తొమ్మిది రోజుల తరువాత.. లలిత అంత్యక్రియలు
డిప్రెషన్‌తో బయటకురాని కూతుళ్లు
సూసైడ్ నోట్‌లో పలువిషయాలు
బౌద్ధనగర్ (హైదరాబాద్): మరణించిన తర్వాత 9 రోజులపాటు ఇంట్లోనే ఉంచిన లలిత మృతదేహానికి శనివారం కూతుళ్లు, బంధువులు అంత్యక్రియలు నిర్వహించారు. ఈ నెల 23వ తేదీన బౌద్ధనగర్‌లోని ఇంట్లో లలిత చనిపోగా కూతుళ్లు ఆమె చనిపోయిన విషయాన్ని తొమ్మిదిరోజులపాటు బయటి ప్రపంచానికి చెప్పకపోవడం తెలిసిందే. అయితే ఆమె మృతదేహాన్ని వారాసిగూడ పోలీసులు గాంధీ మార్చురీకి తరలించి శనివారం పోస్టుమార్టం పూర్తి చేయించారు. అనంతరం లలిత సోదరుడు రమేశ్, కూతుళ్లు రవళిక, యశ్వితలకు ఇన్‌స్పెక్టర్ రాచకొండ సైదులు మృతదేహాన్ని అప్పగించారు. బంధువుల సమక్షంలో మృతదేహానికి అంత్యక్రియలు పూర్తి చేశారు.
తామూ చనిపోవాలనుకుని...
తండ్రి ఎటో వెళ్లిపోవడం, బంధువులు పట్టించుకోకపోవడంతో పాటు తల్లి కూడా మరణించడంతో ఇద్దరు కూతుళ్లు డిప్రెషన్‌లోకి వెళ్లిపోయారు. అంత్యక్రియలు చేయడానికి డబ్బులు లేకపోవడంతో తాము కూడా చనిపోవాలని నిర్ణయించుకున్నారు. సూసైడ్ నోట్ రాసిపెట్టి గొంతు, చేతులు కత్తితో కోసుకున్నారు. అటు తర్వాత ధైర్యం చాలక ఆత్మహత్యాయత్నం విరమించుకున్నారు. తీవ్ర మైన డిప్రెషన్‌లో ఉండటంతో తమకు ఏమీ గుర్తు లేదని పోలీసులకు తెలిపారు. తమపై కొంతమంది బ్లాక్ మ్యాజిక్ చేసి చంపాలని చూస్తున్నారని నోట్‌లో పేర్కొనడంతో వీళ్ల మానసిక స్థితి కూడా సరిగా లేదని పోలీసులు భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment