Pranam Khareedu
-
చిరంజీవి కెరీర్లో స్పెషల్.. 45 ఏళ్ల సినీ ప్రస్థానానికి ఆ సినిమానే నాంది
చిరంజీవి ఇండియన్ సినిమాకు పరిచయం అక్కర్లేని పేరు. 1978 సెప్టెంబర్ 22న మధ్యతరగతి వ్యక్తిగా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన ఆయన టాలీవుడ్లో నంబర్ వన్ హీరోగా ఎదిగారు. ఆయన ఇండస్ట్రీలోకి వచ్చే సమయానికి ఎందరో హేమా హేమీల్లాంటి నటులున్న తెలుగు చిత్ర పరిశ్రమలోకి శివ శంకర వరప్రసాద్ (చిరంజీవి అసలు పేరు) ప్రవేశించారు. అలా ఆయన ఒక్క మెట్టు ఎక్కుతూ తెలుగు చిత్ర సీమలో ఎన్నో సంచలనాలు క్రియేట్ చేశారు. (ఇదీ చదవండి: ఇదీ నీచమైన చర్య: సాయిపల్లవి) సెప్టెంబరు 22 చిరంజీవి కెరీర్లో అరుదైన, ఎప్పటికీ గుర్తిండిపోయే రోజు. ఆయన ఫ్యాన్స్‌కు పండుగ రోజు కూడా.. ఆయన కీలక పాత్రలో నటించిన 'ప్రాణం ఖరీదు' విడుదలై నేటికి 45ఏళ్లు పూర్తి అయింది. ఆయన జీవితంలో ఆగస్టు 22కి ఎంతో ప్రాముఖ్యత ఉందో.. సెప్టెంబరు 22కి కూడా అంతే ప్రాధాన్యం ఉంది. ఆగస్టు 22న ఆయన మనిషిగా ప్రాణం పోసుకున్న రోజు అయితే, సెప్టెంబరు 22 నటుడిగా 'ప్రాణం(ఖరీదు)' పోసుకున్న రోజు అని తెలిసిందే. మెగాస్టార్ 45 ఏళ్ల సినీ జీవితాన్ని గుర్తు చేసుకుంటూ.. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఒక పోస్ట్ చేశారు. 'మన ప్రియతమ మెగాస్టార్‌కి హృదయపూర్వక అభినందనలు. సినిమాల్లో 45 ఏళ్ల జర్నీని పూర్తి చేసుకున్న ఆయన అందరినీ మెప్పించే నటనతో ఇప్పటి వరకు కొనసాగారు.. కొనసాగుతున్నారు కూడా. మీరు మీ ఆన్ స్క్రీన్ ప్రదర్శనలతో పాటు మీ ఆఫ్ స్క్రీన్ మానవతా కార్యకలాపాలతో మిలియన్ల మందికి స్ఫూర్తినిస్తూనే ఉన్నారు. క్రమశిక్షణ, కృషి, అంకితభావం, శ్రేష్ఠతతో పాటు అన్నింటికంటే ముఖ్యంగా కరుణ వంటి విలువలను మాలో పెంపొందించినందుకు నాన్నగారికి ధన్యవాదాలు అంటూ..' ఆయన తెలిపారు. 1978 సెప్టెంబర్ 22న ప్రాణం ఖరీదు మొదటి సినిమాగా విడుదల కాగా.. ఇప్పటికీ 150కి పైగా చిత్రాల్లో నటించి ఎవరూ బీట్ చేయలేని పలు రికార్డులను ఆయన సొంతం చేసుకున్నారు. తన కుమార్తె సుష్మిత నిర్మాణంలో ఆయన 156వ సినిమా చేయనున్నారు. మరోపక్క వశిష్ట డైరెక్షన్లో కూడా మెగా 157 సినిమా చేయనున్నారు. ఈ రెండు చిత్రాలు త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్నాయి. Hearty Congratulations to our beloved Megastar @KChiruTweets garu on completing 45 amazing Years of Mega Journey in Cinema!❤️ What an incredible journey! Starting with #PranamKhareedu & still going strong with your dazzling performances😍 You continue to inspire millions both… pic.twitter.com/PymipPkN7N — Ram Charan (@AlwaysRamCharan) September 22, 2023 -
Chiranjeevi@44: నేటికి 44 ఏళ్లు పూర్తి, ‘చిరంజీవిగా.. నేను పుట్టిన రోజు ఇది’
మెగాస్టార్.. అంటే ఓ బిరుదు మాత్రమే కాదు తెలుగు సినీ పరిశ్రమలో ఇదొక బ్రాండ్. పరిశ్రమలో అంచలంచలుగా ఎదుగుతూ మెగా హీరోగా ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు ఆయన. తొలుత ఓ నటుడిగా ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి విలన్‌గా కూడా మెప్పించారు. అనంతరం హీరోగా మారి బాక్సాఫీసుకు బ్లాక్బస్టర్లను అందిస్తూ సుప్రీం హీరోగా ఎదిగారు. ‘స్వయం కృషి’ ఇండస్ట్రీలో ఎదిగిన ఆయన తన నటన, డాన్స్‌తో అభిమానుల గుండెల్లో మెగాస్టార్‌గా సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు. చదవండి: కొడుకు చంద్రహాస్‌పై ట్రోల్స్.. నటుడు ప్రభాకర్ షాకింగ్ రియాక్షన్ ఇక చిరు ఇండస్ట్రీకి పరిచయమై నేటికి 44 ఏళ్లు. ఆయన సినీరంగ ప్రవేశం చేసిన తొలి చిత్రం ‘ప్రాణం ఖరీదు’ విడుదలై 44 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా చిరు ట్వీట్ చేశారు. ఈ జన్మలో మీ రుణం తీర్చలేనిదంటూ అభిమానుల పట్ల ఆయన కృతజ్ఞత చూపించారు. ఈ మేరకు చిరు ట్వీట్ చేస్తూ.. ‘మీకు తెలిసిన ఈ చిరంజీవి, చిరంజీవిగా పుట్టిన రోజు నేడు. ఈ రోజు 22 సెప్టెంబర్ 1978. ప్రాణం ఖరీదు ద్వారా ప్రాణం పోసి.. ప్రాణప్రదంగా నా ఊపిరై.. నా గుండె చప్పుడై అన్ని మీరే అయి 44 సంవత్సరాలు నన్ను నడిపించారు. చదవండి: ఆర్ఆర్ఆర్పై బ్రిటిషర్ల విమర్శలు, రాజమౌళి స్ట్రాంగ్ కౌంటర్ నన్నింతగా ఆదిరించిన, ఆదరిస్తున్న ప్రేక్షకాభిమానుల రుణం ఈ జన్మలో తీర్చుకోలేను’ అంటూ చేతులు జోడించిన ఎమోజీలను జత చేశారు. కాగా ప్రాణం ఖరీదు చిత్రంలో చిరు నర్సయ్య అనే ఓ సాధారణ వ్యక్తిగా కనిపించారు. ఇదిలా ఉంటే 6 పదుల వయసులో కూడా చిరు ఇప్పటికీ యువ హీరోలకు పోటీగా సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నారు. గాడ్ ఫాదర్, భోళా శంకర్‌తో పాటు బాబీ డైరెక్షన్లో ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకు వాల్తేరు వీరయ్య అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. Chiranjeevi the Actor as you all know was born today, 22 September 1978, 44 years ago! I owe this limitless love and affection I receive from you all, to this day! I owe everything to this day! Humbled and Grateful! 🙏🙏🙏#PranamKhareedu #22Sept1978#DebutMovieRelease pic.twitter.com/LoFcpEo9Zo — Chiranjeevi Konidela (@KChiruTweets) September 22, 2022 -
రెండేళ్ల పాటు ఓకే చొక్కా ధరించాడు.. చిరంజీవి గురించి మీకు తెలియని విషయాలు
‘స్వయంకృషి’తో ఎదిగిన గొప్ప నటుడు ఆయన. టాలీవుడ్ బాక్సాఫీస్‌కు కొత్త లెక్కలు నేర్పించిన ‘మాస్టర్’. డ్యాన్స్‌తో ఎంతో మందికి స్ఫూర్తి నింపిన ‘ఆచార్యు’డు. యాక్షన్‌కు ‘గాడ్‌ఫాదర్’. ఇండస్ట్రీ హిట్లకు దారి చూపిన ‘హిట్లర్’. ప్రతి పాత్రని ‘ఛాలెంజ్’గా తీసుకొని ‘విజేత’గా నిలిచిన ‘హీరో’. కరోనా సమయంలో పేద కళాకారులకు ఆదుకున్న ‘ఆపద్బాంధవుడు’. రక్తదానం, నేత్రదానం అంటూ ఎంతో మంది ప్రాణాలను కాపాడుతూ ‘ అందరివాడు’ అనిపించుకున్న ‘మగ మహారాజు’.. ఆయనే మెగాస్టార్ చిరంజీవి. నేడు(ఆగస్ట్ 22) ఆయన పుట్టిన రోజు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి గురించి కొన్ని విశేషాలు... ►1955, ఆగష్టు 22 న పశ్చిమ గోదావరి జిల్లా మొగుల్తూర్ గ్రామంలో కొణిదెల వెంకట్రావ్, అంజనా దేవి దంపతులకు ప్రథమ సంతానంగా చిరంజీవి జన్మించారు. తమ్ముళ్లు నాగేంద్రబాబు, పవన్ కళ్యాణ్. తన 25 వ ఏటా అంటే 1980లో నాటి ప్రసిద్ద హాస్య నటుడు అల్లు రామలింగయ్య కుమార్తె సురేఖను పెళ్లి చేసుకున్నాడు. వీరికి ముగ్గరు సంతానం. ఇద్దరు కూతుళ్లు సుష్మిత, శ్రీజ , కుమారుడు రామ్ చరణ్. ► మెగాస్టార్ చిరంజీవి ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోగా ఎదిగారు. కెరీర్ ప్రారంభం లో చిన్న చిన్న పాత్రలు చేసి హీరోగా అవకాశాలు అందుకున్నారు. ఆ తరవాత తన డ్యాన్స్ నటన తో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. ► చిరంజీవికి తన బర్త్‌డే ఆగస్ట్ 22 ఎంత ప్రత్యేకమో.. సెప్టెంబర్ 22 కూడా అంతే స్పెషల్. ఎందుకంటే ఆయన నటించిన తొలి చిత్రం ‘ప్రాణం ఖరీదు’విడుదలైంది ఈ రోజే. 1978 సెప్టెంబర్ 22న ఈ చిత్రం విడుదలైంది. కొణిదెల శివశంకర్ వరప్రసాద్‌ని చిరంజీవిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసిన ‘ప్రాణం ఖరీదు’నాకు ఎప్పుడూ స్పెషలే అని చిరంజీవి చెబుతుంటాడు.(చిరంజీవి నటింటిన తొలి చిత్రం ‘పునాది రాళ్లు’అయినా.. ప్రాణం ఖరీదు ముందుగా విడులైంది) ► ‘రుద్రవీణ’లోని పాటలు చిరంజీవికి చాలా ఇష్టమట. చిరుకే కాదు ఆయన సతీమణి సురేఖకు కూడా ఈ పాటలే ఇష్టమట. ఈ సినిమాలోని ‘నమ్మకు నమ్మకు ఈరేయిని కమ్ముకు వచ్చిన ఈ మాయని’అనే పాట అంటే తనకు చాలా ఇష్టమని గతంలో చిరంజీవి తెలిపారు. ► చిరంజీవి చేతి రాత అస్సలు బాగుండదట. ఆయన రాసిన దాన్ని ఆయనే మళ్లీ చదవలేకపోతాడట. సమయం దొరికినప్పుడల్లా చేతి రాతను మళ్లీ ప్రాక్టీస్ చేస్తుంటానని గతంలో చిరంజీవి చెప్పారు. ► చిరంజీవికి ఫోటోగ్రఫీ అంటే చాలా ఇష్టం. వీలు చిక్కినప్పుడల్లా ప్రకృతి అందాలను తన కెమెరాలో బంధించి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటాడు. ‘నాకు చిన్నప్పటి నుంచి ఫోటోగ్రఫి అంటే చాలా ఇష్టం. చిన్నప్పుడు కెమెరాలు కొనుక్కోలేకపోయాను. సినిమాల్లోకి వచ్చిన తరువాత నాకు తెలియకుండానే అదొక హాబీగా మారిపోయింది’అని గతంలో ఓ ఇంటర్వ్యూలో చిరు చెప్పారు. ► ‘అంజి’ సినిమా కోసం ఓ షర్ట్‌ని రెండేళ్ల పాటు ఉతకకుండా వేసుకున్నాడట. ఈ సినిమా క్లైమాక్స్‌ని దాదాపు రెండేళ్ల పాటు తీశాడు దర్శకుడు కోడి రామకృష్ణ. క్లైమాక్స్‌లో చిరంజీవి వేసుకునే చొక్కా రెండేళ్ల పాటు అలాగే ఉతకకుండా ఉంచాల్సి వచ్చిందని అప్పట్లో దివంగత దర్శకుడు కోడి రామకృష్ణ ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. ఈ మూవీ ఫ్లాప్ అయినా కూడా తనకు, చిరంజీవికి మరుపురాని చిత్రమని చెప్పాడు . ► చిత్రపరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మక అవార్డు ‘ఆస్కార్’. ఈ అవార్డు అందుకోవడం ఎంత గొప్ప విషయమో.. ఆ వేడుకలో పాల్గొనటం కూడా అంతే గొప్ప విశేషం. దక్షిణాది నుంచి ఈ అరుదైన అవకాశం అందుకున్న తొలి హీరో చిరంజీవి. 1987లో జరిగిన అస్కార్ అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమంలో చిరంజీవి పాల్గొన్నారు. ► రెండు బిరుదులు పొందిన అరుదైన హీరోలలో చిరంజీవి ఒకరు. తొలినాళ్లలో ‘సుప్రీమ్ హీరో’గా పేరొందిన చిరంజీవి.. తర్వాత ‘మెగాస్టార్’గా క్రేజ్ సంపాదించుకున్నాడు. ‘మరణ మృదంగ’తర్వాత చిరంజీవి మెగాస్టార్‌గా మారాడు. ఈ చిత్ర నిర్మాత కేఎస్ రామారావు చిరుకి ఆ బిరుదు ఇచ్చాడు. ► ‘పసివాడి ప్రాణం' చిత్రం ద్వారా తెలుగు తెరపై మొట్ట మొదటిసారిగా బ్రేక్ డ్యాన్స్ చేసిన ఘనత చిరంజీవి కే దక్కుతుంది.చిరంజీవి డాన్సులకే కాకుండా ఫైట్స్ కు కూడా పెట్టింది పేరు. ఆయన ఫైట్స్ శైలి కూడా ప్రత్యేకంగా ఉంటుంది. డూప్ లేకుండానే రిస్క్ తీసుకుంటారు. ► అక్టోబర్ 2, 1998లో 'చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్' స్థాపించాడు. 'చిరంజీవి బ్లడ్ బాంక్', 'చిరంజీవి ఐ బాంక్' ఈ ట్రస్టు నడుపుతున్నారు. రాష్ట్రంలో అత్యధికంగా నేత్రదానం, రక్తదానం సాగిస్తున్న సంస్థలుగా గుర్తింపు పొందాయి. ► త్వరలోనే సినీ కార్మికుల కోసం ఓ ఆస్పత్రి కట్టించబోతున్నాడు. ఓ సినిమా నిర్మించాలంటే ఎంతో మంది కార్మికులు ఎంతో కష్టపడతారని, వారి కోసం తాను తన తండ్రి కొణిదెల వెంకట్రావు పేరుతో ఆస్పత్రి నిర్మిస్తానని ఇటీవల చిరంజీవి ప్రకటించారు. వచ్చే ఏడాదికల్లా ఈ ఆస్పత్రిని నిర్మించి అందుబాటులోకి తీసుకొస్తానని వెల్లడించారు. -
రచయిత సీఎస్ రావు ఇకలేరు
ప్రముఖ సినీ, నవలా, నాటక రచయిత చింతపెంట సత్యనారాయణరావు (సీఎస్ రావు) ఇకలేరు. కొంతకాలంగా ఆస్తమాతో బాధపడుతున్న ఆయన మంగళవారం హైదరాబాద్‌లో తుదిశ్వాస విడిచారు. తూర్పుగోదావరి జిల్లా ద్రాక్షారామంలో 1935 డిసెంబరు 20న జన్మించిన ఆయన ప్రస్తుతం హైదరాబాద్‌లోని సోమాజిగూడలో నివాసం ఉంటున్నారు. వృత్తి పరంగా లెక్చరర్ అయినప్పటికీ రచయితగా 80 కథలు, 18 నవలలతో పాటు పలు రేడియో నాటికలు, వేదిక నాటకాలు రాశారు. చిరంజీవి నటించిన మొదటి చిత్రం ‘ప్రాణం ఖరీదు’తో పాటు ‘ఊరుమ్మడి బతుకులు, కమలమ్మ కమతం, కుక్కకాటుకు చెప్పుదెబ్బ, తరం మారింది, నాయకుడు వినాయకుడు, మల్లెమొగ్గలు, యజ్ఞం, దీక్ష’ వంటి చిత్రాలకు కథలు, మాటలు అందించారు. ‘ఊరుమ్మడి బతుకులు’ సినిమాకు జాతీయ అవార్డు కూడా వచ్చింది. ‘సరదా రాముడు, సొమ్మొకడిది సోకొకడిది, మట్టి మనుషులు’ వంటి చిత్రాల్లో, పలు నాటకాల్లో నటించారు సీఎస్ రావు. తన సినీ, నాటక జీవితంలో ఎన్నో అవార్డులు, రివార్డులు గెలుచుకున్నారు. పలువురు నటీనటులకు నటనలో శిక్షణ ఇచ్చి, మంచి గురువుగా పేరు తెచ్చుకున్నారాయన. సినీ జీవితానికి దూరంగా ఉంటున్న ఆయన చిక్కడపల్లిలోని గీతాంజలి స్కూల్ కరస్పాండెంట్‌గా వ్యవహరిస్తున్నారు. ఆయనకు ఓ కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. వారిలో ఓ కుమారుడు సింగపూర్‌లో ఉన్నారు. కరోనా నేపథ్యంలో నెలకొన్న లాక్డౌన్ కారణంగా కుమారుడు అంత్యక్రియలకు రాలేని పరిస్థితి. సీఎస్ రావు మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు, సాంకేతిక నిపుణులు, రచయితలు సంతాపం తెలిపారు. కాగా, నేడు హైదరాబాద్‌లో సీఎస్ రావు అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు ఆయన సతీమణి సూర్యమణి తెలిపారు. లాక్డౌన్ నేపథ్యంలో బంధుమిత్రులెవరూ వ్యక్తిగత పరామర్శకు రావొద్దని ఆమె విజ్ఞప్తి చేశారు. -
చిన్న సినిమాలను ప్రోత్సహించాలి
‘‘అమెరికాలో ఉద్యోగం చేస్తున్న ప్రశాంత్ సినిమా మీద ప్యాషన్‌తో ‘ప్రాణం ఖరీదు’ చిత్రంలో హీరోగా నటించాడు. ఈ చిత్రం చూసాను. ప్రశాంత్ బాగా నటించాడు. మరో మంచి నటుడు ఇండస్ట్రీకి వస్తున్నాడు. చిన్న సినిమాలను అందరూ ప్రోత్సహించాలి’’ అని నిర్మాత కె.ఎల్.దామోదర ప్రసాద్ అన్నారు. ప్రశాంత్, అవంతిక జంటగా పియల్‌కె రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ప్రాణం ఖరీదు’. ఎన్‌యస్ క్రియేషన్స్ పతాకంపై నల్లమోపు సుబ్బారెడ్డి నిర్మించిన ఈ సినిమా త్వరలో విడుదలకానుంది. ‘వందేమాతరం’ శ్రీనివాస్ స్వరపరచిన ఈ చిత్రం పాటలను నిర్మాత కె.యల్.దామోదర ప్రసాద్ విడుదలచేశారు. పియల్‌కె రెడ్డి మాట్లాడుతూ– ‘‘సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రమిది. సుబ్బారెడ్డిగారు అన్నివిధాలా సహకరించి సపోర్ట్ చేశారు. శ్రీనివాస్ మంచి పాటలు ఇచ్చారు. యాక్షన్, సెంటిమెంట్ సీన్స్‌లో ప్రశాంత్ బాగా నటించాడు. మేము ఊహించిన దానికంటే అవంతిక బాగా చేశారు’’ అన్నారు. ‘‘సినిమా బాగా వచ్చింది. ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌చేసేలా ఉంటుంది’’ అని నల్లమోపు సుబ్బారెడ్డి అన్నారు. ‘‘మా సినిమా ఎవర్నీ నిరుత్సాహ పరచదు’’ అన్నారు ప్రశాంత్. ‘‘ప్రాణం ఖరీదు’ నా మూడో చిత్రం. ఈ సినిమాలో మంచి పాత్ర చేశాను’’ అని అవంతిక చెప్పారు. -
చిన్న సినిమాగా చూడొద్దు
‘‘ప్రాణం ఖరీదు’ సినిమా టీజర్, ట్రైలర్ చాలా ఆసక్తిగా ఉన్నాయి. ఈ రోజుల్లో బాగా చదువుకున్నవాళ్లు, అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న వాళ్లు కూడా మంచి ఆలోచనలు, చక్కటి కథ, స్క్రీన్‌ప్లేతో ఇండస్ట్రీకి వస్తున్నారు.. వారందరికీ స్వాగతం. ‘ప్రాణం ఖరీదు’ చిత్రాన్ని చిన్నదిగా చూడొద్దు. మంచి సినిమాలను ఆదరిస్తే ఇంకా మంచి కుర్రోళ్లు హీరోలుగా, డైరెక్టర్‌గా, రైటర్స్‌గా వస్తారు’’ అని దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు అన్నారు. ప్రశాంత్, అవంతిక జంటగా తారకరత్న ముఖ్య పాత్రలో పి.ఎల్.కె. రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ప్రాణం ఖరీదు’. పద్మప్రియ సమర్పణలో నల్లమోపు సుబ్బారెడ్డి నిర్మించిన ఈ సినిమా ట్రైలర్‌ని కె.రాఘవేంద్రరావు విడుదల చేశారు. ప్రశాంత్ మాట్లాడుతూ–‘‘నేను అడగ్గానే పెద్ద మనసుతో మా ‘ప్రాణం ఖరీదు’ సినిమా ట్రైలర్‌ని రిలీజ్ చేసి, మమ్మల్ని ఆశీర్వదించిన రాఘవేంద్రరావుగారికి కృతజ్ఞతలు. మా టీమ్ ఎంతో కష్టపడి విరామం లేకుండా ఇండియాలో ఈ సినిమా చిత్రీకరించాం. ఈ నెల 15న చిత్రం విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. షఫి, జెమినీ సురేష్,‘చిత్రం’ శ్రీను, ఫణి రాజమౌళి, సంజన, కెమెరా: మురళి మోహన్ రెడ్డి, సంగీతం: ‘వందేమాతరం’ శ్రీనివాస్. -
సస్పెన్స్ థ్రిల్లర్
ప్రశాంత్, అవంతిక జంటగా నందమూరి తారకరత్న ముఖ్య పాత్రలో పి.ఎల్.కె. రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ప్రాణం ఖరీదు’. పద్మప్రియ సమర్పణలో యన్. ఎస్ క్రియేషన్స్ పతాకంపై నల్లమోపు సుబ్బారెడ్డి నిర్మించిన ఈ చిత్రం సాంగ్ టీజర్‌ని సంగీత దర్శకుడు ‘వందేమాతరం’ శ్రీనివాస్ విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ– ‘‘ప్రాణం ఖరీదు’ చిత్రానికి నేనే సంగీతం అందించాను. ఇందులోని రెండు పాటల టీజర్స్‌ని నా చేతుల మీదుగా విడుదల చేయడం చాలా ఆనందంగా ఉంది. నేను టీజర్ చూశా. సస్పెన్స్ థ్రిల్లర్ మూవీని క్రియేట్ చేశారనిపించింది. త్వరలో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది’’ అన్నారు. ‘‘మా ‘ప్రాణం ఖరీదు’ చిత్రానికి ‘వందేమాతరం’ శ్రీనివాస్‌గారి మ్యూజిక్ చాలా హెల్ప్ అయింది. అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. అతి త్వరలో విడుదల కానుంది’’ అన్నారు ప్రశాంత్. ‘‘మా సినిమాని అందరూ చూసి ఆశీర్వదించాలి’’ అని అవంతిక అన్నారు. షఫి, జెమినీ సురేష్, ‘చిత్రం’ శ్రీను, ఫణి రాజమౌళి, సంజన నటించిన ఈ చిత్రానికి కెమెరా: మురళీ మోహన్ రెడ్డి. -
ప్రాణం ఖరీదు ఎంత?
చిరంజీవి తొలి చిత్రం ‘ప్రాణం ఖరీదు’. కె.వాసు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం 1978లో విడుదలై మంచి విజయం అందుకుంది. ఇప్పుడు అదే పేరుతో ఓ సినిమా రూపొందడం విశేషం. ప్రశాంత్, అవంతిక జంటగా నందమూరి తారకరత్న ముఖ్య పాత్రలో పి.ఎల్.కె. రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ప్రాణం ఖరీదు’. పద్మప్రియ సమర్పణలో యన్.ఎస్ క్రియేషన్స్ పతాకంపై నల్లమోపు సుబ్బారెడ్డి నిర్మించిన ఈ సినిమా నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తి చేసుకుని, సెన్సార్ నుంచి యు/ఎ సర్టిఫికెట్ పొందింది. నల్లమోపు సుబ్బారెడ్డి మాట్లాడుతూ– ‘‘అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే అంశాలతో తెరకెక్కిన చిత్రమిది. ‘ప్రాణం ఖరీదు’ ఎంత? ఆ టైటిల్ ఎందుకు పెట్టామన్నది సినిమా చూస్తే అర్థమవుతుంది. మా సినిమా బాగుందంటూ సెన్సార్ సభ్యులు అభినందించడం మాకు మరింత ఆనందాన్ని ఇచ్చింది. మూవీని త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: మురళీ మోహన్ రెడ్డి, సంగీతం: ‘వందేమాతరం’ శ్రీనివాస్. -
ప్రాణం ఖరీదు ఎంత?
ప్రశాంత్, అవంతిక జంటగా నందమూరి తారకరత్న ముఖ్య పాత్రలో పి.ఎల్.కె. రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ప్రాణం ఖరీదు’. పద్మప్రియ సమర్పణలో యన్.ఎస్ క్రియేషన్స్ పతాకంపై నల్లమోపు సుబ్బారెడ్డి నిర్మించిన ఈ సినిమా నిర్మాణానంతర పనులు జరుపుకుంటోంది. సుబ్బారెడ్డి మాట్లాడుతూ– ‘‘ప్రాణం ఖరీదు’ కథ వినగానే యూనిట్ అందరికీ బాగా నచ్చింది. అందుకే ఖర్చుకు వెనకాడకుండా అమెరికాలో 8 రోజులు, హైదరాబాద్ 45 రోజులు షూటింగ్ పూర్తి చేశాం. అతి త్వరలో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. పి.ఎల్.కె. రెడ్డి మాట్లాడుతూ– ‘‘పక్కా కమర్షియల్ లవ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన చిత్రమిది. అనుకున్నదానికంటే ఔట్ పుట్ చాలా బాగా వచ్చింది. ఈ చిత్రానికి ‘వందేమాతరం’ శ్రీనివాస్‌గారి సంగీతం, ఆర్.ఆర్ ఓ హైలైట్’’ అన్నారు. షఫి, ‘జెమిని’ సురేశ్, ‘చిత్రం’ శ్రీను, ఫణి రాజమౌళి, సంజన తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: మురళి మోహన్ రెడ్డి. -
యాతమేసి తోడినా...
‘ప్రాణం ఖరీదు’ చిత్రంలోని జాలాది రచించిన ‘యాతమేసి తోడినా...’ పాటపై జయరాజ్ అనుభూతులు ఆయన మాటల్లోనే... జాలాది రాసిన ఈ పాటలో అమ్మతనం , ప్రేమ, అనురాగాలు అణువణువునా కనిపిస్తాయి. కోటానుకోట్ల ప్రజలను తన వెంట తీసుకుని సూర్యుని చుట్టూ తిరిగి రావడంలో పుడమిలో అమ్మతనం కనిపిస్తుంది. అమ్మ చనుబాల ఋణం తీర్చుకోలేనిది. స్త్రీ ఒక బిడ్డను కని బలహీనమైనప్పటి నుంచి పురుషుడి ఆధిక్యత, స్త్రీ మీద పెత్తనం ప్రారంభమయ్యాయి. మారిన ఈ సమాజంలో అమ్మతనం, మాతృత్వం తెలిపే పాట, మనందరికీ ప్రాణమైన అమ్మ గురించి తెలిపే పాట. యాతమేసి తోడినా ఏరు ఎండదు/ పొగిలి పొగిలి ఏడ్చినా పొంత నిండదు/ దేవుడి గుడిలోదైనా పూరిగుడిసెలోదైనా/ గాలి ఇసిరి కొడితే.../ ఆ దీపముండదు... ఆ దీపముండదు...ఎంతో వేదాంతాన్ని ప్రబోధించే పాట ఇది. దీపం దేవుడి గుడిలో వెలిగించినా, పూరి గుడిసెలో వెలిగించినా, పెనుగాలి వీస్తే ఆ దీపం కొండెక్కుతుంది. భగవంతుడి దృష్టిలో అందరూ ఒక్కటే. ఆయనకు పెద్దా, చిన్నా తేడా లేదు... అని ఈ పల్లవిలో చెప్పారు జాలాది. అలా రాస్తూ రాస్తూ... పలుపు తాడు మెడకేస్తే పాడియావురా/ పసుపు తాడు ముడులేస్తే ఆడదాయిరా.../ కుడితి నీళ్లు పోసినా... అది పాలు కుడుపుతాది/ కడుపు కోత కోసినా... అది మనిషికే జన్మ ఇత్తాది/ బొడ్డు పేగు తెగి పడ్డ రోజు తెలుసుకో గొడ్డు కాదు ఆడదనే గుణం తెలుసుకో... అంటారు.పలుపుతాడు మెడకేస్తే పాడియావురా పసుపు తాడు ముడులేస్తే ఆడదాయిరా... అని స్త్రీని వర్ణించిన అద్భుతమైన ఈ పాట విన్నప్పుడల్లా గుండె బద్దలవుతుంది. నాకు ఇష్టమైన పాట. మధురమైన పాట. నేను మర్చిపోలేని పాట. అందరూ నడిచిన తోవ ఒక్కటే/ చీము నెత్తురులు పారే తూము ఒక్కటే/ భగవంతుడి సృష్టిలో మనమందరం సమానమే. అందరం నడిచే మార్గం ఒకలాగే ఉంటుంది. పేదలకు ఒక తోవ, సంపన్నులకు ఒక తోవ ఉండదు. అదేవిధంగా అందరిలోనూ చీము నెత్తురులు ప్రవహించే మార్గం ఒక్కటే అంటూ ఎంతో వేదాంతాన్ని బోధించారు జాలాది ఈ చరణంలో. భగవంతుడి దృష్టిలో అందరూ సమానమేననే భావం ఈ పాటలో ప్రస్ఫుటంగా కనపడుతుంది. జాలాది ఈ పాటలో ఎంతో వేదాంతాన్ని ప్రబోధించారు. పదికాలాల పాటు మనసులో నిలబడే పాట, అందరి మనసులనూ హత్తుకునే పాట. నాకు ఎంతో ఇష్టమైన పాట. – సంభాషణ: డా. వైజయంతి -
'ఆ పాత్రే నా కెరీయర్ని మలుపు తిప్పింది’
ఏపాత్రలోనైనా ఇట్టే ఇమిడిపోయి పాత్రకు న్యాయం చేసే విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు. తనకు హాస్యంతో కూడిన విలన్ పాత్రలంటే ఇష్టమని ఆయన అన్నారు. కోట శ్రీనివాసరావు శుక్రవారం రాయవరంలోని సాయితేజా విద్యానికేతన్ వార్షికోత్సవంలో పాల్గొనడానికి వచ్చారు.ఆ సందర్భంగా తన సినీ జీవిత విశేషాలను విలేకరులతో పంచుకున్నారు. ఆయన మాటల్లోనే... నాటకరంగమే పునాది నాకు నాటకాలు వేయడమంటే ఇష్టం. రంగస్థలంపై 20 ఏళ్లపాటు నటించాక అనుకోకుండా సినీరంగంలోకివచ్చాను. 1978-79లో ‘ప్రాణం ఖరీదు’ నాటకం వేస్తుండగా ఆ ప్రదర్శన తిలకించిన దర్శక, నిర్మాత క్రాంతికుమార్ ఆ నాటకాన్ని సినిమాగా మలచారు. అందులో నటించిన నటులనే సినిమాలోకి తీసుకున్నారు. అలా తొలిసారిగా ‘ప్రాణం ఖరీదు’ సినిమాలో నటించాను. ప్రతిఘటన మలుపు తిప్పింది.. ‘ప్రతిఘటన’ సినిమాలో ‘కాశయ్య’ పాత్ర నా సినిమా కెరీర్‌నే మలుపు తిప్పింది. పూర్తిగా సినిమాల్లో స్థిరపడ్డాక ఎస్బీఐలో చేస్తున్న ఉద్యోగాన్ని వదులుకున్నాను. 800 సినిమాల్లో నటించా ఇప్పటి వరకు సుమారు 800 సినిమాల్లో నటించాను. రక్షణ, గణేష్, గాయం, ఇంట్లో ఇల్లాలు వంటిట్లో ప్రియురాలు, ఆమె, హలో బ్రదర్, మామగారు నటనపరంగా సంతృప్తినిచ్చాయి. క్రమశిక్షణ అవసరం నేటి యువతరంసాధన తక్కువ..వాదన ఎక్కువ అన్న చందంగా ఉంది. కఠోర సాధన, క్రమశిక్షణ, ఓర్పు నటులకు చాలా అవసరం.