ప్రాణం ఖరీదు ఎంత? | Post-production works in progress on pranam khareedu | Sakshi
Sakshi News home page

ప్రాణం ఖరీదు ఎంత?

Published Fri, Dec 28 2018 5:56 AM | Last Updated on Fri, Dec 28 2018 5:56 AM

Post-production works in progress on pranam khareedu - Sakshi

అవంతిక, ప్రశాంత్

చిరంజీవి తొలి చిత్రం ‘ప్రాణం ఖరీదు’. కె.వాసు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం 1978లో విడుదలై మంచి విజయం అందుకుంది. ఇప్పుడు అదే పేరుతో ఓ సినిమా రూపొందడం విశేషం. ప్రశాంత్, అవంతిక జంటగా నందమూరి తారకరత్న ముఖ్య పాత్రలో పి.ఎల్‌.కె. రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ప్రాణం ఖరీదు’. పద్మప్రియ సమర్పణలో యన్‌.ఎస్‌ క్రియేషన్స్‌ పతాకంపై నల్లమోపు సుబ్బారెడ్డి నిర్మించిన ఈ సినిమా నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తి చేసుకుని, సెన్సార్‌ నుంచి యు/ఎ సర్టిఫికెట్‌ పొందింది.

నల్లమోపు సుబ్బారెడ్డి మాట్లాడుతూ– ‘‘అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే అంశాలతో తెరకెక్కిన చిత్రమిది. ‘ప్రాణం ఖరీదు’ ఎంత? ఆ టైటిల్‌ ఎందుకు పెట్టామన్నది సినిమా చూస్తే అర్థమవుతుంది. మా సినిమా బాగుందంటూ సెన్సార్‌ సభ్యులు అభినందించడం మాకు మరింత ఆనందాన్ని ఇచ్చింది. మూవీని త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: మురళీ మోహన్‌ రెడ్డి, సంగీతం: ‘వందేమాతరం’ శ్రీనివాస్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement