
మహిధర్, ఇషిత, ప్రశాంత్, లలిత ముఖ్యపాత్రల్లో రూపొందిన చిత్రం ‘ఇప్పట్లో రాముడిలా సీతలా ఎవరుంటారండి బాబు’. వెంకటేష్ కె. దర్శకత్వంలో ప్రశ్నాద్ తాతా నిర్మించిన ఈ సినిమా ఈ నెల 27న విడుదలవుతోంది. నిర్మాత ప్రశ్నాద్ తాతా మాట్లాడుతూ– ‘‘ఇప్పట్లో రాముడిలా సీతలా ఉండాలని అందరూ ఎలా అనుకుంటారన్నది మా సినిమాలో చూపిస్తున్నాం. కథ, కథనాలు ఆసక్తిగా ఉంటాయి’’ అన్నారు. ‘‘పూర్తి స్థాయి యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన చిత్రమిది’’ అన్నారు వెంకటేష్ కె. ‘‘ఈ చిత్రంలో మెయిన్ రోల్ చేశా. టైటిల్ ఎంత వైవిధ్యంగా ఉందో సినిమా కూడా అంతే వైవిధ్యంగా ఉంటుంది. ఈ సినిమా నాకు మంచి బ్రేక్ అవుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు మహిధర్.
Comments
Please login to add a commentAdd a comment