ఎస్‌బీఐ డిప్యూటీ మేనేజర్ హత్య | SBI deputy manager murder | Sakshi
Sakshi News home page

ఎస్‌బీఐ డిప్యూటీ మేనేజర్ హత్య

Published Mon, Nov 3 2014 5:34 AM | Last Updated on Mon, Jul 30 2018 8:29 PM

ఎస్‌బీఐ డిప్యూటీ మేనేజర్ హత్య - Sakshi

ఎస్‌బీఐ డిప్యూటీ మేనేజర్ హత్య

పహాడీషరీఫ్: దుండగులు ఓ బ్యాంక్ డిప్యూటీ మేనేజర్‌ను చాదర్‌ఘాట్‌లో కిడ్నాప్ చేసి.. దారుణంగా హత్య చేశారు.   అతడి నోటికి టేప్‌వేసి.. చేతులు కట్టేసి.. ఉరేసి చంపేశారు. పహాడీషరీఫ్ ఠాణా పరిధిలో ఆదివారం ఉదయం ఈ ఘటన వెలుగు చూసింది. శంషాబాద్ ఏసీపీ ఆర్.సుదర్శన్, పహాడీషరీఫ్ ఇన్‌స్పెక్టర్ పి.వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం.... చంపాపేట్‌లోని ఈస్ట్ మారుతీనగర్‌లో నివాసముండే బ్రిజ్‌మోహన్ (54) చాదర్‌ఘాట్ ఎస్‌బీఐ బ్రాంచిలో డిప్యూటీ మేనేజర్.

ఇతనిడి కుమారుడు రోజూ ఉదయం బ్యాంక్ వద్ద తన వాహనంపై దింపుతాడు. విధులు ముగిశాక బ్రిజ్‌మోహన్ సాయంత్రం ఆటోలో ఇంటికి చేరుకుంటాడు. ఇదిలా ఉండగా శనివారం విధులకు వెళ్లిన ఆయన ఇంటికి తిరిగి వెళ్లకపోవడంతో ఆందోళనకు గురైన కుటుంబసభ్యులు చాదర్‌ఘాట్ ఠాణాలో ఫిర్యాదు చేయగా.. మిస్సింగ్ కేసు నమోదు చేశారు. ఇదిలా ఉండగా... పహాడీషరీఫ్ గ్రామ శివారులో ఉన్న ఉమర్ కాలనీ సమీపంలోని నిర్మానుష్య ప్రాంతంలో మౌలానా మహ్మద్ రాషేద్ హుస్సేనీ ఖురేషీ దర్గా ఉంది.

నిర్మానుష్యంగా ఉండే ఈ ప్రాంతంలో స్థానిక చిన్నారులు ఆదివారం ఉదయం 7.30కి క్రికెట్ ఆడుతున్నారు. దర్గా వైపు బంతి వెళ్లడంతో పట్టుకునేందుకు పరుగులు పెట్టిన చిన్నారులు అక్కడ పడి ఉన్న మృతదేహాన్ని చూసి భయంతో బస్తీలోకి పరుగులు తీసి పెద్దలకు విషయం తెలి పారు.  వారు వెంటనే పహాడీషరీఫ్ పోలీసులకు సమాచారం ఇవ్వగా.. శంషాబాద్ ఏసీపీ ఆర్.సుదర్శన్, పహాడీషరీఫ్ ఇన్‌స్పెక్టర్ పి.వెంకటేశ్వర్లు తమ సిబ్బందితో కలిసి ఘటనా స్థలికి చేరుకున్నారు. హత్య జరిగిన తీరును చూసి పోలీసులు సైతం నివ్వెరపోయారు.

దాదాపు 40 ఏళ్ల వ్యక్తి నోరు, చేతులను దుండగులు మెడికల్ టేప్(ఆసుపత్రులలో గాయాలకు వినియోగించే క్లాత్)తో కట్టేసి, మెడకు తాడుతో ఉరేసి అనంతరం అక్కడే ఉన్న మూడు బండరాళ్లతో ముఖంపై బాది హత్య చేసినట్టు గుర్తించారు. వెంటనే డాగ్‌స్క్వాడ్‌ను రప్పించి పరిశీలించగా.. జాగిలం ఘటనాస్థలం నుంచి  కొద్ది దూరం వెళ్లి.. అక్కడే వంద మీటర్ల దూరంలో కలియ తిరిగి మృతదేహం వద్దకు తిరిగి వచ్చింది.  స్థానికులెవ్వరూ మృతుడిని గుర్తించకపోవడంతో గుర్తు తెలియని వ్యక్తి హత్యగా పోలీసులు భావిస్తున్నారు. కాగా, మృతుడి జేబులో మలక్‌పేటలోని ఎస్‌బీఐ ఏటీఎంలో జరిపిన ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన రసీదులు దొరికాయి.  

గతనెల 30న ఇదే ఏటీఎంలో రూ. 100లు డ్రా చేసిన రసీ దు, 31వ తేదీ సాయంత్రంతీసుకున్న మినీస్టేట్‌మెట్ లభించాయి.    మృతుడు వేసుకున్న చొక్కాపై వీఎన్‌ఆర్ టైలర్, చంపాపేట్ అనే లేబుల్ ఉంది. దర్యాప్తు చేపట్టిన పో లీసులు హతుడు చాదర్‌ఘాట్ ఎస్‌బీఐ డిప్యూటీ మేనేజర్‌గా గుర్తించారు.  డబ్బుల కోసం కిడ్నాప్ చేసి హత్య చేసి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement