బాలుడి కిడ్నాప్ కేసులో ముగ్గురు నిందితుల అరెస్ట్ | The arrest of the three accused in the case of the kidnapped boy | Sakshi
Sakshi News home page

బాలుడి కిడ్నాప్ కేసులో ముగ్గురు నిందితుల అరెస్ట్

Published Wed, May 4 2016 5:09 PM | Last Updated on Fri, Aug 24 2018 2:36 PM

The arrest of the three accused in the case of the kidnapped boy

గుంటూరు జిల్లా కేంద్రం ఏటి అగ్రహారంలో గత నెల 14న బాలుడిని కిడ్నాప్ చేసి హత్య చేసిన కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి వివరాలు వెల్లడించారు. గత నెల 14న ఏటి అగ్రహారానికి చెందిన నన్నం యాదిత్యరాజు(12) అనే బాలుడిని మణికంఠ అనే ట్యూషన్ మాస్టారు ఇద్దరు స్నేహితుల సహాయంతో కిడ్నాప్ చేశారు.

 

కిడ్నాప్ అనంతరం బాలుడి తల్లి జయకుమారికి ఫోన్ చేసి రూ.15 లక్షల ఇవ్వాలని డిమాండ్ చేశారు. తాము అంత ఇచ్చుకోలేమని రూ.2 లక్షలు ఇస్తామని జయకుమారి కిడ్నాపర్లకు తెలిపింది. ఈ విషయం జయకుమారి పోలీసులకు తెలియజేసింది.



 కిడ్నాప్ చేసిన వారు బాలుడికి నిద్రమాత్రలు వేశారు. నిద్ర నుంచి లేచిన బాలుడు కిడ్నాపర్లను గుర్తుపట్టడంతో ఎక్కడ దొరికిపోతామేమోనని భయంతో బాలుడిని చంపి ఓ బావిలో పడేశారు. బాలుడి తల్లికి ఫోన్ చేసి.. మాచర్ల ట్రైన్ ఎక్కి తుమ్మల చెరువు వద్ద ట్రైన్‌లో నుంచి రూ.2 లక్షల నగదును పడవేయమని చెప్పారు. బాలుడిని కిడ్నాప్ చేసిన వెంటనే కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పట్టుబడిన నిందితులు రామిశెట్టి గోపి, వేల్పుల పిచ్చయ్య, మణికంఠలను మీడియా ఎదుట హాజరుపరిచి అనంతరం రిమాండుకు తరలించారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement