కిడ్నాపైన బాలిక ఆత్మహత్య | Kidnapped girl committed suicide | Sakshi
Sakshi News home page

కిడ్నాపైన బాలిక ఆత్మహత్య

Apr 18 2016 11:49 AM | Updated on Nov 6 2018 7:56 PM

హైదరాబాద్‌లో మూడు రోజుల క్రితం కిడ్నాపైన లలిత(13) అనే బాలిక సోమవారం తెల్లవారుజామున ఆత్మహత్య చేసుకుంది.

హైదరాబాద్‌లో మూడు రోజుల క్రితం కిడ్నాపైన లలిత(13) అనే బాలిక సోమవారం తెల్లవారుజామున ఆత్మహత్య చేసుకుంది. గుర్తుతెలియని దుండగులు బాలికను కిడ్నాప్ చేసి కారులో తరలిస్తుండగా మహబూబ్‌నగర్ జిల్లాలో ట్రాఫిక్ పోలీసులు రక్షించారు. అనంతరం పోలీసులు మహబూబ్‌నగర్ జిల్లా దామరగిడ్డ మండలం బొమ్మన్‌పాడు గ్రామంలో ఉన్న తల్లిదండ్రులకు అప్పగించారు.


అయితే తర్వాత ఏమైందో తెలీదు కానీ.. బాలిక సోమవారం ఉదయం ఉరికి వేలాడుతూ కనపడింది. బాలిక తల్లిదండ్రులు హైదరాబాద్‌లో కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement