Gaddar Last Rituals And Funerals Live Updates - Sakshi
Sakshi News home page

ముగిసిన గద్దర్‌ అంత్యక్రియలు

Published Mon, Aug 7 2023 10:23 AM | Last Updated on Mon, Aug 7 2023 8:26 PM

Gaddar Last Rituals And Funerals Live Updates - Sakshi

►గద్దర్‌ అంత్యక్రియలు ముగిశాయి.. రాత్రి 8గంటల ప్రాంతంలో అధికారిక లాంఛనాలతో బౌద్ధ మత ఆచారంలో గద్దర్‌ అంత్యక్రియలు నిర్వహించారు. 

► గద్దర్ అంత్యక్రియల్లో తోపులాట జరిగింది. ఈ తోపులాటలో గద్దర్‌కు అ‍త్యంత ఆప్తుడిగా పేరున్న జహీరుద్దీన్‌ అలీఖాన్‌ మృతి చెందారు.

► బౌద్ధ ఆచారాల ప్రకారం గద్దర్ అంత్యక్రియలు..

► గద్దర్‌ అంత్యక్రియలకు భారీగా తరలివచ్చిన జనం.. అభిమానులను అదుపుచేయలేక పోతున్న పోలీసులు..

► గద్దర్ ఇంటికి చేరుకున్న సీఎం కేసీఆర్.. ఘనంగా నివాళులు అర్పించారు. గద్దర్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. 

► అల్వాల్‌కి చేరుకున్న అంతిమ యాత్ర

►  పార్టీలకు అతీతంగా అంతిమ యాత్రలో పాల్గొన్న నేతలు

► సికింద్రాబాద్ జేబీఎస్ బస్టాండ్‌కు గద్దర్‌ అంతిమయాత్ర చేరుకుంది. అశేష జనవాహిని మధ్య అంతిమయాత్ర కొనసాగుతోంది.

►మధ్యాహ్నం 2.30 నిమిషాల తరువాత సీఎం కేసీఆర్‌ గద్దర్ ఇంటికి చేరుకోనున్నారు. 

►కాసేపట్లో మహా భోది విద్యాలయ లో గద్దర్ అంతిమ సంస్కారాలు జరగనున్నాయి. పోలీసులు పాఠశాల ప్రాంగణానికి చేరుకున్నారు. రిహార్సల్ నేపథ్యంలో సెట్ రైట్ అయిన పోలీసులు. ప్రభుత్వ లాంచనాలతో మధ్యాహ్నం గద్దర్ అంతిమ సంస్కారాలు జరగనున్నాయి.

►అమరవీరుల స్థూపం వద్దకు చేరుకున్న గద్ధర్ అంతిమ యాత్ర

► గద్దర్‌ అంతిమ యాత్రలో కళాకారులు, అభిమానులు భారీగా పాల్గొన్నారు. అంతిమ యాత్ర సందర్భంగా పోలీసులు అల్వాల్‌ భూదేవినగర్‌ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్‌ మళ్లిస్తున్నారు.

► గద్దర్ అంతిమ యాత్ర వాహానానికి జై బీం జెండాలతో పాటు బుద్దిడి పంచశీల జెండాలను జీహెచ్ఎంసీ అధికారులు ఏర్పాటు చేశారు.

►ఎల్బీ స్టేడియం నుంచి గద్దర్‌ అంతిమయాత్ర ప్రారంభమైంది. గన్‌పార్క్‌, అసెంబ్లీ, నెక్లెస్‌రోడ్‌లోని అంబేద్కర్‌ విగ్రహం, అమరవీరుల స్మారక స్థూపం, ట్యాంక్‌బండ్‌,  జేబీఎస్‌, తిరుమల మీదుగా అల్వాల్‌ చేరనుంది. గద్దర్‌ ఇంటివద్ద పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. 

ప్రజా యుద్ధనౌక గద్దర్ మరణంతో తెలంగాణ పాట మూగబోయింది. పార్టీలు, ప్రాంతాలకు అతీతంగా ఆయన మృతి పట్ల అందరూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సందర్శనార్థం ప్రస్తుతం గద్దర్ పార్థివదేహాన్ని ఎల్బీ స్టేడియంలో ఉంచారు.  గద్దర్‌ పార్థివ దేహాన్ని ప్రముఖులు సందర్శించి నివాళులు ఘటించారు.

► అల్వాల్ భూదేవి నగర్‌లోని మహాభోది విద్యాలయంలో గద్దర్ అంత్యక్రియలకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. మహాభోధి విద్యాలయంలోని గ్రౌండ్ వెనకాల సమాధి కోసం చేస్తున్న ఏర్పాట్లను గద్దర్‌ కూతురు వెన్నెల దగ్గరుండి చూసుకుంటున్నారు. ఏర్పాట్లను డీసీపీ సందీప్‌రావు పరిశీలిస్తున్నారు.

►గద్దర్ పార్థివదేహానికి టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి నివాళులు అర్పించారు. ఆయనతోపాటు కాంగ్రెస్ తెలంగాణ ఇంచార్జ్‌ మానిక్ రావు థాక్రే, జానారెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్లు అంజనీ కుమార్ యాదవ్, అజారుద్దీన్‌, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, తమ్మినేని వీరభద్రం, కూనంనేని సాంబశివరావు, బూర న్సయ్య గౌడ్‌, గరికపాటి నర్సింహరావు నివాళులు అర్పించారు, 

►గద్దర్ అంతిమ యాత్ర వాహానాన్ని జీహెచ్ఎంసీ అధికారులు. సిద్ధం చేశారు. వాహానానికి జై బీం జెండాలతో పాటు బుద్దిడి పంచశీల జెండాలను ఏర్పాటు చేశారు.

గద్దర్ పార్దివదేహానికి వీచ్‌ హనుమంతరావు నివాళులు అర్పించారు
►రాహుల్ గాంధీ ప్రధాని అవుతారని ఖమ్మం సభలో దివించారు: వీహెచ్
►గద్దర్ మరణం పట్ల రాహుల్ తన ఆవేదన తెలియజేశారు.
►గద్దర్ చనిపోయినా గద్దర్ కోరుకున్నట్లు గా రాహుల్ గాంధీ ప్రధాని అవుతారు..

గద్దర్ చనిపోవడం బాధాకరం: మాజీమంత్రి జానారెడ్డి
► గద్దర్‌కు ఉన్న స్ఫూర్తి యువత నేర్చుకోవాలి.
►నేను హోం శాఖామంత్రిగా మావోయిస్టులతో శాంతి చర్చలు జరిపిన్నప్పుడు గద్దర్ సూచనలు సేకరించాం.
►తన  సూచనాలతోనే అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులను హైదరాబాద్‌కు రప్పించాం.
►మావోయిస్టులతో ప్రభుత్వం చర్చల్లో గద్దర్ మధ్యవర్తిత్వం వహించారు.
►అమరుల కుటుంబాలకు న్యాయం చేయాలని ఎన్నోసార్లు నన్ను ఆనాడు కలిశాడు

►గద్దర్‌ పార్థివ దేహానికి సుప్రీంకోర్టు మాజీ సీజే ఎన్వీరమణ నివాళులు అర్పించారు. గద్దర్ తన రూమ్ మెట్ అని, రిటైర్మెంట్ తర్వాత తనను రాజకీయాల్లో రావాలని గద్దర్ కోరారని చెప్పారు.

► ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ నివాళులు  అర్పించారు.

►గద్దర్ పార్ధివదేహానికి తెలంగాణ విద్యాశాఖమంత్రి సబితా ఇంద్రారెడ్డి నివాళులు అర్పించారు.

►ఎల్బీ స్టేడియంలో గద్దర్‌ పార్థివ దేహానికి టీపీసీ రేవంత్‌ రెడ్డి, స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే రాజయ్య, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, టీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌, మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌ రావు, మాజీ మండలి చైర్మన్‌ స్వామి గౌడ్‌, ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్‌, ఎమ్మెల్యే దానం నాగేందర్, తదితరులు నివాళులు అర్పించారు. 

►నటుడు మోహన్ బాబు, బండ్ల గణేష్‌, మంచు మనోజ్‌, సింగర్‌ మధు ప్రియ గద్దర్‌కు నివాళులు అర్పించారు. 

