prashanth
-
ఏ లాంగ్వేజ్ అయినా 1 మంత్ లో నేర్చుకోవచ్చు..
-
నిరీక్షణ ముగిసె...
హాంగ్జౌ (చైనా): భారత టెన్నిస్ ప్లేయర్ విజయ్ సుందర్ ప్రశాంత్ తన కెరీర్లో గొప్ప విజయాన్ని అందుకున్నాడు. 19 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెర దించుతూ తన కెరీర్లో తొలి అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) టూర్ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. తమిళనాడుకు చెందిన 37 ఏళ్ల విజయ్ మంగళవారం ముగిసిన హాంగ్జౌ ఓపెన్ టోరీ్నలో భారత్‌కే చెందిన తమిళనాడు ప్లేయర్ జీవన్ నెడుంజెళియన్‌తో కలిసి పురుషుల డబుల్స్ విభాగంలో టైటిల్‌ను దక్కించుకున్నాడు. గంటా 49 నిమిషాలపాటు జరిగిన ఫైనల్లో విజయ్–జీవన్ ద్వయం 4–6, 7–6 (7/5), 10–7తో ‘సూపర్ టైబ్రేక్’లో కాన్‌స్టన్‌టిన్ ఫ్రాంట్జెన్–హెండ్రిక్ జెబెన్స్ (జర్మనీ) జోడీని ఓడించింది. విజయ్–జీవన్‌లకు 52,880 డాలర్ల (రూ. 44 లక్షల 22 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 250 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. టైటిల్ గెలిచే క్రమంలో రెండో సీడ్, మూడో సీడ్ జోడీలను విజయ్–జీవన్ ఓడించడం విశేషం. 35 ఏళ్ల జీవన్కిది రెండో ఏటీపీ డబుల్స్ టైటిల్. 2017లో రోహన్ బోపన్నతో కలిసి జీవన్ చెన్నై ఓపెన్ టైటిల్‌ను సాధించాడు. -
విజయ్ ‘ది గోట్’ మూవీ HD స్టిల్స్
-
బీటెక్ విద్యార్థి హత్య.. చంపింది వారు ముగ్గురే..
సాక్షి, హైదరాబాద్: బాలాపూర్‌లో బీటెక్ విద్యార్థి ప్రశాంత్ హత్య కేసులో మిస్టరీ వీడింది. ఈ హత్య కేసులో నిందితులను అతడి స్నేహితులుగానే గుర్తించారు పోలీసులు. ప్రశాంత్ హత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.వివరాల ప్రకారం.. బాలాపూర్‌లో బీటెక్ విద్యార్థి ప్రశాంత్‌ను హత్య చేశారు. బాలాపూర్ చౌరస్తాలోని హోటల్ 37 వద్ద ప్రశాంత్‌ను ముగ్గురు స్నేహితులు కత్తితో పొడిచి హత్య చేశారు. దీంతో, కేసు నమోదు పోలీసులు చేసి దర్యాప్తు చేపట్టారు. ముగ్గురు నిందితులను పట్టుకునేందుకు డీసీపీ సునీతా రెడ్డి ప్రత్యేక టీమ్ ఏర్పాటు చేశారు. అనంతరం, శుక్రవారం ఉదయం నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.మరోవైపు.. ప్రశాంత్, నిందితులు ముగ్గురు ఒకే బస్తీలో నివాసం ఉంటున్నట్టు పోలీసులు గుర్తించారు. అయితే, ఓ యువతి ప్రేమ విషయంలో నిందితులు.. ప్రశాంత్‌ను హత్య చేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇక, గడిచిన 15 రోజుల్లోనే బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు హత్యలు జరిగాయి. -
51 ఏళ్ల వయసులో పెళ్లి పీటలెక్కనున్న హీరో
కోలీవుడ్ హీరో ప్రశాంత్ రెండోసారి పెళ్లిపీటలెక్కనున్నాడు. 51 ఏళ్ల వయసున్న ఈయన త్వరలోనే మరోసారి వైవాహిక బంధంలోకి అడుగుపెట్టనున్నాడు. ఈ విషయాన్ని ఆయన తండ్రి, దర్శకుడు త్యాగరాజన్ వెల్లడించాడు.అంధగన్ సినిమా సక్సెస్ మీట్లో త్యాగరాజన్.. ప్రశాంత్ పెళ్లి గురించి మాట్లాడాడు. వధువు గురించి వెతుకులాట మొదలుపెట్టామని, త్వరలో గుడ్‌న్యూస్ చెబుతామని తెలిపాడు. ఈ మాటలతో స్టేజీపై ఉన్న ప్రశాంత్ కాస్త సిగ్గుపడినట్లు కనిపించాడు.కాగా 2005లో ప్రశాంత్‌కు గృహలక్ష్మి అనే మహిళతో పెళ్లి జరిగింది. కానీ ఈ బంధం ఎంతోకాలం నిలబడలేదు. 2009లో వీరు విడాకులు తీసుకున్నారు. అప్పటినుంచి ఈయన సింగిల్‌గానే ఉంటున్నాడు. కెరీర్‌పైనే పూర్తి ఫోకస్ పెట్టిన ప్రశాంత్ ఇన్నాళ్లకు మళ్లీ పెళ్లి గురించి ఆలోచిస్తున్నాడు.సినిమాల విషయానికి వస్తే.. ఈయన తెలుగులో లాఠి, ప్రేమ శిఖరం, తొలి ముద్దు చిత్రాల్లోనూ నటించాడు. వినయ విధేయ రామలో కీలక పాత్రలో మెప్పించాడు. ఇటీవలే అంధగన్లో హీరోగా నటించిన ఈయన ప్రస్తుతం గోట్ సినిమా చేస్తున్నాడు. ఇందులో విజయ్ స్నేహితుడిగా కనిపించనున్నాడు. -
పెద్ద ప్లానే వేస్తున్న నీల్...
-
అధ్యక్షుడిగా ట్రంప్ మళ్లీ గెలిస్తే?
అగ్రరాజ్యం అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. ఊహించినట్టుగానే రిపబ్లికన్ పార్టీ తన అధికారిక అధ్యక్ష అభ్యర్థిగా డోనాల్డ్ ట్రంప్‌ను ఎంచుకుంది. ఇప్పటికే ట్రంప్‌కు సానుకూల పవనాలు వీస్తుండగా, ఆయన మీద జరిగిన హత్యాయత్నం ఆయన విజయావకాశాలను మరింతగా పెంచేవుంటుంది. అయితే ఇంకోసారి ట్రంప్‌కు అధికార పగ్గాలు చిక్కితే రకరకాలుగా నష్టం జరిగే అవకాశాలు మెండు! ప్రజాస్వామ్యం, వాతావరణ మార్పు అంశాల్లో ట్రంప్ నిర్ణయాలు అమెరికాను బలహీనపరచడమే కాకుండా... భారత దేశానికీ ఆందోళన కలిగించేవే. ట్రంప్ తన పాత వైఖరినే కొనసాగిస్తే చైనా ఆధిపత్యం పెరుగుతుంది. అమెరికా అంతర్గతంగా బలహీనపడితే కూడా లాభపడేది చైనా మాత్రమే అన్నది గుర్తుంచుకోవాలి.అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భాగంగా జరిగిన తొలి ముఖాముఖి చర్చ జో బైడెన్‌కు ఓ దుస్వప్నంలా మిగిలిపోయింది. తడబాటు, తత్తరపాటు, మతిమరపు లతో బైడెన్ పై అమెరికాతోపాటు ప్రపంచవ్యాప్తంగానూ వ్యతిరేకులు పెరిగిపోయారు. బైడెన్ వైఫల్యం కాస్తా ట్రంప్‌కు వరంగా మారిందని చెప్పాలి. అధ్యక్షుడిగా బైడెన్ రికార్డు బాగానే ఉంది. కానీ చర్చ కార్య క్రమం మాత్రం అతడి వయసు, మానసిక ఆరోగ్యంపై అనేక సందే హాలు లేవనెత్తింది. డెమోక్రాట్ల విశ్వసనీయతతోపాటు వైట్‌హౌస్‌పై కూడా నమ్మకం సడలించే వ్యవహారమిది. డెమోక్రాట్లకు ఓటేయాల్సిందిగా మద్దతుదారులు కూడా అడిగేందుకు సందేహించే పరిస్థితి వచ్చింది. బైడెన్ ఇవేవీ పట్టించుకునే పరిస్థితిలో లేరు. పోటీ నుంచి తప్పుకొమ్మని చాలామంది సలహా ఇస్తున్నా... అధికారాన్ని వదులు కునేందుకు సిద్ధంగా లేరు. పైగా తాను మాత్రమే ట్రంప్‌ను ఓడించ గలనని అంటున్నారు.వాతావరణ మార్పును పట్టించుకోరు!ఈ నేపథ్యంలోనే అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఇంకోసారి ఎన్నికైతే ఏమిటి? అన్న ప్రశ్నకు సమాధానాలు వెతుక్కోవాల్సి వస్తోంది. చాలా రకాలుగా విధ్వంసం జరుగుతుందన్నది కచ్చితం. కాకపోతే భారతదేశం అంటే మనం ఆలోచించాల్సిన అంశాలు ప్రధానంగా రెండు ఉన్నాయి. శతాబ్దాలుగా... ఇప్పుడు కూడా అమె రికా వెలువరించే కర్బన ఉద్గారాలు భారీ స్థాయిలో ఉన్నాయన్నది తెలిసిందే. ఇందుకు బాధ్యత వహించే విషయంలో మాత్రం అగ్ర రాజ్యం బాధ్యతారహితంగా వ్యవహరిస్తోంది. వాతావరణ మార్పుల ప్రభావాన్ని అడ్డుకునేందుకు జరుగుతున్న ప్రయత్నాలకు తన వంతు సాయం అందించేందుకు తిరస్కరిస్తోంది. వినియోగదారుల కేంద్రంగా నడిచే ఆర్థిక వ్యవస్థగానే మిగిలిపోయిన అమెరికా విచ్చల విడి ఖర్చులు, వనరుల వృథాకు ప్రసిద్ధి. కపటత్వం కూడా ఎక్కువే. కోట్లాదిమందిని పేదరికం కోరల నుంచి తప్పించాల్సిన బాధ్యత ఉన్న దేశాలు అభివృద్ధి విషయంలో రాజీపడాల్సిందిగా కోరడం దీనికి నిదర్శనం. చారిత్రక బాధ్యతలను విస్మరించడం, తమ జీవనశైలిని మార్చుకునే ప్రయత్నాలు అస్సలు చేయకపోవడం అమెరికాకు మాత్రమే ప్రత్యేకం. ఈ విషయమై అటు డెమోక్రాట్లనూ, ఇటు రిపబ్లికన్లనూ ఇద్దరినీ నిందించాల్సిందే. అయితే బైడెన్ గద్దెనెక్కిన తరువాత ప్యారిస్ ఒప్పందానికి ఊ కొట్టడం, వాతావరణ మార్పులకు సంబంధించి చట్టాన్ని ఆమోదించడం, స్థానికంగా కర్బన ఉద్గారాల తగ్గింపునకు లక్ష్యాలను ఏర్పాటు చేసుకోవడం గమనార్హం. వాతావరణ సంక్షోభ నివారణ యత్నాలకు రుణసాయం ఇచ్చేలా బ్యాంకులను ప్రోత్సహించారు కూడా. ఈ చర్యలన్నీ నామమాత్రంగానైనా తానూ బాధ్యత తీసుకుంటున్న భావన కలిగించాయి. ఒకవేళ ట్రంప్ రెండోసారి పగ్గాలు చేపడితే ఇవేవీ కొనసాగించడన్నది కచ్చితం. తొలి దఫా గద్దెనెక్కి నప్పటి చందంగానే వాతావరణ మార్పులన్నవి అసలు సమస్యే కాదన్నట్టుగా నటిస్తారు.ట్రంప్ అధ్యక్షుడైతే పాశ్చాత్య దేశాల నుంచి భారత్‌పై వస్తున్న ఒత్తిడి తగ్గుతుందని అనుకునేందుకు బాగానే ఉంటుంది కానీ... అది స్వల్పకాలికం మాత్రమే. వాతావరణ మార్పులనేవి ప్రపంచం మొత్తం సమస్య. ఈ సమస్య ముదిరిపోవడంలో అమెరికా పాత్ర పెద్దది. పరిష్కారం కూడా అమెరికా ప్రమేయంతో మాత్రమే సాధ్యమవుతుంది. ట్రంప్ తన పాత వైఖరినే కొనసాగిస్తే ఈ విషయంలో చైనా ఆధిపత్యం పెరుగుతుంది. వాతావరణ పరిరక్షణకు సంబంధించి టెక్నాలజీల అభివృద్ధిలోనూ ముందుకు దూసుకెళుతుంది. ఫలితంగా ఇప్పటివరకూ వాతావరణ మార్పుల అంశంపై పని చేస్తున్న ప్రపంచ బ్యాంకు వంటి ఆర్థిక సంస్థలు నిర్వీర్యమవుతాయి. అమెరికాకు చెందిన ప్రైవేట్ కంపెనీలు వాతావరణ మార్పులకు సంబంధించి పెట్టుబడులు పెట్టడం నిలిచిపోతుంది. దీనివల్ల వాతావరణ మార్పు లను ఎదుర్కొనేందుకు ఆర్థిక సాయం కోసం ఎదురు చూస్తున్న దేశాలు నష్టపోవాల్సి వస్తుంది. వ్యవస్థలు దెబ్బతింటాయి!రెండో విషయానికి వద్దాం. అమెరికా ప్రజాస్వామ్య వ్యవస్థలో బోలెడన్ని లోటుపాట్లు ఉన్నాయి. న్యాయవ్యవస్ధను ఉదాహరణగా తీసుకుంటే అక్కడ న్యాయమూర్తులు శాశ్వత ప్రాతిపదికన నియ మితులవుతారు. ఫలితంగా వారికి బాధ్యత శూన్యం. పైగా న్యాయ మూర్తుల నియామకాలు అధికార వర్గం ద్వారా జరుగుతాయి. ఫలి తంగా వీరు పక్షపాతంగా ఉండేందుకూ, తాము నమ్మే భావజాలానికి అనుగుణంగా నడుచుకునేందుకూ అవకాశాలు ఎక్కువ. ఫలితంగా ప్రజాస్వామ్యంలో అతి కీలకమైన ఒక అంగం విపరీతమైన అధికా రాలు కలిగి ఉండటమే కాకుండా... సైద్ధాంతిక అంశాలపై విభజితమై ఉంటుంది.అంతెందుకు అమెరికా ఎన్నికల వ్యవస్థనే తీసుకుంటే... అధ్యక్ష తరహా ఎన్నికల వ్యవస్థ ఉంది. మెజారిటీ ప్రజల అభిప్రాయం, ఫలితాలతో నిమిత్తం లేదు. ఫలితంగా అవినీతిపరుడైన నేత... విరాళాలిచ్చే వారు కుమ్మక్కయ్యే అవకాశం ఉంటుంది. 2020 నాటి ఎన్నికలు ఎంతో మెరుగ్గానే జరిగాయని అనుకున్నా ఆ తరువాత అమెరికాలో సగం మంది ఎన్నికల ప్రక్రియను, అధికార మార్పిడి జరిగిన తీరును తప్పుపట్టడం గమనార్హం. ఈ సమస్యలకు అమెరికా రాజ్యాంగ నిర్మాణం ఒక కారణమని చెప్పాలి. వ్యవస్థలు అధికారంలో ఎవరున్నారు అన్న అంశం ఆధారంగా ఒడుదొడుకులకు లోను కాకూడదు. ట్రంప్ అమెరికా సుప్రీంకోర్టుకు ముగ్గురు న్యాయమూర్తుల నియామకాలకు ప్రతిపాదించడం ఇప్పటికే మానవ, మహిళ హక్కుల విషయంలో ప్రతికూల పరిస్థి తులు తెచ్చి పెట్టాయి. అబార్షన్ విషయంలో అధ్యక్షుడికి తిరుగులేని అధికారాలు దక్కిన విషయం ఇక్కడ చెప్పుకోవాలి. ఈ పరిస్థితుల్లో ట్రంప్ గద్దెనెక్కితే మరింత మంది న్యాయమూర్తులను ఆయన సుప్రీంకోర్టులో నియమించవచ్చు. ఎన్నికల ఫలితాలను సవాలు చేయడం మాత్రమే కాకుండా... నేరం రుజువైనా అధికారంలో కొనసాగేందుకు ప్రయత్నించడం వంటివి ఎక్కువ అవుతాయి. జాతి వివక్ష పెరగడం, క్రిస్టియన్ జాతీయతా భావజాలం పెరగడం ప్రజాస్వామ్యానికి మంచి చేసే అంశాలు కాదు. ట్రంప్ గెలుపుతోపాటు సెనేట్‌లో కూడా రిపబ్లిక న్లకు ఆధిక్యం దక్కితే గోరుచుట్టుపై రోకటిపోటు చందం కాక తప్పదు.భారత్ ఆలోచించాలి!భారతదేశ అధికార వర్గాలు ట్రంప్ మరోసారి గెలిస్తే ఏమిటన్న అంశంపై ఆలోచన మొదలుపెట్టాల్సిన అవసరం ఉంది. ట్రంప్ రాకతో ప్రజాస్వామ్యంలో మన లోటుపాట్లు పక్కకు వెళ్లిపోతాయిలే అనుకుంటే అది తప్పే అవుతుంది. వాస్తవానికి సమస్య మరింత పెరుగుతుంది. అమెరికా వ్యవస్థలు, సంస్థల పనితీరుపై చర్చ ఎంత పెరిగితే ఆ దేశ రాజకీయం అంత అస్థిరమవుతుంది. సమాజం కూడా రకరకాల అంశాలపై ముక్కలు అవుతుంది. ఈ పరిణామాలన్నీ చివ రకు అంతర్గత కుమ్ములాటలకూ, సంఘర్షణలకూ తావిస్తాయి.అంతర్జాతీయ, దేశీ రాజకీయాలపై అమెరికాను ఎంత కఠినంగానైనా విమ ర్శించవచ్చు కానీ... ఆ దేశం అంతర్గతంగా బలహీనపడితే లాభ పడేది చైనా మాత్రమే అన్నది గుర్తుంచుకోవాలి. అంతేకాదు... అమె రికాకు వలస వెళ్లిన, ఉద్యోగాలు చేసుకుంటున్న భారతీయులకూ, ఇతర దేశస్థులకూ అంత మంచిది కాదు. ట్రంప్ తిరిగి అధ్యక్షుడు కావడం ప్రపంచ రాజకీయాలు, వాతావరణ మార్పుల సమస్యలకు నిర్ణయా త్మకం కానుందన్నది నిస్సందేహం!ప్రశాంత్ ఝా వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్(‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో) -
ప్రసూబేబీ.. నటనే హాబీ!
మదనపల్లె సిటీ: అవును అతడు సోషల్ మీడియా సూపర్‌స్టార్. యూట్యూబ్‌లో 8.5 మిలియన్ల సబ్స్క్రైబర్లు, ఇన్‌స్ర్ట్రాగామ్‌లో భారీ ఫాలోయింగ్. ప్రసూబేబిగా సూపర్ ఫేమస్. చదివింది ఎంటెక్. ప్రయత్నిస్తే సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నత ఉద్యోగం వస్తుంది. లక్షలాది రూపాయల జీతం లభిస్తుంది. కానీ అతను అందరూ వెళ్లేదారిలో కాకుండా తనకంటూ ప్రత్యేక మార్గం ఉండాలని భావించాడు. నిండు చందురుడు ఒకవైపు–చుక్కలు ఒకవైపు’ అని భావించే తత్వం ఆయనది. అందుకే అతను సోషల్ మీడియాను వేదికగా ఎంచుకున్నాడు. ఆ మార్గంలో వెళ్లే క్రమంలో మొదట అందరూ హేళన చేశారు. అయినా నిరుత్సాహపడలేదు. మరింత కసి, పట్టుదలతో ముందుకెళ్లాడు. ఎంచుక్ను రంగం ఏదైనా సరే, పట్టుదల, చిత్తశుద్ధి ఉంటే విజయం తనవెంటే ఉంటుందని నిరూపించాడు. ఇంటిల్లిపాదీ ఆనందించే వీడియోలను సొంతంగా రూపొందిస్తూ అందులో తానే నటిస్తూ సోషల్ మీడియా సూపర్‌స్టార్‌గా ఎదిగాడు. అతనే మదనపల్లె నియోజకవర్గం నిమ్మనపల్లె మండలం రాచవేటివారిపల్లె(గారబురుజు)కు చెందిన ప్రశాంత్. అతని విజయగాథపై ‘సాక్షి’ప్రత్యేక కథనం..👉సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎంతో మంది ప్రతిభావంతులు వెలుగులోకి వస్తున్నారు. తమకున్న నైపుణ్యాలు ప్రదర్శిస్తూ ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంటున్నారు. అలాంటివారిలో ప్రశాంత్ ఒకరు. ప్రసూ బేబి అనే యూట్యూబ్ ఛానల్ పేరుతో తల్లిదండ్రుల నుంచి ప్రేమికుల వరకు వారి బాధ్యత గుర్తు చేస్తున్నాడు. సరదా సరదా వీడియోలతో యువతను ఆకట్టుకుంటున్నాడు. ఎలాంటి సినీ నేపథ్యమూ లేకపోయినా నటనతో సత్తా చాటుతూ అనతికాలంలోనే సోషల్ మీడియా సూపర్‌స్టార్‌గా ఎదిగాడు. పొడవాటి జుట్టు, గడ్డంతో స్టైలిష్‌గా కన్పించే ప్రశాంత్ చక్కటి నటన, వైవిధ్యమైన డైలాగ్ డెలివరీతో అందరినీ అలరిస్తున్నాడు. ప్రశాంత్ అంటే ఎవరూ గుర్తు పట్టరు. కానీ ‘ప్రసూబేబి’ అంటే మాత్రం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండేవారు ఇట్టే గుర్తు పట్టేస్తారు.అనంతపురం కేంద్రంగా...ప్రశాంత్ ఎంటెక్ చదివేందుకు అనంతపురం జేఎన్టీయూలో చేరాడు. చదువుకుంటూనే సీరియస్ యాక్టింగ్ మొదలుపెట్టాడు. నటనపై ఆసక్తి ఉన్న తనలాంటి వారితో కలిసి వీడియోలు రూపొందిస్తున్నాడు. యాక్టింగ్ మొదలుకుని స్క్రిప్టు వరకు అన్నీ తానే చూసుకుంటున్నాడు. ఇప్పటి వరకు 30 మందికిపైగా తనతో కలిసి నటించారు. వారిలో చాలామందికి సొంత యూట్యూబ్ చానళ్లు, ఇన్‌స్ట్రాగామ్ అకౌంట్లు ఏర్పాటు చేయించి వారూ తగిన ఆదాయం పొందేలా చూస్తున్నాడు. సోషల్ మీడియాలో ప్రశాంత్ పాపులారిటీ గుర్తించిన పెద్ద సంస్థలు సైతం అతనితో వ్యాపార ప్రకటనలు చేయిస్తున్నారు. సినిమా ప్రమోషన్లు కూడా చేయిస్తున్నారు. ఇటీవలే దసరా, విరూపాక్ష సినిమాలకు ప్రమోషన్ చేశారు. ఓటీటీ, సినిమా ఆఫర్లు సైతం వస్తున్నాయి.వ్యవసాయ కుటుంబం నుంచి..ప్రశాంత్‌ది వ్యవసాయ కుటుంబం. మదనపల్లె నియోజకవర్గం నిమ్మనపల్లె మండలం గారబురుజు గ్రామం. తల్లిదండ్రులు సావిత్రి, నారాయణ. వీరిది వ్యవసాయ కుటుంబం. ఇద్దరు కుమారులు కాగా, ప్రశాంత్ చిన్న కుమారుడు. ప్రాథమిక విద్య గ్రామంలో చదివాడు. ఇంటర్మీడియట్ వాల్మీకిపురం జూనియర్ కాలేజీలో, బీటెక్ మదనపల్లె ఆదిత్య ఇంజినీరింగ్ కాలేజీలో చదివాడు.టిక్‌టాక్‌తో మొదలు పెట్టి..మదనపల్లెలో ఆదిత్య ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ చదువుతుండగానే నటనపై ఆసక్తితో 2019లో టిక్‌టాక్‌లో లిప్–సింక్ వీడియోలను చేయడం ప్రారంభించాడు. ప్రేమ, మానవత్వం, కుటుంబ ఇతివృత్తంగా వీడియోలు రూపొందించాడు. అవి బాగా ట్రెండింగ్ కావడంతో లక్షల్లో సబ్ స్క్రైబర్లు వచ్చారు. కేంద్ర ప్రభుత్వం టిక్‌టాక్‌పై నిషేధం విధించడంతో తన దృష్టిని యూట్యూబ్‌పై మళ్లించాడు.పట్టుదల, క్రమశిక్షణతో కూడిన ప్రయత్నంతోనే...పట్టుదల, క్రమశిక్షణతో కూడిన ప్రయత్నంతోనే నేను ఎంచుకున్న గమ్యాన్ని చేరుకోగలిగాను. సాధించాలన్న బలమైన కోరిక, దానినితోడు సరైన ప్రణాళిక రూపొందించుకుని ముందుకెళితే మనం తప్పకుండా విజయం సాధిస్తాం. నిత్య జీవితంలో జరిగే సంఘటనలు, కుటుంబంలో ఉండే సంతోషాలు, సరదాలు, సమస్యలే ఇతివృత్తంగా ఎక్కువ వీడియోలు రూపొందించా. ఇవి భాష, ప్రాంతంతో సంబంధం లేకుండా అందరికి కనెక్ట్ అయ్యాయి. ఇదే ఉత్సాహంతో మరింత మంచి కంటెంట్ అందివ్వడానికి ప్రణాళికలు సిద్ధ చేసుకుంటున్నా. వెబ్ సీరిస్‌లపై ప్రత్యేక దృష్టి పెడుతున్నా.–ప్రశాంత్, ప్రసూబేబీ -
గఘనయానులు...
భారత్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గగన్‌యాన్ మిషన్‌లో పాల్గొనబోతున్న వ్యోమగాములంతా నేషనల్ డిఫెన్స్ అకాడమీ పూర్వ విద్యార్థులే. ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్, అజిత్ కృష్ణన్, అంగద్ ప్రతాప్, శుభాన్షు శుక్లా వృత్తిరీత్యా యుద్ధపైలెట్లు. వీరంతా గగన్‌యాన్ కోసం ఇప్పటికే రష్యాలో వ్యోమగాములుగా శిక్షణ పూర్తి చేసుకున్నారు. భారత్‌లోనూ ఇస్రో వీరికి కొంతకాలంగా ప్రత్యేక శిక్షణ ఇస్తోంది. తమ నలుగురు యుద్ధవిమాన పైలెట్లు గగన్‌యాన్‌లో భాగస్వాములు కావడం తమకెంతో గర్వకారణమని భారత వాయుసేన పేర్కొంది. ఈ నేపథ్యంలో ఈ ‘సూపర్ ఫోర్’ గురించి... ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్ భారత వాయుసేనలో యుద్ధవిమానాన్ని సుదీర్ఘకాలంపాటు నడిపిన అనుభవం ఉన్న పైలెట్ ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్ ఈ నలుగురిలో ఒక్కడిగా ఎంపికయ్యారు. కేరళలోని తిరువజియాడ్‌లో 1976 ఆగస్ట్ 26న జన్మించారు. నేషనల్ డిఫెన్స్ అకాడమీ(ఎన్డీఏ)లో శిక్షణ పూర్తిచేసుకుని అక్కడే ‘స్క్వాడ్ ఆఫ్ హానర్’ను సాధించారు. తమిళనాడులోని వెల్లింగ్టన్లోని డిఫెన్స్ సర్విసెస్ స్టాఫ్ కాలేజీలో, తాంబరం ఎఫ్‌ఐఎస్‌లో చదువుకున్నారు. తర్వాత ఈయన 1998 డిసెంబర్19న ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో యుద్ధవిమాన పైలెట్‌గా విధుల్లో చేరారు. సుఖోయ్30ఎంకేఐ, మిగ్–21, మిగ్–29 ఇలా పలు రకాల యుద్ధవిమానాలు నడపడంలో ఈయన దిట్ట. మొత్తంగా 3,000 గంటలకుపైగా యుద్ధవిమానాలను నడిపారు. కీలకమైన సుఖోయ్–30 స్క్వాడ్రాన్‌కు కమాండింగ్ బాధ్యతలు నిర్వర్తించారు. ‘ఎ’ కేటగిరీ ఫ్లయింగ్ ఇన్‌స్ట్రక్టర్‌గా, టెస్ట్ పైలెట్‌గా అనుభవం గడించారు. గగన్‌యాన్‌లో ఈయన గ్రూప్ కెప్టెన్ గా బాధ్యతలు తీసుకోనున్నారు. నాయర్ భార్య లీనా మలయాళ సినీపరిశ్రమలో నటిగా పేరొందారు. వీళ్లది పెద్దలు కుదిర్చిన పెళ్లి. గత నెల 17వ తేదీన వీరి వివాహం జరిగింది. ‘ మా ఆయనకు తొలి ఇండియన్ ఆస్ట్రోనాట్ వింగ్స్ దక్కడం కేరళ రాష్ట్రానికే గర్వకారణం’ అని ఆమె ఆనందం వ్యక్తంచేశారు. వీళ్ల కుటుంబం కేరళలోని పాలక్కడ్ జిల్లా నెన్‌మరలో నివసిస్తోంది. నాయర్‌ను ఆస్ట్రోనాట్‌గా ప్రధాని ప్రకటించగానే నెన్‌మరలో పండగ వాతావరణం నెలకొంది. అజిత్ కృష్ణన్ అజిత్ కృష్ణన్ 1982లో చెన్నైలో జన్మించారు. ఈయన సైతం ఎన్డీఏలో శిక్షణ విజయవంతంగా పూర్తిచేసుకుని స్వోర్డ్ ఆఫ్ ఆనర్ పొందారు. రాష్ట్రపతి బంగారు పతకాన్ని సాధించారు. ఈయన తమిళనాడులోని వెల్లింగ్టన్లోని డీఎస్‌ఎస్‌సీలోనూ చదువుకున్నారు. 2003 జూన్‌లో భారత వాయుసేనలో పైలెట్‌గా చేరారు. ఫ్లయింగ్ ఇన్‌స్టక్టర్‌గా, టెస్ట్ పైలెట్‌గా ఉంటూ 2,900 గంటలపాటు యుద్ధ విమానాలను నడిపారు. సుఖోయ్, మిగ్, జాగ్వర్, డోర్నియర్, ఏఎన్–32 రకం విమానాలను నడిపారు. ఈ మిషన్‌లో అవసరం మేరకు గ్రూప్ కెప్టెన్ గా ఉంటారు. అంగద్ ప్రతాప్ అంగద్ ప్రతాప్ 1982లో ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జన్మించారు. ఈయన సైతం ఎన్డీఏ పూర్వ విద్యార్ధే. 2004 డిసెంబర్లో భారత వాయుసేన దళాల్లో చేరారు. టెస్ట్ పైలెట్‌గా, ఫ్లయింగ్ ఇన్‌స్ట్రక్టర్‌గా సేవలందించారు. దాదాపు 2,000 గంటలపాటు విమానాలు నడిపిన అనుభవం ఉంది. సుఖోయ్ 30 ఎంకేఐ, మిగ్–21, మిగ్–29, హాక్, డోర్నియర్, ఏఎన్–32సహా ఎన్నో రకాల విమానాలను సమర్థవంతంగా నడిపారు. గగన్‌యాన్ మిషన్‌లో ఈయన గ్రూప్ కెప్టెన్ గా ఎంపికయ్యారు. శుభాన్షు శుక్లా వింగ్ కమాండర్ శుభాన్షు శుక్లా ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో 1985లో జన్మించారు. ఎన్డీఏలో శిక్షణ పూర్తిచేసుకుని 2006 జూన్‌లో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో పైలెట్‌గా చేరారు. ఫైటర్ కంబాట్ లీడర్‌గా, టెస్ట్ పైలెట్‌గా 2,000 గంటలపాటు యుద్ధవిమనాలు నడిపారు. భారత వాయుసేనలోని దాదాపు అన్నిరకాల యుద్ధవిమానాలు నడపడంలో ఈయన నైపుణ్యం సాధించారు. ఈ నలుగురికి రష్యాలోని యూరీ గగారిన్ కాస్మోనాట్ శిక్షణ సంస్థలో సమగ్రమైన శిక్షణ ఇచ్చారు. గగన్‌యాన్‌లో ఈయన వింగ్ కమాండర్‌గా వ్యవహరిస్తారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
అతివేగంలో రెండు బైక్‌లు ఢీ! యువకుడు..
మంచిర్యాల: మండలంలోని పోలంపల్లి సమీపంలో మంచిర్యాల–చెన్నూరు జాతీయ రహదారిపై ఆదివారం ఎదురెదురుగా రెండు బైక్‌లు వేగంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందగా, మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. ఎస్సై రాజవర్ధన్ కథనం ప్రకారం.. వేమనపల్లి మండల కేంద్రానికి చెందిన కంపెల ప్రశాంత్ (24) మంచిర్యాలకు స్కూటీపై వస్తున్నాడు. మంచిర్యాల నుంచి కొట్టవాడ మహేశ్ బైక్‌పై తన స్వగ్రామమైన మహారాష్ట్రలోని సిరొంచకు వెళ్తుండగా ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ప్రశాంత్ అక్కడిక్కడే మృతిచెందగా మహేశ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న ఎస్సై సంఘటన స్థలానికి చేరుకున్నారు. మహేశ్‌ను అంబులెన్స్‌లో మంచిర్యాల ఆసుపత్రికి తరలించారు. ఈమేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. ఇవి చదవండి: అందమైన విద్యార్థినులు కనిపించారంటే.. అతడు కీచకుడే! అర్ధరాత్రి.. -
ఒకే కుటుంబం.. 6 హత్యలు.. ఎలా చేశారంటే..!
-
నా అనుకున్న వాళ్లే హీరో విక్రమ్‌ను తొక్కేశారా.. ఆయనకు జరిగిన నష్టం ఏంటి?
సినీ పరిశ్రమలో ఎందరో హీరోలు ఉన్నారు. వారిలో ఎలాంటి బ్యాగ్రౌండ్ సపోర్ట్ లేకుండా ఎదిగిన వారు కూడా ఉన్నారు. అలాంటి అరుదైన కథానాయకుల్లో కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ ఒకరు. అయితే కెరీర్ ప్రారంభంలో తమిళ చిత్రాలతో పాటు నేరుగా తెలుగు మూవీస్‌లోనూ యాక్ట్ చేశారు విక్రమ్. విభిన్నమైన కథలతో, పాత్రలతో తనదైన ముద్ర వేసుకున్నారు. ప్రయోగాలు చేయడంలో తనకు తానే సాటి అని నిరూపించుకున్నారు. పేరుకు కోలీవుడ్ హీరో అయినప్పటికీ దాదాపు అన్ని భాషల్లో ఆయనకు అభిమానులు ఉన్నారు. అయితే విక్రమ్ సినిమా కెరీర్ ఆరంభం సవాళ్లతో కూడుకున్నది. విక్రమ్‌ను దురదృష్టవంతుడని కూడా అప్పట్లో కోలీవుడ్‌లో అనేవారు. విక్రమ్ కెరీర్ ప్రారంభంలో ఒకదాని తర్వాత ఒకటిగా ఏడు సినిమాలు పరాజయం చెందాయి. దీంతో విక్రమ్‌ను సినీ ప్రపంచం దురదృష్టవంతుడిగా ముద్ర వేసింది. కానీ 1999లో బాలా దర్శకత్వంలో వచ్చిన సేతు సినిమాతో విక్రమ్ జీవితం మారిపోయింది. వంద రోజుల పాటు హౌస్‌ఫుల్ కలెక్షన్స్‌తో కొనసాగింది. సేతు సినిమాతో తమిళనాట కొత్త ఉదయానికి సాక్షిగా విక్రమ్ నిలిచాడు. అక్కడి నుంచి విక్రమ్ వెనక్కి తిరిగి చూడలేదు. మేనమామతో విక్రమ్‌కు కష్టాలు విక్రమ్ సినీ ఇండస్ట్రీలో కష్టాలు పడుతున్నప్పుడు ఆయన కజిన్, హీరో ప్రశాంత్ కోలీవుడ్‌లో సూపర్‌స్టార్‌గా కొనసాగుతున్నాడు. అతను నటించిన ప్రతి సినిమా సూపర్ హిట్టే. సౌత్ ఇండియాలోని అన్ని భాషల్లోకి ఆయన సినిమాలు విడుదల అయ్యేవి. హీరో ప్రశాంత్ తండ్రి త్యాగరాజన్ విక్రమ్‌కి సొంత మేనమామ అవుతాడు. ఆయనకు తమిళ చిత్రసీమలో ఒక నటుడు, డైరెక్టర్, నిర్మాతగా మంచి గుర్తింపు ఉంది. కానీ త్యాగరాజన్ తన మేనళ్లుడు అయిన విక్రమ్‌కు ఎలాంటి సహాయం చేయడానికి ముందుకు రాలేదు. ప్రశాంత్ కూడా విక్రమ్ గురించి ఎక్కడా మాట్లాడకుండా అప్పట్లో దూరం పాటించాడు. విక్రమ్ కూడా వారి గురించి ఎక్కడా మాట్లాడలేదు. విక్రమ్ నటించిన ఏడు సినిమాలు వరుసగా పరాజయం పాలయ్యాయి. దీంతో విక్రమ్ అన్ లక్కీ యాక్టర్ అనే ముద్ర పడింది. విక్రమ్‌తో సినిమా చేస్తే నష్టపోతామని అందరూ అనుకున్నారు. అలాంటి సమయంలోనే దర్శకుడు బాలాను విక్రమ్ కలిశాడు. విక్రమ్ హీరోగా ఆయన 'సేతు' సినిమాను తెరకెక్కించాడు. అయితే సినిమాను కొనుగోలు చేసేందుకు డిస్ట్రిబ్యూటర్లు సిద్ధంగా లేరు. చివరకు చిత్ర నిర్మాతలు తక్కువ మొత్తానికే ఇచ్చేశారు. వారికి థియేటర్లు కూడా తక్కువగానే దొరికాయి. సినిమా భారీ హిట్ అయినా నిర్మాతలు అంతగా లాభపడలేదు. దీనికి విక్రమ్ కూడా కారణమని చెప్పారు. అతనికి ఇండస్ట్రీలో బ్యాక్‌గ్రౌండ్ ఉన్నా కూడా వారి పేర్లు ఎక్కడా ఉపయోగించుకోకుండా ఉండటం అని పలువురు చెప్పుకొచ్చారు. విక్రమ్ మామ కొడుకు అయిన ప్రశాంత్ అప్పట్లో పెద్ద స్టార్. కానీ ప్రశాంత్ మాత్రం విక్రమ్ ఎవరో తనకు తెలియనట్లు ఉండేవాడు. సేతు సినిమాకు మరిన్నీ థియేటర్లు కావాలని నిర్మాతలు మాట సాయం కోరినా ప్రశాంత్ స్పందించలేదట. దీంతో ఇరువురి కుటుంబాల మధ్య ఏదో ఒక గొడవ జరిగిందని తర్వాత అందరూ భావించారు. అందుకే విక్రమ్ కోసం త్యాగరాజన్, ప్రశాంత్ ఎలాంటి రికమెండేషన్ చేయలేదని పలువురు విశ్లేషకులు ఇప్పటికీ చెబుతారు. విక్రమ్‌కు వచ్చిన సినిమా అవకాశాలను కూడా రానీయకుండా త్యాగరాజన్ ప్రయత్నించినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. దీంతో విక్రమ్ అవకాశాల కోసం ఎంతగానో కష్టపడాల్సి వచ్చింది. చివరకు విక్రమ్ తన లక్ష్యాన్ని చేరుకుని సూపర్ స్టార్ అయ్యాడు. కానీ ఈరోజు హీరో ప్రశాంత్ అంటే చాలామందికి తెలియని స్థితిలో ఆయన ఉన్నారని చెప్పవచ్చు. ఇప్పటికీ హీరో విక్రమ్ తన మేనమామ కుటుంబంతో ఎలాంటి సంబంధం లేకుండానే ఉన్నారు. ఒకప్పుడు రాబోయే తరానికి సూపర్ స్టార్ అని అనుకున్న ప్రశాంత్ ఇప్పుడు సినిమా ప్రపంచంలోనే లేరు. అప్పట్లో ఆయనతో పాటు ఎంట్రీ ఇచ్చిన అజిత్, విజయ్, విక్రమ్ నేడు సూపర్ స్టార్లుగా ఎదిగారు. చియాన్ విక్రమ్ ఎప్పటికీ తమిళ సినిమా సూపర్ స్టార్. పొన్నియన్ సెల్వన్ విజయంతో జోరుమీద ఉన్న ఆయన.. త్వరలో తంగళన్, ధ్రువనక్షత్రం చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. -
ఇంటర్ విద్యార్థి విషాదాంతం.. చదవడం ఇష్టం లేక గోదావరిలో దూకాడు
దండేపల్లి: కాలేజీలో దింపేందుకు తీసుకెళ్లిన తండ్రి వద్దనుంచి కరీంనగర్ బస్టాండ్‌లో తప్పించుకున్న ఓ ఇంటర్ విద్యారి్థ...మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం గూడెం వద్ద గోదావరినదిలో శవమై తేలాడు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. దండేపల్లికి చెందిన నానవేని మల్లేశ్ కుమారుడు నానవేని ప్రశాంత్, అలియాస్ గట్టు(19) కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు కాలేజీలో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. ఇటీవల కాలేజీ నుంచి ఇంటికి వచ్చాడు. మంగళవారం అతన్ని కాలేజీలో దింపేందుకు తండ్రి మల్లేశ్ కరీంనగర్ బయల్దేరాడు. కరీంనగర్ బస్టాండులో దిగగానే ప్రశాంత్ తప్పించుకున్నాడు. కొద్దిసేపు బస్టాండులో అతనికోసం వెతికినా ఆచూకీ దొరకలేదు. కాలేజీకి వెళ్లి ఆరా తీయగా, కాలేజీకి రాలేదని చెప్పారు. దీంతో ఇంటికే వచ్చాడేమో అని తండ్రి దండేపల్లికి రాగా..ఇంటికి కూడా రాలేదని కుటుంబసభ్యులు చెప్పడంతో ప్రశాంత్‌ను వెదికేందుకు బయటికి వెళ్లాడు. ఇంతలో సాయంత్రం గూడెం గోదావరినదిలో శవం ఉందని తెలియడంతో అక్కడికి వెళ్లి చూడగా, అది ప్రశాంత్‌ది కావడంతో తల్లిదండ్రులు బోరున విలపించారు. ప్రశాంత్‌ను గతేడాది దండేపల్లి జూనియర్ కాలేజీలో చేరి్పంచగా ఫెయిల్ అయ్యాడు. అతన్ని ఆ కాలేజీ నుంచి తీసి, ఈయేడాది కరీంగర్‌లోని ఓ ప్రైవేటు కాలేజీలో చేరి్పంచారు. చదవడం ఇష్టం లేకనే గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకుని ఉంటాడని కుటుంబీకులు, బంధువులు భావిస్తున్నారు. -
పెళ్లై.. రెండు నెలలు కాలేదు.. అంతలోనే..
భద్రాద్రి: రెండు నెలల క్రితం వివాహమైంది. బతుకుదెరువు కోసం భాగ్యనగరం వెళ్తున్నారు. ఈ క్రమంలో కారు చెట్టును ఢీకొని నవ వధువు మృతి చెందింది. భర్త, అత్త, మామలకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన జనగామ జిల్లా లింగాల ఘణపురం మండలం కుందారం సమీపంలో బుధవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. పాల్వంచ మండలం ఉల్వనూరు గ్రామానికి చెందిన అంబడి ప్రశాంత్‌కు ఖమ్మం రూరల్ మండలం ముత్తగూడెం గ్రామానికి చెందిన సింధూజ(23)తో గత జూన్ 8న వివాహం జరిగింది. కారు నడుపుతూ జీవనం సాగిస్తున్న ప్రశాంత్ బతుకుదెరువు కోసం హైదరాబాద్ వెళ్లి క్యాబ్ నడుపుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఇటీవల భార్యతోపాటు తల్లిదండ్రులు శ్రీనివాస్, నాగమణి తీసుకుని హైదరాబాద్‌కు వెళ్లి, అద్దెకు ఇల్లు తీసుకుని వచ్చాడు. మంగళవారం రాత్రి ఉల్వనూరులో ఇంటికి తాళంవేసి నలుగురూ కారులో హైదరాబాద్‌కు బయల్దేరారు. ఈ క్రమంలో జనగామ జిల్లా పాలకుర్తిరోడ్లోని కుందారం సమీపంలో కారు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. దీంతో సింధూజ తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతిచెందింది. ప్రశాంత్, అతని తల్లిదండ్రులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను జనగామ ఏరియా ఆస్పత్రికి, అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు. వివాహమై రెండు నెలలు కాకముందే.. ప్రశాంత్, సింధూజకు వివాహం జరిగి రెండు నెలలు కూడా పూర్తిగా నిండలేదు. ఇక్కడ బతుకుదెరువు లేకపోడంతో హైదరాబాద్ వెళ్లి కారు క్యాబ్ నడుపుకునేందకు కుటుంబం అంతా బయల్దేరారు. అవసరమైన నిత్యావసర వస్తువులు బియ్యం, ఉప్పు, కారం, పచ్చళ్లు, కుట్టు మిషన్ వంటి సామగ్రి వెంట తీసుకెళ్తున్నారు. ప్రమాదస్థలిలో నిత్యావసర వస్తువులన్నీ చెల్లాచెదురుగా పడిఉన్న తీరు చూసి పలువురు కన్నీటి పర్యంతమయ్యారు. వివాహం జరిగిన రెండు నెలలు కాకముందే సింధూజ మృతిచెందడంతో కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు. ఉల్వనూరు, ముత్తగూడెం గ్రామాల్లో తీవ్ర విషాదం నెలకొంది. -
టీఎస్పీఎస్సీ డీఏవో పరీక్ష పేపర్ కోసం.. ‘ఆడి’ కారు అమ్మి.. అడ్వాన్సు ఇచ్చి
సాక్షి, హైదరాబాద్: టీఎస్పీఎస్సీ డివిజినల్ అకౌంట్స్ ఆఫీసర్ (డీఏఓ) పరీక్ష పేపర్ ఖరీదు చేసిన కేసులో అరెస్టయిన ఖమ్మం జంట సాయి లౌకిక్, సాయి సుస్మిత విచారణలో ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. వీరిద్దరినీ సిట్ అధికారులు న్యాయస్థానం అనుమతితో తమ కస్టడీలోకి తీసుకుని మూడు రోజులపాటు విచారించారు. ఆదివారం ఆ గడువు ముగియడంతో సోమవారం వైద్యపరీక్షల అనంతరం కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించనున్నారు. సాయి సుస్మిత గ్రూప్–1 పరీక్ష రాసిన తర్వాత ఓఎంఆర్ షీట్లో జరిగిన పొరపాట్లు సరి చేసుకోవడానికి కమిషన్‌కు వచ్చిన సందర్భంలో ప్రవీణ్‌కుమార్‌తో పరిచయమైంది. డీఏఓ మాస్టర్ క్వశ్చన్ పేపర్ తన వద్ద ఉందని ఫిబ్రవరి మూడో వారంలో ఈమెతో చెప్పిన ప్రవీణ్ రూ.10 లక్షలకు విక్రయిస్తానన్నాడు. ఈ విషయాన్ని సుస్మిత తన భర్త లౌకిక్‌కు చెప్పింది. అప్పటికప్పుడు అంత డబ్బు లేకపోవడంతో తమ వద్ద ఉన్న రెండు కార్లలో ‘ఆడి’ కారును తన స్నేహితుడికి విక్రయించిన లౌకిక్ అతడి నుంచి అడ్వాన్స్‌గా రూ.6 లక్షలు తీసుకున్నాడు. ఆ మొత్తాన్ని ప్రవీణ్‌కు ట్రాన్స్ఫర్ చేసి మిగిలిన మొత్తం చెల్లింపునకు గడువు కోరాడు. దీంతో భార్యాభర్తల్ని ఎల్బీనగర్ వద్దకు రమ్మని ప్రవీణ్ చెప్పాడు. ‘ఆ పేపర్ మేం ఎవ్వరికీ ఇవ్వలేదు’ ఫిబ్రవరి 23 రాత్రి ఖమ్మం నుంచి నగరానికి వచ్చిన దంపతులు ఎల్బీనగర్లోని డీ మార్ట్ వద్ద ఉండి ప్రవీణ్‌కు సమాచారం ఇచ్చారు. బడంగ్‌పేట్‌లోని మల్లికార్జున కాలనీలో తన ఇంటి నుంచి అక్కడకు వచ్చిన ప్రవీణ్ మాస్టర్ క్వశ్చన్ పేపర్ ఇచ్చి వెళ్లాడు. ఆ రాత్రి అల్కాపురిలోని లాడ్జిలో బస చేసిన ఈ దంపతులు మరుసటి రోజు ఖమ్మంలోని సమీప బంధువు ఇంటికి వెళ్లారు. అక్కడే రెండు రోజుల ఉండి పరీక్షకు సిద్ధమైన సుస్మిత ఫిబ్రవరి 26న పరీక్ష రాసింది. సిట్ అధికారులు వీరిద్దరినీ తీసుకుని శనివారం ఖమ్మం రాపర్తినగర్‌లోని వారి ఇంట్లో సోదాలు చేశారు. మాస్టర్ ప్రశ్నపత్రంతో పాటు హాల్‌టికెట్ స్వాదీనం చేసుకున్నారు. తాము ఆ ప్రశ్నపత్రాలు మరెవరికీ ఇవ్వలేదని ఇరువురూ సిట్ అధికారులకు తెలిపారు. నేను కష్టపడి చదివా.. మీరు అపోహపడుతున్నారు న్యూజిలాండ్ నుంచి సిట్‌కు ఈ– మెయిల్ చేసిన నిందితుడు ప్రశాంత్ గ్రూప్–1 ప్రశ్నా పత్రాన్ని ప్రధాన నిందితులలో ఒకడైన రాజశేఖర్‌రెడ్డి, న్యూజిలాండ్‌లో ఉన్న తన బావ ప్రశాంత్‌రెడ్డికి పంపించాడు. న్యూజిలాండ్‌లో పరీక్షకు సిద్ధమై, హైదరాబాద్‌కు వచ్చి ప్రశాంత్ గ్రూప్–1 పరీక్ష రాసి వెళ్లాడు. పేపర్ లీకేజీ ఘటన వెలుగులోకి రావడంతో వందకుపైగా మార్కులు వచ్చిన వారిని ఆరా తీస్తున్న క్రమంలో ప్రశాంత్‌రెడ్డికి వందకుపైగా మార్కులు వచ్చిన విషయం వెలుగులోకి వచ్చింది. విచారణలో తన బావకు ప్రశ్న పత్రాన్ని పంపించానని రాజశేఖర్ అంగీకరించాడు. ఈ మేరకు న్యూజిలాండ్‌లో ఉన్న ప్రశాంత్‌కు వాట్సాప్, ఈ మెయిల్ ద్వారా సిట్ నోటీసులు పంపించింది. ఈ నేపథ్యంలో ప్రశాంత్‌రెడ్డి సిట్‌కు ఈ మెయిల్ పంపించాడు. ‘నేను కష్టపడి చదివానని, నేను ఎవరి వద్ద నుంచి ప్రశ్నా పత్రం తీసుకోలేదు, నాకు మార్కులు ఎక్కువగా రావడంతో మీరు అపోహపడుతున్నారు’ అని ఈ మెయిల్లో పేర్కొన్నాడు. కాగా ప్రశ్నా పత్రాన్ని న్యూజిలాండ్‌లో ఉన్న ప్రశాంత్‌కు రిమోట్‌యాప్ అయిన ఎనీడెస్క్ ద్వారా రాజశేఖర్‌రెడ్డి పంపించిన విషయం విచారణలో వెల్లడైన విషయంతెలిసిందే. -
లైంగిక వేధింపుల కేసు.. ప్రముఖ నటికి షాకిచ్చిన హైకోర్టు
ప్రముఖ కన్నడ నటి శృతి హరిహరన్‌కు కోర్టులో చుక్కెదురైంది. లైంగిక వేధింపుల కేసులో ఆమెకు వ్యతిరేకంగా కోర్టు ఉత్తర్వులిచ్చింది. సినీ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ ప్రశాంత్ సంబర్గిపై విచారణ నిలిపేయాలంటూ కర్ణాటక హైకోర్టు స్టే విధించింది. గతంలో నటుడు అర్జున్ సర్జాతో పాటు నిర్మాత ప్రశాంత్ లైంగిక వేధింపులకు పాల్పడ్డారని శృతి బెంగళూరు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. ఈ కేసులో తనపేరు తొలగించాలని ప్రశాంత్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రశాంత్ పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు ధర్మాసనం ఈ కేసులో స్టే విధించింది. ప్రశాంత్ వేసిన పిటిషన్‌పై ఫిబ్రవరి 1, 2023న చేపట్టనున్నట్లు వెల్లడించింది. అసలేం జరిగిందంటే.. మరో నటుడు అర్జున్ సర్జా, నిర్మాత ప్రశాంత్ లైంగిక వేధింపులకు పాల్పడ్డారని శృతి హరిహరన్పై పోలీసులను ఆశ్రయించింది. విస్మయ సినిమా షూటింగ్ సమయంలో అర్జున్ సెట్లో తనతో అసభ్యంగా ప్రవర్తించాడని ఆమె ఆరోపించింది. అక్టోబర్ 2018లో అర్జున్, శృతి మధ్య వివాదాన్ని పరిష్కరించేందుకు ప్రముఖ నటుడు అంబరీష్ మధ్యవర్తిత్వంలో కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సమావేశాన్ని కూడా నిర్వహించింది. కానీ ఈ కేసులో రాజీ కుదర్చలేకపోయారు. ఈ కేసు కోసం న్యూయార్క్ నుంచి శృతికి నిధులు సమకూరాయని గతంలో నిర్మాత ప్రశాంత్ ఆరోపించారు. -
నాలుగు జంటల ప్రేమకథ
‘1940లో ఒక గ్రామం, కమలతో నా ప్రయాణం, జాతీయ రహదారి’ వంటి చిత్రాలతో అవార్డులు అందుకున్న దర్శకుడు నరసింహ నంది తెరకెక్కించిన తాజా చిత్రం ‘అమ్మాయిలు అర్థంకారు’. అల్లం శ్రీకాంత్, ప్రశాంత్, కమల్, మీరావలి హీరోలుగా, సాయిదివ్య, ప్రియాంక, స్వాతి, శ్రావణి హీరోయిన్లుగా నటించారు. శ్రీ లక్ష్మీ నరసింహ సినిమా పతాకంపై నందిరెడ్డి విజయలక్ష్మి రెడ్డి, కర్ర వెంకట సుబ్బయ్య నిర్మించిన ఈ సినిమా నిర్మాణానంతర పనులు జరుగుతున్నాయి. ఈ సినిమా ట్రైలర్‌ని దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ బసిరెడ్డి, తెలుగు నిర్మాతల మండలి ప్రధాన కార్యదర్శి ప్రసన్నకుమార్, నిర్మాత మేడికొండ వెంకట మురళీకృష్ణ రిలీజ్ చేశారు. ‘‘నరసింహ తన అభిరుచికి తగ్గ సినిమాలు చేశారు. అదే కమర్షియల్ సినిమాలు తీసి ఉంటే ఇప్పటికే పెద్ద దర్శకుల జాబితాలో చేరేవారు’’ అన్నారు తమ్మారెడ్డి. ‘‘మధ్య తరగతి జీవితాల్లో జరిగే నాలుగు ప్రేమ జంటల కథలతో ఈ చిత్రం తెరకెక్కించాను’’ అన్నారు నరసింహ నంది. ‘‘చిత్తూరు, తిరుపతి ్ర΄ాంతాల యాసను నేపథ్యంగా తీసుకుని ఈ చిత్రాన్ని నిర్మించాం’’ అన్నారు కర్ర వెంకట సుబ్బయ్య. -
రెండో పెళ్లి చేసుకోబోతున్న 48 ఏళ్ల స్టార్ హీరో..
నిర్మాత త్యాగరాజన్ కొడుకుగా ఇండస్ట్రీలో ఇంట్రీ ఇచ్చి తనకుంటూ గుర్తింపు సంపాదించుకున్న హీరో ప్రశాంత్. జీన్స్, దొంగ దొంగ, జోడీ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ప్రశాంత్ రామ్‌చరణ్ నటించిన వినయ విధేయ రామ చిత్రంతో రీఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. కోలీవుడ్‌లో స్టార్ హీరోలకు సమానంగా క్రేజ్సంపాదించుకున్న ప్రశాంత్ ప్రస్తుతం అంధాదూన్ రీమేక్‌లో నటిస్తున్నాడు. అయితే తాజాగా ఈయనకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. త్వరలోనే ప్రశాంత్ రెండో పెళ్లి చేసుకోనున్నట్లు కోలీవుడ్ మీడియా కోడై కూస్తుంది. ఈ ఏడాది చివర్లో ఆయన వివాహం చేసుకోబోతున్నారని తెలుస్తుంది. కాగా 2005లో వ్యాపారవేత్త కూతురు గృహలక్ష్మితో ప్రశాంత్ పెళ్లి జరిగింది. వీరికి ఓ కొడుకు కూడా ఉన్నాడు. మనస్పర్థల కారణంగా పెళ్లయిన మూడేళ్లకే వీరు విడాకులు తీసుకున్నారు. అప్పటి నుంచి ఒంటరిగా ఉంటున్న ప్రశాంత్ తాజాగా వారి కుటుంబానికి పరిచయం ఉన్న అమ్మాయిని పెళ్లాడనున్నాడట. త్వరలోనే ఈ వార్తలపై మరింత క్లారిటీ రానుంది. -
పెళ్లి చేసుకుంటానని గర్భవతిని చేసి.. ఇప్పుడు శ్రీజతో మరో పెళ్లి..
సాక్షి, మేడ్చల్ జిల్లా: పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఓ యువతిని మోసం చేసిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. తనకు న్యాయం చేయాలని కోరుతూ ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు ఆందోళనకు దిగింది. ఈ ఘటన మేడిపల్లి పీఎస్ పరిధిలోని బోడుప్పల్ శ్రీసాయిరాం నగర్లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. జనగాం జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ మండలం తాటికొండ గ్రామానికి చెందిన ప్రణీతకు గత ఐదు సంవత్సరాలుగా ప్రశాంత్‌తో పరిచయం ఉంది. ఈ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఈ క్రమంలో తనను పెళ్లిచేసుకుంటానని నమ్మించి యువతిని ఎనిమిది నెలల గర్భవతిని చేశాడు. చదవండి: (వివాహేతర సంబంధం: మైనర్ బాలుడే నిందితుడు) అయితే ప్రియురాలిని మోసం చేసి శ్రీజ అనే మరో అమ్మాయిని ప్రశాంత్ ఇటీవల పెళ్లి చేసుకున్నాడు. దీంతో తనకు న్యాయం చేయాలని ప్రియురాలు గట్టిగా నిలదీయడంతో ఈనెల మూడున మిర్యాలగూడ తీసుకువెళ్ళి ఒక గదిలో పెళ్ళి చేసుకున్నాడు. అంతలోనే తనకు చెప్పాపెట్టకుండా మిర్యాలగూడ నుంచి ఇంటికి వచ్చేశాడని, ఇదేంటని ప్రశ్నిస్తే అతని తల్లి దండ్రులు ప్రశాంత్‌ను దాచిపెట్టి తమను ఏం చేసుకుంటారో చేసుకో పొమ్మంటున్నారని వాపోయింది. తనకు న్యాయం చేసే వరకూ ఊరుకునేది లేదని ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు నిరసన చేపట్టింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఇరువర్గాలను పీఎస్‌కు తరలించారు. -
Techie Prashant: కన్నీటి పర్యంతం.. అమ్మ మాట విననందుకే కష్టాలు
సాక్షి, విశాఖపట్నం/మధురవాడ: నాలుగేళ్ల కిందట వెళ్లిపోయిన తమ కుమారుడు మరికొద్దిసేపట్లో ఇంటికి రాబోతున్నాడు.. తమ బిడ్డను చూసేందుకు ఆ తల్లిదండ్రులు ఎంతో ఉద్వేగంతో ఎదురు చూస్తున్నారు. అంతలోనే రానే వచ్చాడు. ఇన్నాళ్లకు కుమారుడిని చూసిన ఆ తల్లిదండ్రులు పట్టరాని సంతోషంతో ఎదురెళ్లి గుండెలకు హత్తుకున్నారు. ఒక్కసారిగా కన్నీళ్లపర్యంతమయ్యారు. నాలుగేళ్ల కిందట ప్రియురాలి కోసమని వెళుతూ పాకిస్థాన్ చెరలోకి వెళ్లిన ప్రశాంత్ సోమవారం విడుదలైన విషయం తెలిసిందే. బుధవారం మధ్యాహ్నం విశాఖ మిథిలాపురి వుడా కాలనీలోని తన గృహానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా తండ్రి బాబూరావు, సోదరుడు శ్రీకాంత్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. అమ్మ మాట విననందుకే తాను ఇన్ని కష్టాలు పడ్డానని చెప్పారు. జైల్లో మంచి పుస్తకాలు చదివానని, తనలో మార్పు వచ్చిందని, కొత్త జీవితాన్ని ప్రారంభిస్తానన్నారు. ప్రశాంత్ చెప్పిన వివరాలు ఆయన మాటల్లోనే.. శిక్షా కాలం పూర్తయినా ఇంకా జైల్లోనే.. సరిహద్దు దాటి పాకిస్తాన్లోకి ప్రవేశించి ఎడారిలో 40 కి.మీ నడిచాను. అటుగా వచ్చిన హైవే పెట్రోలియం వాహనంలోంచి వచ్చిన సిబ్బంది నా వివరాలు అడిగారు. అప్పటికే అలిసిపోయి ఉన్న నేను సరిగా సమాధానం చెప్పలేకపోయాను. వాళ్లు నన్ను పట్టుకెళ్లి భద్రత సిబ్బందికి అప్పగించారు. న్యాయస్థానంలో ప్రవేశపెట్టి ఆ తర్వాత నన్ను జైలుకు తరలించారు. నేను జైల్లో ఉన్నంత కాలం నాతో ఒక్కపనీ చేయించలేదు. అంతేకాదు, జైల్లో ఉన్న ఏ భారతీయ ఖైదీతో కూడా పనిచేయించడం లేదు. వారితో మాట్లాడితే తెలిసింది.. వారి శిక్షలు పూర్తయినా ఇంకా ఎంబసీ నుంచి క్లియరెన్స్ రాని కారణంగా అక్కడే మగ్గుతున్నారని. వాళ్లను చూశాక ఇక నేను ఇంటికి రావడంపై ఆశలు వదిలేసుకున్నాను. అమ్మానాన్నను చూస్తానని అస్సలు అనుకోలేదు. కానీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేంద్ర ప్రభుత్వాల చొరవతోనే నేను ఇంత త్వరగా రాగలిగాను. శిక్ష పూర్తి చేసుకున్న, త్వరలోనే శిక్ష పూర్తి కానున్న ఖైదీల వివరాలు కూడా సేకరించి కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చాను. వారిని కూడా త్వరలోనే విడుదల చేయాలని కోరుతున్నా. అప్పుడు నేను మూర్ఖంగా వ్యవహరించాను. ఇలా వెళుతున్నానని అమ్మతో చెప్పాను. అమ్మ వద్దంది. అయినా ఆమె మాట వినలేదు. అందుకే ఇన్ని కష్టాలుపడ్డా’ అని ప్రశాంత్ చెప్పారు. తమవాడు క్షేమంగా తిరిగి వచ్చేందుకు సహకరించిన కేంద్రానికి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ప్రశాంత్ తల్లిదండ్రులు, సోదరుడు కృతజ్ఞతలు చెప్పారు. -
మా అబ్బాయి కోసం నిద్రలేని రాత్రులు గడిపాము..
-
హైదరాబాద్ పోలీసుల చొరవతో ఎట్టకేలకు నగరానికి..
-
పాక్ చెర వీడిన ప్రశాంత్
సాక్షి, హైదరాబాద్/విశాఖపట్నం: ప్రేమించిన యువతి కోసం దేశ సరిహద్దులు దాటాడు. శత్రు దేశం పాకిస్తాన్ భూ భాగంలో అడుగు పెట్టడంతో అరెస్టయ్యి, జైలు జీవితం గడిపాడు. కేసు విచారణలో భాగంగా కోర్టు వద్దకు వచ్చినప్పుడు రెండేళ్ల క్రితం కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వగలిగాడు. వారు హైదరాబాద్ పోలీసులను ఆశ్రయించడం.. ప్రభుత్వాలు జోక్యం చేసుకోవడంతో ఎట్టకేలకు కథ సుఖాంతమైంది. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా రాజాంకు చెందిన బాబూరావు, ఇందిర దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్దవాడైన ప్రశాంత్ బెంగళూరులోని హువాయ్ సంస్థలో ఉద్యోగం చేసేవాడు. ఇతని సోదరుడు శ్రీకాంత్ తన భార్యతో కలిసి ఉద్యోగరీత్యా హైదరాబాద్‌లో ఉంటున్నాడు. దీంతో బాబూరావు దంపతులు తొమ్మిదేళ్ల క్రితం నగరానికి వచ్చి, కేపీహెచ్‌బీ భగత్‌సింగ్‌నగర్ ఫేజ్–1 ద్వారకామయి అపార్ట్మెంట్లో శ్రీకాంత్‌తో కలిసి ఉంటున్నారు. బెంగళూరులో ఉంటున్న సమయంలో స్వప్నికా పాండే అనే మధ్యప్రదేశ్‌కు చెందిన యువతితో ప్రశాంత్ ప్రేమలో పడ్డాడు. కొన్నాళ్లకు ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయి. అప్పట్లోనే స్వప్నికకు మరో ఉద్యోగం రావడంతో స్విట్జర్లాండ్ వెళ్లిపోయింది. తర్వాత కొంతకాలం చైనాలో, ఆఫ్రికా దేశాల్లోనూ, చివరకు హైదరాబాద్‌లో.. ఇలా ఎన్నోచోట్ల ఉద్యోగాలు మారినా స్వప్నికను ప్రశాంత్ మరచిపోలేకపోయాడు. నాలుగేళ్ల క్రితం ఇంట్లో చెప్పకుండా.. మానసికంగా కొంత బలహీనంగా మారిన ప్రశాంత్ ప్రేయసి వద్దకు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. 2017 ఏప్రిల్ 11న ఆఫీస్‌కు వెళ్తున్నానని చెప్పి ఇంట్లోంచి బయటకు వెళ్లిన ప్రశాంత్ తిరిగి రాలేదు. దీంతో బాబూరావు అదే నెల 29న మాదాపూర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో మిస్సింగ్ కేసు నమోదైంది. కాగా తాను పాకిస్తాన్లో అరెస్టు అయ్యాననే సమాచారాన్ని ప్రశాంత్ 2019 నవంబర్ ఆఖరి వారంలో తన తండ్రికి తెలిపాడు. అక్కడి కోర్టు ఆవరణలో ఓ న్యాయవాది సహకారంతో ఫోన్లో మాట్లాడాడు. సెల్ఫీ వీడియో కూడా పంపాడు. బాబూరావు వెంటనే సైబరాబాద్ పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్‌ను కలిసి విషయం చెప్పి తన కుమారుడు తిరిగి వచ్చేందుకు సహకరించాలని కోరారు. దీంతో తెలంగాణ ప్రభుత్వం కేంద్రం ద్వారా చర్యలు చేపట్టింది. ఈ కృషి ఫలితంగా ప్రశాంత్ ఎట్టకేలకు సోమవారం విడుదలయ్యాడు. పాక్ రేంజర్లు వాఘా సరిహద్దులో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) అధికారుల సమక్షంలో తెలంగాణ పోలీసులకు ప్రశాంత్‌ను అప్పగించారు. దీంతో మంగళవారం హైదరాబాద్ చేరుకున్న ప్రశాంత్‌ను సైబరాబాద్ పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ గచ్చిబౌలిలోని కమిషనరేట్‌లో ఆయన సోదరుడు శ్రీకాంత్‌కు అప్పగించారు. కాగా, తమ కుమారుడు పాకిస్తాన్ చెర నుంచి విడుదలై, హైదరాబాద్ చేరుకున్నాడని సీపీ సజ్జనార్ ఫోన్ చేసి చెప్పారని.. విశాఖలో ఉంటున్న ప్రశాంత్ తల్లిదండ్రులు ఆనందంతో ‘సాక్షి’కి తెలిపారు. స్విట్జర్లాండ్‌కు నడిచి వెళ్లాలనుకున్నాడు ఇంట్లోంచి వెళ్లిన ప్రశాంత్ స్విట్జర్లాండ్‌కు నడిచి వెళ్లాలని భావించాడు. పర్సు, ఫోన్ ఇంట్లోనే వదిలి బయలుదేరిన అతడు తొలుత రైల్లో రాజస్థాన్‌లోని బికనీర్ వెళ్లాడు. అక్కడ కంచె దాటి పాకిస్తాన్లోకి ప్రవేశించాడు. ఈ క్రమంలో పంజాబ్ ప్రావిన్స్‌లోని తుబాబరిలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులకు 2019 నవంబర్ 14న చిక్కాడు. ఆ సమయంలో అతని వెంట మధ్యప్రదేశ్‌కు చెందిన దరియాలాల్ కూడా ఉన్నాడు. ఇద్దరినీ అరెస్టు చేసిన బహవల్పూర్ పోలీసులు కంట్రోల్ ఆఫ్ ఎంట్రీ యాక్ట్ 1952 కింద కేసు నమోదు చేశారు. రెండేళ్ల క్రితం ఈ విషయం వెలుగులోకి వచ్చినప్పటి నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రశాంత్‌ను భారత్‌కు రప్పించే ప్రయత్నాలు చేపట్టి సఫలీకృతం అయ్యాయి. – వీసీ సజ్జనార్, సైబరాబాద్ సీపీ ఇంత త్వరగా వస్తాననుకోలేదు పాకిస్తాన్ జైల్లో నా లాంటి వాళ్లు అనేక మంది ఏళ్ల తరబడి ఉన్నారు. వారందరి పరిస్థితి చూసి.. నేను ఇంత త్వరగా తిరిగి వస్తానని భావించలేదు. పట్టుబడిన వెంటనే కొన్నాళ్లు ఆర్మీ జైల్లో ఉంచి విచారించారు. ఆ తర్వాత కోర్టు ఆదేశాల మేరకు సాధారణ జైలుకు తరలించారు. అక్కడ భారతీయుల కోసం ప్రత్యేక బ్లాక్ ఏర్పాటు చేశారు. నా కేసు సివిల్ కోర్టుకు వచ్చాక పాకిస్తాన్ పోలీసులు స్నేహితులుగా మారారు. అప్పుడే సెల్ఫీ వీడియోకు అవకాశం ఇచ్చారు. పాకిస్తాన్ అధికారులతో తొలుత ఇంగ్లిష్ లోనే మాట్లాడాను. ఆపై వారి భాష కొంత వరకు నాకు వచ్చింది. నా విడుదలకు కారణమైన అందరికీ ధన్యవాదాలు. ఇప్పటికీ అక్కడి జైల్లో ఉన్న మన వారి కోసం ప్రభుత్వాలు, మీడియా ఏదైనా చేయాలి. – వి.ప్రశాంత్ -
2017 ఏప్రిల్ లో హైదరాబాద్ నుంచి అదృశ్యమైన ప్రశాంత్
-
పాక్ లో ఇరుక్కున్న యువకుడుప్రశాంత్ విడుదల
-
పాకిస్తాన్లో ఇరుక్కున్న తెలుగు యువకుడు ప్రశాంత్ విడుదల
-
పాకిస్తాన్లో ఇరుక్కున్న తెలుగు యువకుడు విడుదల
సాక్షి, హైదరాబాద్: పాకిస్తాన్లో చిక్కుకుపోయిన తెలుగు యువకుడు ప్రశాంత్ విడుదలయ్యాడు. అతను సోమవారం హైదరాబాద్ చేరుకున్నారు. 2017 ఏప్రిల్‌లో హైదరాబాద్ నుంచి ప్రశాంత్ అదృశ్యమయ్యాడు. తన ప్రియురాలి కోసం పాకిస్తాన్ మీదుగా స్విట్జర్లాండ్ వెళ్లే క్రమంలో ప్రశాంత్ పాక్ అధికారులకు పట్టుబడ్డాడు. దీంతో ఇంత కాలం ప్రశాంత్ పాకిస్తాన్‌లోనే ఉన్నాడు. తాజాగా వాఘా సరిహద్దులో పాక్ అధికారులు ఆ యువకుడిని భారత్‌కు అప్పగించారు. ప్రశాంత్ హైదరాబాద్‌లోని ఓ సాఫ్ట్వేర్ సంస్థలో పని చేశాడు. 2019లో తన కొడుకును రప్పించే ప్రయత్నం చేయాలని ప్రశాంత్ తండ్రి బాబూరావు సైబరాబాద్ సీపీ సజ్జనార్‌కు విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. ఇక ప్రశాంత్ విడుదలతో అతని కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పాక్ నుంచి ప్రశాంత్ తిరిగొచ్చినందుకు సంతోషంగా ఉందని అతని సోదరుడు శ్రీకాంత్ తెలిపాడు. ప్రశాంత్ తిరిగి వచ్చేందుకు నాలుగేళ్లుగా పోలీసుల కృషి ఎంతో ఉందని గుర్తుచేశాడు. ప్రశాంత్ తిరిగి వచ్చేందుకు మీడియా పాత్ర కూడా ఎంతో ఉందని తెలిపాడు. చదవండి: ఎంత చెప్పిన వినరే.. ఏం.. తమాషా చేస్తున్నారా..? -
నిధుల సమస్య నో!!
ముంబై: ప్రైవేట్ రంగ యస్ బ్యాంక్ నేటి సాయంత్రం నుంచి అన్ని బ్యాంకింగ్ సేవలను పునరుద్ధరించనుంది. నిధులపరమైన సమస్యలేమీ లేవని, బుధవారం సాయంత్రం 6 గం.ల నుంచి సర్వీసులన్నీ అందుబాటులోకి వస్తాయని సీఈవోగా బాధ్యతలు చేపట్టనున్న ప్రశాంత్ కుమార్ తెలిపారు. ‘అన్ని జాగ్రత్త చర్యలూ తీసుకున్నాం. మా ఏటీఎంలలో పుష్కలంగా నగదు నిల్వలు ఉంచాం. అలాగే, శాఖలన్నింటికీ తగినంత స్థాయిలో నగదు సరఫరా ఉంది. కనుక.. బ్యాంక్‌కు సంబంధించి నిధులపరంగా ఎలాంటి సమస్యా లేదు. ఇతరత్రా బైటి నుంచి సమీకరించాల్సిన అవసరమైతే లేదు. కానీ ఒకవేళ అవసరమైనా కూడా తక్షణం తగినంత స్థాయిలో నిధులను సమకూర్చుకోగలిగే మార్గాలు ఉన్నాయి‘ అని ఆయన చెప్పారు. బుధవారం సాయంత్రం మారటోరియం ఎత్తివేశాక.. ఖాతాదారులు పూర్తి స్థాయిలో బ్యాంకింగ్ సర్వీసులను వినియోగించుకోవచ్చని పేర్కొన్నారు. మారటోరియం వ్యవధిలో నిర్దిష్ట పరిమితి రూ. 50,000 స్థాయిలో విత్‌డ్రా చేసుకున్న వారి సంఖ్య.. మొత్తం ఖాతాదారుల్లో మూడో వంతు మాత్రమే ఉండవచ్చని కుమార్ చెప్పారు. మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో యస్ బ్యాంక్‌లో ఇన్వెస్ట్ చేసిన ఎస్బీఐ చైర్మన్ రజనీష్ కుమార్, ఫెడరల్ బ్యాంక్ చీఫ్ అశుతోష్ ఖజూరియాతో పాటు ప్రశాంత్ కుమార్ పాల్గొన్నారు. 13 రోజుల్లోనే పరిష్కారం.. యస్ బ్యాంక్ పునరుద్ధరణ ప్రణాళిక గురించి స్పందిస్తూ.. ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్, ఇతర ఆర్థిక సంస్థల తోడ్పాటుతో 13 రోజుల్లోనే సంక్షోభం పరిష్కారమైనట్లు కుమార్ చెప్పారు. యస్ బ్యాంక్‌ను గట్టెక్కించే ప్రయత్నాల్లో భాగంగా మార్చి 5న సుమారు నెల రోజుల పాటు రిజర్వ్ బ్యాంక్ మారటోరియం విధించింది. ఈ వ్యవధిలో రూ. 50,000కు మించి విత్‌డ్రా చేసుకోవడానికి లేకుండా ఆంక్షలు విధించింది. బ్యాంకు బోర్డును రద్దు చేసి వ్యవహారాలను పర్యవేక్షించేందుకు అడ్మినిస్ట్రేటరుగా ఎస్బీఐ మాజీ సీఎఫ్‌వో ప్రశాంత్ కుమార్‌ను నియమించింది. మరోవైపు, బ్యాంకులోకి పెట్టుబడులు వచ్చేందుకు చర్యలు తీసుకుంది. పునరుద్ధరణ ప్రణాళిక ప్రకారం ఎనిమిది బ్యాంకులు యస్ బ్యాంక్‌లో రూ. 10,000 కోట్ల మేర ఇన్వెస్ట్ చేశాయి. ప్రభుత్వ రంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) అత్యధికంగా రూ. 6,050 కోట్లు ఇన్వెస్ట్ చేసింది. రికవరీపై ఆశలు... ముందు జాగ్రత్త చర్యగా సందేహాస్పద ఖాతాలన్నింటినీ క్యూ3 ఆర్థిక ఫలితాల్లో పొందుపర్చినందున యస్ బ్యాంక్ ఖాతాలను ఫోరెన్సిక్ ఆడిట్ చేయాల్సిన అవసరం లేదని ప్రశాంత్ కుమార్ చెప్పారు. మొండిబాకీలకు సంబంధించి ప్రొవిజనింగ్‌ను 42 శాతం నుంచి పెంచి.. 72 శాతం పైగా చేశామని, మార్చి త్రైమాసికంలో రూ. 8,500–10,000 కోట్ల దాకా రికవరీలు అంచనా వేస్తున్నామని ఆయన తెలిపారు. డిపాజిట్లు, రుణాల్లో 60 శాతం వాటాను రిటైల్ విభాగం నుంచి రాబట్టాలంటూ తమ సిబ్బందికి సూచించినట్లు ప్రశాంత్ తెలిపారు. యస్ బ్యాంక్‌కు ప్రస్తుతమున్న మొండిబాకీల్లో 90 శాతం పైగా బాకీలు డిసెంబర్‌తో ముగిసిన తొమ్మిది నెలల్లో జతయినవే కావడం గమనార్హం. ఏప్రిల్–డిసెంబర్ మధ్య కాలంలో రూ. 36,764 కోట్ల మేర మొండిబాకీలు పెరిగాయి. డిసెంబర్ క్వార్టర్లో స్థూల మొండిబాకీలు రూ. 40,709 కోట్లకు, ప్రొవిజనింగ్ రూ. 29,594 కోట్లకు పెరిగాయి. మరోవైపు, షేర్లపై లాకిన్ విధించడాన్ని సవాలు చేస్తూ రిటైల్ ఇన్వెస్టర్లు యస్ బ్యాంకు, ఆర్బీఐలపై కోర్టుకు వెళ్లనున్నారన్న వార్తలపై రజనీష్, ప్రశాంత్ స్పష్టమైన సమాధానం ఇవ్వలేదు. అలాగే ఇకపైనా పొదుపు ఖాతాలపై అధిక స్థాయిలో వడ్డీ చెల్లిస్తారా అన్న ప్రశ్నకు సమాధానమివ్వకుండా దాటవేశారు. మరోపక్క, యస్ బ్యాంకులో రూ. 1,000 కోట్ల పెట్టుబడులతో 7.97% వాటా కొనుగోలు చేసినట్లు ఐసీఐసీఐ బ్యాంకు వెల్లడించింది. హెచ్డీఎఫ్సీ 7.97%, యాక్సిస్ 4.78 %, కోటక్ మహీంద్రా బ్యాంక్ 3.98 శాతం, ఫెడరల్ బ్యాంక్.. బంధన్ బ్యాంక్ చెరి 2.39%, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ 1.99% వాటాలు కొనుగోలు చేశాయి. ఒక్క షేరూ విక్రయించం: రజనీష్ మూడేళ్ల లాకిన్ వ్యవధి పూర్తి కాకుండా యస్ బ్యాంకులో ఒక్క షేరు కూడా విక్రయించబోమని ఎస్బీఐ చైర్మన్ రజనీష్ కుమార్ స్పష్టం చేశారు. ప్రస్తుతం 42 శాతం వాటాలు తీసుకున్నామని, రెండో విడత ఫండింగ్‌లో దీన్ని 49 శాతానికి పెంచుకోనున్నామని ఆయన చెప్పారు. మూడో రోజూ షేరు జోరు... యస్ బ్యాంక్ షేర్ జోరు కొనసాగుతోంది. బ్యాంక్ రేటింగ్‌ను అంతర్జాతీయ బ్రోకరేజ్ సంస్థ, మూడీస్ అప్‌గ్రేడ్ చేయడంతో మంగళవారం యస్ బ్యాంక్ షేర్ 58% లాభంతో రూ.58.65కు చేరింది. ఇంట్రాడేలో 73% లాభంతో రూ.64కు ఎగసింది. 3 రోజుల్లో 134%లాభపడింది. -
టబు పాత్రలో రమ్యకృష్ణ
హిందీలో ‘అంధాధూన్’ ఘనవిజయం సాధించింది. జాతీయ ఉత్తమ హిందీ చిత్రంగా నేషనల్ అవార్డు కూడా గెలుచుకుంది. ఇందులో ఆయుష్మాన్ ఖురానా హీరోగా నటించారు. ఆయన నటనకు ప్రశంసలు దక్కాయి. అలాగే సినిమాకి కీలకంగా నిలిచిన టబు పాత్రకు, ఆమె నటనకు కూడా విపరీతమైన ప్రశంసలు దక్కాయి. ఇప్పుడు ఆ పాత్రను తమిళంలో రమ్యకృష్ణ పోషించనున్నారని తెలిసింది. ‘అంధాధూన్’ తమిళ రీమేక్ హక్కులను నటుడు, దర్శకనిర్మాత త్యాగరాజన్ తీసుకున్నారు. ఇందులో ఆయన కుమారుడు, ‘జీన్స్’ ఫేమ్ ప్రశాంత్ హీరోగా నటించనున్నారు. మోహన్ రాజా దర్శకత్వం వహిస్తారు. హిందీలో టబు చేసిన పాత్రకు నెగటివ్ షేడ్స్ ఉంటాయి. ఆ పాత్రకు రమ్యకృష్ణ అయితే బావుంటారని చిత్రబృందం భావించారట. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. ‘అంధాధూన్’ తెలుగు రీమేక్‌లో నితిన్ నటిస్తారు. -
ప్రశాంత్ బాధ్యత పాకిస్తాన్‌దే: భారత్
సాక్షి, న్యూఢిల్లీ : పాకిస్తాన్లో అడుగుపెట్టిన ఇద్దరు భారతీయుల వ్యవహారంపై కేంద్ర విదేశాంగశాఖ గురువారం స్పందించింది. ఈ నెల 14న హైదరాబాద్‌కు చెందిన వైందం ప్రశాంత్‌తో పాటు మధ్యప్రదేశ్‌కు చెందిన వారిలాల్‌ను పాకిస్తాన్ నిర్బంధంలోకి తీసుకున్న విషయం తెలిసిందే. పాస్‌పోర్టు, వీసా లేకుండా అక్రమంగా తమ దేశంలోకి అడుగు పెట్టారని ఆరోపిస్తూ వీరిని పాక్ పోలీసులు అరెస్టు చేశారు. దీనిపై కేంద్ర విదేశాంగశాఖ అధికార ప్రతినిధి రవీష్ కుమార్ మాట్లాడుతూ.. 2016-17 సంవత్సరంలో ఇద్దరు భారతీయులు పాక్ చెరలో అడుగు పెట్టారనే సమాచారం అందిందని, అప్పుడే ఈ విషయంపై పాకిస్తాన్ అధికారులకు సమాచారం అందించామన్నారు. అయితే అప్పటి నుంచి పాక్ నుంచి ఎటువంటి స్పందన రాలేదని.. అకస్మాత్తుగా అరెస్టు చేసిన ప్రకటన రావడం తమకు ఆశ్చర్యం కలిగించే విషయమన్నారు. ఈ అంశం గురించి పాక్ అధికారులతో మాట్లాడుతున్నట్లు తెలిపారు. పాకిస్తాన్ చేస్తున్న అసత్య ప్రచారానికి వీరు బలికాబోరని.. వీరికి కాన్సులర్ యాక్సెస్ కల్పించాలని కోరినట్లు తెలిపారు. ఇద్దరికీ ఎటువంటి హానీ కలగకుండా సురక్షితంగా స్వదేశానికి పంపించాలని విజ్ఞప్తి చేశారు. వీరిని తిరిగి రప్పించేందుకు కొంత సమయం పడుతుందని, అప్పటి వరకు వీరి బాధ్యత పాకిస్తాన్‌దేనని స్పష్టం చేశారు. -
ప్రేమ కోసమై చెరలో పడెనే..
కేపీహెచ్‌బీకాలనీ : మధ్యప్రదేశ్‌కు చెందిన స్వప్నికా పాండేను మనసారా ప్రేమించాడు. బెంగళూరులోని హువాయ్ సంస్థలో ఉద్యోగం చేస్తున్న సమయంలో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. అయితే స్విట్జర్లాండ్‌లో ఉద్యోగం రావడంతో స్వప్నిక వెళ్లిపోయినప్పటి నుంచి ఆమెనే తలచుకుంటూ మతిస్థిమితం తప్పాడు. ప్రియురాలు తనను దూరంపెట్టడం భరించలేక ఎలాగైనా చేరుకోవాలని పొరపాటున శత్రుదేశంలో కాలుమోపిన హైదరాబాద్‌కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ ప్రశాంత్ పరిస్థితిపై అతని కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రశాంత్‌ను పాకిస్తాన్ నుంచి భారత్‌కు వచ్చేలా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని వేడుకుంటున్నారు. ప్రశాంత్ కుటుంబ నేపథ్యం.. బాబూరావుకు ఇద్దరు కుమారులు కాగా ప్రశాంత్ పెద్ద కొడుకు. ప్రశాంత్ ఎనిమిదో తరగతి చదువుతున్న సమయంలోనే బాబూరావు కుటుంబం శ్రీకాకుళం జిల్లా రాజాం నుంచి విశాఖపట్నంకు వచ్చారు. ఏడేళ్ల క్రితం రెండో కుమారుడు ఉద్యోగ రీత్యా హైదరాబాద్‌లో ఉండటంతో బాబూరావు కూడా నగరానికి వచ్చి కుమారుడి వద్దనే ఉంటున్నారు. ప్రస్తుతం బాబూరావు భార్య ఇందిర, చిన్న కుమారుడు శ్రీకాంత్, కోడలు కలసి కేపీహెచ్‌బీ భగత్‌సింగ్‌నగర్ ఫేజ్–1లోని ప్లాట్ నంబర్ 522లో గల ద్వారకామాయి అపార్ట్మెంట్లో అద్దెకు ఉంటున్నారు. కాగా, ప్రశాంత్‌కు బెంగళూరులోని హువాయ్ సంస్థలో ఉద్యోగం వచ్చింది. ఆ సమయంలో స్వప్నికా పాండే పరిచయమైంది. పరిచయం ప్రేమగా మారింది. తర్వాత ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు తలెత్తాయి. అదే సమయంలో స్వప్నికకు మరో ఉద్యోగం రావడంతో సిట్జర్లాండ్ వెళ్లిపోయింది. ప్రశాంత్ కొంతకాలం చైనా, ఆఫ్రికా దేశాల్లో ఉద్యోగ రీత్యా పనిచేశాడు. అక్కడ ఇమడలేక నగరానికి వచ్చి అమీర్‌పేటలో ఫ్యాకల్టీగా కోచింగ్ సెంటర్లో పనిచేశాడు. తిరిగి షోర్ ఇన్ఫోటెక్ సంస్థలో సాఫ్ట్వేర్ ఉద్యోగంలో చేరాడు. అయితే ఎన్ని దేశాలు, ఉద్యోగాలు మారినా స్వప్నికను మరచిపోలేకపోయాడు. దీంతో ఆమె వద్దకు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. మానసిక స్థితి తప్పిన ప్రశాంత్ ప్రేయసిని వెదుకుతూ.. ఉత్తర భారత్ వెళ్లి ఉంటాడని, ఈ క్రమంలోనే పొరబాటున పాక్‌లోకి ప్రవేశించి ఉంటాడని బాబురావు మంగళవారం మీడియాకు తెలిపారు. చాలా సున్నిత మనస్కుడు.. సున్నిత మనస్కుడైన ప్రశాంత్ ఎప్పుడూ ఆందోళనకు గురవుతూ ఉండేవాడని, ప్రతి చిన్న విషయంలోనూ జాగ్రత్తగా వ్యవహరించేవాడని బాబురావు చెప్పారు. చివరగా 2017, ఏప్రిల్ 11న డ్యూటీకని వెళ్లిన ప్రశాంత్ ఇంటికి తిరిగిరాలేదన్నారు. దీంతో ప్రశాంత్ పనిచేసే సంస్థలో విచారించగా విధులకు వచ్చి వెళ్లినట్లు తెలిపారన్నారు. అంతా వెతికి అదే నెల 29న మాదాపూర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసామన్నారు. ఎక్కడో చోట క్షేమంగా ఉంటాడని భావిస్తూ వచ్చామన్నారు. కానీ, ఇలా పాకిస్తాన్లో ఉన్నాడన్న వార్త వింటామని కలలో కూడా ఊహించలేదని కన్నీరుమున్నీరయ్యారు. ఎనిమిది నెలల కిందట.. 8 నెలల కిందట రాజస్థాన్ నుంచి ఇద్దరు పోలీసులు, నగరంలోని లక్డీకాఫూల్ పోలీసులతో కలసి సివిల్ దుస్తుల్లో వచ్చి తన చిన్న కుమారుడు శ్రీకాంత్‌ను ప్రశాంత్ వివరాలు అడిగారని బాబురావు చెప్పారు. అప్పుడు వైజాగ్‌లో ఉన్న తమ వద్దకు కూడా వచ్చి కుటుంబ వివరాలు తెలుసుకుని మీ అబ్బాయి క్షేమంగానే తిరిగి వస్తాడని చెప్పి వెళ్లారని తెలిపారు. నెల రోజుల తరువాత మరొకరు పోలీసు అని వచ్చి ప్రశాంత్ వివరాలు తెలుసుకుని వెళ్తూ వెళ్తూ మీ అబ్బాయి పాకిస్తాన్లో ఉన్నాడని చెప్పి వెళ్లడంతో ఆందోళనకు గురయ్యామని, వెంటనే మాదాపూర్ పోలీసులకు సమాచారాన్ని అందించామని తెలిపారు. అయితే పోలీసులు మాత్రం అలాంటి సమాచారమేదీ తమకు లేదని చెప్పినట్లు తెలిపారు. రెండువారాల క్రితమే సందేశం.. ఈ క్రమంలోనే రెండువారాల కింద పాకిస్తాన్లో ఉన్న తమ కుమారుడు కోర్టు ఆవరణలో ఓ న్యాయవాది సహకారంతో ఫోన్లో మాట్లాడిన వీడియోను తన సెల్‌కు పంపడంతో తమకు ఏం చేయాలో పాలుపోలేదని వాపోయారు. తాను పాకిస్తాన్ ప్రభుత్వ అదుపులో ఉన్నానని, కోర్టు ప్రొసీడింగ్స్ అయిన తరువాత తనను భారత ప్రభుత్వానికి అప్పగిస్తారని, నెల రోజుల్లో తిరిగి వచ్చేస్తానని తెలియపర్చినట్లు బాబురావు పేర్కొన్నారు. తొలుత సైనిక విచారణ జరిగిందా? 8నెలల క్రితమే పోలీస్ అధికారులు బాబూరావు కుటుంబాన్ని విచారించటాన్ని బట్టి అప్పటి నుంచే ప్రశాంత్ పాక్ చెరలో ఉన్నట్లు తెలుస్తోంది. సైనిక విచారణ అనంతరం ప్రభుత్వానికి అప్పగించి ఉంటారని, ప్రభుత్వం కోర్టు ద్వారా అభియోగాలను నమోదు చేయటంతో వెలుగులోకి వచ్చిందని భావిస్తున్నారు. నవంబర్ 14న ప్రశాంత్‌తోపాటు మధ్యప్రదేశకు చెందిన దరిలాల్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కానీ, వాస్తవానికి అతన్ని చాలాకాలం కిందటే అదుపులోకి తీసుకున్నారని సమాచారం. అతని మానసిక పరిస్థితిపై వారికి కూడా స్పష్టత ఉంది కాబట్టే.. అతని వీడియో సందేశం మీడియాకు విడుదల చేశారని, నిజంగానే గూఢచర్యం కేసులో అరెస్టు చేస్తే.. పరిస్థితులు మరోరకంగా ఉండేవని పోలీసు ఉన్నతాధికారులు అభిప్రాయం వ్యక్తం చేశారు. మంత్రి కేటీఆర్ హామీ ప్రశాంత్ పాక్ చెరలో ఉన్న విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, స్థానిక కార్పొరేటర్ మందడి శ్రీనివాసరావు.. బాబురావు కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం మంత్రి కేటీఆర్‌తో ఫోన్లో మాట్లాడి బాబురావుతోనూ మాట్లాడించారు. ప్రశాంత్‌ను క్షేమంగా తీసుకువచ్చేందుకు తగిన చర్యలు తీసుకుంటామని కేటీఆర్ హామీనిచ్చారు. కాగా, ప్రశాంత్‌ది సాధారణ మిస్సింగ్కేసని, క్షేమంగా వస్తాడని, దానిపై ఎలాంటి ఈ విషయంలో సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారం చేసినా చట్టపరమైన చర్యలు ఉంటాయని సైబరాబాద్ సీపీ సజ్జనార్ హెచ్చరించారు. పాక్ మీడియా ఏమంటోందంటే.. పాకిస్తాన్లో పంజాబ్ ప్రావీన్స్‌లోని తుబాబరిలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులకు ప్రశాంత్, దరియాలాల్ (మధ్యప్రదేశ్) కనిపించారు. దీంతో వీరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని ఆ దేశ మీడియా చెబుతోంది. వీరిపై సెక్షన్ 3, 4 (కంట్రోల్ ఆఫ్ ఎంట్రీ) యాక్ట్ 1952 ప్రకారం.. బహవాల్పూర్ జిల్లా పోలీసులు కేసులు నమోదు చేశారు. -
పాక్‌లో ప్రశాంత్: క్లారిటీ ఇచ్చిన సజ్జనార్
సాక్షి, హైదరాబాద్: పాకిస్తాన్ చెరలో తెలుగు యువకుడు ప్రశాంత్ చిక్కుకున్నట్లు వస్తున్న వార్తలు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. ప్రశాంత్‌ను సురక్షితంగా భారత్‌కు తీసుకరావాలంటూ సోషల్ మీడియా వేదికగా పోలీసులను నెటిజన్లు అభ్యర్థిస్తున్నారు. హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న ప్రశాంత్ ప్రేమించిన అమ్మాయి కోసం పాక్ సరిహద్దును దాటినట్లు వస్తున్న వార్తలపై సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ క్లారిటీ ఇచ్చారు. మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా పాకిస్తాన్ చెరలో తెలుగు యువకుడు ప్రశాంత్ చిక్కుకున్నట్లు వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. ఇప్పటివరకు ప్రశాంత్‌ది కేవలం మిస్సింగ్ కేస్‌గా మాత్రమే నమోదు చేసుకున్నట్లు తెలిపారు. దర్యాప్తులో పూర్తి వివరాలు బయటపడతాయన్నారు అయితే సోషల్ మీడియాలో, ప్రసార మాధ్యమాల్లో వస్తున్న అసత్య ప్రచారాలను నమ్మొద్దని సూచించారు. ఎవరైన అసత్య ప్రచారాలు చేసినా, షేర్ చేసినా వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని సజ్జనార్ హెచ్చరించారు. ‘ప్రశాంత్ వ్యవహారంపై తెలంగాణ పోలీసుల ఆరా, ప్రశాంత్ వ్యవహారంలో వెలుగులోకి వస్తున్న సంచలన విషయాలు, 10 నెలల క్రితమే ఇండియన్ రా ఏజెంట్ ప్రశాంత్ తండ్రి బాబురావు దగ్గరికి వచ్చినట్లు గుర్తింపు, పది నెలల క్రితమే ప్రశాంత్ వివరాలు అడిగిన రా ఏజెంట్, ప్రశాంత్ పాకిస్తాన్లో ఉన్నట్లు బాబురావుకు పది నెలల క్రితమే సమాచారం ఇచ్చిన రా ఏజెంట్’ వంటి సందేశాలు, వార్తలు సోషల్ మీడియాలో ఎక్కువగా షేర్ అవుతున్నట్లు తమ దృష్టికి వచ్చినట్లు తెలిపారు. అయితే ఇవన్నీ తప్పుడు వార్తలని సజ్జనార్ స్పష్టం చేశారు. -
ప్రియురాలి కోసం పాక్ వెళ్లిన ప్రశాంత్!
సాక్షి, హైదరాబాద్: పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్సులో ఉన్న బహవాల్పూర్లో ఇద్దరు భారత యువకుల్ని చోలిస్తాన్ పోలీసులు అదుపులోకి తీసుకున్న ఘటనలో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈనెల 14న పాక్ పోలీసులు అదుపులోకి తీసుక్ను ఇద్దరు యువకుల్లో ఓ వ్యక్తి విశాఖపట్నంకు చెందిన ప్రశాంత్‌గా ఆంధ్రప్రదేశ్ పోలీసులు గుర్తించారు. హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న ప్రశాంత్ ప్రేమించిన అమ్మాయి కోసం పాక్ సరిహద్దును దాటినట్లు తెలుస్తోంది. దీనిపై స్పందించిన ప్రశాంత్ తండ్రి బాబురావు పలు కీలక విషయాలను వెల్లడించారు. ప్రశాంత్ తన ప్రియురాలు (స్వప్నిక) కోసం తమతో విభేదించాడని, ఈ నేపథ్యంలోనే రెండేళ్ల నుంచి కనిపించడంలేదని ఆయన తెలిపారు. గతంలో ప్రశాంత్ బెంగళూర్‌లో ఉద్యోగం చేస్తున్న సమయంలో స్వప్నిక పరిచయం అయిందని ఆయన పేర్కొన్నారు. అయితే ప్రశాంత్ పాకిస్తాన్‌కు ఎందుకు వెళ్లాడో మాత్రం తమకు తెలీదని అంటున్నారు. గత రెండేళ్లుగా పూర్తి డిప్రెషన్లో ఉన్నాడని, మతిస్థిమితం కోల్పోయాడని కూడా అతని తండ్రి వాపోయారు. ఈ మేరకు మంగళవారం మదాపూర్ పోలీసులకు బాబురావు ఫిర్యాదు చేశారు. ఎలాగైనా తన కుమారుడిని క్షేమంగా తీసుకురావాలని వేడుకున్నారు. ఇదిలావుండగా అతని ప్రియురాలి కోసం గూగుల్ మ్యాప్‌లో దోలాడుతూ పాక్‌లోకి ప్రవేశించాడని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రియురాలి కోసం హైదరాబాద్ నుంచి పాక్‌ను వెళ్లినట్లు కూడా తెలుస్తోంది. కాగా ప్రశాంత్ తెలుగులో మాట్లాడిన 1.03 నిమిషాల నిడివి గల వీడియో సైతం హల్చల్ చేస్తోంది. అందులో అతడి వెనుక ముస్తాఫా అనే పేరు గల నేమ్‌ప్లేట్‌తో ఆకుపచ్చ రంగు యూనిఫాంలో ఒకరు నిల్చుని ఉన్నారు. (పాక్‌లోకి అక్రమంగా ప్రవేశించిన హైదరాబాదీ) అయితే పాక్ మీడియా మాత్రం అతను అక్రమంగా ప్రవేశించాడని, పాక్ నుంచి యూరప్ వెళ్లే ప్రయత్నంలో పట్టుబడినట్టు పలు కథనాలను ప్రచురించింది. వీరు అక్రమంగా తమ దేశంలోకి ప్రవేశించినట్లు ఆరోపిస్తూ అక్కడి పోలీసులు కేసు నమోదు చేశారు. ఇద్దరిలో మధ్యప్రదేశ్‌కు చెందిన దరీలాల్‌తోపాటు హైదరాబాద్‌కు చెందిన ప్రశాంత్ ఉన్నట్లు అంతర్జాతీయ మీడియా ప్రకటించింది. వీరిలో ఒకరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావడంతో పాకిస్తాన్లో ప్రత్యేక ఆపరేషన్‌కు భారత్ కుట్ర పన్నిందని పాక్ మీడియా ఆరోపించింది. అయితే ఇద్దరు భారతీయ యువకులు పాక్‌లో బందించడంపై నేడు భారత రక్షణ శాఖ సమావేశం కానుంది. అక్కడి అధికారులతో మాట్లాడి పరిస్థితిపై సమీక్షించనుంది. పాక్‌లో పట్టబడ్డ ప్రశాంత్‌ను విడిపించేందుకు ప్రయత్నిస్తున్నామని బీజేపీ ఎమ్మెల్సీ రాంమాధవ్ తెలిపారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ ప్రధాన కార్యదర్శి రామ్‌మాధవ్‌లతో చర్చించామని అన్నారు. -
పాక్‌లోకి అక్రమంగా ప్రవేశించిన హైదరాబాదీ
సాక్షి, హైదరాబాద్: ఉత్తరప్రదేశ్‌లోని బైరాగిపట్టి మసీదులో జరిగిన పేలుడు కేసులో టోలిచౌకిలో నివసిస్తున్న ఆర్మీ మాజీ డాక్టర్ అరెస్టైన విషయం మరువక ముందే మరో కలకలం రేగింది. పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్సులో ఉన్న బహవాల్పూర్లో ఇద్దరు భారత యువకుల్ని చోలిస్తాన్ పోలీసులు ఈ నెల 14న అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఒకరు హైదరాబాద్‌కు చెందిన ప్రశాంత్ అని తెలుస్తోంది. వీరు అక్రమంగా తమ దేశంలోకి ప్రవేశించినట్లు ఆరోపిస్తూ అక్కడి పోలీసులు కేసు నమోదు చేశారు. ఇద్దరిలో మధ్యప్రదేశ్‌కు చెందిన దరీలాల్‌తోపాటు హైదరాబాద్‌కు చెందిన ప్రశాంత్ ఉన్నట్లు అంతర్జాతీయ మీడియా ప్రకటించింది. వీరిలో ఒకరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావడంతో పాకిస్తాన్లో ప్రత్యేక ఆపరేషన్‌కు భారత్ కుట్ర పన్నిందని పాక్ మీడియా ఆరోపించింది. ఆ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ప్రశాంతేనని.. అతడు 2017 నుంచి కనిపించట్లేదని సమాచారం. ఆ యువకుడు తెలుగులో మాట్లాడిన 1.03 నిమిషాల నిడివి గల వీడియో సైతం హల్చల్ చేస్తోంది. అందులో అతడి వెనుక ముస్తాఫా అనే పేరు గల నేమ్‌ప్లేట్‌తో ఆకుపచ్చ రంగు యూనిఫాంలో ఒకరు నిల్చుని ఉన్నారు. ఈ ఘటనతో కేంద్ర, రాష్ట్ర నిఘా వర్గాలు అప్రమత్తమయ్యాయి. ప్రశాంత్ ఎవరనే కోణంలో ఆరా తీస్తున్నాయి. అంతర్జాతీయ మీడియా వార్తల ఆధారంగా విచారణ చేపట్టామని ఓ ఉన్నతాధికారి ‘సాక్షి’తో అన్నారు. ఆ వీడియోలోని మాటలివి.. ‘‘కెన్ ఐ స్పీక్ ఇన్ మై ఓన్ లాంగ్వేజ్ (నేను నా మాతృ భాషలో మాట్లాడవచ్చా)... మమ్మీ డాడీ బాగున్నారా? ఇక్కడంతా బాగానే ఉంది. నన్ను ఇప్పుడు పోలీసుస్టేషన్ నుంచి కోర్టుకు తీసుకొచ్చారు. ఏ ప్రాబ్లం లేదని డిక్లేర్ అయిన తర్వాత కోర్టుకు తీసుకొచ్చారు. ఇక్కడ నుంచి జైలుకు తీసుకెళ్తారు. అక్కడ నుంచి వాళ్లు ఇండియన్ ఎంబసీకి సమాచారమిస్తారు. జైలుకెళ్లాక బెయిల్ ప్రాసెస్ ఉంటుంది. అప్పుడు మిమ్మల్ని కాంటాక్ట్ చెయ్యడం అవుతుంది. ఇండియా వాళ్లు, పాకిస్తాన్ వాళ్లు ఎక్స్చేంజ్ చేసుకుంటారు. దీనికి ఓ నెల వరకు పడుతుంది. ఇప్పుడు కోర్టులో ఉన్నా.. జైలుకు వెళ్లిన తర్వాత మిమ్మల్ని కాంటాక్ట్ చెయ్యడానికి అవకాశం ఉంటుంది.’ -
ధనుష్ కాదు ప్రశాంత్!
శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వంలో ఆయుష్మాన్ ఖురానా, రాధికా ఆప్టే, టబు ముఖ్య పాత్రల్లో నటించిన హిందీ బ్లాక్‌బస్టర్ చిత్రం ‘అంధాధూన్’. ఈ చిత్రం తమిళంలో రీమేక్ కాబోతుందని ఆ మధ్య వార్తలు వచ్చాయి. హీరోగా ధనుష్, సిద్ధార్థ్ ఇలా పలువురు పేర్లు కూడా వినిపించాయి. ఓ సందర్భంలో ‘అంధాధూన్’ చేయాలని చాలా ఆసక్తిగా ఉన్నానని కూడా తెలిపారు ధనుష్. ఇప్పుడు ‘అంధాధూన్’ తమిళ రీమేక్‌లో ‘జీన్స్’ ఫేమ్ ప్రశాంత్ నటిస్తారని తెలిసింది. ఈ హిందీ చిత్రం తమిళ రైట్స్‌ను ప్రశాంత్ తండ్రి, నటుడు–దర్శకుడు–నిర్మాత త్యాగరాజన్ సొంతం చేసుకున్నారు. ప్రశాంత్ నటించిన గత చిత్రం ‘జానీ’ (తమిళం) కూడా శ్రీరామ్ రాఘవన్ తెరకెక్కించిన ‘జానీ గద్దర్’ (హిందీ)కు రీమేకే కావడం విశేషం. -
చిన్న సినిమాలను ప్రోత్సహించాలి
‘‘అమెరికాలో ఉద్యోగం చేస్తున్న ప్రశాంత్ సినిమా మీద ప్యాషన్‌తో ‘ప్రాణం ఖరీదు’ చిత్రంలో హీరోగా నటించాడు. ఈ చిత్రం చూసాను. ప్రశాంత్ బాగా నటించాడు. మరో మంచి నటుడు ఇండస్ట్రీకి వస్తున్నాడు. చిన్న సినిమాలను అందరూ ప్రోత్సహించాలి’’ అని నిర్మాత కె.ఎల్.దామోదర ప్రసాద్ అన్నారు. ప్రశాంత్, అవంతిక జంటగా పియల్‌కె రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ప్రాణం ఖరీదు’. ఎన్‌యస్ క్రియేషన్స్ పతాకంపై నల్లమోపు సుబ్బారెడ్డి నిర్మించిన ఈ సినిమా త్వరలో విడుదలకానుంది. ‘వందేమాతరం’ శ్రీనివాస్ స్వరపరచిన ఈ చిత్రం పాటలను నిర్మాత కె.యల్.దామోదర ప్రసాద్ విడుదలచేశారు. పియల్‌కె రెడ్డి మాట్లాడుతూ– ‘‘సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రమిది. సుబ్బారెడ్డిగారు అన్నివిధాలా సహకరించి సపోర్ట్ చేశారు. శ్రీనివాస్ మంచి పాటలు ఇచ్చారు. యాక్షన్, సెంటిమెంట్ సీన్స్‌లో ప్రశాంత్ బాగా నటించాడు. మేము ఊహించిన దానికంటే అవంతిక బాగా చేశారు’’ అన్నారు. ‘‘సినిమా బాగా వచ్చింది. ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌చేసేలా ఉంటుంది’’ అని నల్లమోపు సుబ్బారెడ్డి అన్నారు. ‘‘మా సినిమా ఎవర్నీ నిరుత్సాహ పరచదు’’ అన్నారు ప్రశాంత్. ‘‘ప్రాణం ఖరీదు’ నా మూడో చిత్రం. ఈ సినిమాలో మంచి పాత్ర చేశాను’’ అని అవంతిక చెప్పారు. -
చిన్న సినిమాగా చూడొద్దు
‘‘ప్రాణం ఖరీదు’ సినిమా టీజర్, ట్రైలర్ చాలా ఆసక్తిగా ఉన్నాయి. ఈ రోజుల్లో బాగా చదువుకున్నవాళ్లు, అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న వాళ్లు కూడా మంచి ఆలోచనలు, చక్కటి కథ, స్క్రీన్‌ప్లేతో ఇండస్ట్రీకి వస్తున్నారు.. వారందరికీ స్వాగతం. ‘ప్రాణం ఖరీదు’ చిత్రాన్ని చిన్నదిగా చూడొద్దు. మంచి సినిమాలను ఆదరిస్తే ఇంకా మంచి కుర్రోళ్లు హీరోలుగా, డైరెక్టర్‌గా, రైటర్స్‌గా వస్తారు’’ అని దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు అన్నారు. ప్రశాంత్, అవంతిక జంటగా తారకరత్న ముఖ్య పాత్రలో పి.ఎల్.కె. రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ప్రాణం ఖరీదు’. పద్మప్రియ సమర్పణలో నల్లమోపు సుబ్బారెడ్డి నిర్మించిన ఈ సినిమా ట్రైలర్‌ని కె.రాఘవేంద్రరావు విడుదల చేశారు. ప్రశాంత్ మాట్లాడుతూ–‘‘నేను అడగ్గానే పెద్ద మనసుతో మా ‘ప్రాణం ఖరీదు’ సినిమా ట్రైలర్‌ని రిలీజ్ చేసి, మమ్మల్ని ఆశీర్వదించిన రాఘవేంద్రరావుగారికి కృతజ్ఞతలు. మా టీమ్ ఎంతో కష్టపడి విరామం లేకుండా ఇండియాలో ఈ సినిమా చిత్రీకరించాం. ఈ నెల 15న చిత్రం విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. షఫి, జెమినీ సురేష్,‘చిత్రం’ శ్రీను, ఫణి రాజమౌళి, సంజన, కెమెరా: మురళి మోహన్ రెడ్డి, సంగీతం: ‘వందేమాతరం’ శ్రీనివాస్. -
సస్పెన్స్ థ్రిల్లర్
ప్రశాంత్, అవంతిక జంటగా నందమూరి తారకరత్న ముఖ్య పాత్రలో పి.ఎల్.కె. రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ప్రాణం ఖరీదు’. పద్మప్రియ సమర్పణలో యన్. ఎస్ క్రియేషన్స్ పతాకంపై నల్లమోపు సుబ్బారెడ్డి నిర్మించిన ఈ చిత్రం సాంగ్ టీజర్‌ని సంగీత దర్శకుడు ‘వందేమాతరం’ శ్రీనివాస్ విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ– ‘‘ప్రాణం ఖరీదు’ చిత్రానికి నేనే సంగీతం అందించాను. ఇందులోని రెండు పాటల టీజర్స్‌ని నా చేతుల మీదుగా విడుదల చేయడం చాలా ఆనందంగా ఉంది. నేను టీజర్ చూశా. సస్పెన్స్ థ్రిల్లర్ మూవీని క్రియేట్ చేశారనిపించింది. త్వరలో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది’’ అన్నారు. ‘‘మా ‘ప్రాణం ఖరీదు’ చిత్రానికి ‘వందేమాతరం’ శ్రీనివాస్‌గారి మ్యూజిక్ చాలా హెల్ప్ అయింది. అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. అతి త్వరలో విడుదల కానుంది’’ అన్నారు ప్రశాంత్. ‘‘మా సినిమాని అందరూ చూసి ఆశీర్వదించాలి’’ అని అవంతిక అన్నారు. షఫి, జెమినీ సురేష్, ‘చిత్రం’ శ్రీను, ఫణి రాజమౌళి, సంజన నటించిన ఈ చిత్రానికి కెమెరా: మురళీ మోహన్ రెడ్డి. -
ప్రశాంత్ ఈజ్ బ్యాక్
చార్మింగ్ హీరో ప్రశాంత్ చిన్న గ్యాప్ తరువాత ఫుల్ యాక్షన్ ప్యాకేజ్‌తో తెరపైకి రావడానికి రెడీ అవుతున్నారు. సాహసం చిత్రం తరువాత ఈయన నటిస్తున్న తాజా చిత్రం జానీ. ఈ పేరు వింటే నటుడు రజనీకాంత్ గుర్తుకొస్తారు. అవును ఆయన చిత్ర టైటిల్‌తో ప్రశాంత్ తాజాగా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. స్టార్ మూవీస్ పతాకంపై సీనియర్ నటుడు, దర్శక నిర్మాత త్యాగరాజన్ నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా నవదర్శకుడు వెట్రిసెల్వన్ పరిచయం అవుతున్నారు. ఈ సినిమాలో ప్రశాంత్‌కు జంటగా సంచితశెట్టి నటిస్తోంది. ప్రభు, షియాజీ షిండే, ఆనంద్‌రాజ్, అశుతోష్ రాణా వంటి భారీ తారాగణం ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్ ఇతివృత్తంతో తెరకెక్కుతున్న జానీ చిత్రంలో పాటలు లేకపోవడం విశేషం. ఉత్కంఠభరితంగా సాగే కథ, కథనాలతో కూడిన ఇందులో పాటలు చిత్ర వేగానికి బ్రేక్ వేస్తాయన్న ఉద్దేశంతోనే వాటిని చిత్రంలో చొప్పించలేదని నిర్మాత త్యాగరాజన్ పేర్కొన్నారు. చిత్ర టీజర్ ఇంతకు ముందే విడుదలై మంచి స్పందనను పొందగా, తాజాగా జానీ ట్రైలర్‌ను శుక్రవారం విడుదల చేశారు. 51 సెకన్లు నిడివి కలిగిన ఈ ట్రైలర్‌కు సూపర్ రెస్పాన్స్ వస్తోందని చిత్ర వర్గాలు తెలిపారు. త్వరలోనే జానీ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు నిర్మాత తెలిపారు. ప్రశాంత్ చాలా కాలం తరువాత ఒక తెలుగు చిత్రంలో నటిస్తుండడం విశేషం. రామ్‌చరణ్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న చిత్రంలో ప్రశాంత్ ప్రముఖ పాత్రను పోషిస్తున్నారు. ఇందులో ఆయన పాత్ర గురించి సామాజిక మాధ్యమాల్లో తక్కువ చేసి ప్రశాంత్‌కు ఇలాంటి పరిస్థితినా? అంటూ ప్రసారం వైరల్ అవుతోంది. ఇలాంటి ప్రసారాన్ని ప్రశాంత్ తండ్రి, జానీ చిత్ర నిర్మాత త్యాగారాజన్ తీవ్రంగా ఖండించారు. రామ్‌చరణ్ చిత్రంలో ప్రశాంత్ పోషిస్తున్న పాత్రకు చాలా ప్రాధాన్యత ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. -
ప్రాణం ఖరీదు ఎంత?
ప్రశాంత్, అవంతిక జంటగా నందమూరి తారకరత్న ముఖ్య పాత్రలో పి.ఎల్.కె. రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ప్రాణం ఖరీదు’. పద్మప్రియ సమర్పణలో యన్.ఎస్ క్రియేషన్స్ పతాకంపై నల్లమోపు సుబ్బారెడ్డి నిర్మించిన ఈ సినిమా నిర్మాణానంతర పనులు జరుపుకుంటోంది. సుబ్బారెడ్డి మాట్లాడుతూ– ‘‘ప్రాణం ఖరీదు’ కథ వినగానే యూనిట్ అందరికీ బాగా నచ్చింది. అందుకే ఖర్చుకు వెనకాడకుండా అమెరికాలో 8 రోజులు, హైదరాబాద్ 45 రోజులు షూటింగ్ పూర్తి చేశాం. అతి త్వరలో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. పి.ఎల్.కె. రెడ్డి మాట్లాడుతూ– ‘‘పక్కా కమర్షియల్ లవ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన చిత్రమిది. అనుకున్నదానికంటే ఔట్ పుట్ చాలా బాగా వచ్చింది. ఈ చిత్రానికి ‘వందేమాతరం’ శ్రీనివాస్‌గారి సంగీతం, ఆర్.ఆర్ ఓ హైలైట్’’ అన్నారు. షఫి, ‘జెమిని’ సురేశ్, ‘చిత్రం’ శ్రీను, ఫణి రాజమౌళి, సంజన తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: మురళి మోహన్ రెడ్డి. -
యూరోప్ పోదాం చలో చలో
హైదరాబాద్‌లో విలన్స్ అందర్నీ చితకబాదిన తర్వాత హీరోయిన్‌తో ఓ డ్యూయెట్ పాడనున్నారట రామ్‌చరణ్. ఆ డ్యూయెట్ కూడా ఫారిన్లో పాడుకోనున్నారు. అందుకే హీరోయిన్‌తో కలసి యూరోప్ వెళ్లనున్నారని సమాచారమ్. రామ్‌చరణ్, కియారా అద్వానీ జంటగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ యాక్షన్ ఎంటర్టైనర్లో బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్, ఆర్యన్ రాజేశ్, ప్రశాంత్, స్నేహా ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు. ఇటీవలే హైదరాబాద్‌లో ఈ సినిమాకు సంబంధించి హై వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించారు. ఇంటర్వెల్ సీన్స్‌కు సంబంధించిన ఈ ఫైట్‌లో 200మంది ఫైటర్స్ పాల్గొన్న సంగతి తెలిసిందే. ఆగస్ట్‌లో ఓ ఫారిన్ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారట బోయపాటి శ్రీను. దానికి సంబంధించిన లొకేషన్స్ కూడా ఫిక్స్ చేశారట. ఈ షెడ్యూల్లో సాంగ్స్‌తో పాటు హీరో హీరోయిన్‌పై కొన్ని సీన్స్ కూడా చిత్రీకరించనున్నారు. తమన్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని సంక్రాంతికి రిలీజ్ చేయనున్నారు. -
బ్యాంకాక్‌కు చెర్రీ, బోయపాటి
రంగస్థలం లాంటి ఘనవిజయం తరువాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తుండగా డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై దానయ్య భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మేజర్ షెడ్యూల్ హైదరాబాద్‌లో పూర్తయ్యింది. తదుపరి షెడ్యూల్ మే 12 నుంచి బ్యాంకాక్‌లో జరగనుంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత దానయ్య మాట్లాడుతూ ‘మాస్ ఇమేజ్ ఉన్న హీరో రామ్ చరణ్, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో సినిమా అంటే సినిమాపై ఎన్ని అంచనాలుంటాయో అందరికీ తెలిసిందే. ఆ అంచనాలకు ధీటుగా సినిమాను రూపొందిస్తున్నాం. సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. హైదరాబాద్‌లో మేజర్ షెడ్యూల్ పూర్తయ్యింది. అందులో భాగంగా రామోజీ ఫిలిం సిటీలో ఫ్యామిలీ సన్నివేశాలను, అల్యూమినియం ఫ్యాక్టరీలో యాక్షన్ ఎపిసోడ్‌ను పూర్తి చేశాం. ఈ 20 రోజుల షెడ్యూల్లో రామ్ చరణ్, ప్రశాంత్, స్నేహ, కియారాలతో పాటు ప్రధాన తారాగణంపై సన్నివేశాలను చిత్రీకరించారు. అంతుకు ముందుకు చిత్రీకరించిన 15 రోజుల షెడ్యూల్లో వివేక్ ఒబెరాయ్ సహా ప్రధాన తారాగణంపై సన్నివేశాలను చిత్రీకరించాం. తదుపరి షెడ్యూల్ కోసం యూనిట్ బ్యాంకాక్ వెళుతోంది. ఈ షెడ్యూల్ 15 రోజుల పాటు సాగుతుంది. మెగాభిమానులు, ప్రేక్షకులను అలరించేలా రామ్ చరణ్‌ను సరికొత్త యాంగిల్లో ప్రెజెంట్ చేస్తున్నారు డైరెక్టర్ బోయపాటి శ్రీను. ఫ్యామిలీ ఎమోషన్స్‌తో పాటు పవర్ ప్యాక్డ్ యాక్షన్ ఎలిమెంట్స్‌తో కమర్షియల్ ఎంటర్టైనర్గా సినిమాను రూపొందిస్తున్నాం’ అన్నారు. -
నటుడు ప్రశాంత్ మొదటి భార్య ఇంట్లో..
తిరువొత్తియూరు: చెన్నై, టీనగర్లో సినీ నటుడు ప్రశాంత్ మొదటి భార్య ఇంట్లో 170 సవర్ల నగలు చోరీకి గురయ్యాయి. చెన్నై టీ.నగర్ సౌత్ పార్కు రోడ్డులో సినీ నటుడు ప్రశాంత్ మొదటి భార్య గృహలక్ష్మి ఇల్లు ఉంది. ప్రస్తుతం ఈమె అడయారులో నివాసం ఉంటున్నారు. వారం వారం ఇక్కడికి వచ్చి బస చేసి వెళుతుంటారు. ఈ క్రమంలో బుధవారం ఇంటికి వచ్చారు. ఆ సమయంలో ఇంటి కిటికీలు పగులగొట్టి ఉన్నాయి. లోపలికి వెళ్లి చూడగా 170 సవర్ల నగలు, రూ.10వేలు నగదు చోరీకి గురైనట్లు గుర్తించింది.దీనిపై ఫిర్యాదు అందుకున్న మాంబలం పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు. దొంగలకు దేహశుద్ధి: తాంబరం పడప్పై నీలమంగళంకు చెందిన శ్రీనివాసులు ఆడిటర్. శ్రీనివాసన్ ఇంటికి తాళం వేసి ఊరికి వెళ్లారు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి ఇతని ఇంట్లోకి ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి తాళాలు పగులగొట్టి చోరీకి ప్రయత్నించారు. ఇది చూసిన స్థానికులు వారిని పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. విచారణలో పట్టుబడిన వారు షోలింగనల్లూరుకు చెందిన రమేష్, ఆనంద్ అని తెలిసింది. దొంగను పట్టించిన ఇంజినీర్ చెన్నై కన్నగినగర్ కారపాక్కం భారతీయార్ వీధికి చెందిన అబుదాగిరి (23) ఇంజినీర్. మంగళవారం మధ్యాహ్నం ఇంటికి తాళం వేసి పక్క వీధిలో ఉన్న హోటల్‌కు వెళ్లాడు. తరువాత 1.30 గంటల సమయంలో ఇంటికి రాగా ఆసమయంలో ఇంట్లో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ఉన్నట్టు గుర్తించాడు. వెంటనే బయట తలుపులకు తాళం పెట్టి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు అక్కడికి చేరుకుని చోరీకి ప్రయత్నిస్తున్న మణికంఠన్ (26), కార్తికేయన్ (27)లను అరెస్టు చేశారు. -
అతను హిందూ, ఆమె క్రిస్టియన్. ప్రేమించుకున్నారు..
సాక్షి, సిటీబ్యూరో : పెళ్లి చేసుకున్నారు.. జీవితాన్ని అర్థం చేసుకున్నారు.. ఆనందంగా గడుపుతున్నారు. నగరానికి చెందిన ఈప్రేమికులు మేరీ సొలంగ్, ప్రశాంత్ మంచికంటి.. తమ 15ఏళ్ల లవ్ జర్నీ విశేషాలు ‘సాక్షి’తో పంచుకున్నారిలా... మేరీ: నేను పుట్టింది అబుదాబిలో, పెరిగింది హైదరాబాద్‌లో. సెయింట్ ఫ్రాన్సిస్ కళాశాలలో 2002లో డిగ్రీ చేస్తుండగా, ప్రశాంత్ మాకు ఫ్రెంచ్ ప్రొఫెసర్. నాకు ఫ్రెంచ్ ఈజీ. క్లాస్‌లో నవలలు చదువుకునేదాన్ని. ప్రశాంత్ చూసి ఈ అమ్మాయి క్లాస్ వినదు అనుకునేవారు. ఆ తర్వాత రెండేళ్లకి నేను హెచ్ఎస్బీసీలో పనిచేస్తున్నప్పుడు అనుకోకుండా కలిశాం. గుర్తుపట్టి మాట్లాడాను. అప్పుడు ఆయన ఫ్రెంచ్ ఇన్స్టిట్యూట్ ప్రారంభించారు. పార్ట్‌టైమ్ వర్క్ చేస్తావా? అని అడిగారు. అలా మా ప్రయాణం మొదలైంది. తర్వాత ఇద్దరం కలిసి 2006లో ఇఫ్లూలో ఎంఏ చేశాం. అప్పుడే ప్రేమలో పడ్డాం. పెళ్లి.. మేరీ: చదువు పూర్తయ్యాక 2011లో పెళ్లి చేసుకున్నాం. చదువు, కెరీర్, పెళ్లి అన్నీ కలిసి ప్లాన్ చేసుకున్నామని చెప్పొచ్చు. పదేళ్లకు పెళ్లి చేసుకున్నారా! అని ఫ్రెండ్స్ పెళ్లిరోజు జోక్ చేశారు. ప్రశాంత్: పెళ్లి హిందూ, క్రిస్టియన్ పద్ధతుల్లో జరిగింది. మొదట్లో మావాళ్లు, వాళ్ల వాళ్లు ఈ బంధం నిలబడదని అనుకున్నారు. కానీ వారి అభిప్రాయం తప్పని నిరూపించాం. భాషాపర ఇబ్బందులు... మేరీ: మా నాన్న హైదరాబాదీ, అమ్మ ఫ్రెంచ్. గల్ఫ్వార్తో అబుదాబి నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడ్డాం. ఇంట్లో ఫ్రెంచ్ మాట్లాడుతాం. తెలుగు అర్థమవుతుంది. కానీ మాట్లాడటం తెలీదు. మొదట్లో కొంత కష్టమైన, తర్వాత ఇద్దరం మిక్స్డ్ లాంగ్వేజ్ మాట్లాడడం ప్రారంభించాం. ఇంగ్లిష్‌లో తెలియని పదాలు ఫ్రెంచ్‌లో మాట్లాడేస్తాను. తను అర్థం చేసుకుంటాడు. అలాగే తను ఇంగ్లిష్, ఫ్రెంచ్, తెలుగు కలిపి మాట్లాడేస్తాడు. ఇది ఇద్దరికీ అర్థమైపోతుంది. మతపరంగా... ప్రశాంత్: నేను చాలాకాలం ఫ్రెంచ్ పద్ధతులకు దగ్గరగా ఉన్నాను. కాబట్టి నాకు పెద్దగా తేడా అనిపించదు. ఇక తనకు భారత సంస్కృతీ సంప్రదాయాలంటే చాలా ఇష్టం. ఆమె పాటించే పద్ధతులన్నీ నాకు అంగీకారమే. వ్యక్తిగతంగా ఎవరైనా ఏ పద్ధతి అయినా పాటించే హక్కు ఉందని ఇద్దరం నమ్ముతాం.. పాటిస్తాం. మేరీ: మతం మాకెప్పుడూ అడ్డంకి కాలేదు. ఇండియాలో ముఖ్యంగా హైదరాబాద్‌లో ఉంటే భిన్న సంస్కృతీ సంప్రదాయాల గురించి తెలుస్తుంది. ఇక్కడ పరమత సహనం అలవడుతుంది. ఫ్రాన్స్‌లో మా కజిన్స్ అలా కాదు.. చిన్న తేడాలూ వాళ్లకి పెద్ద విషయమే. ఫుడ్... మేరీ: ఇండియన్, ఫ్రెంచ్ వంటలు చేయగలను. ఉడకబెట్టినవి ఆయనకు ఇష్టం. ఫ్రై చేసినవి నాకు ఇష్టం. అందుకే ఇద్దరికీ నచ్చేలా వంటలో మధ్యేమార్గం ఎంచుకున్నాను. ప్రశాంత్: ఆహారం దంపతుల మధ్య సామరస్య వాతావరణాన్ని ఏర్పరుస్తుంది. వండేప్పుడు ప్రేమనంతా గుప్పించి వండుతారు.. వడ్డిస్తారు. మేరీ ఇండియన్ ఫుడ్ బాగా చేస్తుంది. టిఫిన్స్ నుంచి అన్నీ చేసేస్తుంది. నాకే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఆమె ఫ్రాన్స్ అమ్మాయి అయినా తాగటం తెలీదు. ఆరోగ్య విధానాలు పాటిస్తుంది. ఇంట్లో ఆర్గానిక్ గార్డెన్ తయారు చేసుకుంది. గొడవలు.. మేరీ:మొదట్లో గొడవ అయితే ఇక మళ్లీ జీవితంలో కలవం, ఇంతటితో అయిపోయిందని అనిపించేది. ఇప్పుడు గొడవ అయితే సాయంత్రానికి సర్దుకుంటుందిలే అనిపిస్తుంది. ప్రశాంత్: ఒకరికి కోపం వస్తే.. ఇంకొకరు కామ్ అయిపోతుంటాం. బంధం బలపడుతున్నకొద్ది అర్థం చేసుకుంటాం. గొడవలు తగ్గిపోతాయి. పెళ్లికి ముందు తర్వాత.. ప్రశాంత్:పెళ్లికి ముందు కంటే ఇప్పుడు ఎక్కువ బాధ్యతగా, క్రమశిక్షణతో ఉంటున్నాను. దానికి కారణం తనే.. అలాగే తనలో చాలా ఓర్పు పెరిగింది. మేరీ: పుట్టింట్లో చేయని కొన్నైనా.. పెళ్లయ్యాక ప్రతి అమ్మాయి మెట్టినింట్లో చేయాల్సి ఉంటుంది. దానికి ఎవరూ అతీతులు కాదు. పాప రాకతో.. ప్రశాంత్: పాప పుట్టాక మావాళ్లు, వాళ్ల వాళ్లు అందరూ హ్యాపీ. పాప పేరు వేద ఆర్యన్. ఆర్యన్ పదం సంస్కృతం, ఫ్రెంచ్‌లోనూ ఉంది. వాళ్లు పిలుచుకోవడానికి వీలుగా ఈ పేరు సెలెక్ట్ చేశాం. మేరీ: పాప పుట్టాక ఉద్యోగం మానేశాను. ఇక పాప స్కూల్‌కి వెళ్లే వరకు ఉద్యోగం చేసే ఉద్దేశం లేదు. -
అంచనాలు పెంచేస్తోన్న బోయపాటి
ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రంగస్థలంలో సినిమాలో నటిస్తున్న యంగ్ హీరో రామ్ చరణ్, ఆ సినిమా తరువాత మాస్ యాక్షన్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమా చేయనున్నాడు. ఇప్పటికే ప్రారంభమైన ఈ సినిమా కోసం ప్రస్తుతం నటీనటుల ఎంపిక జరుగుతోంది. చరణ్ సరసన కైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా బాలీవుడ్ స్టార్ హీరో వివేక్ ఒబెరాయ్ ప్రతినాయకుడిగా నటించనున్నాడు. ఇతర కీలక పాత్రలకు స్టార్ ఇమేజ్ ఉన్న తారలను ఎంపిక చేస్తున్నాడు బోయపాటి. కథ ప్రకారం ఈ సినిమాలో చెర్రీకి ఇద్దరు అన్నలు ఉంటారట. వీరిలో ఒక అన్నగా తమిళ హీరో ప్రశాంత్ (జీన్స్ ఫేం), మరో అన్నగా నవీన్ చంద్ర(అందాల రాక్షసి ఫేం)లు కనిపించనున్నారు. రామ్ చరణ్ వదినగా అందాల నటి స్నేహ అలరించనుంది. ఈ సినిమాలో చరణ్ సరికొత్త లుక్ లో కనిపించనున్నాడన్న ప్రచారం జరుగుతోంది. -
నాని తొలి సినిమా ఫస్ట్ లుక్, టైటిల్ ఎనౌన్స్ మెంట్
ఈ రోజు సాయంత్రం నాని తొలి సినిమా ఫస్ట్ లుక్ తో పాటు టైటిల్ ను కూడా ఎనౌన్స్ చేయనున్నారు. వరుస విజయాలతో స్టార్ హీరోగా దూసుకుపోతున్న నాని ఇప్పుడు తొలి సినిమా చేయటం ఏంటి అనుకుంటున్నారా..? హీరోగా మంచి విజయాలు సాధించిన నాని తొలిసారిగా పూర్తి స్థాయి నిర్మాతగా మారి ఓ సినిమా చేయబోతున్నాడు. గతంలో ఢీ ఫర్ దోపిడి సినిమా కోసం నాని నిర్మాతగా మారినా సొంతం నిర్మాణ సంస్థను ఏర్పాటు చేయలేదు. ఇప్పుడు సొంతగా వాల్ పోస్టర్ సినిమా అనే బ్యానర్ ను స్థాపించి ఆ బ్యానర్ లో ప్రశాంత్ ను దర్శకుడిగా పరిచయం చేస్తూ ఓ సినిమాను రూపొందిస్తున్నారు. ప్రశాంత్ చెప్పిన పాయింట్ విపరీతంగా నచ్చటంతో తానే స్వయంగా నిర్మాతగా మారి సినిమా చేయాలని ఫిక్స్ అయ్యారు. ఇప్పటికే 80 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను ఫిబ్రవరిలో రిలీజ్ చేయాలని భావిస్తున్నారట. ఈ రోజు సాయంత్రం ఈ సినిమా ఫస్ట్ లుక్ తో పాటు టైటిల్ లోగోనూ రిలీజ్ చేయనున్నారు. #Announcement Wall Poster Cinema Production no 1 pic.twitter.com/vWMPgEma3U — Nani (@NameisNani) 25 November 2017 -
నాని తొలి సినిమా ఫస్ట్ లుక్, టైటిల్ ఎనౌన్స్ మెంట్
-
సూపర్‌స్టార్ టైటిల్‌తో ప్రశాంత్
తమిళసినిమా: సూపర్‌స్టార్ రజనీకాంత్ చిత్రం టైటిల్‌తో చాలా ఫ్రెష్‌గా తెరపైకి రావడానికి రెడీ అవుతున్నారు స్టైలిష్ స్టార్ ప్రశాంత్. గతంలో రజనీకాంత్ నటించిన చిత్రం జానీ విజయాన్ని సాధించింది. అదే టైటిల్‌తో ప్రశాంత్ నటిస్తున్న చిత్రం త్వరలో విడుదలకు ముస్తాబవుతోంది. స్టార్ మూవీస్ పతాకంపై సీనియర్ నటుడు, దర్శక నిర్మాత త్యాగరాజన్ నిర్మిస్తున్న భారీ చిత్రం ఇది. నటి సంచితాశెట్టి కథానాయకిగా నటిస్తున్న ఇందులో ప్రముఖ నటుడు ప్రభు కీలక పాత్రను పోషిస్తున్నారు. ఇంకా ఆనంద్‌రాజ్, అషుతోష్రాణా, శాయాజీ షిండే, దేవదర్శిని, కళైరాణి ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా నవ దర్శకుడు వెట్ట్రిసెల్వన్ పరిచయం అవుతున్నారు. షూటింగ్ పార్టు పూర్తి చేసుకున్న జానీ చిత్ర వివరాలను తెలియజేయడానికి సోమవారం చిత్ర యూనిట్ స్థానిక సేట్పేట్లోని మలయాళీ క్లబ్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. హీరో ప్రశాంత్ మాట్లాడుతూ జానీ చిత్ర కథ, కథనాలు వైవిధ్యంగా ఉంటాయని తెలిపారు. రజనీకాంత్ చిత్రంతో కంపేర్ చేస్తారు: నిర్మాత త్యాగరాజన్ మాట్లాడుతూ జానీ చిత్రం హర్రర్‌తో కూడిన భారీ సస్పెన్స్, థ్రిల్లర్ కథా చిత్రంగా ఉంటుందని చెప్పారు. ప్రభు పాత్ర జానీ చిత్రంలో శక్తివంతంగా ఉంటుందని తెలిపారు. ఈ చిత్రాన్ని రజనీకాంత్ జానీ చిత్రంతో పోల్చుకుంటారని, అంత స్థాయిలో విజయం సాధిస్తుందనే నమ్మకం వ్యక్తం చేశారు. చిత్రంలో యాక్షన్ సన్నివేశాలు అదరహో అనే స్థాయిలో ఉంటాయన్నారు. చిత్ర షూటింగ్‌ను చెన్నై, హైదరాబాద్, బెంగళూర్ ప్రాంతాలలో నిర్వహించినట్లు తెలిపారు. డిసెంబరులో చిత్రం విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడించారు. -
ఈతరం సీతారాములు
మహిధర్, ఇషిత, ప్రశాంత్, లలిత ముఖ్యపాత్రల్లో రూపొందిన చిత్రం ‘ఇప్పట్లో రాముడిలా సీతలా ఎవరుంటారండి బాబు’. వెంకటేష్ కె. దర్శకత్వంలో ప్రశ్నాద్ తాతా నిర్మించిన ఈ సినిమా ఈ నెల 27న విడుదలవుతోంది. నిర్మాత ప్రశ్నాద్ తాతా మాట్లాడుతూ– ‘‘ఇప్పట్లో రాముడిలా సీతలా ఉండాలని అందరూ ఎలా అనుకుంటారన్నది మా సినిమాలో చూపిస్తున్నాం. కథ, కథనాలు ఆసక్తిగా ఉంటాయి’’ అన్నారు. ‘‘పూర్తి స్థాయి యూత్‌ఫుల్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన చిత్రమిది’’ అన్నారు వెంకటేష్ కె. ‘‘ఈ చిత్రంలో మెయిన్ రోల్ చేశా. టైటిల్ ఎంత వైవిధ్యంగా ఉందో సినిమా కూడా అంతే వైవిధ్యంగా ఉంటుంది. ఈ సినిమా నాకు మంచి బ్రేక్ అవుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు మహిధర్. -
మరోసారి నిర్మాతగా..?
వరుస విజయాలతో దూసుకుపోతున్న యంగ్ హీరో నాని తనలోని మరో టాలెంట్ చూపించేందుకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే నేచురల్ స్టార్ గా తిరుగులేని స్టార్ డమ్ అందుకున్న ఈ యంగ్ హీరో నిర్మాణ బాధ్యతలు తీసుకోబోతున్నాడు. ఢీ ఫర్ దోపిడి సినిమాతో తొలిసారిగా నిర్మాతగా మారిన ఈ యంగ్ హీరో ఆశించిన విజయాన్ని సాధించలేకపోయాడు. దీంతో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అవుతున్నాడు. డైలాగ్ ఇన్ ద డార్క్ పేరుతో షార్ట్ ఫిలిం తీసిన ప్రశాంత్ ను దర్శకుడిగా పరిచయం చేస్తూ ఓ సినిమాను నిర్మించేందుకు రెడీ అవుతున్నాడు. దేశంలోనే తొలి సారిగా వర్చువల్ ఆడియో టెక్నాలజీతో షార్ట్ ఫిలిం నిర్మించిన ప్రశాంత్, నానికి ఇంట్రస్టింగ్ లైన్ చెప్పి మెప్పించాడట. మరి నాని నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాని నటిస్తాడో లేదో..? తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. -
ప్రేమన్నాడు.. కట్నంతోనే పెళ్లన్నాడు!
హైదరాబాద్: ప్రేమ పేరిట మోసగించిన ఓ విద్యార్ధిని మల్కాజిగిరి పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్ఐ మోహన్ కథనం ప్రకారం... ఏ.ఎస్.రావు నగర్ సాయినాథపురానికి చెందిన వసపోతుల ప్రశాంత్(23) ఈసీఐఎల్‌లోని వసుంధర డిగ్రీ కాలేజీలో చదువుతున్నాడు. మల్కాజిగిరి అనంత సరస్వతీనగర్‌లో నివాసముంటున్న బంధువుల అమ్మాయి(20)ని మూడేళ్లుగా ప్రేమిస్తున్నాడు. మొన్నటిదాకా పెళ్లి చేసుకుంటానని ఆమెను నమ్మబలికిన ప్రశాంత్ ఇప్పుడు మాట మార్చాడు. తనకు కట్నం ఇస్తేనే మూడు ముళ్లు వేస్తానని లేకపోతే పెళ్లి అనే మాట తన వద్దకు తీసుకురావద్దని యువతిని హెచ్చరించాడు. తాను మోసపోయినట్లు గ్రహించిన బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు ప్రశాంత్‌ను మంగళవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. -
ప్రమాదవశాత్తూ డ్యాన్స్ మాస్టర్ మృతి!
-
ప్రమాదవశాత్తూ డ్యాన్స్ మాస్టర్ మృతి!
హైదరాబాద్: తమ సాన్నిహిత్యం ప్రియురాలి బంధువులకు తెలిసిపోతుందనే భయంతో బిల్డింగ్ ఆరో అంతస్తు నుంచి పైపులు పట్టుకొని దిగుతుండగా ప్రమాదవశాత్తు జారి కిందపడి వర్ధమాన సినీ నటుడు దుర్మరణం చెందా డు. ఈ సంఘటన కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది. మూసాపేట ఆంజనేయనగర్‌లో నివాసం ఉంటున్న బాలప్రశాంత్ (20) ‘ఇప్పట్లో రాముడిలా... సీతలా ఎవరుంటారండి బాబు’ సినిమా హీరోగా నటిస్తున్నాడు. అయితే తన ఇంటికి సమీపంలోనే నివాసముంటున్న తన ప్రియురాలి భర్త లేకపోవడంతో శుక్రవారం ఆమె ఇంట్లోకి వెళ్లాడు. ఒక్కసారిగా బంధువులు రావడంతో భయాందోళనకు గురైన ప్రియురాలు అతన్ని ఇంట్లోనే దాచిపెట్టింది. తన ఇంట్లో ఎవరూ లేరని, నిద్రపోతానని చెప్పి బంధువులను వెళ్లగొట్టేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో అనుమానం వచ్చిన బంధువులు తనిఖీ చేస్తుండగా.. ప్రియురాలు చేతులు కోసుకొని గలాటా సృష్టించింది. దీంతో బంధువులు ఆమెను వెంటనే ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో ఆ ఇంటికి తాళం వేశారు. ఇంట్లోనే ఉన్న బాలప్రశాంత్ ఇంటి వెనకాల ఉన్న పైప్‌ల ద్వారా కిందికి దిగుతుండగా ప్రమాదవశాత్తు జారి కిందపడి మృతి చెందాడు. కూకట్పల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మృతదేహాన్ని ప్రశాంత్ స్వస్థలం గుంతకల్లుకు తరలించారు. శనివారం అంత్యక్రియలు జరుగుతాయి. ప్రశాంత్ తల్లిదండ్రులు అనంతపురం జిల్లాకు చెందిన సౌందరరాజు, గ్లోరీలు. కొన్నేళ్ల క్రితం తండ్రి మరణించారు. ప్రశాంత్.. జ్యోతిలక్ష్మి చిత్రంతోపాటు మూడు షార్ట్ ఫిలింలలో నటించాడు. ప్రశాంత్ నటించిన సినిమా త్వరలో రిలీజ్ కానున్న నేపథ్యంలో ఈ దుర్ఘటన జరగడం తమను కలచివేసిందని కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. -
బాలికపై అత్యాచారం
పట్నంబజారు(గుంటూరు) : ఐదేళ్ల బాలికపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడిన సంఘటన నగరంలోని ఏటీఅగ్రహరంలో ఆలస్యంగా వెలుగుచూసింది. విశ్వసనీయ సమాచారం మేరకు ఏటీఅగ్రహరం ప్రధాన రహదారిలో ఒక కుటుంబం టైర్ల షాపు నిర్వహిస్తూ జీవనం సాగిస్తోంది. వీరు ఉండే నివాసంలో మరో పోర్షన్లో ఉండే ప్రశాంత్ అనే వ్యక్తి నిత్యం ఈ కుటుంబంతో సన్నిహితంగా ఉంటూ వారి పిల్లలతో ఆడుకుంటూ ఉంటాడు. ఈ నెల 26తేదీన ఇంట్లో ఎవరూ లేని సమయంలో చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలిసింది. చిన్నారి అప్పటి నుంచి సరిగా ఉండకపోవడంతో తల్లిదండ్రులు ప్రశ్నించగా బాలిక విషయం చెప్పినట్లు తెలుస్తోంది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అడిషనల్ ఎస్పీ స్థాయిలో విచారణ జరుపుతున్నట్టు సమాచారం. బాలిక ఆసుపత్రికి తరలించారు. వైద్యుల నుంచి సమగ్ర నివేదిక రావాల్సి ఉంది. ఇప్పటికే నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. -
మరో కొత్త పార్టీ?
న్యూఢిల్లీ: ఆప్ బహిష్కృత నేతలు ప్రశాంత్ భూషణ్, యోగేంద్ర యాదవ్ కొత్త పార్టీ పెట్టే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి ప్రయత్నాలు శరవేగంగా చేస్తున్నట్టు వార్తలొస్తున్నాయి. తమ మద్దతుదారులతో కలిసి అంబేడ్కర్ జయంతి అయిన ఏప్రిల్ 4న సమావేశమవుతున్నట్టు సమాచారం. ఆప్ మాజీ నేత, లోకపాల్ అడ్మిరల్ రామదాస్ సహా, ఇతర సన్నిహిత వర్గాలు కొన్ని ప్రజా సంఘాలు సమావేశంలో పాల్గొననున్నాయి. అలాగే ప్రశాంత్, యోగేంద్ర యాదవ్ ను పార్టీనుంచి తొలగించినందుకు నిరసనగా పార్టీకి రాజీనామా చేసిన నర్మదా బచావో ఆందోళన్ నేత మేథాపాట్కర్ ను కూడా ఈ సమావేశానికి ఆహ్వానించినట్టు తెలుస్తోంది. అనూహ్య మెజార్టీతో ఢిల్లీ పీఠాన్ని అధిరోహించి చరిత్ర సృష్టించిన ఆమ్ ఆద్మీ పార్టీలో రగిలిన విభేదాలు తారా స్తాయికి చేరాయి. ముఖ్యంగా ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ , పార్టీలో కీలక నేతలుగా ఉన్న యోగేంద్ర, ప్రశాంత్ భూషణ్ మధ్య మాటల యుద్ధం జరిగింది. చివరికి ఇరువురి నేతలను జాతీయ మండలి పదవులనుంచి తొలగించడంతో చీలిక అనివార్యమైంది. -
స్పెషల్ 26లో త్రిష
వివాహ నిశ్చితార్థం జరుపుకుని పెళ్లి ఎప్పుడు అనే వాళ్ల నోళ్లకు తాళం వేసింది త్రిష. నిశ్చితార్థం అయింది కాబట్టి త్వరలో పెళ్లి కూడా చేసేసుకుంటారని అనుకునే వాళ్లను ఈ చెన్నై చిన్నది సందిగ్ధంలో పడేసింది. ఎన్నై అరిందాల్ చిత్రంలో చాలా కొత్తగా కనిపించిన త్రిష ప్రస్తుతం జయం రవి సరసన అప్పాటక్కర్ చిత్రంలో నటిస్తున్నారు. అదే హీరోతో నటించిన భూలోకం చిత్రం విడుదలకు ఎదురు చూస్తున్నారు. వీటితో పాటు తాజాగా, భోగి చిత్రం లోనూ, తెలుగులో బాలకృష్ణ సరసన లయన్ చిత్రంలోను నటిస్తున్నారు. ఈ చిత్రాల ను ముగించుకుని పెళ్లికి సిద్ధం అవుతారని చాలా మంది ఊహించారు. అయితే, త్రిష తాజాగా మరో కొత్త చిత్రాన్ని అంగీకరించి ఎవరికీ అర్థం కాకుండా పోయారు. బాలీవుడ్లో మంచి విజయం సాధించిన స్పెషల్ 26 చిత్రం దక్షిణాది రీమేక్ హక్కులను సీనియర్ దర్శక నిర్మాత, నటుడు త్యాగరాజన్ దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని ఆయన తమిళం, తెలుగు, కన్నడ భాషల్లో ఏక కాలంలో తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తమిళంలో ప్రశాంత్, తెలుగులో రవి తేజ, కన్నడంలో పునిత్ రాజ్‌కుమార్ హీరోలుగా నటించనున్నట్టు సమాచారం. దీనికి ఈ మూడు భాషల్లోను ప్రాచుర్యం కల్గిన త్రిషను హీరోయిన్గా ఎంపిక చేసినట్లు తాజా సమాచారం. ఈ అమ్మడు తమిళం, తెలుగు భాషల్లో పాపులర్ హీరోయిన్. ఈ మధ్యనే కన్నడంలో పవర్ అనే చిత్రంలో నటించారు. ఆ చిత్రం అక్కడ హిట్ కావడంతో స్పెషల్ 26 చిత్రంలో త్రిషకు ఓకే చెప్పినట్లు సమాచారం. మరో విషయం ఏమిటంటే స్పెషల్ 26 హిందీ వర్షన్లో అక్షయ్ కుమార్‌కు హీరోయిన్గా కాజల్ అగర్వాల్ నటించి గ్లామర్‌లో దుమ్ము రేపారు. దక్షిణాదిలో అదే పాత్ర లో నటించనున్న త్రిష కూడా అందాల ఆర బోతలో తగ్గేది లేదంటూ నిర్మాతకు హామీ ఇచ్చినట్టు కోలీవుడ్ టాక్. -
ప్రశాంత్ హీరోగా జీన్స్-2
చాక్లెట్ బాయ్ స్థాయి నుంచి యాంగ్రీ యంగ్ హీరో స్థాయికి ఎదిగిన నటుడు ప్రశాంత్. పలు వైవిధ్యభరిత కథా పాత్రలకు జీవం పోసిన స్మార్ట్ హీరో ఆయన. తన కెరీర్లో జీన్స్ చిత్రం ఒక మైలురాయి. పలు ప్రత్యేకతలతో తెరపై ఆవిష్కృతమైన చిత్రం జీన్స్. దర్శకుడు శంకర్ అద్భుత సృష్టి. అప్పట్లో ప్రపంచ సుందరి కిరీటాన్ని ధరించిన ఐశ్వర్యరాయ్ ఈ చిత్రంలో ప్రశాంత్‌తో జతకట్టి తొలి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ప్రపంచంలోని ఏడు అద్భుత ప్రదేశాలను పాటలో పొందుపరుచుకున్న చిత్రం జీన్స్. ఇలా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందిన జీన్స్ చిత్రానికి తాజాగా సీక్వెల్ తెరకెక్కడానికి సిద్ధం అవుతోంది. ఈ చిత్రంలోను చార్మింగ్ నటుడు ప్రశాంత్ హీరోగా నటించనున్నట్లు సమాచారం. దీనికి దర్శకుడు మాత్రం శంకర్ కాదు. ప్రశాంత్ తండ్రి, సీనియర్ నటుడు, దర్శకుడు త్యాగరాజన్ దర్శకత్వంతోపాటు, నిర్మాణ బాధ్యతల్ని చేపట్టనున్నారని తాజా సమాచారం. ఆ మధ్య ఈయన ప్రశాంత్ ద్విపాత్రాభినయం చేసిన చిత్రం పొన్నర్ శంకర్‌ను భారీ నిర్మాణ విలువలతో బ్రహ్మాండంగా తెరకెక్కించిన విషయం తెలిసిందే. అదే విధంగా గతంలో తాను నటించిన మలైయూర్ మంబట్టియాన్ చిత్రా న్ని ఇటీవల ప్రశాంత్హీరోగా తెరకెక్కించారు. తాజాగా జీన్స్-2ను మరో గొప్ప దృశ్య కావ్యంగా మలచడానికి సన్నాహాలు చేస్తున్నట్లు కోలీవుడ్ సమాచారం. -
లాటరీల పేర ఘరానా మోసం
పిట్లం, న్యూస్‌లైన్: అమాయక ప్రజలను టార్గెట్ చేసుకుంటున్న మోసగాళ్లు వారిని మోసగిస్తూ వేల రూపాయలు దోచుకుంటున్నారు. మీ ఫోన్ నంబర్‌కు లక్షల రూపాయల లాటరీ తగిలింది. మీరు అందులో ఒక శాతం మాపేరున ఉన్న ఖాతాల్లో జమచేస్తే మీ ఖాతాల్లో లక్షల రూపాయలు జమ చేస్తాం అని ఫోన్లు చేస్తుండటంతో వారి మాటలను నమ్మిన అమాయక జనం చివరికి మోసపోతున్నారు. శుక్రవారం జుక్కల్ మండ లం మహ్మదాబాద్ గ్రామ తండాకు చెందిన పాండు జాదవ్ అనే వ్యక్తికి ముంబయి నుంచి ఓ ఫోన్ వచ్చిం ది. తనపేరు సురేంద్రలాల్ అని, పాండుజాదవ్కు ఫోన్ నంబర్‌కు రూ. 25 లక్షల లాటరీ తగిలిందని చెప్పాడు. అయితే అందులో ఒక శాతం అంటే రూ. 25 వేలు తమ ఖాతాలో (నంబర్ 33143374026) జమచేస్తే రూ. 25 లక్షలు పాండుజాదవ్ ఖాతాలో జమ చేస్తాం అని ఫోన్లో చెప్పారు. అది నమ్మిన పాండుజాదవ్ రూ. 25 వేలను తీసుకుని పిట్లం ఎస్బీ ఐ బ్రాంచ్‌కి వెళ్లాడు. అనంతరం అనుమానం వచ్చి విషయాన్ని స్నేహితుడికి చెప్పడంతో ఇందులో ఏదో మోసం ఉందని స్నేహితుడు వారించడంతో డబ్బు ఖాతాలో జమ చేయలేదు. అనంతరం మళ్లీ ముంబ యి నుంచి ఫోన్ చేసి మీ వద్ద ఎంత డబ్బు ఉంటే అంత జమ చేయాలని చెప్పారు. దీంతో జాదవ్ విషయాన్ని ‘న్యూస్‌లైన్’ దృష్టికి తీసుకొచ్చారు. ‘న్యూస్‌లైన్’ పిట్లం ఎస్బీఐ బ్యాంకులో విచారణ చేయగా గతంలో జుక్కల్ మండలం నుంచి కొందరు యువకులకు ఫోన్ రాగా వారు ఒక్కొక్కరు వేల రూపాయలు ఖాతాల్లో జమచేసి మోసపోయారని బ్యాంకు సిబ్బంది తెలిపారు. ఈ విషయపై పిట్లం ఎస్సై ప్రశాం త్ను ‘న్యూస్‌లైన్’ వివరణ కోరగా ఇటువంటి మోసాలను ప్రజలు నమ్మొద్దని, ఫోన్ వచ్చినవెంటనే పోలీ సులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. ఆరునెలల క్రితం జుక్కల్, బిచ్కుంద మండలాలకు చెందిన యువకులు ఇలాగే మోసపోయారని పేర్కొన్నారు. -
యువతరం ప్రేమకథ
వరుణ్, దినేష్, ప్రశాంత్, షిప్రా గౌర్, హేమలత, కల్పన, కావ్య, పృధ్వీ ప్రధాన పాత్రధారులుగా ఓ చిత్రం రూపొందుతోంది. యన్నీ కె. దర్శకత్వంలో సంగీత్, హబీబ్ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రం శుక్రవారం హైదరాబాద్‌లో మొదలైంది. ముహూర్తపు దృశ్యానికి వీఎన్ ఆదిత్య కెమెరా స్విచాన్ చేయగా, సూర్యకిరణ్ క్లాప్ ఇచ్చారు. ప్రేమతో పాటు అన్ని రకాల ఎలిమెంట్సూ ఉన్న కథాంశమిదని దర్శకుడు చెప్పారు. ఆర్ఎఫ్సీలో సెట్ వేస్తున్నామని, ఓ పదిరోజుల్లో షూటింగ్ మొదలుపెడతామని నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: ఆర్.కె.సేన, సంగీతం: జె.వర్ధన్, కళ: డేవిడ్. -
వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురి మృతి
దుబ్బాక/కొండపాక/మెదక్ టౌన్/ పటాన్చెరు టౌన్ : జిల్లాలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఇదే ఘటనలో నలుగురు గాయపడ్డారు. పోలీసుల కథనం మేరకు.. దుబ్బాక నియోజకవర్గం, మిరుదొడ్డి మండలం భూంపల్లికి చెందిన కుర్మ మల్లవ్వ, పెంటయ్య దంపతుల పెద్ద కుమారుడు ప్రశాంత్ (17) దుబ్బాక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుకుంటున్నాడు. రోజు మాదిరిగానే శుక్రవారం ఉదయం ప్రశాంత్ బస్‌లో కళాశాలకు వెళ్లా డు. కళాశాల ముగిశాక దుబ్బాక నుంచి మధ్యలో ఉన్న హబ్షీపూర్ వద్దకు చేరుకున్నాడు. అక్కడి నుంచి భూంపల్లి వెళ్లేందుకు మరో బస్ కోసం వేచి ఉన్నాడు. ఈ క్రమంలోనే తమ గ్రామానికి చెందిన బండారి పరుశురాములు మోటారు సైకిల్‌పై వెళుతుండడంతో అందులో గ్రామానికి బయలుదేరాడు. అయితే లారీ.. ముందు వెళ్లే బస్సును ఓవర్టేక్ (అధిగమిస్తూ) చేసే క్రమంలో ఎదురుగా వస్తున్న మోటార్ సైకిల్‌ను ఢీకొం ది. ఈ సంఘటనలో మోటార్ సైకిల్ వెనక కూర్చొన్న ప్రశాంత్ తలపై లారీ చక్రం ఎక్కడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. బైక్ నడుపుతున్న పరుశురాములు తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో అతడిని 108 వాహనంలో సిద్దిపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసున్న దుబ్బాక ఎస్ఐ లెనిన్‌బాబు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని దుబ్బాక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రమాదానికి కారాణమైన లారీని దుబ్బాక పోలీస్‌స్టేషన్‌కు తరలించి డ్రైవర్ ఎర్రనాయుడును అదుపులో తీసుకున్నామన్నారు. వాహనం వైజాగ్దిగా గుర్తించినట్లు ఎస్ఐ వివరించారు. మా ఆశలన్నీ.. నీమీదే కదా.. ఆశలన్నీ నీమీదే పెట్టుకున్నాం కదా నాయినా.. అంటూ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ప్రశాంత్ మృతదేహంపై తల్లిదండ్రులు మల్లవ్వ, పెంటయ్యలు గుండె లవిసేలా రోదించారు. వీరితో పాటు ప్రశాంత్ సోదరుడు శ్రీకాంత్, సాదరి విజయలు కన్నీరుమన్నీరయ్యారు. మృతదేహాన్ని చూసేందుకు దుబ్బాక ప్రభుత్వ ఆస్పత్రికి భూంపల్లి గ్రామస్థులు, మృతుడి బంధువులు బారులు తీరారు. వాహనం ఢీకొని మరొకరు.. పటాన్చెరు టౌన్: గుర్తు తెలియని వాహనం ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన మండల పరిధిలోని ఇస్నాపూర్ సమీపంలో జాతీయ రహదారిపై గురువారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. ఎస్ఐ రాంప్రసాద్ కథనం మేరకు.. గురువారం అర్ధరాత్రి గుర్తు తెలియని (32) వ్యక్తిని ఇస్నాపూర్ గ్రామ సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో అతను అక్కడిక్కడే మృతి చెందాడు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.