kidnapping
-
కిడ్నాప్ చేశారని విద్యార్థుల డ్రామా
కర్నూలు జిల్లా: పాఠశాల నుంచి ఇంటికి వెళ్లేందుకు విద్యార్థులు ఒక డ్రామా ఆడారు. తమను కిడ్నాప్ చేశారని సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. పోలీసులు చాకచక్యంగా వ్యవహరించడంతో విద్యార్థులు క్షేమంగా పాఠశాలకు చేరారు. కోడుమూరు సీఐ తబ్రేజ్ తెలిపిన వివరాలు ఇవీ.. సి.బెళగల్‌లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాలలో కోసిగి మండలం జంపాపురం గ్రామానికి చెందిన నవీన్.. 7వ తరగతి బీ సెక్షన్లో చదువుతున్నాడు. అలాగే కర్నూలులోని బుధవారపేటకు చెందిన సూర్యతేజ 6వ తరగతి ఏ సెక్షన్లో చదువుతున్నాడు. వీరిద్దరూ అక్కాచెల్లి అయిన లక్ష్మి, సరస్వతిల పిల్లలు. పాఠశాలలో ఉండటం ఇష్టం లేక జంపాపురానికి వెళ్లేందుకు సిద్ధపడ్డారు. ఈ విషయం ఉపాధ్యాయులకు తెలిస్తే ఇబ్బంది పడతామని.. తమను ముఖానికి ముసుగులు వేసుకున్న కొంతమంది వ్యక్తులు క్యాబ్‌లో వచ్చి కిడ్నాప్ చేశారనే విషయం మిత్రుడు నితిన్‌కు తెలిపి పాఠశాల బయటి నుంచి పొలాల్లో వెళ్లిపోయారు. ఈ విషయాన్ని నితిన్.. పాఠశాలలో ఉన్న ఉపాధ్యాయులు సూర్యపతాప్సింగ్, అయ్యన్న కు తెలిపారు. దీంతో వారు వెంటనే పోలీస్‌లకు సమాచారం అందజేశారు. సోషల్ మీడియాలో ఎస్ఐ సెల్ నంబర్‌తో గురుకుల పాఠశాల ఇద్దరు విద్యార్థులు కిడ్నాప్ అంటూ కథనం హల్చల్ చేసింది. దీంతో కోడుమూరు సీఐ తబ్రేజ్ పాఠశాలకు చేరుకుని సంఘటన వివరాలను తెలుసుకుని గాలింపు చర్యలు చేపట్టారు. ఎంపీడీఓ రాణెమ్మ, ఇన్చార్జ్ తహసీల్దార్ పురుషోత్తం, సి.బెళగల్ సర్పంచ్ పాండురంగన్న, ఎంఈఓ – 2 ఆదామ్‌బాషా.. పాఠశాలకు చేరుకుని పాఠశాల సిబ్బందితో వివరాలు అడిగి తెలుసుకున్నారు. కంటపడిన విద్యార్థులు.. సి.బెళగల్ గురుకుల పాఠశాల విద్యార్థులు కిడ్నాప్ అంటూ సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం అయ్యింది. మిన్నెల అనే వ్యక్తికి ఎమ్మిగనూరులో విద్యార్థులు కంటపడ్డారు. ఈ విషయాన్ని మాజీ జెడ్పీటీసీ సభ్యుడు చంద్రశేఖర్‌కు ఫోన్లో వీడియో కాల్ ద్వారా తెలియజేశారు. ఎమ్మిగనూరులో వ్యక్తిగత పనిపై వెళ్లిన సి.బెళగల్ పోలీస్ కానిస్టేబుల్ శ్రీనివాసులు గౌడ్‌కు విషయం తెలియడంతో ఆయన ఎమ్మిగనూరు పట్టణ పోలీస్‌లకు విద్యార్థులను అప్పగించారు. అనంతరం పాఠశాల నుంచి వెళ్లిన విద్యార్థులను పోలీస్‌లు విచారించారు. పాఠశాలలో ఉండటం ఇష్టం లేక తాము పారిపోయ్యామని తెలిపారు. దీనితో సీఐ, ఎస్ఐ, పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులను వారి తల్లిదండ్రులకు అప్పగించారు. పాఠశాలలో ఇవీ లోపాలు.. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మనబడి నాడు– నేడులో భాగంగా సి.బెళగల్‌లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాలలో 20 నూతన మరుగుదొడ్లు నిర్మించారు. అలాగే 20 పాత మరుగుదొడ్లను మరమ్మతు చేశారు. స్వచ్ఛ భారత్ మిషన్‌లో భాగంగా పాఠశాల ఆవరణలో విద్యార్థుల కోసం మరో 32 కొత్త మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. వాటి నిర్వహణను పట్టించుకోకపోవడంతో విద్యార్థులు.. పాఠశాల ప్రాంగణం దాటి బహిర్భూమికోసం సూదూరంగా వెళ్తున్నారు. మలవిసర్జనకు పాఠశాల బయటకు వచ్చి ఇలాంటి కథలకు చోటు చేసుకుండటంతో విద్యార్థుల తల్లిదండ్రులు భయాందోళన చెందుతున్నారు. -
నేరం వెనుక నిజం
సాక్షి, హైదరాబాద్: సమాజంలో జరిగే ప్రతి నేరం వెనుక ఓ కారణం కచ్చితంగా ఉంటుంది. వార్షిక విలేకరుల సమావేశం సందర్భంగా ఆదివారం డీజీపీ డాక్టర్ జితేందర్ నేరాల సంబంధిత గణాంకాలను విడుదల చేశారు. 2024కు (నవంబర్ వరకు) సంబంధించి రాష్ట్రంలో నమోదైన నేరాలను పరిశీలిస్తే..వీటిల్లో అనేక ఆసక్తికరమైన కోణాలు కూడా ఉన్నాయి. కుటుంబీకులే కత్తికడుతున్నారు... బాడీలీ అఫెన్స్‌గా పిలిచే హత్య కేసులకు పోలీసులు చాలా ప్రాధాన్యం ఇస్తారు. వీటి దర్యాప్తు కోసం అవసరమైతే ప్రత్యేక బృందాలనూ రంగంలోకి దింపుతారు. సాధారణంగా ఓ వ్యక్తి/వ్యక్తులు మరొకరిని చంపడానికి ఆర్థిక లావాదేవీలే కారణమని భావిస్తాం. అయితే ఈ ఏడాది రాష్ట్రంలో నమోదైన 856 హత్య కేసుల్లో అత్యధికంగా 229 (26.75 శాతం) కేసులు కుటుంబ కలహాల వల్లే జరిగాయి. అక్రమ సంబంధాల కారణంగా 102, భూ వివాదాలతో 82, చిరు వివాదాల వల్ల మరో 82 హత్యలు జరిగితే.. ఆర్థిక కారణాల వల్ల 53 హత్యలు జరిగాయి. మరో 259 మాత్రం రకరకాలైన ఇతర కారణాల వల్ల జరిగాయి. పిల్లలు తప్పిపోయినా కిడ్నాపే... డబ్బు కోసం లేదా ఇతరత్రా లబ్ధి కోసం వ్యక్తులో, ముఠానో ఎవరినైనా ఎత్తుకుపోయి నిర్భంధిస్తే కిడ్నాప్‌గా పరిగణిస్తారు. అయితే ఈ ఏడాది తెలంగాణలో 1,525 అపహరణ కేసులు నమోదయ్యాయి. ఇంతమంది కిడ్నాప్‌కు గురయ్యారని అనుకుంటున్నారా? కానే కాదు. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు మైనర్ల మిస్సింగ్ కేసుల్ని కూడా కిడ్నాప్‌గా నమోదు చేయడం తప్పనిసరి. దర్యాçప్తుల్లో నిర్లక్ష్యాన్ని నిరోధించడానికి న్యాయస్థానం ఈ ఆదేశాలు ఇచ్చింది. కాగా ఈ ఏడాది నమోదైన కిడ్నాపుల్లో మిస్సింగ్ సంబంధిత కేసులే 1,251 (82.03 శాతం) ఉన్నాయి. మిగిలినవి ప్రేమ వ్యవహారాలు, కుటుంబ కలహాలు, చిరు వివాదాల నేపథ్యంలో జరిగినవి ఉన్నాయి. చోరీలకు సెల్ఫోన్ల లింకు ప్రతి వ్యక్తి చేతిలోకి అందుబాటులోకి వచ్చిన సెల్‌ఫోన్ ప్రభావం కేవలం సైబర్ నేరాల పైనే కాదు. చోరీ, దోపిడీ, బందిపోటు దొంగతనం (డెకాయిటీ) కేసుల పైనా ఉంటోంది. ఈ ఏడాది 58 డెకాయిటీ కేసులు నమోదు కాగా.. వీటిలో 5 సెల్ఫోన్లు లాక్కుపోవడానికి సంబంధించివే. 703 దోపిడీ కేసుల్లో 67, 19480 చోరీ కేసుల్లో 1960 ఫోన్లతో ముడిపడి ఉన్నవే కారణం కావడం గమనార్హం.పరిచయస్తులే చెరబట్టారు! మహిళలపై జరుగుతున్న నేరాల్లో అత్యాచారాన్ని తీవ్రంగా పరిగణిస్తారు. రాష్ట్రంలో ఈ ఏడాది నమోదైన అత్యాచారం కేసుల్లో పరిచయస్తులే నిందితులుగా ఉన్న ఉదంతాలు ఎక్కువగా ఉండటం గమనార్హం. మొత్తం 2,945 కేసులు నమోదు కాగా...వీటిలో 2,922 (99.21 శాతం) పరిచయస్తుల వల్ల జరిగినవే కావడం ఆందోళన కలిగించే అంశం. కేవలం 23 కేసుల్లో మాత్రమే బాధితులకు పరిచయం లేని వాళ్లు నిందితులుగా ఉన్నారు. మైనర్‌ను ప్రేమ పేరుతో మోసం చేయడం, పెళ్లి చేసుకోవడం తరహాకు చెందినవీ మొదటి కేటగిరీలోనే ఉంటున్నాయి. రేప్ కేసు బాధితుల్లో 15 ఏళ్ల లోపు వాళ్లు 87 మంది, 15–18 ఏళ్ల మధ్య వయసు్కలు 1,970 మంది, మేజర్లు 888 మంది ఉన్నారు. మోసాల్లో సైబర్ నేరాలదే అగ్రస్థానం ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా 33,618 చీటింగ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో 24,643 (73.3 శాతం) సైబర్ నేరాలే కావడం గమనార్హం. చిన్న చిన్న మొత్తాలతో కూడిన సైబర్ నేరాలు ఫిర్యాదు దశలోనే ఆగిపోతున్నాయి. పెద్ద మొత్తాలు కోల్పోయిన వారిలోనూ దాదాపు సగం మంది పరువు, ప్రతిష్ట కోసం, సమాజానికి భయపడి ఫిర్యాదుల వరకు వెళ్లట్లేదు. ఇవి కూడా రికార్డుల్లోకి ఎక్కితే మోసం కేసుల సంఖ్య లక్షల్లోనే ఉండే అవకాశం ఉంది. ప్రమాదాలు, మరణాలు పైపైకే.. రాష్ట్ర వ్యాప్తంగా 2023లో (నవంబర్ వరకు) 20,702 రోడ్డు ప్రమాదాలు జరగ్గా... 6,541 మంది చనిపోయారు. ఈ ఏడాది నవంబర్ వరకు మొత్తం 23,491 రోడ్డు ప్రమాదాల్లో 6,640 మంది మరణించారు. మృతులు నమోదు కాని రోడ్డు ప్రమాదాలు సైతం పెరిగాయి. 2023లో వీటి సంఖ్య 14,161 కాగా.. ఈ ఏడాది ఈ సంఖ్య 16,851కి చేరింది. 2023లో అన్ని రకాల నేరాలూ కలిపి 1,38,312 నమోదు కాగా, 2024లో 1,69,477 నమోదయ్యాయి. -
పోలీసులే కిడ్నాపర్ల అవతారమెత్తి..
సాక్షి ప్రతినిధి కర్నూలు: ఎవరైనా కిడ్నాప్ చేస్తే పోలీసులను ఆశ్రయిస్తాం. మరి పోలీసులే కిడ్నాప్ చేస్తే. ఎవరిని ఆశ్రయించాలి. న్యాయం కోసం ఎక్కడికి వెళ్లాలి. కూటమి ప్రభుత్వంలో లా అండ్ ఆర్డర్ తీరును, ఏపీలో అమలవుతున్న రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని స్పష్టం చేసే ఘటన కర్నూలు జిల్లాలో జరిగింది. భూవివాదాన్ని కోర్టులతో పనిలేకుండా సెటిల్ చేసుకోవాలంటూ ఓ ఉపాధ్యాయుడిని కర్నూలు పోలీసులు కిడ్నాప్ చేశారు. అర్ధరాత్రి వరకూ బెదిరించి మరీ అతడిని ఇంటికి పంపారు. కిడ్నాపైన ఉపాధ్యాయుడు మునీర్ అహ్మద్, అతని భార్య తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మునీర్ అహ్మద్ కర్నూలు వాసి. వెల్దుర్తి మండలం అల్లుగుండు ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లిష్ ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నారు. మునీర్ శనివారం స్కూల్లో పాఠాలు చెబుతుండగా.. ఇద్దరు పోలీసులు మఫ్టీలో వచ్చి సీఐ రమ్మంటున్నారని చెప్పారు. హెడ్మాస్టర్కు చెప్పి వస్తానన్నా వినకుండా సెల్‌ఫోన్ లాగేసుకుని అతడిని బలవంతంగా కారులో ఎక్కించుకుని తీసుకెళ్లారు. ఎక్కడికి తీసుకెళ్తున్నారని అడిగితే.. వెల్దుర్తి స్టేషన్ అని ఒకసారి, డీఐజీ ఆఫీసుకు అని ఇంకోసారి చెప్పి చివరకు గుర్తు తెలియని ప్రాంతానికి తీసుకెళ్లారు. ‘ఏంటి గన్‌తో కాల్చి చంపేస్తారా’ అని గట్టిగా కేకలు వేయగా పోలీసులు అతడి నోరుమూసేశారు. అక్కడ ఓ గదిలో అప్పటికే కొంతమంది వ్యక్తులకు పోలీసులు కౌన్సెలింగ్ ఇస్తున్నారు. అప్పటికే అతని సోదరుడు మక్బూల్‌ను కూడా అక్కడికి తీసుకొచ్చారు. అక్కడే మునీర్‌ను ఉంచారు. పక్కన ఉన్న వారిని కొడుతున్న దెబ్బలకు మునీర్ బెదిరిపోయాడు. రాత్రి 11 గంటల తర్వాత సీఐ శేషయ్య వచ్చి భూవివాదం గురించి మాట్లాడి పంపించేశారు. కిడ్నాప్ నేపథ్యంలో మునీర్‌ను ఎవరు తీసుకెళ్లారు, ఎక్కడి తీసుకెళ్లారో అర్థంకాక అతడి సతీమణి రెహానాబేగం, పాఠశాల హెడ్మాస్టర్ మల్లయ్య వెల్దుర్తి, కర్నూలు త్రీటౌన్ పోలీసుల చుట్టూ తిరిగారు. ఎవరూ స్పందించలేదు. తన భర్త కిడ్నాప్ అయ్యారంటూ ఫిర్యాదు ఇచ్చినా పోలీసులు తీసుకోలేదు.అసలు కారణం ఇదీమునీర్ అహ్మద్ కుటుంబానికి కర్నూలు కేంద్రీయ విద్యాలయం సమీపంలో భూమి ఉంది. అన్నదమ్ములు భాగపరిష్కారాలు చేసుకున్న తర్వాత సర్వే నంబర్ 649/2ఏలో 1.17 ఎకరాలు మునీర్ అధీనంలో ఉంది. 1910 నుంచి రికార్డులు ఆ కుటుంబం పేరిటే ఉన్నాయి. 2016లో ధనుంజయ అనే వ్యక్తి ఆ ప్రాంతంలోనే 6 ఎకరాలు కొనుగోలు చేశాడు. తాను కొనుగోలు చేసిన సర్వే నంబర్లలోనే మునీర్ అహ్మద్ 1.17 ఎకరాలు కూడా ఉన్నాయని ధనుంజయ్ కోర్టును ఆశ్రయించాడు. కోర్టు మునీర్‌కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. దీనిపై హైకోర్టులో ధనుంజయ్ అప్పీల్ చేశాడు. ఈ క్రమంలో కోడుమూరు టీడీపీ ఇన్చార్జి ఎదురూరు విష్ణువర్ధన్‌రెడ్డి, మనీశ్ అనే వ్యక్తి కలిసి వివాదాన్ని సెటిల్ చేసుకోవాలంటూ మునీర్‌ను బెదిరించారు. ఎవరు ఎన్ని బెదిరింపులు చేసినా కోర్టులో న్యాయం జరుగుతుందనే నమ్మకంతో మునీర్ ఉన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగా.. సెప్టెంబర్‌లో ధనుంజయ్, అతడి తరఫు వ్యక్తి కడప విష్ణువర్ధన్‌రెడ్డిని పిలిపించి సెటిల్ చేసుకోవాలని చెప్పారు. ఆపై సీఐ మురళీధర్‌రెడ్డి అక్టోబర్ 30న పిలిపించి డీఐజీ, రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయని సెటిల్ చేసుకోవాలని మునీర్‌కు, అతని సోదరుడు మక్బూల్‌కు చెప్పారు. ఆ తర్వాత సీఐ బదిలీ అయ్యారు. ఈ క్రమంలో మునీర్, మక్బూల్ డీఐజీ కోయ ప్రవీణ్‌ను కలిశారు. ‘భూ వివాదం తెంచుకోవాలి. ఇక్కడ లా ముఖ్యం కాదు. ఇప్పటికే 9 ఏళ్లయింది. మరో పదేళ్లయినా కోర్టులో తెగదు. ఆలోచించుకోండి. ఒక రేటు మాట్లాడుకుని వదిలేయండి. మా సీఐ మీ వాళ్లతో మాట్లాడతారు’ అని చెప్పారు. దీంతో వారు వెనుదిరిగి వచ్చేశారు. శనివారం పోలీసులు వెళ్లి మునీర్‌ను కిడ్నాప్ చేసి, అర్ధరాత్రి తిరిగి పంపించారు.నన్ను చంపేస్తారునన్ను తీసుకెళ్లిన పోలీసులు గన్‌తో కాల్చి చంపేస్తారని భయపడ్డా. భూ వివాదాన్ని సెటిల్ చేసుకోవాలని సీఐ నుంచి డీఐజీ వరకూ ఒత్తిడి చేస్తున్నారు. మార్కెట్ రేటు కంటే 30 శాతం తక్కువ ఇచ్చినా వదిలేస్తా. కానీ.. వారు ఇచ్చిందే తీసుకోవాలనేలా మాట్లాడుతున్నారు. మా భూమి మేమెందుకు వదిలేయాలి. నాకు దివ్యాంగురాలైన కుమార్తె ఉంది. పోలీసుల తీరు, ధనుంజయ్ తరఫు వ్యక్తి కడప విష్ణువర్ధన్‌రెడ్డి బెదిరింపులు చూస్తే కచ్చితంగా నా కుటుంబాన్ని చంపేస్తారనే భయం కలుగుతోంది. నన్ను చంపినా ఫర్వాలేదు. నా భార్య, బిడ్డలైనా బతికితే చాలు. నేను ముస్లిం కాబట్టే బెదిరిస్తున్నారా అనిపిస్తోంది. – మునీర్ అహ్మద్ -
పోలీసులే కిడ్నాప్ చేస్తే!
సాక్షి, నరసరావుపేట: పట్టపగలు న్యాయస్థాన ప్రాంగణంలో గిరిజన నేతపై దాడి చేయడమే కాకుండా బలవంతంగా అపహరించారు. చట్టాన్ని కాపాడాల్సిన ఖాకీలే రౌడీల అవతారమెత్తారు. కోర్టులో లొంగిపోయేందుకు వచ్చి న నిందితుడిని కోర్టు ప్రాంగణంలోనే కిడ్నాప్ చేశారు. దుర్గి మండలం కాకిరాలకు చెందిన వైఎస్సార్సీపీ నేత రమావత్ శ్రీనునాయక్‌పై ఇప్పటికే మూడు అక్రమ కేసులు నమోదు చేశారు. అందులో రెండు కేసుల్లో సుమారు 70 రోజులపాటు సబ్‌జైలులో ఉన్న శ్రీనునాయక్ బెయిల్‌పై విడుదలయ్యాడు. జైలులో ఉన్న సమయంలో అప్పటికే నమోదైన మూడో కేసులో పీటీ వారెంట్ వేయకుండా బయటకు వచ్చి న తరువాత అరెస్ట్ చేసి హింసించాలన్న దురుద్దేశంతో పోలీసులు ఆ సమయంలో అరెస్ట్ చూపలేదు. బెయిల్‌పై బయటకు వచ్చిన తరువాత ఎలాగైనా అక్రమంగా నిర్బంధించి చిత్రహింసలకు గురి చేయాలని పోలీసులపై టీడీపీ ప్రజాప్రతినిధి నుంచి తీవ్ర స్థాయిలో ఒత్తిడి వచ్చి0ది. విషయం తెలుసుకున్న శ్రీనునాయక్ కొన్ని రోజులు అజ్ఞాతంలోకి వెళ్లాడు. కుటుంబ సభ్యులను, సన్నిహితులను పోలీసులు వేధింపులు గురి చేస్తుండటంతో శ్రీనునాయక్ కోర్టులో లొంగిపోయేందుకు మంగళవారం మాచర్ల న్యాయస్థానం వద్దకు చేరుకున్నారు. తన న్యాయవాది ద్వారా కోర్టులో సరెండర్ పిటిషన్ దాఖలు చేశారు. మరికొన్ని నిమిషాల్లో న్యాయమూర్తి ఎదుట హాజరవుతడనగా.. మాచర్ల పోలీసులు అక్కడకు చేరుకున్నారు. బలవంతంగా శ్రీనునాయక్‌ను కోర్టు ప్రాంగణం నుంచి నెట్టుకుంటూ పక్కకు తీసుకెళ్లారు. గమనించిన అతని తరపు న్యాయవాది రామానాయక్ అడ్డుకోబోయాడు. అయినప్పటికీ పోలీసులు చొక్కా చించి దాడికి పాల్పడ్డారు. అ సమయంలో శ్రీనునాయక్ చేతి వేళ్లకు గాయాలయ్యాయి. కోర్టు ప్రాంగణంలో పోలీసులు వ్యవహరిస్తున్న దౌర్జన్యకాండను మరో న్యాయవాది షేక్ ఖాసిం తన సెల్ఫోన్లో చిత్రీకరించాడు. గమనించిన పోలీసులు న్యాయవాది వద్ద నుంచి ఫోన్‌ను బలవంతంగా లాక్కున్నారు. అనంతరం ఎవరూ ముందుకు రావద్దంటూ పోలీసులు బెదిరిస్తూ శ్రీనునాయక్‌ను కిడ్నాప్ చేసి కార్లో ఎక్కించుకుని వెళ్లారు. అనంతరం న్యాయవాది రామానాయక్ జరిగిన ఘటనను న్యాయమూర్తికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.లొంగిపోయేందుకు వచ్చిన తమ క్లయింట్‌ను పోలీసులు బలవంతంగా అపహరించడంతోపాటు తనపట్ల దురుసుగా ప్రవర్తించి విధులకు ఆటంకం కలిగించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. శ్రీనునాయక్ రక్తంతో తడిసిన తన చొక్కాను న్యాయమూర్తికి అప్పగించినట్టు రామానాయక్ తెలిపారు. న్యాయస్థాన ప్రాంగణంలో పోలీసుల దౌర్జన్యకాండ పట్ల న్యాయవాదులు మండిపడుతున్నారు. నా భర్తకు ప్రాణహాని ఉంది పోలీసుల నుంచి తన భర్తకు ప్రాణహాని ఉందని కిడ్నాప్‌కు గురైన శ్రీనునాయక్ భార్య లక్ష్మీభాయ్ విలేకరుల ఎదుట వాపోయింది. కోర్టు ప్రాంగణం నుంచి పోలీసులు బలవంతంగా తీసుకువెళ్లిన తరువాత ఎక్కడ పెట్టారో చెప్పలేదన్నారు. తన భర్తను చూసేందుకు పోలీస్ట స్టేషన్‌కు వెళ్లినా అక్కడ లేడని వెనక్కి పంపారన్నారు. కాగా.. పాత కేసులో నిందితుడిగా ఉన్న శ్రీనునాయక్‌ను కోర్టు సమీపంలో అరెస్ట్ చేశామని గురజాల డీఎస్పీ జగదీష్ తెలిపారు. -
ప్రియుణ్ణి కిడ్నాప్ చేసిన ప్రియురాలు!
తిరుపతి క్రైమ్: ఓ ప్రియురాలు తన ప్రియుడినే కిడ్నాప్ చేసిన ఘటన గురువారం తిరుపతి జిల్లాలో సంచలనం సృష్టించింది. తిరుపతి ఈస్ట్ ఇన్చార్జ్ సీఐ రామకృష్ణ తెలిపిన వివరాల మేరకు.. ప్రస్తుతం తిరుపతిలోని పీకే లేఅవుట్లో లాడ్జి నిర్వహిస్తున్న నాని అనే వ్యక్తికి మదనపల్లికి చెందిన భాను పరిచయమైంది. ఈ క్రమంలో వారు గత ఎనిమిది నెలలుగా సన్నిహితంగా ఉంటున్నారు.అయితే మూడు నెలల నుంచి నాని భానును పట్టించుకోవడం లేదు. ఈ క్రమంలో భాను తన ప్రియుడిపై కోపం పెంచుకుంది. మరో నలుగురు సహాయంతో మదనపల్లి నుంచి వచ్చి పీకేలో లాడ్జిలో ఉన్న నానిని ఇన్నోవా కార్లో కిడ్నాప్ చేసి తీసుకెళ్లింది. కిడ్నాప్ ఘటన సమాచారం పోలీసులకు అందడంతో.. వాయల్పాడు వద్ద వారిని అడ్డగించి నానిని సురక్షితంగా కాపాడారు. పోలీసులను చూసి కిడ్నాపర్లు పరార్ అయ్యారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. -
వల్లభాపురం రైతు కిడ్నాప్
వల్లభాపురం (తెనాలి): ఓ రైతు కిడ్నాప్ వ్యవహారం కలకలం సృష్టించింది. తెనాలి నియోజకవర్గం, కొల్లిపర మండలం, వల్లభాపురం గ్రామానికి చెందిన రైతు ఆళ్ల జగదీశ్‌రెడ్డిని గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. ఇంటికొచ్చి నిద్రలేపి మరీ తీసుకెళ్లారు. ఆదివారం సాయంత్రం వరకు ఆయన ఆచూకీ తెలియ రాలేదు. కుటుంబసభ్యులు ఫోను చేసినా సమాధానం లేకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. లండన్ వెళ్లేందుకు సిద్ధమైన ఆయన కుమారుడు, విషయం తెలుసుకుని హైదరాబాద్ నుంచి స్వగ్రామానికి బయలుదేరారు. జగదీశ్ రెడ్డి భార్య శ్రీదేవి వివరాల ప్రకారం... వల్లభాపురానికి చెందిన జగదీశ్ రెడ్డి రైతు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త. ఆదివారం తెల్లవారుజామున మూడు గంటలకు ముగ్గురు ఆగంతకులు ఇంటికొచ్చి జగదీశ్ రెడ్డి కావాలని అడిగారు. స్నేహితులేమోనని భావించిన తల్లి జగదీశ్ రెడ్డిని నిద్ర లేపారు. బయటకు వచ్చిన ఆయన, లోపలకు వచ్చి షర్ట్ వేసుకుని వచ్చిన వారితోపాటు వెళ్లిపోయారు. నిద్రలో ఉన్న తనకు ఈ విషయాలేమీ తెలియదని శ్రీదేవి చెప్పారు. మధ్యాహ్నం పొలానికి భోజనం తీసుకెళ్లే మనిషి వస్తే యధాప్రకారం క్యారేజీ ఇచ్చానని, తీరా చూస్తే పొలానికి వెళ్లలేదనీ, తెల్లవారుజామున ముగ్గురు ఆగంతకులు వచ్చి తీసుకెళ్లారని అప్పుడు తెలిసింది ఆమె చెప్పారు. దీంతో అక్కడ సమీపంలోని సీసీ కెమెరాను పరిశీలిస్తే ముగ్గురు వ్యక్తులు వచ్చినట్టు స్పష్టంగా కనిపించిందన్నారు. వారిని చూస్తుంటే మఫ్టీలో వచ్చిన పోలీసుల్లా ఉన్నారని భావించామనీ, దీనిపై గ్రామస్తులు, సమీప బంధువులు కొల్లిపర, తెనాలి రూరల్ పోలీసులను విచారిస్తే, తమకేమీ తెలియదని చెప్పడంతో అయోమయానికి గురయ్యామన్నారు. ఆయన జాడ తెలియ రాలేదని, ఏం చేయాలో పాలుపోవడం లేదని శ్రీదేవి ఆందోళన వ్యక్తం చేశారు. జగదీశ్‌రెడ్డికి ఇద్దరు కుమారుల్లో ఒకరు హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తుంటే, మరొకరు లండన్‌లో చదువుతున్నారు. సెలవులని ఊరొచ్చిన కుమారుడు, లండన్ వెళ్లేందుకు ముందు రోజే హైదరాబాద్ వెళ్లారు. తండ్రి కిడ్నాప్ సమాచారంతో వారిద్దరూ వల్లభాపురం బయలుదేరారు. -
ప్రాణం తీస్తున్న ప్రేమ
ప్రేమ, దాని కారణంగా వివాహేతర సంబంధాలు మనుషుల ప్రాణాలు తీస్తున్నాయి. హత్యలు,ఆత్మహత్యలకు కారణమవుతున్నాయి. కిడ్నాపులకు దారితీస్తున్నాయి. ప్రేమ కారణంగా గత పదేళ్లలో లక్షకుపైగా హత్యలు, ఆత్మహత్యలు జరిగాయి.⇒ దేశంలో ప్రేమ, తత్సంబంధ కారణాల వల్ల 201322 మధ్య ఆత్మహత్య చేసుకున్నవారు 74,180⇒ మొత్తం ఆత్మహత్యల్లో ప్రేమ కారణంగా జరిగినవి 76.1%⇒ వివాహేతర సంబంధాల వల్ల జరిగిన ఆత్మహత్యలు 13.3% ⇒ ప్రేమ కారణంగా హత్యకు గురైనవారు 30,012⇒ మొత్తం హత్యల్లో అక్రమ సంబంధాల కారణంగా జరిగినవి 46.6%⇒ పెళ్లిళ్ల కోసం చేసిన కిడ్నాపులు 2.8 లక్షలు⇒ పరువు హత్యలు 517ఆధారం: నేషనల్ర్ కైమ్ రికార్డ్స్ బ్యూరో -
డాక్టర్ లేరు.. వైద్య పరికరాలూ లేవంట!
నరసరావుపేట టౌన్ : పల్నాడు జిల్లాలో ఓ మైనర్ బాలిక కేసులో వైద్యుల నిర్లక్ష్యం, ప్రభుత్వ అసమర్థత వెలుగుచూసింది. కిడ్నాప్‌కు గురైన బాలికకు వైద్య పరీక్షల నిర్వహణలో ఓ ఏరియా ఆస్పత్రి డొల్లతనం బట్టబయలైంది. బాధితురాలిని రాత్రి 11 గంటల ప్రాంతంలో తీసుకొస్తే.. డాక్టర్ 12.30కు తీరిగ్గా వచ్చారు. పైగా.. పరీక్షల నిర్వహణకు అవసరమైన పరికరాలు ఆస్పత్రిలో లేవని.. వాటిని బయట నుంచి తెచ్చుకోమని స్లిప్పై రాసివ్వడంపై వివాదాస్పదమవుతోంది. వివరాలివీ.. నరసరావుపేట పట్టణానికి చెందిన పదహారేళ్ల మైనర్ బాలికను వినుకొండ పట్టణానికి చెందిన వెంకటేష్ ప్రేమ పేరుతో వంచించి గత సోమవారం ఇంటి నుంచి బలవంతంగా తీసుకెళ్లాడు. బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదుతో వన్‌టౌన్ పోలీసులు మంగళవారం కిడ్నాప్, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. వినుకొండలో బాలికను గుర్తించిన పోలీసులు ఆమెను నరసరావుపేటకు తీసుకొచ్చారు. రెండ్రోజులపాటు బాలికను నిందితుడు తన వద్దే నిర్బంధించడంతో పోలీసులు వైద్య పరీక్షల నిమిత్తం బాలికను రాత్రి 11గంటలకు ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు.కానీ, ఆ సమయంలో వైద్యపరీక్షలు చేసేందుకు నైట్‌డ్యూటీ డాక్టర్ అందుబాటులో లేరు. రాత్రి 12.30 గంటలకు తీరుబడిగా వచ్చిన డాక్టర్ తమ వద్ద మెడికల్ పరీక్షలకు అవసరమైన వైద్య పరికరాలు, లిక్విడ్స్, గ్లౌజులు అందుబాటులో లేవని చెప్పారు. పరీక్షలు నిర్వహించాలంటే బయట నుంచి వాటిని తెచ్చుకోవాలంటూ బాధితులకు స్లిప్ రాసి ఇచ్చారు.కానీ, అప్పటికే అర్థరాత్రి దాటడంతో మెడికల్ షాపులు మూసేశారు. దీంతో.. బాధితురాలికి సకాలంలో చేయాల్సిన వైద్య పరీక్షలు నిలిచిపోగా.. బుధవారం ఉదయం వైద్య పరికరాలు తీసుకురావడంతో దాదాపు 12 గంటల తర్వాత బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించారు. బంధువుల ఆందోళన..ప్రభుత్వాసుపత్రిలో సౌకర్యాలు, వైద్యులు అందుబాటులో లేకపోవడంపై బాధితురాలి బంధువులు ఆందోళనకు దిగారు. పరీక్షల నిర్వహణలో తీవ్ర జాప్యం జరగడంతో సాక్ష్యాలు చెదిరిపోయి కేసు నీరుగారిపోతుందేమోనని వారు ఆవేదన చెందుతున్నారు. పరీక్షలకు అవసరమైన కనీస పరికరాలు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలోని ఏరియా ఆసుపత్రిలో లేకపోవటంపట్ల వారు మండిపడ్డారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన డ్యూటీ డాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
అశ్వియ హత్య కేసులో ముగ్గురి అరెస్ట్
పుంగనూరు : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన చిన్నారి అశ్వియ అంజుమ్(7) కిడ్నాప్, హత్య కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలిస్తున్నట్టు జిల్లా ఎస్పీ మణికంఠ చందవోలు చెప్పారు. ఆయన ఆదివారం జిల్లా కలెక్టర్ సుమిత్‌కుమార్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. పట్టణంలోని ఉబేదుల్లా కాంపౌండులో ఉన్న అజు్మతుల్ల కుమారై అశ్వియఅంజుమ్ గత నెల 29న రాత్రి 7 గంటల సమయంలో ఆడుకుంటూ అదృశ్యమైందని బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు ఎస్పీ చెప్పారు. దీనిపై కేసు నమోదు చేసి.. 12 పోలీస్ బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టామన్నారు. కాగా, ఈ నెల 2న బాలిక పట్టణ సమీపంలోని ఎన్‌ఎస్‌పేట సమ్మర్‌స్టోరేజ్ ట్యాంకులో శవమై దొరికిందని తెలిపారు. అదే రోజు పోస్టుమార్టం నిర్వహించగా.. బాలిక ఊపిరితిత్తుల్లో నీరు, ఆహారం ఉండటాన్ని గమనించి ఆ మేరకు దర్యాప్తు చేపట్టామన్నారు. బాలిక తండ్రి అజు్మతుల్ల ఒక మహిళకు రూ.3.5 లక్షలు అప్పు ఇచ్చినట్లు, ఆ అప్పు కోసం ఆ మహిళను వేధించడం, కోర్టుకీడుస్తానంటూ బెదిరించడంతో ఆ మహిళ విసుగు చెంది ఈ ఘాతుకానికి పాల్పడిందన్నారు.ఆడుకుంటున్న చిన్నారి వద్దకు బురఖా వేసుకుని ఆ మహిళ వచ్చి.. చాక్లెట్ ఇచ్చి ఇంటికి తీసుకెళ్లిందని ఎస్పీ తెలిపారు. తన కుమారైతో కలిసి చిన్నారికి ఇంట్లో అన్నం పెట్టిందని, అనంతరం ఆ చిన్నారిని నోరు, ముక్కు మూసిపెట్టి హత్య చేసినట్టు ఎస్పీ చెప్పారు. అదే సమయంలో తమకు సమీప బంధువైన ఓ బాలుడిని ఇంటి ముందు కాపాలాగా పెట్టినట్టు తెలిపారు. బాలుడి సూచన మేరకు.. తర్వాత బాలుడి సూచన మేరకు చిన్నారి శవాన్ని బైక్‌పై సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు వద్దకు తీసుకెళ్లి నీటిలో పడేసినట్టు ఎస్పీ తెలిపారు. ఈ విషయాన్ని బాలుడు స్వయంగా అంగీకరించగా.. ముగ్గురినీ అరెస్ట్ చేసి, రిమాండ్‌కు పంపిస్తున్నట్టు వెల్లడించారు. కేసులో మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నామని ఎస్పీ వివరించారు. సమావేశంలో పలమనేరు డీఎస్పీ ప్రభాకర్, ఎస్బీ సీఐ భాస్కర్, డాక్టర్ మధుసూదనచారి పాల్గొన్నారు. మీడియాపై కలెక్టర్ మండిపాటు జిల్లా కలెక్టర్ సుమిత్‌కుమార్ మాట్లాడుతూ మీడియా తమ ఇష్టానుసారం వార్తలు రాస్తోందని, సోషల్ మీడియాలోనూ నిరాధార ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. మైనర్ బాలిక పేర్లను, వారి వివరాలను ఎలా మీడియాలో వేస్తారని విలేకరులను ప్రశి్నంచారు. -
అతీగతీలేని దర్యాప్తు
సాక్షి, అమరావతి : నంద్యాల జిల్లా మచ్చుమర్రిలో చిన్నారి వాసంతిని అపహరించి, హత్యాచారం చేసి మూడునెలలు అవుతున్నా మృతదేహాన్ని ఇప్పటివరకూ గుర్తించలేదు. అలాగే, చిత్తూరు జిల్లా పుంగనూరులో చిన్నారి అంజుమ్‌ను అపహరించి, హత్యచేసి ఆరు రోజులవుతున్నా ఇప్పటివరకు నిందితులెవరో కనుగొనలేదు. .. ఇదీ బాలికలు, మహిళల భద్రతపట్ల సీఎం చంద్రబాబు ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి. ప్రభుత్వ తీరును ఆసరాగా చేసుకునే రాష్ట్రంలో రౌడీలు, ఆకతాయిలు అత్యాచారాలు, లైంగిక దాడులకు బరితెగిస్తున్నారు. మరోవైపు.. దర్యాప్తు విషయంలో పోలీసుల తీరూ నత్తనడకను మరిపిస్తోంది. ఇందుకు పుంగనూరులో చిన్నారి అశి్వయ అంజుమ్ కిడ్నాప్, హత్య కేసే ఉదాహరణ. ఆమె తల్లిదండ్రులు వెంటనే ఫిర్యాదు చేసినా పోలీసులుగానీ ప్రభుత్వంగానీ బాధ్యతాయుతంగా స్పందించకపోవడంవల్లే ఏడేళ్లకే ఆ చిన్నారికి నూరేళ్లు నిండిపోయాయి. అపహరణకు గురైన అంజూమ్‌ను సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించడంలో పోలీసు వ్యవస్థ పూర్తిగా విఫలమైంది. కనీసం ఆమె హంతకులను అయినా గుర్తించడంలో పోలీసులు క్రియాశీలంగా దర్యాప్తు చేస్తున్నారా అంటే అదీ లేదు. ముఖ్యమంత్రి, హోంమంత్రి అయినాసరే ఈ కేసు దర్యాప్తును పర్యవేక్షిస్తున్నారా అంటే అదసలే లేదు. సత్వర స్పందన లేదు.. సమగ్ర దర్యాప్తు అంతకన్నా లేదు.. నిజానికి.. అంజుమ్ గత ఆదివారం సాయంత్రం నుంచి కనిపించలేదు. దీంతో ఆమె తల్లిదండ్రులు షమియ, అజ్మతుల్లా ఆ రోజు సా.6 గంటల సమయంలోనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ, పోలీసులు సరైన రీతిలో స్పందించలేదు. పుంగనూరులోని అంజుమ్ కుటుంబం నివసించే యూబీ కాంపౌండ్ నుంచి చెంగాలాపురం రోడ్డు వరకే దర్యాప్తును పరిమితం చేయడం విడ్డూరంగా ఉంది. ఎందుకంటే పోలీసు జాగిలాలు చెంగలాపురం రోడ్డు వరకు వచ్చి ఆగిపోయాయి. దీంతో పోలీసుల దర్యాప్తు కూడా అక్కడితోనే నిలిచిపోయింది. అంతేగానీ అక్కడికి పది కి.మీ. పరిధిలో గాలింపు చర్యలు చేపట్టాలనిగానీ అనుమానితుల కదలికలపై ఆరా తీయాలనిగానీ వారికి అనిపించకపోవడం విస్మయపరుస్తోంది.చెంగలాపురం రోడ్డు వరకు జాగిలాలు వచ్చి ఆగిపోయాయి అంటే.. అక్కడ నుంచి ఆగంతకులు మరో వాహనంలో అంజుమ్‌ను తీసుకునిపోవచ్చనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేయనేలేదు. ఇక గత ఆదివారం అంజుమ్ నివాసం పరిసర ప్రాంతాల్లో అనుమానితుల కదలికలపైనా ఆరా తీయలేదు, స్థానిక ఆకతాయిలపై దృష్టిసారించనే లేదు. సెల్‌ఫోన్ టవర్ల డేటా, గూగుల్ టేకవుట్ డేటా విశ్లేíÙంచాలని అనిపించకపోవడం విడ్డూరం. ఆదివారం సాయంత్రం నుంచి బుధవారం వరకు పోలీసులు తూతూమంత్రంగా విచారణ పేరుతో విలువైన కాలాన్ని వృథా చేశారు. చివరికి.. బుధవారం మధ్యాహ్నం ఎన్‌ఎస్‌పేట సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్‌లో అంజుమ్ మృతదేహాన్ని గుర్తించారు. అంజూమ్ నివాసానికి ఆ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ 4 కి.మీ. దూరంలోనే ఉంది. అంటే.. పోలీసులు మూడ్రోజుల్లో కూడా కనీసం 4 కి.మీ. పరిధిలో కూడా గాలింపు చర్యలు చేపట్టలేదన్నది స్పష్టమవుతోంది.ఆరు రోజులైనా నిందితులను గుర్తించనేలేదు..పోనీ అంజుమ్ హంతకులను గుర్తించే దిశగా అయినా పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారా అంటే అదీ లేదు. చిన్నారి అంజుమ్ అపహరణకు గురై ఆరు రోజులు గడిచాయి. ఆమె మృతదేహాన్ని గుర్తించి మూడు రోజులైంది. ఇప్పటివరకు అసలు నిందితులను గుర్తించలేకపోవడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం. హత్యకు గల కారణాలనూ పోలీసులు నిర్ధారించలేకపోయారు. స్థానికంగా ఉండే ఓ మహిళతోపాటు గంజాయికి బానిసలైన నలుగురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. ప్రభుత్వం తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు గంజాయి వ్యసనపరులపైకి నేరాన్ని నెట్టివేసేందుకు యత్నిస్తోందని స్థానికులు సందేహం వ్యక్తంచేస్తున్నారు. అంతేతప్ప.. అంజుమ్‌ను అపహరించి హత్యచేసిన అసలు దోషులను గుర్తించేందుకు సమగ్రంగా దర్యాప్తు చేయడంలేదని చెబుతున్నారు. కేసును ఏదో విధంగా క్లోజ్ చేయాలనే దిశగానే పోలీసులు ప్రయత్నిస్తున్నారు తప్ప.. అసలు దోషులను గుర్తించేందుకు చిత్తశుద్ధితో దర్యాప్తు చేయడంలేదని కూడా వారు విమర్శిస్తున్నారు. -
కాగితాలకు ఉన్న విలువ ప్రాణాలకు లేదా?
సాక్షి, అమరావతి / పుంగనూరు: రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబబునాయుడు కాగితాలకు ఇచ్చిన విలువ రాష్ట్రంలో ప్రజల భద్రతపట్ల.. మరీ ముఖ్యంగా మహిళలు, బాలికల రక్షణకు ఇవ్వడంలేదనడానికి పుంగనూరులో ఏడేళ్ల ముస్లిం బాలిక హత్యోదంతం మరో నిదర్శనం. అగ్నిప్రమాదంలో నాలుగు ఫైళ్లు తగలబడితే తీవ్రంగా స్పంచించిన చంద్రబాబు.. రాష్ట్రంలో బాలికలు, మహిళలను అపహరించుకుని పోయి అత్యాచారాలు చేస్తున్నా, హత్యలకు తెగబడుతున్నా పట్టించుకోవడంలేదు. సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారిక హోదాతో కూడిన బాధ్యతతోనే కాదు.. కనీసం మానవతా దృక్పథంతో కూడా స్పందించకపోవడంపట్ల సర్వత్రా ఆగ్రహం వెల్లువెత్తుతోంది. రాజకీయ కక్షలు, వేధింపులకు ఇస్తున్న ప్రాధాన్యం, ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు దు్రష్పచారాలకు కేటాయిస్తున్న సమయంలో పదో వంతు కూడా బాలికలు, మహిళల రక్షణకు ఉపయోగించడం లేదని చిత్తూరు జిల్లా పుంగనూరులో ముస్లిం బాలిక అశ్వియ అంజుమ్ విషాదాంతం రుజువు చేస్తోంది. రెండు నెలల క్రితం ముచ్చుమర్రిలో వాసంతి తప్పిపోయిందన్నా బాబు సర్కారు పట్టించుకోలేదు. చివరకు మృతదేహాన్ని కూడా అప్పచించలేక వాసంతి చనిపోయిందని ఓ మాట తల్లిదండ్రులకు చెప్పేసి ప్రభుత్వం తప్పించుకొంది. తమ కుమార్తె కనిపించడంలేదంటూ పుంగనూరుకు చెందిన ముస్లిం కుటుంబం మూడు రోజులు వేనోళ్ల వేడుకొన్నా బాబు ప్రభుత్వంలో కదలిక లేదు. మూడు రోజుల తర్వాత బాలిక మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పజెప్పి అయిందనిపించేసుకుంది. రాష్ట్రంలో ఇన్ని దారుణాలు జరుగుతున్నా సీఎం చంద్రబాబు కనీసం పట్టించుకోవడంలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీస స్పందన లేని చంద్రబాబు చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో ముస్లిం బాలిక అశ్వియ అంజుమ్‌ను అపహరించి హత్య చేసినా ఆయన కనీసం స్పందించకపోవడం ప్రజలను విస్మయానికి గురిచేస్తోంది. చిన్నారి విషాదాంతంపై ఆయన ఇప్పటి వరకు స్పందించనే లేదు. మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ప్రమాదవశాత్తూ అగ్ని ప్రమాదం సంభవించి కొన్ని కాగితాలు కాలిపోతే చంద్రబాబు చేసిన రాద్ధాంతం అంతా ఇంతా కాదు. ఆ ఉదంతాన్ని రాజకీయ ప్రయోజనాలకు వాడుకునేందుకు వైఎస్సార్సీపీపై దు్రష్పచారం చేశారు. అంతేకాదు డీజీపీ ద్వారకా తిరుమల రావు, సీఐడీ అదనపు డీజీ రవిశంకర్ అయ్యన్నార్ను వెంటనే ప్రత్యేక హెలికాప్టర్లో మదనపల్లి పంపించారు. రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియానూ అక్కడికి పంపారు. ఎలాగైనా వైఎస్సార్సీపీ నేతలపై అక్రమ కేసులు బనాయించాలని ఒత్తిడి చేశారు. కానీ పుంగనూరులో ఏడేళ్ల బాలిక అంజుమ్‌ను ఆగంతకులు అపహరించుపోతే ముఖ్యమంత్రిగా కనీసం స్పందించలేదు. డీజీపీతో మాట్లాడలేదు. సత్వరం స్పందించి బాలికను సురక్షితంగా తీసుకురావాలని జిల్లా ఎస్పీకీ చెప్పలేదు. అసలు ఆ విషయాన్నే పట్టించుకోలేదని అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. తిరుపతిలోనే ఉన్నా.. స్పందించని పవన్ ఎన్నికలకు ముందు వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో 34 వేలమంది బాలికలను అపహరించారని దు్రష్పచారం చేసి, మహిళల రక్షణ పట్ల పెద్ద పెద్ద ఉపన్యాసాలిచ్చిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. గత మూడు నెలలుగా రాష్ట్రంలో యథేచ్ఛగా బాలికలు, మహిళల అపహరణ, అత్యాచారాలపై మౌనవత్రం పాటిస్తున్నారు. కళ్లెదుట జరుగుతున్న ఘోరాలపై స్పందించడమే లేదు. నంద్యాల జిల్లా ముచ్చిమర్రులో వాసంతి కిడ్నాప్, హత్య ఉదంతంపై పవన్ పోలీసు శాఖను ప్రశ్నించలేదు. చిత్తూరు జిల్లా పుంగనూరులో ముస్లిం బాలిక అంజుమ్ అపహరణ, హత్యకు బాధ్యత తీసుకోవడంలేదు. బుధ, గురువారాల్లో తిరుపతిలోనే ఉన్న ఆయన.. సమీపంలోని పుంగనూరులో జరిగిన దారుణాన్ని పట్టించుకోలేదని ప్రజా సంఘాలు, మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. చిన్నారి అంజుమ్ హత్యపై ముస్లింల ఆగ్రహం చిన్నారి అశ్వియ అంజుమ్(7) కిడ్నాప్, హత్యపై ముస్లింలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆరు రోజులు గడుస్తున్నా నిందితుల ఆచూకి కనుగొనలేకపోయారని మండిపడ్డారు. శుక్రవారం నమాజ్ అనంతరం అంజుమన్ కమిటీ ఆధ్వర్యంలో వేలాది ముస్లింలు నిరసన ప్రదర్శన నిర్వహించారు. జాతీయ పతాకాన్ని పట్టుకుని అశ్వియ ఫోటోలను ప్రదర్శిస్తూ ఎంబిటి రోడ్డులోని మదీన మసీదు నుంచి తూర్పు మొగసాల, సుబేదారు వీధి, పోస్టాఫీసు వీధి, నాగపాళెం, ఇందిరా సర్కిల్, పోలీస్‌స్టేషన్ మీదుగా గోకుల్ సర్కిల్ చేరుకున్నారు. అక్కడ సమావేశమై చిన్నారి హత్య కేసులో నిందితులను వెంటనే పట్టుకొని, ఉరితీయాలని డిమాండ్ చేశారు. చిన్నారి కుటుంబానికి రక్షణ కల్పించాలని కోరారు. ముస్లింల నినాదాలతో పట్టణం దద్దరిల్లింది. ముస్లింల ప్రదర్శనతో జాతీయ రహదారిపై ట్రాఫిక్ స్తంభించింది. -
మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి పీఏ కిడ్నాప్‌నకు యత్నం
మాచర్ల: మాచర్లలో మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పీఏ ఎం.శ్రీనివాస శర్మను కిడ్నాప్ చేయడానికి టీడీపీ వర్గీయులుగా భావిస్తున్న కొందరు గూండాలు ప్రయత్నించారు. పోలీసులు రంగంలోకి దిగడంతో ఆయన్ని వదిలేసి పరారయ్యారు. శర్మ కుటుంబ సభ్యులు, స్థానికుల కథనం ప్రకారం.. పిన్నెల్లికి చాలా కాలం నుంచి పీఏగా పనిచేస్తున్న శ్రీనివాస శర్మను టీడీపీ వర్గీయులు కొందరు టార్గెట్ చేసుకున్నారు. శనివారం సాయంత్రం పట్టణంలోని ఆయన ఇంటికి టీడీపీ గుర్తులు కలిగిన స్కారి్పయో వాహనంలో గుర్తు తెలియని ఐదుగురు దుండగులు వచ్చారు.ఇంటి ముందు వాహనాన్ని ఆపి హడావుడిగా దిగారు. ఆ ప్రాంతానికి ఇతరులు రాకుండా ముగ్గురు నిలబడగా, ఇద్దరు ఇంటి ముందు తలుపులను కర్రలతో కొట్టారు. అవి రాకపోవటంతో మరో వైపు నుంచి తలుపులు బద్దలుకొట్టి దౌర్జన్యంగా ఇంటిలోకి ప్రవేశించి శ్రీనివాస శర్మను బెదిరించారు. తన భర్తను ఏమీ అనవద్దని, కొట్టవద్దని శర్మ భార్య వేడుకొన్నా వారు దౌర్జన్యంగా ప్రవర్తించారు. శర్మ రావాల్సిందేనని, లేకపోతే ఊరుకునేది లేదని బెదిరించారు. శ్రీనివాసశర్మ రానని చెప్పటంతో బయట ఉన్న ముగ్గురు కూడా లోపలకు వచ్చారు. శర్మను బలవంతంగా ఎత్తుకొని తీసుకెళ్లి వాహనంలో ఎక్కించారు.స్కార్పియోలో గుంటూరు రోడ్డు వైపు తీసుకెళ్లారు. మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లికి కూడా పలువురు సమాచారమిచ్చారు. పట్టణ, నియోజక వర్గంలోని సీఐలు వెంటనే రంగంలోకి దిగారు. కిడ్నాప్ చేసిన వారి ఆచూకీ తెలుసుకొనేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. దీంతో కిడ్నాపర్లు శ్రీనివాస శర్మను కారంపూడి సమీపంలో వదిలివేసి పరారయ్యారు. ఆయన తెలిసిన వారి వాహనం ఎక్కి మాచర్లలోని ఇంటికి చేరుకున్నారు. వెంటనే కారంపూడి, మాచర్ల అర్బన్, రూరల్ సీఐలు శర్మ ఇంటికి చేరుకొని జరిగిన సంఘటనపై విచారణ జరిపారు. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నట్లు మాచర్ల అర్బన్ సీఐ చెప్పారు. -
వాంగ్మూలాలు మార్చేద్దాం.. వాస్తవాలు కప్పెట్టేద్దాం
సాక్షి, అమరావతి: వలపు వల విసిరి పారిశ్రామికవేత్తలను బురిడీ కొట్టించి ఆస్తులు కొల్లగొట్టే కి‘లేడీ’ కాదంబరి జత్వానీ కేసులో తిమ్మిని బమ్మి చేసేందుకు టీడీపీ కూటమి సర్కారు కుట్రలకు పదునుపెడుతోంది. ఈ కేసుకు వక్రభాష్యం చెబుతూ రాజకీయ కక్ష సాధింపు కుట్రను వేగవంతం చేస్తోంది. గతంలో ఈ కేసుకు సంబంధించి అధికారులు, సాక్షులు ఇచ్చిన వాంగ్మూలాలు తప్పని ముద్ర వేసేందుకు కుయుక్తులు పన్నుతోంది. నారా లోకేశ్ దుగ్ధతో తన రెడ్‌బుక్‌లో ప్రస్తావించిన పోలీసు అధికారులపై కక్ష సాధించడంతోపాటు వైఎస్సార్సీపీ సర్కారుపై దుష్ప్రచారం చేసేందుకు పావులు కదుపుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు, హోంమంత్రి అనిత తదితరులంతా ఈ కేసులో నిందితురాలికి వత్తాసు పలుకుతూ మాట్లాడటం ప్రభుత్వ పన్నాగాన్ని బట్టబయలు చేస్తోంది. టీడీపీ పెద్దల ఒత్తిడి మేరకు విజయవాడ పోలీసు ఉన్నతాధికారులు ఈ కేసును వక్రీకరిస్తూ రాజకీయ కక్ష సాధింపు ఉపకరణాలుగా మారుతున్నారు. ఆ ముగ్గురు ఐపీఎస్‌లే లక్ష్యం... మేం చెప్పినట్లు వాంగ్మూలాలివ్వండి మాయలేడీ కాదంబరి జత్వానీ బ్లాక్‌మెయిలింగ్ చేయడంతోపాటు ఫోర్జరీ పత్రాలతో తనకు చెందిన 5 ఎకరాలను దక్కించుకోవడంపై బాధితుడు విద్యాసాగర్ ఈ ఏడాది ఫిబ్రవరిలో విజయవాడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం న్యాయస్థానం సమ్మతితో కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో పోలీసు అధికారుల బృందం ముంబై వెళ్లి అక్కడి పోలీసుల సహకారంతో ఆమెను అరెస్ట్ చేసింది. అనంతరం ముంబై న్యాయస్థానంలో హాజరుపరచి ట్రాన్సిట్ వారెంట్‌పై విజయవాడకు తీసుకువచ్చారు. అదే రోజు విజయవాడ న్యాయస్థానంలో హాజరుపరచగా న్యాయమూర్తి రిమాండ్ విధించారు. అనంతరం న్యాయస్థానం ఐదు రోజులు పోలీసు కస్టడీకి అనుమతించడంతో కాదంబరి జత్వానీ వ్యక్తిగత న్యాయవాది సభ, ప్రభుత్వ వీఆర్వో సమక్షంలో విచారించారు. ఫోర్జరీ పత్రాలకు సంబంధించిన సాక్షులు, 5 ఎకరాలను విక్రయించేందుకు అడ్వాన్స్ ఇచ్చిన వారు... ఇలా పలువురు సాక్షులను విచారించారు. పోలీసుల విచారణతో సంతృప్తి చెందిన న్యాయస్థానం ఆమెకు రిమాండ్ విధించింది. అంతా చట్ట ప్రకారం సాగిన ఈ కేసుకు వక్రభాష్యం చెప్పాలంటే ఏం చేయాలనే ఆరాటంతో టీడీపీ కూటమి సర్కారు మల్లగుల్లాలు పడుతోంది. ఈ క్రమంలో గతంలో వాంగ్మూలాలు ఇచ్చిన సాక్షులు, అధికారులను విజయవాడ పోలీసులు పిలిపించి తీవ్రస్థాయిలో బెదిరిస్తున్నారు. నాడు ఐపీఎస్‌ల ఒత్తిడితో వాంగ్మూలు ఇచ్చామని చెప్పాలంటూ వేధిస్తున్నారు. లేదంటే తీవ్ర పరిణామాలు తప్పవని బెదిరిస్తున్నారు. అప్పట్లో ముంబై వెళ్లిన పోలీసుల బృందంలో కిందిస్థాయి అధికారులను కూడా బెదిరిస్తున్నట్లు తెలుస్తోంది. లోకేశ్ రెడ్‌బుక్‌లో పేర్కొన్న ఓ సీనియర్ ఐపీఎస్‌తోపాటు మరో ఇద్దరు ఐపీఎస్‌ల ఒత్తిడితోనే తాము కాదంబరి జత్వానిపై తప్పుడు కేసులు నమోదు చేసినట్లు చెప్పాలని బెదిరిస్తుండటం గమనార్హం. తాజాగా దీనిపై విచారణ అధికారిగా డీసీపీ కె.స్రవంతి రాయ్‌ను నియమించినా గతంలో ఇచ్చిన దానికి విరుద్ధంగా వాంగ్మూలాలు ఇప్పించే ప్రక్రియను విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్‌బాబు స్వయంగా పర్యవేక్షిస్తుండటం గమనార్హం. ప్రభుత్వ పెద్దల నుంచి స్పష్టమైన ఆదేశాలతోనే ఆయన ఇలా వ్యవహరిస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఈ ఉదంతం పోలీసు శాఖలో ప్రస్తుతం కలకలం సృష్టిస్తోంది. గతంలో సక్రమంగా సాగిన విచారణను.. కోర్టు కూడా ఆమోదించిన విచారణ ప్రక్రియను కేవలం రాజకీయ దురుద్దేశంతో తిరగదోడి అక్రమ కేసులు బనాయించడం విస్మయం కలిగిస్తోందని పోలీసు వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. విజయవాడ కమిషరేట్‌లో హైడ్రామా హైడ్రామాలో భాగంగా కి‘లేడీ’ కాదంబరి జత్వానిని శుక్రవారం విజయవాడ రప్పించారు. ఓ స్టార్ హోటల్లో ఆమెకు బస కల్పించి కొందరు పోలీసు అధికారులు ఆమెకు తాము సిద్ధం చేసిన స్క్రిప్ట్ అందించారు. గతంలో చెప్పిన విషయాలను వక్రీకరిస్తూ ఎలా మాట్లాడాలో తర్ఫీదు ఇచ్చారు. తన తల్లి, న్యాయవాదులతో విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబును కలిసిన అనంతరం విచారణ అధికారి స్రవంతి రాయ్‌తో ఆమె చర్చించినట్లు తెలుస్తోంది. పోలీసు అధికారులు ముందుగా అందచేసిన స్క్రిప్‌్టనే ఆమె వల్లించినట్లు సమాచారం. తనను బెదిరించి సంతకాలు తీసుకున్నారని పేర్కొన్నట్లు తెలుస్తోంది. అయితే ఆమె వాదన అసంబద్ధమని పోలీసు వర్గాలు, పరిశీలకులు స్పష్టం నిజంగానే బలవంతంగా తెల్ల కాగితాలపై సంతకాలు తీసుకుని ఉంటే ముంబై వెళ్లిన వెంటనే ఆ విషయాలను బయటపెట్టి న్యాయస్థానంలో కేసు వేసేవారని పేర్కొంటున్నారు. అంబరీష్ జత్వానీ స్మగ్లర్.. పారిశ్రామికవేత్తలు, రాజకీయనేతలు, బ్యూరోక్రాట్లను బ్లాక్మెయిల్ చేసి భారీగా ఆస్తులు కొల్లగొట్టే కుట్రలో కాదంబరి జత్వానీకి ఆమె తమ్ముడు అంబరీష్ జత్వానీ భాగస్వామి అనే విషయం పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. దుబాయ్ అండర్ వరల్డ్ మాఫియాతో సన్నిహిత సంబంధాలున్న అంబారీష్ జత్వానీ అంతర్జాతీయ స్మగ్లర్ కూడా. గతంలో బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తూ అహ్మదాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో కస్టమ్స్ అధికారులకు చిక్కాడు. 2021 డిసెంబర్ 30న 599.490 గ్రామాలు బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తుండగా కస్టమ్స్ అధికారులు అరెస్ట్ చేశారు. ఇక సజ్జన్ జిందాల్తోసహా పలువురు పారిశ్రామికవేత్తలను బ్లాక్మెయిల్ చేసి భారీగా ఆస్తులు గుంజడంలో అతను పాత్రధారిగా వ్యవహరించాడు. హనీట్రాప్, బ్లాక్‌మెయిలింగ్ జత్వాని కుటుంబ దందా– ‘సాక్షి’ టీవీ చర్చలో కుక్కల విద్యా సాగర్ ‘బ్లాక్‌మెయిలింగ్, ఫోర్జరీలకు పాల్పడి అక్రమంగా ఆస్తులు కొల్లగొట్టడం కాదంబరి జత్వానీ, ఆమె కుటుంబం దందా. పెళ్లి చేసుకోవాలని లేదంటే ఆస్తులు రాసివ్వాలని బెదిరిస్తారు. సంతకాలు ఫోర్జరీ చేయడం, బోగస్ డాక్యుమెంట్లు సృష్టించడం, ఆస్తులు కొల్లగొట్టడం పక్కా కుట్రతో చేస్తారు. ఈ దందాలో కాదంబరి జత్వానీతోపాటు ఆమె తల్లి, సోదరుడు అంబరీశ్, ఇతర కుటుంబ సభ్యులు భాగస్వాములు. నాతోపాటు జిందాల్, ఏసియన్ పెయింట్స్ లాంటి పెద్ద పారిశ్రామిక సంస్థల కుటుంబాలకు చెందినవారితోపాటు ముంబై, ఢిల్లీ, బెంగళూరు తదితర నగరాల్లో ఎంతోమంది కాదంబరి జత్వాని బాధితులున్నారు. 2009లో నటాషా అనే పేరుతో పరిచయం చేసుకుంది. తనకు రెండేసి చొప్పున పాస్‌పోర్ట్‌లు, ఆధార్ కార్డులు ఉన్నాయి. ఎన్నోసార్లు బ్లాక్మెయిల్ చేసి డబ్బులు అడిగేది. నా ఫోటోలను మార్ఫింగ్ చేసి బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడింది. జగ్గయ్యపేటలో నా 5 ఎకరాల భూమిని ఫోర్జరీ పత్రాలతో ఇతరులకు విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఈ ఏడాది ఫ్రిబవరిలో తెలియడంతో పోలీసులకు ఫిర్యాదు చేశా. పోలీసులు కేసు నమోదు చేసి చట్ట ప్రకారం ఆమెను అరెస్ట్ చేసి న్యాయస్థానం ఎదుట హాజరుపరిచారు. నాలాంటి ఎంతోమంది మోసపోకుండా సమర్థంగా వ్యవహరించారు. నాకు వైఎస్సార్సీపీతో ఎలాంటి సంబంధం లేదు. 2014 ఎన్నికల ముందు మా నాన్న నాగేశ్వరరావు చనిపోవడంతో ఆయన ఇన్చార్జిగా ఉన్న పెనమలూరు నుంచి వైస్సార్సీపీ తరపున పోటీ చేయాల్సి వచ్చింది. ఎన్నికల ఫలితాల అనంతరం రాజకీయాలకు దూరంగా ఉంటున్నా. అప్పటి నుంచి నాకు ఏ పార్టీతోనూ సంబంధాలు లేవు. కాదంబరి జత్వానీని హఠాత్తుగా పిలిపించి తప్పుడు ఆరోపణలు చేయిస్తుండటం వెనుక పక్కా కుట్ర ఉంది. ఆమె నుంచి గత ఫిబ్రవరిలో పోలీసులు స్వాధీనం చేసుకున్న 7 ఫోన్లలోని వివరాలను ఎందుకు బయటపెట్టడం లేదు? ఈ కేసు విషయంలో న్యాయపోరాటానికి సిద్ధంగా ఉన్నా. బ్లాక్‌మెయిలింగ్ రాజకీయాలకు భయపడేదే లేదు.’ -
కొడుకు కోసం.. తల్లి నిర్బంధం
బషీరాబాద్: షాద్‌నగర్ దళిత మహిళపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించిన ఘటన మరవకముందే వికారాబాద్ జిల్లా బషీరాబాద్ పోలీస్‌స్టేషన్‌లో మరో దారుణం.. పదహారేళ్ల బాలిక కిడ్నాప్ కేసులో నిందితుడైన కొడుకు ఆచూకీ చెప్పాలంటూ బాలుడి తల్లిని పోలీసులు చిత్రహింసలకు గురిచేశారు. రోజూ స్టేషన్‌కు పిలవడం.. కొడుకు గురించి వివరాలు చెప్పాలని ఒత్తిడి చేస్తూ సాయంత్రం వరకు కూర్చోబెట్టడం.. మధ్యలో లాఠీలతో విచక్షణారహితంగా కొట్టడం.. గడిచిన మే నుంచి ఆగస్టు 15 వరకూ ఇదే వరస.. కాలూచేయీ కూడ దీసుకోలేని స్థితిలో భర్త.. తను పనికి వెళ్తే కానీ పూట గడవని దుస్థితి.. పోలీసులు మాత్రం ఆమె పొట్టకొడుతూ మూడున్నర నెలలుగా ఠాణా చుట్టూనే తిప్పుతున్నారు.పంద్రాగస్టు సందర్భంగా వార్తా సేకరణకు బషీరాబాద్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లిన మీడియా ప్రతినిధులకు దీనస్థితిలో స్టేషన్ ముందు కూర్చున్న ఆమె కంటపడింది. ఆరా తీస్తే ఈ దారుణం వెలుగుచూసింది. బాధితురాలు, గ్రామస్తులు తెలిపిన ప్రకారం వివరాలిలా ఉన్నాయి. కుమారుడిపై కిడ్నాప్ కేసు.. బషీరాబాద్ మండలం నవల్గా గ్రామానికి చెందిన లోహడ నరేష్ (17), కాశీంపూర్ గ్రామానికి చెందిన బాలిక (16) ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుని మే 2న ఇంట్లోంచి పారిపోయారు. తమ కూతురును నరేష్ కిడ్నాప్ చేశాడంటూ బాలిక కుటుంబసభ్యులు బషీరాబాద్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మే 4న నరే‹Ùపై పోలీసులు కిడ్నాప్ కేసు నమోదు చేశారు. బాలుడి తల్లి కళావతి, తండ్రి నర్సప్ప కూలి పనులు చేసుకుంటూ పొట్టపోసుకుంటున్నారు. పోలీసులు కళావతిని మే నెలలోనే ఠాణాకు పిలిపించారు. ఎస్ఐ రమేశ్‌కుమార్ ఆమెను విచారిస్తూ.. ‘నీ కొడుకు మైనర్ పిల్లను ఎత్తుకొనిపోయాడు.వాడు ఎక్కడున్నాడో రెండు రోజుల్లో వెతికి తీసుకురావాలి. లేదంటే వాణ్ణి నేనే పట్టుకొచ్చి తుపాకీతో కాల్చి చంపేస్తా..’అంటూ బెదిరించాడు. దీనికి కళావతి స్పందిస్తూ.. ‘కూలి పనులు చేసుకునే మాకు ఏం తెలుసు సారూ.. వాడు పట్నంలో పనిచేసుకునేవాడు. కాశీంపూర్ పిల్లతో ప్రేమ కుదిరింట. అది పిల్ల తల్లికి కూడా తెలుసు. వారు ఎక్కడికి పోయారో నాకు తెలీదు’ అని చెప్పింది. దీంతో ఎస్ఐ ఒక్కసారిగా ఆవేశానికి లోనై లాఠీతో విచక్షణారహితంగా కొట్టారు. ఆ దెబ్బలకు చేతులు, కాళ్లు వాచిపోయాయని, నడవడానికి కూడా రాలేదని బాధితురాలు వాపోయింది. ‘ఆ రోజు నుంచి ప్రతీ రోజు పోలీస్ స్టేషన్‌కి వస్తున్నా. రోజూ ఉదయం 9 గంటలకు పోలీస్ స్టేషన్‌కి వచ్చి కూర్చోవాలి. తాగడానికి నీళ్లు కూడా ఇవ్వరు. ఆకలితో రాత్రి 9 గంటల వరకు ఉండి సారుకు చెప్పి ఇంటికెళ్తున్న. నిన్న ఒక్క రోజే (బుధవారం) స్టేషన్‌కు రాలేదు’అంటూ ఠాణాకు వెళ్లిన విలేకరులకు చెబుతూ కళావతి కన్నీటి పర్యంతమైంది. రోజు కూలి పనులు చేసుకునే తమకు మూడు నెలలుగా పనిలేక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ ఘటనపై దళిత సంఘాలు ఆగ్రహం వ్యక్తంచేశాయి. ఎస్ఐపై చట్టపరమైన చర్యలు తీసుకుని, కళావతికి న్యాయం చేయాలని సీపీఎం జిల్లా నాయకుడు శ్రీనివాస్ డిమాండ్ చేశారు. విచారణ జరుపుతాం: అశోక్, సీఐ తాండూరు రూరల్ కిడ్నాప్ కేసు విషయం మా దృష్టిలో ఉంది. కిడ్నాపర్ మైనర్ అయినా అరెస్టు చేయాల్సిందే. విచారణలో భాగంగా బాలుడి తల్లిని బషీరాబాద్ ఎస్ఐ స్టేషన్‌కు పిలిచి విచారించారు. ఎస్ఐ ఆమెను కొట్టాడనే విషయం మా దృష్టికి రాలేదు. దీనిపై విచారణ జరుపుతాం. -
బాప్ రే బాప్.. వర్చువల్ కిడ్నాప్
పాతబస్తీకి చెందిన ఓ యువతి ఇంట్లోంచి బయటికి వెళ్లింది. అదే సమయంలో ఆమె తల్లిదండ్రులకు ఓ వ్యక్తి ఫోన్ చేసి.. మీ కుమార్తెను కిడ్నాప్ చేశామని, తక్షణమే డబ్బు ఇవ్వకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని భయపెట్టాడు. దీంతో తల్లిదండ్రులు ఫోన్ చేసిన వ్యక్తి చెప్పిన అకౌంట్‌కు రూ.12 వేలు ట్రాన్స్ఫర్ చేశారు. అయితే యువతి కిడ్నాప్ కాలేదని, ఆ ఫోన్ కాల్ తప్పుడుదని తేలింది హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ పశ్చిమ మండలం పరిధిలోని ఓ పోలీసుస్టేషన్లో పనిచేసే సబ్–ఇన్స్పెక్టర్కు గత వారం ఫోన్‌కాల్ వచ్చింది. ఓ వ్యక్తి ‘మీ కుమార్తెను కిడ్నాప్ చేశాం’ అన్నాడు. అప్రమత్తమైన ఆయన.. తొలుత తమ కుమార్తె వివరాలు ఆరా తీశారు. ఆమె సురక్షితంగా ఉన్నట్లు గుర్తించి, తప్పుడు ఫోన్‌కాల్‌గా తేల్చుకున్నారు...సైబర్ నేరగాళ్లకు కొత్త అస్త్రంగా మారుతున్న ‘వర్చువల్ కిడ్నాప్’ ఉదంతాలకు ఉదాహరణలు ఇవి. బాధితుల అత్యాశ, భయం, బలహీనతలను ఆధారంగా చేసుకుని రెచ్చిపోయే సైబర్ నేరగాళ్లు కొత్తగా మొదలుపెట్టినవే ఈ కిడ్నాప్ కాని కిడ్నాపులు. సోషల్ మీడియాలో పోస్టులను గమనించడం ద్వారా.. ఎదుటి వారి వ్యక్తిగత విషయాలు తెలుసుకుని డబ్బులు దండుకునేందుకు నుసరిస్తున్న సరికొత్త రూట్ ఇది. ఇలాంటి సైబర్ నేరగాళ్ల పట్ల నగరవాసులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. సాక్షి, హైదరాబాద్కొన్నాళ్లు అధ్యయనం చేసి రంగంలోకి..ఇటీవలికాలంలో సోషల్ మీడియా వినియోగం గణనీయంగా పెరిగి పోయింది. స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరికీ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్ తదితర ఖాతాలు ఉంటున్నాయి. లైకులు, కామెంట్లు, ఫాలోవర్ల క్రేజ్‌లో చాలా మంది వ్యక్తిగత విషయాలు, ఇతర అంశాలనూ పోస్టు చేస్తున్నారు. తమ కుటుంబం, పిల్లల వివరాలు, అభిరుచులు, విద్య, ఉద్యోగం వంటివీ చెప్పేస్తున్నారు. సైబర్ నేరగాళ్లు ఇవన్నీ నిశితంగా గమనించి ఆయా అంశాల ఆధారంగా ‘వర్చువల్ కిడ్నాప్’ టార్గెట్స్‌ను ఎంచుకుంటున్నారు. వారిని సంప్రదించడానికి అవసరమైన ఫోన్ నంబర్‌ను సోషల్ మీడియా ద్వారానే సంపాదిస్తున్నారు.‘సరైన సమయం’లో ఫోన్లు చేస్తూ..వివరాల సేకరణ పూర్తయ్యాక సైబర్ నేరగాళ్లు అసలు పని మొదలుపెడుతున్నారు. టార్గెట్ చేసిన వ్యక్తి సంతానం విద్యార్థులైతే పాఠశాలలు/కళాశాలల పనివేళలు, ఉద్యోగస్తులైతే వర్కింగ్ అవర్స్‌ను ఎంపిక చేసుకుంటున్నారు. టార్గెట్ చేసిన వ్యక్తులకు ఆ సమయాల్లో ఫోన్ చేసి, పిల్లల్ని కిడ్నాప్ చేశామని బెదిరిస్తున్నారు. ఎదుటివాళ్లు తేరు కునేందుకు, వెనుకా ముందు ఆలోచించేందుకు సమయం ఇవ్వకుండా భయభ్రాంతులకు గురి చేస్తున్నారు.కిడ్నాప్ చేసిన వారిని వదిలిపెట్టాలంటే వెంటనే సొమ్మును బ్యాంక్ ఖాతాలు/యూపీఐ ద్వారా ట్రాన్స్ఫర్ చేయాలని ఒత్తిడి చేస్తున్నారు. చాలా సందర్భాల్లో సైబర్ నేరగాళ్లు డిమాండ్ చేసేది కొంత మొత్తమే కావడంతో బాధితులు తొందరపడి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. ఆపై అసలు విషయం తెలుసుకుని మోస పోయినట్టు గుర్తిస్తున్నారు. ఈ తరహా బాధితుల్లో చాలా వరకు కేసు పెట్టడానికి ముందుకురావడం లేదు కూడా.బోగస్ పేర్లతో ఖాతాలు, సిమ్కార్డులువర్చువల్ కిడ్నాప్ నేరాలకు పాల్పడేవారు ఎట్టి పరిస్థితుల్లో తమ ఉనికి బయటపడకుండా జాగ్రత్త పడుతున్నారు. విషయం పోలీసుల వరకు వెళ్లినా దర్యాప్తులోముందుకు వెళ్లకుండా వ్యవహరిస్తున్నారు. ఇతరుల పేర్లతో లేదా బోగస్ వివరాలతో ఓపెన్ చేసిన బ్యాంకు ఖాతాలు, సెల్‌ఫోన్ నంబర్లను వినియోగిస్తున్నారు.మన భయమే వాళ్ల పెట్టుబడి..వర్చువల్ కిడ్నాప్ వ్యవహారంలో బాధితుల భయాందోళనలే సైబర్ నేరగాళ్లకు వరంగా మారుతున్నాయి. పాతబస్తీకి చెందిన దంపతుల విషయమే తీసుకుంటే.. వారి కుమార్తె ఇంటి నుంచి బయటకు వెళ్లిన సమయంలో సైబర్ నేరగాడు ఫోన్ చేసి కిడ్నాప్ చేసినట్టు బెదిరించాడు. వారు భయపడి కుమార్తెను ఫోన్ ద్వారా సంప్రదించే ప్రయత్నం చేశారు. ఆమె నుంచి స్పందన లేకపోవడంతో అపహరణ జరిగిందని భయపడ్డారు. కనీసం ఫోన్ చేసిన వ్యక్తి ఎవరనిగానీ, అమ్మాయి వివరాలేమిటనిగానీ ఆరా తీయలేదు.సైబర్ నేరగాడు డబ్బు డిమాండ్ చేయగా.. తమ బ్యాంకు ఖాతాలో రూ.12 వేలే ఉన్నాయని చెప్పారు. ఆ మొత్తం పంపినా మీ కుమార్తెను వదిలేస్తామనడంతో.. వెంటనే సొమ్ము యూపీఐ చేశారు. ఈ రోజుల్లో కిడ్నాపర్ అంత చిన్న మొత్తానికి ఒప్పుకోవడం ఏమిటని కూడా ఆలోచించలేదు. తర్వాత హడావుడిగా పోలీసులను ఆశ్రయిస్తే.. అధికారులు యువతి లొకేషన్, ఇతర వివరాలు ఆరా తీసి సురక్షితంగానే ఉన్నట్టు తేల్చారు. దీంతో తల్లిదండ్రులు ఫిర్యాదు చేయకుండానే వెళ్లిపోయారు.సోషల్ మీడియాలో వ్యక్తిగత వివరాలు పెట్టొద్దుఇటీవలి కాలంలో సోషల్ మీడియా వినియోగం గణనీయంగా పెరిగింది. వర్చువల్ కిడ్నాప్ తరహా ఉదంతాలకూ అదే కారణం. ఎవరికి వారు తమ వివరాలు, అలవాట్లు, చేస్తున్న పనులను పోస్టు చేస్తున్నారు. ఇది సైబర్ నేరగాళ్లకు కలసి వస్తోంది. పార్ట్‌టైమ్ జాబ్స్, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్తోపాటు అనేకరకాల సైబర్ నేరాలకు సోషల్ మీడియా ఖాతాలే ఆధారం అవుతున్నాయి. అందుకే వీలైనంత వరకు ‘బీ లెస్ ఇన్ సోషల్ మీడియా’ అన్నది పాటించాలి. సైబర్ నేరగాళ్లు ప్రలోభపెట్టినా, భయపెట్టినా వారి ట్రాప్‌లో పడకుండా జాగ్రత్తగా ఉండాలి..’’ - ఆర్జీ శివమారుతి, ఏసీపీ, హైదరాబాద్ సైబర్ క్రైమ్ ఠాణా -
ఇష్టపడితే దూరం పెట్టాడని...
ఉప్పల్ (హైదరాబాద్): ఓ యువతి టీవీ యాంకర్‌ను ఇష్టపడింది. అయితే అతను నో చెప్పడంతో కిడ్నాప్‌నకు పథకరచన వేసింది. అది కాస్త ఫెయిల్ కావడంతో కటకటాలపాలైంది. ఉప్పల్ పీఎస్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. శుక్రవారం దీనికి సంబంధించిన వివరాలు మల్కాజిగిరి ఏసీపీ పురుషోత్తంరెడ్డి విలేకరులకు వెల్లడించారు. మాదాపూర్ అరుణోదయకాలనీకి చెందిన బోగిరెడ్డి త్రిష్ణ ఓ డిజిటల్ మార్కెటింగ్ సంస్థకు సీఈఓ. భారత్ మ్యాట్రిమోని పేరుతో ఇన్‌స్ర్ట్రాగాంలో చైతన్యరెడ్డి త్రిష్ణకు పరిచయమయ్యాడు. అయితే చైతన్యరెడ్డి ఉప్పల్‌కు చెందిన టీవియాంకర్ ప్రణవ్సిస్టా ఫొటోను తన ఇన్‌స్ట్రాగామ్ ప్రొఫైల్‌కు వాడుకున్నాడు. ప్రణవ్ ఫొటో చూసి త్రిష్ణ ఇష్టం పెంచుకుంది. వాట్సాప్ ద్వారా మెసేజ్‌లు పంపుతూ దగ్గరైంది. దీనిని అదనుగా భావించిన చైతన్యరెడ్డి తన వ్యాపారంలో పెట్టుబడి పెట్టమని త్రిష్ణను కోరాడు. దీంతో ఆమె పెద్ద మొత్తంలో ఫోన్‌పే ద్వారా పంపింది. తిరిగి డబ్బు చెల్లించమని అడగ్గా కాలయాపన చేస్తున్నాడు. దీంతో అప్రమత్తమైన త్రిష్ణ కూపీ లాగగా, చైతన్యరెడ్డి ఫేక్ ఐడీ ద్వారా ప్రణవ్ సిస్టా ఫొటో వాడుకొని మోసం చేసినట్టు నిర్థారణకు వచి్చంది. వెంటనే ప్రణవ్ను మెసేజ్‌ల ద్వారా అలర్ట్ చేసింది. దీంతో ఆయన సైబర్ క్రైమ్‌లో ఫిర్యాదు చేశాడు. తర్వాత మెసేజ్‌ల ద్వారా పరిచయం పెంచుకొని ప్రణవ్ను మరింతగా ఇష్టపడింది. ఎలాగైనా అతడిని వశం చేసుకోవాలని ప్రయత్నించింది. ఆ ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో తన కార్యాలయంలో పనిచేసే నలుగురి ద్వారా ప్రణవ్ వివరాలు తెలుసుకుంది. ఉప్పల్‌లో పార్కు చేసిన ప్రణవ్ కారుకు వారు జీపీఎస్(యాపిల్ ఎయిర్ ట్యాగ్) బిగించారు. దీని ద్వారా ప్రణవ్ కదలికలను గుర్తిస్తూ అతన్ని బ్లాక్మెయిల్ చేయడం ప్రారంభించింది. అయినా ప్రణవ్ దారికి రాలేదు. దీంతో కిడ్నాప్‌నకు ప్లాన్ వేసింది. రూ.50,000 సుపారీ ఇచ్చింది. దీంతో కిడ్నాపర్లు రంగంలోకి దిగి ఈ నెల 11న అర్ధరాత్రి ఉప్పల్ లిటిల్ ఫ్లవర్ కళాశాల వెనుక రోడ్డులో ప్రణవ్ను అడ్డగించారు. తమ కారులో ఎక్కించుకొని కిడ్నాప్ చేసి చితకబాదుతూ త్రిష్ణ కార్యాలయానికి తీసుకొచ్చారు. వారి నుంచి ఎలాగో అలా తప్పించుకొని వచ్చిన ప్రణవ్ ఉప్పల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన ఉప్పల్ పోలీసులు కేసులో ప్రధాన నిందితురాలైన త్రిష్ణను అరెస్టు చేసి శుక్రవారం రిమాండ్‌కు తరలించారు. మిగిలిన కిడ్నాపర్ల కోసం వేట ప్రారంభించినట్టు ఏసీపీ తెలిపారు. నిందితుల్లో ఇద్దరు గతంలో పలు నేరాలకు పాల్పడినట్టు పోలీసులు భావిస్తున్నారు. నిందితురాలి సెల్‌ఫోన్, కారుకు వాడిన జీపీఎస్ ట్యాగ్ స్వాధీనం చేసుకున్నారు. -
ప్రియుడితో కలిసి అన్నను కిడ్నాప్ చేయించిన చెల్లి..
హైదరాబాద్: గతంలో వచ్చన ‘మనీ’ సినిమాను తలదన్నేలా.. గుర్రం సురేందర్ కిడ్నాప్ ఉదంతం సంచలనం సృష్టించింది. డబ్బు కోసం ఆ చిత్రంలో భార్యను భర్త కిడ్నాప్ చేయగా.. వాస్తవ జీవన చిత్రంలో మాత్రం ప్రేమికుడితో కలిసి ఓ చెల్లెలు తన సోదరుడిని అపహరించిన కేసును పోలీసులు 48 గంటల్లో ఛేదించారు. డబ్బుల కోసం చిన్నాన్న కూతురే తన ప్రియుడితో కలిసి అపహరణకు తెర లేపడం దిగజారిపోతున్న మానవతా విలువలకు అద్దం పట్టింది. ఎంతో ప్రేమగా.. సొంత సోదరిలా చూసుకునే అన్ననే అపహరించి.. ఆపై పోలీసులకు చిక్కిన వ్యవహారం తాజాగా వెలుగుచూసింది. ఆదివారం గచ్చి»ౌలిలోని మాదాపూర్ డీసీసీ కార్యాలయంలో ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఇన్చార్జి డీసీపీ శ్రీనివాస్‌రావు వెల్లడించారు. నల్లగొండ పట్టణానికి చెందిన గుర్రం సురేందర్, భార్య నాగమణితో కలిసి గోకుల్ ప్లాట్స్‌లో ఉంటూ ఓ ప్రైవేట్ కంపెనీలో టెక్నికల్ సపోర్టర్‌గా పని చేస్తున్నాడు. ఆయన చిన్నాన్న కూతురు గుర్రం నిఖిత (22) నగరంలోనే సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తోంది. ఈ క్రమంలో ఈ నెల 4న సాయంత్రం తన సోదరుడు సురేందర్‌కు ఫోన్ చేసిన నిఖిత.. ఆఫీస్‌లో కొందరు తనను వేధిస్తున్నారని, ఖాజాగూడ చెరువు వద్దకు వచ్చి మాట్లాడాలని కోరగా వచ్చాడు. నిఖితతో అతడు మాట్లాడుతుండగా.. అక్కడికి వచి్చన ఐదుగురు ఆగంతకులు సురేందర్‌ను కారులోకి లాక్కువెళ్లి కిడ్నాప్ చేశారు. ఈ సమయంలో సమీపంలోనే ఇద్దరు వ్యక్తులు అనుమానంతో డయల్ 100కు కాల్ చేశారు. రాయదుర్గం పెట్రోల్ మొబైల్ పోలీసులు అక్కడికి చేరుకొని నిఖితను పీఎస్‌కు తీసుకెళ్లి విచారణ జరిపారు. తన సోదరుడిని ఎవరో కిడ్నాప్ చేశారని ఫిర్యాదు ఇచ్చి అక్కడినుంచి వెళ్లిపోయింది. ఈ క్రమంలో సురేందర్‌ను తీసుకువెళ్తున్న కిడ్నాపర్ల కారు కడ్తాల్ వరకు వెళ్లగానే బ్రేక్ డౌన్ అయింది. దీంతో కిడ్నాపర్లు నిఖితకు ఫోన్ చేయడంతో సురేందర్‌కు చెందిన కారులో ఆమె ప్రియుడు కృష్ణా జిల్లా పెనమలూరు పెద్దపులిపాకకు చెందిన బల్లిపర వెంకట కృష్ణ (28)తో కలిసి వచ్చి సదరు కారును వారికి ఇచి్చంది. పోలీసులు సెల్‌ఫోన్ మెసేజ్‌ల ఆధారంగా వెంబడించడంతో కిడ్నాపర్లు కడ్తాల్ నుంచి కర్నూలు వైపు వెళ్లారు. సురేందర్ భార్య నాగమణికి వాట్సాప్ కాల్స్ చేస్తూ రూ.2 కోట్ల డబ్బు సమకూర్చాలని, కిడ్నాప్ విషయం పోలీసులకు చెబితే చంపేస్తామని బెదిరించారు. దీంతో ఖమ్మంలో తల్లిగారింట్లో ఆమె హుటాహుటిన నగరంలోని గోకుల్ ప్లాట్స్‌కు వచి్చంది. ప్రత్యేక బృందాలతో గాలించి.. పోలీసులు ఆరు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి చెక్ పోస్టులను అలర్ట్ చేశారు. సీఐ మహేష్ బృందం కిడ్నాపర్లను వెంబడించారు. కర్నూలు దగ్గర్లోకి వెళ్లగానే ఆత్మకూరు వైపు కారు వెళుతున్నట్లుగా గుర్తించి అక్కడి పోలీసులు, చెక్‌పోస్ట్‌ను అప్రమత్తం చేశారు. శుక్రవారం రాత్రి 10 గంటల సమయంలో ఆత్మకూరు ఫారెస్ట్ చెక్‌పోస్ట్ వద్దకు వెళ్లగానే అక్కడి సిబ్బంది కారును ఆపారు. గమనించిన దుండగులు కారును రివర్స్ తీసుకొని పారిపోయేందుకు ప్రయతి్నంచి వెనక వాహనాలను ఢీకొట్టారు. అంతలోనే సిబ్బంది రావడంతో ముగ్గురు నిందితులు పారిపోగా భోజగుట్ట చెందిన షిండే రోహిత్ (19)ను పట్టుకున్నారు. తనను కిడ్నాప్ చేశారని, రాయదుర్గం పీఎస్‌లో కేసు నమోదైందని సురేందర్ వారికి చెప్పారు. కొద్ది సేపటికే రాయదుర్గం సీఐ మహేష్ బృందం అక్కడికి చేరుకొని ఇద్దరిని అదుపులోకి తీసుకుంది. ముగ్గురు ఫారెస్ట్‌లోకి పారిపోయారు. శనివారం సాయంత్రం 7 గంటల సమయంలో ఆత్మకూరు ఫారెస్ట్ ఏరియాలో అత్తాపూర్‌కు చెందిన గుంజపోగు సురేష్ అలియాస్ సూర్య (31), మెహిదీపటా్ననికి చెందిన రామగల్ల రాజు అలియాస్ లడ్డూ (20)లను అరెస్ట్ చేశారు. మరో నిందితుడు కడ్తాల్‌కు చెందిని చందు పరారీలో ఉన్నాడు. కారు బ్రేక్ డౌన్ అయిన సమయంలో కిడ్నాపర్లలో ఒకరైన అత్తాపూర్‌కు చెందిన వెంకట్ పరారయ్యాడు. సురేపై 22 కేసులు కిడ్నాప్‌లు, ఇంటి తాళాలు పగులగొట్టిన పలు కేసుల్లో గుంజపోగు సురేష్ నిందితుడు. హబీబ్‌నగర్, గాంధీనగర్, ఆసిఫ్‌నగర్, హయత్‌నగర్, సదాశివపేట్, గచ్చిబౌలి, రాజేంద్రనగర్, జీడిమెట్ల, అంగర్హౌస్, పటాన్చెరు, మియాపూర్, తెనాలీ రూరల్ పీఎస్‌లలో 22 కేసుల్లో నిందితుడిగా ఉన్నారు. నిఖిత ప్రియుడు బల్లిపర వెంకటకృష్ణపై జీడిమెట్ల పీఎస్‌లో ఎన్డీపీఎస్, కూకట్పల్లి పీఎస్‌లో కిడ్నాప్ కేసులు నమోదై ఉన్నాయి. గతంలోనే వెంకటకృష్ణకు జైలులో సురేష్ పరిచయమయ్యాడు. గత అక్టోబర్‌లోనే ఓ కిడ్నాప్.. ప్రధాన నిందితుడైన సురేష్ ముఠా గత అక్టోబర్ 10న కన్సల్టెన్సీ నిర్వాహకుడు శివశంకర్‌ను కిడ్నాప్ చేసి కోటి రూపాయలు డిమాండ్ చేసింది. శివశంకర్ భార్య నుంచి రూ.2 లక్షలు తీసుకొని విప్రో సర్కిల్లో వదిలిపెట్టారు. గచి్చ»ౌలి పీఎస్‌లో నమోదైన ఆ కేసులో నిందితులుగా ఉన్నారు. నిందితుల నుంచి పోలీసులు రెండు స్విఫ్ట్ డిజైర్ కార్లు, రెండు హోండా యాక్టివాలు, ఏడు సెల్ ఫోన్లు స్వా«దీనం చేసుకున్నారు. 48 గంటల్లో కేసును ఛేదించిన సీఐ మహే‹Ùను, సిబ్బందిని, ఏడీసీపీ నంద్యాల నర్సింహారెడ్డి, ఏసీపీ శ్రీనివాస్‌ను డీసీపీ శ్రీనివాస్ రావు అభినందించారు. కిడ్నాప్‌నకు స్కెచ్ ఇలా.. సాఫ్ట్వేర్ ఇంజినీరైన గుర్రం నిఖితకు నేర ప్రవృత్తి కలిగిన తోటి ఉద్యోగి బల్లిపర వెంకటకృష్ణను ఇష్టపడింది. వీరు త్వరలోనే పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఆర్థిక ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలంటే సురేందర్‌ను కిడ్నాప్ చేయాలని పథకం పన్నారు. అప్పటికే తమకు పరిచయం ఉన్న సురేష్‌ను సంప్రదించారు. సురేందర్‌ను కిడ్నాప్ చేస్తే వచ్చే డబ్బుల్లో వాటా ఇస్తామని ప్లాన్ వేశారు. డయల్ 100కు కాల్ వెళ్లకపోతే పోలీసులకు నిఖిత ఫిర్యాదు ఇచ్చేది కాదని పోలీసులు తెలిపారు. సురేందర్ భార్యతో ఇంట్లోనే ఉంటూ ఎప్పటికప్పుడు కిడ్నాపర్లకు సమాచారం అందించి దొరికిపోయింది. ఏ1 గుంజపోగు సురే‹Ù, ఏ2 బల్లిపర వెంకట కృష్ణ, ఏ3 గుర్రం నిఖిత, ఏ4 రామగల్ల రాజు, ఏ5 షిండే రోహిత్‌లను అరెస్ట్ రిమాండ్‌కు తరలించారు. -
సురేందర్ కిడ్నాప్ కేసు డీసీపి శ్రీనివాస్ రావు కీలక వ్యాఖ్యలు
హైదరాబాద్: రాయదుర్గం సాఫ్ట్ వేర్ ఉద్యోగి సురేందర్ కిడ్నాప్ కేసులో నిందితుల అదుపులో తీసుకున్నట్లు మాదాపూర్ ఇంచార్జి డీసీపి శ్రీనివాస్ రావు అన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కిడ్నాప్ కేసులో ఫిర్యాదు చేసిన నిఖితనే ప్రధాన నిందితురాలుగా వెల్లడించారు. కిడ్నాప్ కు గురైన సురేందర్ సోదరి నిఖితగ గుర్తించినట్లు తెలిపారు. తన సోదరుడు కిడ్నాప్ కు గురైనట్లు రాయదుర్గం పోలీసులకు నిఖిత ఫిర్యాదు చేసింది. నిఖితతో మాట్లాడుతున్నప్పుడే సురేంద్ర కిడ్నాప్ కు గురయ్యాడు. ఈనెల 4వ తేదీ ఉద్యోగి సురేందర్ కిడ్నాప్ చేశారని తెలిపారు. అయితే ఈ కేసు నమోదు చేసుకున్న కేవలం 48 గంటల్లో కిడ్నాప్ చేదించామని డీసీపీ వెల్లడించారు. డయల్ 100 కు ఇద్దరు సమాచార అందించారని, నిఖిత కిడ్నాప్ కు గురైన సమయంలో అక్కడే ఉందన్నారు. ఆమెతో పాటు మరో వ్యక్తిని వెంటనే విచారించామని అన్నారు. ప్రత్యేకంగా ఆరు టీమ్‌లను ఏర్పాటు చేసి ఈ కిడ్నాప్ ను ఛేదించినట్లు తెలిపారు. నిఖిత వెంకటకృష్ణ ఒకే చోట ఉద్యోగం చేస్తారు. సురేందర్ కు నిఖిత కజిన్ సిస్టర్ గా గుర్తించామన్నారు. నిఖితతో వెంకటకృష్ణకు పరిచయం ఉందని, వీళ్ళిద్దరూ కలిసి సురేష్ తో కలిసి కిడ్నాప్ కు ప్లాన్ చేశారని వెల్లడించారు. ఆ తర్వాత సురేష్ కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి రెండు కోట్లు డిమాండ్ చేశారని అన్నారు. పోలీసులకు సమాచారం తెలియడంతో సురేందర్ తో కుటుంబ సభ్యులకు కిడ్నాపర్లు ఫోన్ చేయించారు. వారికి సహకరించాలని చెప్పారని ముందే ప్లాన్ వేశారు. అయితే.. నిఖిత, వెంకటకృష్ణ లు పెళ్ళి చేసుకోవాలనుకున్నారు.. సురేష్ తో కలిసి నిఖిత , వెంకట కృష్ణలు కిడ్నాప్ ప్లాన్ వేసినట్లు తెలిపారు. గతంలోనూ వీళ్ళు కిడ్నాప్ లు చేసిన కేసులు వున్నాయని తెలిపారు. ప్రధాన నిందితుల పై పీడీ యాక్ట్ పెడతామన్నారు. సురేష్, వెంకటకృష్ణ లపై పలు కేసులు ఉన్నాయని, సురేష్ పై 21 కేసులు ఉండగా, వెంకటకృష్ణ పై రెండు కేసులు ఉన్నాయని డీసీపీ తెలిపారు. -
దారుణం: పట్టపగలే కిడ్నాప్.. టీచర్‌ను వ్యాన్‌లో ఎక్కించి..
బెంగళూరు: కర్ణాటకాలో పట్టపగలే దారుణం జరిగింది. అందరూ చూస్తుండగానే ఓ స్కూల్ టీచర్(23)ను దుండగులు కిడ్నాప్ చేశారు. ఎస్‌యూవీలో బలవంతంగా ఎక్కించుకుని వెళ్లిపోయారు. అర్పిత(23) స్థానికంగా ఓ పాఠశాలలో స్కూల్ టీచర్‌గా పనిచేస్తోంది. నేడు రాష్ట్రంలో స్కూళ్లకు సెలవు ఉన్న నేపథ్యంలో అర్పిత బయటకు వెళ్లారు. ఈ క్రమంలో ఆమెను వెంబడించారు దుండగులు. వెనుక నుంచి నెమ్మదిగా వచ్చి అమాంతం ఒక్కసారిగా ఎస్‌యూవీలో బలవంతంగా ఎక్కించుకుని వెళ్లిపోయారు. రాము అనే యువకుడే ఈ దారుణ ఘటనకు పాల్పడ్డారని బాధిత యువతి తల్లి ఆరోపిస్తోంది. రాము, అర్పిత గత నాలుగు ఏళ్లుగా ప్రేమించుకున్నారని తెలిపింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. సెలవు రోజు అర్పిత ఇంటి నుంచి బయటకు ఎందుకు వెళ్లారు? ఇతర అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ఇదీ చదవండి: రసాయన పరిశ్రమలో అగ్ని ప్రమాదం.. ఏడుగురు కూలీలు మృతి -
ఏకంగా యజమానినే కిడ్నాప్ చేసి.. రూ.4 కోట్లు తీసుకుని
కర్నూలు: జేసీబీ డ్రైవర్ ఏకంగా తన యజమానినే కిడ్నాప్ చేసి రూ.4కోట్లతో ఉడాయించిన ఘటన గత జూన్‌లో కలకలం రేపింది. ఈ కేసుకు సంబంధించి గతంలో 11 మందిని అరెస్టు చేయగా, ప్రస్తుతం ప్రధాన నిందితుడు సహా ముగ్గురిని అరెస్టు చేశారు. వీరి నుంచి రెండు విడతల్లో రూ.3.6 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ కె.రఘువీర్‌రెడ్డి శుక్రవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. బనగానపల్లి పట్టణానికి చెందిన వినాయకరెడ్డి క్రషర్ వ్యాపారం చేస్తూ ఉమ్మడి జిల్లాలో పారిశ్రామికవేత్తగా పేరు గడించాడు. అనంతపురం జిల్లా పెద్దవడుగూరు గ్రామానికి చెందిన నరేష్ ఇతని వద్ద గత నాలుగేళ్లుగా జేసీబీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అయితే క్రమంగా ప్రవర్తనలో మార్పు కనిపించడంతో వినయకరెడ్డి అతడిని తొలగించాడు. ఇది మనసులో పెట్టుకున్న నరేష్ అతన్ని కిడ్నాప్ చేసి కోట్లు రాబట్టేందుకు పథకం వేశాడు. అందులో భాగంగా కర్ణాటక రాష్ట్రంలోని కోలార్‌కు చెందిన సురేష్, శ్రీనివాస్, ఖలందర్, అజయ్, విజయ్, భార్గవ్, ప్రభు, ప్రకాష్, రంజిత్.. అనంతపురం జిల్లాకు చెందిన రవికుమార్, రంజిత్‌కుమార్, చెన్నా భాస్కర్, రఘులతో కిడ్నాప్‌నకు తెరలేపారు. అందరూ కలిసి గత జూన్ 3న బనగానపల్లిలో రెక్కీ నిర్వహించారు. 5వ తేదీ ఉదయం బనగానపల్లి నుంచి బేతంచర్లకు వినాయకరెడ్డితో పాటు ఆయన కుమారుడు భరత్‌కుమార్‌రెడ్డి డ్రైవర్‌తో కలిసి కారులో బయలుదేరారు. అదే సమయంలో కిడ్నాపర్లు నాలుగు కార్లలో వెంబడించి సీతారామాపురం మెట్ట వద్ద అడ్డగించారు. కత్తిని చూపించి భరత్‌కుమార్‌రెడ్డి, వినాయకరెడ్డిలను కిందకు దించారు. వారిని కిడ్నాపర్ల కారులో ఎక్కిస్తుండగా డ్రైవర్ సాయినాథ్‌రెడ్డి అడ్డుకున్నారు. కిడ్నాపర్లు తండ్రీ కొడుకులతో పాటు డ్రైవర్‌ను కూడా కారులోకి కుక్కి ఎత్తుకెళ్లారు. ఆ తర్వాత వినాయకరెడ్డి తండ్రి నాగిరెడ్డికి ఫోన్ చేసి రూ.4 కోట్లు ఇవ్వాలని, లేకుంటే వాళ్లను చంపుతామని బెదిరించారు. భయపడిన నాగిరెడ్డి బంధువుల వద్ద డబ్బు తీసుకుని మొదటగా అనంతపురం జిల్లా కొత్తపల్లి వద్ద రూ.2 కోట్లు.. ఆ తర్వాత కర్ణాటక రాష్ట్రంలోని కోలార్ వద్ద రూ.2 కోట్లు ముట్టజెప్పాడు. దీంతో కిడ్నాపర్లు 7వ తేదీన కర్ణాటక రాష్ట్రంలో ముగ్గురినీ విడిచిపెట్టారు. అయితే కిడ్నాపర్లు డబ్బు తీసుకొని కూడా తమ కుమారుడిని, మనవడిని వదిలిపెట్టరేమోనన్న ఆందోళనతో నాగిరెడ్డి జరిగిన విషయాన్ని బేతంచర్ల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు తమదైన శైలిలో విచారణ కొనసాగించారు. ఇంతలోనే కిడ్నాప్‌నకు గురైన ముగ్గురూ ఇంటికి చేరుకున్నారు. అయితే పోలీసులు జూన్ 30న గుత్తి పట్టణంలో 11 మందిని అరెస్ట్ చేసి రూ.40 లక్షల నగదు, కత్తి, మూడు సెల్ఫోన్లు, నాలుగు కార్లు స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న కిడ్నాప్ ప్రధాన నిందితుడు నరేష్, చెన్నా భాస్కర్, రఘులను శుక్రవారం వేకువజామున అనంతపురం జిల్లా గుత్తి వద్ద అరెస్ట్ చేశారు. వీరి నుంచి రూ.2.66 కోట్లు నగదు, రెండు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. గతంలో స్వాధీనం చేసుకున్న నగదుతో కలిపి మొత్తం రూ.3.6 కోట్లు రికవరీ చేసినట్లు ఎస్పీ తెలిపారు. కేసును త్వరితగతిన చేధించిన అడిషనల్ ఎస్పీ వెంకటరాముడుతో పాటు డోన్ డీఎస్పీ శ్రీనివాసరెడ్డి, సీఐ ప్రియతమ్‌రెడ్డి, ఎస్ఐలు శివశంకర్, నాయక్, రాకేష్, నరేష్, జగదీశ్వరరెడ్డి, రమేష్ రెడ్డి, హరినాథ్‌రెడ్డి, పీఆర్ఓ చెన్నయ్యలను ఎస్పీ అభినందించారు. -
విద్యార్థినిపై సామూహిక అత్యాచారం
సాక్షి బళ్లారి: నగరంలోని ఓ కళాశాలలో బీకాం చదువుతున్న విద్యార్థినిని సినీఫక్కీలో కిడ్నాప్ చేసి సామూహిక అత్యాచారం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈనెల 11న నలుగురు యువకులు కళాశాల వద్దకు వచ్చి మీ అన్న పిలుస్తున్నాడని చెప్పి సదరు విద్యార్థిని ఆటోలో కిడ్నాప్ చేసుకుని కొప్పళ జిల్లా సనాపురం పక్కన ఉన్న హోటల్‌కు తీసుకెళ్లి ఆమెకు మద్యం తాపించి అత్యాచారం చేశారు. ఈ ఘటనపై కౌల్‌బజార్ నవీన్, షాకిబ్, థనుతో పాటు మరొకరిపై మహిళా పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నిందితులు విద్యార్థినికి పరిచయం ఉన్నవారు కావడంతోనే ఆమె కళాశాల బయటకు వచ్చిన వెంటనే ఆటోలో కిడ్నాప్ చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుల్లో నవీన్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. -
కోడలు కిడ్నాప్ అంటూ అత్త డ్రామా
నరసరావుపేటరూరల్: తన కోడలను కిడ్నాప్ చేశారంటూ ఓ అత్త చేసిన హంగామాను డ్రామాగా పోలీసులు తేల్చారు. అత్తింట్లో వేధింపులు తట్టుకోలేక బంధువుల ఇంట్లో తలదాచుకున్న వివాహితను గుర్తించి విచారించగా అసలు విషయం వెలుగుచూసింది. రూరల్ పోలీసుల కథనం ప్రకారం ఉప్పలపాడు సమీపంలోని జగనన్న కాలనీలో సింగులూరి నాగలక్ష్మి, తన కుమారుడు కృష్ణ, కోడలు లక్ష్మీప్రణతితో నివాసం ఉంటున్నారు. కృష్ణ, లక్ష్మీప్రణతికి ఐదేళ్ల క్రితం వివాహం కాగా తరచూ భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీంతో లక్ష్మీప్రణతి పుట్టింటికి వెళ్లి వస్తూ ఉండేది. రెండునెలల తరువాత మంగళవారం అత్తింటికి వచ్చిన లక్ష్మీప్రణతిని అత్త, భర్త వేధించడం ప్రారంభించారు. భర్త తనపై చేయిచేసుకోవడంతో తట్టుకోలేక తన బంధువులకు లక్ష్మీప్రణతి సమాచారం ఇచ్చింది. బుధవారం రాత్రి బంధువులు జగనన్న కాలనీకి వచ్చి లక్ష్మీప్రణతిని తీసుకెళ్లారు. దీనిని కిడ్నాప్‌గా చిత్రీకరించిన నాగలక్ష్మి రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివరాలు నమోదు చేసుకున్న రూరల్ ఎస్ఐ బాలనాగిరెడ్డి లక్ష్మీప్రణతిని బంధువుల ఇంట్లో గుర్తించి విచారణ చేపట్టారు. తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని అత్త, భర్త వేధింపులు తట్టుకోలేక బంధువుల ఇంట్లో తలదాచుకున్నానని స్పష్టంచేసింది. దీంతో పోలీసులు అత్త, భర్తను స్టేషన్‌కు పిలిపించి మాట్లాడారు. -
మైనర్ బాలికను కిడ్నాప్ చేసి పెళ్లి.. హయత్‌నగర్‌లో వదిలి
మిర్యాలగూడ టౌన్: మైనర్ బాలికను కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకున్న యువకుడితో పాటు అతడికి సహకరించిన మరో ముగ్గురిని మంగళవారం పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. మిర్యాలగూడ రూరల్ సీఐ ముత్తినేని సత్యనారాయణ విలేకరులకు తెలిపిన వివరాల ప్రకారం.. మిర్యాలగూడ మండలం రుద్రారం గ్రామానికి చెందిన బాలిక ఈ నెల 22వ తేదీన ఇంటి నుంచి పాఠశాలకు వెళ్తున్నానని చెప్పి కనిపించకుండా పోయిందని కుటుంబ సభ్యులు మిర్యాలగూడ రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. కాగా మిర్యాలగూడ మండలం యాద్గార్పల్లి గ్రామానికి చెందిన చరణ్‌దీప్ తన తమ్ముడు శరత్‌తో పాటు అతడి మిత్రులు అంజి, మహేష్ కలిసి బాలికను బైక్‌పై ఎక్కించుకొని అడవిదేవులపల్లి మండల సమీపంలో ఆంధ్రప్రదేశ్‌లోని సత్రశాలకు తీసుకెళ్లారు. అక్కడ బాలికను చరణ్‌దీప్ వివాహం చేసుకున్నాడు. బాలికపై లైంగిక దాడికి పాల్పడటంతో పాటు హైదరాబాద్‌కు తీసుకెళ్లారు. దీంతో భయపడిన బాలిక నాన్న దగ్గరికి వెళ్తానని అనడంతో రంగారెడ్డి జిల్లా పరిధిలోని హయత్‌నగర్‌లో వదిలివేశారు. హయత్‌నగర్ బస్టాండ్ వద్ద బాలికను తల్లిదండ్రులు, పోలీసులు గుర్తించి ఇంటికి తీసుకొచ్చారు. బాలికను తీసుకెళ్లిన నలుగురు యువకులపై పోక్సో, నిర్భయ, అత్యాచారం, కిడ్నాప్ కేసులు నమెదు చేశారు. పరారీలో ఉన్న నలుగురు యువకులు మిర్యాలగూడ పట్టణ సమీపంలోని అవంతీపురంలో ఉన్నట్లు తెలుసుకున్న మిర్యాలగూడ రూరల్ పోలీసులు మంగళవారం వారిని అరెస్ట్ చేసి కోర్టులో రిమాండ్ చేశారు. నిందితులను పట్టుకున్న కానిస్టేబుల్ నాగయ్య, హోంగార్డు గోపిని సీఐ అభినందించారు. విలేకరుల సమావేశంలో మిర్యాలగూడ రూరల్ ఎస్ఐ దోరేపల్లి నర్సింహులు తదితరులున్నారు. -
మదనపల్లెలో కిడ్నాప్ కలకలం
మదనపల్లె : పట్టణ పరిధి అమ్మచెరువుమిట్టలోని ఆర్కే టైల్స్ యజమాని శ్రావణ్‌కుమార్‌ను ఆదివారం కడపకు చెందిన కొందరు వ్యక్తులు కిడ్నాప్ చేశారన్న విషయం కలకలం రేపింది. కడపకు చెందిన ముగ్గురు వ్యాపారులు 15 మందితో కలిసి రెండు వాహనాల్లో ఆర్కే టైల్స్ యజమాని శ్రావణ్‌కుమార్, బావమరిది రమేష్‌ను కొట్టుకుంటూ తీసుకెళ్లిపోయారన్న వార్త దావానలంలా వ్యాపించింది. తమ పార్టనర్, అతడి బావమరిది కిడ్నాప్‌కు గురయ్యారంటూ ఆర్కే టైల్స్ నగేష్ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు అప్రమత్తమయ్యారు. వెంటనే జిల్లా వ్యాప్తంగా సమాచారం అందించి నిఘా పెట్టారు. ఎట్టకేలకు గుర్రంకొండ పోలీస్‌స్టేషన్ పరిధిలో నిందితులు కిడ్నాప్ చేసిన వ్యక్తులతో సహా పోలీసులకు దొరికిపోయారు. పట్టణంలో సంచలనం సృష్టించిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలో అమ్మచెరువుమిట్ట వద్ద శ్రావణ్‌కుమార్, నగేష్‌లు ఆర్కే టైల్స్ పేరుతో టైల్స్ వ్యాపారం చేస్తున్నారు. వీరు గుజరాత్ నుంచి టైల్స్ తెప్పించి, స్థానికంగా హోల్‌సేల్ ధరకు విక్రయిస్తుంటారు. కడప జిల్లాకు చెందిన నాగబసిరెడ్డి, సునీల్‌రెడ్డి, లోకేష్‌రెడ్డిలు రాయచోటి, కడపలో టైల్స్ వ్యాపారం నిర్వహిస్తున్నారు. వీరు గుజరాత్ నుంచి టైల్స్ పెద్ద మొత్తంలో తెప్పించుకుని, అక్కడి వ్యాపారులకు డబ్బులు చెల్లించకుండా బెదిరింపులకు పాల్పడుతుండేవారు. ఈ క్రమంలో వ్యాపార లావాదేవీల్లో భాగంగా గుజరాత్‌కు వెళ్లిన ఈ ముగ్గురిని అక్కడి వ్యాపారులు మూకుమ్మడిగా నిర్బంధించి తమకు రావాల్సిన బాకీని వసూలు చేసుకున్నారు. దీనిని కడప వ్యాపారులు అవమానంగా భావించారు. తమకు గుజరాత్లో అవమానం జరిగేందుకు మదనపల్లెకు చెందిన ఆర్కే టైల్స్ యజమానులు శ్రావణ్‌కుమార్, నగేష్‌లు కారణమని, తమ సమాచారాన్ని వారికి అందించినందునే తాము ఇబ్బందులు పడ్డామని వీరిపై కక్ష పెంచుకున్నారు. దీంతో ఆదివారం సాయంత్రం కడప వ్యాపారులు రెండు వాహనాల్లో 15 మందిని వెంటపెట్టుకుని మదనపల్లె ఆర్కే టైల్స్ వద్దకు చేరుకున్నారు. ఆ సమయంలో శ్రావణ్‌కుమార్, అతడి బావమరిది రమేష్ షాపులో ఉన్నారు. తమ సమాచారం గుజరాత్ వ్యాపారులకు అందించి తమకు రూ.30 లక్షల వరకు నష్టం కలిగించారని, ఆ డబ్బులు మీరే చెల్లించాలంటూ ఇద్దరినీ బెదిరించారు. ఖాళీ బాండుపేపర్లపై రూ.30 లక్షలు బాకీ ఉన్నట్లు సంతకాలు పెట్టాల్సిందిగా ఒత్తిడి తెచ్చారు. వారు ససేమిరా అనడంతో ఎలా ఇవ్వరో చూస్తామంటూ మరో యజమాని నగేష్‌కు ఫోన్ చేసి.. ఇద్దరినీ కిడ్నాప్ చేసి తీసుకెళుతున్నామని, డబ్బులు ఇచ్చి విడిపించుకోవాల్సిందిగా చెప్పారు. దీంతో నగేష్ వన్‌టౌన్ సీఐ మహబూబ్‌బాషాకు ఫిర్యాదు చేయడం, ఆయన డీఎస్పీ కేశప్ప దృష్టికి తీసుకెళ్లడంతో అప్రమత్తమై జిల్లా ఎస్పీకి సమాచారం అందించి జిల్లాలోని అన్ని పోలీస్స్టేషన్లను అప్రమత్తం చేశారు. వాహన తనిఖీలు చేయాల్సిందిగా ఆదేశించారు. దీంతో గుర్రంకొండ వద్ద వాహన తనిఖీల్లో కిడ్నాపర్లు వాహనాలతో సహా పోలీసులకు దొరికిపోయారు. అక్కడ నుంచి వారిని మదనపల్లె వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కిడ్నాప్‌కు ఉపయోగించిన రెండు వాహనాలను స్వాధీనం చేసుకుని నిందితులను విచారణ చేస్తున్నట్లు తెలిసింది. కిడ్నాప్ ఘటనపై పోలీసులు తక్షణమే స్పందించి నిందితులను అరెస్ట్ చేయడంతో కథ సుఖాంతమైంది. -
సినీ దర్శకుడు కిడ్నాప్
కర్ణాటక: సినిమాలలో దర్శకుడు ఎన్నో కిడ్నాప్ ఘటనలను చిత్రీకరించి ఉంటాడు. కానీ తనే కిడ్నాప్‌కు గురవుతానని ఊహించి ఉండడు. నిజజీవితంలో అదే జరిగింది. సినిమా చాన్సిస్తానని డబ్బులు వసూలు చేసి ముఖం చాటేసిన సినిమా డైరెక్టర్‌ను కొందరు కిడ్నాప్ చేశారు. ఈ సంఘటన క్రిష్ణగిరి పట్టణంలో చోటుచేసుకొంది. వివరాల మేరకు కేరళ రాష్ట్రం పాలక్కాడుకు చెందిన క్రిష్ణ ప్రకాష్ (36), తమిళం, మలయాళం సినిమా రంగంలో దర్శకునిగా ఉన్నాడు. రెండు రోజుల క్రితం క్రిష్ణగిరి ప్రాంతంలో సినిమాను చిత్రీకరించేందుకు స్థల పరిశీలన కోసం వచ్చాడు. క్రిష్ణగిరి కొత్తబస్టాండులోని ఓ లాడ్జిలో బసచేశాడు. సోమవారం ఉదయం క్రిష్ణగిరి బస్టాండు వద్ద ఉన్న క్రిష్ణప్రకాష్తో కారులో వచ్చిన నలురు వ్యక్తులు వాగ్వివాదానికి దిగి అతన్ని కారులో కిడ్నాప్ చేశారు. ఈరోడ్‌లో పట్టివేత గమనించిన స్థానికులు పట్టణ పోలీసులకు సమాచారం అందజేశారు. వెంటనే పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. రాష్ట్రంలోని వివిధ పోలీస్స్టేషన్లకు సమాచారం అందజేశారు. ఈరోడ్ జిల్లా సత్యమంగలం పోలీసులు కారును అడ్డుకుని అందరినీ క్రిష్ణగిరి పోలీసులకు అప్పగించారు. గత ఏడాది క్రితం సత్యమంగలం ప్రాంతంలో కరికాలన్, కార్తికేయన్, శివశక్తి అనేవారి నుంచి సినిమాలలో అవకాశమిస్తానని రూ. 2.50 లక్షల నగదును తీసుకొన్నాడు. కానీ అవకాశాలు ఇవ్వకపోవడంతో ఏదో ఒకటి తేల్చుకోవాలని కిడ్నాప్ చేశామని చెప్పారు. నిందితులను అరెస్ట్ చేసి తీవ్ర విచారణ జరుపుతున్నారు. -
Hyderabad: జీఎస్టీ అధికారి కిడ్నాప్ కేసులో గుంటూరు టీడీపీ నేతలు
సాక్షి ప్రతినిధి, గుంటూరు: జీఎస్టీ సీనియర్ అధికారిని కిడ్నాప్ చేసిన కేసులో గుంటూరు టీడీపీ నేతలు, కుటుంబ సభ్యులను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. గుంటూరు నగర టీడీపీ నేత సయ్యద్ ముజీబ్, ఆయన కుటుంబ సభ్యులు సయ్యద్ ఫిరోజ్, సయ్యద్ ఇంతియాజ్‌లకు హైదరాబాద్ సరూర్‌నగర్ పరిధిలోని క్రాంతినగర్ రోడ్ నంబర్ 2లో ఇనుము వ్యాపారం ఉంది. ప్రస్తుతం గుంటూరులోని ఆర్టీసీ కాలనీలో నివాసం ఉంటున్నారు. జీఎస్టీ చెల్లించకపోవటంతో బుధవారం జీఎస్టీ, ఇంటెలిజెన్స్ అధికారులు హైదరాబాద్‌లోని దుకాణాన్ని సీజ్‌చేసేందుకు వెళ్లారు. ఆ అధికారులపై ముజీబ్, ఫిరోజ్, ఇంతియాజ్, వారి కారు డ్రైవర్ షేక్ ముషీర్ దాడిచేశారు. గుంటూరు నుంచి తాము వెళ్లిన కారులోనే అధికారుల్ని కిడ్నాప్ చేశారు. అధికారుల డ్రైవర్ ద్వారా సమాచారం అందుకున్న సరూర్‌నగర్ పోలీసులు కిడ్నాప్‌నకు పాల్పడిన నలుగురిని అదుపులోకి తీసుకుని అధికారులను రక్షించారు. ముజీబ్ ప్రస్తుతం గుంటూరు తూర్పు నియోజకవర్గం నుంచి టికెట్ ఆశిస్తున్నారు. ఆ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. లోకేశ్ పాదయాత్రలో కూడా పాల్గొన్నారు. హైదరాబాద్‌లో కిడ్నాప్ వ్యవహారంలో గుంటూరు టీడీపీ నేతలు అరెస్ట్ కావడం చర్చనీయాంశమైంది. కుటుంబసభ్యులంతా నేరచరితులే... గుంటూరుకు చెందిన ముజీబ్ కుటుంబ సభ్యులు తొలినుంచి నేరచరిత్ర కలిగి ఉన్నారు. గుంటూరు ఆర్టీసీ కాలనీలో ఒక భూమిని ఆక్రమించిన కేసులో ముజీబ్ సోదరుడు ఫిరోజ్, ఇంతియాజ్, బషీర్లపై రౌడీషీట్లున్నాయి. ఆటోనగర్‌లో సైతం గతంలో కత్తులు తీసుకుని ఆ ప్రాంతమంతా హల్చల్ సృష్టించిన విషయంలో కాకాని పోలీసుస్టేషన్లో కేసు నమోదైంది. దీంతోపాటు కొంతమందిపై దాడిచేసిన కేసులున్నాయి. ఈ క్రమంలో తెలంగాణలోని హైదరాబాద్‌లో ముజీబ్, అతడి సోదరులపై అధికారులను కిడ్నాప్ చేసిన కేసు నమోదైంది. తొలినుంచి వివాదాలకు దిగే ముజీబ్, అతడి కుటుంబ సభ్యులపై మరోమారు కేసు నమోదవడంపై టీడీపీలో కూడా చర్చ జరుగుతోంది. ముజీబ్ సోదరుడు సయ్యద్ ఫిరోజ్ రౌడీïÙట్ కలిగి ఉండటంతో పాటు టీడీపీ నగర ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. ముజీబ్ తండ్రి మాత్రం తన కుమారుడు అమాయకుడని, అతడిపై కుట్ర జరిగిందని పేర్కొంటున్నారు. -
అప్పు తిరిగి ఇవ్వాలని అడిగిన మాజీ ప్రియుడు.. కిడ్నాప్ చేసిన తాజా ప్రేమికుడు
హైదరాబాద్: తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరిన మాజీ ప్రియుడిని.. తాజా ప్రేమికుడితో కలిసి కిడ్నాప్ చేయాలని యత్నించిన ఓ యువతి సంఘటన ఘట్కేసర్ పీఎస్ పరిధిలో ఆదివారం కలకలం లేపింది. సీఐ మహేందర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం..మేడిపల్లికి చెందిన కీసర అవినాశ్‌రెడ్డి (29) పీర్జాదిగూడ బుద్దానగర్కు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి కుమార్తె అరోషికారెడ్డి (25) అలియాస్ అన్షితారెడ్డి గతంలో ప్రేమించుకున్నారు. 2016 నుంచి 2021 వరకు వీరి మధ్య స్నేహం, ప్రేమ కొనసాగాయి. ఈ నేపథ్యంలోనే అన్షితారెడ్డి తన అవసరాల కోసం అవినాశ్‌రెడ్డి వద్ద రూ.25 లక్షలు తీసుకుంది. అనంతరం కొద్దిరోజుల తర్వాత అన్షితారెడ్డి అతడ్ని దూరం పెట్టి మాదాపూర్‌లో ఉండే సిద్దిపేట్‌కు చెందిన చక్రధర్‌గౌడ్‌తో స్నేహం ఏర్పరుచుకుంది. ఈ విషయం తెలుసుకున్న అవినాశ్‌రెడ్డి ఆమెతో విభేదించి..తనవద్ద తీసుకున్న డబ్బులు తిరిగివ్వాలని డిమాండ్ చేశాడు. దీంతో కోపం పెంచుకున్న అన్షితారెడ్డి ఎలాగైనా అవినాశ్‌రెడ్డిని అంతం చేయాలని భావించి చక్రధర్‌గౌడ్‌తో కలిసి కిడ్నాప్‌నకు పథకం వేశారు. ఈమేరకు ఆదివారం సాయంత్రం ఘట్కేసర్లోని వరంగల్–హైదరాబాద్ జాతీయ రహదారిపై ఉన్న ఓ హోటల్ వద్దకు వస్తే తీసుకున్న డబ్బులు ఇస్తామని నమ్మబలికారు. దీంతో అవినాశ్‌రెడ్డి అక్కడకురాగానే అప్పటికే అక్కడ తన అనుచరులతో కలిసి మాటువేసి ఉన్న చక్రధర్‌గౌడ్..అవినాశ్‌రెడ్డిని కారులోకి బలవంతంగా ఎక్కించారు. ఈ క్రమంలో ఘర్షణ జరగడంతో స్థానికులు గమనించి అక్కడికి రాగా...కిడ్నాపర్లు అక్కడి నుంచి పారిపోయారు. బాధితుడు అవినాశ్‌రెడ్డి అక్కడి నుంచి తప్పించుకుని ఘట్కేసర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. దీంతో తక్షణమే స్పందించిన పోలీసులు చక్రధర్‌గౌడ్, కారు డ్రైవర్ మామిండ్ల గౌత్మ్ను పీర్జాదిగూడలో అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. కాగా చక్రధర్‌గౌడ్‌కు అప్పటికే పెళ్లయి..ఇద్దరు సంతానం ఉన్నట్లు, అన్షితారెడ్డిని ఆర్యసమాజ్‌లో వివాహమాడినట్లు సమాచారం. ఈ మేరకు ఘట్కేసర్ పోలీసులు విచారిస్తున్నారు. -
రాత్రంతా ముళ్ల పొదల్లోనే..
ఎమ్మిగనూరురూరల్: ఆలనాపాలనా చూసుకోవాల్సిన తల్లి వదిలేసి వెళ్లింది.. సంరక్షకుడిగా ఉన్న తండ్రి అనారోగ్యంతో మృతి చెందాడు.. చిన్నమ్మ వద్ద ఉంటున్న బాలుడికి పెద్ద కష్టమొచ్చింది. గుర్తు తెలియని వ్యక్తి బిస్కెట్లో మత్తు మందు ఇచ్చి కిడ్నాప్ చేశాడు. అనంతరం బాలుడిని ముళ్లపొదల్లో వదిలేశాడు. రాత్రంతా బాలుడు అక్కడే ఉన్నాడు. ఉదయం మెలకువ వచ్చిన తర్వాత తాను ఉన్న ప్రాంతాన్ని చూసి భయంతో వణికిపోయాడు. ఈ ఘటన ఎమ్మిగనూరు పట్టణంలో చోటుచేసుకుంది. వివరాలు.. స్థానిక శివన్న నగర్లో బాలుడు నరేష్(12) తన చిన్నమ్మ వీరేశమ్మ దగ్గర ఉంటున్నాడు. మనస్పర్ధలు రావటంతో బాలుడి తండ్రి వీరేష్, తల్లి సరోజమ్మలు ఐదు సంవత్సరాల క్రితం విడిపోయారు. తండ్రి వీరేష్ వద్ద బాలుడిని వదిలేసి తల్లి తన పుట్టినిల్లు అయిన గోనెగండ్ల మండలం పెద్దమర్రివీడుకు వెళ్లిపోయింది. వీరేష్ అనారోగ్యంతో మృతి చెందడంతో బాలుడు నరేష్ తన చిన్నమ్మ వీరేశమ్మ దగ్గర ఉంటున్నాడు. స్థానిక పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్నాడు. ఆదివారం అమావాస్య కావడంతో టెంకాయ తీసుకురావడానికి వెళ్లి ఎంతకూ తిరిగి రాలేదు. దీంతో బాలుడి మేనత్త భాగ్య, చిన్నమ్మ వీరేశమ్మ వెతికినా ఎక్కడా కనిపించకపోవటంతో రాత్రి పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సోమవారం ఉదయం బాలుడి మేనత్త శివన్ననగర్లోని బంక్ పరిసర ప్రాంతంలో వెతుకుతుండగా ముళ్లపొదల పక్కన బాలుడు పడుకుని ఉండటం గమనించింది. ముఖంపై నీళ్లుచల్లి.. ఏమి జరిగిందని నరేష్‌ను విచారించగా.. టోపీ పెట్టుకున్నవ్యక్తి వచ్చి తనకు బిస్కెట్ ఇచ్చాడని, మత్తురావటంతో ఆ వ్యక్తి తనను తీసుకెళ్లినట్లు చెప్పాడు. బాలుడిని తీసుకెళ్లిన వ్యక్తి మత్తు బిస్కెట్ ఎందుకు ఇచ్చాడు, తీసుకెళ్లి ముళ్లపొదల్లో ఎందుకు పడేశాడు అనేది తెలియరాలేదు. బాలుడు భయంతో వణికిపోతున్నాడు. ముళ్లు శరీరంపై గుచ్చుకున్న ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. నరేష్‌ను మేనత్త భాగ్య సోమప్ప నగర్లో తన ఇంటికి తీసుకొచ్చింది. పట్టణంలో పిల్లలను ఎత్తుకెళ్లే వ్యక్తులు సంచరిస్తున్నారనే వదంతులతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. -
విశాఖ కిడ్నాప్ కేసు: లవర్‌కు 40 లక్షలు పంపిన హేమంత్
దొండపర్తి (విశాఖ దక్షిణ): ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 48 గంటలపాటు ఎంపీ కుటుంబ సభ్యులకు కిడ్నాపర్లు నరకం చూపించారు. రూ.20 కోట్లు ఇవ్వాలంటూ విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ భార్య జ్యోతి, కుమారుడు శరత్, ప్రముఖ ఆడిటర్ గన్నమనేని వెంకటేశ్వరరావు(జీవీ)ను చిత్ర హింసలు పెట్టారు. ఈ వ్యవహారంపై పోలీసులు చేపట్టిన దర్యాప్తులో అనేక కీలక అంశాలు వెలుగు చూశాయి. పోలీసుల దర్యాప్తులో వెల్లడైన వివరాల ప్రకారం.. భీమిలి ప్రాంతానికి చెందిన కోలా వెంకట హేమంత్ కుమార్ ఈ ఏడాది ఫిబ్రవరిలో మధుసూదనరావు అనే రియల్ ఎస్టేట్ వ్యాపారిని కిడ్నాప్ చేసిన కేసులో జైలుకు వెళ్లాడు. చోరీలు చేసే రాజేష్, ఇతర గ్యాంగ్‌తో అక్కడ అతనికి పరిచయం ఏర్పడింది. చిన్న చిన్న చోరీలు చేసే కంటే ఒకేసారి బిగ్‌షాట్‌ను కిడ్నాప్ చేస్తే సెటిల్ అయిపోవచ్చని హేమంత్ వారికి ఆశపెట్టాడు. టార్గెట్ ఎంపీ కుటుంబం బయటకు వెళ్లాక రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే ఎంపీ ఎం.వి.వి.సత్యనారాయణ కుటుంబ సభ్యులను కిడ్నాప్ చేయాలని నిర్ణయించారు. హేమంత్‌కుమార్, రాజేష్, సాయి, చిన్న సాయి, గోవర్ధన్, మరో వ్యక్తి కలిసి ఎంపీ కొత్త ఇంటి వద్ద రెక్కీ నిర్వహించారు. ఇంట్లోకి చొరబడి ఎంపీ కుమారుడు శరత్‌పై దాడి చేశారు. కాళ్లు, చేతులు కట్టేశారు. శరత్‌తో ఫోన్ చేయించి సెక్యూరిటీ గార్డును పంపించేశారు. శరత్ ఒంటిపై ఉన్న బంగారం దోచుకున్నారు. మరుసటి రోజు ఉదయం శరత్‌తో ఫోన్ చేయించి ఒంట్లో బాగోలేదని చెప్పించి, తల్లి జ్యోతిని ఆ ఇంటికి రప్పించారు. ఆమె వద్ద ఉన్న బంగారాన్ని తీసుకుని, ఆమెనూ బంధించారు. అనంతరం ఎంపీ ఎంవీవీ స్నేహితుడు జీవీ వద్ద డబ్బులు ఉంటాయని భావించి అతనికి బలవంతంగా ఫోన్ చేయించి రప్పించారు. హేమంత్ రాజేష్‌లు అతడిపై దాడి చేసి.. చేతులు, కాళ్లు కట్టేశారు. కారు డ్రైవర్‌ను అక్కడి నుంచి వెళ్లిపోవాలని ఫోన్ చేయించారు. రూ.20 కోట్లు ఇస్తావా? లేదా ఇల్లు, స్థలం రాసిస్తావా? అసలు ఎందుకు తమను నిర్బంధించారని, ఏం కావాలో చెబితే ఇస్తామని జీవీ కిడ్నాపర్లకు చెప్పగా.. రూ.100 కోట్లు కావాలి ఇస్తావా? అని హేమంత్ ప్రశ్నించాడు. అంత డబ్బు ఉండదని, తమను వదిలేస్తే రూ.5 కోట్ల వరకు సమకూరుస్తామని చెప్పారు. దానికి హేమంత్ అంగీకరించలేదు. ఎవరికి ఫోన్ చేస్తే డబ్బులు వస్తాయో వారి పేర్లను హేమంత్కుమారే సూచించి, ఫోన్లు చేయించారు. ఇలా జీవీ రూ.కోటి వరకు సమకూర్చి డ్రైవర్ ద్వారా ఆ డబ్బు తెప్పించారు. వచ్చిన డబ్బులో హేమంత్‌కుమార్, రాజేష్‌లకు 40 శాతం చొప్పున, సాయికి 10 శాతం, ఇతర ఖర్చుల కోసం 10 శాతం పంపకాలు చేసుకున్నారు. శరత్ బ్యాంక్ అకౌంట్లో రూ.65 లక్షలు జీవీ అకౌంటెంట్ ద్వారా విత్‌డ్రా చేయించి తెప్పించుకున్నారు. వచ్చిన డబ్బులో రూ.21 లక్షలు బెయిల్ కోసం రాజేష్ అనే లాయర్‌కు పంపించారు. లవర్‌కు రూ.40 లక్షలు నజరానా హేమంత్‌కుమార్ తన వాటాలో వచ్చిన డబ్బులో రూ.40 లక్షలు తన లవర్ సుబ్బలక్ష్మికి ఇవ్వాలని భావించాడు. అయితే గతంలో చేసిన కిడ్నాప్ వ్యవహారంలో ఇతనితో పాటు సుబ్బలక్ష్మి కూడా జైలుకు వెళ్లింది. ఫలితంగా వీరి మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయి. రూ.40 లక్షలు ఇచ్చి మళ్లీ ఆమెకు దగ్గరవ్వాలని భావించాడు. నేరుగా డబ్బులు ఇస్తానంటే అంగీకరించదని జీవీతో ఫోన్ చేయించి.. రెండు గంటల సేపు మాట్లాడి ఒప్పించేలా చేశాడు. జీవీ కారు డ్రైవర్‌ను రప్పించి రూ.40 లక్షలు ఆమెకు అందేలా చేశారు. రెండు రోజుల పాటు కిడ్నాపర్లు స్విగ్గీలో ఫుడ్ ఆర్డర్ పెట్టారు. వారికి పెరుగన్నం పెట్టి, కిడ్నాపర్లు మాత్రం బిర్యానీ తినేవారు. రూ.20 కోట్లు ఇవ్వాలంటూ రాజేష్.. వారి చేతులపై కత్తితో కొడుతూ.. దుర్భాషలాడుతూ వారి చేతికి ఉన్న ఉంగరాలను లాక్కున్నాడు. డబ్బు లేదంటే ఎంపీ ఇల్లు, జీవీకి ఉన్న స్థలాన్ని తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేయాలని హేమంత్ డిమాండ్ చేశాడు. శరత్‌ను డిక్కిలో కుక్కి.. ఫోన్ చేసినప్పుడు జీవీ పొంతన లేని సమాధానాలతో ఎంపీకి అనుమానం వచ్చింది. వెంటనే పోలీస్ కమిషనర్ త్రివిక్రమ్ వర్మకు ఫోన్ చేసి విషయం చెప్పారు. వెంటనే పోలీసులు జీవీ నెంబర్‌కు వరుసగా ఫోన్ చేస్తుండటంతో.. అనుమానం వస్తుందని భావించిన కిడ్నాపర్లు ఫోన్లో మాట్లాడించారు. పోలీసులకు అనుమానం వచ్చినట్లు గ్రహించిన హేమంత్‌కుమార్ గ్యాంగ్ వెంటనే అక్కడి నుంచి శరత్ కారులోనే తప్పించుకోవాలని చూసింది. చేతులు, కాళ్లు కట్టేసి శరత్‌ను డిక్కీలో కుక్కారు. హేమంత్ కార్ డ్రైవ్ చేయగా ముందు సీట్లో రాజేష్ ఎక్కాడు. జ్యోతి, జీవీతో పాటు సాయి కూర్చున్నాడు. మధ్యలో వీరు తమ వద్ద ఉంటే ప్రమాదమని భావించిన హేమంత్‌కుమార్.. వారిని ఆనందపురం మండలంలో దించేశాడు. దీంతో జ్యోతి, జీవీలు జాతీయ రహదారి వరకు నడుచుకుంటూ వచ్చి ఆటో ఎక్కారు. అనంతరం కారు ఆపి మధ్యలోనే సాయి దిగిపారిపోయాడు. అంతలో పోలీసులు వారి కారును వెంబడించి హేమంత్, రాజేష్‌లను పట్టుకుని.. శరత్‌ను విడిపించిన విషయం తెలిసిందే. ముగ్గురి అరెస్ట్.. రూ.86.6 లక్షలు రికవరీ దొండపర్తి (విశాఖ దక్షిణ): ఎంపీ కుటుంబ సభ్యుల కిడ్నాప్ ఘటనలో ముగ్గురు కిడ్నాపర్లను పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. వాస్తవానికి గురువారమే కోలా వెంకట హేమంత్‌కుమార్, రాజేష్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా కిడ్నాప్‌లో పాల్గొన్న వారి వివరాలను వెల్లడించారు. దీని ప్రకారం శుక్రవారం గాజువాకకు చెందిన సాయిని షీలానగర్ ప్రాంతంలో పట్టుకున్నారు. వీరి ముగ్గురి నుంచి రూ.86.6 లక్షలు రికవరీ చేశారు. ఈ ముగ్గురిని సాయంత్రం కేజీహెచ్‌కు తీసుకువెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం కోర్టులో హాజరు పరిచి రిమాండ్‌కు తరలించారు. కాగా, మరో ముగ్గురు నిందితుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. -
నన్ను గాలి అనుచరులు కిడ్నాప్ చేశారు
గంగావతి రూరల్: కల్యాణ రాజ్య ప్రగతి పక్ష(కేఆర్పీపీ) నాయకులు అలీఖాన్ నేతృత్వంలో తనను గత ఐదు రోజులుగా బంధించి చిత్రహింసలకు గురి చేశారని బాధితుడు ఫ్రూట్ బాబా ఆరోపించారు. ఆయన గురువారం తన చేతికి అయిన గాయాన్ని చూపుతూ విలేకరులతో మాట్లాడారు. స్థానిక ఎమ్మెల్యే పరణ్ణ మునవళ్లి పరామర్శించి మాట్లాడుతూ బాధితునికి అన్ని విధాలుగా తమ సహకారం ఉంటుందన్నారు. పోలీస్ అధికారులతో తనిఖీ చేయించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా ఓబీసీ అధ్యక్షులు అమర్‌జ్యోతి వెంకటేశ్‌తో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తులు తదితరులు పాల్గొన్నారు. -
కిడ్నాప్ నాటకంతో డబ్బులు కాజేయాలనుకుంది..కానీ చివరికీ ఆ భార్య..
ఒక అమాయక భర్తకి మీ భార్య కిడ్నాప్ అయ్యిందంటూ ఓ అపరిచిత వ్యక్తి నుంచి కాల్ వచ్చింది. ఆమెను వదిలేయాలంటే పెద్ద మొత్తంలో డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. లేదంటే చిత్రహింసలకు గురిచేస్తాం అని కూడా బెదిరించాడు. దీంతో పోలీసులను ఆశ్రయించిన ఆ వ్యక్తికి దిమ్మతిరిగే షాక్ తగిలింది. కేసును విచారించిన పోలీసులు సైతం నివ్వెరపోయారు. చివరికి అతడి భార్యను అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. ఈ అనూహ్య ఘటన దక్షిణాఫ్రికాలో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే.. దక్షిణాఫ్రికాలోని 47 ఏళ్ల భారతీయ సంతతికి చెందిన మహిళ ఫిరోజా బీ బీ జోసెఫ్ తాను కిడ్నాప్ అయ్యినట్లు నాటకం ఆడింది. అందుకోసం తన భర్తకి ఒక అపరిచిత వ్యక్తి చేత ఫోన్ చేయించి..మీ భార్యను కిడ్నాప్ చేశామని, వదిలేయాలంటే పెద్దమొత్తంలో డబ్బు ఇవ్వాలని డిమాండ్ చేయించింది. దీంతో అతను పోలీసులను ఆశ్రయించాడు. ఇంతలో మరుసటి రోజు కూడా డబ్బుల తొందరగా ఇవ్వకపోతే గనుక ఆమెను చిత్రహింసలకు గురి చేస్తాం అని మరోసారి సదరు వ్యక్తి నుంచి కాల్ వచ్చింది ఆమె భర్తకు. దీంతో పోలీసులు ఆ ఫోన్ కాల్స్‌ని ట్రేస్ చేసి ఆ దిశగా దర్యాప్తు సాగించగా.. అసలు విషయం బయటపడింది. అతడి భార్య జోసఫ్ పీటర్‌మారిట్జ్‌బర్గ్ నగరంలోని ఒక హోటల్ల గదిలో ఉంటున్నట్లు తేలింది. అలాగే కిడ్నాపర్లు దొంగలించారన్న ఆభరణాలన్ని కూడా ఆమె అధీనంలోనే ఉన్నట్లు వెల్లడైంది. అలాగే ఆమె ఆ హోటల్లో బస చేసినట్లు సీసీఫుటేజ్‌ల ఆధారంగా గుర్తించారు. అక్కడ ఆమె వేరే పేరుతో లగ్జరీగా నివశిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. కిడ్నాప్ నాటకంతో భర్త నుంచి డబ్బులు కాజేయాలనుకుని చివరికి కటకటాలపాలైంది. (చదవండి: అతని జీవితం నాశనం అయ్యింది.. భారతీయుడికి రూ.11 కోట్లు చెల్లించాలని ఆదేశం) -
అంకుల్‌కి గిఫ్ట్‌గా ఇచ్చేందుకు కిడ్నాప్ చేశా! నివ్వెరపోయిన పోలీసులు
ఒక వ్యక్తి ఇంటి బటయ ఆడుకుంటున్నా చిన్నారిని కిడ్నాప్ చేశాడు. చిన్నారి తండ్రి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు కేసును చేధించి నిందితుడిన అరెస్టు చేశారు. ఐతే విచారణలో అతడు చెప్పిన విషయాలు విని ఒక్కసారిగా పోలీసులు షాక్‌కి గురయ్యారు. వివరాల్లోకెళ్తే...21 ఏళ్ల వ్యక్తి ఢిల్లీలోని గౌతమ్‌పురిలో ఇంటి ముంగిట ఆడుకుంటున్న చిన్నారి కిడ్నాప్‌కి గురయ్యింది. దీంతో చిన్నారి పోలీసులను ఆశ్రయించాడు. ఈ మేరకు పోలీసులు రెండు రోజుల నుంచి చిన్నారి ఆచూకి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్న పోలీసులకు బాధితుడు పొరిగింటి వ్యక్తి కిడ్నాప్ అయిన రోజే అతను కూడా ఇంటి నుంచి బయటకు వెళ్లాడని, తిరిగి రాలేదని తెలిసింది. దీంతో పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేస్తూ.. ఆవ్యక్తిని ట్రేస్ చేసి పట్టుకున్నారు. ఆ తర్వాత పోలీసులు తమదైన శైలిలో నిందితుడిని గట్టిగా విచారించగా.. తన మేనమామకు పిల్లలు లేరని, తన మేనత్తకు నలుగురు పిల్లలు పుట్టి చనిపోయారని చెప్పాడు. అందుకని వారికి ఈ బాలుడిని గిఫ్ట్‌గా ఇచ్చేందుకే ఇలా చేశానని చెప్పడంతో పోలీసులు ఒక్కసారిగా కంగుతిన్నారు. ఈ మేరకు సదరు వ్యక్తిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. (చదవండి: భర్త నిద్రలో చనిపోయినట్లు నమ్మించింది..చివర్లో కూతురు షాకింగ్ ట్విస్ట్) -
పక్కా ప్లాన్‌తో కిడ్నాప్..త్రుటిలో తప్పించుకున్న మహిళ: వీడియో వైరల్
ఒక మహిళను కొందరూ దుండగులు పక్కాప్లాన్‌తో కిడ్నాప్ చేసేందుకు యత్నించారు. ఐతే సదరు మహిళ అనుహ్యంగా ఆ ఘటన నుంచి త్రుటిలో బయటపడగలిగింది. ఈ ఘటన హర్యానాలోని యమునా నగర్లో శనివారం చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే...జిమ్ సెంటర్ నుంచి బయటకొచ్చిన ఒక మహిళ తన కారులో కూర్చొని ఉండగా... ఇద్దరు వ్యక్తులు ఆగి ఉన్న ఆమె కారు లోకి దూసుకుంటూ వచ్చి కారు తలుపులు మూసేశారు. మొత్తం నలుగురు వ్యక్తులు ఆమెని కిడ్నాప్చేసేందుకు యత్నించారు. ఐతే ఆమె ప్రతిఘటిస్తూ...అరవడంతో భయంతో ఆ వ్యక్తులు కొద్ది వ్యవధిలోనే కారు నుంచి బయటకొచ్చేశారు. ఈ ఘటన మొత్తం సమీపంలోని సీసీఫుటేజ్‌లో రికార్డ్ అయ్యింది. సదరు మహిళ ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు సీసీఫుటేజ్‌ని పరిశీలించి..ఒక వ్యక్తి అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. మిగతా నిందితుల కోసం తీవ్రంగా గాలిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని, ఈ ఘటనకు గల కారణాలపై దర్యాప్తు చేయడం ప్రారంభించినట్లు తెలిపారు. ప్రస్తుతం ఆ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. #WATCH | Caught On Camera: Miscreants tried to kidnap a woman in Haryana's Yamuna Nagar city yesterday After doing gym, the woman sat in her car. 4 people came & entered her car & tried to kidnap her. One accused has been caught. Probe underway: DSP Kamaldeep Singh, Yamuna Nagar pic.twitter.com/XvuN22yfWy — ANI (@ANI) January 1, 2023 (చదవండి: ఒకేఒక్క వ్యక్తి రోడ్డుపై సృష్టించిన బీభత్సం చూస్తే..వామ్మో! అని నోరెళ్లబెడతారు) -
మత్తిచ్చి.. రెండ్రోజులపాటు కీచకపర్వం!
డబీర్‌పురా: హైదరాబాద్ పాతబస్తీలో ఘోరం చోటుచేసుకుంది. రాత్రి వేళ ఇంటి సమీపంలోని ఓ మందుల షాప్‌కు వెళ్లిన మైనర్ బాలిక (14)ను ఇద్దరు యువకులు కిడ్నాప్ చేసి ఆమెకు మత్తుమందు ఇచ్చి ఏకంగా రెండు రోజులపాటు సామూహిక అత్యాచారానికి పాల్పడటం కలకలం సృష్టించింది. రెండు నెలల కిందట సంచలనం సృష్టించిన జూబ్లీహిల్స్ గ్యాంగ్‌రేప్ ఉదంతాన్ని మరచిపోక ముందే ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. డబీర్‌పురా పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మీర్‌చౌక్ ఏసీపీ ప్రసాద్‌రావు... డబీర్‌పురా ఇన్స్పెక్టర్ కోటేశ్వర్రావు, ఎస్సైలతో కలిసి నిందితుల వివరాలను వెల్లడించారు. డబీర్‌పురా ప్రాంతానికి చెందిన మైనర్ బాలిక (14) తొమ్మిదో తరగతి మధ్యలోనే ఆపేసి ఇంట్లోనే ఉంటోంది. ఈ నెల 12న రాత్రి 8 గంటల సమయంలో తన తల్లి కాస్త అస్వస్థతకు గురికావడంతో మందులు తీసుకొచ్చేందుకు ఇంటి సమీపంలోని మందుల దుకాణానికి వెళ్లింది. అదే సమయంలో రెయిన్‌బజార్ షా కాలనీకి చెందిన సయ్యద్ నైమత్ అహ్మద్ (26), సయ్యద్ రవిష్ అహ్మద్ మెహదీ (20) క్వాలిస్ కారు (ఏపీ28 డీబీ 2729)లో అక్కడకు చేరుకున్నారు. సయ్యద్ రవిష్ స్కూల్ డ్రాపవుట్ కాగా సయ్యద్ నైమత్ సౌదీ అరేబియాలో కళ్లద్దాల దుకాణం నిర్వహిస్తూ ఇటీవలే నగరానికి వచ్చాడు. రవిష్ బాలికకు పరిచయస్తుడే. వారు మాయమాటలు చెప్పి బాలికను కారులో ఎక్కించుకొని తొలుత నాంపల్లిలోని సృజన ఇన్ లాడ్జికి తీసుకెళ్లారు. అనంతరం బాలికకు కూల్‌డ్రింక్‌లో మత్తు ట్యాబ్లెట్లు ఇచ్చి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ మర్నాడు త్రీ క్యాజిల్స్ డీలక్స్ లాడ్జికి తరలించి మళ్లీ అఘాయిత్యానికి పాల్పడ్డారు. బాలిక ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆమె తల్లి 12న అర్ధరాత్రి దాటాక డబీర్‌పురా పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసింది. అయితే ఈ నెల 14న బాలిక తల్లికి ఫోన్ చేసిన నిందితులు.. బాలిక తమ వద్దే ఉందని చెప్పి ఆమెను చాదర్‌ఘాట్–ఎంజీబీఎస్ నాలా వద్ద విడిచిపెట్టి పరారయ్యారు. దీనిపై సమాచారం అందుకున్న డబీర్‌పురా పోలీసులు బాలికను భరోసా కేంద్రానికి తరలించారు. నిందితుల ఫోన్ నంబర్ ఆధారంగా సయ్యద్ నైమత్ అహ్మద్, సయ్యద్ రవిష్ అహ్మద్ మెహదీలను అరెస్టు చేయడంతోపాటు వారు ఉపయోగించిన వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కిడ్నాప్, గ్యాంగ్‌రేప్ కేసులతోపాటు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. అలాగే లాడ్జీల గదుల నుంచి ఫోరెన్సిక్ ఆధారాలను సేకరించారు. అక్కడి సీసీటీవీ దృశ్యాలను పరిశీలిస్తున్నారు. కాగా, తమ కుమార్తె చేతిపై ఇంజక్షన్లు ఇచ్చిన గుర్తులు ఉన్నట్లు బాధితురాలి తల్లి పేర్కొంది. -
సినిమాలో హీరో మాదిరి కూతురుని రక్షించుకున్న రోజువారీ కూలీ
కిడ్నాప్‌కి గురైతే దొరకుతారన్నగ్యారంటి ఉండకపోగా బతికే ఉంటారన్న నమ్మకమూ ఉండదు. చాలా వరకు ఇలాంటి కిడ్నాప్ కేసుల్లో బాదితులను హతమార్చడం లేదంటే అమ్మేయడం వంటివి జరుగుతుంటాయి. సరైనా అధారాలు ఉంకపోవడంతో చాలా వరకు ఇలాంటి కేసులు పెండింగ్‌లోనే ఉండిపోతాయి. ఐతే ఇక్కడొక తండ్రి కిడ్నాప్ అయిన కూతురుని సినిమాలో హీరో మాదిరి గాలించి రక్షించుకున్నాడు. వివరాల్లోకెళ్తే.... పోలీసులు తెలిపిన కథనం ప్రకారం....ముంబైలోని సబర్బన్ బాంద్రాలో రోజువారీ కూలీ తమ ఇంటి వద్ద 12 ఏళ్ల కూతురు కిడ్నాప్‌కి గరయ్యందంటూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఐతే ఆ అమ్మాయి తండ్రి ఇరుగు పొరుగువారిని విచారించి నిందితుడు గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తుంటాడు. ఆ అమ్మాయి కిడ్నాప్‌కి గురయ్యిన రోజు తల్లికి ఏదో సాకుతో బయటకు వెళ్లిందనే విషయాన్ని తెలుసుకుని ఆ దిశగా తెలిసినవాళ్లందర్నీ ఆరా తీయడం మెదలు పెట్టాడు. ఈ క్రమంలో బాధితురాలి తండ్రి నిందుతుడు షాహిద్ ఖాన్(24)తో వెళ్లినట్లు తెలుసుకుంటాడు. అంతేకాదు ఆ వ్యక్తి తన ఇంటికి సమీపంలోని వస్త్రాల తయారీలో ఉద్యోగం చేస్తుస్నట్లుగా తెలుసుకుంటాడు. దీంతో ఆ తండ్రి ఆ నిందితుడు కుటుంబం అలీఘర్ సమీపంలోని ఐత్రోలి గ్రామంలో ఉంటుందని తెలుసుకుని... పోలీసులు, స్థానికుల సాయంతో తన కూతురుని రక్షించుకుంటాడు. సదరు నిందితుడు ఆ అమ్మాయిని తనతో షాపింగ్‌కి రావాలంటూ కుర్లాకు తీసుకువెళ్లి..అక్కడ నుంచి సూరత్‌కి బస్సు ఎక్కి, రైలులో ఢిల్లికి చేరుకున్నట్లు తెలిపాడు. దీంతో పోలీసులు సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. (చదవండి: గేమింగ్ యాప్ స్కామ్.... సుమారు రూ. 12 కోట్లు స్వాధీనం) -
సారా ఎవెరార్డ్ హత్య ప్రకంపనలు
లండన్: దక్షిణ లండన్‌లో 33 ఏళ్ల యువతి సారా ఎవెరార్డ్ హత్యను నిరసిస్తూ నిర్వహించిన కొవ్వొత్తుల ర్యాలీని అడ్డుకున్న స్కాట్‌ల్యాండ్ పోలీసులు తమ చర్యల్ని పూర్తిగా సమర్థించు కున్నారు. కరోనా నిబంధనల్ని అతిక్రమిస్తూ జనం సారాకి మద్దతుగా భారీ సంఖ్యలో గుమిగూడడం వల్లే వారిని చెదరగొట్టామని చెబుతున్నారు. ర్యాలీలో పాల్గొన్నవారిలో నలుగురిని పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. ‘‘ప్రజల భద్రత గురించి ఆలోచిస్తూ పోలీసులు చర్యలు తీసుకుంటారు. ఇంకా కరోనా సంక్షోభం ముగియకుండా అంత మంది ఒకే చోట గుమిగూడడం మంచిది కాదు’’అని పోలీసు కమిషనర్ హెలెన్ బాల్ అన్నారు. ‘‘పోలీసులు వెళ్లిపోమని చెప్పగానే చాలా మంది వెనక్కి మళ్లారు కానీ కొంత మంది పోలీసులపైకి వస్తువులు విసిరారు. అందుకే వారిని కట్టడి చేయాల్సి వచ్చింది’’అని చెప్పారు. అయితే పోలీసులకి, నిరసనకారులకి మధ్య జరిగిన ఘర్షణలకి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరస్ అయ్యాయి. పోలీసుల దౌర్జన్యాన్ని నిరసిస్తూ నెటిజన్లు కామెంట్లు పెట్టారు. దీంతో లండన్ మేయర్ సాదిక్ ఖాన్ సహా ఎందరో నాయకులు దీనిపై స్పందించారు. పోలీసుల తీరుని తప్పు పట్టారు. గత వారంలో స్నేహితురాలి ఇంటికి వెళ్లి తిరిగి వస్తూ సారా ఎవెరార్డ్ అదృశ్యమయ్యారు. ఆ తర్వాత శవమై కనిపించడం బ్రిటన్ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది. వివిధ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ప్రజలు బయటకి వచ్చి హత్యను నిరసిస్తూ కొవ్వొత్తుల ర్యాలీలు తీశారు. -
కిడ్నాపర్‌కు ఐదేళ్ల జైలు శిక్ష
గుత్తి(గుంతకల్లు) : ఓ యువతిని కిడ్నాప్ చేసి నిర్భందించిన కేసులో నిందితుడికి జైలు శిక్ష ఖరారైంది. పోలీసుల కథనం మేరకు... గుంతకల్లులోని భాగ్యనగర్‌కు చెందిన ఓ యువతి(22) ఇంటి బయట ఉండగా హిందూపురానికి చెందిన పఠాన్ అజ్మతుల్లా టాటాసుమోలో వచ్చి కిడ్నాప్ చేసి కర్నూలులోని ఓ ఇంట్లో వారం రోజుల పాటు నిర్భందించాడు. ఈ సంఘటన 2016 అక్టోబర్ 7న జరిగింది. దీంతో కిడ్నాప్‌నకు గురైన యువతి అక్క ఫిర్యాదు మేరకు గుంతకల్లు వన్‌టౌన్ పోలీసులు అప్పట్లో కేసు నమోదు చేశారు. ఆ తరువాత అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. ఈ క్రమంలో సదరు కేసు గుత్తి అసిస్టెంట్ సెషన్స్ కోర్టులో విచారణకు వచ్చింది. అయితే విచారణ మొదలు కాకముందే నిందితుడు తానే యువతిని కిడ్నాప్ చేసి నిర్బం«దించినట్లు అంగీకరించాడు. దీంతో అతనికి కిడ్నాప్ చేసినందుకు ఐదేళ్లు, నిర్భందించినందుకు మరో ఐదేళ్లు శిక్షతో పాటు రూ.2 వేలు జరిమానా విధిస్తూ జడ్జి హరినారాయణ తీర్పు వెలువరించారు. శిక్షలు ఏకకాలంలో అమలు చేయాలని తన తీర్పులో పేర్కొన్నారు. ప్రాసిక్యూషన్ తరుపున ఎం.వి. మహేశ్‌కుమార్ వాదించారు. -
ప్రతి ముగ్గురిలో ఒకరిపై కేసు!
యూపీ ఎన్నికల బరిలో అభ్యర్థుల జాతకమిది ► 30% మంది కోటీశ్వరులు ► 41% అభ్యర్థులు పన్నెండో తరగతి లోపువారే! న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో పోటీపడే అభ్యర్థుల జాతకాలు విస్తు గొలుపుతున్నాయి. బరిలో నిలిచిన ప్రతి ముగ్గురిలో ఒకరిపై క్రిమినల్ కేసులున్నాయి. వాటిల్లో హత్య, అత్యాచారం, కిడ్నాప్ వంటి తీవ్రమైన కేసులు ఎదుర్కొంటున్నవారూ అధికంగానే ఉన్నారు. మొత్తం అభ్యర్థుల్లో 30 శాతం మంది కోటీశ్వరులున్నారు. ఇక డిగ్రీ కూడా పూర్తి కాని వారి శాతం 41. నిరక్షరాస్యులు 54 శాతం. ఈ ఎన్నికల్లో అభ్యర్థులు దాఖలు చేసిన అఫిడవిట్ల ఆధారంగా ఉత్తరప్రదేశ్ ఎలక్షన్ వాచ్ అండ్ అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రీఫారమ్స్ (ఏడీఆర్) ఈ వివరాలను వెల్లడించింది. ఏడు దశల ఎన్నికల్లో చివరి దశ పోలింగ్ ఈ నెల 8న జరగనుంది. బరిలో ఉన్న మొత్తం 4,823 (మహిళలు 445) అభ్యర్థుల్లో 859 మంది తమపై క్రిమినల్ కేసులున్నట్టు అఫిడవిట్లో పేర్కొన్నారు. మరో 704 మందిపై తీవ్రమైన క్రిమినల్ కేసులున్నాయి. 31 మంది అభ్యర్థుల అఫిడవిట్లు స్పష్టంగా లేకపోవడంతో వారి వివరాలు ఇక్కడ ఇవ్వలేదని ఏడీఆర్ తెలిపింది. 38 మంది లైంగిక వేధింపుల కేసులు ఎదుర్కొంటున్నారు. 1457 మంది అభ్యర్థులు కోటీశ్వరులు. వీరి సగటు ఆస్తుల విలువ రూ.1.91 కోట్లు. రూ.5 కోట్ల పైనున్నవారు 453 మంది. 13 మంది జీరో ఆస్తులు ప్రకటించడం గమనార్హం. 411 మంది రూ.లక్ష కంటే తక్కువని పేర్కొన్నారు. 1210 మంది పాన్ కార్డు, 2,790 మంది ఆదాయ పన్ను వివరాలు సమర్పించలేదు. -
కర్నూలు బాలిక కిడ్నాప్ కేసు ఛేదింపు
అనంతపురం సెంట్రల్ : కర్నూలులో కిడ్నాపైన బాలిక కేసును అనంతపురం పోలీసులు ఛేదించారు. వివరాల్లోకెళితే.. కర్నూలు పట్టణానికి చెందిన తొమ్మిదేళ్ల బాలికకు హిందూపురంలోని బోయవీధికి చెందిన పఠాన్ అజంతుల్లా అనే యువకుడు ఆదివారం మాయమాటలు చెప్పి అనంతపురానికి ఆర్టీసీ బస్సులో తీసుకొచ్చాడు. అక్కడి నుంచి హిందూపురం వెళ్లేందుకు బస్సు కోసం నిరీక్షించాడు. బాలిక ఏడుస్తుండడంతో పాటు కిడ్నాపర్ అనుమానాస్పందంగా కనిపించడం సీసీ కెమెరాల్లో పసిగట్టిన త్రీటౌన్ సీఐ గోరంట్ల మాధవ్, ఎస్ఐ రెడ్డప్పలు వెంటనే బస్టాండుకు వచ్చి యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. స్టేషన్‌కు తీసుకుపోయి విచారణ చేస్తే అసలు విషయం బయటపెట్టాడు. సదరు కిడ్నాపర్ గతంలో కూడా ఇలాంటి నేరాలు చేసినట్లు విచారణలో వెల్లడించినట్లు సమాచారం. కేవలం కిడ్నాప్ చేసి వారి తల్లిదండ్రుల నుంచి డబ్బు వసూలు చేయాలనే ఉద్దేశంతోనే ఈ నేరానికి పాల్పడినట్లు తెలుస్తోంది. వెంటనే త్రీటౌన్ సీఐ గోరంట్ల మాధవ్ ఫోన్ ద్వారా కర్నూలు నాలుగో పట్టణ ఎస్ఐ సుబ్రమణ్యంరెడ్డితో మాట్లాడారు. వారు అనంతపురం వచ్చి కిడ్నాపర్‌ను అదుపులోకి తీసుకుని, బాలికను వారి తల్లిదండ్రుల వద్దకు చేర్చారు. -
కిడ్నీల కోసం బాలుడి కిడ్నాప్!
-
కిడ్నీల కోసం బాలుడి కిడ్నాప్!
చాకచక్యంగా తప్పించుకున్న రాహుల్ వికారాబాద్ రూరల్: కిడ్నీలు తీసి అమ్ముకొనేందుకు ఓ 11 ఏళ్ల బాలుడ్ని గుర్తు తెలియని దుండగులు కిడ్నాప్ చేశారు. బలవంతంగా కారులో ఎక్కించుకుని వెళుతుండగా.. ఆ బాలుడు చాకచక్యంగా తప్పించుకున్నాడు. రంగారెడ్డి జిల్లా వికారాబాద్ పట్టణంలో శుక్రవారం పట్టణంలో ఈ ఘటన జరిగింది. రంగారెడ్డి జిల్లా దోమ మండలం బ్రహ్మణపల్లి తండాకు చెందిన నేనావత్ తార్యా కుమారుడు రాహుల్ (11) ముజాహిద్‌పూర్‌లోని ఎస్టీ హాస్టల్లో 6వ తరగతి చదువుతున్నాడు. రెండు రోజుల కింద గణేశ్ నిమజ్జనం కోసం తండాకు వచ్చిన రాహుల్... శుక్రవారం తిరిగి హాస్టల్‌కు బయలుదేరాడు. పరిగికి చేరుకున్నాక గుర్తు తెలియని దుండగులు బిస్కెట్లు ఇస్తామని, రూ.1,000 ఇస్తామని ఆశ చూపి రాహుల్‌ను కారు ఎక్కించుకునే ప్రయత్నం చేశారు. వారికి లొంగని రాహుల్ కొద్దిదూరం ముందుకు వెళ్లాడు. ఇంతలోనే దుండగులు కారులో వచ్చి బలవంతంగా ఎక్కించుకున్నారు. రాహుల్‌ను కొడుతూ.. మీ దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నారుు, మీ నాన్న ఏం చేస్తాడంటూ ప్రశ్నించారు. తన తండి వ్యవసాయం చేస్తాడని చెప్పడంతో... ‘నీ నుంచి డబ్బులు రావు.. నీ కిడ్నీలు తీసి అమ్ముకుంటా’మన్నారు. అలా వారు మధ్యాహ్నం 3 గంటల సమయంలో వికారాబాద్‌కు చేరుకున్నారు. వికారాబాద్ నుంచి తాండూరుకు వెళ్లే మార్గంలో కాలకృత్యాల కోసం కారు ఆపగా.. రాహుల్ ఒక్కసారిగా బయటకు దూకి తప్పించుకున్నాడు. అదే సమయంలో ఓ పోలీస్ వాహనం రావడంతో దుండగులు పరారయ్యాడు. రాహుల్ వికారాబాద్ పట్టణంలోకి వెళ్లి.. స్థానికుల సహాయంతో తండ్రికి సమాచారమిచ్చాడు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని బాలుడి వద్ద వివరాలు తెలుసుకున్నారు. దుండగుల కోసం గాలిస్తున్నారు. -
లిబియా ఉగ్ర బాధిత కుటుంబంలో వెల్లివిరిసిన ఆనందం
14 నెలల క్రితం లిబియా దేశంలో ఉగ్రవాదుల చేతుల్లో కిడ్నాప్ గురైన తెలుగు ప్రొఫెసర్ గోపీకృష్ణ ఎట్టకేలకు ఉగ్రవాదుల చెరనుంచి బయటపడ్డాడు. ఈ విషయం స్వయంగా గోపీకృష్ణనే బుధవారం అర్ధరాత్రి 12 గంటలకు తన భార్య కృష్ణవేణికి ఫోన్ చేసి చెప్పాడు. ‘నేను గోపీకష్ణను మాట్లాడుతున్నాను. ఉగ్రవాదుల చేరనుండి బయటపడ్డాను. నేను క్షేమంగా ఉన్నాను. మీరు క్షేమంగా ఉన్నారా?’ అని అడిగాడు. ప్రస్తుతం అమెరికా దేశ మిలిటరీ ఆధీనంలో ఉన్నట్లు ఫోన్ ద్వారా సమాచారం అందించాడు. దీంతో ఆ కుటుంబ సభ్యుల్లో సంతోషం వెల్లివిరిసింది. 2015 జూలై 28న లిబియా నుంచి హైదరాబాద్‌కు వస్తున్నానంటూ ఫోన్లో మాట్లాడిన గోపీకృష్ణ అంతలోనే ఉగ్రవాదుల చేతిలో కిడ్నాప్‌కు గురయ్యాడు. అప్పటి నుంచి భర్త ఆచూకీ తెలియక కళ్యాణి, కుటుంబసభ్యులు కళ్లల్లో ఒత్తులు వేసుకొని ఎదురుచూస్తున్నారు. ఇంతలోనే బుధవారం అర్ధరాత్రి ఫోన్ మోగడం.. గోపీకృష్ణ భార్య కళ్యాణితో మాట్లాడటంతో ఆమె ఉద్వేగానికి గురైంది. గురువారం ఉదయం కళ్యాణి తన పిల్లలతో కలిసి నాచారం రాఘవేంద్రనగర్‌లోని సాయిబాబా గుడికి వెళ్లి తన భర్త క్షేమంగా ఉన్నాడన్న సంతోషంతో ప్రత్యేక పూజలు నిర్వహించింది. తన భర్త విడుదలకు కృషి చేసిన ప్రధాన మంత్రి నరేంద్రమోదీ, విదేశాంగమంత్రి సుష్మాస్వరాజ్, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, ఎంపీ మల్లారెడ్డి, ముఖ్యమంత్రి కేసీఆర్‌లకు కృతజ్ఞతలు తెలిపింది. అనంతరం గోపీకృష్ణ సోదరుడు మురళీకృష్ణ మాట్లాడుతూ.. గోపీకృష్ణ క్షేమంగా ఉన్నాడన్న వార్త మా కుటుంబ సభ్యులలో పండుగ వాతావరణం తీసుకొచ్చింది. గోపీకృష్ణకు పునర్జన్మగా భావిస్తున్నామన్నారు. ఫోన్ సమాచారం మేరకు బుధవారం అమెరికా మిలిటరీ దళాలు లిబియాలో రెస్క్యూ ఆపరేషన్ చేస్తుండగా తెలుగు ప్రొఫెసర్లతో పాటు మరో నలుగురు ప్రొఫెసర్లను వారి ఆధీనంలోకి తీసుకున్నట్లు తెలిసింది. ఎట్టకేలకు లిబియాలోని ఐఎస్ ఉగ్రవాదుల చెర నుండి తెలుగు ప్రొఫెసర్లకు విముక్తి కలిగింది. బుధవారం రాత్రి 12 గంటలకు గోపీకృష్ణ తన భార్యతో మాట్లాడాడు. అనంతరం నాన్న నారాయణరావుతో కూడా మాట్లాడినట్లు తెలిపారు. -
చింతూరులో నలుగురు గిరిజనుల కిడ్నాప్!
చింతూరు మండలం పేగ గ్రామానికి చెందిన నలుగురు గిరిజనులను మావోయిస్టులు మంగళవారం రాత్రి కిడ్నాప్ చేసినట్టు స్థానికులు చెబుతున్నారు. అయితే.. వారిని కిడ్నాప్ చేయలేదని, మావోయిస్టులు రమ్మని కబురు పెడితే వారంతట వారే వెళ్లారని పోలీసులు అంటున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి... మంగళవారం రాత్రి గ్రామంలోకి వచ్చిన సాయుధ మావోయిస్టులు కంగాల ముత్తయ్య, కంగాల నాగేశ్వరరావు, కణితి రామయ్య, సోడె ముద్దయ్యలతో మాట్లాడే పనుందని, తమ వెంట రావాల్సిందిగా కోరారు. వారి కుటుంబ సభ్యులు అడ్డుచెప్పారు. దీంతో మావోయిస్టులు బెదిరించి సమీపంలోని ఛత్తీస్‌గఢ్ అడవుల్లోకి తీసుకు వెళ్లారు. ఇటీవల చింతూరు మండలంలో జరిగిన పాస్టర్ కన్నయ్య హత్య సమయంలో మావోయిస్టులు వదిలిన లేఖలో ఇన్ఫార్మర్లుగా ఆరోపించిన వారిలో వీరి పేర్లు కూడా ఉన్నాయి. దీంతో తమ వారిని మావోయిస్టులు ఏమి చేస్తారోనని కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. మరో వైపు పేగకు చెందిన గిరిజనులను మావోయిస్టులు కిడ్నాప్ చేయలేదని, రమ్మని కబురు పెడితే వారే స్వచ్ఛందంగా వెళ్లారని చింతూరు ఓఎస్డీ డాక్టర్ ఫకీరప్ప చెప్పారు. -
ప్రొఫెసర్ కిడ్నాప్‌నకు ఏడాది
గత ఏడాది జూలై 29వ తేదీన లిబియా దేశంలో ఐఎస్ తీవ్రవాదులు కిడ్నాప్ చేసిన శ్రీకాకుళం జిల్లా టెక్కలికి చెందిన తిరువీధుల గోపీకృష్ణ ఆచూకీ ఇప్పటికీ తెలియరాలేదు. అప్పట్లో మన దేశానికి చెందిన నలుగురు వ్యక్తులను తీవ్రవాదులు కిడ్నాప్ చేశారు. కిడ్నాప్‌నకు గురైన వారిలో ఇద్దరు కర్ణాటక వాసులు కాగా మరొకరు హైదరాబాదుకు చెందిన బలరాం, శ్రీకాకుళం జిల్లాకు చెందిన గోపీకృష్ణ ఉన్నారు. వీరిలో కర్ణాటక వాసులను విడుదల చేసిన తీవ్రవాదులు బలరాం, గోపీకృష్ణలను మాత్రం బందీలుగానే ఉంచుకున్నారు. గోపీకృష్ణ లిబియాలో స్రిట్ యూనివర్సిటీలో కంప్యూటర్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పని చేసేవారు. గోపీకృష్ణ కిడ్నాప్‌నకు గురైన తరువాత రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, శ్రీకాకుళం ఎంపీ కె.రామ్మోహన్నాయుడు తదితరులు అతని తల్లిదండ్రులైన వల్లభనారాయణరావు, సరస్వతిలను పరామర్శించారు. గోపీకృష్ణ విడుదలకు పూర్తి ప్రయత్నాలు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ నెల 29వ తేదీకి ఏడాది పూర్తవుతున్నప్పటికీ గోపీకృష్ణ నుంచి ఏ సమాచారం లేకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురవుతున్నారు. అప్పట్లో గోపీకృష్ణ భార్య కల్యాణి, సోదరుడు మురళీకృష్ణ రాష్ట్రపతిని సైతం కలిసి తమ గోడు వెళ్లబుచ్చారు. అయినప్పటికీ ఫలితం కనిపించలేదు. ఇదిలా ఉండగా గోపీకృష్ణ విడుదల విషయంలో పూర్తిగా వైఫల్యం చెందిన ప్రభుత్వాలు ఆయా కుటుంబ సభ్యులకు ఇటీవల కాలంలో పరిహారం అందజేసి చేతులు దులుపుకున్నాయి. -
పాఠశాలలో మూడు కంప్యూటర్లు చోరీ
కాజీపేట : కాజీపేట ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల(డంకెన్‌బాబా)లో గుర్తుతెలియని వ్యక్తులు చొరబడి మూడు కంప్యూటర్లను అపహరించినట్లు సీఐ రమేష్‌కుమార్ తెలిపారు. సీఐ కథనం ప్రకారం.. గురువారం సాయంత్రం పాఠశాలకు తాళం వేసి సిబ్బందితో కలిసి ఉపాధ్యాయులు ఇళ్లకు వెళ్లిపోయారు. అర్ధరాత్రి సమయంలో సరస్వతిమాత విగ్రహం పక్కనున్న ఇనుప గ్రిల్ గేట్ తాళంను గుర్తుతెలియని వ్యక్తులు పగులగొట్టి లోపలికి చొరబడ్డారు.ప్రత్యేక గదిలో పిల్లలకు శిక్షణ ఇవ్వడానికి ఏర్పాటు చేసిన మూడు కంప్యూటర్లను చోరీ చేశారు. శుక్రవారం ఉదయం పాఠశాలకు వచ్చిన సిబ్బంది తాళం పగులగొట్టి ఉండటంతో ఆందోళనకు గురై వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్లో ప్రధానోపాధ్యాయురాలు కె.పుష్పాంజలి ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. క్లూస్‌టీం సీఐ రఘు, ఎస్సైలు భీమేష్, నాగరాజు సిబ్బందితో కలిసి ఘటన స్థలాన్ని సందర్శించి ఆధారాలు సేకరించారు. అనుమానితులను గుర్తించడానికి సీసీ కెమెరాల పుటేజీలను పరిశీలిస్తున్నట్లు చెప్పారు. కంప్యూటర్ల విలువ లక్షకుపైగా ఉంటుందని నిందితుల సమాచారం తెలిస్తే స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. -
వ్యాపారి కిడ్నాప్.. డీఎస్పీ ఆత్మహత్య
బెంగళూరు: బెంగళూరుకు చెందిన ఫైనాన్షియర్ కిడ్నాప్ కేసులో సస్పెండైన కర్టాటక పోలీసు ఉన్నతాధికారి ఆత్మహత్య చేసుకున్నారు. చిక్కమంగళూరు డిప్యూటీ సూపరింటెండెంట్ కల్లప్ప హండీబాగ్ ఆత్మహత్య చేసుకున్నారు. చిట్ ఫండ్ వ్యాపారి కిడ్నాప్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కల్లప్పను పోలీసు అధికారులు మంగళవారం సస్పెండ్ చేశారు. ఈ ఉత్తర్వులు వెలువడిన కొన్ని గంటల్లోనే ఆయన ఆత్మహత్యకు ప్రయత్నించారు. అనంతరం బెల్గావ్ లోని మురగోడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. కిడ్నాప్ గురైన ఫైనాన్షియర్ తేజస్ (37) తన ఇంటి సమీపంలో కారు పార్క్ చేస్తుండగా ఓ ముఠా కిడ్నాప్ చేసి బెంగళూరుకు తీసుకొచ్చి ఒక గోడౌన్ లో బందీ చేసింది. అనంతరం 20 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ చిత్ర హింసలకు గురిచేసింది. వారి హింస భరించలేక తేజస్ రూ. 10 లక్షలకు బేరం కుదుర్చుకున్నాడు. ఈ చెల్లింపుల కోసం కిడ్నాపర్లు ఒక ఫోన్ నెంబరు ఇచ్చారు. చిక్కమగళూరులోని స్నేహితుడు షివు ద్వారా ఈ మొత్తం చెల్లించి తేజస్ బయటపడ్డాడు. అయితే ఇక్కడే కథ మరో టర్న్ తీసుకుంది. కిడ్నాపింగ్ కోసం ఉపయోగించిన స్కార్పియో నంబరు, ఫోన్ నంబరు ద్వారా కూపీ లాగిన అతని స్నేహితులు డీఎస్పీ గుట్టు రట్టుచేశారు. 10 లక్షల చెల్లింపు సందర్భంగా కిడ్నాపర్ల ఫోన్ సంభాషణలను రికార్డు చేశారు. ఈ నేపథ్యంలో ఆ వాహనం, మొబైల్ నంబరు డీఎస్పీ పేరుతో రిజిస్టర్ అయి ఉన్నట్టు తేలడంతో బసవన్ హళ్లి పోలీసు స్టేషన్ లో డీఎస్పీ కల్లప్పపై ఫిర్యాదు చేశారు. దీంతో ఈ కేసులో ఐదో నిందితునిగా కల్పప్పపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు అతణ్ని అదుపులోకి తీసుకున్నారు. దీనిపై ప్రాథమిక విచారణ చేపట్టిన పోలీసు ఉన్నతాధికారులు డీఎస్పీని సస్పెండ్ చేశారు. ఈ కేసులో అరెస్టయిన డీఎస్పీ బెయిల్ పై విడుదలయ్యారు. అవమానం భరించలేక ఆత్మహత్యకు పాల్పడ్డారు. -
అడ్డుగా భావించి..హతమార్చారు
♦ హైదరాబాద్ వాసీ ఇల్లెందులో దారుణ హత్య ♦ భార్యాభర్త వివాదంలో దూరాడని కిడ్నాప్, ఆపై హతం ♦ సింగరేణి ఆస్పత్రి సమీపంలో పూడ్చిన వైనం ♦ ఆరు రోజుల తర్వాత వెలుగు చూసిన ఘటన ఇల్లెందు: దంపతుల వివాదంలో జోక్యం చేసుకుంటున్నాడని భావించి హైదరాబాద్ దిల్‌షుక్‌నగర్‌కు చెందిన ఎం.శ్రీహరిరావు (62)ను ఇల్లెందు 24 ఏరియాకు చెందిన ఆటో డ్రైవర్ ఎన్.వెంకటేశ్వర్లు, ఆయన సోదరులు ఆంజనేయులు, రాజేష్, మరో ఆటో డ్రైవర్ నందకిషోర్లతో కలిసి హతం చేశాడు. ఈ నెల 17న ఇల్లెందులో కిడ్నాప్ చేసి హతమార్చారు. మృతదేహాన్ని సింగరేణి ఏరియా హాస్పిటల్ వెనుక అటవీ ప్రాంతంలో పూడ్చిపెట్టారు. మృతుడు శ్రీహరిరావు భార్య రమణి భర్త ఆచూకీ లభించడం లేదని ఫిర్యాదు చేయగా పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు చేయడంతో ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఇల్లెందు సీఐ అల్లం నరేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. భార్య తరఫున జోక్యం చేసుకున్నాడనే.. ఇల్లెందు 24 ఏరియాకు చెందిన ఆటో డ్రైవర్ ఎన్.వెంకటేశ్వర్లు, ప్రశాంతి భార్యాభర్త. వీరిద్దరిదీ ఇల్లెందు ప్రాంతమే. 2004లో వివాహమైంది. ఇద్దరు అబ్బాయిలు సంతానం ఉన్నారు. భార్యాభర్త మధ్య తరచు గొడవలు జరుగుతుండడంతో ఐదేళ్లుగా ఆమె వేరుగా ఉంటోంది. కొంతకాలంగా హైదరాబాద్‌లోని దిల్‌షుక్‌నగర్‌లో ఉంటూ..ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తోంది. దిల్‌షుక్‌నగర్‌లోని సాయిబాబా దేవాలయం మేనేజర్ శ్రీహరిరావుతో పరిచ యం ఏర్పడింది. తన గోడును అతడికి వివరించింది. భర్తతో విడాకుల కోసం కోర్టులో కేసు నడుస్తోంది. ఈ క్రమంలో ఆమె వెంట అతను పలుమార్లు ఇల్లెందుకు వచ్చాడు. ఈ నెల 17న ఇల్లెందు కోర్టులో వాయిదా ఉండగా 14వ తేదీన ప్రశాంతి, 17వ తేదీన శ్రీహరిరావు ఇల్లెందుకు చేరుకున్నారు. పిల్లలను ఎందుకు తీసుకురాలేదని కోర్టు వద్ద ప్రశాంతిని ఆమె భర్త మందలించాడు. ఆమె తరఫున శ్రీహరిరావుకు, భర్త వెంకటేశ్వర్లుకు మధ్య స్వల్ప ఘర్షణ జరిగింది. ఈ క్రమంలోనే శ్రీహరిరావుపై కసి పెంచుకొని..సోదరులతో కలిసి కుట్ర పన్నాడు. పట్టించిన సెల్ సిగ్నల్.. శ్రీహరిరావు ఆచూకీ లేకపోవడంతో.. ఆయన భార్య, కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతడి సెల్ సిగ్నల్ చివరగా ఈ నెల 17న ఇల్లెందు ప్రాంతంలో ఉన్నట్లు చూపడంతో..ఇక్కడికి వచ్చి విచారణ చేశారు. కోర్టు వ్యవహారం, భార్యాభర్త గొడవలో జోక్యం చేసుకున్న విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆటో డ్రైవర్ వెంకటేశ్వర్లును అదుపులో తీసుకుని ప్రశ్నించగా..తనతో పాటు సోదరులు ఆంజనేయులు, రాజేష్, ఆటో డ్రైవర్ నందకిషోర్ సహాయంతో హతమార్చినట్లు అంగీకరించాడు. బుధవారం మధ్యాహ్నం తహసీల్దార్ ఎన్టీ.ప్రకాశ్ సమక్షంలో మృతదేహాన్ని వెలికి తీసి పంచానామా నిర్వహించారు. సీఐ అల్లం నరేందర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కేసు దర్యాప్తులో ఎస్ఐలు సతీష్, కొమురెల్లి, ఇబ్రహీంలు సహకరించారు. మృతుడి భార్య రమణి, బందువులు సంఘటనా స్థలాన్ని సందర్శించి మృతదేహాన్ని చూసి బోరున విలపించారు. ఆటోలో తరలించి..హతం ఈ నెల 17వ తేదీన ఓ ఆటోలో శ్రీహరిరావును ఆటో డ్రైవర్ వెంకటేశ్వర్లు బలవంతంగా సింగరేణి హాస్పిటల్ వెనుకవైపు అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లారు. మరికొందరితో కలిసి బలమైన వస్తువుతో అతడి ముఖంపై తీవ్రంగా మోది, గొంతు నులిమారు. తుదిశ్వాసలో ఉన్న క్రమంలో ఓ ఆర్ఎంపీకి ఫోన్ చేసి వైద్యం చేయాలని సంప్రదించారు. నిరాకరించడంతో..వారే ప్రథమ చికిత్సకు యత్నించారు. అప్పటికే శ్రీహరిరావు చనిపోవడంతో..సమీపంలోని అటవీప్రాంతంలో మృతదేహాన్ని పాతి పెట్టారు. -
అమ్మా.. నిన్నొక్కసారి చూడాలమ్మా..
కిడ్నాపైన తల్లి కోసం చిన్నారుల ఎదురు చూపు సుమారు ఆరు నెలలుగా కంటికి కనిపించని తల్లి కిడ్నాపైందంటే అదృశ్యం కేసు నమోదు చేసిన ఖాకీలు నిందితులు కళ్లెదుటే తిరుగుతున్నా పట్టించుకోని పోలీసులు అన్ని కేసుల్లోలా ఈ కేసులోనూ చక్రం తిప్పుతున్న టీడీపీ నేతలు చివరకు హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసిన బంధువులు ఒంగోలు : ఆరు నెలలుగా తల్లి కనిపించకపోవడంతో ఇద్దరు చిన్నారులు నరకయూతన అనుభవిస్తున్నారు. తల్లి ప్రేమ కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. గ్రామానికి చెందిన యువకులే ఆమెను కిడ్నాప్ చేశారని తెలిసినా చివరకు పోలీసులు సైతం సీరియస్‌గా పట్టించుకోకపోవడం బాధితురాలి కుటుంబ సభ్యులకు తీరని ఆవేదన మిగిల్చింది. బాధితురాలి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. ప్రకాశం జిల్లా శింగరపల్లెకు చెందిన దార్ల ఆదిలక్ష్మి, వెంకటరమణ దంపతులకు ఇద్దరు కుమార్తెలు జయశ్రీ (7), స్వాతి (5). కుటుంబ పోషణ కోసం భర్త వెంకట రమణ చెన్నైలోని ఓ హోటల్లో పనిచేస్తుంటాడు. ఈ నేపథ్యంలో గ్రామానికి చెందిన మురారి కృష్ణ, దాసరి అడవిరాజు కన్ను ఒంటరిగా ఉన్న ఆదిలక్ష్మిపై పడ్డాయి. ఆమెను నిత్యం లైంగికంగా వేధించారు. చివరకు ఈ ఏడాది జనవరి 5వ తేదీన ఆదిలక్ష్మితో పాటు ఆమె ఇద్దరు పిల్లలను ఆటోలో గిద్దలూరు రైల్వేస్టేషన్‌కు తీసుకెళ్లారు. అక్కడి నుంచి రైలులో హైదరాబాద్‌కు తరలించారు. అక్కడి ఉప్పల్‌లోని గాంధీ బొమ్మ సెంటర్లో అడవిరాజు తల్లి వెంకట లక్ష్మమ్మ, అన్న వెంకటరావు ఇంట్లో తల్లీబిడ్డలను బంధించారు. అప్పటికే తల్లి మాయం విషయం తెలుసుకున్న బాధితురాలి భర్త, ఇతర కుటుంబ సభ్యులు ఉప్పల్ వెళ్లి వెంకటరావు ఇంట్లో వెతికారు. అప్పటికే తల్లిని మాయం చేసి పిల్లలను మాత్రమే అక్కడ ఉంచారు. పిల్లలను అక్కును చేర్చుకుని ఆ ఇంట్లో ఉన్న దాసరి వెంకటరావు, వెంకట లక్ష్మమ్మలను నిలదీశారు. ఆదిలక్ష్మి ఆచూకీ చెప్పకపోవడంతో వారిద్దరిని బేస్తవారిపేట పోలీసులకు అప్పగించి జరిగిన విషయం చెప్పారు. నిందితులపై కిడ్నాప్ కేసు పెట్టారు. చక్రం తిప్పిన తమ్ముళ్లు విషయం తెలిసి టీడీపీ నేతలు సీన్లోకి వచ్చారు. ఆదిలక్ష్మి కిడ్నాప్‌నకు వినియోగించిన ఆటో అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధిది కావడం.. ఆటో నడిపిన మురారి కృష్ణ బంధువు కావడంతో కేసును విచారించేందుకు పోలీసులు కాస్త వెనకడుగు వేశారు. బాధితులు పలుసార్లు పోలీసుస్టేషన్ మెట్లెక్కినా కిడ్నాప్ కేసు నమోదు చేయలేదు. కేసును నిర్వీర్యం చేసేందుకు కిడ్నాప్ కేసును కాస్త అదృశ్యం కేసుగా మార్చి ఖాకీలు చేతులు దులుపుకున్నారు. ఫిబ్రవరి 2వ తేదీన డీజీపీకి ఫిర్యాదు చేశారు. ఆయన లుకౌట్ నోటీస్ జారీ చేశారు. ఆదిలక్ష్మి ఆచూకీపై పోలీసులు అప్పటికీ శ్రద్ధ తీసుకోలేదు. అప్పటికే పోలీసుల అదుపులో ఉన్న అడవిరాజు తల్లి, అన్నను వదిలేశారు. పోలీసు ఉన్నతాధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోవడంతో చివరగా వెంకటరమణ కోర్టు తలుపు తట్టాడు. తన భార్యను కిడ్నాప్ చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదని హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశాడు. అడవిరాజు కుటుంబానిది బ్రోతల్ వ్యాపారం అడవిరాజు కుటుంబం పదిహేనుళ్లుగా హైదరాబాద్‌లో ఉంటోంది. అతడి అన్న బ్రోతల్ వ్యాపారం చేస్తున్నాడు. హైదరాబాద్ పోలీసుస్టేషన్లో కేసులు కూడా ఉన్నారుు. నా తమ్ముని భార్యను బ్రోతల్ కేంద్రానికి అమ్మేశారా, లేక చంపారోనని అనుమానంగా ఉంది. అమ్మ కోసం పిల్లలు ఏడ్వని రోజు లేదు. - దార్ల వెంకటేశ్వర్లు, చిన్నారుల పెదనాన్న ఫిర్యాదు ప్రకారమే కేసు విచారించాం ఆదిలక్ష్మి భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశాం. పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నాం. అడవిరాజు, ఆదిలక్ష్మి కుటుంబ సభ్యులు అందుబాటులోకి రావడం లేదు. అడవిరాజు తల్లి, అన్నను విచారించినా ఫలితం లేకపోవడంతో వారిని వదిలేశాం. - రామానాయక్, ఎస్సై, బేస్తవారిపేట -
బాలిక కిడ్నాప్ - అత్యాచారం
ముగ్గురు యువకులు పదమూడేళ్ల బాలికను అపహరించి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. మహబూబ్‌నగర్ జిల్లా పెద్ద కొత్తపల్లి మండలం మరికల్ గ్రామంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బుధవారం రాత్రి తల్లి బయటకు వెళ్లగా, అదే సమయంలో ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలికను ముగ్గురు యువకులు ముఖానికి ముసుగులు ధరించి వచ్చి ఆమెను బలవంతంగా తమతో తీసుకెళ్లి సమీప ప్రాంతంలో అత్యాచారం చేసి పరారయ్యారు. దీనిపై బాలిక తల్లి శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. -
నేరాలకు కేరాఫ్ తాడేపల్లి.
► వరుస కిడ్నాప్లతో కలకలం ► శ్రీమంతులే టార్గెట్ ► చేసేది..చేయించేది.. సెటిల్ చేసేది.. ► అంతా వారే! తాడేపల్లి రూరల్ : శ్రీమంతులు... విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్న పిల్లల తల్లిదండ్రులే టార్గెట్‌గా తాడేపల్లి ప్రాంతంలో కిడ్నాప్‌లు జరుగుతున్నాయి. ఈ ప్రాంతంలో నేరస్తులు రూటు మార్చి సినీ ఫక్కీలో పక్కాగా ప్లాన్ చేసి, గుట్టు చప్పుడు కాకుండా ‘టార్గెట్’లను కిడ్నాప్ చేసి, చిత్రహింసలు పెట్టి వారి నుంచి లక్షలాది రూపాయలు గుంజుకుంటున్నారు. గత వారంలో వరుసగా తాడేపల్లిలో రెండు కిడ్నాప్‌లు, ఒక దోపిడీ జరిగాయి. ఇందులో దోపిడీ ఘటన మాత్రమే వెలుగు చూసింది. కిడ్నాప్ విషయాలు మాత్రం బయటకు రాలేదు. కిడ్నాప్ విషయాలు ఆ నోటా ఈ నోటా పోలీసుల చెవినబడ్డాయి. ఈ మేరకు తాడేపల్లి పోలీసులు ఆదివారం సీరియస్‌గా తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు తాడేపల్లి మునిసిపల్ ప్రాంతంలో నివాసం ఉండే ఓ బిల్డర్ ఇంటికి వెళుతుండగా అతడిని కారులో ఎక్కించుకుని, కిడ్నాప్ చేసి ఏటీఎం కార్డు, కొంత నగదు దోచుకెళ్లారు. మరుసటి రోజు కుంచనపల్లికి చెందిన ఓ శ్రీమంతుడిని కిడ్నాప్ చేశారు. అనంతరం అతడిని తాడేపల్లి, మంగళగిరి ప్రాంతాలలో కారులో తిప్పుతూ చిత్రహింసకు గురి చేశారు. అదే సమయంలో కిడ్నాప్ అయిన వ్యక్తికి కిడ్నాప్ చేయించిన వ్యక్తి ఫోన్ చేసి ఎక్కడ ఉన్నావని సమాచారం అడుగుతాడు. కిడ్నాప్ అయిన వ్యక్తి నుంచి విషయాలు తెలుసుకున్నట్టు నటించి, కిడ్నాపర్స్‌తో ఫోన్లో మాట్లాడి, వారు అడిగిన డబ్బులు ఇస్తానంటూ అతనే ఆ డబ్బు తెస్తాడు. ఆ డబ్బును కిడ్నాపర్లకు అందజేసి, అనంతరం కిడ్నాప్ అయిన వ్యక్తి నుంచి వసూలు చేసుకుంటాడు. నగదు వసూలు ఇలా.. ఇలా జరిగిన కిడ్నాప్‌లో కుంచనపల్లికి చెందిన ఓ శ్రీమంతుడి వద్ద ఎనిమిది లక్షలు వసూలు చేశారు. సదరు కిడ్నాప్ అయిన వ్యక్తి దగ్గర ఈ నెల 21న రూ. లక్ష, 23న రూ. 3 లక్షలు, 25న రూ. 4.5 లక్షలు వసూలు చేశారు. దీనిలో కూడా కిడ్నాపర్స్‌తో మాట్లాడినందుకు రూ. 50 వేలు అంటూ అదనంగా నగదు వసూలు చేశాడు. ఈ కిడ్నాప్‌లు చేస్తున్నది తాడేపల్లికి చెందిన మాజీ నేరస్తుడిగా పోలీసులు గుర్తించినట్టు విశ్వసనీయ సమాచారం. గతంలో ఆ పాత నేరస్తుడు తాడేపల్లి చుట్టుపక్కల ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పేకాట, కోడిపందేలు నిర్వహించడంతో ఎవరి ఆర్థిక పరిస్థితి ఏంటనేది తెలిసిన వ్యక్తి. వారిని కిడ్నాప్ చేస్తే ఎంత డబ్బు వసూలు చేయవచ్చు, ప్రాణభయం ఉన్నవారిని మాత్రమే ఎంచుకుని ఈ ఘాతుకాలకు పాల్పడుతున్నారు. ఇప్పటికే పోలీసుల అదుపులో మహానాడు ప్రాంతానికి చెందిన ముగ్గురు కిడ్నాపర్లు ఉన్నట్టు సమాచారం. అసలు సూత్రధారి పరారీ ఉండి, అధికార పార్టీ నేతలతో మంతనాలు జరుపుతున్నట్టు విశ్వసనీయ సమాచారం. -
బాలుడి కిడ్నాప్ కేసులో ముగ్గురు నిందితుల అరెస్ట్
గుంటూరు జిల్లా కేంద్రం ఏటి అగ్రహారంలో గత నెల 14న బాలుడిని కిడ్నాప్ చేసి హత్య చేసిన కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి వివరాలు వెల్లడించారు. గత నెల 14న ఏటి అగ్రహారానికి చెందిన నన్నం యాదిత్యరాజు(12) అనే బాలుడిని మణికంఠ అనే ట్యూషన్ మాస్టారు ఇద్దరు స్నేహితుల సహాయంతో కిడ్నాప్ చేశారు. కిడ్నాప్ అనంతరం బాలుడి తల్లి జయకుమారికి ఫోన్ చేసి రూ.15 లక్షల ఇవ్వాలని డిమాండ్ చేశారు. తాము అంత ఇచ్చుకోలేమని రూ.2 లక్షలు ఇస్తామని జయకుమారి కిడ్నాపర్లకు తెలిపింది. ఈ విషయం జయకుమారి పోలీసులకు తెలియజేసింది. కిడ్నాప్ చేసిన వారు బాలుడికి నిద్రమాత్రలు వేశారు. నిద్ర నుంచి లేచిన బాలుడు కిడ్నాపర్లను గుర్తుపట్టడంతో ఎక్కడ దొరికిపోతామేమోనని భయంతో బాలుడిని చంపి ఓ బావిలో పడేశారు. బాలుడి తల్లికి ఫోన్ చేసి.. మాచర్ల ట్రైన్ ఎక్కి తుమ్మల చెరువు వద్ద ట్రైన్లో నుంచి రూ.2 లక్షల నగదును పడవేయమని చెప్పారు. బాలుడిని కిడ్నాప్ చేసిన వెంటనే కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పట్టుబడిన నిందితులు రామిశెట్టి గోపి, వేల్పుల పిచ్చయ్య, మణికంఠలను మీడియా ఎదుట హాజరుపరిచి అనంతరం రిమాండుకు తరలించారు. -
డబ్బుతీసుకుని చంపేశారు
- గుంటూరు జిల్లాలో దారుణం - బాలుడి కిడ్నాప్, హత్య గుంటూరు గుంటూరు జిల్లా ఫిరంగి పురం మండలం తాళ్లూరులో సోమవారం దారుణం చోటు చేసుకుంది. కిడ్నాప్ డబ్బు అందిన తర్వాత కూడా ఓ బాలుడిని కిరాతకంగా హతమార్చారు. ఈనెల 14న తాళ్లూరుకి చెందిన యాదిత్య రాజు(8) అనే బాలుడిని కిడ్నాప్ చేశారు. అండల్ పేటలో బాలుడిని కిడ్నాప్ చేసిన దుండగులు.. అతని తల్లిదండ్రుల వద్ద రూ15 లక్షలు డిమాండ్ చేశారు. దీంతో వారు కిడ్నాపర్లకు రూ.12 లక్షలు అందించారు. అయితే సోమవారం స్థానిక చెరువులో బాలుడి మృత దేహం వెలుగు చూసింది. కిడ్నాపర్లే డబ్బు తీసుకుని బాలుడిని హతమార్చి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
కిడ్నాపైన బాలిక ఆత్మహత్య
హైదరాబాద్‌లో మూడు రోజుల క్రితం కిడ్నాపైన లలిత(13) అనే బాలిక సోమవారం తెల్లవారుజామున ఆత్మహత్య చేసుకుంది. గుర్తుతెలియని దుండగులు బాలికను కిడ్నాప్ చేసి కారులో తరలిస్తుండగా మహబూబ్‌నగర్ జిల్లాలో ట్రాఫిక్ పోలీసులు రక్షించారు. అనంతరం పోలీసులు మహబూబ్‌నగర్ జిల్లా దామరగిడ్డ మండలం బొమ్మన్‌పాడు గ్రామంలో ఉన్న తల్లిదండ్రులకు అప్పగించారు. అయితే తర్వాత ఏమైందో తెలీదు కానీ.. బాలిక సోమవారం ఉదయం ఉరికి వేలాడుతూ కనపడింది. బాలిక తల్లిదండ్రులు హైదరాబాద్‌లో కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఎవరినీ బెదిరించలేదు: తలసాని
సాక్షి, హైదరాబాద్: తన కుమారుడు సాయికిరణ్ ఎవరినీ కిడ్నాప్ చేయలేదని, బెదిరించలేదని మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ స్పష్టం చేశారు. సాయిపై కిడ్నాప్ కేసు నేపథ్యంలో గురువారం మారేడ్‌పల్లిలోని తన నివాసంలో మంత్రి విలేకరులతో మాట్లాడారు. తన కుమారుడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రామకోటేశ్వరరావు తదితరులతో కలసి 2011 ఓ నిర్మాణ సంస్థతో భాగస్వామ్య ఒప్పందం చేసుకున్నాడని తెలిపారు. ఈ మేరకు పెద్ద మొత్తంలో సొమ్మును తాము రామకోటేశ్వరరావుకు ఇచ్చామన్నారు. దీనికి సంబంధించి పెట్టుబడులు వెనక్కు తీసుకోవాల్సిందిగా రామకోటేశ్వరరావు నుంచి ప్రతిపాదన వచ్చిందని.. అయితే ఏళ్లు గడుస్తున్నా డబ్బులు తిరిగి ఇవ్వలేదన్నారు. బుధవారం రామకోటేశ్వరరావు, అతని మిత్రుడు కృష్ణ, మరో భాగస్వామి రామకృష్ణ, తన కుమారుడు సాయి కిరణ్ తాజ్ కృష్ణ లాబీల్లో కూర్చుని ఈ విషయమై మరోసారి చర్చించుకున్నారని తెలిపారు. కొంత డబ్బులు చెల్లించడానికి అంగీకరించిన రామకోటేశ్వరరావు, మిగతా మొత్తాన్ని నాలుగైదు నెలల్లో ఇస్తానని ప్రతిపాదించాడన్నారు. ఈ మేరకు హామీ ఇస్తూ వైట్‌పేపర్ మీద తానే రాసిచ్చాక సుహృద్భావ వాతావరణంలోనే చర్చలు ముగించుకుని, అక్కడి నుంచి బయలు దేరారన్నారు. ఆ తర్వాత తన కుమారుడు బెదిరించాడని రామకోటేశ్వరరావు ఫిర్యాదు చేయడం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. దీనిపై పూర్తి వివరాలను శుక్రవారం మరోసారి మీడియాకు వెల్లడిస్తానని మంత్రి చెప్పారు. -
బాలికను రెండో పెళ్లి చేసుకున్న ఘనుడు
♦ కిడ్నాప్, అత్యాచారం కేసులు నమోదు ♦ వేధింపులు భరించలేక ♦ విడాకులు తీసుకున్న మొదటి భార్య కౌడిపల్లి: ప్రేమ పేరుతో బాలికను ఎత్తుకెళ్లి పెళ్లి చేసుకుని కాపురం చేస్తున్న వ్యక్తిపై కిడ్నాప్, అత్యాచారం కేసు నమోదు చేసినట్లు నర్సాపూర్ సీఐ తిరుపతిరాజు తెలిపారు. శుక్రవారం నిందితుడిని అరెస్టు చేసిన సందర్భంగా విలేకరులతో కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. మండలంలోని రాయిలాపూర్ తండాకు చెందిన నునావత్ చందర్ అతడి భార్య, కూతురు(15)తో కలిసి హత్నూరలో కూలీ పనులు చేస్తున్నాడు. కాగా ఈ నెల 3న ఆ బాలిక స్వగ్రామానికి వెళ్లి తిరిగి వస్తానని చెప్పి వెళ్లింది. కానీ తిరిగి వెళ్లలేదు. దీంతో 16న బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు బాలిక అదృశ్యం కేసు నమోదు చేసినట్లు తెలిపారు. కాగా ఏఎస్ఐ ఖలీమొద్దీన్ ఆధ్వర్యంలో విచారణ చేపట్టగా మండలంలోని సలాభత్‌పూర్ తండాకు చెందిన నునావత్ రవీందర్ (24) బాలికను ప్రేమ పేరుతో తీసుకెళ్లి రాజేంద్రనగర్ చింతల్‌మేట్‌లో పెళ్లిచేసుకుని కాపురం చేస్తున్నట్లు తెలిసింది. దీంతో రవీందర్‌ను అరెస్టు చేసి బాలికను పెళ్లిచేసుకుని శారీరక సంబం ధం పెట్టుకోవడంతో అతడిపై కిడ్నాప్, అత్యాచారం కేసు నమోదు చేసినట్లు తెలిపారు. బాలికను తల్లిదండ్రులకు అప్పగించారు. గతంలోనే రవీందర్‌పై కేసు.. ఇదిలా ఉండగా రవీందర్‌కు 2013లో శివ్వంపేట తండాకు చెందిన మహిళతో పెళ్లి జరిగింది. కాగా భార్య ఉండగానే సలాభత్‌పూర్ తండాకు చెందిన మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుని ఆమెను ఎత్తుకెళ్లాడు. దీంతో ఈ విషయంలో రవీందర్‌పై గతంలోనే కేసు నమోదు అయింది. ఇతరులతో అక్రమ సంబంధం పెట్టుకొని భార్యను వేధించేవాడు. భరించలేని భార్య గత ఏడాది రవీందర్‌తో విడాకులు తీసుకుంది. -
పక్కా ప్లాన్?
♦ తండ్రి వ్యాపార, ఆర్థిక లావాదేవీలు తెలిసిన దుండగులు ♦ స్కూల్ దగ్గర కలుస్తూ బాలుడితో పరిచయం ♦ పక్కా రెక్కీ తర్వాతే ‘నమ్మక ద్రోహం’ ♦ డబ్బు కోసమే కిడ్నాప్ అనుకోని పరిస్థితుల్లో హత్య? సాక్షి, సిటీబ్యూరో: షాహినాయత్‌గంజ్‌లోని జ్ఞాన్‌బాగ్ కాలనీ సీతారాంపేట్‌లో అదృశ్యమై... సికింద్రాబాద్‌లోని ఆల్ఫా హోటల్ వద్ద శవమై కనిపించిన టెన్త్ క్లాస్ బాలుడు అభయ్ కిడ్నాప్.. మర్డర్ మిస్టరీలో ఆసక్తికర అంశాలు ఉన్నట్లు తెలుస్తోంది. బాలుడి తండ్రి రాజ్‌కుమార్ వ్యాపార, ఆర్థిక లావాదేవీలపై కన్నేసిన వ్యక్తులే ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రాథమిక ఆధారాలను సేకరించిన పోలీసులు దుండగుల కోసం వేట ముమ్మరం చేశారు. అభయ్‌తో పరిచయం పెంచుకుని... సీతారాంపేటలోని మహాలక్ష్మి టిఫిన్ సెంటర్ సమీపం నుంచి అభయ్‌ను ద్విచక్ర వాహనంపై తీసుకు వెళ్లిన దుండగుడు కొంతకాలం ముందు నుంచే బాలుడితో పరిచయం పెంచుకున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బాలుడు ఎలాంటి పెనుగులాట లేకుండా ద్విచక్ర వాహనం ఎక్కడం... కొద్దిదూరం అతడే వాహనాన్ని డ్రైవ్ చేసినట్లు తెలియడంతో ఈ అభిప్రాయం వ్యక్తమవుతోంది. అభయ్‌తో ఇంటి వద్ద కొత్త వ్యక్తులు పరిచయం పెంచుకోవడం సాధ్యం కాదు. అది జరిగితే కిడ్నాప్ తర్వాత వారి పైనే అనుమానాలు వస్తాయి. ఈ నేపథ్యంలోనే దుండగులు అబిడ్స్‌లోని స్లేట్ ద స్కూల్ వద్ద బాలుడితో పరిచయం పెంచుకుని కొన్ని రోజుల ముందు నుంచీ అక్కడికి వెళ్లినట్లు అనుమానాలున్నాయి. నమ్మకంగా పిలిచి అపహరణ కిడ్నాపర్లు కొద్ది రోజులుగా సాయంత్ర వేళ అభయ్ కదలికలను గమనించడంతో పాటు అతడితో కలిసి సరదాగా షికార్లు చేసినట్లు తెలుస్తోంది. అలా పెంచుకున్న నమ్మకాన్ని ఆసరాగా చేసుకున్న దుండగులు కిడ్నాప్‌కు పథక రచన చేశారు. రోజూలాగానే అభయ్ బుధవారం సైతం సీతారాంపేటలోని మహాలక్ష్మి టిఫిన్ సెంటర్‌కు వస్తాడని తెలుసుకున్న కిడ్నాపర్ అక్కడే కాపు కాయడమో... ఫోన్ చేసి బాలుడిని అక్కడికి రప్పించడమో చేశాడనుకుంటున్నారు. ముందే ఏర్పడిన పరిచయంతో కిడ్నాపర్ ద్విచక్ర వాహనం ఎక్కడానికి అభయ్ సంశయించ లేదు. అలా నమ్మకంగా తన వాహనం ఎక్కించుకున్న దుండగుడు అభయ్‌తో కలిసి కొంత దూరం వరకు ద్విచక్ర వాహనం పైనే ప్రయాణించాడు. ఆపై అసలు ‘కథ’ ప్రారంభించినట్లు తెలుస్తోంది. వాహనంతో పాటే మారిన సీన్... టిఫిన్ సెంటర్ నుంచి కొంత దూరం వరకు అభయ్‌ను ద్విచక్ర వాహనంపై తీసుకువెళ్లిన దుండగుడు ఆపై అసలు వ్యవహారం ప్రారంభించాడు. ముందే నిర్ణయించుకున్న ప్రాం తంలో కారు లేదా తేలికపాటి వాహనంలో వేచి ఉన్న అనుచరులను కలిశాడు. అది కచ్చితంగా నిర్మానుష్య ప్రాంతై మె ఉంటుందనే అనుమానాలు కలుగుతున్నాయి. తనను కూడా ఆ వాహనంలో ఎక్కించుకోవడం... ఎక్కడికో చెప్పకుండా తీసుకు వెళ్లడానికి ఉపక్రమించిన తర్వాతే అభయ్కు తొలిసారిగా అనుమానం వచ్చి ఉంటుందనే భావన ఉంది. దీంతో సీన్ మారినట్లు గుర్తించిన బాలుడు తప్పించుకునే ప్రయత్నాలు చేసి ఉంటాడనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అనుకోకుండా హత్య? అభయ్‌ను కిడ్నాప్ చేసిన దుండగులు ముందే నిర్ణయించుకున్న ప్రాంతానికి తీసుకువెళ్లి బంధించాలని భావించారని తెలుస్తోంది. అది సాయంత్రం కావడం... నగరంలో రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాట్లు... తనిఖీలు వీరికి ప్రతికూలంగా మారాయి. తమ వాహనంలో ఉన్న అభయ్ మార్గమధ్యలో ఏమాత్రం గలాభా చేసినా... చుట్టు పక్కల వారితో పాటు ఇతర వాహన చోదకులు, జంక్షన్ల వద్ద ఉండే పోలీసుల దృష్టిలో పడతామని దుండగులు భావించారని తెలుస్తోంది. అలా జరగకుండా ఉండటానికే బాలుడిని వాహనం సీట్ల మధ్యలోనో మరో ప్రాంతంలోనో అదిమిపట్టి ఉంటారని, అతడు అరవకుండా ఉండేందుకు పేపర్‌తో నోరు మూసే ప్రయత్నంలో ముక్కు కూడా మూసేయడంతో బాలుడి ప్రాణం పోయి ఉంటుంద ని భావిస్తున్నారు. ఇలా కాకుండా కిడ్నాప్ నేపథ్యంలో గలా భా చేస్తున్నాడనే ఉద్దేశంతో హత్య చేసి ఉంటారనే వాదనా ఉంది. కార్టన్ బాక్స్ కొని... అభయ్ మృతదేహానికి నోరుతో పాటు చేతులు వెనక్కు విరిచిన స్థితిలో మణికట్ల వద్ద ప్లాస్టర్ వేసి ఉంది. దాన్ని పరిశీలించిన పోలీసులు వైద్యులు వినియోగించే సర్జికల్ ప్లాస్టర్‌గా గుర్తించారు. అభయ్ చనిపోయాడని గుర్తించిన దుండగులు... సికింద్రాబాద్ వైపు ప్రయాణిస్తూ మార్గ మధ్యలో ఏదైనా మెడికల్ షాపులో ప్లాస్టర్‌తో పాటు అక్కడే కార్టన్ బాక్స్, సన్నటి ప్లాస్టిక్ తాడు తీసుకుని ఉంటారని తెలుస్తోంది. మృతదేహంతో నగరం దాటడం సాధ్యం కాదనే ఉద్దేశంతోనే వీటి సాయంతో వాహనంలోనే నిర్జన ప్రదేశంలో అభయ్ మృతదేహాన్ని పార్శిల్ చేశారనే అనుమానాలున్నాయి. ఆ పెట్టెను వాహనంలో పెట్టుకుని వెళ్తూ... ఆల్ఫా హోటల్ వద్ద వదిలేసి పరారైనట్లు తెలుస్తోంది. మొత్తం ఐదుగురిగా భావిస్తున్న దుండగుల్లో ఇద్దరు ఉప్పల్, తార్నాక ప్రాంతాల్లో ఆగిపోగా... మిగిలిన ముగ్గురూ సికింద్రాబాద్ నుంచే రైలులో విజయవాడ చేరుకున్నట్లు సమాచారం. ఎవరీ వీరేష్ అలియాస్ ఇమ్రాన్? అభయ్ కుటుంబీకులకు ఫోన్ చేసి డబ్బు డిమాండ్ చేయడానికి కిడ్నాపర్లు ‘78422 76480’ నెంబర్ వాడారు. సర్వీస్ ప్రొవైడర్ టాటా డొకోమో రికార్డుల ప్రకారం ఈ ఫోన్ ‘బి.వీరేష్, హరి నగర్, నియర్ పోచమ్మ టెంపుల్, రామ్‌నగర్, ముషీరాబాద్’ చిరునామాతో రిజిస్టరై ఉంది. మొబైల్ యాప్ ‘ట్రూ కాలర్’లో నమోదైన వివరాల ప్రకారం ఈ నెంబర్ తల్వార్ వర్క్‌షాప్‌నకు చెందిన ఇమ్రాన్ వినియోగిస్తున్నట్లు ఉంది. ఈ నేపథ్యంలోనే వీరేష్ పేరుతో తీసుకున్న నెంబర్‌ను ఇమ్రాన్ వినియోగిస్తున్నాడా? ఈ నేరంతో వీరేష్, ఇమ్రాన్‌లకు సంబంధం ఉందా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఈ కేసుకు సంబంధించి నగర పోలీసులు గురువారం రాత్రి ఇద్దరిని పట్టుకున్నట్లు సమాచారం. మరో ముగ్గురు నిందితులు విజయవాడలో ఉన్నట్లు గుర్తించిన ప్రత్యేక బృందం అక్కడకు చేరుకుని గాలిస్తోంది. -
నైజీరియాలో కిడ్నాప్ కథ సుఖాంతం
♦ కిడ్నాపర్ల చెర నుంచి సురక్షితంగా ♦ బయటపడిన పవన్‌కుమార్ సాక్షి, గుంటూరు: నైజీరియాలో అపహరణకు గురైన అయిశెట్టి వెంకట పవన్‌కుమార్ ఎట్టకేలకు కిడ్నాపర్ల చెర నుంచి సురక్షితంగా బయటపడ్డారు. దీంతో రెండ్రోజులుగా భయాందోళనలో ఉన్న పవన్‌కుమార్ కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. పవన్‌కుమార్ ఈనెల 20న కిడ్నాప్‌కు గురైనట్లు కుటుంబ సభ్యులకు గురువారం సమాచారం అందిన విషయం విదితమే. పవన్‌కుమార్‌తోపాటు కిడ్నాప్‌నకు గురైన ఇద్దరు వ్యక్తులను వదిలేసిన కిడ్నాపర్లు.. పవన్‌కుమార్‌ను మాత్రం శుక్రవారం అర్ధరాత్రి వరకూ వదలకపోవడంతో పవన్ భార్య లక్ష్మీఅన్నపూర్ణ, తల్లి వెంకటరత్నం తీవ్ర ఆందోళన చెందారు. శుక్రవారం పవన్‌కుమార్ తల్లి వెంకటరత్నం పడిన ఆవేదన వర్ణనాతీతమైంది. కిడ్నాపర్లు మనసు మార్చుకుని ఎటువంటి డిమాండ్లు పెట్టకుండానే పవన్‌కుమార్‌ను శనివారం తెల్లవారుజామున సురక్షితంగా వదిలేశారు. కిడ్నాపర్ల చెర నుంచి పవన్‌కుమార్ బయటపడ్డాడన్న వార్త తెలుసుకున్న కుటుంబసభ్యుల ఆనందానికి అవధులు లేవు. మిఠాయిలు పంచుకుని ఒకరినొకరు ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని ఆనందభాష్పాలు రాల్చారు. తన బిడ్డ కిడ్నాపర్ల చెర నుంచి బయటపడడానికి సహకరించిన వారందరికీ పవన్‌కుమార్ తల్లి వెంకటరత్నం కృతజ్ఞతలు తెలిపారు. -
పసికందు కిడ్నాప్
గుంటూరు జిల్లా మాచర్ల మండలం అడిగొప్పుల అమ్మవారి ఆలయం వద్ద ఆరు నెలల బాలుణ్ణి గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. ప్రకాశం జిల్లా పుల్లలచెరువు పట్టణానికి చెందిన ఎర్రదేశి రామాంజి, మన్నెమ్మ అనే దంపతులు బంధువులతో కలిసి తమ కుమారుడికి అన్నప్రాశన చేసేందుకు గుంటూరు జిల్లా మాచర్ల మండలం అడిగొప్పుల అమ్మవారి ఆలయానికి శనివారం రాత్రి 8 గంటలకు వచ్చారు. రాత్రి పొద్దుపోయాక ఆలయం బయట అడుకుంటున్న అరవింద్(6 నెలలు) అనే పిల్లవాణ్ణి గుర్తుతెయని వ్యక్తులు ఎత్తుకుని పిల్లవాడు ముద్దుగా ఉన్నాడని ముద్దాడుతూ పిల్లవాడితో సహా ఉడాయించారు. ఈ హటాత్ సంఘటనతో ఖంగుతున్న పిల్లవాని తల్లిదండ్రులు మాచర్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పిల్లవాని ఆచూకి కోసం గాలిస్తున్నారు. -
దుర్గ కిడ్నాప్.. సుఖాంతం
నల్లగొండలో నిందితురాలి జాడ పాపను క్షేమంగా విడిపించిన రైల్వే పోలీసులు అదుపులో నిందితురాలు.. మరో ఇద్దరు హైదరాబాద్: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో వారం రోజుల క్రితం అపహరణకు గురైన చిన్నారి దుర్గ కేసు సుఖాంతమైంది. సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా కిడ్నాప్ కేసును ఛేదించిన రైల్వే పోలీసులు నిందితురాలితోపాటు సహకరించిన మరో ఇద్దరు వ్యక్తులను నల్లగొండలో అదుపులోకి తీసుకున్నారు. కాకినాడకు చెందిన జి. రాణి తన కుమార్తె దుర్గ(5)తో కలసి పదిరోజుల క్రితం హైదరాబాద్‌లో ఉంటున్న సోదరుని ఇంటికి వచ్చింది. తిరిగి వెళ్లేందుకు ఈనెల 5న చిన్నారితో కలసి సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు చేరుకుంది. స్టేషన్లో వేచిచూస్తున్న రాణితో ఓ మహిళ మాటకలిపి పరిచయం చేసుకుంది. తనదీ విజయవాడేనని నమ్మించింది. రైలు వచ్చేందుకు చాలా సమయం ఉందని స్టేషన్ బయట పండ్లు కొందామని చెప్పి బయటకు తీసుకువచ్చింది. తిరిగి స్టేషన్లోకి వెళ్లే క్రమంలో ముందు రాణి నడుస్తుండగా, వెనుక దుర్గను ఎత్తుకుని మహిళ అనుసరించింది. టికెట్ కౌంటర్ ప్రాంతంలో రద్దీ ఎక్కువగా ఉండడంతో చిన్నారితో మహిళ అక్కడి నుంచి ఉడాయించింది. చుట్టపక్కల వెతికి.. చివరకు తన కుమార్తె కిడ్నాప్‌కు గురైనట్లు గ్రహించిన రాణి.. జీఆర్పీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు సీసీ కెమెరా ఫుటేజ్‌ల ఆధారంగా చిన్నారిని అపహరించిన మహిళను గుర్తించారు. ఆమె చిన్నారితో సహా నల్లగొండ వెళ్లే రైలు ఎక్కినట్లు గుర్తించి.. ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దింపారు. నల్లగొండ పట్టణంలో నిందితురాలితోపాటు ఆమెకు సహకరించిన ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని, చిన్నారి దుర్గను సురక్షితంగా విడిపించారు. గురువారం హైదరాబాద్‌కు తీసుకుచ్చిన నిందితులను శుక్రవారం మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. చిన్నారి దుర్గ కిడ్నాప్‌ను విజయవంతంగా ఛేదించి, నిందితులను అదుపులోకి తీసుకున్నామని జీఆర్పీ ఇన్స్పెక్టర్ ఆంజనేయులు తెలిపారు. -
బాలిక అదృశ్యం
హయత్ నగర్ బాలుడు నవీన్ ఉదంతం మరవక ముందే ఉప్పల్ లో మరో కిడ్నాప్ ఘటన నమోదైంది. ఇంటి ముందు ఆడుకుంటున్న ఏడేళ్ల బాలిక అదృశ్యం అయింది. బైక్ పై వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు తమ బిడ్డను అపహరించారని చిన్నారి తల్లిదండ్రులు ఫిర్యాదుచేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. మంగళవారం సాయంత్రం తన ఇంటి ముందు ఆడుకుంటున్న నవీన్ ను గుర్తుతెలియని వ్యక్తులు కారులో వచ్చి అపహరించుకుపోయారు. కిడ్నాపర్ పక్కింటి వ్యక్తే అని నవీన్ తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఉప్పల్ పరిసర ప్రాంతాల్లో రోజుకో కిడ్నాప్ కలకలం స్థానికుల్లో గుబులు రేపుతోంది. -
విశాఖ టీడీపీలో ముసలం
విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో ముగ్గురు టీడీపీ నాయకులను మావోయిస్టులు అపహరించి వారం గడుస్తున్నా ప్రభుత్వం వారి విడుదలకు ఎలాంటి ప్రయత్నాలు చేయకపోవడంతో.. మూడు మండలాల్లో పార్టీ కేడర్ తమ పదవులకు రాజీనామాలు చేశారు. ఈ విషయాన్ని మాజీ మంత్రి మణికుమారి మీడియాకు తెలిపారు. పాడేరు ఏజెన్సీ పరిధిలో బాక్సైట్ తవ్వకాలకు సంబంధించిన ఒప్పందాలను ప్రభుత్వం రద్దు చేసుకోవాలని డిమాండ్ చేస్తూ మావోయిస్టులు వారం క్రితం విశాఖ జిల్లా టీడీపీ కార్యదర్శి ముక్కల మహేశ్ , జీకే వీధి మండల అధ్యక్షుడు ఎం బాలయ్య పడాలు, ఉపాధ్యక్షుడు వి.బాలయ్యను మావోయిస్టులు అపహరించారు. అయితే, వీరి విడుదల విషయంలో ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి ప్రయత్నాలు చేయకపోవడం పార్టీ స్థానిక నాయకులకు ఆగ్రహం కలిగించింది. సీఎం చంద్రబాబు రెండు రోజుల క్రితం విశాఖ వచ్చిన సందర్భంగా అపహరణకు గురైన నాయకుల కుటుంబ సభ్యులు కూడా ఆయన్ను కలసి విడుదలకు కృషి చేయాలని కోరారు. అయినా, ప్రభుత్వ పరంగా ఎలాంటి చర్యలు లేకపోవడంతో పాడేరు నియోజకవర్గంలోని చింతపల్లి, జేకే వీధి, జి.మాడుగుల మండలాలకు చెందిన నాయకులు అందరూ తమ పదవులకు రాజీనామా చేశారు. రెండు మూడు రోజుల్లో ప్రభుత్వం స్పందించకుంటే, తెలుగుదేశం పార్టీకి కూడా రాజీనామా చేస్తామని వారు చెప్పినట్టు మణికుమారి తెలిపారు. కాగా మరో వైపు కొయ్యూరు, పాడేరు మండలాలకు చెందిన టీడీపీ కేడర్ కూడా రాజీనామాలకు సిద్ధమవుతున్నట్టు తెలిసింది. -
నలుగుర్ని అపహరించిన మావోయిస్టులు
ఖమ్మం జిల్లాలో నలుగురు గిరిజనుల్ని మావోయిస్టులు అపహరించుకుపోయారు. చర్ల మండలం పెద్దమిడిసిలేరు పంచాయతీ పరిధిలోని చలమల గ్రామానికి చెందిన మడకం ముత్తయ్య, మడకం రాజశేఖర్, మడకం రమేష్, వాసం కన్నారావులను సాయుధులైన మావోయిస్టులు సోమవారం రాత్రి అపహరించుకు పోయినట్టు తెలిసింది. ఈ విషయం బయటకు చెబితే చంపేస్తామని గ్రామస్తులను మావోయిస్టులు హెచ్చరించినట్టు సమాచారం. ఈ ఘటనని పోలీసులు ఇంకా ధ్రువీకరించలేదు. -
చిన్నారి ఉత్తమ్ కిడ్నాప్ కథ సుఖాంతం
తిరుపతి : తిరుపతిలో కిడ్నాప్ అయిన 27 రోజుల చిన్నారి ఉత్తమ్ ఆచూకీ లభ్యమైంది. తమిళనాడు రాష్ట్రం చిదంబరంలోని వేలూరులో ఉత్తమ్‌ని పోలీసులు ఆదివారం గుర్తించారు. చిన్నారిని తీసుకుని పోలీసులు చిత్తూరు బయలుదేరారు. మరికాసేపట్లో చిన్నారిని తల్లిదండ్రులకు అప్పగించనున్నారు. అయితే చిన్నారిని కిడ్నాప్ చేసినట్లుగా భావిస్తున్న పూజను పోలీసులు అదుపులోకి తీసుకుని... ప్రశ్నిస్తున్నారు. తిరుపతి రూరల్‌లోని విద్యా నగర్ కాలనీ నివసిస్తున్న నేపాల్‌కి చెందిన దంపతులు సంతోష్ కుమార్, బాటుకు ఇటీవలే బాబు జన్మించాడు. ఆ చిన్నారిని శనివారం మధ్యాహ్నం ఆగంతకులు కిడ్నాప్ చేశారు. దాంతో దంపతులు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అందులోభాగంగా బాలుడి ఆచూకీ కోసం పలు బృందాలను పోలీసులు ఏర్పాటు చేశారు. ఆ క్రమంలో బాలుడు వేలూరులో ఉన్నట్లు గుర్తించారు. -
మీటర్ బాగుచేస్తానంటూ మోసం
మూడున్నర తులాల పుస్తెలతాడు అపహరణ దేవరాపల్లి: విద్యుత్ మీటరును సరి చేసేందుకు వచ్చానంటూ గుర్తు తెలియని వ్యక్తి దంపతులను మోసగించి మూడున్నర తులాల బంగారు పుస్తెలతాడును అపహరించుకు పోయాడు. మండలంలోని బోయిల కింతాడ శివారు వడిదడకల వారి కల్లాలు వద్ద మంగళవారం సాయంత్రం జరిగిన ఘరానా మోసం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దేవరాపల్లి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కల్లాల్లో నివాసం ఉంటున్న వడదడకల శంకరరావు మంగళవారం పొలం పనులు ముగించుకొని తిరిగి వస్తుండగా గుర్తు తెలియని వ్యక్తి వచ్చి మీ ఇంటి విద్యుత్ మీటర్‌ను బాగు చేయడానికి వచ్చానని నమ్మబలికాడు. ఇది నిజమని నమ్మిన శంకరరావు ఇంటికి తీసుకెళ్లి విద్యుత్ మీటర్‌ను చూపించాడు. దానిని బాగు చేస్తున్నట్లు కొద్ది సేపు నటించిన అతడు కాఫర్ వైర్ కావాలని అడిగాడు. తమ వద్ద లేదని శంకర్రావు భార్య బదులిచ్చింది. దీంతో శంకర్రావు భార్య మెడలో ఉన్న బంగారు పుస్తెలతాడు ఇవ్వాలని కోరాడు. బంగారు పుస్తులతాడుతో పాటు అతడు అడిగిన మేరకు తెల్లని గుడ్డ కూడా ఇచ్చారు. వారి కంట పడకుండా గుడ్డ చాటున పుస్తెల తాడును జేబులో వేసుకొని తెల్లని గుడ్డని మాత్రం మీటరుపైన ఉంచాడు. గుడ్డలో పుస్తెలతాడు ఉందని, ఈ మీటరు పని చేయడం లేదని, దీని స్థానంలో కొత్త మీటరు వేయాలని నమ్మించాడు. తమ సిబ్బంది గవరవరం బ్రిడ్జి వద్ద విద్యుత్ మీటర్లుతో ఉన్నారని, అక్కడి నుంచి తేవాలని, శంకర్రావును కూడా బైకుపై ఎక్కించుకొని తీసుకెళ్లాడు. అతడు చెప్పిన ప్రదేశానికి కొద్ది దూరంలో శంకర్రావును దించేసి మీటర్‌ను తీసుకు వస్తానంటూ చెప్పి వెళ్లాడు. ఎంతసేపటికీ అతని పత్తా లేక పోవడంతో శంకర్రావు ఇంటికి వచ్చేశాడు. విద్యుత్ మీటరు మీద ఉంచిన తెల్లని గుడ్డలో బంగారు పుస్తెల తాడు లేక పోవడాన్ని గమనించి దంపతులు లబో దిబో మన్నారు. మోసోయామని తెలుసుకుని దేవరాపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ జి. అప్పన్న తెలిపారు. -
చిన్నారి కిడ్నాప్ కేసు దర్యాప్తులో పురోగతి
కర్నూలులో నిందితురాలు పోలీసుల అదుపులో ఆమెకు సహకరించిన వ్యక్తి కిడ్నాపర్ కోసం పోలీసుల మోహరింపు చిలకలగూడ : సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో అపహరణకు గురైన చిన్నారిని కన్నతల్లి ఒడికి చేర్చేందుకు చిలకలగూడ పోలీసులు తీవ్రంగా కృషి చేస్తున్నారు. అపహరించిన వారిని గుర్తించడంలో పురోగతి సాధించారు. ఏ క్షణమైనా నిందితురాలిని అదుపులోకి తీసుకునేందుకు ప్రత్యేక నిఘా బృందాలు కర్నూలు పట్టణంలో మాటు వేశాయి. మెదక్‌జిల్లా చిన్నశంకరంపేట మండలం గౌలిపల్లికి చెందిన రేణుక కుమార్తె కావ్య (9 నెలలు)ను శనివారం తెల్లవారుజామున గాంధీ ఆస్పత్రి విజటర్స్ షెడ్ నుంచి గుర్తుతెలియని మహిళ అపహరించిన సంగతి విదితమే. చిన్నారి తల్లి ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆదివారం సాయంత్రానికి పురోగతి సాధించారు. నిందితురాలికి సహకరించిన వ్యక్తిని ఘట్కేసర్కు చెందిన రవికుమార్‌గా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. సెల్‌ఫోన్ కాల్‌డేటా ఆధారంగా నిందితురాలు కర్నూలు పట్టణంలో ఉన్నట్లు గుర్తించి, ప్రత్యేక నిఘా బృందాలు అక్కడ మోహరించాయి. అదుపులోకి తీసుకున్న రవికుమార్ కూడా మహిళకు సంబంధించిన పూర్తి వివరాలు చెప్పలేకపోవడంతో నిందితురాలిని పట్టుకోవడంలో కొంతమేర జాప్యం జరుగుతున్నట్లు తెలిసింది. కాగా నిందితురాలిని పట్టుకుని చిన్నారిని క్షేమంగా నగరానికి తీసుకువస్తున్నారని కొన్ని ఛానెళ్లలో ప్రసారం కావడాన్ని పోలీస్ వర్గాలు కొట్టిపారేశాయి. నిందితురాలిని ఆదివారం సాయంత్రం వరకూ అదుపులోకి తీసుకోలేదని, రాత్రికి, లేదా సోమవారం నాటికి అదుపులోకి తీసుకుంటామని పోలీస్‌వర్గాలు స్పష్టం చేశాయి. అడ్డంకిగా మారిన ఆదివారం... చిన్నారిని రక్షించేందుకు ఆదివారం అడ్డంకిగా మారినట్లు తెలిసింది. నిందితురాలు వినియోగిస్తున్న సెల్‌నంబర్ కర్నూలు టవర్ లొకేషన్ చూపించింది. అయితే ఆదివారం సెలవు కావడంతో సర్వీస్ ప్రొవైడర్ల నిందితురాలు వినియోగిస్తున్న సెల్‌నంబర్‌కు సంబంధించిన పూర్తిస్థాయి సమాచారం అందించలేకపోయారని తెలిసింది. సోమవారం నాటికి నిందితురాలిని అదుపులోకి తీసుకునే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. -
గాంధీలో చిన్నారి అపహరణ
రంగంలోకి దిగిన పోలీస్ బృందాలు చిలకలగూడ : సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి ప్రాంగణంలో శనివారం వేకువజామున తొమ్మిది నెలల చిన్నారిని అపహరించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు 14 పోలీస్ బృందాలు రంగంలోకి దిగి గాలింపు చర్యలు చేపట్టాయి. చిలకలగూడ పోలీసులు తెలిపిన వివరాలు.. మెదక్‌జిల్లా చిన్నశంకరంపేట మండలం గౌలపల్లికి చెందిన గూడ రేణుక థైరాయిడ్ సమస్యలతో బాధపడుతుంది. చికిత్స కోసం తొమ్మిది నెలల కుమార్తె కావ్య, అత్త సిద్ధమ్మ, తండ్రి మల్లేష్‌తో కలిసి శుక్రవారం మధ్యాహ్నాం 12 గాంధీ ఆస్పత్రికి వచ్చింది. అప్పటికే అవుట్ పేషెంట్ విభాగం మూసివేయడంతో శనివారం వైద్యపరీక్షలు చేయించుకోవాలని ఆస్పత్రి ప్రాంగణంలోని విజిటర్స్ షెడ్లో బస చేశారు. ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రం సుమారు 45 ఏళ్లు ఉన్న వ్యక్తి తన పేరు విశ్వనాథం అని, 30 ఏళ్ల వయసుగల మహిళ తన కోడలు అని పరిచయం చేసుకున్నాడు. తన కోడలు కూడా థైరాయిడ్ సమస్యతో బాధపడుతుందని మాటలు కలిపి, తన కోడలు ఇక్కడే ఉంటుందని రాత్రి 8 గంటల సమయంలో అతడు వెళ్లిపోయాడు. అందరు కలిసి విజిటర్స్ షెడ్లో పడుకున్నారు. రాత్రి 2 గంటల సమయంలో రేణుక లేచి చూడగా కావ్యతోపాటు ఆ మహిళ కనిపించలేదు. ఆస్పత్రి ప్రాంగణమంతా వెతికినా ఫలితం లేకపోవడంతో రేణుక అవుట్‌పోస్ట్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. చిలకలగూడ ఇన్చార్జ్ సీఐ కావేటి శ్రీనివాసులు ఘటనాస్థలానికి వచ్చి వివరాలు సేకరించి, ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. కిడ్నాప్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సెల్‌నంబర్ ఆధారంగా.. విశ్వనాథం సెల్ నంబర్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టినట్లు తెలిసింది. గుర్తుతెలియని మహిళ రేణుక సెల్‌ఫోన్ నుంచి శుక్రవారం రాత్రి విశ్వనాథానికి ఫోన్ చేసింది. తర్వాత విశ్వనాథం రేణుక సెల్‌కు ఫోన్ చేసి సదరు మహిళతో మాట్లాడాడు. ఫొటోను సేకరించి బాధితురాలికి చూపించగా విశ్వనాథం అని గుర్తుపట్టింది. ఘట్కేసర్ ప్రాంతంలో విశ్వనాథాన్ని అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. గజ్వేలు, కడప తదితర ప్రాంతాలకు వెళ్లిన పోలీస్ బృందాలు చిన్నారి ఆచూకీ కోసం గాలిస్తున్నాయి. పనిచేయని సీసీ కెమెరా.. గాంధీ ఆస్పత్రిలోని విజిటర్స్ షెడ్ ఎదురుగా ఎమర్జెన్సీ విభాగం వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరా పనిచేయకపోవడంతో నిందితులకు సంబంధించిన సరైన ఆధారాలు లభించలేదు. దీంతో దర్యాప్తులో వేగం తగ్గింది. కిడ్నాప్ కేంద్రంగా.. - గాంధీలో రెండేళ్లలో రెండో ఘటన - రెండు ఆగస్టులోనే.. గాంధీ ఆస్పత్రి : సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి చిన్నారుల అపహరణకు కేంద్రంగా మారింది. రెండేళ్లలో ఇద్దరు చిన్నారులు కిడ్నాప్‌లకు గురయ్యారు. రెండు ఘటనలు ఆగస్ట్ నెలలోనే జరగడం గమనార్హం. 2013 ఆగస్ట్ 18వ తేదీన బోరబండ శ్రీరాంనగర్‌కు చెందిన సుమిత్ర ప్రసవించిన మరునాడే బాబును పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన మేరీ, నవీన్ అపహరించారు. చాకచక్యంగా వ్యవహరించిన పోలీసులు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లోని సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించి చిన్నారిని ఎత్తుకుని అనుమానాస్పదంగా సంచరించి నిందితులు మహిళ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ ఎక్కినట్లు గుర్తించారు. తెనాలి రైల్వేస్టేషన్లో నిందితులను అదుపులోకి తీసుకుని చిన్నారిని కన్నతల్లి చెంతకు చేర్చారు. కాగా శనివారం అపహరణకు గురైన చిన్నారి కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. -
పాతబస్తీలో వడ్డీవ్యాపారుల ఆగడాలు
హైదరాబాద్ : హైదరాబాద్ పాతబస్తీలో వడ్డీ వ్యాపారుల ఆగడాలు అడ్డుఅదుపు లేకుండా కొనసాగుతున్నాయి. తాజాగా ఓ వ్యక్తిని కిడ్నాప్ చేసి చిత్రహింసలకు గురి చేశారు. వివరాల్లోకి వెళితే చాంద్రాయణగుట్టలో ట్రావెల్ ఏజెంట్‌గా పని చేస్తున్న షరీఫ్ అనే వ్యక్తి... వడ్డీ వ్యాపారి నారాయణరెడ్డి వద్ద రూ.10 చొప్పున 2లక్షల 50వేల రూపాయలు ఏడాది క్రితం అప్పు తీసుకున్నాడు. అయితే సకాలంలో వడ్డీ చెల్లించలేదని షరీఫ్‌ను బుధవారం నారాయణరెడ్డి అనుచరులు కిడ్నాప్ చేసి ఆల్మాస్గూడలో బంధించి చిత్రహింసలు పెట్టారు. ఈ విషయాన్ని బాధితుడి బంధువులు ఫిర్యాదు చేయటంతో పోలీసులు వడ్డీ వ్యాపారుల డెన్‌పై దాడి చేసి షరీఫ్‌ను విడిపించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
పది మంది గిరిజనుల కిడ్నాప్.. కానిస్టేబుల్ హత్య
ఛత్తీస్‌గఢ్‌లో మావోల దురాగతం చింతూరు: ఛత్తీస్‌గఢ్‌లో మావోరుుస్టులు పదిమంది గిరిజనులను కిడ్నాప్ చేయడమే కాక ఓ కానిస్టేబుల్‌ను హతమార్చారు. సుక్మా జిల్లా కిష్టారం పోలీస్ స్టేషన్ పరిధిలోని భెర్జి గ్రామానికి చెందిన గిరిజనులను ఆదివారం మావోలు కిడ్నాప్ చేసి రహస్య ప్రదేశానికి తరలించారు. తమ సమావేశాలకు హాజరుకాకపోవడం, సహకరించకపోవడం వంటి కార ణాలతో గిరిజనులను మావోలు కిడ్నాప్ చేసినట్లు తెలుస్తోంది. గత నెలరోజులుగా అడవుల్లో మావోయిస్టులు కిడ్నాప్‌లకు పాల్పడుతున్నారు. 20 రోజుల క్రితం గొల్లపల్లి సర్పంచ్‌తో పాటు మరొకరిని కిడ్నాప్‌చేసి.. హతమార్చారు. వారం క్రితం గంగలేరు సర్పంచ్‌తో పాటు నలుగురిని కిడ్నాప్ చేసి విడిచిపెట్టారు. ఇదిలా ఉండగా ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు ఓ కానిస్టేబుల్‌ను హతమార్చారు. మి ర్తూర్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న సుందర్ కశ్యప్ శనివారం చేర్పాల్‌లో జాతర చూసేందుకు వెళ్లాడు. సుందర్‌ని జాతరలో కిడ్నాప్ చేసిన మావోలు గొంతు నులిమి హత్య చేశారు. శవాన్ని ఆదివారం పాలనార్ వద్ద పడేశారు. -
రంపచోడవరం కిడ్నాప్
ముప్పై ఏళ్ల క్రితం జరిగిన క్రైమ్ స్టోరీ ఇది. నేను 1984లో తూర్పుగోదావరి జిల్లా ఎస్పీగా అపాయింట్ అయ్యాను. అప్పటికి ఆ ప్రాంతమంతా నక్సల్స్ కిడ్నాపుల సంఘటనలతో అట్టుడుకుతోంది. నేను అక్కడికి వెళ్లకుముందు జరిగిన ఓ రెండు పెద్ద కిడ్నాపులు నాకే కాదు, మొత్తం డిపార్టుమెంటుకే సవాలుగా నిలిచాయి. ఒకసారి నక్సల్స్... ఎనిమిదిమంది ఐఏఎస్ ఆఫీసర్లను కిడ్నాప్ చేసి వారి డిమాండ్లను నెరవేర్చుకున్నారు. ఇంకోసారి పెద్దాపురం ఆర్డీఓను కిడ్నాప్ చేసి వారి సహచరుల్ని జైల్ నుంచి విడిపించుకున్నారు. అదే సమయంలో ఆదిలాబాద్ కలెక్టర్‌ని కూడా కిడ్నాప్ చేశారు. ఎక్కడ చూసినా నక్సల్స్ కిడ్నాపుల వార్తలే. తూర్పుగోదావరి చాలావరకూ ఏజెన్సీ ప్రాంతం కావడంవల్ల అక్కడే ఈ సంఘటనలు ఎక్కువగా జరుగుతుండేవి. ఎవరిని కిడ్నాప్ చేసినా దట్టమైన అడవుల్లోకి తీసుకెళ్లి దాచిపెట్టేవారు. పవర్లో ఉన్నవారిని కిడ్నాప్ చేసి తోటి నక్సల్స్‌ని జైళ్ల నుంచి విడిపించుకునేవారు. డబ్బున్నవారిని కిడ్నాప్ చేసి ధనాన్ని డిమాండ్ చేసేవారు. ఇలాంటివి వారి భాషలో ‘మనీ యాక్షన్’ పనులన్నమాట! సాయంత్రంలోగా 35 లక్షలు! ఒకరోజు ఉదయం నేను రంపచోడవరం ఏజెన్సీలో ఉండగా ఓ షావుకారి కుటుంబ సభ్యులొచ్చి చేతిలో ఓ లేఖ పెట్టి బోరుమన్నారు. సాయంత్రం లోగా 35 లక్షల డబ్బుని ఫలానా చోటికి పంపించకపోతే షావుకారి ప్రాణాలు గాల్లో కలిసిపోతాయని ఆ ఉత్తరం సారాంశం. అప్పటికే నేను నక్సల్స్ కిడ్నాపింగ్ సంఘటనల విషయంలో చాలా అలర్ట్‌గా ఉన్నాను. ఉదయం తొమ్మిదింటికి కిడ్నాప్ విషయం తెలిసిన వెంటనే మా బలగాలను మొత్తం దింపాను. దాదాపు రెండు వందల మంది వరకూ ఉంటారు. వారిని ఎనిమిది గ్రూపులుగా విభజించాను. ఒక్కో గ్రూపులో ఇరవైమందికి పైగానే ఉంటారు. నా అంచనా ప్రకారం కిడ్నాప్ చేసిన దళంలో పదిమందివరకూ నక్సల్స్ ఉంటారు. ఒక నక్సల్‌కి ఇద్దరు పోలీసుల చొప్పున గ్రూపులను తయారుచేసి అటవీ ప్రాంతానికి చేరుకున్నాం. రంప ఏజెన్సీలో ఉన్న అటవీ విస్తీర్ణం చాలా పెద్దది. చాలా డేంజరెస్ జోన్ కూడా! చిరుత పులులు, ఎలుగుబంట్లు ఎక్కువగా ఉండేవి. ముందుగా అడవి మ్యాప్ తీసుకుని, అడవి చుట్టూ ప్రాంతాన్ని మా బృందాలు కవర్ చేసేలా ప్లాన్ వేశాను. అందరమూ దిక్సూచిలు, వైర్లెస్ ఫోన్లు, రాత్రుళ్లు కూడా కనిపించే నైట్ విజన్ గాగుల్స్, ఆయుధాలను వెంటబెట్టుకుని బయలుదేరాం. కాళ్లు అరిగే ప్రయాణం... నా స్కెచ్ గురించి చెప్పగానే టీమంతా ఆశ్చర్యపోయింది. లేఖలో చాలా స్పష్టంగా రాసి ఉంది. పోలీసులకు చెబితే బాగుండదని. అలాంటి పని చేస్తే వెంటనే ప్రాణాలు తీసేస్తామని కూడా హెచ్చరించారు. అలాంటి లేఖని చదివి కూడా నేను ఇలా పోలీసు బలగాలను అడవిలోకి పంపడం ఎంతవరకూ సమంజసమని అనుకున్నారంతా. కానీ నా స్కెచ్ ఫలితం... షావుకారు ప్రాణాలతో దక్కుతాడు. ఆ క్షణానికి అది నా నమ్మకం మాత్రమే. నా ప్లాన్ బెడిసికొట్టే అవకాశం లేకపోలేదు. మనసులో షావుకారు ప్రాణాలకు అపాయం జరక్కూడదని కోరుకుంటూ అడుగు ముందుకు వేస్తున్నానే కాని నా టెన్షన్ నాకుంది. అప్పటివరకూ ఇలాంటి ఆపరేషన్స్‌లో ఎస్పీ స్థాయి వ్యక్తి నేరుగా పాల్గొనడం అదే ప్రథమం. గాల్లోకి కాల్పులు... అడవిని ఆనుకుని ఉన్న గూఢాలు దాటుకుని మధ్యలో కాసేపు ఆగి గిరిజనులు పెట్టిన రొట్టెలు తిని మళ్లీ పరుగు మొదలుపెట్టాం. నక్సల్స్‌కి సానుభూతిపరులున్నట్టే మాక్కూడా ఉంటారు కదా! వాళ్లు షావుకారుని పట్టుకుని ఎటువైపు వెళ్లింది చూసినవారల్లా చెప్పుకొచ్చారు. దాన్నిబట్టి ముందుకు కదిలాం. మధ్యమధ్యలో చిన్న చిన్న దొంగతనాలు చేసిన దొంగలు మమ్మల్ని చూసి పారిపోయేవారు. ‘మీకోసం కాదురా బాబు’ అనుకుంటూ మా పనిలో మేం నిమగ్నమైపోతుండగా నక్సల్స్‌కి కొద్దిగా దగ్గరగా వచ్చామన్న విషయం అర్థమయ్యాక అసలు ప్లాన్ అమలుపరిచాను. వైర్లెస్ సాయంతో అందరికీ ఒక ఆర్డరు జారీ చేశాను. నాన్‌స్టాప్‌గా గాల్లోకి కాల్పులు జరుపుకుంటూ ముందుకి నడవమని చెప్పాను. అడవిలో చిన్న శబ్దం కూడా చాలా గట్టిగా వినపడుతుంది. అలాంటిది వందల సంఖ్యలో తుపాకులు ఆకాశంలోకి పేలుస్తుంటే చప్పుడు ఏ స్థాయిలో ఉంటుందో ఊహించుకోండి. ఎనిమిది వైపుల నుంచి తుపాకి కాల్పులు. ఒక్కసారి పేలిస్తే నాలుగుసార్లు రీసౌండ్ వస్తోంది. మావరకూ మాకే చెవులు చిల్లులు పడేలా అనిపించింది. విషయం అర్థమైంది... గిరిజనులు నక్సల్స్ వెళ్లిన మార్గం గురించి మాకు ఎలా వివరాలు చెప్పారో వారికి అంతకంటే పెద్దస్థాయిలో సానుభూతిపరులు ఉంటారు కాబట్టి వారికి కూడా మా గాలింపు విషయాలు ఎప్పటికప్పుడు అందుతుంటాయి. పైగా ఎస్పీయే రంగంలోకి దిగిన వార్త వారికి ముందుగానే అందిపోయి ఉంటుంది. సాయంత్రం ఐదు అయ్యేసరికి వారున్న ప్రాంతానికి చేరుకున్నాం. ఒక కొండదిగాక పెద్ద జలపాతం కనిపించింది. అక్కడ పెద్ద రాయి. దానిముందు శివలింగం ఉంది. అక్కడికి వెళ్లి చుట్టూ ఉన్న లోయలోకి చూస్తే పక్కనే ఒక వెడల్పాటి రాయిపై పడివున్న షావుకారు కనిపించాడు. దగ్గరికి వెళ్లిచూస్తే బాగా దెబ్బలతో ఆయాసపడుతూ ఉన్నాడు. ‘ఏంటి సంగ’తని అని అడిగితే... ఇప్పుడే నక్సల్స్ తనని అక్కడ వదిలేసి పారిపోయారని చెప్పాడు. నేను దగ్గరకి వెళ్లగానే ఓపిక కూడదీసుకుని కన్నీళ్లతో కృతజ్ఞత చెప్పాడు. కారణం... అప్పటివరకూ డిమాండ్ నెరవేర్చకుండా ఏ ఒక్కరూ నక్సల్స్ చేతిల్లోనుంచి ప్రాణాలతో బయటపడలేదు. చుట్టుముట్టడం వల్లే... మామూలుగా ఇలాంటి కిడ్నాపింగ్ సంఘటనల్లో పోలీసులు దాడికి వస్తున్నారని తెలియగానే కిడ్నాప్‌కి గురైనవాడ్ని చంపేసి పారిపోతారు. లేదంటే అతన్ని ఎక్కడైనా దాచిపెట్టి బెదిరింపులు కొనసాగిస్తారు. కానీ ఓ సామాన్యుడ్ని కిడ్నాప్ చేస్తే ఇంత పెద్దస్థాయిలో బలగాల్ని దింపుతామని వారు ఊహించలేదు. పైగా నేను గాల్లోకి కాల్పులు జరపాలనే కాన్సెప్టుకి అర్థం ఏమిటంటే... ఒకవైపు నుంచి పోలీసులు వస్తున్నారంటే మరో వైపుకి వారు పరిగెడతారు. కానీ నాలుగువైపుల నుంచి ఫైరింగ్ చప్పుళ్లతో వస్తున్నారంటే పోలీసుల కోపం ఏ స్థాయిలో ఉందో వారికి అర్థమైపోతుంది. వాళ్లు మరో స్కెచ్ వేసుకునే అవకాశం లేకుండా సైకలాజికల్‌గా ఇబ్బందిలో పడేశాం. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే... అప్పటికే షావుకారిని బలవంతంగా లాక్కుంటూ, కొంతదూరం ఈడ్చుకుంటూ వెళ్లడం వల్ల అతని చాలా దెబ్బలు తగిలాయి. అతన్ని చంపేసి పారిపోతే మరునిమిషం మా టార్గెట్ నక్సల్సే అవుతారు. అడవంతా జల్లెడ పట్టయినా వారిని అంతం చేస్తామని వారికి తెలుసు. అదే షావుకారిని ప్రాణాలతో వదిలేస్తే మా దృష్టి అతనిపై ఉంటుంది. పైగా బాగా దెబ్బలు తగిలి ఉన్నాయి కాబట్టి అతన్ని ముందుగా ఆసుపత్రికి తీసుకెళ్లే పనిలో పడతాం కదా! నా స్కెచ్ నాతో ఉన్న పోలీసువారికి ఎంతవరకూ అర్థమైందో తెలీదు కానీ, నక్సల్స్‌కి మాత్రం క్లియర్‌గా అర్థమైంది. నేను కోరుకున్నట్టుగానే షావుకారిని మార్గమధ్యంలో వదిలేసి పారిపోయారు. సీఎం అభినందన... దెబ్బలతో ఉన్న షావుకారిని మావాళ్లంతా మోసుకొచ్చి ఆసుపత్రిలో చేర్పించి వైద్యం చేయించారు. నక్సల్స్ చేతిలో కిడ్నాప్ అయిన వ్యక్తిని ఈ విధంగా విడిపించుకురావడం అప్పుడొక సంచలనమైంది. పోలీస్ డిపార్టుమెంట్ పేరు చెబితే నక్సల్స్ ఒక నిమిషం ఆలోచించే పరిస్థితి తీసుకొచ్చింది. ఇక షావుకారి కుటుంబసభ్యుల ఆనందానికి అవధుల్లేవు. అప్పటి డీజీపీ కృష్ణమాచార్యులు వెంటనే ఫోన్ చేసి అభినందించారు. ఆ వెంటనే ముఖ్యమంతి ఎన్.టి రామారావుగారి దగ్గర నుంచి ఫోన్. ‘బ్రదర్...బాగుంది. కంగ్రాట్స్’ అంటూ. ఫోన్ చేసి ఊరుకోలేదు. రిటన్‌గా కమండేషన్స్(రాతపూర్వక ప్రశంస) పంపించారు. ఆ సందర్భంగా ‘ఎస్పీ స్వయంగా ఇలాంటి ఆపరేషన్స్‌లో పాల్గొంటే ఫలితాలెలా ఉంటాయనేందుకు ఈ కేస్ ఒక ఉదాహరణ’ అని డీజీపీ కృష్ణమాచార్యులు అన్నమాట డిపార్టుమెంట్లోకి వచ్చేవారికి ఒక పాఠంలాంటిది! రిపోర్టింగ్: భువనేశ్వరి -
నగలతో సహా విద్యార్థిని కిడ్నాప్ !
తిరువొత్తియూరు: విద్యార్థినితోపాటు 50 సవర్ల బంగారాన్ని కిడ్నాప్ చేసిన దుండగుని కోసం పోలీసులు గాలిస్తున్నారు. కన్యాకుమారి జిల్లా ఆరల్ వాయ్ మొళి, తాళ్కుడి సౌత్ వీధికి చెందిన దివ్య (19). ఈమె నాగర్‌కోవిల్‌లోని ఓ కళాశాలలో ద్వితీయ సంవత్సరం డిగ్రీ చదువుతోంది. 23వ తేదీ సాయంత్రం పక్కింటిలో ఉన్న స్నేహితురాలి వద్దకు వెళుతున్నట్టు చెప్పి వెళ్లింది. కాని తరువాత దివ్య ఇంటికి తిరిగి రాలేదు. తల్లిదండ్రులు, బంధువులు, ఆమె కోసం అన్ని చోట్ల గాలించారు. దీనిపై తల్లిదండ్రులు విచారణ చేయగా దివ్యను అదే ప్రాంతానికి చెందిన స్వయంభులింగం అనే వ్యక్తి కిడ్నాప్ చేసినట్టు తెలిసింది. దీనిపై విద్యార్థి తండ్రి ఆరోగ్యస్వామి ఆరల్మొలి పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదులో తన కుమార్తెను స్వయంభులింగం మాయ మాటలు చెప్పి 50 సవర్ల నగలతో కిడ్నాప్ చేసినట్టు పేర్కొన్నారు. ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేసి విద్యార్థిని కోసం గాలిస్తున్నారు. -
ఫైనాన్స్ కంపెనీ కార్యాలయంలో చోరీ
నెల్లూరు(క్రైమ్): ఓ ఫైనాన్స్ కంపెనీ కార్యాలయంలో దుండగులు చొరబడి రూ.7.15 లక్షలు అపహరించిన ఘటన మంగళవారం ఉదయం వెలుగు చూసిం ది. పోలీసుల కథనం మేరకు.. హిందూ జా లేలాండ్ ఫైనాన్స్ కంపెనీ బ్రాంచ్ కార్యాలయాన్ని నెల్లూరులోని ఆచారి వీధిలో ఐదేళ్లుగా నిర్వహిస్తున్నారు. నెల్లూరుకే చెందిన ఎం.మహేష్ బ్రాంచ్ మేనేజర్‌గా వ్యవహరిస్తున్నారు. శనివారం బ్యాంకు సమయం మించిపోవడంతో కంపెనీకి సంబంధించిన రూ.7.15 లక్షల నగదును కార్యాలయంలోని లాకరులోనే ఉంచారు. ఆదివారం సెలవు కావడంతో కార్యాలయం తెరవలేదు. సోమవారం సెలవు అయినప్పటికీ మహేష్‌తో పాటు పలువురు సిబ్బంది వచ్చి సాయంత్రం వరకు కార్యాలయంలోనే ఉన్నారు. అనంతరం తాళం వేసుకుని వెళ్లారు. ఈ క్రమం లో గుర్తుతెలియని వ్యక్తులు లోనికి చొరబడి లాకర్ పగలగొట్టడంతో పాటు అందులోని నగదు అపహరించారు. వేలి ముద్రలు పడకుండా, డాగ్‌స్క్వాడ్‌కు సైతం ఆధారాలు లభించకూడదనే ఉద్దేశంతో ఘటనా స్థలంలో మిరప్పొడి చలి ఉడాయించారు. మంగళవా రం ఉదయం 9.30 గం టలకు మహేష్ కార్యాలయం తలుపు తెరవగా లోపలంతా మిరప్పొడి చల్లివుండటంతో పాటు దక్షిణ భాగంలోని తలు పు తెరిచి కనిపించింది. లాకర్ సైతం పగలగొట్టి ఉండటం గుర్తించి వెంటనే ఒకటో నగర పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘట నా స్థలాన్ని నగర డీఎస్పీ ఎస్ మగ్బుల్, సీసీఎస్ డీఎస్పీ శ్రీధర్, ఇన్చార్జి ఇన్స్పెక్టర్ బాజీజాన్‌సైదా, ఒకటోనగర ఎస్ఐ కె. రామకృష్ణ పరిశీలించారు. క్లూస్‌టీం వేలిముద్రలను సేకరించింది. కంపెనీ సిబ్బందిని పోలీసులు విచారిస్తున్నారు. అనుమానాలెన్నో.. చోరీ జరిగిన తీరుపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. మహేష్ ఫిర్యాదులో పేర్కొన్న అంశాలకు ఘటన జరిగిన తీరుకు పొంతన కుదరడం లేదు. దక్షిణం వైపు తలుపు తెరిచివుందని మహేష్ చెబుతుండగా ఆ వైపు నుంచి దుండగులు వచ్చే అవకాశం కనిపించడం లేదు. కార్యాలయం మూడో అంతస్తులో ఉండ టం, దక్షిణం వైపు కరెంట్ తీగలు ఉండటంతో అటువైపు నుంచి దొంగలు వచ్చే అవకాశం లేనట్లు తెలుస్తోంది. నేరుగా తలుపులు తెరిచే లోనికి ప్రవేశించి, తిరిగే వెళ్లే సమయంలో తాళాలు వేసుకుని వెళ్లి ఉంటారని పోలీసులు భావించి ఆ దిశగా విచారణ చేపట్టారు. కార్యాలయానికి సంబంధించిన తాళాలు రెండు సెట్లు ఉండగా ఒక సెట్‌ను ఆఫీస్‌బాయి చంద్ర కొన్ని నెలల కిందట పోగొట్టినట్లు పోలీసుల దృష్టికి వచ్చింది. ఈ క్రమంలో చంద్రను సైతం విచారిస్తున్నారు. -
రక్తచరిత్ర
రివైండ్ 2014 23 హత్యలు.. 36 కిడ్నాప్‌లు... 64 అత్యాచారాలు... వందలాది భూకబ్జాలు... ఇలా2014లో జిల్లాలో అనేక సంచనల కేసులు నమోదయ్యాయి. ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది గన్ కల్చర్ పెరిగింది. చైన్‌స్నాచర్లు చెలరేగారు. రాజధాని నేపథ్యంలో ఆస్తి కోసం అయినవారిని సైతం హతమార్చేందుకు పలువురు వెనుకాడలేదు. రాజకీయ హత్యలు జిల్లావాసులను కలవరపాటుకు గురిచేశాయి. -
ఎనిమిది నెలల బిడ్డ అపహరణ
గాజువాక : అపహరణకు గురైన ఎనిమిది నెలల బాలుడు అదృష్టవశాత్తు ఆటో డ్రైవర్ చెంతకు చేరాడు. ఆటో డ్రైవర్‌కు ఇచ్చిన అజ్ఞాతవ్యక్తే తిరిగి ఆ బాలుడిని తీసుకెళ్లిపోవడానికి పథకం వేసినప్పటికీ ఆటోడ్రైవర్ భార్య పోలీస్ స్టేషన్లో అప్పగిస్తామని చెప్పడంతో మెల్లగా జారుకున్నాడు. ఆ బాలుడిని పోలీసులు చైల్డ్‌లైన్‌కు అప్పగించారు. గాజువాక పోలీసుల కథనం ప్రకారం.. అక్కిరెడ్డిపాలేనికి చెందిన బొంగు శ్రీరాములు ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. బేరంపై సోమవారం ఉదయం నగరానికి వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో కేజీహెచ్ వద్ద ఎనిమిది నెలల బాబుతో ఓ వ్యక్తి ఆటో ఎక్కాడు. తన భార్య లేదని, ఎవరైనా పెంచుకోవడానికి ముందుకొస్తే తన కుమారుడిని ఇచ్చేస్తానని చెప్పాడు. ప్రస్తుతం కుమార్తెను కలిగి ఉన్న శ్రీరాములు ఆ బిడ్డను తనకు ఇస్తే పెంచుకుంటానని చెప్పాడు. అక్కిరెడ్డిపాలెంలోని శ్రీరాములు ఇంటికి వెళ్లి బిడ్డను ఇచ్చి వెళ్లిపోయాడు. సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో మళ్లీ వచ్చిన కిడ్నాపర్ బిడ్డను తనకు ఇచ్చేయాలని కోరాడు. అతడి తీరుపై అనుమానం వ్యక్తం చేసిన శ్రీరాముల భార్య రమణమ్మ బిడ్డను పోలీసుల ద్వారా అప్పగిస్తామని, గాజువాక పోలీస్ స్టేషన్‌కు రమ్మని చెప్పింది. ఆ దంపతులిద్దరూ బిడ్డను తీసుకొని పోలీస్ స్టేషన్‌కు చేరుకోగా కిడ్నాపర్ మాత్రం మెల్లగా జారుకున్నాడు. ఎంతసేపటికీ అతడు పోలీస్ స్టేషన్‌కు రాకపోవడంతో పోలీసులు ైచైల్డ్లైన్కు ఫోన్లో సమాచారం అందించారు. అక్కడకు చేరుకున్న చైల్డ్‌లైన్ టీమ్ సభ్యురాలు కె.శారదాదేవికి బాబును అందజేశారు. తమ బాలుడు అపహరణకు గురైనట్టు పీఎం పాలెం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైనట్టు తెలిసింది. అక్కడ ఫిర్యాదు చేయడానికి వెళ్లిన తల్లిదండ్రులకు గాజువాక పోలీస్ స్టేషన్లో బాబు ఉన్నట్టు తెలియడంతో వారు ఇక్కడి పోలీసులకు ఫోన్ చేసి తమ బిడ్డ వివరాలను, గుర్తులను తెలిపారు. అన్ని ఆధారాలతో మంగళవారం వస్తే బిడ్డను అందజేస్తామని పోలీసులు, చైల్డ్‌లైన్ ప్రతినిధి స్పష్టం చేశారు. అంతవరకు చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ద్వారా శిశు గృహంలో ఉంచుతామని ఈ సందర్భంగా శారదాదేవి తెలిపారు. -
బాలిక ను గర్భవతి చేసిన వ్యక్తికి జైలు
న్యూఢిల్లీ: బాలికను కిడ్నాప్ చేసి, బలవంతంగా గర్భవతిని చేసిన నేరస్థుడికి ఏడు సంవత్సరాల కఠిన జైలు శిక్ష విధిస్తూ ఢిల్లీ కోర్టు సోమవారం తీర్పు చెప్పింది. నిందితుడికి ఇంతకు ముందే వివాహమైంది. భార్య పిల్లలు ఉన్నారు. కాబట్టి, బాలికను పెళ్లి చేసుకోవాలని పట్టుబట్టడం, గర్భవతిని చేయడం చట్టవిరుద్ధమని కోర్టు పేర్కొంది. అదనపు సెషన్స్ జడ్జి రజనీష్ కుమార్ గుప్తా ఈ మేరకు నేరస్థుడికి జైలు శిక్షను ఖరారు చేశారు. బీహార్‌కు చెందిన వ్యక్తికి జైలు శిక్షతోపాటు రూ. 7,000 జరిమానాను కూడా విధించారు. పోలీసులు తెలిపిన కేసు వివరాలిలా ఉన్నాయి.. డిసెంబర్ 23, 2011లో తన కూతురు కన్పించడం లేదని ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. డిసెంబర్ 8వ తేదీ నుంచి ఇప్పటి వరకు కన్పించలేదని పేర్కొన్నాడు. కిడ్నాప్ చేసినట్లు ఓ వ్యక్తిపై అనుమానం కూడా వ్యక్తం చేశాడు. ఆ తర్వాత బాలిక ఫిబ్రవరి 3, 2012లో బీహార్‌లోని సామస్తీపూర్లో పోలీసులు కనుగొన్నారు. వైద్యపరీక్షల అనంతరం ఆ బాలిక గర్భవతి అని తేలింది. ఆమె ఫిర్యాదు మేరకు నిందితుడి మరో 10 రోజుల్లో పోలీసులు అరెస్టు చేశారు. బాలిక వైద్య పరీక్షల నివేదికను కోర్టు పరిశీలించింది. బాలిక గర్భంలోని పాపకు తండ్రి నిందితుడేనని డీఎన్ఏ నివేదిక ఆధారంగా తేల్చింది. ఏది ఏమైనా బాలికను బలవంతంగా లొంగదీసుకొని ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడని కోర్టు భావించింది. కాగా, ఆమె వయస్సు 18 ఏళ్లు అని, తనను ప్రేమిస్తోందని నిందితుడి తరఫున వాదనలతో కోర్టు ఏకీభ వించలేదు. ఈ మేరకు నేరస్థుడికి జైలు శిక్ష ఖరారు చేసింది. -
ఎస్బీఐ డిప్యూటీ మేనేజర్ హత్య
పహాడీషరీఫ్: దుండగులు ఓ బ్యాంక్ డిప్యూటీ మేనేజర్‌ను చాదర్‌ఘాట్‌లో కిడ్నాప్ చేసి.. దారుణంగా హత్య చేశారు. అతడి నోటికి టేప్‌వేసి.. చేతులు కట్టేసి.. ఉరేసి చంపేశారు. పహాడీషరీఫ్ ఠాణా పరిధిలో ఆదివారం ఉదయం ఈ ఘటన వెలుగు చూసింది. శంషాబాద్ ఏసీపీ ఆర్.సుదర్శన్, పహాడీషరీఫ్ ఇన్స్పెక్టర్ పి.వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం.... చంపాపేట్‌లోని ఈస్ట్ మారుతీనగర్‌లో నివాసముండే బ్రిజ్మోహన్ (54) చాదర్‌ఘాట్ ఎస్బీఐ బ్రాంచిలో డిప్యూటీ మేనేజర్. ఇతనిడి కుమారుడు రోజూ ఉదయం బ్యాంక్ వద్ద తన వాహనంపై దింపుతాడు. విధులు ముగిశాక బ్రిజ్మోహన్ సాయంత్రం ఆటోలో ఇంటికి చేరుకుంటాడు. ఇదిలా ఉండగా శనివారం విధులకు వెళ్లిన ఆయన ఇంటికి తిరిగి వెళ్లకపోవడంతో ఆందోళనకు గురైన కుటుంబసభ్యులు చాదర్‌ఘాట్ ఠాణాలో ఫిర్యాదు చేయగా.. మిస్సింగ్ కేసు నమోదు చేశారు. ఇదిలా ఉండగా... పహాడీషరీఫ్ గ్రామ శివారులో ఉన్న ఉమర్ కాలనీ సమీపంలోని నిర్మానుష్య ప్రాంతంలో మౌలానా మహ్మద్ రాషేద్ హుస్సేనీ ఖురేషీ దర్గా ఉంది. నిర్మానుష్యంగా ఉండే ఈ ప్రాంతంలో స్థానిక చిన్నారులు ఆదివారం ఉదయం 7.30కి క్రికెట్ ఆడుతున్నారు. దర్గా వైపు బంతి వెళ్లడంతో పట్టుకునేందుకు పరుగులు పెట్టిన చిన్నారులు అక్కడ పడి ఉన్న మృతదేహాన్ని చూసి భయంతో బస్తీలోకి పరుగులు తీసి పెద్దలకు విషయం తెలి పారు. వారు వెంటనే పహాడీషరీఫ్ పోలీసులకు సమాచారం ఇవ్వగా.. శంషాబాద్ ఏసీపీ ఆర్.సుదర్శన్, పహాడీషరీఫ్ ఇన్స్పెక్టర్ పి.వెంకటేశ్వర్లు తమ సిబ్బందితో కలిసి ఘటనా స్థలికి చేరుకున్నారు. హత్య జరిగిన తీరును చూసి పోలీసులు సైతం నివ్వెరపోయారు. దాదాపు 40 ఏళ్ల వ్యక్తి నోరు, చేతులను దుండగులు మెడికల్ టేప్(ఆసుపత్రులలో గాయాలకు వినియోగించే క్లాత్)తో కట్టేసి, మెడకు తాడుతో ఉరేసి అనంతరం అక్కడే ఉన్న మూడు బండరాళ్లతో ముఖంపై బాది హత్య చేసినట్టు గుర్తించారు. వెంటనే డాగ్‌స్క్వాడ్‌ను రప్పించి పరిశీలించగా.. జాగిలం ఘటనాస్థలం నుంచి కొద్ది దూరం వెళ్లి.. అక్కడే వంద మీటర్ల దూరంలో కలియ తిరిగి మృతదేహం వద్దకు తిరిగి వచ్చింది. స్థానికులెవ్వరూ మృతుడిని గుర్తించకపోవడంతో గుర్తు తెలియని వ్యక్తి హత్యగా పోలీసులు భావిస్తున్నారు. కాగా, మృతుడి జేబులో మలక్‌పేటలోని ఎస్బీఐ ఏటీఎంలో జరిపిన ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన రసీదులు దొరికాయి. గతనెల 30న ఇదే ఏటీఎంలో రూ. 100లు డ్రా చేసిన రసీ దు, 31వ తేదీ సాయంత్రంతీసుకున్న మినీస్టేట్మెట్ లభించాయి. మృతుడు వేసుకున్న చొక్కాపై వీఎన్ఆర్ టైలర్, చంపాపేట్ అనే లేబుల్ ఉంది. దర్యాప్తు చేపట్టిన పో లీసులు హతుడు చాదర్‌ఘాట్ ఎస్బీఐ డిప్యూటీ మేనేజర్‌గా గుర్తించారు. డబ్బుల కోసం కిడ్నాప్ చేసి హత్య చేసి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. -
రియల్ రెక్కీ
వరంగల్ నగరంలో పిల్లల వైద్యుడు సురేందర్‌రెడ్డి కిడ్నాప్ మిస్టరీ మరువక ముందే.. ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్‌నకు కుట్ర జరిగింది. నిషేధిత సంస్థతో డీల్ కుదుర్చుకుని రెక్కీ నిర్వహించినా.. సక్సెస్ కాకపోవడంతో అతడిని అంతమొందించేందుకు సిద్ధపడ్డారు. చివరకు నిఘావర్గాల సమాచారంతో పోలీసులకు పట్టుబడ్డారు. ఇదే క్రమంలో మరో ముఠా నిషేధిత సంస్థల సభ్యుల పేరుతో భూ వ్యవహారాల్లో తలదూర్చి.. ఆయుధాలతో సహా పోలీసులకు చిక్కి కటకటాల పాలు కావడం కలకలం రేపింది. వీరిని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించినట్లు సమాచారం. వరంగల్ క్రైం : వరంగల్ నగరానికి చెందిన ఓ వ్యాపారి కొంతకాలంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నాడు. వెంచర్లు చేసి విక్రయిస్తూ.. బిల్డర్‌గా కొనసాగుతున్నారు. గతంలో ఒక పార్టీలో ఉన్నతస్థాయి నామినేటెడ్ పోస్టులో కొనసాగాడు. అనంతరం రాజకీయాలకు గుడ్‌బై చెప్పి ఫుల్‌టైమ్ రియల్ ఎస్టేట్ వ్యాపారిగా కొనసాగుతున్నాడు. గీసుకొండ మండలం గొర్రెకుంట సమీపంలో ఈ వ్యాపారికి పెద్ద వెంచర్ ఉంది. దీంతోపాటు నగర పరిధిలోని పలు ప్రాంతాల్లో ప్లాట్ల కొనుగోళ్లు, విక్రయించడం చేస్తుంటాడు. ఈ క్రమంలో మూడే ళ్ల క్రితం ఆరెపల్లిలో ఓ వ్యక్తికి చెందిన భూమిని కొనుగోలు చేయడం.. ఆ తర్వాత విక్రయిం చడం.. ఈ క్రమంలో అది డిస్ప్యూట్గా మా రింది. తాను అమ్మిన ఆరెపల్లికి చెందిన వ్యక్తికి డ బ్బులు తిరిగి ఇచ్చేవిధంగా సదరు రియల్టర్ ఒప్పందం కుదుర్చుకుని, ఆ భూమిని మరొకరికి విక్రయించాడు. గతంలో పెద్దమనుషుల మధ్య జరిగిన పంచాయితీలో రెండోసారి భూమి కొనుగోలు చేసిన వ్యక్తి ఆరెపల్లికి చెం దిన భూ పట్టాదారుడికి డబ్బులు ఇచ్చే విధం గా ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే సమాచార లోపంతో డ బ్బులు ఇవ్వలేదు. దీంతో పట్టాదారు తనకు డబ్బులు ఇవ్వాలని.. రెండో వ్యక్తితో సంబంధం లేదని కొద్ది రోజులుగా మొదట కొనుగోలు చేసిన రియల్టర్‌తో పలుమార్లు అన్నాడు. ఈ క్రమంలో సదరు రియల్ ఎస్టేట్ వ్యాపారికి బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చాయి. తీవ్ర స్థాయిలో బెదిరిస్తూ ఒత్తిడి తీసుకువస్తున్నప్పటికీ.. సదరు రియల్టర్ డబ్బులు ఇస్తానని చెప్పినట్లు సమాచారం. డబ్బులు ఇవ్వడంలో ఆలస్యం కావడతో ఆరెపల్లికి చెందిన వ్యక్తి.. నిషేధిత సంస్థ సభ్యులతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. తనకు రియల్టర్ నుంచి డబ్బులు ఇప్పించే విధంగా డీల్ చేసుకున్నాడు. వారం రోజులుగా రెక్కీ రంగంలోకి దిగిన ఐదుగురు వ్యక్తులు రియల్టర్‌ను వెంబడించారు. గొర్రెకుంట సమీపంలో ఒక మారు కిడ్నాప్‌నకు యత్నించి విఫలమయ్యూరు. వరంగల్ నగరం నడిబొడ్డున ఉన్న రియల్టర్ ఇంటి వద్ద పలుమార్లు ఆటోలో వెంబడించారు. సుమారు నాలుగైదు రోజులపాటు రాత్రివేళలో అక్కడే మకాం వేసినట్లు తెలిసింది. రియల్టర్ ఇంట్లో శుభకార్యాలు జరగడం.. ఎక్కువ మంది బంధువులు ఉండడంతో అతడిని కిడ్నాప్ చేయడం ఆ ముఠాకు కుదురలేదు. చివరకు బుధవారం మధ్నాహ్నం వీలైతే కిడ్నాప్.. లేదా.. హతమార్చాలని ముఠా సభ్యులు పక్కాగా ప్లాన్‌వేశారు. ఈ క్రమంలో రెక్కీ చేస్తూ సంచరిస్తున్న వారిలో ఓ వ్యక్తి అదే రోజు కొద్ది గంటల ముందే పోలీసులకు పట్టుబడ్డాడు. పోలీసులు విచారించగా గుట్టు రట్టయింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీస్ సిబ్బంది ముఠా సభ్యులందరినీ పట్టుకుని కటకటాల్లోకి నెట్టారు. ఇదేవిధంగా మరో గ్యాంగ్ హన్మకొండ పోలీసులకు గురువారం చిక్కింది. వీరు కూడా నిషేధిత సంస్ధల సభ్యుల పేరిట ములుగురోడ్డులోని భూ వ్యవహారాల్లో తలదూర్చి.. పోలీసులకు చిక్కి కటకటాల పాలైనట్లు తెలిసింది. ఈ ముఠానుంచి పోలీసులు ఒక ఆయుధాన్ని కూడా స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. నిఘా వర్గాల సమాచారంతోనే.. పోలీసు నిఘావర్గాల సమాచారంతోనే నగరంలో కిడ్నాప్, హత్యకు పథకం రచించిన ఈ ముఠా కార్యకలాపాలు బట్టబయలయ్యాయి. నర్సంపేటకు చెందిన కొందరు, నిషేధిత పార్టీకి సంబంధించిన వ్యక్తులు నగరంలో సంచరిస్తున్నారనే నిఘా వర్గాల సమాచారం మేరకు వరంగల్ పోలీసులు వారిపై దృష్టి సారించారు. పక్కాగా అందిన సమాచారంతో వారు సంచరిస్తున్న ప్రాంతాలు, ఆయా భూములపై నిఘా పెట్టారు. దీంతో హన్మకొండలో ఒకటి, వరంగల్‌లో మరొక ముఠా పోలీసులకు చిక్కింది. -
డామిట్.. కిడ్నాప్ అడ్డం తిరిగింది
విజయవాడ సిటీ: ‘ఓ జాబ్ కన్సల్టెన్సీ నిర్వాహకుడికి ఒక మహిళతో పరిచయం ఏర్పడింది. పరిచయాన్ని కాస్తా స్నేహంగా మార్చుకున్నాడు. ఆమె ఆస్తి అమ్ముతుందని తెలుసుకొని డబ్బు గుంజేందుకు..ఆమె కొడుకును కిడ్నాపునకు తెరలేపాడు. తన వద్ద పని చేసే యువకుని ద్వారా ఇద్దరు యువకులను ఏర్పాటు చేసుకొని ఆమె కొడుకును కిడ్నాపు చేసి ఓ ఇంట్లో బంధించాడు. కిడ్నాపు చేసినట్టు ఫోన్ చేయడంతో పోలీసుల సాయంతో ఆమె తన కొడుకును రక్షించుకుంది. పెనమలూరు మండలంలో కలకలం రేపిన బాలుని కిడ్నాపు వివరాలను శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పోలీసు కమిషనర్ ఎ.బి.వెంకటేశ్వరరావు వివరించారు. మండలంలోని గంగూరు గ్రామానికి చెందిన భాష్యం రాధిక భర్తకు దూరంగా ఉంటూ ఎనిమిదేళ్ల తన కుమారుడు శ్రీ నిఖిల్‌ను ఇదే ప్రాంతంలోని పాఠశాలలో చదివిస్తోంది. ఈ నెల 22న పాఠశాలకు వెళ్లిన బాబు రాత్రి 7.30 గంటల వరకు కూడా రాకపోవడంతో పాఠశాల నిర్వహకులను ఆరా తీసింది. బాబు పాఠశాల నుంచి బయటకు వచ్చినట్టు తెలుసుకొని చుట్టుపక్కల విచారించగా ఫలితం లేదు. రాత్రి 9.30గంటల సమయంలో బాబు తమ వద్ద ఉన్నట్టు చెప్పిన ఆగంతకులు డబ్బు ఎంతనేది మళ్లీ చెపుతామంటూ ఫోన్ పెట్టేశారు. ఆందోళనకు లోనైన ఆమె పోలీసులను ఆశ్రయించింది. ఈస్ట్‌జోన్ ఎసీపీ కె.మహేశ్వరరాజు నేతృత్వంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి కృష్ణలంకలోని ఓ ఇంట్లో ఉంచిన బాబును క్షేమంగా విడిపించి తల్లికి అప్పగించారు. పరిచయస్తులే.. నిందితులు నలుగురూ రాధికకు పరిచయస్తులే. గుంటూ రు జిల్లా ఉండవల్లికి చెందిన జాబ్ కన్సల్టెన్సీ నిర్వాహకుడు రాయి రత్నసతీష్తో ఆమె సోదరి ఉద్యోగ విషయమై సంప్రదించగా పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా స్నేహంగా మారింది. ఇటీవల ఆమె ఆస్తి అమ్ముతుందని తెలిసి తన వద్ద పని చేసే అబ్దుల్ రషీద్‌తో కలిసి డబ్బు గుంజాలని పథకం పన్నాడు. గతంలో ఆమె వద్ద కూడా పని చేసిన రషీద్ సరేననడంతో బాలుడి కిడ్నాపుకు నిర్ణయించుకున్నారు. ఇందుకు గంగూరుకు చెందిన బండారి నాగేంద్రబాబు, కృష్ణలంకకు చెందిన గాజా జగదీష్ సాయం తీసుకున్నారు. వీరు నలుగురూ ఆమెకు ఎప్పటి నుంచో పరిచయస్తులే. పట్టుబడిందిలా.. ఆగంతకుల ఫోన్ కోసం అర్థరాత్రి వరకు వేచి చూసిన పోలీసులు..ఆమెను విచారించి పరిచయస్తుల వివరాలు సేకరించి ఆరా తీశారు. ఈ క్రమంలో యనమలకుదురులో ఉన్న నాగేంద్ర, జగదీష్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా మిగిలిన ఇద్దరు కిడ్నాపర్లు పట్టుబడ్డారు. నేటి నుంచి శోధన ప్రారంభం రాజధాని నగర పోలీసింగ్‌ను దృష్టిలో ఉంచుకొని అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా పలు కార్యక్రమాలు చేపడుతున్నట్టు పోలీసు కమిషనర్ చెప్పారు. ఇందులో భాగంగా ఏర్పాటు చేసిన శోధన(ఇంటి వద్దకే ఎఫ్ఐఆర్) పని శనివారం నుంచి ప్రారంభమవుతుందన్నారు. 24గంటల పాటు అందుబాటులో ఉండేలా మూడు డివిజన్లకు మూడు శోధన వాహనాలు కేటాయించామన్నారు. ఇందుకు అవసరమైన సిబ్బందికి తగిన శిక్షణ ఇచ్చి నియమించామన్నారు. కేసు తీవ్రతను బట్టి ఈ వాహనాలు పంపుతామని తెలిపారు. దోపిడీలు, మహిళలు, వృద్ధులు, పిల్లల సంబంధిత నేరాలతో పాటు రోడ్డు ప్రమాదాలు జరిగిన సమయాల్లో ఈ వాహనాలు ఉపయుక్తంగా ఉంటాయన్నారు. ప్రజల నుంచి వచ్చే స్పందన ఆధారంగా వాహనాల సంఖ్యను పెంచేందుకు చర్యలు తీసుకోనున్నట్టు తెలిపారు. రిసెప్షన్ కేంద్రాలకు స్పందన పోలీసు స్టేషన్లలో ఏర్పాటు చేసిన రిసెప్షన్ కేంద్రాలకు స్పందన బాగుందని సీపీ తెలిపారు. గతంలో కొన్ని కేసులు స్టేషన్ అధికారి దృష్టికే వచ్చేవి కావని, మంచి సిబ్బంది అధికారులు ఉంటే సాధారణ కేసుల పరిష్కారంపై దృష్టిసారించేవారన్నారు. ఈ విధానం వలన అలాంటివి చోటు చేసుకోవని, స్టేషన్ అధికారితో పాటు ఆపై అధికారులకు వెంటనే స్టేషన్‌కి వచ్చే ఫిర్యాదులు సంక్షిప్త సందేశం (యస్యంయస్) ద్వారా తెలుస్తాయని చెప్పారు. తద్వారా స్టేషన్ అధికారులకు సిబ్బందిపై పట్టు వస్తుందన్నారు. ఇక్కడ శిక్షణ పొందిన హోంగార్డులు పని చేస్తున్నారని, వీరంతా నగర పోలీసు కమిషనర్ పర్యవేక్షణలో పని చేస్తున్నందున ఎవరికీ భయపడాల్సిన పని లేదన్నారు. వచ్చిన పిర్యాదులు నమోదు కాకుంటే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా కమిషనర్ హెచ్చరించారు. పని విభజన వలన మంచి ఫలితాలు వస్తాయనేందుకు ఇదో నిదర్శనమని, సిసియస్(సెంట్రల్ క్రైం స్టేషన్) ఫలితాలను మరో రెండు నెలల్లో అద్భుతంగా ఉంటాయన్నారు. పోలీసు మిత్ర ఏర్పాటు తీరిక వేళల్లో పోలీసు విధుల్లో సాయం చేసేందుకు ముందుకు వచ్చే రిటైర్డు ఉద్యోగులు, ఇతర సామాజిక కార్యకర్తలతో పోలీసు మిత్ర ఏర్పాటు చేయనున్మాన్నారు. ఆసక్తి కలిగిన వారు తమను సంప్రదిస్తే రిసెప్షన్ కేంద్రాలు, ట్రాఫిక్ నియంత్రణ, రాత్రి గస్తీ, ఇతర కేసులు నమోదు చేయదగినవి కాని విధులు అప్పగిస్తామన్నారు. ముందుగా వారు తాము కేటాయించగలిగిన సమయాలను పేర్కొంటే పోలీసులకు విధుల కేటాయింపులో మార్పులు, చేర్పులు చేస్తామన్నారు. వీరి పనితీరును కొద్ది రోజులు పరిశీలించిన తర్వాత పూర్తి స్థాయి బాధ్యతలు అప్పగిస్తామన్నారు. పోలీసు విధుల్లో ప్రజలను భాగస్వాములను చేయడమే దీని ప్రధాన ఉద్దేశమన్నారు. రక్షణ చర్యలు తీసుకోకుంటే క్రిమినల్ కేసు రోజువారీ కూలీలతో పని చేయించుకునేవారు పని చేయించుకునే ప్రాంతాల్లో రక్షణ చర్యలు చేపట్టని యాజమాన్యాలపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని పోలీసు కమిషనర్ హెచ్చరించారు. ఇటీవల కొన్ని ప్రమాదాలపై దృష్టి పెట్టగా యాజమాన్యాల నిర్లక్ష్యమే వారి మృతికి కారణంగా వెల్లడైందన్నారు. ఇలాంటి మరణాలపై ఇప్పటి వరకు 304ఎ(ప్రమాదవశాత్తు మృతి) కింద కేసు పెడుతున్నామని, ఇకపై 304(కల్పబుల్ హోమీసైడ్) కింద హత్య కేసు నమోదు చేస్తామన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని యాజమాన్యాలు వ్యవహరించాలని పోలీసు కమిషనర్ హితవు పలికారు. పగటి దొంగల అరెస్టు పట్టపగలు తాళం వేసి ఉన్న ఇళ్లను గొల్లగొట్టే ముగ్గురు సభ్యుల ముఠాను సెంట్రల్ క్రైం స్టేషన్(సిసియస్) పోలీసులు అరెస్టు చేశారు. చోరీలకు సూత్రధారి బాలుడు కావడంతో బాలల పరిశీలనా ఆవాస గృహానికి తరలించారు. సీపీ తెలిపిన వివరాల ప్రకారం..పాయకాపురంలోని ప్రకాష్‌నగర్‌కి చెందిన బాలుడు వ్యసనాలకు లోనై అవసరమైన డబ్బు కోసం పగటి చోరీలను ఎంచుకున్నాడు. ఇందుకు పరిచయస్తులు డాకుపాటి వెంకటేష్(20), కుమ్మా దుర్గారావు(19)తో కలిసి ముఠా కట్టాడు. అజిత్‌సింగ్‌నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో మూడు చోరీలకు పాల్పడిన వీరిని నగర పోలీసు కమిషనర్ సూచనల మేరకు క్లూస్ టీమ్ ఇన్స్పెక్టర్ ఎ.ప్రసాదరావు సహకారంతో సిసియస్ ఎస్ఐ యం.వి.శ్యామలరావు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 6.53గ్రాముల బంగారం, 12.5 తులాల వెండి, కెమెరా, టీవీతో పాటు సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో పోయిన సొత్తుకంటే ఎక్కువ మొత్తం చోరీకి గురైనట్లు బాధితులు ఫిర్యాదులో పేర్కొన్నారని, ఇలా చేయడం మంచిది కాదని సీపీ హితవు పలికారు. పోలీసు వెబ్సైట్ ఆధునీకరణ ఆధునీకరించిన పోలీసు వెబ్సైట్ వారం రోజుల్లో అందుబాటులోకి వస్తుందని పోలీసు కమిషనర్ వెంకటేశ్వరరావు తెలిపారు. ఇందుకు నగరానికి చెందిన స్వయం ఐటీసొల్యూషన్స్ సహకారం తీసుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు. రాజధాని పరిసర గ్రామాలకు చెందిన అనేకమంది విదేశాల్లో ఉంటున్నారని చెప్పారు. వీరు ఇక్కడి తమ వారి క్షేమం, ఆస్తుల పరిరక్షణ వంటి అంశాల్లో ఆందోళనకు గురవుతుంటారని, ఇక్కడి విషయాలు ఎప్పటికప్పుడు వెబ్సైట్లో పెట్టడం వలన వారిలో ఆందోళన తొలగించవచ్చని కమిషనర్ తెలిపారు. సామాజిక కార్యక్రమాలపై ఆసక్తి కలిగిన ఎన్ఆర్ఐలను గుర్తించి ఇక్కడ మంచి ప్రాజెక్టుల్లో భాగస్వాములను చేసేందుకు వెబ్సైట్ ఉపయోగపడుతుందన్నారు. ఒలింపిక్ పతకం సాధించేందుకు ఓల్గా ఆర్చరీ నిర్వాహకులు రూ.కోటి అడిగారని, ఎన్ఆర్ఐలను సంప్రదించి సమకూర్చితే పతకం సాధించవచ్చన్నారు. విలేకరుల సమావేశంలో డీసీపీ (పరిపాలన) జి.వి.జి.అశోక్‌కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు. ముగ్గురు మృతికి కారకుడైన డ్రైవర్ లొంగుబాటు రోడ్డు ప్రమాదంలో ముగ్గురి మృతికి కారకుడైన డ్రైవర్ పోలీసులకు లొంగిపోయాడు. కేసు ఛేదనలో పోలీసులు చేసిన ప్రయత్నాలు విఫలమైన స్థితిలో..నిజాయితీగా లొంగిపోయి నేరం అంగీకరించిన డ్రైవర్‌ను శుక్రవారం విలేకరుల సమావేశంలో పోలీసు కమిషనర్ ఎ.బి.వెంకటేశ్వరరావు అభినందించారు. గత నెల 14వ తేదీన గుణదలకు చెందిన శీలం సువర్ణరాజు భార్య జ్యోతి, కుమార్తె భవ్యశ్రీ(14)తో కలిసి శుభలేఖలు పంచేందుకు మోటారు సైకిల్‌పై గుడివాడ వెళుతూ ఉదయం 5.30గంటల సమయంలో మానికొండ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. కేసు దర్యాప్తులో పోలీసులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఈ క్రమంలో గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన టాటా ఏసీ డ్రైవర్ చింతా శ్రీనివాసరావు ప్రమాదానికి తానే కారణమంటూ లొంగిపోయాడు. బస్సును క్రాస్ చేసే క్రమంలో వారు ముందుకు రాగా చేపల లోడ్‌తో ఉన్న ఆటో అదుపు తప్పి వారిని ఢీకొందని డ్రైవర్ చెప్పాడు. భయంతో పరారైన తాను ముగ్గురు మృతి చెందారని తెలుసుకొని కలత చెంది పోలీసులకు లొంగిపోయానన్నారు. నిజాయితీకి పేద, ధనిక వ్యత్యాసం లేదనడానికి శ్రీనివాసరావు లొంగుబాటే కారణమని పోలీసు కమిషనర్ వ్యాఖ్యానించారు. -
కరిష్మా జ్యువెలర్స్ యజమాని కిడ్నాప్
ప్రొద్దుటూరు క్రైం: పట్టణంలోని కరిష్మా జ్యువెలర్స్ యజమాని యాకూబ్ కిడ్నాప్‌కు గురుయ్యాడు. అతన్ని వీఎన్‌పల్లి మండలానికి చెందిన ఓ ఆయిల్ మిల్ యజమాని కిడ్నాప్ చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ నెల 12న హైదరాబాద్‌లోని కొండాపురం ప్రాంతంలో ఉన్న శ్రీరాంనగర్‌లో ఆయిల్‌మిల్ యజమానితోపాటు అతని అనుచరులు యాకూబ్‌ను కిడ్నాప్‌ను చేశారు. ఈ వార్త ఆలస్యంగా వెలుగులోకి రావడంతో పట్టణంలోని బంగారు వ్యాపారుల్లో చర్చనీయాంశమైంది. స్థానిక మెయిన్‌బజార్‌లో ఉన్న కరిష్మా జ్యువెలర్స్ యజమానులు యాకూబ్ సోదరులు నెల రోజుల క్రితం సుమారు రూ.7.30 కోట్లకు ఐపీ పెట్టిన విషయం తెలిసిందే. పట్టణంతో పాటు చుట్టు పక్కల సుమారు 35 మంది దగ్గర డబ్బులు తీసుకొని వీరు బాకీ అయ్యూరు. కోర్టులో ఐపీ పిటిషన్ దాఖలు చేసిన వీరు కొన్ని రోజుల నుంచి కనిపించడం లేదు. అయితే వీఎన్‌పల్లి మండలంలోని ఓ ఆయిల్ మిల్ యజమానికి యాకూబ్ సుమారు రూ. 50 లక్షలు దాకా బాకీ ఉన్నాడు. యాకూబ్ సోదరులు హైదరాబాద్‌లో ఉన్నారని తెలుసుకున్న ఆయిల్‌మిల్ యజమాని తన అనుమాయులతో కిడ్నాప్ చేయించడానికి గత వారం రోజుల నుంచి ప్రణాళిక రూపొందించినట్లు సమాచారం. ఈ క్రమంలో అతను గత ఆదివారం హైదరాబాద్‌లోని శ్రీరాంనగర్ ప్రాంతంలో తిరుగుతుండగా కిడ్నాప్ చేశారు. యాకూబ్‌ను కిడ్నాపర్లు బెంగుళూరుకు తరలించినట్లు విశ్వసనీయ సమాచారం. గతంలో కూడా ఆయిల్ మిల్ యజమాని యాకూబ్‌పై దాడికి యత్నించాడు. ప్రొద్దుటూరులో హైదరాబాద్ పోలీసుల దర్యాప్తు యాకూబ్ కిడ్నాప్ అయ్యాడని విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని శ్రీరాంనగర్ పోలీస్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆయిల్ మిల్ యజమానికి సంబంధించిన సెల్‌ఫోన్ మూడు రోజుల నుంచి స్విచ్చాఫ్ చేసి ఉంది. అంతేగాాక అతని బంధువులతో పాటు మిల్లో పని చేసే గుమాస్తాల ఫోన్లు కూడా పని చేయలేదు. మూడు రోజుల నుంచి మిల్లు కూడా మూసి ఉండటంతో అతనే కిడ్నాప్ చేసి ఉంటాడని కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. వారి ఫిర్యాదు మేరకు హైదరాబాద్ పోలీసులు రంగంలోకి దిగారు. సంబంధిత స్టేషన్ ఎస్ఐతో పాటు సిబ్బంది కిడ్నాప్ కేసును దర్యాప్తు చేయడానికి మంగళవారం ప్రొద్దుటూరుకు వచ్చారు. వీఎన్పల్లిలోని కిడ్నాపర్ బంధువుల ఇళ్లలో పోలీసులు సోదాలు నిర్వహించినట్లు తెలిసింది. అంతేగాక వీఎన్‌పల్లి ఎస్ఐని కూడా కలసి వివరాలు సేకరించారు. హైదరాబాద్ పోలీసులు స్థానిక డీఎస్పీతో పాటు వన్‌టౌన్ పోలీసులను కలిశారు. కిడ్నాప్‌కు సంబంధించిన పూర్తి వివరాలను వారు ప్రొద్దుటూరు పోలీసులకు వివరించినట్లు తెలిసింది. ఇప్పటికే ఆయిల్‌మిల్ యజమానికి సంబంధించిన పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. యాకూబ్‌ను కిడ్నాప్ చేసి మూడు రోజులైనా ఇంత వరకూ అతని జాడ తెలియక పోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. -
వారు దొరికారు
సునీల్.. ఈ పేరు చెబితే చాలు వణకు పుడుతుంది.. ఫోన్లో బెదిరించడం.. మాట వినకుంటే కిడ్నాప్ చేయడం.. అవసరమైతే డబ్బు కోసం చంపడం.. ఇదీ ఇంతకాలం సునీల్ గ్యాంగ్ చేసిన దందాలు. ఇలాంటి ఎన్నో దందాలు చేసిన సునీల్ ఇప్పుడు జైల్లో ఉచలు లెక్కబెడుతున్నాడు. అయితే సునీల్ చూపిన మార్గాన్ని మాత్రం చాలా మంది కొనసాగిస్తున్నారు. బ్రాండ్ నేమ్‌లా సునీల్ పేరు చెప్పుకుంటూ పలువురు ప్రొద్దుటూరులో బెదిరింపులకు పాల్పడుతున్నారు. - ప్రొద్దుటూరు క్రైం సునీల్ గ్యాంగ్ పేరుతో గతంలో ఓ డాక్టర్‌కు ఫోన్ చేసి డబ్బు కావాలని కొందరు బెదిరించిన విషయం తెలిసిందే. ఆ సంఘటన ఇంకా మరచిపోకనే తాజాగా ఓ వ్యాపారిని బెదిరించిన సంఘటనలో సుగమంచిపల్లెకు చెందిన యోహాన్, ప్రొద్దుటూరు కాల్వకట్ట వీధిలో నివాసముంటున్న రామకొండయ్యను ఆదివారం ప్రొద్దుటూరు వన్‌టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. వాటి వివరాలను స్థానిక డీఎస్పీ శ్రీనివాసులరెడ్డి విలేకరులకు తెలిపారు. జమ్మలమడుగు మండలం సుగుమంచుపల్లికి చెందిన యోహాన్ కూలి చేసుకుంటూ జీవనం సాగించేవాడు. పట్టణంలోని కాల్వకట్టవీధికి చెందిన రామకొండయ్య ఎలక్ట్రీషియన్‌గా పని చేసేవాడు. కొన్నేళ్ల కిందట జరిగిన ఫైనాన్షియర్ పోట్లదుర్తి రమణారెడ్డి హత్య కేసులో వీరిద్దరూ నిందితులు. అప్పట్లో డబ్బులు తీసుకొని రమణారెడ్డిని దారుణంగా హతమార్చారు. అప్పట్లో పోలీసులు అరెస్టు చేసి వీరిద్దరినీ జైలుకు పంపారు. అదే వారికి కలిసొచ్చింది. అప్పటికే జైల్లో ఉంటున్న సునీల్‌తో వీరిద్దరికీ పరిచయం ఏర్పడింది. తను చేసిన కిడ్నాప్‌ల గురించి సునీల్ వారికి వివరించాడు. ఎలా బెదిరించాలి, ఎలాంటి వాళ్లను ఎంచుకోవాలన్న దానిపై సునీల్ చెప్పిన మాటలు వారిలో ఆలోచనను రేకెత్తించాయి. బెయిల్‌పై వచ్చాక యోహాన్, రామకొండయ్య సునీల్ చూపిన బాటలోనే నడవడం మొదలుపెట్టారు. ఫ్రూఫ్ లేని సిమ్ కార్డుల కోసం అన్వేషణ సునీల్ చెప్పిన సూచనల మేరకు అడ్రస్ ఫ్రూఫ్‌లు లేని సిమ్‌కార్డుల కోసం అన్వేషణ సాగించారు. జమ్మమలడుగులో ఉంటున్న యోహాన్ బంధువు రాబర్ట్ సెల్పాయింట్ నిర్వహిస్తున్నాడు. రాబర్ట్ వద్దకు వెళ్లిన యోహాన్ ఫ్రూఫ్లెస్ సిమ్‌కార్డులు కావాలని అడిగాడు. ముందుగా లేవని చెప్పిన రాబర్ట్ తర్వాత అతనికి రెండు సిమ్ కార్డులు ఇచ్చాడు. అప్పటి నుంచి రంగంలోకి దిగిన యోహాన్, రామకొండయ్య ఆ సిమ్‌కార్డుతో పలువురికి ఫోన్ చేసి బెదిరించడం మొదలుపెట్టారు. ముందుగా ప్రొద్దుటూరుకు చెందిన మేడా చంద్రశేఖర్ అనే వ్యక్తికి ఫోన్ చేశారు. ‘నిన్ను ఒక గ్యాంగ్ కిడ్నాప్ చేయాలని చూస్తోంది. ఈ విషయం మాకు తెలిసి నీకు ఫోన్ చేస్తున్నాం. జాగ్రత్తగా ఉండు’ అని చెప్పారు. కొద్ది సేపటి తర్వాత మళ్లీ అతనికే ఫోన్ చేసి ‘నీకు విలువైన సమాచారం చెప్పి సాయం చేశాం కదా.. మాకు కొంత డబ్బు కావాలి’ అని అడిగారు. అందుకు చంద్రశేఖర్ వారికి రూ.8 వేలు ఇచ్చాడు. తర్వాత వైఎంఆర్ కాలనీలో నివాసముంటున్న హోల్‌సేల్ వ్యాపారి కొప్పర్తి ప్రతాప్‌కు ఈ నెల 19న వారే ఫోన్ చేసి ‘మేం సునీల్ గ్యాంగ్ సభ్యులం. మాకు రూ.5 లక్షలు కావాలి.. లేదంటే నిన్ను చంపేస్తాం.. ఇస్తావా లేదా’ అని బెదిరించారు. వారి ఫోన్ రాకతో భయపడ్డ ప్రతాప్ ‘నా వద్ద అంత డబ్బు లేదు’ అని చెప్పడంతో రూ. 50 వేలైనా ఇవ్వాలని నిందితులు డిమాండ్ చేశారు. చివరకు రూ. 40 వేలు ఇచ్చేందుకు ప్రతాప్ అంగీకరించారు. ఆ డబ్బును తన గుమాస్తా రామ్మోహన్‌రెడ్డి ద్వారా 19న సాయంత్రం పంపించాడు. అతని వద్ద డబ్బు తీసుకున్న యోహాన్, రామకొండయ్య ‘ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామని’ బెదిరించారు. వారికి డబ్బు ఇచ్చిన ప్రతాప్ భయంతో ఎవరికీ చెప్పలేదు. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సూచన మేరకు 20న వన్‌టౌన్ పోలీస్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న సీఐ మహేశ్వరరెడ్డి వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. -
కిడ్నాపర్ల చెర నుంచి విముక్తి
వారం రోజుల ఉత్కంఠకు తెర పోలీసుల అదుపులో ముగ్గురు నిందితులు పెందుర్తి : వారం రోజుల ఉత్కంఠకు తెరపడింది. దామోదర్(9) కిడ్నాప్ కథ సుఖాంతమైంది. కిడ్నాపర్ల చెర నుంచి పెందుర్తి మండలం చింతలగ్రహారానికి చెందిన కొరుబిల్లి దామోదర్ క్షేమంగా బయటపడ్డాడు. వారం రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన ఈ కేసును పోలీసులు సోమవారం చాకచక్యంగా ఛేదించారు. దీంతో బాలుని తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఆనందోత్సాహాల్లో మునిగిపోయారు. జరిగిందిదీ: చింతలగ్రహారం గవరపాలెం కాలనీకి చెందిన కొరుబిల్లి శ్రీనివాసరావు, లక్ష్మి దంపతులకు యామిని, దామోదర్ సంతానం. శ్రీనివాసరావు ఫైనాన్స్ వ్యాపా రం చేస్తున్నారు. గత సోమవారం రాత్రి శ్రీనివాసరావు కుమారుడు దామోదర్ స్థాని క వినాయక మండపం వద్దకు వచ్చిన సమయంలో కొందరు దుండగులు ఆ బాలుడ్ని కిడ్నాప్ చేశారు. బుధవారం ఉదయం శ్రీనివాసరావుకు కొత్తపాలెం సమీపంలోని కాయిన్‌బాక్స్ నుంచి ఫోన్ చేసి రూ.30 లక్ష లు డిమాండ్ చేశారు. దీనిపై గత బుధవా రం సాయంత్రం ఫిర్యాదు అందుకున్న పో లీసులు రంగంలోకి దిగారు. ఆరు రోజుల పాటు డీసీపీ రామ్‌గోపాల్‌నాయక్, నార్త్ ఏ సీపీ సీ.ఎం నాయుడు జిల్లావాప్తంగా బృం దాలు ఏర్పాటు చేసి గాలింపు చేపట్టారు. చాకచక్యంగా: ఈ కేసు ఛేదనలో పోలీసు లు ఎంతో చాకచక్యంగా వ్యవహరించారు. బాలు డ్ని అపహరించుకుపోయిన వారు తరుచూ కాయిన్బాక్స్ల నుంచి ఫోన్లు చేయడంతో నగరంలో ఉన్న కాయిన్బాక్స్ల వద్ద ప్రత్యేక గస్తీని ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే సోమవారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో గోపాలపట్నం జిల్లా ఉన్నత పరిషత్ పాఠశాల వద్దకు వచ్చిన ఓ కిడ్నాపర్ బాలుడి తండ్రికి ఫోన్ చేసి బెదిరించాడు. అదే సమయంలో అక్కడ ఉన్న కానిస్టేబుళ్లు అతడ్ని పట్టుకున్నారు. వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. నిందితుడ్ని విచారించగా పెందుర్తి వుడా కాలనీ సమీపంలో రెల్లి కాలనీ కొండపై ఓ తాటాకుల పాకలో దామోదర్‌ను ఉంచినట్టు తెలిపాడు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసు అధికారులు బాలుడ్ని గుర్తించి తమ ఆధీనంలోకి తీసుకున్నారు. మొత్తం ముగ్గురు నిందితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. నిందితుల్లో ఒకరు చింతలగ్రహారం వాసి కాగా, మిగిలిన వారు పెందుర్తి ప్రాంతానికి చెందిన వారుగా తెలిసింది. తండ్రి ఆర్థిక లావాదేవీలే దామోదర్ కిడ్నాప్‌కు కారణమని పోలీసులు భావిస్తున్నట్లు సమాచారం. ఆనందోత్సాహాలు: వారం రోజులుగా కిడ్నాపర్ల చెరలో ఉన్న దామోదర్ క్షేమంగా బయటపడడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల ఆనందానికి అవధుల్లేవు. దామోదర్ ఇంట పండగ వాతావరణం నెలకొంది. బాలుని తల్లి మాట్లాడుతూ కేసును ఛేదించిన పోలీసులకు, సహకరించిన మీడియాకు, ప్రార్థించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. సోమవారం రాత్రి 7 గంటలకు దామోదర్‌ను కేజీహెచ్‌కు తరలించారు. చికిత్స అనంతరం బాలుడి తండ్రి శ్రీనివాసరావుతో కలసి డీసీపీ చింతలగ్రహారం వెళ్లారు. అక్కడ దామోదర్‌ను వారికి అప్పగించారు. పోలీస్ స్టేషన్‌కు కూతవేటు దూరంలో.. పెందుర్తి పోలీస్‌స్టేషన్‌కు కూతవేటు దూరంలో ఉన్న రెల్లి కాలనీలోని ఓ పాకలో దామోదర్‌ను ఉంచడం చూసి పోలీసులే ఆశ్చర్యపోయారు. ఈ వారం రోజు ల పాటు కిడ్నాపర్లు పోలీస్‌స్టేషన్ సమీపం నుంచే తమ కార్యకలాపాలు నిర్వహించినట్టు గుర్తించారు. బాలుడికి ఆహారం కూడా పోలీస్‌స్టేషన్ సమీపంలోని దుకాణాల నుంచే తీసుకువెళ్లారని పోలీసులు భావిస్తున్నారు. కాయిన్‌బాక్స్ నుంచి ఫోన్ చేసేందుకు మాత్రం గోపాలపట్నం వెళ్లేవారు.