
ప్రశాంత్, కె.రాఘవేంద్రరావు, నల్లమోపు సుబ్బారెడ్డి
‘‘ప్రాణం ఖరీదు’ సినిమా టీజర్, ట్రైలర్ చాలా ఆసక్తిగా ఉన్నాయి. ఈ రోజుల్లో బాగా చదువుకున్నవాళ్లు, అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న వాళ్లు కూడా మంచి ఆలోచనలు, చక్కటి కథ, స్క్రీన్‌ప్లేతో ఇండస్ట్రీకి వస్తున్నారు.. వారందరికీ స్వాగతం. ‘ప్రాణం ఖరీదు’ చిత్రాన్ని చిన్నదిగా చూడొద్దు. మంచి సినిమాలను ఆదరిస్తే ఇంకా మంచి కుర్రోళ్లు హీరోలుగా, డైరెక్టర్‌గా, రైటర్స్‌గా వస్తారు’’ అని దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు అన్నారు. ప్రశాంత్, అవంతిక జంటగా తారకరత్న ముఖ్య పాత్రలో పి.ఎల్.కె. రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ప్రాణం ఖరీదు’.
పద్మప్రియ సమర్పణలో నల్లమోపు సుబ్బారెడ్డి నిర్మించిన ఈ సినిమా ట్రైలర్‌ని కె.రాఘవేంద్రరావు విడుదల చేశారు. ప్రశాంత్ మాట్లాడుతూ–‘‘నేను అడగ్గానే పెద్ద మనసుతో మా ‘ప్రాణం ఖరీదు’ సినిమా ట్రైలర్‌ని రిలీజ్ చేసి, మమ్మల్ని ఆశీర్వదించిన రాఘవేంద్రరావుగారికి కృతజ్ఞతలు. మా టీమ్ ఎంతో కష్టపడి విరామం లేకుండా ఇండియాలో ఈ సినిమా చిత్రీకరించాం. ఈ నెల 15న చిత్రం విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. షఫి, జెమినీ సురేష్,‘చిత్రం’ శ్రీను, ఫణి రాజమౌళి, సంజన, కెమెరా: మురళి మోహన్ రెడ్డి, సంగీతం: ‘వందేమాతరం’ శ్రీనివాస్.
Comments
Please login to add a commentAdd a comment