►అల్వాల్‌లోని గద్దర్ నివాసం వద్ద ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళులు అర్పిస్తారు.

►తెలంగాణ ఉద్యమంలో గద్దర్ కీలక పాత్ర పోషించారు. 74 ఏళ్ల వయసులో కూడా గోష్టిగొంగడితో సమాజాన్ని మేల్కొలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని  కోరుకుంటున్నా: స్పీకర్‌ పోచారం

►గద్దర్ అంటే మెదక్.. మెదక్ అంటే ఉద్యమాలు: ఎమ్మెల్యే రఘునందన్ రావు

►వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని గద్దర్ కోరుకున్నారు.

►4 దశాబ్దాల ఆశయ సాధక కోసం పోరాటం చేసి.. దానికి దూరం అయ్యారు.

►గద్దర్ కుటుంబానికి సంతాపం తెలియజేస్తున్నా.

గద్దర్‌ మృతి బాధాకరం: కిషన్‌ రెడ్డి
గద్దర్‌ పార్ధివ దేహానికి కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి నివాళులు అర్పించారు. గద్దర్‌ మృతి బాధాకరమని కిషన్‌ రెడ్డి పేర్కొన్నారు. సమస్యలపై తిరుగులేని పోరాటం చేసిన ఉద్యమకారుడని కొనియాడారు. తన గొంతు ద్వారా తెలుగు సమాజానికే కాకుండా యావత్ భారతదేశానికి రోల్‌మాడల్‌గా నిలిచారని ప్రశంసించారు. గద్దర్ అనారోగ్యంతో మృతి చెందడం ప్రతి ఒక్కరికి బాధ కలిగించిన విషయమని అన్నారు.

‘నాకు గద్దర్‌తో వ్యక్తిగతంగా మంచి సంబంధం ఉంది.  నేను లేకున్నా మా ఇంటికి వచ్చి భోజనం చేసే వాళ్ళు. ఆయన ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ ఉండాలి అని కోరుకున్నటువంటి వ్యక్తి. * ఆయన కలగన్న రాజ్యం రాకముందే స్వర్గస్తులయ్యారు. చివరి కోరిక తిరకముందే కాలం చెల్లించారు. గద్దర్‌ మనల్ని విడిచి వెళ్లిపోవడం దూరంగా మరి వెళ్లిపోవడం నిజంగా తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ సమాజాని, కవులు, కళాకారులకు, తెలంగాణ ఉద్యమకారులకు, మేధావులకు ఎంతో బాధాకరం. గద్దర్ ఆకస్మిక మృతికి భారతీయ జనతా పార్టీ తెలంగాణ వారి ఆత్మ శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నాం’ అని తెలిపారు

సాక్షి, హైదరాబాద్‌: గద్దర్‌ అంతిమయాత్ర మధ్యాహ్నం 12 గంటలకు ఎల్బీనగర్‌ స్టేడియం నుంచి ప్రారంభం కానుంది. కళాకారులతో భారీ ర్యాలీగా గద్దర్‌ పార్థివదేహాన్ని తీసుకెళ్లనున్నారు. కళాకారులు, ఉద్యమకారులు, పలు రాజకీయ పార్టీ నేతలు ఈ అంతిమయాత్రలో పాల్గొననున్నారు. స్టేడియం నుంచి బషీర్‌బాగ్‌ చౌరస్తా, జగ్జీవన్‌రామ్‌ విగ్రహం మీదుగా.. గన్‌పార్క్‌ వైపు సాగనుంది.

గన్‌పార్క్‌లోని అమరవీరుల స్థూపం వద్దకు గద్దర్‌ పార్ధివ దేహం చేరుకోగా.. కాసేపు అక్కడ పాటలతో కళాకారులు నివాళులు అర్పించనున్నారు. అనంతరం అమరవీరుల స్థూపం నుంచి సికింద్రాబాద్‌ మీదుగా  భూదేవినగర్‌లోని తన నివాసానికి చేరుకోనుంది. అల్వాల్‌్‌​ మహాబోధి గ్రౌండ్స్‌లో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరగనున్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement