డి, కర్ర వెంకట సుబ్బయ్య నిర్మించిన ఈ సినిమా నిర్మాణానంతర పనులు జరుగుతున్నాయి.
ఈ సినిమా ట్రైలర్‌ని దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ బసిరెడ్డి, తెలుగు నిర్మాతల మండలి ప్రధాన కార్యదర్శి ప్రసన్నకుమార్, నిర్మాత మేడికొండ వెంకట మురళీకృష్ణ రిలీజ్ చేశారు. ‘‘నరసింహ తన అభిరుచికి తగ్గ సినిమాలు చేశారు. అదే కమర్షియల్ సినిమాలు తీసి ఉంటే ఇప్పటికే పెద్ద దర్శకుల జాబితాలో చేరేవారు’’ అన్నారు తమ్మారెడ్డి. ‘‘మధ్య తరగతి జీవితాల్లో జరిగే నాలుగు ప్రేమ జంటల కథలతో ఈ చిత్రం తెరకెక్కించాను’’ అన్నారు నరసింహ నంది. ‘‘చిత్తూరు, తిరుపతి ్ర΄ాంతాల యాసను నేపథ్యంగా తీసుకుని ఈ చిత్రాన్ని నిర్మించాం’’ అన్నారు కర్ర వెంకట సుబ్బయ్య.
Comments
Please login to add a commentAdd a comment