lalitha
-
టీకా వికటించి శిశువు మృతి
తంగళ్లపల్లి (సిరిసిల్ల): టీకా వికటించి శిశువు మృతిచెందిన సంఘటన రాజన్నసిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం నేరెళ్లలో జరిగింది. బాధితులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... నేరెళ్ల గ్రామానికి చెందిన దాసరి లలిత–రమేశ్ దంపతులకు ఇద్దరు సంతానం కొడుకు హన్షిత్ (9), కూతురు(45రోజులు) ఉన్నారు. కూతురుకు నేరెళ్ల పీహెచ్సీలో బుధవారం టీకా వేయించారు. ఇంటికెళ్లాక పాప అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో హుటాహుటిన సిరిసిల్లలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యుడు శిశువు అప్పటికే మృతిచెందిందని తెలపడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా ఏడ్చారు. పాప మృతదేహంతో నేరెళ్ల పీహెచ్సీ వద్ద ధర్నాకు దిగారు. సిరిసిల్ల రూరల్ సీఐ మొగిలి, ఎస్సై రామ్మోహన్ వారికి నచ్చజెప్పినా వినలేదు. కలెక్టర్ రావాలని పట్టుబట్టారు. జిల్లా వైద్యాధికారి రజిత అక్కడికి చేరుకొని బుధవారం ముగ్గురు చిన్నారులకు టీకాలు వేస్తే ఇద్దరు బాగానే ఉన్నారన్నారు. పాప మృతిపై విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. అయినా తల్లిదండ్రులు వినలేదు. వీరికి తోడుగా సిద్దిపేట–సిరిసిల్ల ప్రధాన రహదారిపై రాస్తారోకోకు దిగిన బీజేపీ మండలాధ్యక్షుడు వెన్నమనేని శ్రీధర్‌రావుతోపాటు మరో పదిమందిని పోలీసులు అదుపులోకి తీసుకొని ఠాణాకు తరలించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారే అవకాశం ఉండటంతో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రాధాబాయి పాప కుటుంబ సభ్యులతో మాట్లాడి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం బాధిత కుటుంబానికి ప్రభుత్వం తరపున రూ.లక్ష చెక్కు అందించారు. తంగళ్లపల్లి తహసీల్దార్ గురువారం మరో రూ.లక్ష అందజేయనున్నట్లు ప్రకటించారు. -
Secunderabad: తొమ్మిది రోజుల తరువాత.. లలిత అంత్యక్రియలు
బౌద్ధనగర్ (హైదరాబాద్): మరణించిన తర్వాత 9 రోజులపాటు ఇంట్లోనే ఉంచిన లలిత మృతదేహానికి శనివారం కూతుళ్లు, బంధువులు అంత్యక్రియలు నిర్వహించారు. ఈ నెల 23వ తేదీన బౌద్ధనగర్‌లోని ఇంట్లో లలిత చనిపోగా కూతుళ్లు ఆమె చనిపోయిన విషయాన్ని తొమ్మిదిరోజులపాటు బయటి ప్రపంచానికి చెప్పకపోవడం తెలిసిందే. అయితే ఆమె మృతదేహాన్ని వారాసిగూడ పోలీసులు గాంధీ మార్చురీకి తరలించి శనివారం పోస్టుమార్టం పూర్తి చేయించారు. అనంతరం లలిత సోదరుడు రమేశ్, కూతుళ్లు రవళిక, యశ్వితలకు ఇన్స్పెక్టర్ రాచకొండ సైదులు మృతదేహాన్ని అప్పగించారు. బంధువుల సమక్షంలో మృతదేహానికి అంత్యక్రియలు పూర్తి చేశారు. తామూ చనిపోవాలనుకుని... తండ్రి ఎటో వెళ్లిపోవడం, బంధువులు పట్టించుకోకపోవడంతో పాటు తల్లి కూడా మరణించడంతో ఇద్దరు కూతుళ్లు డిప్రెషన్లోకి వెళ్లిపోయారు. అంత్యక్రియలు చేయడానికి డబ్బులు లేకపోవడంతో తాము కూడా చనిపోవాలని నిర్ణయించుకున్నారు. సూసైడ్ నోట్ రాసిపెట్టి గొంతు, చేతులు కత్తితో కోసుకున్నారు. అటు తర్వాత ధైర్యం చాలక ఆత్మహత్యాయత్నం విరమించుకున్నారు. తీవ్ర మైన డిప్రెషన్లో ఉండటంతో తమకు ఏమీ గుర్తు లేదని పోలీసులకు తెలిపారు. తమపై కొంతమంది బ్లాక్ మ్యాజిక్ చేసి చంపాలని చూస్తున్నారని నోట్లో పేర్కొనడంతో వీళ్ల మానసిక స్థితి కూడా సరిగా లేదని పోలీసులు భావిస్తున్నారు. -
సమయోచిత జ్ఞానమే.. వివేచన!
వివేచన అంటే సమయోచిత జ్ఞానం, యుక్తాయుక్త విచక్షణ, లోచూపు, శోధన, దార్శనికత, విశ్లేషణా సామర్థ్యం. ఇతరులకు తోచని, అవగాహనకు రాని సూక్ష్మాంశాలను గ్రహించగల ఓ శక్తి. ఈ వివేచన కొందరిలో మాత్రమే ఉండే ఓ అపురూపమైన శక్తి.అసలు వివేచన ఎలా ఒనగురుతుంది... అని ప్రశ్నించుకుంటే... ప్రధానంగా చదువు వల్ల పొందే జ్ఞాన, పరిజ్ఞానాల వల్ల అని చె΄్పాలి. ఈ భావాన్నే ΄ోతన‘‘జదివిన సదసద్వివేక చతురత గలుగు జదువగ వలయును జనులకు.. ’’అని హిరణ్యకశిపుని చేత పలికిస్తాడు. చదువు వల్ల జ్ఞానంతోపాటు ఔచిత్యాననౌచిత్యాలు, మంచి చెడు విచక్షణలు తెలుస్తాయి. అవి మన పలుకులో, ప్రవర్తనలో, ఆలోచనాసరళిలో అభిలషణీయమైన చక్కని మార్పు తెస్తాయి. ఈ వివేచన మన వైయుక్తిక జీవిత సుఖ సంతోషాలకు, ఆరోగ్యకరమైన సామాజిక వికాసానికి పునాదులు వేస్తుంది.విద్యనభ్యసించటం వలన వివేచన అనే శక్తిని పొందటం జరుగుతుంది. కాని ఇది ఎల్లప్పుడూ నిజం కావలసిన అవసరం లేదని లోకానుభావం, పరిశీలన చెపుతాయి. కొందరు విద్యావంతులలో కనిపించని ఈ వివేచన కొన్ని సందర్భాలలో అక్షర జ్ఞానంలేని వారెందరి లోనో కనిపించటం ఆశ్చర్యం కలిగిస్తుంది. కానీ, ఇది వాస్తవం. వారి సంభాషణల్లో, సమస్యలను పరిష్కరించే వేళల్లో సమయోచిత జ్ఞానాన్ని చూపుతూ, విచక్షణను ప్రదర్శిస్తూ వివేచనాపరులుగా పేరు తెచ్చుకున్న వారున్నారు."పంచతంత్రంలోని పావురాలు – వేటగాడి కథ వివేచనా పార్శ్వమైన ముందుచూపుని సూచిస్తుంది. ఆకాశమార్గం లో పయనించే పావురాలు భూమిపై ఒకచోట చల్లిన నూకలను చూచి, కిందకు దిగి తిందామనుకున్నప్పుడు వారిని వారించిన చిత్రగ్రీవునిలో ఉన్నది ముందుచూపే. అప్రమత్తతే. ఇవి వివేచనలోని కోణాలే . చిత్రగ్రీవుని మాటను పెడచెవిని పెట్టి ్రపాణాల మీదకు తెచ్చుకున్న మిగిలిన పావురాలలో ఉన్నది తొందరపాటుతనం, విచక్షణారాహిత్యం. జ్ఞానాన్ని సందర్భానుసారంగా ఉపయోగించగలగాలని ఈ ఉదంతం మనకు చెపుతుంది. అలాగే మూడు చేపలకథలోని దీర్ఘదర్శి అన్న చేప తన్రపాణాలను కాపాడుకున్నది ఈ ముందుచూపు వల్లే కదూ!"ఇది ఎలా సాధ్యమవుతుంది? జీవనక్రమంలో వచ్చే ఆటు΄ోట్లను తట్టుకుని, నిబ్బరంగా ఉంటూ, మనసును దిటవు చేసుకోవటంవల్ల వారికి ఇది సాధ్యమవుతుంది. అలాగే చేదు అనుభవాలు, జీవితం నేర్పిన పాఠాలు పొందిన ఇంగితజ్ఞానంతో జీవితాన్ని మరింత లోతుగా పరిశీలిస్తూ, విశ్లేషించుకునే వీరికి ఈ వివేచనాశక్తి కరతలామలకమవుతుంది.కౌరవులు పాండవులను పెట్టే ఇబ్బందులను, చేసే దుశ్చర్యలను గమనిస్తూ ఎప్పటికప్పుడు వారిని అప్రమత్తులను చేసి, రక్షించినవాడు శ్రీ కృష్ణుడు. అలా వివేచనకు గొప్ప ఉదాహరణగా నిలిచాడు. వివేచనాశీలి ఎదుటవారి మాటలను, వాటి అంతరార్థాన్ని గ్రహించగలడు. వారి మనసులో మెదిలే ఆలోచనలను పసిగట్టగలరు. వాటిని విశ్లేషించగలరు. ఇవన్నీ వివేచనకున్న కోణాలే.బెర్ట్రాండ్ రసెల్.. జ్ఞానం –వివేకం.. అన్న వ్యాసంలో ఈ రెండిటి మధ్య ఉన్న సూక్ష్మమైన భేదాన్ని ఒక ఉదాహరణతో ఎంతో స్పష్టంగా వివరించాడు. రివాల్వర్ ఎలా ఉపయోగించాలో తెలియటం జ్ఞానం. దాన్ని ఎప్పుడు వాడాలి, అసలు వాడాలా, వద్దా అన్న సందర్భానౌచిత్య నిర్ణయశక్తే వివేచన. మనలో చాలామందికి విషయం పరిజ్ఞానం ఉంటుంది. కాని ఎక్కడ ప్రదర్శించాలో, ఎక్కడ కూడదోనన్న వివేకం ఉండదు. మన ప్రతిభా నైపుణ్యాలను అసందర్భంగా ప్రదర్శించి, అవమానం పొందకూడదు. ఉచితానుచితాలు తెలుసుకుని ప్రవర్తించటం కూడా వివేచనే. సాంకేతికాభివృద్ధి... ముఖ్యంగా అంతర్జాల సాంకేతికత విశ్వాన్ని కుగ్రామం చేసింది. ఆ సాంకేతికతను అంది పుచ్చుకోవాలి. వాటి ఫలితాలు అనుభవించాలి. ఇందంతా జ్ఞానపరమైనది. అభినందనీయం. కాని సక్రమమార్గంలో ఉపయోగించుకోవటంలోనే మన వివేచన ఉంటుంది. – లలితా వాసంతి -
ఒక్క చెంపదెబ్బతో జీవితమే తలకిందులు.. సోదరి వల్ల భర్తకు విడాకులు!
ఒకప్పుడు వెండితెరను ఏలింది.. మూకీ, టాకీ సినిమాల్లో కథానాయికగా నటించింది. కానీ ఒక్క దెబ్బ.. ఒకే ఒక చెంపదెబ్బ ఆమె జీవితాన్నే తలకిందులు చేసింది. హీరోయిన్ నుంచి సైడ్ క్యారెక్టర్లు చేసే స్థితికి తీసుకొచ్చింది. ఒంటి కన్నుతో విలనిజం పండించే పాత్రలు చేసుకుంటూ పోయింది.. ఆవిడే భారతీయ సినిమా తొలితరం నటి లలితా పవార్. ఆమె గురించే నేటి ప్రత్యేక కథనం.. హీరోయిన్గా, నిర్మాతగా.. మహారాష్ట్రలో 1916 ఏప్రిల్ 18న లలితా పవార్ జన్మించింది. తండ్రి లక్ష్మణ్ రావు వ్యాపారవేత్త. తొమ్మిదేళ్ల వయసులోనే లలిత నటనవైపు అడుగులు వేసింది. 1928లో వచ్చిన రాజా హరిశ్చంద్రలో బాలనటిగా కెరీర్ మొదలుపెట్టింది. 1940లో హిందీ, మరాఠీ, గుజరాతీ భాషల్లో హీరోయిన్గా సినిమాలు చేసింది. ఖైలాష్ (మూకీ చిత్రం), దునియా క్యా హై (టాకీ) చిత్రాలను నిర్మించింది. ఆమెకు వెండితెరపై తిరుగులేదు అనుకునే సమయంలో ఓ చెడు సంఘటన జరిగింది. జీవితం తలకిందులైన రోజు 1942లో 'జంగ్ ఇ ఆజాద్' సినిమాలో నటుడు మాస్టర్ భగవాన్.. ఆమె చెంప చెళ్లుమనిపించాలి. అతడు సీన్ బాగా రావాలని ఎంతో గట్టిగా కొట్టాడు. దీంతో ఆమె చెవి నుంచి రక్తం కారింది. ఆస్పత్రికి తీసుకెళ్లగా ఫేషియల్ పెరాలసిస్ (ముఖానికి పక్షవాతం) వచ్చినట్లు వైద్యులు నిర్ధారించారు. ఎడమ కన్ను కూడా డ్యామేజ్ అయినట్లు తెలిపారు. అలా మూడేళ్లు ఇంటికే పరిమితమైంది. తర్వాత చాలాకాలం వరకు ఒంటికన్నుతోనే సినిమాలు చేసింది. చికిత్స వికటించడం వల్లే.. అయితే వైద్యుల చికిత్స వికటించడం వల్లే తనకు శరీరం కుడివైపు కూడా పక్షవాతం వచ్చిందని అప్పట్లో వార్తలు వెలువడ్డాయి. ఈ ప్రమాదం తర్వాత తనకు మరిన్ని అవకాశాలు వచ్చాయి. కానీ అన్నీ నెగెటివ్ పాత్రలే! అయినా అన్నింటినీ ప్రాణం పెట్టి చేసింది. గయ్యాలి అత్తగా, కుట్రలు కుతంత్రాలు చేసే దుష్టురాలిగా భయపెట్టింది. అనాది, శ్రీ 420, గోర కుంభర్.. ఇలా అనేక చిత్రాలతో దాదాపు ఏడు దశాబ్దాలపాలు సినీప్రియులను అలరిచింది. రామాయణం సీరియల్లో మందరగా నటించింది. 70 ఏళ్లపాటు ఇండస్ట్రీలో రాణించిన నటిగా గిన్నిస్ రికార్డుకెక్కింది. సొంత చెల్లితోనే ఎఫైర్ లలిత.. నిర్మాత గణపత్రావుని పెళ్లాడింది. కానీ అతడు తన సొంత చెల్లితోనే వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో భరించలేకపోయింది, విడాకులిచ్చేసింది. అనంతరం నిర్మాత రాజ్ గుప్తాను పెళ్లాడింది. వీరికి జై పవార్ అనే కుమారుడు సంతానం. అంతా సవ్యంగా ఉందనుకున్న సమయంలో లలితకు నోటి క్యాన్సర్ వచ్చింది. అప్పటివరకు ముంబైలోనే ఉన్న ఆమె చికిత్స కోసం పుణెకు షిఫ్ట్ అయింది. నెగెటివ్ క్యారెక్టర్స్ పోషించడం వల్లే తనకు ఇలా జరిగిందని లోలోపలే మథనపడింది. 1998లో ఆమె కన్నుమూసింది. చదవండి: 'బ్రో'ని పెళ్లి చేసుకున్న నటి.. రెండేళ్లయినా పిల్లలు ఎందుకు లేరంటే? -
అత్తా కోడళ్ల మధ్య ఘర్షణ! కత్తిపీటతో అత్తను దారుణంగా..
ఖమ్మం: చిలికి చిలికి గాలి వానలా మారిన అత్తా కోడళ్ల మధ్య ఘర్షణ చివరకు అత్తమీద కోడలు కత్తిపీటతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచేలా చేసింది. శనివారం సాయంత్రం పట్టణంలో చోటు చేసుకున్న ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని 2వ వార్డు ఇల్లెందులపాడుకు చెందిన అత్త శివారపు లలితమ్మ, కోడలు మౌనికలు శనివారం సాయంత్రం గొడవపడ్డారు. ఈక్రమంలో ఇరువురు ఒకరిపై ఒకరు దాడి చేసుకోగా ఆగ్రహంతో అత్తపై కోడలు కత్తిపీటతో తలమీద నరికింది. దీంతో లలితమ్మ కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చి ఆస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. మెరుగైన వైద్యం కోసం ఖమ్మానికి తరలించగా.. ఈ సంఘటన ఇల్లెందులపాడులో సంచలనంగా మారింది. ఇవి చదవండి: ద్విచక్రవాహనంపై వెళ్తుండగా యువకుడి విషాదం! -
రెండు రోజులుగా ఫోన్ కలవకపోవడంతో.. కూతురు వచ్చి చూడగా..
నిజామాబాద్: ఖలీల్వాడిలోని నాందేవ్వాడలో నివాసం ఉంటున్న బుక్యా లలిత(50) హత్యకు గురైంది. ఎస్సై ప్రవీణ్‌కుమార్ తెలిపిన వివరాలు.. బోధన్ మండలం బెల్లాల్ గ్రామానికి చెందిన బుక్యా లలిత ఏడాది నుంచి నగరంలోని ఓ ప్రజాప్రతినిధి ఇంట్లో పని చేస్తూ.. నాందేవ్వాడలో ఒంటరిగా ఉంటోంది. రెండు రోజులుగా లలిత ఫోన్ కలవకపోవడంతో సోమవారం ఉదయం ఆమె కూతురు వచ్చి చూడగా ఇంటికి తాళం ఉంది. దీంతో ఆమె మూడో టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు ఇంటికి వెళ్లి చూశారు. ఏవైనా ఆధారాలు దొరుకుతాయని తాళం పగులగొట్టి చూడగా లలిత మృతదేహం నగ్నంగా ఉంది. రెండు రోజుల క్రితం చనిపోయి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. శనివారం ఆమె ఎవరితోనో కలిసి ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే మహిళ శరీరంపై ఎలాంటి గాయాలు లేవని అధికారులు గుర్తించారు. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీంతో ఆధారాలు సేకరించారు. ఏసీపీ కిరణ్‌కుమార్, సీఐ నరహరి ఘటన స్థలానికి చేరుకొని వివరాలు తెలుసుకున్నారు. -
జస్టిస్ కన్నెగంటి లలితకు ఘనంగా వీడ్కోలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ నుంచి కర్ణాటక హైకోర్టుకు బదిలీ అయిన జస్టిస్ కన్నెగంటి లలితకు ఫుల్‌కోర్టు ఘనంగా వీడ్కోలు పలికింది. దాదాపు 7 వేల కేసుల్లో ఆమె తీర్పులు వెలువరించారని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే కొనియాడారు. బుధవారం మధ్యాహ్నం 3.30 గంటలకు మొదటి కోర్టు హాల్లో వీడ్కోలు సమావేశం నిర్వహించారు. జస్టిస్ లలిత ఇచ్చిన పలు తీర్పులను అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ చదివి వినిపించారు. మోటార్ వెహికిల్ కేసులలో సత్వర న్యాయంతోనే బాధితులకు న్యాయం జరుగుతుందని, ఏళ్ల తర్వాత వారికి అనుకూలంగా తీర్పు ఇచ్చినా అది ప్రయోజనం చేకూర్చదని జస్టిస్ లలిత ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఇలాంటి కేసులలో న్యాయం త్వరగా అందించేలా కృషి చేయాలన్నారు. తనకు సహకరించిన న్యాయమూర్తులు, న్యాయవాదులు, ఇతర సిబ్బందికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జస్టిస్ లలిత కుటుంబ సభ్యులు, న్యాయమూర్తులు, న్యాయవాదులు, బార్ కౌన్సిల్ చైర్మన్ ఎ.నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో..: అనంతరం హైకోర్టు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జస్టిస్ లలితకు వీడ్కోలు సమావేశం నిర్వహించారు. సీజే జస్టిస్ అలోక్ అరాధే ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ చైర్మన్ పల్లె నాగేశ్వర్రావు, ఏజీ బీఎస్ ప్రసాద్, బార్ కౌన్సిల్ వైస్ చైర్మన్ సునీల్‌గౌడ్, అసోసియేషన్ వైస్ చైర్మన్ కల్యాణ్‌రావు, కార్యదర్శులు పులి దేవేందర్, ప్రదీప్‌రెడ్డి, బైరెడ్డి శ్రీనివాస్, పూర్ణశ్రీ, శారద తదితరులు పాల్గొన్నారు. -
అవసరం నుంచి ఆకాంక్ష వరకు
మహిళల పురోగతికి ఆకాశమే హద్దు. నిజమే... మరి! మహిళ పురోగతి ఎక్కడ మొదలవుతుంది? ఒక ఆకాంక్ష నుంచి మొదలు కావచ్చు... అలాగే... ఒక అవసరం నుంచి కూడా మొదలు కావచ్చు. అవును... అవసరమే ఆమెను జాతీయస్థాయిలో నిలిపింది. ఆమె... మహిళలకు చేయూతనిచ్చే స్థానంలో నిలిచింది. ఆలూరి లలిత మహిళాపారిశ్రామికవేత్త. ఢిల్లీ యూనివర్సిటీ నుంచి ఎమ్మెస్సీ చేశారు. పెళ్లి చేసుకుని హైదరాబాద్‌లో వ్యాపార కుటుంబంలో అడుగుపెట్టారు. ఉమ్మడి కుటుంబం కూడా కావడంతో తన మీద పెద్ద బాధ్యతలేవీ లేవు. నాలుగేళ్లు అలా గడిచిపోయాయి. తమ కంపెనీ ఒడిదొడుకుల్లో ఉందని, భాగస్వాములు దూరం జరిగారని తెలిసిన తర్వాత భర్తకు తోడుగా బాధ్యత పంచుకోవడానికి భుజాన్నివ్వాల్సి వచ్చింది. అలా మొదలైన పారిశ్రామిక ప్రస్థానం ఆమెను విజేతగా నిలపడంతోపాటు జాతీయ స్థాయిలో సంఘటితమైన మహిళా పారిశ్రామికవేత్తల సమాఖ్య (కోవె)కు అధ్యక్షురాలిని చేసింది. ఆ వివరాలను సాక్షితో పంచుకున్నారు లలిత. ‘అవసరం’తో పోరాటం ‘‘గృహిణిగా ఉన్న నేను పరిశ్రమ నిర్వహణలోకి అడుగుపెట్టింది 1998లో. అప్పటికే మనుగడ సమస్య మాది. తీరా అడుగు పెట్టిన తర్వాత తెలిసింది బ్యాంకు వాళ్లు మా పరిశ్రమను ఎన్పీఏ (నాన్ పెర్ఫార్మింగ్ అసెట్) కేటగిరీలో లిస్ట్ చేశారని. మూడు క్వార్టర్లు బకాయి పడి ఉన్నాం. మరో క్వార్టర్ సమయం కావాలని అడిగాను. మొదట్లో ససేమిరా అన్నారు. ‘మీరు హ్యాండోవర్ చేసుకుని మీ డబ్బు ఎలా జమ చేసుకుంటార’ని అడిగాను. మెషినరీ అమ్మేస్తామన్నారు. ఈ మెషీన్లతో పని చేయడానికి మా వారు సింగపూర్‌లో శిక్షణ తీసుకుని వచ్చారు, హైదరాబాద్‌లో ఈ టెక్నాలజీ చాలామందికి తెలియదు. మీరు స్క్రాప్ కింద అమ్మాల్సిందే, రెండు లక్షలు కూడా రావు. మాకు టైమిస్తే మీ లోన్ మొత్తం తీర్చేస్తామని చెప్పాను. ఆ తర్వాత అక్కచెల్లెళ్లు, అన్నదమ్ముల సహాయంతో పది లక్షలు ఎదురు పెట్టి కొత్త టెక్నాలజీతో పరిశ్రమను నడిపించాం. రెండేళ్లపాటు రోజుకు 18 గంటలు పనిచేశాం. మొత్తానికి గట్టెక్కాం. 2005లో పరిశ్రమ విస్తరించాలనే ఆలోచనతో కాన్ఫెడరేషన్ ఆఫ్ ఉమెన్ నెట్వర్క్ – జేఎన్టీయూ తో కలిసి నిర్వహించిన ఎంప్లాయ్మెంట్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్‌లో శిక్షణ తీసుకున్నాను. అప్పటి నుంచి ఈ సంస్థలో భాగస్వామినయ్యాను. లైఫ్ మెంబర్, ఎగ్జిక్యూటివ్ మెంబర్, తెలంగాణ చాప్టర్ ప్రెసిడెంట్, జాతీయ స్థాయి కమిటీలో జాయింట్ సెక్రటరీ, సెక్రటరీ బాధ్యతలు నిర్వహించి ఇప్పుడు ప్రెసిడెంట్ బాధ్యతలు చేపట్టాను. ఈ రాష్ట్రాలు ముందున్నాయి! మహిళా పారిశ్రామిక వేత్తల విషయంలో తెలంగాణ, ఏపీ, కర్ణాటక, రాజస్థాన్, గుజరాత్, యూపీ, ఢిల్లీ రాష్ట్రాలు ముందువరుసలో ఉన్నాయి. వెస్ట్‌బెంగాల్, తమిళనాడు, మహారాష్ట్రతోపాటు కొన్ని రాష్ట్రాలు చేయి పట్టి నడిపించాల్సిన దశలోనే ఉన్నాయి. మా సంస్థలో ఉన్న ఎంటర్‌ప్రెన్యూర్స్‌లో ఎక్కువ మంది బాగా చదువుకున్న వాళ్లే. ఐఐటీ, బిట్స్, ఐఐఎమ్ స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్లు ఇంజనీరింగ్, మాన్యుఫాక్చరింగ్ కంపెనీలు నిర్వహిస్తున్నారు. మా చదువు, పరిశ్రమ నిర్వహణలో మేము నేర్చుకున్న మెళకువలతో కొత్తగా పరిశ్రమల రంగంలోకి వచ్చిన వాళ్లకు మెంటార్‌గా వ్యవహరిస్తున్నాం. ఈశాన్య రాష్ట్రాల మీద ప్రత్యేక దృష్టి కేంద్రీకరిస్తున్నాం. అలాగే కాలేజ్‌లకెళ్లి విద్యార్థులకు వర్క్‌షాపులు నిర్వహించడం, నగరాల్లోని అల్పాదాయ వర్గాలు నివసించే కాలనీల్లోనూ, గ్రామాల్లోనూ మహిళలకు శిక్షణతోపాటు ఇన్క్యుబేషన్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నాం. మహిళలు మారారు! మహిళల్లో చాలా మార్పు వచ్చింది. ఒకప్పుడు మహిళలు ఉద్యోగం చేసుకుంటే చాలన్నట్లు, భర్త సంపాదనకు తోడు మరికొంత అన్నట్లు ఉండేవారు. ఇప్పుడు ఆ ధోరణి పూర్తిగా మారిపోయింది. తన ఐడెంటిటీని తామే రాసుకోవాలనే ఆకాంక్ష పెరిగింది. అలాగే విజయవంతం అవుతున్నారు. ఉద్యోగం చేసి పిల్లల కారణంగా కెరీర్లో విరామం వచ్చిన మహిళలకు (35 నుంచి 45 ఏళ్ల మధ్య ఉన్న వారికి) వారి సామర్థ్యం, ఆసక్తిని బట్టి ‘రీ ఇగ్నైట్’ ప్రోగ్రామ్ కింద సపోర్ట్ చేస్తున్నాం. పదివేల మంది విద్యార్థులను, 30 వేల మంది గ్రామీణ మహిళలను సాధికారత దిశలో నడిపించాలనేది ప్రస్తుతం మా కోవె ముందున్న లక్ష్యం’’. ఇలా చేయండి ఒక మహిళ వ్యాపారం కానీ పరిశ్రమ కానీ పెట్టినప్పుడు అది నిలదొక్కుకుని లాభాల బాట పట్టే వరకు దాదాపుగా మూడు నాలుగేళ్లు జీవితం మనది కాదు మన పరిశ్రమది అనుకుని శ్రమించాలి. మార్కెట్‌ని విశ్లేషించుకోవాలి. రెవెన్యూ మీద అవగాహన ఉండాలి. పెట్టుబడి, రాబడి మాత్రమే కాదు. రాబడికి ఆదాయానికి మధ్య తేడా తెలుసుకోవాలి. ► కౌంటర్లోకి వచ్చిన ప్రతిరూపాయి మనది కాదు. ఉద్యోగుల వేతనాలు, అద్దె, కరెంటు, పెట్టుబడి కోసం మనం ఇంటి నుంచి పెట్టిన డబ్బుకు కొంత జమ వేసుకోవడం, బ్యాంకు లేదా ఇతర అప్పులు అన్నీ పోగా మిగిలినదే ఆదాయం. అదే మనం సంపాదించినది, మన కోసం ఖర్చు చేసుకోగలిగినది. ► పరిశ్రమ కోసం ఒక మూలనిధి ఏర్పాటు చేసి ఏటా పదిశాతం లాభాలను మూలనిధిలో జమ చేయాలి. యంత్రాల రిపేరు వంటి అనుకోని ఖర్చులకు, పరిశ్రమ విస్తరణకు ఆ నిధి పనికొస్తుంది. కోవిడ్ దెబ్బకు తట్టుకుని నిలబడినవన్నీ మూలనిధి ఉన్న పరిశ్రమలే. ► మహిళలు గుర్తుంచుకోవాల్సిన మరో విషయం ఏమిటంటే... పరిశ్రమ నిర్వహణ బరువైనప్పుడు అది లాభాల బాట పట్టడం కష్టం అని నిర్ధారించుకున్నప్పుడు దాని నుంచి వెంటనే మరొక దానికి మారిపోవాలి. ► మొదట్లో కష్టపడినన్ని గంటలు పదేళ్లు, పాతికేళ్లు కష్టపడలేరు. కాబట్టి ఇంట్లోనూ, పరిశ్రమలోనూ సపోర్టు సిస్టమ్‌ని అభివృద్ధి చేసుకోవాలి. ఇంటర్వ్యూ: వాకా మంజులారెడ్డి ఫొటోలు : మోర్ల అనిల్ కుమార్ -
సరదా అనుకున్నాం కానీ, అదొక వ్యాధి అనుకోలేదు.. అసలు ఏంటిది?
గత కొన్ని రోజులుగా శ్రీనగర్ కాలనీ నివాసి లలిత (35) ఏదో ఒత్తిడికి గురవుతున్నట్టు కనిపిస్తోంది. ఇంట్లో ఏవో కొన్ని వస్తువులు రహస్యంగా దాస్తోంది. డబ్బులు ధారాళంగా ఖర్చు చేస్తోంది. ఈ విషయాలన్నీ గమనించిన కుటుంబసభ్యులు ఎందుకయినా మంచిదని ఒకరోజున సైకియాట్రిస్ట్ దగ్గరకు తీసుకెళ్లారు. కొన్ని గంటల పాటు పరిశీలించిన వైద్యుడు ఆమె సీబీఎస్డీ అనే వ్యాధికి గురైందని నిర్ధారించారు. అదేమిటీ..తరచూ షాపింగ్ చేస్తుంటే సరదా అనుకున్నాం కానీ అదొక వ్యాధి అనుకోలేదే అని ఆశ్చర్యపోయారు కుటుంబ సభ్యులు. నగరంలో విజృంభిస్తున్న సరికొత్త మానసిక వ్యాధికి లలిత ఓ ఉదాహరణ. సాక్షి, హైదరాబాద్: కంపల్సివ్ బయింగ్ బిహేవియర్ లేదా కంపల్సివ్ బైయింగ్, షాపింగ్ డిజార్డర్ (సీబీఎస్డీ/సీబీడీ)తో బాధపడు తున్నవారి సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. ఒకప్పుడు మహిళల్లో ఎక్కువగా కనిపించే ఈ సమస్య ఇప్పుడు అందరినీ వేధిస్తోందని మనస్తత్వ నిపుణులు చెబుతున్నారు. సీబీఎస్డీ తీవ్రమైన ఒత్తిడితో ముడిపడిన మానసిక ఆరోగ్య పరిస్థితి అని, అనవసరమైన వాటిని కూడా కొనడాన్ని నియంత్రించుకోలేని సమస్య గా మనస్తత్వవేత్తలు పేర్కొంటున్నారు. ఇటీవలే ప్రపంచ ఆరోగ్యసంస్థ ఇంపల్స్ కంట్రోల్ డిజార్డర్స్ (కొన్నిప్రత్యేక అలవాట్ల నియంత్రణ లోపాలు)లో ఒకటిగా దీనిని చేర్చింది. ఈ సమస్య ఉన్నవారికి తరచుగా షాపింగ్ చేయాలనే కోరిక కలుగుతుంటుంది. అధిక వ్యయం వల్ల ఉత్పన్నమయ్యే ఆర్థికసమస్యలు, అను బంధాల విచ్ఛిన్నం వంటి ప్రతికూల ఫలితాలున్నప్పటికీ పట్టించుకోకుండా అదేపనిలో నిమగ్నమైపోతారు. ఈ రుగ్మత ఉన్నవారు తమ బడ్జెట్‌పై స్పష్టమైన వైఖరి లేకుండా వారి సాధారణ కార్యకలాపాలను సైతం నిర్లక్ష్యం చేస్తూ కొనడంలోనే నిమగ్నమవుతుంటారు. కరోనా సహా...కారణాలనేకం.. మానసిక, పర్యావరణ, జీవ సంబంధమైన కార ణాలుసహా అనేక అంశాలు కంపల్సివ్ షాపింగ్ ను ప్రేరేపిస్తున్నాయి. పెరిగిన ఇంటర్నెట్, సోషల్ మీడియా, క్రెడిట్ కార్డ్‌లు, ఆన్లైన్ షాపింగ్, ప్రకటనలు, ప్రమోషన్ కార్యక్రమాలు కూడా సీబీఎస్డీకి దోహదపడుతున్నట్లు మనస్తత్వవేత్తలు పేర్కొంటున్నారు. మరోవైపు ఆర్థిక అవగాహన లోపించడం, రుణాలు సులభంగా అందుబాటులోకి రావడం కూడా కారణమవుతున్నాయి. మరీ ముఖ్యంగా కరోనా సమయంలో ప్రతి చిన్న వస్తువును ఆన్లైన్ ద్వారా కొనడం అత్యధికశాతం మందిని ఈ వ్యాధికి చేరువ చేసిందంటున్నారు. కంపల్సివ్ షాపింగ్ కోసం చికిత్స కోరిన వ్యక్తుల్లో దాదాపు 34% మంది ఆన్లైన్ షాపింగ్‌కు అలవాటు పడినవారని జర్మనీలోని హన్నోవర్ మెడి కల్ స్కూల్ పరిశోధకులు తేల్చడం గమనార్హం. భావోద్వేగ పరిస్థితులతో వ్యాధి తీవ్రం.. కంపల్సివ్ షాపింగ్ లింగ భేదాలకు అతీతంగా ఉందని నిపుణులు అంటున్నారు. అయితే సాధారణంగా పురుషులతో పోలిస్తే మహిళలకు కాస్త షాపింగ్ ప్రియత్వం ఎక్కువ. అందువల్ల మహిళలే ఎక్కువగా ఈ వ్యాధి బారినపడే అవకాశం ఉందని పరిశోధనలు సూచిస్తున్నాయి. ఒత్తిడి, ఆందోళన, నిరాశ, ఆత్మవిశ్వాస లోపం వంటి ప్రతికూల భావోద్వేగ పరిస్థితులతో వ్యాధి తీవ్రతరం కావొచ్చు. బైపోలార్ ఎఫెక్టివ్ డిజార్డర్ (కొన్ని సమయాల్లో కుంగుబాటు, కొన్ని సమయాల్లో విపరీత ప్రవర్తన), అబ్సెసివ్–కంపల్సివ్ డిజార్డర్ (అతిగా ప్రవర్తించడం) (ఓసీడీ) తదితర ఇంపల్స్ కంట్రోల్ డిజార్డర్స్‌తో బాధపడుతున్న వ్యక్తులలో కంపల్సివ్ షాపింగ్‌ను వైద్యులు గుర్తిస్తున్నారు. దీనికి మందులు, జీవనశైలి మార్పుల కలయికతో కూడిన సమగ్ర చికిత్స విధానం అవసరమని వైద్యులు అంటున్నారు. వ్యక్తులు ఖర్చు చేసే అలవాటుపై తిరిగి నియంత్రణ సాధించేందుకు ఈ చికిత్స సహాయపడుతుందని చెబుతున్నారు. కంపల్సివ్ షాపింగ్‌తో పోరాడుతున్న వ్యక్తులు శిక్షణ పొందిన మానసిక ఆరోగ్య నిపుణుల నుంచి సహాయం పొందాల్సిందేనని స్పష్టం చేస్తున్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లోనూ.. సమగ్ర మనోరోగ చికిత్స జర్నల్‌లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం, అభివృద్ధి చెందిన దేశాలలో 5% మంది పెద్దలను కూడా సీబీఎస్డీ ప్రభావితం చేస్తోంది. ప్రతి 20 మందిలో ఒకరు దీని బారిన పడుతున్నారని ఇంటర్నేషనల్ బిజినెస్ టైమ్స్ నివేదించింది. వీరిలో ప్రతిముగ్గురి లో ఒకరు ఆన్లైన్ కొనుగోలు వ్యసనంతో బాధ పడుతున్నారు. ‘షాపింగ్‌పై కోరికతో వారు కొనుగోలు చేయగలిగిన దానికంటే ఎక్కువ కొనుగోలు చేస్తారు. మహిళలే కాదు..అందరిలోనూ కని్పస్తోంది గతంలో పార్కిన్సన్స్ లాంటి మెదడు మీద ప్రభావం చూపే వ్యాధుల్లో ఒక లక్షణంగా ఈ సీబీడీని గుర్తించేవాళ్లం. దీన్ని బైపోలార్ డిజార్డర్ అనేవాళ్లం. అయితే ఇటీవలి కాలంలో ఇతరత్రా వ్యాధులు లేకుండానే..సీబీడీకి గురవుతున్నారు. విచిత్రమేమిటంటే అవసరానికో, ఆర్థికంగా బాగుండో కొనేవారిలా కాకుండా ఈ వ్యాధికి గురైన వారు కొన్నవాటితో సంతోషం కూడా పొందరు. కొన్నప్పటికీ అసంతృప్తితో ఉంటారు. అవమానంగా ఫీలవుతారు. దాంతో మళ్లీ కొంటారు. అలా అలా.. మత్తు పదార్థాలకు అలవాటైన వారిలా.. కొంటున్న విషయాన్ని, కొన్న వస్తువుల్ని రహస్యంగా ఉంచుతారు. వీరికి చికిత్సలో భాగంగా కౌన్సెలింగ్ తో పాటు మందులను కూడా వాడాల్సి ఉంటుంది. గతంలో మహిళల్లో ఎక్కువగా చూసేవాళ్లం. ఇప్పుడు అందరిలోనూ కనిపిస్తోంది. –డాక్టర్ చరణ్ తేజ, న్యూరో సైకియాట్రిస్ట్, కిమ్స్ ఆసుపత్రి -
మంచి మాట: దృష్టి.. ఒక జీవిత పథం
‘ఇతరులకు గోచరం కానిది చూడగలగటమే దృష్టి అంటే...’’ అన్నాడు ప్రముఖ ఆంగ్ల నవలా రచయిత జోనాథన్ స్విఫ్ట్. ఎవరూ చూడలేని వైపు ఆలోచనా దృష్టిని ప్రసరింప చేయగలగటమే దృష్టి. చాలా మందికి తట్టని ఆలోచన ఒకరికి తట్టడం, ఒక నిశితమైన చూపు. దృష్టి ఒక శోధన, అన్వేషణ, దార్శనికత, సృజన, సంస్కారం, అద్భుత ఊహ. ఒక జీవిత పథం. చర్మ చక్షువులు మనకి బాహ్య దృష్టిని మాత్రమే ఇస్తాయి. దానివల్ల ఈ సమస్త ప్రపంచాన్ని చూడగలం. దీనిని కేవలం చూపు అంటాం. మనం చూసే ప్రపంచాన్ని, దాని పోకడను, వైఖరిని , వర్తనను చూపిస్తున్న మన నయనానికి ఆలోచనను కలిపి చూడటమే అంతర దృష్టి. దీనినే మనోనేత్ర మంటాం. ఈ దృష్టి కొందరికి సహజం. కొందరికి చదువు వల్ల వస్తుంది. ఇంకొందరికి జీవితం నేర్పుతుంది. సాధన వల్ల కూడ సాధ్యమే. మస్తిష్క సాగరంలో వచ్చే ఆలోచనా తరంగాలను దాటి చాలా లోతుగా వెళ్ళటం దృష్టే. మనకందరకూ ఆలోచనలు వస్తాయి. కొన్ని క్లిష్టమైన సందర్భాలలో, సమస్యల విషయంలో మనం తీవ్రంగా యోచించి పరిష్కారం లేదా సమాధానం కనుక్కోవలసివస్తుంది. అప్పుడు ఒక పరిధి.. పరిమితి లేకుండా ప్రసరించే మన ఆలోచనా కిరణాలను సమీకరించుకుని ఒక చోట కేంద్రీకృతం చేయాలి. ఇలా అందరూ చేయలేరు. మనలో కొందరికే ఆ శక్తి సామర్థ్యాలుంటాయి. వారు సమస్య మూలాలలోకి తమ దృష్టిని ప్రవహింప చేయగలరు. అపుడది శక్తిమంతమై మనం వెతుకుతున్న ప్రశ్నకు సమాధానం దొరికేటట్టు చేస్తుంది. మన దృష్టిని సమస్య అన్ని కోణాలవైపు చొప్పించాలి. అన్ని దిశలలో వెళ్ళాలి. లోతుల్ని తాకాలి. మన చుట్టూ ఎంతో ప్రపంచముంది. దానిలో అగణితమైన మనుష్యులున్నారు. ఎన్నో సుందర దృశ్యాలున్నాయి. హృదయ విదారకమైన దృశ్యాలు వున్నాయి. వాటిని మన కళ్ళు పరిశీలిస్తాయి. మన దృష్టిని బట్టి ఒక బలమైన ముద్ర పడుతుంది. ఓ అనుభూతి.. కొన్ని భావనలు ఏర్పడతాయి. అవి ఏ రకంగా ఉంటాయి, ఏ స్థాయి లో ఉంటాయన్నది మన దృష్టి వల్ల ఏర్పడిన సంస్కారాన్ని బట్టి ఉంటుంది. ఒక మల్లెమొగ్గ రేకులు విప్పుకుని, వికసించి తన పరిమళాన్ని నలుదిశలా వెదజల్లుతుంది. కొన్ని గంటల తరువాత వాడి.. రేకులు ఒక్కొక్కటిగా భూమి మీదకు విడుస్తూ పూర్తిగా నశించిపోతుంది. ఇది చాలా సహజం..అతి సాధారణం. ఇలా అనుకునే వారు మనలో చాలా మంది వుంటారు. ఇది ఒక దృష్టి. ఈ సహజ పరిణామాన్ని కొందరు జీవితానికి అన్వయించి లోతుగా ఆలోచిస్తారు. మనిషి జీవితం కూడ ఆ మల్లె పువ్వు లాగా అశాశ్వతమైనది. మనిషి ప్రాణం విడవక తప్పదని గ్రహించి మూన్నాళ్ళ ముచ్చటే ఈ జీవితమన్న ఎరుకతో దాన్ని మల్లెపువ్వులా పరిమళ భరితం చేసుకోవాలని చూసే దృష్టి మరికొందరిది. జీవితాని కొక విలువ.. సార్థకత తెచ్చుకోవాలని వారి వైఖరి. మంచితనంతోనే అది సాధ్యం. ఆ దృష్టే వారి పేరును.. వారు చేసిన పనులను ప్రజల మనస్సుల్లో తరతరాలు నిలిచిపోయేటట్లు చేస్తుంది. అపుడా మనస్సులు సుగంధ పారిజాతాలవుతాయి. ఇది నిశిత దృష్టి. శాశ్వతత్వానికి.. ఆశాశ్వతత్వానికి ఉన్న భేదాన్ని గుర్తెరిగే అద్భుత దృష్టి. చేపట్టే పనులు.. వ్యాపారాలలో కొందరి బుద్ధి కొత్త పుంతలు తొక్కుతుంది. రకరకాల మార్గాలలో అన్వేషణ చేస్తారు ఎలాగైనా విజయం సాధించాలని పట్టుదలతో కష్టిస్తారు. ఇది ఒక రకమైన దృష్టి. ఒక పుస్తకాన్ని చదివే క్రమంలో.. ఆకళింపు చేసుకోవటంలో కూడా దృష్టి వుంటుంది. పైపైన చదివి అర్ధం చేసుకునేవారు కొందరైతే, ఆ కనిపించే వాక్యాల అంతరార్థాన్ని పట్టుకునే యత్నం కొందరు చేస్తారు. ఈ దృష్టికలవారే రచయిత ఆలోచనను పట్టుకుని.. రచనలోని ఆత్మను చేరుకుంటారు. ఎంత లోతుగా వెళ్ళగలరో అంతవరకూ వెళ్ళగలరు. అంతే కాదు . వారి దృష్టి చెదరదు. తోవను వీడదు. చేర వలసిన చోటుకు చేరుకొని సఫలీకృతులవుతారు. తమ కాలానికి .. దూరంగా తమ ఆలోచనా దృష్టిని ప్రసరింప చేయగలిగే ప్రతిభా సంపన్నులు కొందరుంటారు. సమాజంలో అనేక రంగాలలో చోటు చేసుకునే అనేక పరిణామాలు భవిష్యత్తులో ఏ రూపాన్ని తీసుకుంటాయి... వాటి ప్రభావం ఎలా వుంటుంది, సమస్యలకు పరిష్కారం ఏమిటనే యోచనే వీరిది. ఈ దృష్టికే దార్శనికతని పేరు. వీరు నాయకులు కావచ్చు... సామాజిక విశ్లేషకులూ కావచ్చు.. వేదాంతులూ కావచ్చు. తమ చుట్టూ ఉన్న బాధార్తులు... దాహార్తుల గురించి ఆలోచించే వారుంటారు. వారందించే ఆపన్న హస్తం మానవత్వానికి చిహ్నం. కరుణకు సంకేతం. ఇది ఒక రకమైన దృష్టి. విద్యావేత్తలు విద్యావిధానాలను సమాజానికి కనుగుణంగా తయారు చేస్తారు. దాని కెంతో మేధోమధనం కావాలి. ఈ విద్యావిధానాలనే విత్తనాలు భవిష్యత్తులో ఫలానా విధంగా ఫలవంతమవుతాయనే అద్భుత ఊహాశక్తి, ఆలోచన... దృష్టి వల్లే సాధ్యమవుతాయి. ‘కేవలం చూవు మాత్రమే ఉండి.. దృష్టి లేనివాడు ఈ ప్రపంచంలో అతి దయనీయుడైన వ్యక్తి..’ అన్నారు హెలెన్ కెల్లర్. ఎంత అద్భుతమైన మాటలు! చూపు ఉన్నవారందరికి దృష్టి ఉండాలని కానీ.. చూపు లేనివారికి దృష్టి ఉండకూడదన్న నియమం గాని లేదన్న భావనను ఎంత బాగా చెప్పారో! నదిలో కొట్టుకుపోతున్నది ఆడ.. మగా అని కాక ఒక జీవి అన్న భావనలో రక్షించానన్న శిష్యుడి మాటల్లో.. రసవిహీనంగా ఉండి గంటపాటు సాగిన ఒక ఉపన్యాసాన్ని విని.. ఎలా మాట్లాడకూడదో నేర్చుకున్నానన్న వ్యక్తి మాటల్లో వ్యక్తమయ్యేది వారి దృష్టి మాత్రమే. అది ఎంత లోతైనదో.. స్పష్టమైనదో చూడండి. అటువంటి మనోనేత్రం మనకందరకూ కావాలి. దాన్ని అలవరచుకునే ప్రయత్నం చేయాలి. పొందాలి. దాన్ని కార్యరూపంలోకి తీసుకురావాలి. అలా కానట్లయితే అది పుస్తకాలనుండి నేర్చుకున్న జ్ఞానంలా మిగిలిపోతుంది. పుస్తకజ్ఞానాన్ని సందర్భానికి తగిన విధంగా, ఆపద్ధర్మంగా మంచి కోసం వాడుకోవాలి. దీనినే ఇంగిత జ్ఞానమంటారు. అలా వాడటానికి వివేచన అనే దృష్టి కావాలి. జీవితమంటే ఏమిటి.. దాని పథం ఏమిటో స్పష్టమైన దృష్టిని ఏర్పరచుకుని పయనించాలి. మనం నేర్చిన విద్య యొక్క సారాన్ని జీర్ణించుకోవాలి. జీవన క్రమంలో ఎదురయ్యే అనుభవాలను.. సత్యాలను పొదవుకోవాలి. అటువంటి జీవితం ఎటువంటి కుదుపులొచ్చినా అతలాకుతలమవ్వక ఒక ప్రశాంత స్థితిలో సాగుతుంది. మనం ప్రపంచాన్ని.. మనుష్యుల స్వభావాలను.. మనస్తతత్వాలను ఆకళింపు చేసుకున్న తీరు మన దృష్టికి దర్పణం. మన దృష్టి మన వ్యక్తిత్వాన్ని... ఆలోచనా విధానాన్ని... జీవిత దృక్పథాన్ని.. మనం జీవితాన్ని అర్థం చేసుకున్న తీరును తేటతెల్లం చేస్తుంది. దృష్టి ఆవశ్యకత ఏమిటి.. దాన్ని ఏర్పరచు కోవాలా అనే సందేహాలు వచ్చే వారుంటారు. దృష్టి మన జీవితాన్ని పరిపుష్టం చేస్తుంది. ఒక గౌరవం.. ఒక హుందాతనాన్నిస్తుంది. జీవితానికొక సమతౌల్యతనిస్తుంది. దృష్టి వ్యక్తి వికాసానికెంత అవసరమో... దేశవికాసానికి అంతే అవసరం. కేవలం చూవు మాత్రమే ఉండి.. దృష్టి లేనివాడు ఈ ప్రపంచంలో అతి దయనీయుడైన వ్యక్తి.. – లలితా వాసంతి -
విషాదంగా ప్రేమ పెళ్లి.. ఇంటి నుంచి వెళ్లిపోయి..
సాక్షి, హసన్‌పర్తి: ప్రేమ పెళ్లి విఫలమైంది. రెండేళ్ల పాటు ప్రేమించుకుని, పెద్దలను ఎదిరించి వివాహం చేసుకున్నారు. అయితే కుటుంబంలో నెలకొన్న గొడవలు భరించలేక ఆ వివాహిత తనువు చాలించింది. మూడు రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిన ఆమె గురువారం వడ్డెపల్లి చెరువులో శవంగా లభ్యమైంది. అంతకుముందు భార్య ఆచూకీ లభ్యం కాకపోవడంతో భర్త కూడా ఇంటి నుంచి వెళ్లిపోయాడు. వివరాలు.. నగరంలోని 56వ డివిజన్ గోపాలపురానికి చెందిన నిఖిలేశ్వర్, హనుమకొండ కాపువాడకు చెందిన లలిత(23) ఇంటర్మీడియట్ చదువుతున్న క్రమంలో ప్రేమలొ పడ్డారు. కులాలు వేరు కావడంతో కుటుంబసభ్యులు పెళ్లికి అంగీకరించలేదు. దీంతో పెద్దలను ఎదిరించి ఏడాది క్రితం వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం నిఖిలేశ్వర్ ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. భార్యపై అనుమానం.. కాగా, కొంతకాలంగా భార్య లలితపై నిఖిలేశ్వర్ అనుమానం వ్యక్తం చేస్తున్నాడని బాధిత కుటుంబసభ్యుల ఆరోపిస్తున్నారు. కుటుంబంలో నెలకొన్న గొడవలు భరించలేక ఈనెల 20న లలిత ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఆమె ఆచూకీ కోసం వివిధ ప్రాంతాల్లో గాలించారు. భార్య ఆచూకీ లభ్యం కాకపోవడంతో నిఖిలేశ్వర్ మానసిక వేదనకు గురయ్యాడు. దీంతో గురువారం ఉదయం తాను చనిపోతానని లేఖ రాసి వెళ్లిపోయాడు. బైక్, సెల్‌ఫోన్ ఇంట్లోనే ఉన్నాయి. పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు.. కాగా, కొడుకు, కోడలు ఇంటి నుంచి వెళ్లిపోవడంతో ఆందోళనకు గురైన తల్లి యాదలక్ష్మి గురువారం రాత్రి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. చెరువులో తేలిన మృతదేహం.. ఇదిలా ఉండగా, లలిత మృతదేహం గురువారమే వడ్డెపల్లి చెరువులో లభ్యమైంది. అయితే గుర్తు తెలియని మృతదేహంగా ఎంజీఎంలో కాజీపేట పోలీసులు భద్రపరిచారు. శుక్రవారం ఆ మృతదేహం లలితదిగా కుటుంబసభ్యులు గుర్తించారు. అయితే ఇప్పటివరకు నిఖిలేశ్వర్ ఆచూకీ లభ్యం కాలేదు. ►మనిషికి ఉండేది ఒక్కటే జీవితం. ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
ఆలూరి లలిత కన్నుమూత
సాక్షి, హైదరాబాద్: విప్లవరచయితల సంఘం సభ్యురాలు, ఆలూరి భుజంగరావు సహచరి ఆలూరి లలిత (76) ఆదివారం కన్నుమూశారు. కర్ణాటకలోని గుల్బర్గాలో కుమారుడి దగ్గర ఉంటున్న ఆమె గుండెపోటుతో చనిపోయినట్లు కుమార్తె ఆలూరి కవిని తెలిపారు. సోమవారం గుల్బర్గాలోనే అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు చెప్పారు. ఆలూరి భుజంగరావు మరణం తరువాత లలిత మూడేళ్లపాటు గుంటూరులోనే ఉన్నారు. అనారోగ్యం కారణంగా గుల్బర్గాలో ఉంటున్న కుమారుడు శివప్రసాద్‌రావు దగ్గరకు వెళ్లి అక్కడే ఉంటున్నారు. గత 40 ఏళ్లు ప్రజా సంఘాలతో కలిసి పని చేశారు. భుజంగరావుతో కలిసి దశాబ్దానికి పైగా అజ్ఞాత జీవితం గడిపారు. భుజంగరావు రచనావ్యాసంగంలో భాగస్వామిగా నిలిచారు. ఆమె చాలాకాలంగా విరసం సభ్యురాలుగా కొనసాగుతున్నారు. ఆలూరి లలిత మరణం ప్రజా ఉద్యమాలకు తీరని లోటని పలువురు సంతాపం తెలిపారు. -
దివికేగిన లలిత గానం; కుమారి లలిత
జంటకవుల సాహిత్యం, సంగీతం చెవికి వినసొంపుగా ఉంటాయి. తిరుపతి వేంకటకవుల జంట అవధానం గురించి తెలిసిందే. లలిత, హరిప్రియల జంట కూడా అదేవిధంగా సంగీత ప్రియులను అలరించింది. నిజానికి వీరు కన్నడ దేశస్థులు. కాని హైదరాబాద్‌లోనే పుట్టి పెరగటం వల్ల, హైదరాబాద్ సిస్టర్స్‌గా పేరు సంపాదించుకున్నారు. కుమారి లలిత, శ్రీమతి హరిప్రియ.. ఈ జంటలో కుమారి లలిత హైదరాబాద్‌లోని స్వగృహంలో మంగళవారం తుదిశ్వాస విడిచారు. ఆమెకు అక్షర నివాళిగా... హైదరాబాద్ సిస్టర్స్ పేరిట తమ అమృత గానంతో సంగీత ప్రపంచాన్ని ఓలలాడించారు లలిత, హరిప్రియ. సోదరీమణులు జంటగా గానం చేయటం అందరినీ ఆకర్షించింది. లలిత అక్టోబర్ 6, 1950 లో బి. సరోజ, బి. శివచంద్ర దంపతులకు జన్మించారు. తల్లిగారి దగ్గరే సంగీత శిక్షణ ప్రారంభించి, ఆ తరవాత టి. జి పద్మనాభన్ దగ్గర సంగీత శిక్షణ అందుకున్నారు. తొమ్మిదో ఏట హైదరాబాద్ నల్లకుంటలోని శంకరమఠంలో మొట్టమొదటి సంగీత కచేరీ చేశారు. వీరు అలత్తూరు సోదరుల సంగీత కచేరీలు విని ప్రభావితులయ్యారు. వీరికి సంగీత జ్ఞానం కంటె, సంగీతం విలువలు నేర్పారు గురువుగారు. ‘‘మా గురువు గారైన టి. జి. పద్మనాభన్ వల్ల మాకు సంగీతం మీద శ్రద్ధ కలిగింది. సంగీతాన్ని స్వయంగా అధ్యయనం చేయటం అలవాటు చేసుకున్నాం. ప్రతి కచేరీనీ మేం చాలెంజింగ్‌గా తీసుకుని, శిక్షణ తీసుకునేవాళ్లం’’ అనేవారు ఈ సోదరీమణులు. ఎన్. ఎస్. శ్రీనివాసన్ అనే ఫ్లూట్ విద్వాంసులు వీరిరువురికీ అపురూపమైన, అరుదైన త్యాగరాజ కీర్తనలు, తమిళ సంప్రదాయ కీర్తనలు నేర్పారు. వీటిని వీరు తమిళనాడులో పాడి వారి ప్రశంసలు అందుకున్నారు. రాగాలాపన, స్వరకల్పనలలో వారికి వారే సాటి అనిపించుకున్నారు. తమిళనాడులోని కృష్ణగానసభలో ప్రతి సంవత్సరం వీరి కచేరీ తప్పనిసరిగా ఉండేది. తమిళనాట తెలుగువారు అవార్డులు అందుకోవటం అందనిద్రాక్షగానే చెప్పుకుంటారు. అయితే ఈ సోదరీమణులు తమ అమృతగానంతో కృష్ణగాన సభ వారి ‘సంగీత చూడామణి’ బిరుదు అందుకున్నారు. లలిత, హరిప్రియ జంటకు కాంభోజి, ఖరహరప్రియ రాగాలంటే ఇష్టం. ఆ రాగాలలో ఎంతోసేపు స్వరప్రస్తారం చేసేవారు. కీర్తనను నేర్చుకున్నది నేర్చుకున్నట్లుగా ఇంపుగా పాడేవారు. వీరికి సంగీత జ్ఞానం సహజంగానే అలవడింది. వీరి కుటుంబంలోని ఎనిమిదిమంది సంతానమూ సంగీతజ్ఞులే. లలిత, హరిప్రియ సోదరీమణులకు సంగీతం అలవోకగా, అప్రయత్నంగానే అలవడింది. కచేరీలకే జీవితం అంకితం చేశారు. ఎంతోమంది శిష్యుల్ని తయారుచేశారు. శ్రద్ధ ఉన్నవారిని ఇంటికి పిలిపించి, దగ్గరుండి తర్ఫీదు ఇచ్చేవారు. ఇటువంటి వారు సంగీత ప్రపంచంలో చాలా అరుదు. పిట్స్బర్గ్ వెంకటేశ్వర దేవాలయంలో రెండు సంవత్సరాలు టీచింగ్ కాంట్రాక్ట్‌లో పాఠాలు చెప్పారు. హిందుస్థానీ సంగీతం పట్ల వీరికి అవగాహన ఉండటం వల్ల, కచేరీలు మరింత రక్తి కట్టేవి. ఈ సోదరీమణులు తెలుగు రాష్ట్రాల నుంచి పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటకలలో కచేరీలు చేసి, అందరి ప్రశంసలు అందుకోవటమే కాదు, ఇలా జంటగా పాడిన మొట్టమొదటి సోదరీమణులు కూడా వీరే. కుమారి లలిత తన జీవితాన్ని సంగీతానికే అంకితం చేశారు. రామ్ కోఠీ సంగీత కళాశాలలో సంగీత అధ్యాపకురాలిగా పనిచేశారు. సహృదయులు. మృదుభాషి. పేరుకు తగ్గట్టే లలితంగా మాట్లాడేవారు. రెండు రోజుల క్రితం కూడా యూ ట్యూబ్ లో ప్రత్యక్ష కచేరీ చేశారు. ‘‘వ్యక్తిగతంగా లలిత చాలా సౌమ్యురాలు. కళాకారుల్లో ఇంతమంచి లక్షణాలు ఉండటం చాలా అరుదు. స్నేహశీలి. వయసులో పెద్దవారి ని ఎంత గౌరవంగా చూసేవారో, చిన్నవారిని కూడా అంతే గౌరవంగా చూసేవారు. వారి వయసుకి కాకుండా, వారిలోని సరస్వతికి ప్రణమిల్లేవారు’’ అంటారు ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసులు మోదుమూడి సుధాకర్. ‘‘వీరు ఎంతోమందికి ఆదర్శం. నేను, మా అన్నయ్య మల్లాది శ్రీరామ్ ప్రసాద్ ఇద్దరం జంటగా పాడుతున్నామంటే అందుకు వీరే ఆదర్శం’’ అంటున్నారు మల్లాది సోదరులలో ఒకరైన మల్లాది రవి కుమార్. – డా. వైజయంతి పురాణపండ -
టీకాతో వలంటీర్ లలిత మృతి
కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వలంటీర్ పిల్లా లలిత(28) ఆదివారం మృతి చెందారు. శ్రీకాకుళం జిల్లా పలాస మండలం రెంటికోటలో ఈ ఘటన జరిగింది. పోస్టుమార్టం రిపోర్టు వచ్చాకే మృతికి కారణాలను నిర్ధారించగలమని తహసీల్దార్ చెప్పారు. లలితతో పాటు వ్యాక్సిన్ తీసుకున్న వారికి ప్రత్యేక చికిత్స అందిస్తున్నారు. సాక్షి, పలాస/కాశీబుగ్గ : కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వలంటీర్ పిల్లా లలిత(28) ఆదివారం మృతి చెందారు. వ్యాక్సిన్ వికటించడం వల్లే తమ బిడ్డ మృతి చెందిందని తల్లిదండ్రులు కన్నీళ్ల పర్యంతమవుతున్నారు. శ్రీకాకుళం జిల్లా పలాస మండలం రెంటికోటకు చెందిన లలితతో పాటు మరో 8 మంది వలంటీర్లు, వీఆర్వో ప్రసాద్ వ్యాక్సిన్ తీసుకున్నారు. అప్పటి నుంచి అందరికీ స్వల్పంగా జ్వరం, తలనొప్పి లక్షణాలు కనిపించాయి. లలితకు ఆ లక్షణాలు తీవ్రంగా ఉండటంతో ఇంట్లోనే ఉంటూ టాబ్లెట్లు వేసుకున్నారు. ఈ క్రమంలో తెల్లవారుజామున మృతి చెందారు. మృతురాలికి భర్తతో పాటు ఎనిమిదేళ్ల కుమారుడున్నాడు. పలాస తహసీల్దార్ మధుసూదనరావు, కాశీబుగ్గ సీఐ శంకరరావు, డీఎంహెచ్‌వో చంద్రనాయక్ తదితరులు లలిత మృతదేహాన్ని పరిశీలించి, కుటుంబ సభ్యులతో మాట్లాడారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పలాస కమ్యూనిటీ ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం రిపోర్టు వచ్చాకే మృతికి గల కారణాలను నిర్ధారించగలమని తహసీల్దార్ చెప్పారు. లలిత మృతిచెందడంతో ఆమెతో పాటు వ్యాక్సిన్ తీసుకున్న మిగతా వలంటీర్లు, వీఆర్వో తీవ్ర ఆందోళనకు గురయ్యారు. వెంటనే వారు పలాస పీహెచ్‌లో చేరి చికిత్స పొందుతున్నారు. మృతురాలి కుటుంబానికి మంత్రి భరోసా ఇదిలా ఉండగా వలంటీర్ మృతి వార్త తెలుసుకున్న మంత్రి సీదిరి అప్పలరాజు పలాస కమ్యూనిటీ ఆస్పత్రికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. అక్కడే తక్షణ సాయం కింద రూ.2 లక్షలు ప్రకటించారు. అప్పటికే నీరసించిపోయింది.. టీకా వేసుకున్న తర్వాత జ్వరం వచ్చిందని చెప్పింది. మెడికల్ సిబ్బందికి తెలియజేస్తే పారాసిటమాల్ వేసుకోవాలని చెప్పారు. అయితే లక్షణాలు అలాగే ఉంటాయిలే అనుకుని టాబ్లెట్ కూడా వేసుకోలేదు. తర్వాత రోజు కూడా జ్వరం తగ్గకపోవడంతో టాబ్లెట్ వేశాం. కానీ అప్పటికే పూర్తిగా నీరసం అయిపోయింది. తెల్లారేసరికి ఇలా జరిగింది. మా పాపకు ఎలాంటి ఆరోగ్య సమస్యల్లేవు. కేవలం వ్యాక్సిన్ వేసుకోవడం వల్లే చనిపోయింది. – పి.పార్వతి, మృతి చెందిన వలంటీర్ తల్లి -
భర్త కోసం
భర్త ప్రాణాల కోసం భార్యలు అపర శక్తి స్వరూపిణులు అవుతారు. ఒక్కోసారి యముని మహిషంపై కొమ్ములు కూడా విసురుతారు. వారి నిశ్శబ్ద సంగ్రామాలు చాలా మటుకు లోకానికి తెలియవు. తెలిసినవి విస్మయం కలిగించకమానవు. చెన్నైకి చెందిన 66 ఏళ్ల లలిత తన భర్త కోసం మృత్యువు సమక్షంలో 8 రోజులు గడపడం సామాన్యం కాదు. జూన్ 19. చెన్నై. రెడ్‌హిల్స్‌లో ఆ ఇంట్లోని 76 ఏళ్ల భర్త మదనగోపాల్ తన భార్య లలితను పిలుద్దామనుకున్నాడు. కాని మాట జారిపోయింది. మళ్లీ పిలుద్దామనుకున్నాడు. గొంతు పెగల్లేదు. కుడి చేత్తో సైగ చేసి పిలుద్దామనుకున్నాడు. చేయి కదలడం లేదు. అయితే వంట గదిలో ఉన్న ఆయన భార్య లలితకు మనసులో ఏదో ఆరాటంగా అనిపించింది. బయటకొచ్చి చూసింది. భర్త పరిస్థితి ఆందోళనగా ఉందని అర్థమైంది. ఆమె భయపడలేదు. వెంటనే భర్త బంధువు ఒకరికి ఫోన్ చేసింది. అతను డాక్టర్. ‘అది స్ట్రోక్‌లా ఉంది. వెంటనే హాస్పిటల్‌కు తీసుకొచ్చేయండి’ అని చెప్పాడతను. లలిత తన భర్తను ఆఘమేఘాల మీద హాస్పిటల్‌కు తీసుకెళ్లి జాయిన్ చేసింది. వైద్యులు ఆ మైల్డ్ స్ట్రోక్‌కి వెంటనే వైద్యం చేశారు. ఇది కోవిడ్ సమయం కనుక ఆ టెస్ట్ కూడా చేశారు. పాజిటివ్ వచ్చింది. కంగారు పడి లలితకు కూడా చేశారు. నెగెటివ్ వచ్చింది. ‘ఇప్పుడేం చేద్దాం’ అన్నారు లలితతో. ‘ఇంటికి తీసుకెళ్లి జాగ్రత్తగా చూసుకుంటాను’ అందామె. ‘అది క్షేమం కాదు. ఆయన హాస్పిటల్లో ఉండాలి’ అని చెప్పారు. వెంటనే మదన గోపాల్ని పొన్నేరిలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ మదన గోపాల్ ఐసొలేషన్‌లో ఉండాలి. కాని మదన గోపాల్‌కు అప్పటికే బి.పి, షుగర్ వంటి సమస్యలు ఉన్నాయి. దానికితోడు ఆయనకు మతి స్థిమితం సరిగా ఉండదు. ‘ఆయన నేను లేకపోతే ఉండడు. ఉండలేడు’ అంది లలిత. ‘నేను కూడా ఆయనతో పాటే ఉంటాను’ అని కూడా అంది. ఆయనతో పాటు ఉండటం అంటే కోవిడ్‌ను కొని తెచ్చుకోవడం. మృత్యువుకు గడపదాకా ఆహ్వానం పలకడం. ఎందుకంటే ఆమె కూడా రిస్క్ ఏజ్ గ్రూప్‌లోనే ఉంది. కాని డాక్టర్లకు వేరే దారి కనిపించలేదు. ‘సరే ఉండండి’ అన్నారు. లలిత ఆ వయసులో తన భర్త కోసం నిలబడింది. అతనితోపాటు 8 రోజుల పాటు ఐసొలేషన్‌వార్డులో ఉండి పోయింది. ప్రతి క్షణం మాస్క్ ధరించి తనను తాను కాపాడుకుంటూ భర్తను కాపాడుకుంది. ‘అక్కడ మా బట్టలు నేనే ఉతుక్కున్నాను. రాత్రంతా అతని పక్కనే కూచుని కాపు కాచాను’ అంది లలిత. డాక్టర్లు ఎందుకైనా మంచిదని లలితకు కూడా మల్టీ విటమిన్ టాబ్లెట్లు, కొన్ని బూస్టర్లు ఇచ్చారు. ‘అలా ఉండటం కష్టం కాలేదా?’ అని లలితను అడిగితే ‘పెద్ద కాలేదు. కాని ఆయనకు టీ అలవాటు. టైమ్‌కు టీ అందకపోతే విసుక్కుంటారు. ఆయన అడిగినప్పుడు టీ ఏర్పాటు చేయడం కష్టమైంది’ అని మెల్లగా నవ్విందామె. ‘మీకు కోవిడ్ వచ్చి ఉంటే?’ అనడిగితే ‘వస్తే ఏం చేస్తాం? ఎన్నోసార్లు అతనిని కాపాడుకున్నాను. ఈసారి అది వచ్చినా కాపాడుకోవాలనుకున్నాను. కాని నాకు రాలేదు’ అందామె. మదనగోపాల్ అసింప్టమేటిక్ కావడం వల్ల డాక్టర్లు ఇంటికి పంపించారు. ఇంట్లో క్వారంటైన్లో ఉండాలని చెప్పారు. మదనగోపాల్‌కు ఏం భయం... ఏం బెంగ? అలాగే ఉంటాడు. లలిత ఉందిగా. – సాక్షి ఫ్యామిలీ -
లలితా రైస్ మిల్స్‌లో ఐటీ దాడులు
-
లలితా రైస్ మిల్స్‌లో ఐటీ దాడులు
సాక్షి, కాకినాడ: తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురంలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. లలితా రైస్ మిల్స్‌లో ఐటీ అధికారులు గురువారం సోదాలు చేపట్టారు. ఏడు బృందాలుగా ఏర్పడి అధికారులు ఈ తనిఖీలు జరిపారు. కాగా లలితా రైస్‌మిల్స్ యజమానులు మట్టే ప్రసాద్, శ్రీనివాస్.. మాజీ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్పకు అత్యంత సన్నిహితులు. ఖరీదైన, సాంకేతిక పరిజ్ఞానం కలిగిన షాటెక్స్ యంత్రాలతో మిల్లింగ్ చేసిన బియ్యాన్ని నౌకల ద్వారా విదేశాలకు ఎగుమతి చేసే వ్యాపారులుగా వీరికి పేరుంది. కాగా మట్టే సోదరులు.. ఒక షాటెక్స్ యంత్రానికి అనుమతి తీసుకుని, దాని పేరు మీద మరిన్ని షాటెక్స్ యంత్రాలతో బియ్యాన్ని మిల్లింగ్ చేసి కోట్లాది రూపాయలు అక్రమార్జన చేశారనే ఆరోపణలు ఉన్నాయి. టీడీపీ హయాంలో అచ్చంపేట వద్ద మాజీ హోంమంత్రి చినరాజప్పకు క్యాంప్ కార్యాలయం భవనాన్ని మట్టే సోదరులే బహుమతిగా ఇచ్చారని ప్రచారం ఉంది. -
సీరియల్ నటి లలిత అదృశ్యం
హైదరాబాద్: తెలుగు టీవీ సీరియల్స్‌లో నటించే లలిత (25) అనే మహిళ కనిపించకుండా పోయింది. అమీర్‌పేట లోని ఓ హాస్టల్లో ఉంటున్న లలిత ఈ నెల 17 నుంచి కనిపించకుండా పోయిం దని ఆమె తల్లి వెంకటలక్ష్మి బుధవారం ఎస్సార్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అనంతపురం జిల్లా ధర్మవరం మండలానికి చెందిన లలిత (25)కు పదేళ్ల క్రితం వివాహం జరిగింది. ఆమెకు ఏడేళ్ల కుమార్తె ఉంది. లలిత ప్రస్తుతం భర్తతో దూరంగా ఉంటోంది. కూతురుని తల్లిదం డ్రుల వద్ద ఉంచి అమీర్‌పేట రాజరాజేశ్వరీ ఉమెన్స్ హాస్టల్లో చేరి తెలుగు టీవీ సీరియల్స్‌లో నటిస్తోంది. రోజూ రాత్రి ఫోన్ చేసి తల్లితో పాటు కుమార్తెతో మాట్లాడేది. ఈ నెల 17న ఫోన్ చేయకపోవడంతో తల్లి లలితకు ఫోన్ చేస్తే స్విచాఫ్ వచ్చింది. ఇలా వారం నుంచి లలిత ఫోన్ స్విచాఫ్ అని రావడంతో వెంకటలక్ష్మి మరో కుమార్తె రామాంజనమ్మతో కలిసి నగరానికి వచ్చి హాస్టల్లో ఆరా తీసింది. లలిత 2 నెలల క్రితమే హాస్టల్ నుంచి వెళ్లిపోయిందని తెలిపారు. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నాని అనే వ్యక్తి సీరియల్లో నటించే అవకాశం కల్పిస్తానని చెప్పి నగరానికి తీసుకువచ్చాడని వెంకటలక్ష్మి పోలీసులకు తెలిపింది. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ మురళీ తెలిపారు. -
నూరేళ్ల నాటి తొలి అడుగు
లలిత పేరులో లాలిత్యం ఉంది కానీ ఆమె జీవితం అంత సుకుమారంగా ఏమీ సాగలేదు. వారిది చెన్నైలోని తెలుగు కుటుంబం. శుద్ధసంప్రదాయమైన కుటుంబం కూడా. ఏడుగురిలో ఐదో సంతానం. తండ్రి ఇంజనీర్. కొడుకులను కూడా ఇంజనీరింగ్ చదివించారు. కానీ ఆడపిల్లలను పదో తరగతి దాటనివ్వలేదు. లలితకు పదో తరగతితో చదువు అయిందనిపించి పదిహేనో ఏట పెళ్లి చేశారు. ఆ తరవాత రెండేళ్లకే ఆమె ఓ పాపాయికి తల్లయింది. కొద్ది నెలలకే భర్త పోయాడు. పద్దెనిమిదేళ్లకు వితంతువు అనే ముద్రకు తలవంచాల్సి వచ్చింది. సమాజం వేసిన ముద్ర కంటే కఠినమైన ముద్ర అత్తగారు వేశారు. ‘శాపగ్రస్తురాలు’ అనే ముద్ర అది! లలిత అనే పేరునే మర్చిపోయారు వాళ్లు. నవ సమాజ నిర్మాణం సమాజంలో వితంతువుకు ఎదురవుతున్న అవమానాలను తుడిచేయాలనుకున్నారు లలిత. ‘నేను చదువుకుంటాను’ అని పుట్టింటి వాళ్లతో చెప్పారు. తండ్రి ఆమెకు అండగా నిలిచాడు. డాక్టర్ కోర్సు చేయమని సలహా ఇచ్చారామెకి. మహిళలు ఇంజనీరింగ్ రంగంలో అడుగు పెట్టని రోజులవి. లలిత మాత్రం ఒకటే మాట చెప్పారు. ‘వివాహిత అలాంటి దుస్తులు ధరించాలి, వితంతువు ఇలాంటి దుస్తులు ధరించాలి... అంటూ మూఢత్వంలో మగ్గిపోతున్న సమాజంలో మార్పు రావాలి. కొత్త సమాజ నిర్మాణం జరగాలి. అది నాతోనే జరుగుతుంది. వితంతువు కూడా ఎవరికీ తీసిపోకుండా రాణిస్తుందని నిరూపిస్తాను’ అన్నదామె స్థిరంగా. ‘‘డాక్టర్ అయితే ఏ అర్ధరాత్రో కేసు వస్తే బిడ్డను ఒంటరిగా వదిలి వెళ్లాల్సి వస్తుంది. ఇంజనీర్ ఉద్యోగంలో అలాంటి ఇబ్బంది ఉండదు’’ అని తన తల్లిని సమాధాన పరిచింది లలిత. అంతర్జాతీయ సదస్సులకు! ఇంజనీరింగ్ పట్టా పుచ్చుకున్న తర్వాత లలిత సిమ్లా, కోల్‌కతాలలో ఉద్యోగం చేశారు. తండ్రి పరిశోధనల్లో సహాయం చేశారు. ఆయన జెలోక్టోమోనియమ్ అనే సంగీత పరికరాన్ని, ఎలక్ట్రిక్ ఫ్లేమ్ స్టవ్, పొగరాని స్టవ్‌లను కనిపెట్టారు. ఇంజనీర్‌గా లలిత సాధించిన విజయాలే ఆమెను అంతర్జాతీయ వేదికకు తీసుకెళ్లాయి. అమెరికా, న్యూయార్క్‌లో 1964లో జరిగిన తొలి మహిళా ఇంజనీర్లు, సైంటిస్టుల సదస్సుకు ఆమెకు ఆహ్వానం వచ్చింది. యాభై ఐదేళ్లకే తుది శ్వాస వదిలిన లలిత... తన జీవితాన్ని కూతుర్ని పెంచుకోవడానికి, ఇంజనీరింగ్ పరిశోధనలకే అంకితం చేశారు. (లలిత కూతురు శ్యామల అమెరికాలో స్థరపడ్డారు. ఆమె తాజాగా ఇండియన్ మీడియాతో పంచుకున్న విషయాలివి) – మంజీర ‘షీ’ సర్టిఫికేట్లు లలిత తండ్రి సుబ్బారావు చెన్నైలోని గిండిలో ఉన్న ఇంజనీరింగ్ కాలేజ్‌లో ప్రొఫెసర్. ఆయనే లలితను కాలేజ్ ప్రిన్సిపల్ దగ్గరకు తీసుకెళ్లారు. ఇంజనీరింగ్‌లో చేరుతానని తొలిసారిగా ఒక మహిళ అడ్మిషన్ అడగడం వారికి కూడా ఆశ్చర్యమే. లలితకు సీటివ్వడంతోపాటు ఆమె కోసం హాస్టల్ భవనంలో మార్పులు కూడా చేయించారు ప్రిన్సిపల్. అలా కాలేజ్‌లో చేరారు లలిత. వందలాది మంది యువకుల మధ్య ఒక్క యువతి. కోర్సు పూర్తయిన తర్వాత ఆమెకు సర్టిఫికేట్ ఇచ్చేటప్పుడు మరో ధర్మసంకటం ఎదురైంది. అప్పటి వరకు కాలేజ్ సర్టిఫికేట్ ప్రొఫార్మాలో ‘హీ’ అని ఉండేది. లలిత కోసం సర్టిఫికేట్లలో ‘హీ/షీ’ అని కొత్తగా ముద్రించారు. లలిత ఇంజనీరింగ్‌లో చేరిన తర్వాత ఏడాది ఆ కాలేజ్ మహిళలకు కూడా ప్రవేశం కల్పిస్తున్నట్లు ప్రకటన జారీ చేసింది. ఆమె ఇంజనీరింగ్ కోర్సులో ఉండగానే ఆ కాలేజ్‌లో మరో ఇద్దరు మహిళలు చేరారు. -
బరువు నా బాధ్యత
సామాన్య కుటుంబంలో జననం... అసామాన్య రీతిలో గమనం. సాధారణ పల్లెలో సాధన.. అసాధారణ స్థాయిలో పతకాల సాధన. సిక్కోలు ఆశా కిరణం గార లలితారాణి గమ్యం వైపు దూసుకువెళ్తోంది. వెయిట్‌లిఫ్టింగ్‌లో ఉత్తరాంధ్రకు ఉన్న గొప్ప పేరును కాపాడుతూనే.. చరిత్ర పుటల్లో తన పేరునూ లిఖించేలా రాణిస్తోంది. తాజాగా మహారాష్ట్రలోని పూణెలో జరిగిన ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌లో ద్వితీయస్థానం సాధించి ప్రతిభ చాటింది. కామన్వెల్త్లో రాణిస్తానని నమ్మకంగా చెబుతోంది ఈ పాలకొండ యువతి. పతకం సాధించి తిరిగి వచ్చిన లలితారాణికి స్థానికులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ‘సాక్షి’తో ఆమె ఇలా మాట కలిపారు.– పాలకొండ రూరల్ సాక్షి: జాతీయ స్థాయి పతకం సాధించడం ఎలాంటి అనుభూతి నిచ్చింది..? రాణి: ఆనందంగా ఉంది. నా తల్లిదండ్రులు తిరుపతిరావు, చిన్నమ్మడుల ప్రోత్సాహం, కుటుంబసభ్యుల సహకారంతో చిన్నతనం నుండి క్రీడలపై ఆసక్తి కనబర్చాను. తొలి రోజుల్లో ఆడపిల్లలకు బరువులెత్తే ఆటలేంటని ప్రశ్నించిన వారే ఇప్పుడు శభాష్ అంటున్నారు. కుటుంబసభ్యులు, కోచ్‌ల ప్రోత్సాహంతో ఈ స్థాయికి చేరుకోవడం ఆనందంగా ఉంది. ఇక్కడి ప్రతిభ కారణంగా ఇతర దేశాల్లో జరగనున్న వరల్డ్ యూనివర్సిటీ వెయిట్‌లిఫ్టింగ్ క్రీడలకు కూడా ఎంపిక కావడం ఆనందంగా ఉంది. సాక్షి: ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ప్రయాణం ఎలా సాగింది? రాణి: గత ఏడాది ఫిబ్రవరిలో విశాఖలో నిర్వహించిన జూనియర్ నేషనల్స్‌లో దేశస్థాయిలో వివిధ రాష్ట్రాల నుంచి క్రీడాకారిణులు ప్రతిభ కనబర్చారు. నాతో సహా 17 మంది ఈ పోటీల్లో తలపడ్డారు. అందులో రాణించిన వారిని ఖేలో ఇం డియా యూత్ గేమ్స్‌కు పంపించారు. అప్పటి నుంచే కఠోరంగా శ్రమించాను. సాక్షి: జూనియర్ నేషనల్స్ ఎలా ఉపయోగపడింది? రాణి: విశాఖ జూనియర్ నేషనల్స్‌లో నేను పడిన కష్టం వృధా పోలేదు. నాకు బంగారు పతకంతోపాటు మంచి పేరు, దేశస్థాయి క్రీడల్లో పాల్గొనే అవకాశం కలిగింది. సాక్షి: ఖేలో ఇండియా యూత్ గేమ్స్ పోటీలు ఎలా సాగాయి..? రాణి: ఈ ఏడాది జనవరి 9 నుంచి 15 వరకు మహరాష్ట్ర పూణేలో నిర్వహించిన ఈ క్రీడలకు దేశస్థాయిలో ప్రతిభ గల 21 మంది వెయిట్‌లిఫ్టర్స్‌తో పోటీల్లో తలపడ్డాను. వివిధ ప్రాంతాలకు చెందిన క్రీడాకారిణులు, వారి శిక్షకులు అనుసరించే విధానాలను దగ్గరగా చూశాను. వారు శ్రమిస్తున్న తీరు నాలో మరింత శక్తి, ఆసక్తి నింపింది. సాక్షి: బంగారు పతకం చేజార్చుకున్నానన్న బాధ ఉందా..? రాణి: నాతోపాటు ఈ క్రీడల్లో పోటీ పడిన వారు అందరూ చివరి వరకు తమ ప్రతిభను కనబరిచారు. ఆ సమయంలో నాకు ఆరోగ్యం సరిగా లేదు. జ్వరంతో బాధపడుతున్నా. కేవలం ఒక్క అడుగు దూరంలో బంగారు పథకం దూరమైంది. ఆ సమయంలో కన్నీరు ఆపుకోలేకపోయా. మణిపూర్‌కు చెందిన క్రీడాకారిణికి పథకం వచ్చింది. సాక్షి: 2018 ఎలాంటి జ్ఞాపకాలు మిగిల్చింది..? రాణి: 2018 నాకు ఎంతో కలిసి వచ్చిన ఏడాది. ఈ ఏడాదిలో మూడు బం గారు పథకాలతోపాటు బెస్ట్ లిఫ్టర్‌గా గుర్తింపు లభించింది. ఆల్ ఇండియా స్థాయిలో గుంటూరు నాగార్జున యూనివర్సిటీ క్రీడల్లో, నాగపూర్‌లో జరిగిన జూనియర్ నేషనల్స్‌లో, గుంటూరులో జరిగిన సీఎం కప్‌లో బంగారు పథకాలు సాధించా. సాక్షి: మీ విజయాల్లో ఎవరి సహకారం ఉంది? రాణి: నా తొలి గురువు నా తండ్రి తిరుపతిరావు. అటుపై నా శిక్షకులు ఎస్ఏ.సింగ్, పి.మాణిక్యాలరావు, ఎం.రామకృష్ణలు ఎంతగానో ప్రోత్సహించి శిక్షణ అందించారు. ప్రస్తుతం నాకు కాకినాడకు చెందిన ఎన్సీ.మోహన్ శిక్షణ అందిస్తున్నారు. అలాగే మా బావగారు రామకృష్ణ సహకారం మరిచిపోలేనిది. సాక్షి: మీ భవిష్యత్ లక్ష్యాలు..? రాణి: నా కుటుంబంలో నాతోపాటు మా అక్కలు అరుణరాణి, ఉషారాణిలుకూడా వెయిట్‌లిఫ్టర్లు కావటంతో వారి సహకారం ఉంది. ఉన్నత చదువులతోపాటు రానున్న కామన్వెల్త్ క్రీడల్లో సత్తాచాటాలనేది నా లక్ష్యం. నా తల్లిదండ్రులు నాపై ఉంచిన నమ్మకం వృధా కానివ్వను. సాక్షి: ప్రస్తుతం క్రీడాకారులకు ఎలాంటి ప్రోత్సాహం ఉంది? రాణి: సౌకర్యాలు లేకున్నా కష్టపడి లక్ష్య సాధనవైపు దూసుకువేళ్లే క్రీడాకారులకు జిల్లాలో కొదువ లేదు. ప్రభుత్వ ప్రోత్సాహం అవసరం. ముఖ్యం గా క్రీడాకారులకు ఆర్థిక స్థోమత లేక ఇబ్బందులు పడుతున్నారు. వారిలో నేను కూడా ఉన్నా. మధ్య తరగతి కుటుంబం మాది. అధికారుల సహకారం అవసరముంది. సాక్షి: నేటితరం క్రీడాకారులకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? రాణి: ఆసక్తి ఉన్న క్రీడాకారులు ముందుకురావాలి. నిరుత్సాహం విడనాడాలి. వారికి కుటుంబ సభ్యులతోపాటు అందరూ సహకరించాలి. నచ్చిన రంగంలో ఉన్నత స్థానం దక్కించుకునేందుకు నిరంతరం కృషి చేయాలి. -
బాక్సర్ ప్రసాద్‌కు స్వర్ణం
పుణే: జాతీయ సీనియర్ పురుషుల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పొలిపల్లి లలితా (పీఎల్) ప్రసాద్ స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకున్నాడు. సర్వీసెస్ స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డు (ఎస్‌ఎస్‌పీబీ) తరఫున బరిలోకి దిగిన ప్రసాద్ 52 కేజీల విభాగంలో చాంపియన్‌గా అవతరించాడు. ఫైనల్లో ప్రసాద్ 3–2తో అనంత చోపాడే (మహారాష్ట్ర)పై గెలుపొందాడు. వైజాగ్‌కు చెందిన 23 ఏళ్ల ప్రసాద్ 2015లో 49 కేజీల విభాగంలో స్వర్ణ పతకాన్ని దక్కించుకున్నాడు. అంతే కాకుండా ప్రపంచ యూత్, ఆసియా యూత్ బాక్సింగ్ పోటీల్లో భారత్‌కు కాంస్య పతకాలను అందించాడు. ఈసారి జాతీయ చాంపియన్‌షిప్‌లో సర్వీసెస్ తరఫున ఫైనల్‌కు చేరిన ఎనిమిది మంది బాక్సర్లు స్వర్ణాలు గెలవడం విశేషం. ఓవరాల్ చాంపియన్‌షిప్ గెల్చుకున్న సర్వీసెస్‌కు మనీశ్ కౌశిక్ (60 కేజీలు), మదన్‌లాల్ (56 కేజీలు), సంజీత్ (91 కేజీలు), సతీశ్ కుమార్ (ప్లస్ 91 కేజీలు), దీపక్ (49 కేజీలు), దుర్యోధన్ సింగ్ (69 కేజీలు), మంజీత్ సింగ్ (75 కేజీలు) కూడా పసిడి పతకాలు అందించారు. -
భూస్వాముల కోసమే రైతుబంధు పథకం
నిజామాబాద్ రూరల్ : టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదని ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈనెల 2న నిజాంసా గర్ మండల కేంద్రం నుంచి టీడీపీ భూస్వాముల కోసమే రైతుబంధు పథకం రాష్ట్ర నాయకుడు రాష్ట్ర మాజీ హస్తకళల అభివృద్ధి సంస్థ చైర్మ న్ అమర్‌నాథ్‌బాబు సారథ్యంలో ప్రారంభించిన సకల జనుల పాదయాత్ర ఆదివారంతో నిజామా బాద్ మండలం మల్కాపూర్, లక్ష్మాపూర్, గుండారం, సారంగపూర్‌కు చేరుకుంది. దీనికి ఎమ్మెల్సీ ఆకుల లలిత సంఘీభావం తెలిపారు. రాష్ట్ర ప్రభు త్వం రైతుబంధు పథకం భూస్వాముల కోసమే ప్రవేశపెట్టిందని విమర్శించారు. ప్రత్యేక బీసీ కమిషన్‌ను ఏర్పాటు చేయాలని కోరారు. టీడీపీ జిల్లా అధ్యక్షులు భాగిర్తి బాగారెడ్డి, టీడీపీ జిల్లా లీగల్‌సెల్ అధ్యక్షుడు సురేష్, నవీపేట మండల అధ్యక్షుడు రచ్చ సుదర్శన్, నాయకులు మువ్వ నాగేశ్వర్రావు, ఇస్మాయిల్ పటేల్, మల్లేశం, గోపాల్‌రెడ్డి, సురేష్, న్యాయవాది దొంతి సాయన్న, బోధన్ టీడీపీ నాయకుడు వెంకటేశ్వర్రావు ఉన్నారు. మహాధర్నాను జయప్రదం చేయండి సకల జనుల పాదయాత్ర సోమవారం ముగిస్తున్నట్లు జిల్లా టీడీపీ అధ్యక్షుడు భాగిర్తి భాగారెడ్డి అన్నారు. ప్రజల సంక్షేమం కోరేందుకు చేపడుతున్న సకల జనుల పాదయాత్రల ఉద్యమానికి అందరూ కలెక్టరేట్‌కు కోరారు. మహాసభను జయప్రదం చేయాలని కోరారు. -
సీఎం కార్యాలయం ఎదుటే ఆత్మహత్య చేసుకుంటా
పట్నంబజారు (గుంటూరు): ‘‘నా భర్త శవంతో రాజకీయాలు చేస్తున్నారు. ఎవరు తప్పు చేసినా చర్యలు చేపడతానని చెప్పే ముఖ్యమంత్రి చంద్రబాబు టీడీపీ నేతలు చేస్తున్న అరాచకాలపై ఏం చర్యలు తీసుకుంటున్నారు. నా సమస్యలు పరిష్కరించకుంటే ఈసారి సీఎం కార్యాలయం ఎదుట ఆత్మహత్య చేసుకుంటా’’ అంటూ తెలుగుదేశం పార్టీ క్రియాశీల కార్యకర్త అయిన ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం ముట్లూరు గ్రామానికి చెందిన నర్రా లలిత శనివారం గుంటూరు నగరంపాలెంలోని రిజిస్ట్రారు కార్యాలయంలో ఉన్న సెల్ టవర్ ఎక్కి నిరసన తెలిపింది. సుమారు మూడు గంటలకు పైగా సెల్‌టవర్‌పైనే కూర్చుంది. ఈ విషయం తెలుసుకున్న గుంటూరు వెస్ట్ సబ్ డివిజన్ డీఎస్పీ కేజీవీ సరిత, సీఐ వై.శ్రీధర్‌రెడ్డి సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సీఐ శ్రీధర్‌రెడ్డి సెల్‌టవర్ ఎక్కి మహిళ సమస్యలు అడిగి తెలుసుకుని హామీ ఇవ్వడంతో లలిత కిందకు దిగారు. అనంతరం ఆమెను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షల అనంతరం తిరిగి గ్రామానికి పంపినట్టుసీఐ శ్రీధర్‌రెడ్డి తెలిపారు. టీడీపీ నేతలతో ప్రాణభయం సెల్ టవర్ ఎక్కి ఆందోళన చేపట్టిన నర్రా లలిత మీడియాతో మాట్లాడుతూ, తన భర్త సాంబశివరావు గత ఏడాది ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. తనకు న్యాయంగా రావాల్సిన ఆస్తులను రానీయకుండా తన మామగారు మోహన్‌రావు, ఆడపడుచు భర్త జాగర్లమూడి శ్రీనివాసరావు అడ్డుపడుతూ ఆస్తిని కాజేయాలని చూస్తున్నారని, వారికి స్థానిక టీడీపీ నేతలు, పోలీసులు అండగా ఉన్నారని ఆరోపించారు. తన భర్త కేసు విషయంలో వాస్తవాలు బయటకు వస్తాయనే ఉద్దేశంతో, ఈనెల 2వ తేదీ రాత్రి తమ ప్రాంతంలోని రౌడీషీటర్ మొవ్వా బుల్లయ్య, జాగర్లమూడి శ్రీనివాసరావు, కాపా శ్రీకాంత్, గడ్డం మురళీకృష్ణ తన ఇంటికి వచ్చి చంపుతామని బెదిరింపులకు దిగారని తెలిపారు. మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, నక్కా ఆనందబాబు, తెనాలి ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్ పేర్లు చెప్పి రౌడీషీటర్లతో పాటు మాజీ ఎంపీపీ పూనాటి రమేష్ తనను భయపెడుతున్నారని పేర్కొన్నారు. చేబ్రోలు సీఐ, వట్టిచెరుకూరు ఎస్ఐ వారికి వంత పాడుతున్నారన్నారు. వట్టిచెరుకూరు ఎస్ఐ అశోక్ తనపై వ్యభిచారం కేసులు పెడతామని బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. -
అత్తవారితో డేంజర్.. సెల్ టవరెక్కిన మహిళ
-
ఈతరం సీతారాములు
మహిధర్, ఇషిత, ప్రశాంత్, లలిత ముఖ్యపాత్రల్లో రూపొందిన చిత్రం ‘ఇప్పట్లో రాముడిలా సీతలా ఎవరుంటారండి బాబు’. వెంకటేష్ కె. దర్శకత్వంలో ప్రశ్నాద్ తాతా నిర్మించిన ఈ సినిమా ఈ నెల 27న విడుదలవుతోంది. నిర్మాత ప్రశ్నాద్ తాతా మాట్లాడుతూ– ‘‘ఇప్పట్లో రాముడిలా సీతలా ఉండాలని అందరూ ఎలా అనుకుంటారన్నది మా సినిమాలో చూపిస్తున్నాం. కథ, కథనాలు ఆసక్తిగా ఉంటాయి’’ అన్నారు. ‘‘పూర్తి స్థాయి యూత్‌ఫుల్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన చిత్రమిది’’ అన్నారు వెంకటేష్ కె. ‘‘ఈ చిత్రంలో మెయిన్ రోల్ చేశా. టైటిల్ ఎంత వైవిధ్యంగా ఉందో సినిమా కూడా అంతే వైవిధ్యంగా ఉంటుంది. ఈ సినిమా నాకు మంచి బ్రేక్ అవుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు మహిధర్. -
ఆమె ఖరీదు లక్షా ఎనభైవేలు..!
బోథ్: భర్త చనిపోవడంతో ఓ మహిళను... అత్తింటివాళ్లు అమ్మేసిన ఘటన స్థానికంగా కలకలం సృష్టిస్తోంది. తమ కుమార్తె ఆచూకీ తెలపాలంటూ బాధితురాలి తల్లిదండ్రులు ఆందోళనకు దిగడంలో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం కిష్టాపూర్ గ్రామానికి చెందిన లలిత అనే మహిళను ఆమె బావ (భర్త సోదరుడు) గుజరాత్లో అమ్మేసినట్లు తెలుస్తోంది. బోథ్ మండలం సొనాల గ్రామానికి చెందిన లలిత తల్లి గంగుబాయి, సోదరుడు జగదీశ్ తెలిపిన వివరాల ప్రకారం.. లలితను మూడేళ్ల క్రితం నేరడిగొండ మండలం కిష్టాపూర్ గ్రామానికి చెందిన రమేశ్‌కిచ్చి పెళ్లి చేశారు. వీరికి కూతురు శివానీ పుట్టిన ఏడాదికే రమేశ్ ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో లలిత తన కూతురుతో కిష్టాపూర్‌లోని అత్తవారింట్లోనే ఉంటూ స్థానిక పాఠశాలలో రోజువారి వేతనం కింద అటెండర్‌గా పని చేస్తూ జీవనం సాగిస్తోంది. కాగా ఆమె బావ చౌహాన్ అర్జున్ తరచూ లలితను వేధించేవాడు. నెల రోజులుగా లలిత క్షేమ సమాచారాలు తెలియకపోవడంతో ఆమె సోదరుడు జగదీశ్ కిష్టాపూర్‌కు వెళ్లి విచారించాడు. తన సోదరిని ఇచ్చోడ గ్రామానికి చెందిన రేఖ, శారదలతో కలిసి చౌహాన్ అర్జున్ గుజరాత్లో అమ్మేసినట్లు తెలిసిందని జగదీశ్ పేర్కొన్నాడు. ఇదే విషయం అర్జున్ను అడగగా తనకేమీ తెలియదని చెప్పగా మేనకోడలును తీసుకుని సొనాలకు వెళ్లానని తెలిపాడు. కాగా మంగళవారం రాత్రి మద్యం సేవించి సొనాలలోని తమ ఇంటికి వచ్చిన అర్జున్ పరుష పదజాలంతో దుర్భాషలాడి దాడికి యత్నించాడని జగదీశ్ వాపోయాడు. అదే రోజు సాయంత్రం తన సోదరి లలిత ఫోన్ చేసి తనను గుజరాత్లో రూ.లక్షా 80వేలకు అమ్మేశారని తెలిపినట్లు జగదీశ్ పేర్కొన్నాడు. దీంతో బుధవారం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయనున్నట్లు ఆయన తెలిపాడు. కాగా ఓ మహిళను విక్రయించడం జిల్లాలో సంచలనానికి దారితీసింది. -
ప్రియుడు పెళ్లికి నిరాకరించాడని..
యువతి బలవన్మరణం ⇒మృతదేహంతో నిందితుడి ఇంటి ఎదుట బంధువుల ఆందోళన ⇒పర్వతగిరి గ్రామ శివారు సోమ్లాతండాలో విషాదం ⇒పోలీసుల చొరవతో సద్దుమణిగిన వివాదం ⇒ప్రియుడితో పాటు తల్లిదండ్రులపై కేసు నమోదు మహబూబాబాద్ రూరల్ : ప్రియుడు పెళ్లికి నిరాకరించడంతో మనస్థాపానికి గురైన ఓ యువతి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మహబూబాబాద్ మండలంలోని పర్వతగిరి గ్రామశివారు సోమ్లాతండాలో మంగళవారం జరిగింది. స్థానికులు, రూరల్ ఎస్సై పత్తిపాక జితేందర్ కథనం ప్రకారం... సోమ్లాతండాకు చెందిన బానోత్ లాలు, పద్మ దంపతుల కుమార్తె లలిత(19) ఇంటర్ వరకు చదువుకుని ఇంటి వద్దే ఉంటోంది. ఇదేతండాకు చెందిన బాదావత్ మంగ్యా, లక్ష్మీ దంపతుల కుమారుడు శరత్ 10వ తరగతి వరకు చదువుకుని ఖాళీగా ఉంటున్నాడు. లలిత, శరత్ నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. లలిత తనను పెళ్లి చేసుకోమని ఎన్నిసార్లు కోరినా అతడు వాయిదా వేస్తూ వచ్చాడు. దీంతో లలిత తల్లిదండ్రులు తండా పెద్దమనుషులను ఆశ్రయించి లలితకు న్యాయం చేయాలని కోరారు. పెద్దమనుషులు బాదావత్ శరత్ ఇంటికి వెళ్లి అతడి తల్లిదండ్రులను పెళ్లికి ఒప్పించే విధంగా చూశారు. అయినా వారు పెళ్లికి నిరాకరించారు. తన తండ్రి పెళ్లికి ఒప్పుకోవడం లేదు. ఈ క్రమంలో లలిత సోమవారం శరత్‌ను మహబూబాబాద్‌లో కలిసింది. తనను పెళ్లి చేసుకోమని వేడుకుంది. అయినా అతడు వినలేదు. దీంతో లలిత రైలుపట్టాలపైకి వెళ్లి ఆత్మహత్య చేసుకుంటానని చెప్పింది. ఆమె బంధువులు లలితను వారించి ఇంటికి తీసుకెళ్లారు. నాలుగేళ్లపాటు ఎంతో నమ్మకంతో ప్రేమించిన శరత్ పెళ్లికి నిరాకరించడంతో మంగళవారం ఉదయం 7 గంటల సమయంలో ఇంట్లోని ఫ్యాన్‌కు చీరతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. గమనించిన మృతురాలి కుటుంబ సభ్యులు లలిత మృతదేహాన్ని తీసుకువెళ్లి ప్రియుడు బాదావత్ శరత్ ఇంటి ఎదుట ఉంచి ఆందోళనకు దిగారు. లలిత మృతి చెందిన విషయం తెలుసుకున్న బాదావత్ శరత్, అతడి తల్లిద్రండులు మంగ్యా, లక్ష్మీ ఇంటికి తాళం వేసి పరారయ్యారు. జెడ్పీటీసీ సభ్యుడు మూలగుండ్ల వెంకన్న, టీడీపీ జిల్లా కార్యదర్శి భూక్య సునీత, పర్వతగిరి సర్పంచ్ గుగులోత్ వీరన్న, ఎంపీటీసీ సభ్యురాలు బాణోత్ కళ్యాణిహరిబాబు సంఘటన స్థలానికి చేరుకొని మృతురాలి కుటుంబ çసభ్యులను ఓదార్చారు. విషయం తెలుసుకున్న మహబూబాబాద్ రూరల్ ఎస్సై పత్తిపాక జితేందర్ అక్కడికి చేరుకుని మృతురాలి బంధువులతో మాట్లాడి శాంతింపజేశారు. లలిత మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతురాలి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్రియుడు బాదావత్ శరత్, తల్లిదండ్రులు మంగ్యా, లక్ష్మీపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు రూరల్ ఎస్సై తెలిపారు. -
ప్రతిభ ఉన్నా ప్రోత్సాహమేదీ..?
► వెయిట్ లిఫ్టింగ్‌లో రాణిస్తున్న లలిత ► పట్టించుకోని క్రీడాశాఖాధికారులు ► క్రీడా మంత్రి ఉన్నా అందని చేయూత నరసన్నపేట: నేతింటి లలిత.. నరసన్నపేట పట్టణానికి చెంది న ఈ వెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారిణి అడుగుపెట్టిన ప్రతి టోర్నీలోనూ పతకాలు కొల్లగొడుతూ శభాష్ అనిపించుకుంటోంది. నరసన్నపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అరకొర వసతులతో ఉన్న వ్యాయామ శాలలో శిక్షణ పొందుతూ రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో సత్తాచాటుతోంది. పలు పతకాలను కైవసం చేసుకుంటూ జిల్లా ఖ్యాతిని ఇనుమడింప చేస్తున్న నేతింటి లలితకు క్రీడాశాఖ అధికారుల నుంచి ప్రోత్సాహం కరువవుతోంది. పతకాలతో మెరుస్తున్నా కనీస ఆర్థిక సాయం చేయడం లేదు. కొంతమంది క్రీడాకారులకు అదే పనిగా నజరానాలు ప్రకటిస్తున్న ప్రభుత్వాలు, క్రీడా శాఖాధికారులు లలిత లాంటి పేద క్రీడాకారిణులకు భరోసా కల్పించలేకపోతున్నారు. క్రీడా శాఖ మంత్రి అచ్చెన్నాయుడు సొంత జిల్లాలోనే గ్రామీణ క్రీడాకారు ల పరిస్థితి ఇంత దయనీయంగా ఉంటే మిగిలిన జిల్లాల్లో పరిస్థితి ఎలా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. లలిత సాధించిన విజయాల్లో కొన్ని.. ఈ ఏడాది ఫిబ్రవరి 18, 19వ తేదీల్లో కృష్ణా జిల్లా గుడివాడలో జరిగిన రాష్ట్ర స్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో సీనియర్ విభాగంలో స్వర్ణ పతకం. పంజాబ్ రాష్ట్రం చండీఘడ్‌లో జనవరిలో జరిగిన అఖిలభారత విశ్వ విద్యాలయాల స్థాయి పోటీల్లో నాలుగో స్థానం. 2016 డిసెంబరులో భువనేశ్వర్‌లో జరిగిన ఓపెన్ జూనియర్ జాతీయ స్థాయి పోటీల్లో కాంస్య పతకం. నవంబర్‌లో విజయనగరంలో జరిగిన రాష్ట్ర స్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో సీనియర్, జూనియర్ విభాగాల్లో రెండు స్వర్ణ పతకాలు. 2015లో బీహార్ రాష్ట్రం పాట్నాలో గత ఏడాది జరిగిన జూనియర్ విభాగం పోటీల్లో మూడు కాంస్య పతకాలు. ఏలూరులో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో రెండు స్వర్ణ పతకాలు. ఈ విధంగా ప్రతి పోటీలోనూ పతకం సాధిస్తూ జిల్లా, రాష్ట్ర ఖ్యాతిని ఇనుమడింపజేస్తున్న లలితను ఆర్థి కంగా ఆదుకోవడానికి ప్రభుత్వం ముందుకు రావడంలేదు. ఇప్పటికైనా క్రీడాశాఖ అధికారులు స్పందించి ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు. అవార్డు ఇవ్వాలి లలిత నిరు పేదకుటుంబానికి చెందిన అమ్మాయి. మంచి శిక్షణ ఇస్తే మరిన్ని పతకాలు సొంతం చేసుకుని జిల్లా, రాష్ట్ర ఖ్యాతిని ఇనుమడింపజేస్తుంది. లలితను ఆర్థికంగా ఆదుకొని రాష్ట్ర మనీ అవార్డు ఇవ్వాలి. – అప్పలరామయ్య, జిల్లా వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్ జాయింట్ కార్యదర్శి స్టైఫండ్ ఇవ్వాలి ఒలింపిక్, ఇతర ప్రపంచ స్థాయి పోటీల్లో ఏమాత్రం ప్రతిభ చూపినా కాసులు కురిపిస్తున్నారు. జాతీయ, రాష్ట్ర స్థాయి పోటీల్లో బంగారు పతకాలు సాధిస్తున్నా క్రీడాకారులను పట్టించుకోవడం లేదు. గ్రామీణ క్రీడాకారులకు నెలవారీ స్టైఫండ్ ఇవ్వాలి. –గొద్దు చిట్టిబాబు, వైఎంసీఏ అధ్యక్షుడు, నరసన్నపేట -
యువతిపై సర్పంచ్, గ్రామస్తుల అమానుషం
జోద్పూర్: రాజస్తాన్ లో దారుణం చోటు చేసుకుంది. తన ఫాంలో చెట్లు నరకడాన్ని వ్యతిరేకించిన యువతిని అమానుషంగా హత్యచేశారు. జోధ్ పూర్ గ్రామంలో ఆదివారం ఈ సంఘటన జరిగింది. గ్రామానికి చెందిన లలిత (20)ను గ్రామ పెద్దలు, మరికొంతమంది గ్రామస్తులు సజీవ దహనం చేసిన ఘటన కలకలం రేపింది. పోలీసులు అందించిన సమాచార ప్రకారం జోధ్‌పూర్‌కు చెందిన గ్రామ సర్పంచ్ సహా కొంతమంది గ్రామస్తులు లలిత పొలంలో చెట్లను నరకడానికి ప్రయత్నించారు. దీన్ని ఆమె తీవ్రంగా ప్రతిఘటించడంతో ఉద్రిక్తత చెలరేగింది. రెచ్చిపోయిన వారు ఆమెపై మూకుమ్మడిగా దాడిచేశారు. అక్కడితో ఆగకుండా ఆవేశంతో విచక్షణ మరచి ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం లలిత కన్నుమూసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని పోలీసు అధికారి సురేష్ చౌదరి తెలిపారు. ముఖ్యంగా ఈ కేసులో ప్రధాన నిందితుడుగా భావిస్తున్న గ్రామ సర్పంచ్ రణవీర్ సింగ్, ఇతర గ్రామస్తులను విచారిస్తున్నట్టు చెప్పారు. విచారణ అనంతరం వారిని అదుపులోకి తీసుకుంటామన్నారు. -
శ్రీకరీ! శుభకరీ!
వినూత్న ఆధ్యాత్మిక కార్యక్రమలకు శ్రీకారం సహస్ర గళాలతో సహస్ర నామాల పారాయణకు సిద్ధమవుతున్న మహిళలు నలుగురు ఆడవాళ్లు ఒకచోట చేరితే, చీరలు, నగల గురించి మాట్లాడుకుంటారని లోకంలో ఓ అపప్రధ. 1960 దశకంలో పత్రికల్లో ప్రచురితమయ్యే కార్టూన్లకు ప్రధాన ముడిసరుకు ఆడవాళ్లే. అప్పడాలకర్రతో అతివ, గచ్చకాయంత బొడిపెతో భర్త కనిపించని కార్టూను ఉండేది కాదు. తదనంతరం ప్రారంభమైన ‘టీవీ సీరియళ్లకు అతుక్కుపోయే’ ఆడవారిపై కార్టూన్లు నేటికీ కొనసాగుతున్నాయి. నలుగురు ఆడవారు ఒకచోట చేరితే, సమాజానికి ఉపకరించే ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాలను మూడు దశాబ్దాలుగా సమర్థంగా నిర్వహించగలరని శ్రీకరి లలితామండలి నిరూపిస్తోంది. - రాజమహేంద్రవరం కల్చరల్ రాజమహేంద్రవరం, టి.నగర్లో నివసిస్తున్న గ్రంధి విజయలక్ష్మి పదోతరగతి చదువుకున్న ఓ మధ్యతరగతి మహిళ. చీకూచింతాలేని సంసారం. సమీపంలోని విశ్వేశ్వరస్వామి ఆలయానికి వెళ్లడం ఆమెకు అలవాటు. ఆమెకు మరో మధ్యతరగతి మహిళ పాలకోడేటి పద్మజ ఆలయంలో పరిచయమైంది. ఇద్దరూ కలసి పర్వదినాల్లో ఆలయంలో జరిగే సామూహిక పారాయణల్లో పాల్గొనేవారు. 1982లో గ్రంధి విజయలక్ష్మి వ్యవస్థాపకురాలిగా, ఏడుగురు మహిళలతో శ్రీకరి లలితామండలి ప్రారంభమైంది. మొదట్లో శ్రీకరి మహిళలలో జరిగే పారాయణల పరిధి పెరిగి, ఎవరు పిలిస్తే, వారింటికి వెళ్లి పారాయణలు చేయడం ప్రారంభించారు. మహిళల సంఖ్య ఏటా పెరుగుతూ వచ్చింది. ప్రస్తుతం ఈ సంఖ్య రెండు వందలు దాటింది. ‘ఇంతి’ంతై.. వటుడింతై 2009లో లక్ష కనకధారాపారాయణలు పూర్తి చేయాలని సంకల్పం కలిగింది. సుమారు ఒకటిన్నర సంవత్సరాల వ్యవధిలో లక్ష పారాయణలు పూర్తి చేశారు. పారాయణలు చేయమని జిల్లావ్యాప్తంగా ఆహ్వానాలు వచ్చాయి. అదే ఉత్సాహంతో వంద సౌందర్యలహరి పారాయణలు, 18 ఏకాదశలలో భగవద్గీతాపారాయణలు, వంద ఇళ్లలో వంద శివానందపారాయణలు శ్రీకరి మహిళలు పూర్తి చేశారు. అన్నమయ్య కీర్తనల శతగళార్చన, సహస్రగళార్చన, దశ సహస్రగళార్చనలు నిర్వహించారు. కొండవీటి జ్యోతిర్మయి దశసహస్రగళార్చనలో పాల్గొన్నారు. శ్రీవేంకటేశ్వరగానామృతం ఇప్పటి వరకు సుమారు 70 పారాయణలు పూర్తి చేశారు. ఏలూరు ప్రణవపీఠాధిపతి వద్దిపర్తి పద్మాకర్, ప్రచవన రాజహంస డాక్టర్ ధూళిపాళ మహాదేవమణి, భారతభారతి శలాక రఘునాథశర్మలు శ్రీకరి కార్యక్రమాల్లో పాల్గొని ఆశీస్సులను అందజేశారు. అంతేకాదు శ్రీకరీశాంకరీ సత్క్రియా సమ్మేళనం అనే ట్రస్టును స్థాపించి, సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. సహస్రగళాలతో సహస్రనామాలు ఈనెల 22వ తేదీ సాయంత్రం ఐదు గంటలకు రాజమహేంద్రవరం హిందూ సమాజంలో వేయిమందికి పైగా మహిళలు లలితాసహస్రనామపారాయణలో పాల్గొంటారు. వశిన్యాది వాగ్దేవతలుగా ఎనిమిదిమంది మహిళలు కొలువుతీరుతారు. లలితాసహస్రనామాలు రాయించి ఉన్న 12 అడుగుల చీరెను ప్రదర్శిస్తారు. ట్రస్టు ద్వారా దివ్యాంగులకు సేవలను అందిస్తారు. -
యువతి ఆత్మహత్య
అనంతపురం సెంట్రల్ : అనంతపురం సాయినగర్‌లో నివాసముంటున్న రామకృష్ణ, చిత్రలేఖ దంపతులు కుమార్తె లలిత(23) శుక్రవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత ఆత్మహత్య చేసుకున్నట్లు రెండో పట్టణ పోలీసులు తెలిపారు. డిగ్రీ వరకు చదివిన ఆమె కొంతకాంగా మానసికంగా ఇబ్బందిపడేదని, ఈ క్రమంలో తన రూంలో ఉరేసుకుని తనువు చాలించిందన్నారు. కేసు దర్యాప్తులో ఉంది. -
కలెక్టరేట్ ఎదుట కానిస్టేబుల్ భార్య ధర్నా
కరీంనగర్: భర్త వేధింపులు తాళలేక ఓ కానిస్టేబుల్ బార్య కలెక్టరేట్ ఎదుట ధర్నాకు దిగింది. కరీంనగర్ జిల్లా జమ్మికుంటకు చెందిన కానిస్టేబుల్ శ్రీకాంత్ గత కొన్ని రోజులుగా భార్య లలితను వేధింపులకు గురిచేస్తున్నాడు. దీంతో విసిగిపోయిన లలిత పిల్లలతో కలిసి గురువారం కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు దిగింది. తనకు న్యాయం జరిగే వరకు కలెక్టరేట్ ఎదుటే కూర్చుంటానని పట్టుబట్టింది. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఆమె నుంచి వివరాలు సేకరిస్తున్నారు. -
లలితాదేవికి మహాభోగ నివేదన
దుర్గాడ (గొల్లప్రోలు) : స్థానిక ఉమా రామలింగేశ్వరస్వామి ఆలయంలో ఆదివారం దుర్గాష్టమిని పురస్కరించుకుని లలితాదేవికి 108 రకాలతో తయారు చేసిన పిండివంటలతో మహాభోగ నివేదన చేశారు. గ్రామంలోని మహిళలు వీటిని తయారుచేసి ప్రసాదంగా అందజేశారు. ఆలయ పండితుడు చెరుకూరి వీరబాబు మాట్లాడుతూ గ్రామం సుభిక్షంగా ఉండాలని, అందరికీ ఆహారం, పాడిపంటలు సమృద్ధిగా కలగాలని కోరుతూ ఈ భోగ నివేదన చేసినట్టు తెలిపారు. అమ్మవారికి సోమవారం పండ్లతో, మంగళవారం పూలతో అభిషేకం చేయనున్నట్టు చెప్పారు. -
కుమార్తె మృతితో ఆవేదన..తండ్రి ఆత్మహత్య
కుమార్తె అకాల మరణంతో మనస్తాపానికి గురైన తండ్రి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన చిలకలగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పార్శిగుట్ట సంజీవపురంనకు చెందిన పి. బాలకృష్ణ (30), లలిత దంపతులకు పవిత్ర (09). ప్రత్యుష (08) అనే కుమార్తెలున్నారు. అస్వస్థతకు గురైన పవిత్ర గతనెల 12వ తేదిన మృతి చెందింది. అప్పటి నుంచి బాలకృష్ణ మనస్తాపానికి గురై మద్యానికి బానిసయ్యాడు. మరో కుమార్తె ప్రత్యూషతోపాటు ఆత్మహత్య చేసుకుందామని భార్య లలితతో తరచూ అనేవాడు. ఈ క్రమంలో ఈనెల 13వ తేదీన లలిత తన కుమార్తెను తీసుకుని రాంనగర్లో ఉంటున్న సోదరి ఇంటికి వెళ్లింది. ఎన్నిసార్లు ఫోన్ చేసినా బాలకృష్ణ లిఫ్ట్ చేయకపోవడంతో 14వ తేదీ ఉదయం ఇంటికి వచ్చింది. లోపలకు తలుపు గడియపెట్టి ఉంది. అనుమానం వచ్చి కిటికీ నుంచి చూడగా భర్త చున్నీతో సీలింగ్‌ఫ్యాను ఉరివేసుకుని వేలాడుతు కనిపించాడు. భార్య లలిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని, కుమార్తె మృతితో మనస్తాపానికి గురై బాలకృష్ణ ఆత్మహత్యకు పాల్పడినట్లు ప్రాధమిక దర్యాప్తులో తేలిందని పోలీసులు తెలిపారు. -
'అమ్మా' రక్షించు.. శివశంకర్ మాస్టర్ విన్నపాలు!
చెన్నై: తెలుగు ప్రేక్షకులకు శివశంకర్ మాస్టర్ గా సుపరిచితమైన డ్యాన్స్ మాస్టర్, కొరియోగ్రాఫర్... శివశంకర్.. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు లేఖ రూపంలో విన్నపాలను పంపారు. తమ కుటుంబానికి ఆత్మ హత్య చేసుకోవడం తప్పించి మరో దారి లేదని, తమ కేసును ముఖ్యమంత్రి స్వయంగా పరిశీలించే ప్రయత్నం చేయాలంటూ ఆయన తన లేఖలో తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తనదైన శైలిలో.. ప్రత్యేక అభినయంతో.. సూపర్ ఛాలెంజ్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన డ్యాన్స్ మాస్టర్, కొరియోగ్రాఫర్ శివశంకర్ ప్రసాద్ కష్టాల్లో పడ్డట్టు తెలుస్తోంది. ఆయన కుమారుడు విజయ కృష్ణ ప్రసాద్ తో భార్య జ్యోతి... విడాకులు తీసుకున్నప్పటికీ తమపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తోందని, తమ కుటుంబాన్ని ఇబ్బందులకు గురి చేస్తోందంటూ ఆయన అమ్మకు (తమిళనాడు సీఎం జయలలిత) రాసిన ఉత్తరంలో తన గోడును వెళ్ళబోసుకున్నారు. చట్ట ప్రకారం విడాకులు తీసుకుని మరీ తమను ఏడిపించాలని చూస్తోందని, పది కోట్లు చెల్లించాలని డిమాండ్ చేయడంతోపాటు, తమ కుటుంబంపై తప్పుడు కేసులు పెట్టి ఇంటిని లాక్కోవాలని చూస్తోందంటూ జయలలితకు శివశంకర్ ప్రసాద్ లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు. 2013 సంవత్సరంలో శివశంకర్ మాస్టారి కుమారుడు విజయశంకర్ ప్రసాద్ బెంగళూరుకు చెందిన జ్యోతిని వివాహం చేసుకున్నాడు. అనంతరం ఇద్దరి మధ్యా వచ్చిన విభేదాలతో డైవర్స్ తీసుకున్నారు. అయితే అప్పట్నుంచీ శివశంకర్ మాస్టారి కుటుంబాన్ని పలు రకాలుగా వేధిస్తున్న జ్యోతి... తాజాగా వారిపై కేసు పెట్టింది. ఇటీవల తమ ఇంటిముందు ఆందోళనకు దిగి పదికోట్ల డబ్బును డిమాండ్ చేసిందని, ఆమె టార్చర్ భరించలేక తమ కుటుంబం కొన్ని రోజులపాటు అజ్ఞాతంలోకి పోవాల్సిన పరిస్థితి వచ్చిందని శివశంకర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా తమ కుటుంబంపై అక్రమ కేసును బనాయించిందని, ఈ విషయంలో ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధ వహించి తగిన చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని, లేదంటే కుటుంబం మొత్తం ఆత్మ హత్య చేసుకోవడం తప్ప మరోదారి లేదని తెలిపారు. మరి మాస్టారి విషయంలో అమ్మ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. -
కిడ్నాపైన బాలిక ఆత్మహత్య
హైదరాబాద్‌లో మూడు రోజుల క్రితం కిడ్నాపైన లలిత(13) అనే బాలిక సోమవారం తెల్లవారుజామున ఆత్మహత్య చేసుకుంది. గుర్తుతెలియని దుండగులు బాలికను కిడ్నాప్ చేసి కారులో తరలిస్తుండగా మహబూబ్‌నగర్ జిల్లాలో ట్రాఫిక్ పోలీసులు రక్షించారు. అనంతరం పోలీసులు మహబూబ్‌నగర్ జిల్లా దామరగిడ్డ మండలం బొమ్మన్‌పాడు గ్రామంలో ఉన్న తల్లిదండ్రులకు అప్పగించారు. అయితే తర్వాత ఏమైందో తెలీదు కానీ.. బాలిక సోమవారం ఉదయం ఉరికి వేలాడుతూ కనపడింది. బాలిక తల్లిదండ్రులు హైదరాబాద్‌లో కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
వ్యక్తి అనుమానాస్పద మృతి..
- ఆలస్యంగా వెలుగుచూసిన ఘటన కొల్చారం(మెదక్) ఒక వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన మెదక్ జిల్లా కొల్చారం మండలం ఎనగండ్ల గ్రామ శివారులో సోమవారం ఆలస్యంగా వెలుగుచూసింది. మెదక్ రూరల్ సీఐ రామక్రిష్ణ, కొల్చారం ఎస్సై రమేష్‌నాయక్ గ్రామస్థుల కథనం ప్రకారం... ఎనగండ్ల గ్రామానికి చెందిన మంగలి గణేష్(35) ఐదేళ్లుగా భార్య లలిత, ఇద్దరు కుమారులతో కలిసి పటాన్ చెరువుకు సమీపంలోని బీరంగూడలో కూలిపని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. స్వగ్రామంలోని సొంతిల్లు కూలిపోవటంతో కొత్త ఇంటి నిర్మాణం కోసం దరఖాస్తు పెట్టి వస్తానంటూ నాలుగు రోజుల క్రితం బీరంగూడ నుంచి ఎనగండ్లకు వెళ్లాడు. మూడు రోజులవుతున్నా భర్త జాడ కానరాకపోవడం, ఫోన్‌చేసినా సమాచారం లేకపోవడంతో లలిత పిల్లలతో కలిసి ఆదివారం ఎనగండ్ల గ్రామానికి చేరుకుంది. ఈ క్రమంలోనే గ్రామ శివారులోని దామర చెరువు వద్ద పొదల్లో గణేష్ మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. పోలీసులు అక్కడికి చేరుకొని గణేష్ మృతదేహాన్ని పరిశీలించారు. గణేష్ మెడ, పొట్ట భాగంలో కత్తిపోట్ల ఆనవాళ్లున్నాయి. డ్వాగ్‌స్వ్కాడ్‌ను రప్పించగా అది మృతదేహం వద్ద నుంచి లలిత వద్దకు వచ్చి ఆగిపోయింది. ఈ మేరకు ఎస్సై రమేష్‌నాయక్ కేసు నమోదు చేసుకొని శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం మెదక్ ఏరియా ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
లలిత వర్సెస్ హైమావతి
► ఎస్‌కోట టీడీపీలో ఆధిపత్యపోరు ► నామినేటెట్ పదవుల్లో లలితకుమారి హవా ► జీర్ణించుకోలేకపోతున్న హైమావతి వర్గీయులు ► జెంటిల్మన్ ఒప్పందం అమలుపైనా అనుమానాలు టీడీపీలో ఆధిపత్యపోరు చాపకింద నీరులా సాగుతోంది. ఇప్పుడిప్పుడే అన్ని నియోజకవర్గాలకూ అది పాకుతోంది. తాజాగా ఎస్‌కోట నియోజకవర్గంలో ఈ విషయాలు కాస్తా బహిర్గతమవుతున్నాయి. అక్కడి ఇంతుల మధ్య పోరు రసవత్తరంగానే ఉంది. ఎవరికి వారే తమ పట్టుకోసం తీవ్రంగా పోటీపడుతున్నారు. పైచేయి సాధించేందుకు అంతర్గతంగా పావులు కదుపుతున్నారు. వీరి మధ్య వైరం గతంలో జరిగిన జెంటిల్మన్ ఒప్పందం అమలుపైనా పడుతుందేమోనని ఆశావహులు ఆందోళన చెందుతున్నారు. సాక్షి ప్రతినిధి, విజయనగరం : శృంగవరపుకోట టీడీపీలో అంతర్గత పోరు నడుస్తోంది. ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి, మాజీ ఎమ్మెల్యే శోభా హైమావతి మధ్య విభేదాలు తీవ్రమవుతున్నాయి. తాజాగా జరుగుతున్న నామినేటేడ్ పదవుల నియామకాలు వారి మధ్య ప్రచ్ఛన్న యుద్ధానికి దారితీస్తున్నాయి. జెడ్పీ చైర్పర్సన్ పదవిలో ఉన్నది తన కుమార్తె అయినప్పటికీ హైమావతి మాట చెల్లుబాటు కావడంలేదు. నియోజకవర్గంలో ఎమ్మెల్యే లలితకుమారి పెత్తనమే సాగుతోంది. ఈ పరిణామాలు శోభా వర్గీయుల్ని కలవర పెడుతోంది. ఆదినుంచీ వైరమే... తొలి నుంచి వీరి మధ్య విభేదాలున్నాయి. సాధారణ ఎన్నికల్లో ఎమ్మెల్యే టిక్కెట్కోసం గట్టీ పోటీ నడిచింది. జెడ్పీ ఎన్నికలు రావడం... నీకొకటి- నాకొకటి అన్న రీతిలో పదవుల పంపకాలు జరగడంతో వివాదం సద్దుమణిగింది. హైమావతి కుమార్తె స్వాతిరాణి జెడ్పీ చైర్పర్సన్ అయ్యాక ఎస్‌కోట నియోజకవర్గంలో పాగా వేసేందుకు పావులు కదిపారు. ఎస్‌కోట, వేపాడ మండలాల్ని తమకే వదిలేయాలని పరోక్ష సంకేతాలు పంపించారు. కానీ, ఎమ్మెల్యే లలితకుమారి ససేమిరా అన్నారు. అయినప్పటికీ చాపకింద నీరులా ఆ రెండు మండలాల్లో హైమావతి వర్గమే ఆధిపత్యం సాగిస్తోంది. దీంతో ఇద్దరి మధ్య వివాదాలు అంతర్గతంగా ముదిరి ఒకరిపై ఒకరు పరోక్షంగా దెబ్బకొట్టుకుంటూనే ఉన్నారు. ఎస్‌కోట పంచాయతీ సర్పంచ్ చెక్ పవర్ రద్దు, వేపాడ, కొత్తవలస మండల పరిషత్ కార్యాలయాల్లో పలు వివాదాలకు ఆధిపత్య పోరే కారణమని పెద్ద ఎత్తున విమర్శలు ఉన్నాయి. నామినేటెడ్‌లో కోళ్ల హవా... తాజాగా నామినేటెడ్ పదవుల పోరుకు తెరలేచింది. కొత్తవలస వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పోస్టు కోసం అటు ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి, ఇటు శోభా హైమావతి చెరొకరిని ప్రతిపాదించారు. లక్కవరపుకోట మండలం గొలజాంకు చెందిన ఏరువాక సులోచనను లలితకుమారి, కొత్తవలస మండలం అప్పన్నపాలేనికి చెందిన తిక్కాన చినదేముడును హైమావతి ప్రతిపాదించారు. కానీ, ఎమ్మెల్యే తనుకున్న పలుకుబడిని ఉపయోగించి పంతాన్ని నెగ్గించుకున్నారు. దాదాపు పాలకవర్గం మొత్తం ఆమె ప్రతిపాదించిన వారే. తాజాగా జామి ఎల్లారమ్మ, ధర్మవరం సన్యాసయ్య ఆలయ కమిటీలను వేశారు. ఇక్కడా ఎమ్మెల్యే సిఫార్సులే పనిచేశాయి. త్వరలో ఖరారు చేయనున్న పుణ్యగిరి దేవస్థానం కమిటీలోనూ ఆ వర్గానికే చోటు కల్పించినట్టు తెలుస్తోంది. ఈ పరిణామాలు హైమావతి వర్గీయులు తట్టుకోలేకపోతున్నారు. జెడ్పీని ఖాతరు చేయకుండా... అభివృద్ధి పనుల విషయంలోనూ ఎమ్మెల్యే ఓవర్ టేక్ చేస్తున్నారు. జెడ్పీతో పనిలేకుండా నేరుగా మంత్రి, కలెక్టర్ ద్వారా చేయించుకున్నారు. ఉపాధి హామీ మెటీరియల్ కాంపోనెంట్ పనుల్నీ పెద్ద ఎత్తున మంజూరు చేయించుకున్నారు. అంతేకాకుండా మాజీ జెడ్పీ చైర్పర్సన్ లగుడు సింహాద్రిని తన వర్గంగా చేసుకుని, నియోజకవర్గంలో చక్రం తిప్పే ప్రయత్నం చేస్తున్నారు. లగుడు సింహాద్రికి ప్రత్యర్థిగా జామి జెడ్పీటీసీ పెదబాబును హైమావతి వర్గీయులు దించినప్పటికీ హవా మాత్రం సాగించలేకపోతున్నారు. ఈ వ్యవహారం కాస్తా చినబాబు దృష్టికి వెళ్లేలా ఉంది. జెంటిల్మన్ ఒప్పందంపై అనుమానాలు వీరిమధ్య పోరు ఎస్‌కోట, జామి ఎంపీపీ పదవులకోసం చేసుకున్న జెంటిల్మెన్ ఒప్పందం అమలుపై ప్రభావం చూపే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆ ఎంపీపీ పదవుల్ని చెరో రెండున్నరేళ్లు చేపట్టేలా రెండువర్గాలూ ఒప్పందం చేసుకున్నారు. ఎస్‌కోటలో హైమావతికి చెందిన రెడ్డి వెంకన్న, జామిలో లలితకుమారికి చెందిన సరసాన అప్యయ్యమ్మ ఎంపీపీలుగా తొలుత నియమితులయ్యారు. రెండున్నరేళ్ల గడువు సమీపించడం, వీరి మధ్య అంతర్గత పోరు తీవ్రమవ్వడంతో జెంటిల్మెన్ ఒప్పందం అమలుపై అనుమానాలు నెలకొంటున్నాయి. ఆ పదవులకోసం ఎస్‌కోటలో రాయవరపు చంద్రశేఖర్, జామిలో ఇప్పాక చంద్రకళ ఎదురు చూస్తున్నారు. ఎప్పుడేమవుతుందోనన్న భయం ఆశావహులకు పట్టుకుంది. -
రైలు కింద పడి బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య
కరీమాబాద్: వరంగల్ రైల్వేస్టేషన్ సమీపంలోని చింతల్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ సమీపంలో గురువారం బీటెక్ విద్యార్థిని రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుంది. వరంగల్ జీఆర్పీ ఎస్సై పి. శ్రీనివాస్ కథనం ప్రకారం.. నల్లగొండ జిల్లా మట్టపల్లి మండలం రాంచంద్రాపూర్ గ్రామానికి చెందిన రూపావత్ లలిత(19) కాకతీయ యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాలలో ప్రథమ సంవత్సరం బీటెక్ (ఈసీఈ) చదువుతోంది. యూనివర్సిటీ సమీపంలోని జాగృతి హాస్టల్లో ఉంటోంది. గురువారం ఉదయం హాస్టల్లో టిఫిన్ చేసి బయటకు వచ్చిన లలిత చింతల్ ఫ్లైవర్ బ్రిడ్జి వద్ద సుమారు 10.30 గంటలకు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుంది. లలిత ఎందుకు ఆత్మహత్య చేసుకుందో తెలియరాలేదు. మృతదేహం వద్ద దొరికిన సిమ్ ఆధారంగా పోలీసులు లలిత అన్నయ్య రమేష్‌కు ఫోన్ చేసి సమాచారమిచ్చారు. కేసు నమోదు చేసి, మృతదేహాన్ని ఎంజీఎం మార్చురీకి తరలించినట్లు ఎస్సై తెలిపారు. లలిత ఆత్మహత్య చేసుకునే ముందు చాలాసేపు ఎవరితోనో ఫోన్లో మాట్లాడినట్లు తెలిసింది. -
వివాహిత దారుణ హత్య
భీమ్‌గల్: నిజామాబాద్ జిల్లాలో గురువారం ఓ వివాహిత దారుణ హత్యకు గురైంది. భీమ్‌గల్ మండలం మెండోరా శివారులోని ఈర్లగుట్ట వద్ద దుండగులు గొంతుకోసి మహిళను అత్యంత కిరాతకంగా హతమార్చారు. మృతురాలు కమ్మర్పల్లి మండలం మానాల గ్రామానికి చెందిన లలిత(35)గా పోలీసులు గుర్తించారు. లలిత గత నెల 12 వ తేదీ నుంచి కనపడటం లేదని స్థానిక పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సంఘటనాస్థలాన్ని డీఎస్పీ ఆకుల రాంరెడ్డి, సీఐ రమణారెడ్డి పరిశీలించారు. -
కన్నీటి ’సారిక’లు!
-
కన్నీటి ’సారిక’లు!
పోచమ్మమైదాన్: అశ్రునయనాల మధ్య వరంగల్‌లో మాజీ ఎంపీ రాజయ్య కోడలు సారిక, మనవళ్ల అంత్యక్రియలు ముగిశాయి. విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో నగరంలోని పోతన శ్మశాన వాటికలో దహన సంస్కారాలు చేశారు. గురువారం మధ్యాహ్నం ఎంజీఎం ఆస్పత్రిలో మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తరుున తర్వాత ఆస్పత్రి నుంచి శ్మశాన వాటిక వరకు అంతిమయాత్ర నిర్వహించారు. మహిళలు, స్థానికులు పెద్దఎత్తున పాల్గొన్నారు. రాజయ్య కుటుంబాన్ని కఠినంగా శిక్షించాలి.. కాంగ్రెస్ నుంచి సస్పెండ్ చేయాలి అని నినదించారు. సాయంత్రం 5.15 గంటలకు సారిక చితికి తల్లి లలిత నిప్పంటించారు. తర్వాత అభినవ్, శ్రీయాన్, అయాన్ మృతదేహాలను ఖననం చేశారు. మనవళ్లను ఖననం చేశాక లలిత బిగ్గరగా రోదిస్తూ కుప్పకూలిపోయింది. అంత్యక్రియలలో సారిక సోదరి అర్చన, కుటుంబ సభ్యులు, విశ్వబ్రాహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎర్రోజు భిక్షపతి, మహిళా సంఘం నేతలు పాల్గొన్నారు. అంతకుముందు ఎంజీఎం ఆస్పత్రి మార్చురీ వద్ద సారిక తల్లిని మహాజన సోషలిస్టు పార్టీ అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ పరామర్శించారు. సారిక మృతిపై సీబీఐ విచారణ చేరుుంచాలని ఆయన డిమాండ్ చేశారు. -
సారిక చితికి నిప్పంటించిన తల్లి
-వరంగల్‌లోనే రాజయ్య కోడలు, మనువళ్లు అంత్యక్రియలు -అంత్యక్రియలు నిర్వహించిన విశ్వబ్రాహ్మణులు -భారీగా తరలివచ్చిన మహిళలు, స్థానికులు -రాజయ్యకు వ్యతిరేకంగా నినాదాలు పోచమ్మమైదాన్ : వరంగల్ నగరంలోని పోతన స్మశాన వాటికలో మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య కోడలు సారిక, మనువళ్లు అభినవ్, శ్రీయాన్, అయాన్ మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించారు. విశ్వ బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో పోతన స్మశాన వాటికలో అంత్యక్రియలు చేశారు. ఎంజీఎం ఆస్పత్రిలో మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తయిన తర్వాత ఆస్పత్రి నుంచి స్మశానవాటిక వరకు అంతిమ యాత్ర నిర్వహించారు. ఈ అంతిమ యాత్రలో మహిళలు, స్థానికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రాజయ్య కుటుంబాన్ని కఠినంగా శిక్షించాలి... కాంగ్రెస్ పార్టీ నుంచి రాజయ్యను సస్పెండ్ చేయాలి అంటూ నినాదాలు చేశారు. మానవత్వం కలిగిన వారందరూ ఆ నలుగురుకి ఆత్మ బంధువులు అయ్యారు. కుతురు సారికకు తల కొరివి పెట్టేందుకు కుండ పట్టుకుని అంతమయాత్రలో తల్లి లలిత సాగుతుంటే అందరూ దుఃఖసాగరంలో మునిగిపోయారు. సాయంత్రం సారిక చితికి తల్లి లలిత నిప్పు అంటించారు. తరువాత అభినవ్, శ్రీయాన్, అయాన్ మతదేహాలను ఖననం చేశారు. మనువళ్లను ఖననం చేశాకా లలిత బిగ్గరగా రోధిస్తూ కుప్పకూలిపోయింది. అత్యక్రియలలో సారిక సోదరి అర్చన, కుటుంబ సభ్యులు, విశ్వబ్రాహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఏర్రోజు బిక్షపతి, సోల్లేటి కష్ణమాచార్యులు, కట్ట ఈశ్వరాచారి, చిట్టిమల్ల రమేశ్ బాబు, కలకోట భాస్కరచారి, గన్నోజు జగన్, కర్ణకంటి కమార్, కొక్కోండ రవి, శ్రీరాముల సతీష్, బెజ్జంకి విశ్వనాథం, సత్యనారాయణ, బండ్ల సురేందర్, మహిళా సంఘం నాయకురాలు ఇందిర పాల్గొన్నారు. అంతకుముందు ఎంజీఎం ఆస్పత్రి మార్చురీ వద్ద సారిక తల్లిని మహాజన సోషలిస్టు పార్టీ అధ్యక్షుడు మంద కష్ణమాదిగ పరామర్శించారు. సారిక మతిపై సీబీఐ చేత విచారణ చేయించాలని ఆయన డిమాండ్ చేశారు. -
ముగ్గురు పిల్లలతో తల్లి ఆదృశ్యం
చిలకలగూడ: తనకున్న ముగ్గురు పిల్లలతో కలిసి తల్లి అదశ్యమైన ఘటన హైదరాబాద్ నగరం చిలకలగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం జరిగింది. ఎస్ఐ భాస్కర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. చిలకలగూడ దూద్‌బావికి చెందిన ధనరాజ్, లలిత (27) భార్యాభర్తలు. వీరికి కిరణ్మయి (7), దివ్యశ్రీ (5), శాంతి (3) అనే ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. ధనరాజ్ పెయింటర్‌గా పనిచేస్తుండగా, లలిత పంజాగుట్టలోని కాల్‌సెంటర్ ఉద్యోగి. ముగ్గురు పిల్లలు, ఇంటిపనితోపాటు ఉద్యోగం చేయడం కష్టం కనుక ఉద్యోగం మానేయాలని ధనరాజ్ కోరాడు. ఈ విషయమై భార్యాభర్తల మధ్య వివాదం కొనసాగుతుంది. ఈ క్రమంలో ఈనెల 18వతేదీ ఉదయం 8 గంటలకు ముగ్గురు పిల్లలను తీసుకుని బయటకు వెళ్లిన లలిత తిరిగి ఇంటికి చేరలేదు. సన్నిహితులు, బంధుమిత్రులతో పాటు కాల్‌సెంటర్ యాజమాన్యాన్ని వాకబు చేసినా ఫలితం లేకపోవడంతో ధనరాజ్ ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని, లలిత ఆచూకీ తెలిస్తే పోలీసులకు సమాచారం అందించాలని ఎస్ఐ భాస్కర్‌రెడ్డి కోరారు. -
లలిత, వికాస్ గౌడలకు స్వర్ణాలు
ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ వుహాన్ : ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ మూడో రోజు భారత్‌కు రెండు స్వర్ణాలు, ఓ రజతం దక్కాయి. శనివారం జరిగిన 3000మీ. స్టీపుల్‌చేజ్‌లో లలితా బాబర్ 9:34.13సె. టైమింగ్‌తో జాతీయ రికార్డును సవరిస్తూ స్వర్ణం కొల్లగొట్టింది. దీంతో రియో ఒలింపిక్స్‌కు కూడా 26 ఏళ్ల లలితా అర్హత సాధించింది. మరోవైపు 2013లోనూ స్వర్ణం సాధించిన డిస్కస్ త్రోయర్ వికాస్ గౌడ ఈసారి కూడా తన పతకాన్ని నిలబెట్టుకున్నాడు. 62.03మీ. దూరం డిస్క్ విసిరి తొలి స్థానంలో నిలిచాడు. 10 వేల మీ. రేసులో జి.లక్ష్మణన్ 29:42.81సె.లో గమ్యం చేరి రజతం సాధించాడు. పురుషుల 200మీ. రేసులో ధరమ్వీర్ సింగ్, శ్రబాని నందా.. మహిళల 200మీ. రేసులో టింటూ లూకా, గోమతి ఫైనల్స్‌కు అర్హత సాధించారు. -
గృహిణిని బలితీసుకున్న వేధింపులు
అనుమానాస్పదస్థితిలో వివాహిత మృతి భర్త, అత్తలే కారణం : తల్లిదండ్రులు చైతన్యపురి(హైదరాబాద్) : అనుమానాస్పదస్థితిలో వివాహిత మృతి చెందింది. ఆత్మహత్య చేసుకుందని అత్తింటివారు అంటుండగా.., భర్త, అత్త, ఆడపడుచులు, ఎస్సైగా పని చేస్తు న్న ఆ ఇంటి అల్లుడి వేధింపులతోనే ఆమె చని పోయిందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. హైదరాబాద్‌లోని చైతన్యపురి పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. స్థానికులు, మృతురాలి బంధువు లు, పోలీసుల కథనం ప్రకారం.. వరంగల్ జిల్లా నెల్లికుదురు మండలం నైనాల గ్రామానికి చెందిన ఉపాధ్యాయుడు చట్ల నర్సయ్య-అనసూయ దంపతుల కుమార్తె లలిత(24) ఎమ్మెస్సీ పూర్తి చేసింది. ఈమెకు గతేడాది ఫిబ్రవరి 9న నల్లగొండ జిల్లాకు చెందిన అక్కినపల్లి సుమన్(29)తో వివాహమైంది. ఆ సమయం లో రూ.10 లక్షలు, బంగారం, ఫ్లాట్ కట్నంగా ఇచ్చారు. సుమన్ వికారాబాద్‌లో అటవీశాఖ లో ఎఫ్ఎస్ఓగా పని చేస్తున్నాడు. మారుతినగ ర్ సత్యానగర్‌లో ఇల్లు అద్దెకు తీసుకుని కాపు రం పెట్టారు. సుమన్ తల్లి రామలింగమ్మ, సోదరి చైతన్య వీరి వద్దే ఉంటున్నారు. పెళ్లైన దగ్గర నుంచి సూటిపోటి మాటలతో లలితను భర్త, అత్త, ఆడపడుచు వేధిస్తున్నారు. ఇటీవలే పదోన్నతి వచ్చిన సుమన్ అదనపు కట్నం కావాలని లలితను వేధిస్తున్నాడు. నెల క్రితం లలితపై చే యి చేసుకోవటంతో గాయపడింది. విషయం తెలుసుకున్న ఆమె తల్లిదండ్రులు వచ్చి సరూర్‌నగర్ మహిళా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కౌన్సెలింగ్ చేసిన పోలీసులు రాజీ కుదిర్చి పంపించారు. వారం రోజులు లలితను తమ వెంట తీసుకెళ్లి తిరిగి 15 రోజుల క్రితం భర్త వద్ద వదిలి వెళ్లారు. ఆ సమయంలో కూడా ఇరు కుటుంబాల మధ్య గొడవ జరిగింది. లలిత వద్ద సెల్‌ఫోన్ లేకపోతేనే కాపురం చేస్తానని, లేదంటే మళ్లీ తిరిగి పంపివేస్తానని సుమన్ షరతు పెట్టాడు. ఇంట్లో ఏదైనా గొడవ జరిగినా పక్కింటి వారిని కూడా ఫోన్ ఇవ్వవద్దని సుమన్ బెదిరించాడు. ఇదిలా ఉండగా.. గురువారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో లలిత అనుమానాస్పదస్థితిలో చీరతో ఫ్యాన్‌కు ఉరేసుకుని మృతి చెంది ఉంది. స్థానికుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. భర్త సుమన్, అత్త రామలింగమ్మను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వేధింపుల వల్లే చనిపోయింది..: తల్లిదండ్రులు లలిత ఆత్మహత్య చేసుకుందన్న విషయం తెలుసుకుని ఆమె తల్లిదండ్రులు నర్సయ్య, అనసూయ హుటాహుటిన నగరానికి వచ్చారు. లలిత మృతదేహాన్ని చూసి గుండెలు బాదుకుంటూ రోదించారు. పెళ్లైనప్పటి నుంచీ రకరకాలుగా వేధించటం వల్లే తమ బిడ్డ చనిపోయిందని వారు ఆరోపించారు. ప్రమోషన్ వచ్చింది.. ఇల్లు కొనుగోలు చేయటానికి రూ.20 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తే ఇప్పట్లో ఇవ్వలేమని చెప్పినట్టు వారు ఆరోపించారు. అన్యాయంగా తమ బిడ్డను పొట్టన పెట్టుకున్నారని నిందితులను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. ఎస్సై అండ చూసుకునే.. సుమన్ బావ వసంత్‌కుమార్ అల్వాల్‌లో ఎస్సైగా పని చేస్తున్నాడని, అతని అండ చూసుకునే తమను నానా రకాలుగా ఇబ్బందులు పెట్టారని లలిత తల్లిదండ్రులు ఆరోపించారు. మహిళా పోలీస్‌స్టేషన్ ఫిర్యాదు చేసినప్పుడు కూడా తమను వసంత్‌కుమార్ బెదిరించాడని.. మమ్మల్ని ఎవ్వరూ ఏమీ చేయలేరని అన్నాడని వారు తెలిపారు. కాలనీ పెద్దల సమక్షంలో జరిగిన పంచాయతీలో కూడా తమను బెదిరించాడన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించి కేసు నమోదు చేసినట్లు ఎస్సై సత్యనారాయణ తెలిపారు. -
ఇప్పటికీ నాతో ఆ పాట పాడించుకుంటూ ఉంటారు!
రావు బాలసరస్వతి, తొలితరం సినీ, లలిత సంగీత గాయని - నటి రజనీకాంతరావు గారి పేరు చెప్పగానే సినిమాల్లో, రేడియోలో ఆయన చేసిన కృషి, ఆయన రచనలు, నేను పాడిన పాటలు అన్నీ గుర్తుకువస్తాయి. ఇప్పటికి 75 ఏళ్ళ క్రితం నుంచి ఆయన మాట, పాట - అన్నీ పరిచయమే. నా కన్నా ఆయన ఎనిమిదిన్నరేళ్ళు పెద్ద. ఆ రోజుల్లో ఆయన సంగీతం కూర్చిన సినిమాల్లో నేను పాడింది తక్కువే అయినా, ఆ పాటలకు మంచి పేరు రావడం ఇప్పటికీ సంతోషం అనిపిస్తుంటుంది. ప్రసిద్ధ దర్శక - నిర్మాత వై.వి. రావు ‘మానవతి’ చిత్రానికి రజని సంగీత దర్శకుడు. ఆయన స్వీయ సాహిత్య, సంగీతాల్లో ఆ సినిమాకు తయారైన పాటల్లో నేను పాడిన ‘తన పంతమె తావిడువడు...’ ఇవాళ్టికీ ఆ తరం వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. ఆ పాటకు రజనీ బాగా వరుస కట్టారనీ, నేను బాగా పాడాననీ పేరొచ్చింది. తరువాత గోపీచంద్ దర్శక త్వంలో జగ్గయ్యతో రూపొందిన ‘ప్రియురాలు’ చిత్రానికీ రజని సంగీత దర్శకులు. దానికి ఆయన చేసిన వరుసల్లో నేనూ పాడాను. అయితే, రజనీ గారు సినిమాల్లో స్థిరపడలేదు. ఆకాశవాణిలో ఆయన సంగీత, సాహిత్య ప్రాభవం ఎక్కువగా బయటకు వచ్చింది. ఆయన రేడియో కోసం రాసి, బాణీ కట్టిన పాటలు కూడా పాడాను. ఆ రోజుల్లో సాలూరి రాజేశ్వరరావు గారు, నేను కలసి చాలా లలిత గీతాలు పాడేవాళ్ళం. రజని రాసిన ‘కోపమేల రాధ... దయ చూపవేల నాపై...’ పాట కూడా రాజేశ్వరరావు, నేను పాడితే రికార్డుగా వచ్చింది. దానికి, రాజేశ్వరరావు సంగీతం కూర్చారు. వ్యక్తిగతంగానూ రజని చాలా నెమ్మదైన వ్యక్తి. మంచి మనిషి. ఎంతో ప్రతిభ ఉన్నా, దాన్ని తలకెక్కిం చుకోని మనిషి. గాయకులకు చక్కగా పాట నేర్పేవారు. రచయిత, సంగీత దర్శకుడే కాక గాయకుడు కూడా కావడం ఆయనలోని మరో పెద్ద ప్లస్ పాయింట్. పాట నేర్పేటప్పుడు తానే పాడి వినిపిస్తారు. గాయకులు తమ గాత్రధర్మా నికి తగ్గట్లుగా స్థాయిని మార్చు కొని, పాటను అనువుగా మలుచుకొని పాడినా ఏమీ అనేవారు కాదు. ఆకాశవాణి స్టేషన్ డెరైక్టరైన రజని విజయవాడలోనూ, రిటైర్మెంట్కు ముందు బెంగుళూరులోనూ ఉన్న ప్పుడు నన్ను ప్రత్యేకించి అక్కడకు పిలిపించి మరీ, లలితగీతాలు పాడించారు. అది ఆయన మంచితనం. ఆ మధ్య కొన్నేళ్ళ క్రితం కూడా ఆయన రచించి, ట్యూన్ చేసిన ‘విరహా నలంపు బాధ భరియింప లేదు రాధ’ అన్న గీతాన్ని ‘ఈ మాసపు పాట’గా రేడియో కోసం పాడా. రచన, బాణీ ఆయనదే అయినా, నా గాత్రధర్మానికి తగ్గట్లుగా కొద్దిగా మార్చుకొన్నా. ఆయన కోపగించకపోగా, ప్రోత్సహించారు. ఇప్పటికీ ఆయన దగ్గరకు ఎప్పుడు వెళ్ళినా, నాతో ఆ పాట పాడించు కొంటారు. సాహిత్య, సంగీత జీవులకు అంతకన్నా ఆనందం ఏముంటుంది! -
అమ్మ లేదు.. నాన్న రాడు
కెరమెరి : మండలంలోని కెరమెరి గ్రామ పంచాయతీలోని బాబేఝరి(కొలాంగూడ) గ్రామానికి చెందిన టేకం లేతుబాయి-భీంరావు దంపతులకు ఇద్దరు కూతుళ్లు లలిత(రెండున్నరేళ్లు), లక్ష్మి(ఏడాదిన్నర), ఐదు నెలల బాబు భీంరావు ఉన్నారు. ఆగస్టులో తల్లి లేతుబాయి జ్వరంతో మృతిచెందింది. కానీ ఆ పిల్లల ఆలనా, పాలనా చూసుకోవాల్సిన తండ్రి త్రాగుడుకు బానిసయ్యాడు. ఆయన ఉన్నా లేనిదాని కిందే లెక్కని బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భార్య మృతిచెందినప్పటి నుంచి నేటి కీ ఆయనకు మత్తు దిగడం లేదు. దీంతో ఆ చిన్నారులు అనాథలయ్యారు. అన్న పట్టించుకోవడం లేదని తెలుసుకున్న తమ్ముడు టేకం గంగారాం ఆ చిన్నారుల బరువు బాధ్యతలు, తన భుజస్కంధాలపై వేసుకున్నాడు. అమ్మతో కలిసి తల్లిదండ్రులు చేసే సపర్యాలు ఆయన చేస్తున్నారు. స్నానం చేయించడం, బట్టలు వేయించడం, అన్నం తినిపించడం, రాత్రి పడుకోబెట్టడం.. జోల పాడడం, ఇతరత్రా సపర్యలు చేస్తున్నారు. పాపం పసివాడు.. భీంరావు భీంరావు ఐదు నెలల చిన్నారి. పుట్టిన 30 రోజులకే తల్లి మృతి చెందడంతో చిన్నారిని చూసిన వారందరు బతక డం కష్టమన్నారు. కానీ ఇప్పటికైతే క్షేమంగానే ఉన్నాడు. తల్లి పాల కోసం పెడుతున్న కేకలు చూపరుల ను కంటతడి పెట్టిస్తున్నాయి. ఆవు పాలు తాగిస్తున్నారు. చలించిన అధికారులు మంగళవారం బాబేఝరి(కొలాంగూడ) గ్రామాన్ని సందర్శించినప్పుడు ఆ చిన్నారుల పరిస్థితిని చూసి కెరమెరి మండల ప్రత్యేకాధికారి ఎ.ఇనేశ్, తహశీల్దార్ సిడాం దత్తు చలించిపోయారు. తల్లిదండ్రుల్లా సపర్యాలు చేస్తున్న గంగారాంను అభినందించారు. పిల్లల కోసం కావల్సిన సహాయం అందిస్తామన్నారు. కాగా, టేకం లలితకు జ్వరం రాగా మంగళవారం గ్రామంలోనే వైద్య సిబ్బంది వైద్యం అందించారు. -
లలిత స్వర కమలం
లేలేత పదాలు.. సంగీతంలో లాలిత్యం.. గానంలో మాధుర్యం.. కలగలసిన కమ్మదనం లలిత గీతం. తేటతెలుగుతో ముడివేసుకున్న లలిత సంగీత ఝరి.. ఈనాటి సంగీత ఆధునిక హోరులో వినిపించకుండా పోయింది. శిశిరాన్ని తరిమి కోకిలకు గొంతుక య్యే వసంతంలా.. లలిత సంగీతానికి పూర్వవైభవం తెచ్చే ఆమని రాగం వస్తుందన్నారు ప్రముఖ గాయకురాలు వేదవతి ప్రభాకర్. లలిత గీతాలకు చలనం నేర్పిన స్వరకర్త, పదకర్త పాలగుమ్మి విశ్వనాథం సంస్మరణార్థం సప్తపర్ణిలో శనివారం జరిగిన స్మృత్యాంజలి కార్యక్రమంలో ఆమె లలిత గీతాలతో అలరించారు. ఈ సందర్భంగా ఆమె సిటీప్లస్‌తో పంచుకున్న మరిన్ని విషయాలు.. పాలగుమ్మి విశ్వనాథం అనేక మంది లలిత సంగీతకారులకు అవకాశం కల్పించారు. అయితే ఆయన స్వరకల్పన చేసిన, రాసిన ఎక్కువ గీతాలు పాడే అవకాశం, అదృష్టం నాకు లభించింది. ఆయన కేవలం స్వరకర్తే కాదు, ఎంతో బాగా పాటను నేర్పించే వారు. లలిత సంగీతం ఎలా పాడాలి, పాడటానికి కావలసిన మెలకువలు, ఈ సంగీతానికి గాత్రాన్ని ఎలా పలికించాలి,మైక్ ఎలా వాడాలి ఇలా ఎన్నో ఆయన నేర్పించారు. నాడు ప్రాభవం లలిత సంగీతానికి ఇప్పుడు ఎక్కువ ప్రాముఖ్యత లేదు. అప్పట్లో సినిమా సంగీతంతో పాటు లలిత సంగీతానికి ఎంతో ప్రాధాన్యం, ఆదరణ వుండేది. ఆ సమయం లైట్ మ్యూజిక్ స్వర్ణయుగం అని చెప్పాలి. అప్పట్లో అనేక మంది లైట్ మ్యూజిక్ కంపోజర్స్ ఉండేవారు. ఈ కాలంలో క్లాసికల్, లైట్ మ్యూజిక్‌కి ఆడియన్స్తగ్గిపోయారని చెప్పాలి. లలిత సంగీత కచేరీకి వచ్చే వారి సంఖ్య తగ్గిపోయింది. ఇప్పుడు సినిమా పాటలపైనే ఎక్కువ దృష్టి పెడుతున్నారు. ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క ఫేజ్ ఉంటుంది. సంగతుల సంగతి.. లైట్ మ్యూజిక్ అంటే చాలా తేలికగా పాడవచ్చుఅనుకుంటారు. కానీ అది అంత సులువైన విషయం కాదు. సంగీతంలో సంగతుల సాధన చాలా ముఖ్యం. అందుకే వెస్ట్రన్ మ్యూజిక్ అయినా, హిందుస్తానీ, కర్ణాటిక్ ఏ సంగీతమైనా పాడుతూ ఉండాలి. కొన్ని సినిమా పాటల్లో క్లిష్టమైన సంగతులు ఉంటాయి. వాటినీ ప్రయత్నించాలి. మనసులో అనుకున్న భావాన్ని గొంతులో పలికించగలిగితేనే లలిత గీతం ఆకట్టుకుంటుంది. లలిత రాగాలు.. శాస్త్రీయ రాగాలపై అవగాహన ఉంటే లలిత సంగీతం వినసొంపుగా ప్రజెంట్ చేయగలుగుతాం. లలిత సంగీతంలో శాస్త్రీయ పోకడ ఎక్కువగా కనిపించకపోయినా.. ప్రభావం మాత్రం ఎంతో కొంత ఉంటుంది. శాస్త్రీయ సంగీత సాధన చేస్తే మన గొంతుకను లలిత సంగీతానికి అనువుగా మలచుకోవడం సులువవుతుంది. అలా కాకుండా లలిత సంగీతం పాడినా.. అది ఎక్కువ రోజులు నిలబడలేదు. ఈ తరం సుస్వరం.. ఈ తరం పిల్లల్లో లలిత గీతాలపై మక్కువ కనిపిస్తోంది. సాలూరి రాజేశ్వరరావు, రావు బాలసరస్వతి ఇలా ఆనాటి మేటి తరం పాటలను ఇంటరె ్నట్లో వెతుక్కుని మరీ నేర్చుకుంటున్నారు. పలు టీవీ షోల్లో చిన్నారులు చూపుతున్న ప్రతిభ చూస్తుంటే ఆనందం వేస్తోంది. బుల్లితెర..భారీ బాధ్యత.. లలిత సంగీతానికి మళ్లీ పూర్వ వైభవం రావాలంటే టీవీ ద్వారానే సాధ్యం. ఈ విషయంలో మనం చేసే ప్రయత్నం ఎక్కువ మందికి రీచ్ కావాలంటే బుల్లితెరతోనే సాధ్యం. అప్పట్లో దూరదర్శన్, రేడియో మాత్రమే ఉండేవి. ఆడియన్స్‌కు లైట్ మ్యూజిక్‌ని వినే అవకాశం కల్పిస్తే ఆదరణ తప్పకుండా ఉంటుంది. మంచి సినిమా వస్తే ఎలాగైతే చూస్తారో.. మంచి సంగీతం వస్తే కూడా తప్పకుండా వింటారు. అందుకే టీ వీ చానళ్లు బాధ్యతగా తీసుకుంటే లలిత సంగీతానికి తప్పకుండా మంచిరోజులు వస్తాయి. -
విజయదశమి నాడు విషాదం
వర్ని : దసరా పండుగను ఆనందంగా జరుపుకుందామని బంధువుల ఇం డ్లకు వెళ్తున్న వారిని ‘తుఫాన్’ వాహనం రూపంలో మృత్యువు కాటేసింది. గమ్య స్థానానికి చేరక ముందే వారి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. వారి కుటుంబాలకు విధి విషాదాన్ని పంచింది. వర్ని మండలంలోని అక్బర్ నగర్ శివారులో శుక్రవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో బా న్సువాడ మండలం కొల్లూరు సర్పంచ్ పల్లి కొండ మాధవి(35), కోటగిరి పోతంగల్ వార్డు సభ్యురాలు సూదం గంగామణి(36), వర్ని మండలం తగిలేపల్లికి చెందిన కృష్ణవేణి(32), అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఆస్పత్రికి తరలిస్తుండగా వడ్డేపల్లికి చెందిన బాలిక శ్వేత(11) మార్గ మధ్య లో మృతి చెందింది. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారు రాజకీయంగా వివిధ పదవుల్లో కొనసాగుతున్నందు వల్ల ఆయా గ్రామాల్లో తీవ్ర కలకలం రేగింది. రోడ్డు ప్రమాదం మధ్యాహ్నం జరిగినప్పటికీ తగిలేపల్లికి చెందిన కృష్ణవేణిని తప్ప మిగిలిన మృతులెవరనేది రాత్రి వరకు తెలియరాలేదు. మృతి చెందిన వారు ముగ్గురు మహిళలే కావడంతో వారిని గుర్తించడంలో తీవ్ర జాప్యం జరిగింది. తల్లిగారింట్లో పండుగ జరుపుకుందామని... మృతురాలు కృష్ణవేణి తగిలేపల్లి గ్రామ పంచాయతీ వార్డు సభ్యుడు బండి బందెయ్య భార్య. ఈ ఏడాది దసరాను తల్లిగారింట్లో జరుపుకుందామని కుమారులైన అజేయ్, విజయ్‌లను పాఠశాలకు సెలవు ప్రకటించగానే.. బోధన్ మండలం బెలాల్కు పంపింది. భర్త బందెయ్యతో కలిసి వర్ని మండల కేంద్రానికి వచ్చి బోధన్ వె ళ్లేందుకు ఆటో ఎక్కింది. పది నిమిషాల్లోపే మృత్యు ఒడిలోకి జారిపోయింది. భర్త బందెయ్యకు తీవ్ర గాయాలు కాగా నిజామాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. జాతరకు వెళ్దామని.. విజయ దశమి సందర్భంగా కొండల్వాడిలో జరిగే జాతరకు వడ్డేపల్లికి చెందిన శ్వేత, ఆమె తల్లి లలిత బయలు దేరా రు. వీరు వర్ని క్రాసింగ్‌లో ఆటో ఎక్కారు. అంతలోనే ప్రమాదం సంభవించడంతో బోధన్ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి నిజామాబాద్ తరలిస్తుం డగా.. మార్గ మధ్యంలో మృతి చెందింది. శ్వేత తల్లి లలిత పరిస్థితి విషమంగా ఉన్నందు వల్ల హైదరాబాద్‌లో చికిత్స పొందుతోంది. కూతురు చనిపోయింద నే విషయం కూడా ఇప్పటికీ కుటుంబ సభ్యులు లలితకు తెలియనివ్వలేదు. మృతురాలు శ్వేత చిన్నప్పటి నుంచి అ మ్మమ్మ హన్మవ్వ, తాత మల్కయ్యల వ ద్ద ఉంటోంది. స్థానిక విజయ విధ్యానికేతన్లో ఆరో తరగతి చదువుతోంది. చ దువులో ముందుండేదని, పాఠశాల నుం చి ఇంటికి వచ్చిన తర్వాత సాయంత్రం ముచ్చట్లు చెబుతుంటే తమకు ఎంతో ఆనందాన్ని కలిగించేదని... ఇప్పుడెవరు తమకు కబుర్లు చెబుతారని రోదించడం కలిచివేసింది. -
అందంగా లేదని భార్యను చంపిన భర్త
కట్టుకున్నవాడే కాలయముడై కడతేర్చాడు. భార్య అందంగా లేదంటూ చిత్రహింసలకు గురిచేశాడు. పెళ్లయిన ఏడాదికే చున్నీతో గొంతుకు ఉరి బిగించి హత్య చేశాడు. ఈ సంఘటన కోటపల్లి మండలం రొయ్యలపల్లి గ్రామంలో బుధవారం రాత్రి జరిగింది. మృతురాలి తల్లిదండ్రులు.. గ్రామస్తులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కోటపల్లి : మహారాష్ట్రలోని సిరొంచ తాలూకా పరిధి రంగయ్యపల్లికి చెందిన ఏదండ్ల ఈశ్వ రి, స్వామి దంపతుల కుమార్తె లలిత(23) వివాహం రొయ్యలపల్లికి చెందిన సల్పాల సంతోష్‌తో గతేడాది మే 13న జరిగింది. వివాహ సమయంలో కట్నంగా రూ.3 లక్షలు, ఇతర లాంఛనాలను లలిత తల్లిదండ్రులు సంతోష్‌కు అందజేశారు. ఐదు నెలల పాటు సంతోష్, లలితల కాపురం సాఫీగా సాగింది. అనంతరం అందంగా లేవంటూ సంతోష్ నిత్యం భార్యను వేధించేవాడు. శారీరకంగా, మానసికంగా హింసించేవాడు. ఈ విషయాన్ని లలిత తన తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లగా వారు సంతోష్‌ను మందలించారు. ఈ క్రమంలో బుధవారం రాత్రి ఇద్దరి మధ్య గొడవ జరిగింది. తీవ్ర పెనుగులాట చోటుచేసుకుంది. ఆగ్రహించిన సంతోష్ చున్నీతో లలిత గొంతుకు ఉరి బిగించి హత్య చేశాడు. గురువారం వేకువజామున విషయం ఇరుగుపొరుగువారికి తెలియడంతో అతడు పారి పోయాడు. సీఐ చంద్రబాను, ఎసై కిరణ్‌కుమార్, తహశీల్దార్ మధునయ్య సంఘటన స్థలాన్ని పరిశీలించారు. పెళ్లయిన ఏడాదికే లలిత హత్యకు గురవడంతో తల్లిదండ్రులు, బంధువుల రోదనలు మిన్నం టాయి. కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. -
పతిధర్మం తెలియని మోడీ
మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు లలిత నిజామాబాద్, న్యూస్‌లైన్: దేశానికి ప్రధానమంత్రి కావాలని పగటి కలలు కంటున్న గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీకి పతిధర్మమే తెలియదని మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు ఆకుల లలిత విమర్శించారు. అలాంటి వ్యక్తి రాజధర్మాన్ని ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. శుక్రవారం నిజామాబాద్ డీసీసీ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. మోడీకి 17వ ఏటనే పెళ్లయితే, సంసారబంధాన్ని వదిలి ఆర్ఎస్ఎస్లో చేరారని అనడం, ఇప్పుడు భార్య పేరు ప్రకటించటం విడ్డూరంగా ఉందన్నారు. దీంతోనే మహిళల పట్ల ఆయనకు ఉన్న చిత్తశుద్ది ఏమిటో తెలుస్తోందన్నారు. ఇలాంటి నాయకుడు దే శానికి ప్రధాని అయితే మహిళలకు ఏ విధమైన రక్షణ ఇస్తారో ప్రజలు ఆలోచించాలని ఆమె కోరారు