Manikantha
-
విద్యుత్ షాక్‌కు నలుగురు యువకులు బలి
ఉండ్రాజవరం: తూర్పు గోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం తాడిపర్రు గ్రామంలో విద్యుత్ షాక్‌కు గురై నలుగురు యువకులు మృతిచెందారు. మరో ముగ్గురు గాయపడ్డారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... తాడిపర్రు గ్రామంలో సర్దార్ పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణపై స్థానికంగా రెండు సామాజికవర్గాల మధ్య 18 నెలలుగా వివాదం నెలకొంది. కలెక్టర్, ఆర్డీవో వంటి ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని ఇటీవల వివాదాన్ని పరిష్కరించారు. ఈ నేపథ్యంలో సోమవారం గౌడ సామాజికవర్గం వారు పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణకు, అన్నసమారాధనకు ఏర్పాట్లు చేసుకున్నారు. ఇందులో భాగంగా సోమవారం తెల్లవారుజామున కొందరు యువకులు 25 అడుగుల భారీ ఫ్లెక్సీ కడుతుండగా వారికి 11కేవీ విద్యుత్ వైరు తగిలింది. తీవ్ర విద్యుదాఘాతానికి గురై బొల్లా వీర్రాజు (25), కాసగాని కృష్ణ (23), పామర్తి నాగేంద్ర (25), మారిశెట్టి మణికంఠ (29) అక్కడికక్కడే మృతిచెందారు. కోమటి అనంతరావు అనే యువకుడికి తీవ్ర గాయాలు కాగా, మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. మృతిచెందినవారిలో కాసగాని కృష్ణకు పెళ్లి కాగా, మిగిలిన ముగ్గురు అవివాహితులు. తీవ్రంగా గాయపడిన కోమటి అనంతరావును తొలుత పశి్చమ గోదావరి జిల్లా తణుకు ప్రభుత్వాస్పత్రికి, అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ యువకులు అందరూ కొబ్బరి ఒలుపు కారి్మకులుగా, వ్యవసాయ కూలీలుగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ ఘటనతో తాడిపర్రు గ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. -
పందెం కోళ్లను ఈతకు తీసుకెళ్లి..తండ్రీ, ఇద్దరు కొడుకులు మృతి
పెదవేగి : పందెం కోళ్ల పెంపకం సరదా ఒక కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. వాటికి ఈతలో శిక్షణను ఇద్దామనుకున్న ఆ తండ్రీ కొడుకులు ప్రమాదవశాత్తూ కాల్వలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. ఏలూరు జిల్లా పెదవేగి మండలం కవ్వగుంటలో చోటుచేసుకున్న ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. పోలీసుల కథనం ప్రకారం.. కవ్వగుంట గ్రామానికి చెందిన శెట్టిపల్లి వెంకటేశ్వరరావు (45) రైతు. సంక్రాంతికి ఏలూరు జిల్లా కోడిపందేలకు ప్రసిద్ధి. దీంతో వెంకటేశ్వరరావు తన పందెం కోళ్లను తన వ్యవసాయ క్షేత్రంలో పెంచుతున్నాడు. వాటికి శిక్షణలో భాగంగా ఈతకూ తీసుకెళ్తుంటారు. దీంతో తమకు సమీపంలో ఉన్న పోలవరం కుడికాలువలో ఈత శిక్షణ ఇచ్చేందుకు వాటిని తీసుకువెళ్లాడు. వెంకటేశ్వరరావుతోపాటుగా అతని ఇద్దరు కుమారులు శెట్టిపల్లి మణికంఠ (16), శెట్టిపల్లి సాయి (14)లు సైతం తోడుగా వెళ్లారు. కాలువలో లోతును గ్రహించని ముగ్గురూ కాలువలో ఉన్నపళంగా మునిగిపోయారు. ఈత రాకపోవడంతో వారు ముగ్గురూ ప్రాణాలు కోల్పోయారు. ఇది గమనించిన స్థానికులు హుటాహుటిన అక్కడికి చేరుకునేలోపే వారు మృతిచెందారు. సీఐ వెంకటేశ్వరరావు, ఎస్సై రాజేంద్రప్రసాద్ ఘటన స్థలానికి చేరుకుని రెస్క్యూ బృందం, స్థానికుల సాయం మృతదేహాలను వెలికితీశారు. పోస్టుమార్టం నిమిత్తం ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పండగ సమయంలో ఒకే కుటుంబంలో తండ్రీ కొడుకులు చనిపోవడంతో గ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. భర్త, ఇద్దరు కుమారులు విగత జీవులుగా కళ్లముందు కనిపించడంతో భార్య దేవి, ఇతర కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. -
వైఎస్సార్సీపీ కార్యకర్త హత్య
రేపల్లె రూరల్/నగరం: బాపట్ల జిల్లా రేపల్లె నియోజకవర్గంలో టీడీపీ గూండాలు రెచ్చిపోయారు. రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఇలాకా అయిన రేపల్లె నియోజకవర్గం.. నగరం మండలం దాసరిపాలెం గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్త నున్నా భూషయ్య (47)పై అదే గ్రామానికి చెందిన కొందరు టీడీపీ నేతలు శనివారం రాత్రి దాడికి తెగబడ్డారు. దీంతో తీవ్రగాయాలపాలైన భూషయ్య మృతిచెందాడు. దాసరిపాలేనికి చెందిన భూషయ్యను అదే గ్రామానికి చెందిన వెంకటేశ్వరరావు డ్రింక్ తాగుదామంటూ నిజాంపట్నం ఆముదాలపల్లి పంట పొలాల సమీపంలోని బావి వద్దకు తీసుకెళ్లాడు. వీరి కదలికలు గమనించిన దాసరిపాలెం గ్రామానికి చెందిన టీడీపీ నేతలు, మంత్రి అనగాని ప్రధాన అనుచరులు నున్నా బాలశంకర్, నున్నా మణికంఠలతో పాటు మరికొందరు సరివిబాదులతో భూషయ్యపై ఒక్కసారిగా దాడిచేశారు. తలపై విచక్షణారహితంగా చితకబాదడంతో భూషయ్య తీవ్రగాయాల పాలై అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. దీంతో వెంకటేశ్వరరావు వెంటనే భూషయ్య కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చాడు. వారు ఘటనా స్థలానికి చేరుకుని రక్తపు మడుగులో ఉన్న భూషయ్యను రేపల్లె ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం గుంటూరు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడు. భూషయ్యకు భార్య వెంకట లక్ష్మి, కుమారుడు, కుమార్తె ఉన్నారు. దాసరిపాలేనికి చెందిన నున్నా భూషయ్య గ్రామంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున అన్ని కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొంటాడు. భూషయ్యను హతమార్చితే గ్రామంలో టీడీపీకి తిరుగులేదని భావించిన గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు పథకం ప్రకారం హత్యకు పన్నాగం పన్నినట్లు గ్రామస్తులు చెబుతున్నారు.కాగా, భూషయ్య హత్యను వ్యక్తిగత కక్షలుగా చిత్రీకరించి కేసు నీరుగార్చేందుకు పోలీసులు పడరానిపాట్లు పడుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మంత్రి అనగాని సత్యప్రసాద్ ఒత్తిడితో కేసు నీరుగార్చేందుకు పోలీసులు విశ్వప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. -
హనీట్రాప్ చేసి.. కత్తులతో పొడిచి
బంజారాహిల్స్ (హైదరాబాద్): పాత కక్షల నేపథ్యంలో ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారిని 10 మంది కలిసి దారుణంగా హత్య చేశారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం సింగోటం గ్రామానికి చెందిన పుట్టా రాము (36) గతంలో ఆటోడ్రైవర్‌గా పనిచేశాడు. ఇటీవల రియల్ ఎస్టేట్ రంగంలోకి దిగాడు. కొద్ది రోజులు కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన రాము ఇటీవల బీజేపీలో చేరి వివిధ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నాడు. హైదరాబాద్ చుట్టుపక్కల రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న సమయంలో రాముకు జీడిమెట్లకు చెందిన మణికంఠ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ కలిసి రియల్ఎస్టేట్ లావాదేవీలు చేసేవారు. అయితే వారి మధ్యలో వ్యాపారం విషయంలో గొడవలు జరిగి ఒకరిపై ఒకరు పోలీసు కేసులు కూడా పెట్టుకున్నారు. పరిస్థితులు ముదిరిపోవడంతో రాము హత్యకు మణికంఠ పథకం వేశాడు. గత రెండు రోజుల నుంచి రెక్కీ నిర్వహిస్తున్నాడు. ఈ నెల 5వ తేదీన రాము యూసుఫ్‌గూడలోని ఎల్‌ఎన్‌నగర్‌లో ఉంటున్న విషయం తెలుసుకున్న మణికంఠ బుధవారం రాత్రి 10 గంటల సమయంలో ఓ యువతితో ఫోన్ చేయించి హానీట్రాప్ చేయించాడు. ఆ యువతి ఫోన్‌కాల్ నమ్మిన రాము రాత్రి 10 గంటల సమయంలో ఎల్ఎన్నగర్లోని తన ఇంటికి వచ్చాడు. సరిగ్గా 11.15 గంటలకు మణికంఠతో పాటు బోరబండకు చెందిన జిలానీ అనే రౌడీïÙటర్, మరో ఎనిమిది మంది కలిసి ఇంట్లోకి చొరబడి రామును కత్తులతో 50 పోట్లు పొడిచారు. అరగంట పెనుగులాడిన అనంతరం రాము కన్నుమూశాడు. రామును మర్డర్ చేసిన తరువాత ఆ దృశ్యాలను మణికంఠ ఓ స్నేహితుడికి వీడియో కాల్ చేసి చూపించాడు. రామును హనీట్రాప్ చేసిన యువతిని జూబ్లీహి ల్స్ పోలీసులు విచారిస్తున్నారు. మణికంఠతో పాటు పారిపోయిన మిగతా నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మర్డర్ జరిగిన సమయంలో అక్కడ ఇద్దరు యువతులు కూడా ఉన్నట్లుగా పోలీసులు అను మానిస్తున్నారు. మృతుని భార్య, ఇద్దరు పిల్లలు స్వగ్రా మంలో ఉంటుండగా, విషయం తెలియగానే ఆమె గురువారం జూబ్లీహిల్స్పోలీస్స్టేషన్కు చేరుకుంది. ఆమె ఇచ్చి న ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. -
నవ్వులే నవ్వులు
అభినవ్ మణికంఠ, గోల్డీ నిస్సీ, మ్యాడీ వీజే, పవన్ రమేష్, భరత్ రెడ్డి కీలక పాత్రల్లో అశోక్ కుమార్ దర్శకత్వం వహించిన చిత్రం ‘మహానటులు’. ఏబీఆర్ ప్రొడక్షన్స్ అండ్ ఏబీఆర్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్‌పై అనిల్ బోధిరెడ్డి, తిరుపతి ఆర్. యర్రంరెడ్డి నిర్మించారు. ఈ చిత్రాన్ని ఈ నెల 25న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అశోక్ కుమార్ మాట్లాడుతూ– ‘‘నేను ఇప్పటి వరకూ కామెడీ జానర్ టచ్ చేయలేదు. ‘జాతిరత్నాలు’ సినిమా తరహాలో పూర్తి ఫన్, హిలేరియస్ ఎంటర్టైన్మెంట్తో తీసిన మూవీ ‘మహానటులు’. నలుగురు టీమ్‌గా మారి మహానటులు అనే యూట్యూబ్ చానల్‌ను ఎలా అభివృద్ధి చేశారు? అనేది ఈ చిత్ర కథ’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: సిద్ధం నరేష్, సంగీతం: మార్కస్ ఎం. -
ఎంత కష్టం వచ్చిందమ్మా!
పెనుబల్లి/గచ్చిబౌలి/మల్లాపూర్/ఎడపల్లి (బోధన్)/ఖలీల్‌వాడి (నిజామాబాద్ అర్బన్): భర్తల వేధింపులు.. ఆర్థిక ఇబ్బందులు.. కారణం ఏదైతేనేం.. క్షణికావేశంలో రాష్ట్రవ్యాప్తంగా నలుగురు మహిళలు ఆత్మహత్యకు యత్నించారు. వారిలో ఇద్దరు తల్లులు, ఓ కుమార్తె కన్నుమూయగా పిల్లలతో కలసి చెరువులో దూకిన మరో ఇద్దరు తల్లులను స్థానికులు కాపాడటంతో ప్రాణాలతో బయటపడ్డారు. అయితే ఈ ఘటనలో ఓ బాలుడి ఆచూకీ గల్లంతైంది. మరో ఘటనలో అనారోగ్యం కారణంగా కుమార్తెతో కలసి భార్య, భర్త ఆత్మహత్య చేసుకున్నారు. ఆర్థిక సమస్యలు, కుటుంబ కలహాలతో... ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలతో తల్లీకూతురు ఇంట్లోనే ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్‌లోని రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. మణికొండలోని ఆంధ్రా బ్యాంకు సమీపంలో నివసించే బుడ్డోలు సదానందానికి భువనగిరి జిల్లా కాటేపల్లికి చెందిన అలివేలుతో 15 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వారికి కూతురు లాస్య (14), కుమారుడు మణికంఠ (11) ఉన్నారు. సదానందం ఖాళీగా ఉంటుండగా కోవిడ్ లాక్‌డౌన్‌కు ముందు వచ్చే ఇంటి అద్దెలు కాస్తా బందువులతో ఏర్పడిన వివాదాలతో నిలిచిపోయాయి. దీంతో కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకుంది. డబ్బులేక పిల్లలను చదువు కూడా మాన్పి0చారు. ఈ పరిణామాలతో తీవ్ర మనస్తాపానికి గురైన అలివేలు ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. సమస్యల నుంచి బయటపడేయాల్సిందిగా దేవుడిని ప్రార్థించి రావాలంటూ భర్తను యాదగిరిగుట్టకు పంపింది. అనంతరం అర్ధరాత్రి వేళ ఓ బెడ్రూంలో తొలుత కుమార్తెకు ఉరేసి, ఆమె చనిపోయిందని నిర్ధారించుకున్నాక వంటింట్లో చీరతో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. తెల్లవారుజామున లేచిన కుమారుడు తల్లి, అక్కను విగతజీవులుగా చూసి వెంటనే చుట్టుపక్కల వారికి విషయం తెలిపాడు. చేతిపై గోరింటాకు..! ఆత్మహత్మకు ముందు అలివేలు, లాస్య గోరింటాకు పెట్టుకున్నారు. లాస్య చేతిపై గోరింటాకు కోన్‌తో ‘డూ సమ్‌థింగ్ దట్ మేక్ యూ హ్యాపీ’అని రాసుకుంది. అదేవిదంగా తల్లీ, కూతురు ఇద్దరూ ‘ది గేమ్ ఈజ్ స్టార్టెడ్’అని గోరింటాకుతో రాసిన వ్యాఖ్యలు ఉండటంతో పోలీసులు ఇవి ఎందుకు రాసుకున్నారో...? అనే అంశంపై కూడా విచారణ చేస్తున్నారు. కాగా, అలివేలు, లాస్య ఆత్మహత్య చేసుకున్న ఇంట్లో మరో ఉరితాడు వేలాడుతూ కనిపించడం కలకలం రేపుతోంది. కుమారుడికి కూడా ఉరివేయాలని తల్లి భావించి ఉంటుందని పోలీసులు బావిస్తున్నారు.కానీ కుమారుడు బెడ్రూమ్లో నిద్ర పోతుండడంతో ఈ ప్రయత్నాన్ని విరమించుకొని ఉంటుందని వారు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు అలివేలు ఆత్మహత్యకు ముందు తన సెల్‌ఫోన్, బట్టలను ఇంట్లోనే తగలబెట్టింది. తల్లీకుమార్తెల మానసిక స్థితి సరిగ్గా లేదని.. కరోనా కాలం నుంచి అందరికీ దూరంగా ఉంటున్నారని రాయదుర్గం ఇన్స్పెక్టర్ మహేష్ తెలిపారు. లైవ్‌లో ఆత్మహత్య... భర్త వేధింపులు తట్టుకోలేక.. ఫేస్బుక్ లైవ్ వీడియో పెట్టి భార్య ఆత్మహత్య చేసుకున్న ఘటన నాచారం పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నాచారానికి చెందిన సనా (29) రాజస్తాన్‌కు చెందిన హేమంత్ పటియాల (డిజె మ్యూజిక్ అపరేటర్) 5 ఏళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. పెళ్లయిన రెండేళ్ల వరకు వారి వైవాహిక జీవితం బాగానే కొనసాగింది. బాబు పుట్టాక వారి మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. సనాను భర్త హేమంత్‌తోపాటు వారి అత్తమామలు వేధించసాగారు. దీంతో గతంలో పలుమార్లు పోలీసులకు హేమంత్పై సనా ఫిర్యాదు చేశారు. సైప్రస్ దేశానికి వెళ్లిన హేమంత్ గత 5 నెలలుగా సనాను ఫోన్లో వేధిస్తూనే ఉన్నాడు. దీంతో మంగళవారం నాచారంలోని ఇంట్లో సనా ఫేస్బుక్ లైవ్ పెట్టి ఫ్యాన్‌కు ఊరివేసుకొని ఆత్మహత్మ చేసుకుంది. సనాకు 3 ఏళ్ల బాబు ఉన్నాడు. పిల్లలతో సహా చెరువులో దూకిన అక్కాచెల్లెళ్లు ముగ్గురు పిల్లలతో సహా అక్కాచెల్లెళ్లు చెరువులో దూకి ఆత్మహత్యకు యత్నించగా అందులో బాలుడు గల్లంతయ్యాడు. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలోని అశోక్ సాగర్ (జానకంపేట చెరువు) వద్ద శుక్రవారం ఈ ఘటన చోటు చేసుకుంది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని దుబ్బ ప్రాంతానికి చెందిన లక్షి్మ, మోహన్ దంపతులకు ముగ్గురు కూతుళ్లు. మోహన్‌కు కొత్త కలెక్టరేట్ సమీపంలో 2 వేల గజాల స్థలం ఉంది. ఆ స్థలంలో కొంత భాగాన్ని పెద్ద కూతురుకు అమ్మి రెండో కూతురు అక్షయ, మూడో కూతురు నిఖితలకు వివాహం చేశాడు. అక్షయ వివాహం హైదరాబాద్‌కు చెందిన హేమంత్‌తో, నిఖిత వివాహం మెదక్‌కు చెందిన మహేశ్‌తో జరిగింది. వివాహ సమయంలో చెరో 200 గజాల స్థలాన్ని వారికి కానుకగా ఇచ్చారు. కొంతకాలంగా హేమంత్, మహే‹Ùలు ఇంటి స్థలం అమ్మి డబ్బులు తీసుకురావాలని భార్యలను వేధిస్తున్నారు. అయితే ఈ ప్లాట్లకు రోడ్డు సౌకర్యం లేకపోవడంతో దానిని కొనేందుకు ఎవరూ ముందుకు రావట్లేదని తెలిసింది. అక్షయ, నిఖితలపై వేధింపులు ఎక్కువ కావడంతో వారిద్దరూ మూడు రోజుల క్రితం పిల్లలతో కలసి పుట్టింటికి వచ్చారు. ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకొని గురువారం ఉదయం నిఖిత తన పిల్లలైన భవశ్రీ, శ్రీమాన్, అక్షయ తన కుమారుడైన చిన్నా (3) అలియాస్ భువనేశ్వర్‌ను తీసుకొని ఎడపల్లి మండలంలోని అశోక్‌సాగర్ వద్దకు చేరుకున్నారు. ముందుగా పిల్లలను నీటిలోకి తోసి తర్వాత నిఖిత, అక్షయ కూడా దూకారు. ఆ సమయంలో రోడ్డుపై అటుగా వెళ్తున్న షేక్ హైదర్ అనే వ్యక్తి చెరువులోకి దూకి నిఖిత, అక్షయలతోపాటు భవశ్రీ, శ్రీమాన్లను రక్షించాడు. మూడేళ్ల చిన్నా ఆచూకీ లభించలేదు. కేన్సర్ నుంచి భార్య కోలుకోదేమోనని.. భార్యకు కేన్సర్ ఉందని నిర్ధారణ కావడంతో భర్త తల్లడిల్లాడు. భార్యకు ఏమైనా అయితే తాను తట్టుకోలేనని.. తామిద్దరం లేకపోతే కూతురు భవిష్యత్తు ఏమిటనే భయంతో కుమార్తె సహా ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం కొత్తకారాయిగూడెంలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పోట్రు వెంకట కృష్ణారావు (40)కు భార్య సుహాసిని (35), కుమార్తె అమృత (16)తోపాటు కుమారుడు కార్తీక్ ఉన్నారు. కార్తీక్‌కు బీటెక్ సెకండియర్ పూర్తికాగానే బెంగళూరులోని హెచ్‌సీఎల్‌లో ట్రెయినీగా ఉద్యోగం రాగా అమృత ఇంటర్ పూర్తిచేసి ఇంజనీరింగ్ చదివేందుకు సిద్ధమవుతోంది. నెలన్నర క్రితం ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా తిరువూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో సుహాసినికి శస్త్రచికిత్స చేసిన వైద్యులు గర్భసంచిలోని కణతిని తొలగించారు. ఈ క్రమంలో శాంపిల్స్ హైదరాబాద్‌కు పంపగా అది కేన్సర్‌గా తేలింది. దీంతో ఆస్పత్రి వైద్యుల సూచన మేరకు హైదరాబాద్‌లో మెరుగైన చికిత్స కోసం వెళ్తామని కుమారుడు, బంధువులకు చెప్పారు. దీంతో కుమారుడు బెంగళూరు నుంచి గురువారం ఉదయం ఇంటికి రాగా, గుంటూరులో ఉంటున్న వెంకటకృష్ణారావు తమ్ముడు కూడా కొత్తకారాయిగూడెం వచ్చాడు. అనంతరం గురువారం సాయంత్రం వెంకటకృష్ణారావు, సుహాసిని దంపతులు కుమార్తె అమృతతో కలసి ద్విచక్రవాహనంపై ఆస్పత్రికి వెళ్తున్నట్లు చెబుతూ తిరువూరు బయలుదేరారు. కానీ మధ్యలోనే మూడు ప్లాస్టిక్ స్టూళ్లు, నైలాన్ తాడు, కూల్ డ్రింక్, వాటర్ బాటిల్ కొనుక్కొని స్వగ్రామంలో పొలం పక్కనే ఉన్న మామిడి తోటకు రాత్రి చేరుకున్నారు. ఆ సమయంలో వారిని గమనించిన గ్రామ స్తులు ఆరా తీయగా గేదెలను వెతకడానికి వెళ్తున్నట్లు చెప్పారు. అనంతరం బంధువులకు ఫోన్ చేసి మాట్లాడి ఆత్మహత్య చేసుకున్నారు. -
తల్లడిల్లిన తల్లి గుండెకు ఊరట.. సీఎం జగన్ సత్వర స్పందన
ఆరిలోవ (విశాఖ తూర్పు): పసి వయసులోనే ఓపెన్ హార్ట్ సర్జరీ జరగడంతోపాటు తండ్రిని కోల్పోయి హృద్రోగం బారినపడ్డ ఓ బాలుడి వ్యథ తెలిసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తక్షణమే స్పందించారు. సీఎం విశాఖ పర్యటన సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఆరిలోవలోని శ్రీకాంత్నగర్కు చెందిన వానపల్లి పార్వతి కుమారుడు వానపల్లి చరణ్‌సాయి మణికంఠ(12)కు మూడేళ్ల వయసులోనే ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగింది. అయితే ఇప్పుడు మరోసారి శస్త్ర చికిత్స అవసరమని, అందుకు రూ.8 లక్షలు వరకు ఖర్చు అవుతుందని వైద్యులు చెప్పడంతో ఆ తల్లి గుండె తల్లడిల్లింది. నిరుపేద కుటుంబానికి చెందిన ఆమె భర్త రెండేళ్ల క్రితం చనిపోయారు. అపోలో క్యాన్సర్ ఆస్పత్రి ప్రారంబోత్సవ కార్యక్రమం ముగిసిన అనంతరం ముఖ్యమంత్రి కాన్వాయ్ వెళ్తుండగా పెదగదిలి కూడలి వద్ద ‘నా కుమారుడిని రక్షించండి జగనన్నా..’ అంటూ కేకలు వేసింది. దీన్ని గుర్తించిన ముఖ్యమంత్రి జగన్ తన కారు ఆపి విషయం తెలుసుకుని చలించిపోయారు. తక్షణ సహాయం అందించాలని జిల్లా కలెక్టర్ మల్లికార్జునను ఆదేశించారు. జేసీ విశ్వనాథన్, రూరల్ తహశీల్దారు పి.రమణయ్య సాయంత్రం బాలుడి ఇంటికి వెళ్లి తక్షణం సాయంగా రూ.లక్ష చెక్కు అందజేశారు. ముఖ్యమంత్రి జగన్ ఆదేశాల మేరకు బాలుడికి వైద్య సాయం కూడా అందిస్తామని భరోసా ఇచ్చారు. ముఖ్యమంత్రి జగన్ దేవుడిలా తన కుమారుడిని కాపాడేందుకు వచ్చారని బాలుడి తల్లి కృతజ్ఞతలు తెలిపారు. మేయర్ గొలగాని హరివెంకటకుమారి, మంత్రి గుడివాడ అమర్నా«థ్‌కు రుణపడి ఉంటానని పేర్కొన్నారు. -
అజర్బైజాన్లో తప్పిపోయిన భారత యువకుడు
ఒంటరిగా సాహసయాత్రకు వెళ్లి కనిపించకుండా పోయిన భారతీయ యువకుడి కోసం అతడి కుటుంబం వేయి కళ్లతో ఎదురు చూస్తోంది. అతడు క్షేమంగా తిరిగి రావాలని కోరుకుంటోంది. మణికాంత్ కొండవీటి (28) అనే యువకుడు ఏప్రిల్ 26న ఇండియా నుంచి అజర్‌బైజాన్‌కు బయలుదేరాడు. మే 12 వరకు కుటుంబ సభ్యులతో టచ్‌లో ఉన్నాడు. తర్వాత నుంచి అతడు జాడ లేకుండా పోయాడు. అప్పటి నుంచి కుటుంబ సభ్యులు అతడి జాడ కనిపెట్టేందుకు అవిశ్రాంతంగా ప్రయత్నాలు చేస్తున్నారు. తాము చేస్తున్న ప్రయత్నాల గురించి మణికాంత్ సోదరుడు ధరన్.. ‘హ్యూమన్స్ ఆఫ్ బాంబే’ ఇన్స్టాగ్రామ్ పేజీలో పంచుకున్నారు. తమ సోదరుడి ఫొటోలను షేర్ చేశారు. ‘ఫోటోలో మీరు చూస్తున్న అబ్బాయి నా సోదరుడు మణికాంత్. గత రెండు వారాల నుంచి అతడు కనిపించడం లేదు. అతడు ఎక్కడ ఉన్నాడో తెలియకపోవడంతో మా కుటుంబ సభ్యులంతా నిద్రాహారాలకు దూరమయ్యారు. మణికాంత్ నాకు సోదరుడు మాత్రమే కాదు ఆత్మీయ మిత్రుడు. అతడికి సాహస యాత్రలంటే చాలా ఇష్టం. ఒంటరిగా అజర్‌బైజాన్‌కు వెళ్లాలని నాకు చెప్పినప్పుడు చాలా ఎగ్జైట్ అయ్యాను. ప్రయాణానికి ఒకరోజు ముందు ఢిల్లీలో ఉంటున్న నా దగ్గరకు వచ్చాడు. తర్వాత రోజు స్వయంగా నేను నా సోదరుడిని ఎయిర్‌పోర్ట్‌లో డ్రాప్ చేశాను. మళ్లీ వెళ్లినప్పుడు నేను కూడా వస్తానని చెప్పాను. ఏప్రిల్ 26న ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి అజర్‌బైజాన్‌కు బయలుదేరాడు. మే 12 వరకు మాతో టచ్‌లో ఉన్నాడు. అదే రోజు రాత్రి 7 గంటలకు చివరిసారిగా మాట్లాడా. నేను తర్వాత మెసేజ్ చేశాను కానీ అది డెలివరీ కాలేదు. దీంతో కాస్త భయపడ్డాను. బహుశా అక్కడ నెట్వర్క్ లేదేమో అనుకున్నాను. తర్వాత అతడిని కాంటాక్ట్ చేయడానికి చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. ఏం చేయాలో తెలియక అజర్‌బైజాన్‌లోని భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించాం. కొండ ప్రాంతంలో ఉండి ఉంటాడని, అందువల్ల సిగ్నల్ సమస్య ఉండొచ్చని దౌత్య అధికారులు తెలిపారు. మేము పలుమార్లు ప్రాధేయపడటంతో మణికాంత్ కోసం గాలిస్తున్నామని చెప్పారు. కానీ ఇప్పటివరకు అతడి ఆచూకీ లభించలేదు. మణికాంత్ జాడ కనిపెట్టడానికి ముఖ్యమంత్రి నుంచి ప్రధాని వరకు అందరినీ సంప్రదించాం. అతడి ఫొటోలను కూడా సర్క్యులేట్ చేశాం. అవిశ్రాంతంగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాం. అమ్మ తన ఫోన్ మోగినప్పుడల్లా మణికాంతే అనుకుంటుంది. నా సోదరుడి ఫోన్ కాల్ కోసం ప్రార్థిస్తున్నాను. మణికాంత్ క్షేమంగా తిరిగి వస్తాడని గట్టిగా నమ్ముతున్నామ’ని ధరన్ ఆశాభావం వ్యక్తం చేశారు. తన సోదరుడి ఆచూకీ కోసం చేస్తున్న ప్రయత్నాలకు అండగా నిలబడాలని అందరినీ అభ్యర్థించాడు. change.orgలో తాము చేపట్టిన సంతకాల సేకరణకు మద్దతు పలకాలని కోరారు. -
ఓ క్రిమినల్ కథ
మణికంఠ, సునీల్, పోసాని కృష్ణమురళి, అవి, భారత్, ఇంతియాజ్ ఉద్దీన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కనున్న చిత్రం ‘క్రియేటివ్ క్రిమినల్’. ప్రభాస్ నిమ్మల దర్శకత్వంలో నర్సింగ్ గౌడ్ నిర్మిస్తున్న ఈ చిత్రం హైదరాబాద్‌లో ప్రారంభం అయింది. ముహూర్తపు సన్నివేశానికి నర్సింగ్ గౌడ్ కెమెరా స్విచ్చా¯Œ చేయగా, సునీల్ క్లాప్ ఇచ్చారు. పోసాని కృష్ణమురళి తొలి సన్నివేశానికి దర్శకత్వం చేశారు. ప్రభాస్ నిమ్మల మాట్లాడుతూ– ‘‘సస్పె¯Œ ్స క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కనున్న చిత్రమిది. క్రిమినల్ నేపథ్యంలో ఉంటుంది’’ అన్నారు. ‘‘ఈ చిత్రాన్ని మొదట చిన్న బడ్జెట్ సినిమాగా చెయ్యాలి అనుకున్నా కథను బట్టి భారీగా నిర్మించబోతున్నాం’’ అన్నారు నర్సింగ్ గౌడ్. ‘‘ఒక మంచి పాత్రతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాను’’ అన్నారు సునీల్. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సలీమ్ మాలిక్, కెమెరా: గణేష్ రాజు. -
బెంగళూరులో రెచ్చిపోయిన మృగాడు
బనశంకరి: బెంగళూరులో మృగాళ్ల అకృత్యాలకు అడ్డుకట్టపడలేదు. కేజీ హళ్లి, కమ్మనహళ్లి ఘటనలు మరువకముందే మరో మృగాడు రెచ్చిపోయాడు. ఇద్దరు బాలికలతో పాటు ఓ మహిళను నిర్జీన ప్రదేశానికి తీసుకెళ్లి లైంగిక దాడికి యత్నించాడు. వయ్యాలి కావల్ పోలీస్‌స్టేషన్ సమీపంలోని స్విమ్మింగ్‌పూల్ లేఔట్లో మంగళవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఓ మహిళ ఇంటికి నడుచుకుని వెళ్తుండగా మునీశ్వరబ్లాక్కు చెందిన మణికంఠ అనే యువకుడు అడ్డుకుని లైంగికదౌర్జన్యానికి యత్నించాడు. అదే రోజు సాయంత్రం 4.30 గంటల సమయంలో సదరు యువకుడు వయ్యాలికావల్ 5 వమెయిన్రోడ్డులో పాఠశాల ముగించుకుని ఇంటికి వెళుతున్న ఇద్దరు బాలికలను బలవంతంగా నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి లైంగిక దాడికి యత్నించాడు. బాధితుల ఫిర్యాదు మేరకు వయ్యాలికావల్ పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. మణికంఠ పీయూసీ పూర్తిచేసి పొట్టకూటికోసం నిర్మాణ రంగ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. అతడు గంజాయికి బానిసైనట్లు పోలీసుల విచారణలో వెలుగుచూసింది. -
బాలుడి కిడ్నాప్ కేసులో ముగ్గురు నిందితుల అరెస్ట్
గుంటూరు జిల్లా కేంద్రం ఏటి అగ్రహారంలో గత నెల 14న బాలుడిని కిడ్నాప్ చేసి హత్య చేసిన కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి వివరాలు వెల్లడించారు. గత నెల 14న ఏటి అగ్రహారానికి చెందిన నన్నం యాదిత్యరాజు(12) అనే బాలుడిని మణికంఠ అనే ట్యూషన్ మాస్టారు ఇద్దరు స్నేహితుల సహాయంతో కిడ్నాప్ చేశారు. కిడ్నాప్ అనంతరం బాలుడి తల్లి జయకుమారికి ఫోన్ చేసి రూ.15 లక్షల ఇవ్వాలని డిమాండ్ చేశారు. తాము అంత ఇచ్చుకోలేమని రూ.2 లక్షలు ఇస్తామని జయకుమారి కిడ్నాపర్లకు తెలిపింది. ఈ విషయం జయకుమారి పోలీసులకు తెలియజేసింది. కిడ్నాప్ చేసిన వారు బాలుడికి నిద్రమాత్రలు వేశారు. నిద్ర నుంచి లేచిన బాలుడు కిడ్నాపర్లను గుర్తుపట్టడంతో ఎక్కడ దొరికిపోతామేమోనని భయంతో బాలుడిని చంపి ఓ బావిలో పడేశారు. బాలుడి తల్లికి ఫోన్ చేసి.. మాచర్ల ట్రైన్ ఎక్కి తుమ్మల చెరువు వద్ద ట్రైన్లో నుంచి రూ.2 లక్షల నగదును పడవేయమని చెప్పారు. బాలుడిని కిడ్నాప్ చేసిన వెంటనే కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పట్టుబడిన నిందితులు రామిశెట్టి గోపి, వేల్పుల పిచ్చయ్య, మణికంఠలను మీడియా ఎదుట హాజరుపరిచి అనంతరం రిమాండుకు తరలించారు. -
వడదెబ్బకు కుప్పకూలిన విద్యార్థి
పశ్చిమగోదావరి జిల్లా భీమడోలులో ఓ యువకుడు వడదెబ్బకు కుప్పకూలిపోయాడు. ద్వారకా తిరుమలకు చెందిన కనికిచర్ల మణికంఠ (20) స్థానికంగా కూల్‌డ్రింక్ షాపు నడుపుతున్న తల్లి లక్ష్మికి సాయంగా ఉంటూనే ప్రైవేటుగా డిగ్రీ చదువుతున్నాడు. ఈ నేపథ్యంలో పరీక్షలకు సంబంధించి హాల్‌టికెట్ తెచ్చుకుందామని సోమవారం భీమడోలులోని తన కళాశాలకు వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో భీమడోలు జంక్షన్లో బస్సు కోసం వేచి ఉండగా... ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. స్థానికులు గమనించి అతని వద్దనున్న సమాచారం ఆధారంగా తల్లికి ఫోన్ చేసి విషయం చెప్పారు. లక్ష్మి భర్త రెండేళ్ల క్రితం మరణించాడు. ఆమెకు ముగ్గురు పిల్లలు ఉండగా మణికంఠ పెద్దవాడు. -
గట్టు మైసమ్మ జాతరలో అపశ్రుతి
- కరెంట్ షాక్‌తో ఇద్దరి మృతి బొమ్మలరామారం(నల్గొండ జిల్లా) నల్గొండ జిల్లా బొమ్మలరామారం గ్రామంలో జరుగుతున్న గట్టుమైసమ్మ జాతరలో సోమవారం వేకువజామున అపశ్రుతి దొర్లింది. ఈదురుగాలులకు విద్యుత్ తీగ తెగిపడి ఇద్దరు భక్తులు మృత్యువాత పడ్డారు. బీబీనగర్ మండలం కొండమడుగు గ్రామానికి చెందిన ఏర్పుల స్వామి(65), నాగారం గ్రామంలోని సత్యనారాయణ కాలనీకి చెందిన ఉప్పునూతల మణికంఠ(21) జాతరకు వచ్చారు. గాలికి తెగి పడిన విద్యుత్ తీగలను గమనించక పోవడంతో... వాటిపై నడుచుకుంటూ వెళ్లారు. కరెంట్ షాక్ కొట్టి ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. విద్యుత్ అధికారులు విద్యుత్ సరఫరాను నిలిపేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
వేధింపులకు విద్యార్థిని బలి
-కళాశాల వద్ద విద్యార్థుల ఆందోళన రాజమండ్రి ఆకతాయి వేధింపులకు ఓ విద్యార్థిని బలైపోయింది. రాజమండ్రి వై జంక్షన్ ప్రాంతంలోని ఎస్‌కేవీటీ కళాశాల విద్యార్థిని గొర్ల అనూష జ్యోతి ఓ విద్యార్థి వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకుంది. దీంతో తోటి విద్యార్థులు కళాశాల ముందు బుధవారం ఆందోళనకు దిగారు. పోలీసులు, విద్యార్థులు అందించిన సమాచారం ప్రకారం... రంగంపేట మండలం రామవరంచండ్రేడు గ్రామానికి చెందిన అనూష జ్యోతి ఎస్‌కేవీటీ కళాశాలలో బీఎస్సీ ప్రథమ సంవత్సరం చదువుతోంది. ఇంటి నుంచి రోజూ కళాశాలకు వచ్చి వెళుతోంది. ఈ క్రమంలో గత రెండు నెలల నుంచి అదే కశాళాలకు చెందిన ఎంపీసీ మొదటి సంవత్సరం విద్యార్థి మణికంఠ ఆమెను వేధిస్తున్నాడు. మాటలతో, ఎస్ఎంఎస్లతో వేధింపులకు గురి చేస్తున్నాడు. కళాశాల మానేస్తే ఇంటికే వచ్చేస్తానని బెదిరించాడు. భయపడిన అనూష సోమవారం కళాశాలకు వెళ్లలేదు. దీంతో మణికంఠ రామవరం చండ్రేడు గ్రామానికి వెళ్లాడు. దీంతో భయపడిన అనూష వంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకోగా మంటలకు ప్రాణాలు కోల్పోయింది. కూలి పనులు ముగించుకుని రాత్రి 7 గంటలకు తల్లిదండ్రులు ఇంటికి తిరిగి రాగా అనూష ఇంట్లో ఓ మూలన బొగ్గుగా మారి కనిపించేసరికి నిశ్చేష్టులయ్యారు. దుఃఖాన్ని దిగమింగుకుని... తమ చిన్న కూతురు భావి జీవితానికి కష్టాలేమైన వస్తాయన్న భయంతో పోలీసులకు ఫిర్యాదు చేయకుండా అంత్యక్రియలు కానిచ్చేశారు. అయితే, ఈ విషయం తెలుసుకున్న కశాళాల విద్యార్థులు బుధవారం తమ కళాశాల ముందు ఆందోళనకు దిగారు. అనూష ఆత్మహత్యకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని, బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు అక్కడకు చేరుకుని కేసు నమోదు చేసే దిశగా విచారణ ప్రారంభించారు. -
ప్రమాదవశాత్తు ముగ్గురు చిన్నారుల మృతి
-
ప్రమాదవశాత్తు ముగ్గురు చిన్నారుల మృతి
శ్రీకాకుళం రూరల్ మండల్ కనుగులవానిపేట సమీపంలోని నారాయణపురం లింక్ కాలువలో పడి మంగళవారం సాయంత్రం ముగ్గురు చిన్నారులు మృతిచెందారు. కనుగులవానిపేటకు చెందిన అప్పారావు సోమవారం మృతిచెందాడు. మంగళవారం అతని అంత్యక్రియలు జరిగాయి.ఈ నేపథ్యంలో రెండు కుటుంబాలవారు మంగళవారం సాయంత్రం స్నానంచేసేందుకు లింక్ కాలువకు వెళ్లారు. వారిలో ఏడుగురు చిన్నారులు కూడా ఉన్నారు. అయితే ప్రమాదవశాత్తూ కాలువలో మునిగి ముగ్గురు చిన్నారులు మృతిచెందారు. మృతి చెందినవారిలో పార్వతీశం, పార్వతి దంపతుల కుమార్తె లావణ్య(9), కొడుకు మణికంఠ(7), త్రినాథరావు, లత దంపతుల కుమార్తె గీత(6) ఉన్నారు. మృతుల కుటుంబాలవారూ వ్యవసాయ కూలిపనులు చేసుకుని జీవించేవారు. పిల్లల మృతితో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. -
మా తమ్ముడు సజీవం
-
మణికంఠకు అంతిమ వీడ్కోలు
రామవరప్పాడు : ఐదుగురికి అవయవాలు దానం చేసి పునర్జన్మ ప్రసాదించిన మణికంఠ భౌతికకాయం శనివారం రామవరప్పాడులోని నెహ్రూనగర్‌కు చేరుకుంది. గుండె, ఊపిరితి త్తులు, కాలేయం, కిడ్నీలు, కళ్లును దానం చేయడానికి బ్రెయిన్‌డెడ్‌కు గురైన మణికంఠ కుటుంబీకులు ముందుకొచ్చిన విషయం విదితమే. మణికంఠ భౌతికకాయాన్ని స్నేహితులు, అభిమానులు, బంధువులు కడసారి వీడ్కోలు పలికేందుకు భారీ సంఖ్యలో మణికంఠ నివాసానికి చేరుకుని కన్నీటి వీడ్కోలు పలికారు. అంత్యక్రియలు నిమిత్తం అంబులెన్స్‌లో స్మశానానికి బయలుదేరిన భౌతికకాయానికి దారి పొడవునా పుష్పాలను చల్లారు. అంత్యక్రియలు ఘనంగా నిర్వహించారు. పలువురి ఆర్థిక సాయం ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న మణికంఠ కుటుంబానికి దాతలు సాయం చేయడానికి ముందు కొచ్చారు. విజయవాడ క్లబ్ సభ్యుడు చంద్రశేఖర్ రూ.50 వేలు, విజయవాడ క్లబ్ సభ్యుడు, గొల్లపూడి మాజీ సర్పంచ్ బొమ్మసాని సుబ్బారావు, ప్రసాదంపాడు ఉప సర్పంచ్ కొమ్మా కోటేశ్వరరావు, రామవరప్పాడు ఉప సర్పంచ్ కొల్లా ఆనంద్ కుమార్, చిట్టిబాబు, కొడాలి రాజేంద్రప్రసాద్‌లు మరో 50 వేలను మృతుడు తల్లి రాధమ్మకు అందజేశారు. -
కొండంత మనసు
అవయవదానంపై పలువురి అభినందన విజయవాడ సిటీ: వారేమీ ఉన్నత చదువులు చదువుకున్న వారు కాదు. అలాగని ఆర్థికంగా స్థితిమంతులూ కాదు. కాని వారి ఆశయం ముందు ఇవేవీ పనికిరావని నిరూపించారు. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన తోట మణికంఠ కుటుంబం చేసిన త్యాగాన్ని నగర ప్రజలు అభినందిస్తున్నారు. బ్రెయిన్ డెడ్ కావడంతో గుండె సహా అవయవ దానం చేసిన వారి మంచి మనస్సుకు నగరవాసులు చలిం చారు. గుండెను సకాలంలో గన్నవరం విమానాశ్రయం చేర్చేందుకు గ్రీన్ చానల్ ఏర్పాటు చేసి పోలీసులు సహకరిస్తే.. మరో మనిషికి పునర్జన్మ ఇచ్చే గుండెను తీసుకెళుతున్న అంబులెన్స్‌కు మార్గం మధ్యలో రోడ్డుపై ప్రజలు ఆప్యాయంగా వీడ్కోలు పలికారు. గ్రీన్ చానల్‌తో సహకారం : నగరంలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణ క్లిష్టమైనప్పటికీ.. గ్రీన్ చానల్ ఏర్పాటు ద్వారా గుండెను గన్నవరం ఎయిర్‌పోర్టు వరకు సజావుగా తీసుకెళ్లేందుకు గట్టి చర్యలు చేపట్టారు. జీవన్‌దాన్ ప్రతినిధుల కోరిక మేరకు సీపీ ఎ.బి. వెంకటేశ్వరరావు ఆదేశాల మేరకు శుక్రవారం మధ్యాహ్నం నుంచే ట్రాఫిక్ పోలీసులు రోడ్లపైకి వచ్చి గ్రీన్‌చానల్ ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. గుంటూరు జిల్లా పోలీసులతో సమన్వయం చేసుకుంటూ మార్పులు చేర్పులు చేశారు. కనకదుర్గమ్మ వారధి నుంచి పశువుల ఆస్పత్రి జంక్షన్ మీదుగా బందరురోడ్డుపై బెంజిసర్కిల్ వరకు, అక్కడి నుంచి రామవరప్పాడు రింగ్ ద్వారా గన్నవరం విమానాశ్రయం వరకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసి అంబులెన్స్ వెళ్లేందుకు మార్గం సుగమం చేశారు. దీంతో 27 నిమిషాల వ్యవధిలోనే గుండె విమానాశ్రయం చేరింది. సీపీ మాట్లాడుతూ..మంచి పనులకు పోలీసు సహకారం ఉంటుందన్నారు. కారు యజమాని నీరజ్ స్నేహితుడు ఉదయ్‌భాస్కర్ మాట్లాడుతూ.. మంచి పనులు చేసేం దుకు ఎప్పుడూ సిద్ధమేనన్నారు. హాట్సాఫ్ నిజంగా మణికంఠ కుటుంబం చేసిన పనికి ప్రతి ఒక్కరూ హ్యాట్సాఫ్ చెప్పాలి. మణికంఠ రోడ్డు ప్రమాదం కేసు నేనే దర్యాప్తు చేస్తున్నాను. పెద్దగా చదువుకున్న కుటుంబం కాకపోయినా ఉన్నతంగా ఆలోచించారు. వారు అవయవాలను దానం చేసినట్టు తెలిసి ఎంతగానో ఉద్వేగానికి లోనయ్యా. వారి నిర్ణయం ప్రతి ఒక్కరినీ ఆలోచింప జేసింది. - గిరి అశోక్‌కుమార్, రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం మాజీ సహాయ కార్యదర్శి -
మణిదీపం
బ్రెయిన్ డెడ్ అయిన రామవరప్పాడు యువకుడి అవయవాలు ఐదుగురికి దానం కళ్లు, గుండె, కాలేయం, ఊపిరితిత్తులు, కిడ్నీల అందజేత చెన్నైలోని ఓ రోగి కోసం ఎన్ఆర్ఐ ఆస్పత్రి నుంచి గుండె తరలింపు ఇరవై రెండేళ్ల యువకుడు దేశంలోనే ఓ చారిత్రక ఘట్టానికి ఆద్యుడయ్యాడు. అవయవదానంతో మళ్లీ సజీవుడయ్యాడు. కళ్లు, గుండె, కాలేయం, కిడ్నీలు, ఊపిరితిత్తులు ఇచ్చి ఐదుగురి ప్రాణాలను నిలిపాడు. మరో ఇద్దరికి కంటి వెలుగయ్యాడు. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి బ్రెయిన్‌డెడ్ అయిన ఆ యువకుడి అవయవాలు దానం చేయడానికి ముందుకొచ్చిన ఆ కుటుంబం ఎదుట మానవత్వం అనే మాట సైతం చిన్నబోయింది. ఈ క్రతువుకు గుంటూరు జిల్లా మంగళగిరి మండలం చినకాకానిలోని ఎన్ఆర్ఐ ఆస్పత్రి ఊపిరిలూదింది. రామవరప్పాడుకు చెందిన ఆ యువకుడి అవయవాల తరలింపులో శుక్రవారం ప్రముఖ వైద్యులు, రెండు జిల్లాల ఉన్నతాధికారులు చేసిన కృషిని పలువురు ప్రశంసించారు. మంగళగిరి/లబ్బీపేట/గన్నవరం : ఆ యువకుడి పేరు తోట మణికంఠ. కుటుంబ ఆర్థిక పరిస్థితి నేపథ్యంలో పదో తరగతితోనే చదువుకు స్వస్తి చెప్పాడు. రామవరప్పాడు నెహ్రూనగర్‌లో నివాసం. తండ్రి శ్రీనివాసరావు కొద్దికాలం కిందట మృతి చెందడంతో కుటుంబ బాధ్యతలు మీద పడ్డాయి. అనారోగ్యంతో ఉన్న తల్లి రాధమ్మను బాగా చూసుకోవాలని, సోదరి శివనాగజ్యోతిని ఉన్నత చదువులు చదివించాలని కారు డ్రైవర్‌గా మారాడు. ఈ నేపథ్యంలో ఈనెల మూడో తేదీ అర్ధరాత్రి ద్విచక్ర వాహనంపై విజయవాడలోని బెంజిసర్కిల్ నుంచి ఇంటికి వెళుతుండగా, సెట్విన్ ఆస్పత్రి వద్ద లారీ ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన మణికంఠను చికిత్స నిమిత్తం తొలుత ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం అవసరం కావడంతో అక్కడి నుంచి విజయవాడలోని మెట్రో ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ డాక్టర్ ఎన్.శ్రీనివాసరావు శస్త్రచికిత్స నిర్వహించారు. అయితే, విధి మణికంఠను చిన్నచూపు చూసింది. దేహానికి ప్రాణం ఉన్నా బ్రెయిన్‌డెడ్ అవడంతో తల్లి, సోదరి తల్లడిల్లిపోయారు. కుటుంబానికి ఒకే ఒక్క ఆధారమైన మణికంఠను బతికించుకోవాలని తపన పడ్డారు. ఏ వైద్యుడిని కలిసినా లాభం లేదని చెప్పారు. అప్పటికే నర్సింగ్ విద్యనభ్యసిస్తున్న మణికంఠ సోదరి జ్యోతి తన తల్లి, బంధువులతో మాట్లాడి తమ్ముడి అవయవాలను దానం చేయాలని, మరికొందరిలో మణికంఠను చూసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఉపకులపతి డాక్టర్ రవిరాజుకు తమ నిర్ణయాన్ని తెలియజేశారు. ఆయన జీవన్‌దాన్ అనే సంస్థను సంప్రదించి మణికంఠను కెడావర్ ట్రాన్స్‌ప్లాంట్ (అవయవ మార్పిడి)కు అవకాశం ఉన్న ఎన్ఆర్ఐ ఆస్పత్రికి తరలించారు. గ్రీన్ చానల్ ద్వారా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ డీజీపీలతో పాటు పోలీసు ఉన్నతాధికారులతో సంప్రదించి అత్యవసరంగా అవయవాలు కావాల్సిన వారి కోసం సమాచారం పంపారు. ఐదుగురికి అవయవదానం చెన్నైలోని రోగికి గుండె, ఎన్ఆర్ఐ ఆస్పత్రిలోని రోగికి ఒక కిడ్నీ, హైదరాబాద్ గ్లోబల్ ఆస్పత్రిలోని రోగికి కాలేయం, గుంటూరు సిటీ ఆస్పత్రి రోగికి మరో కిడ్నీ, పెదకాకానిలోని శంకర్ కంటి ఆస్పత్రికి కళ్లను అందించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ క్రమంలో చెన్నైలోని రోగికి మణికంఠ గుండెను అమర్చేందుకు ముగ్గురు డాక్టర్లతో కూడిన బృందం శుక్రవారం అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం చేరుకుని రోడ్డు మార్గాన ఎన్ఆర్ఐ ఆస్పత్రికి వచ్చింది. శస్త్రచికిత్స అనంతరం మణికంఠ గుండెను సజీవంగా సాయంత్రం అదే విమానంలో చెన్నై తరలించారు. గుండెను తరలించే క్రమంలో ఇక్కడి వైద్యులతోపాటు కృష్ణా, గుంటూరు జిల్లాల రెవెన్యూ, పోలీస్ యంత్రాంగం సహకారం అందించింది. ట్రాఫిక్ అవాంతరాలు లేకుండా జాగ్రత్తగా తీసుకెళ్లారు. రామవరప్పాడు సెంటర్లో ప్రజలు అంబులెన్‌సపై పూల జల్లులు కురిపించారు. వాహనదారులు ఎక్కడికక్కడ పక్కకు తప్పుకొని అంబులెన్స వెళ్లడానికి సహకరించారు. మణికంఠ మిగిలిన అవయవాలను కూడా ఆయా ఆస్పత్రుల్లోని రోగులకు అమర్చేందుకు ఏర్పాట్లుచేశారు. మణికంఠ సోదరి శివనాగజ్యోతిని ఎన్ఆర్ఐ ఆస్పత్రి యాజమాన్యంతో పాటు అక్కడికి వచ్చిన వైద్యులు, ప్రముఖులు, ప్రజలు అభినందించారు. అవయవదానంతో సమాజానికి ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. మా తమ్ముడు సజీవం ‘మా తమ్ముడి మృతితో మా కుటుంబం అనాథగా మారింది. అయినా అవయవాలను దానం చేయడం ద్వారా మా తమ్ముడు సజీవంగా ఉంటాడనే ఆత్మ సంతృప్తి దక్కింది. మా మణికంఠ మా నుంచి భౌతికంగా దూరమైనా ఐదుగురి ప్రాణాలను నిలిపి సజీవంగా నిలిచాడు.’ అంటూ మణికంఠ సోదరి శివనాగజ్యోతి తీవ్ర ఉద్వేగానికి లోనైంది. -
ఏడేళ్ల బాలికపై అత్యాచార యత్నం
నిలదీసిన బాలిక తల్లిపై మూకుమ్మడి దాడి పోలీసుల అదుపులో యువకుడు రావికమతం : ఆడుకుంటున్న బాలికకు మాయమాటలు చెప్పి అత్యాచార యత్నానికి పాల్పడిన యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ సంఘటన వివరాలను కొత్తకోట ఎస్ఐ శిరీష్‌కుమార్ శనివారం తెలిపారు. రావికమతం మండలం కిత్తంపేట గ్రామానికి చెందిన దాడి మణికంఠ(17) అదే గ్రామానికి చెందిన ఏడేళ్ల బాలికకు మాయమాటలు చెప్పి బుధవారం సాయంత్రం ఇంట్లోకి తీసుకువెళ్లి అసభ్యంగా ప్రవర్తించాడు. బాలికకు తీవ్ర రక్తస్రావం కావడంతో రోదిస్తూ తల్లికి వివరించింది. వారు ఆ బాలికను నర్సీపట్నంలోని ఒక ప్రైవేటు ఆస్పత్రికి తరలించి శుక్రవారం రాత్రి ఇంటికి తీసుకువచ్చారు. ఈ దారుణానికి పాల్పడిన మణికంఠను ఆ బాలిక తల్లి నలుగురిలో మందలించింది. దీంతో ఆగ్రహించిన ఆ యువకుడు అతని పెద్దలతో వచ్చి బాలిక తల్లిపై మూకుమ్మడి దాడి చేశారు. బాధితులు కొత్తకోట పోలీసులకు శనివారం ఫిర్యాదు చేశారు. మణికంఠను అదుపులోకి తీసుకుని, దాడికి పాల్పడిన మరో ఏడుగురిపై కేసులు నమోదు చేసినట్టు ఎస్ఐ తెలిపారు. నర్సీపట్నం రూరల్ సీఐ కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
దురలవాట్లకు దూరంగా...
చేతి నిండా డబ్బు... ఏం చేయాలో తెలియక... విచ్చలవిడిగా ఖర్చుచేయడం... తప్పుదోవ పట్టడం... దురలవాట్లకు వృథా చేయడం... కొన్ని రోజులు గడిచాక... జీవితంలో అనుకోని సంఘటన ఎదురుకావడంతో... పరివర్తన కలగడం... ఈ అంశాన్ని ఆధారంగా చేసుకుని మణికంఠ తీసిన లఘుచిత్రం ‘అహల్య’ డెరైక్టర్స్ వాయిస్: మాది కడప జిల్లా, చిన్నమండెం గ్రామం. నేను బి.టెక్ పూర్తి చేసి, ప్రస్తుతం నిజాం గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్లో ఎం.టెక్ చేస్తున్నాను. ఈ సినిమాకి మా స్నేహితులు బాగా సపోర్ట్ చేశారనడం కంటె, నా వెనుకే ఉంటూ, నన్ను బాగా ఎంకరేజ్ చేస్తూ , ఏ విషయంలోనూ నేను డిజప్పాయింట్ కాకుండా చూసుకుంటూ వచ్చారు. ప్రస్తుత కాలంలో అమ్మానాన్నలు... బాగా డబ్బు సంపాదించేసి, తమ పిల్లలు బాగుండాలనే ఒకే ఒక ఉద్దేశ్యంతో పిల్లలు ఎంత అడిగితే అంత ఇచ్చేస్తున్నారు. ఆ డబ్బుతో ఏం చేయాలో తెలియక పిల్లలు అడ్డదారుల్లోకి వెళ్లి చెడిపోతున్నారు. అలాంటివి కాస్త తగ్గాలి. తల్లిదండ్రులు ఆలోచించి పిల్లల మీద కొంత శ్రద్ధ తీసుకుంటేనే మంచిదని కోరుకుంటున్నాను. ఎవరికీ సూక్తులు, సందేశాలు నచ్చవు. ఇప్పుడుండే జనరేషన్ సందేశం ఇచ్చేవారిని పనిలేనివాళ్లలా జమ కట్టేస్తున్నారు. అందువల్ల నేను ఎవరికీ సందేశం ఇవ్వదల్చుకోలేదు. ‘మనలో ముందు మార్పు రావాలి, తర్వాత పక్కన వాళ్లకి చెప్పాలి’ అన్నది నా ఉద్దేశ్యం. షార్ట్ స్టోరీ: ఇద్దరు స్నేహితులు ఉంటారు. వారిద్దరికీ కొన్ని దురలవాట్లు ఉంటాయి. ఒకసారి ఒక మిత్రుడు బాగా మద్యం సేవించి, ‘అమ్మాయి కావాలి’ అని మిత్రుడిని అడుగుతాడు. వెంటనే ఒక అమ్మాయిని తీసుకువస్తాడు. వచ్చిన అమ్మాయికి ఆకలిగా ఉండటంతో గబగబ వంటగదిలోకి వెళ్లి అన్నం తింటూ ఉంటుంది. అది చూసిన వెంటనే అతడిలో పశ్చాత్తాపం కలుగుతుంది. తనకు కావలసినంత డబ్బు ఉండటంతో, మంచిచెడుల విచక్షణ లేకుండా ప్రవర్తిస్తున్నానని బాధ పడతాడు. వెంటనే ఆ అమ్మాయికి కొంత డబ్బు ఇచ్చి, పిల్లలకు ఏదైనా కొనిపెట్టమని చెప్పి పంపేస్తాడు. స్థూలంగా ఇదీ కథ. కామెంట్: లఘుచిత్రాలలో ఇటువంటి అంశం మీద చిత్రాలు నిర్మించినవారు తక్కువే అని చెప్పవచ్చు. ఇంత చిన్న వయసు (23 సంవత్సరాలు) లో ఇంత మంచి ఆశయంతో లఘుచిత్రం నిర్మించినందుకు మణికంఠను అభినందించాలి. నటీనటులు మరికాస్త బాగా నటించాలి. చిత్రంలో మరింత పర్ఫెక్షన్ ఉంటే ఇంకా బాగుంటుంది. సినిమా టేకింగ్, ఎడిటింగ్, ఎక్స్ప్రెషన్స్, కెమెరా... వంటివన్నీ బాగున్నాయి. డైలాగులు అంత ఎక్కువ లేవు. ఒక సామాజిక అంశాన్ని ప్రధానంగా తీసుకుని తీసిన లఘుచిత్రం కనుక, అంశం మీదే ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంది. - డా.వైజయంతి -
విధి విషాదమిది!
=పేద కుటుంబంపై పగబట్టిన దురదృష్టం =ఏడాదిలో తల్లిదండ్రులు మృత్యువాత =తాజాగా అనారోగ్యంతో కుమారుడి మృతి =ఒంటరిగా మిగిలిన కుమార్తె =బామ్మే తోడూనీడా రావికమతం, న్యూస్‌లైన్: ‘విధి ఒక విషవలయం’ అన్న కవి వాక్కు ఆ కుటుంబం విషయంలో అక్షర సత్యమేమో! కొన్ని బతుకులకు దురదృష్టం వెంటాడి మరీ వేధించి వినోదిస్తుందనడానికి ఆ పేద జీవితాలు ప్రత్యక్ష సాక్ష్యమేమో.. అందుకే మృత్యువు పగబట్టి మరీ ఆ నిస్సహాయులను వెంటాడింది. ఒకరి వెంట ఒకరిగా ముగ్గురిని బలి తీసుకుని చోద్యం చూసింది. ముందు తల్లిని, తర్వాత తండ్రిని కబళించిన మృత్యువు ఇప్పుడు కుమారుడినీ మింగేసింది. ఒంటరిగా మిగిలిన బాలిక వేదనతో విలవిలలాడుతూ ఉంటే వినోదిస్తోంది. రావికమతానికి చెందిన శానాపతి అప్పారావు, అతని భార్య రాజు ఈ ఏడాది నెలల వ్యవధిలో మృతి చెందారు. దీంతో టెన్త్ పాసైన కుమారుడు మణికంఠ (16), ఎనిమిదో తరగతి చదువుతున్న కుమార్తె అంజలి అనాథలయ్యారు. పింఛనుతో కాలం వెళ్లదీస్తున్న వారి నాయనమ్మ సోములమ్మపై ఆధారపడ్డారు. బతుకు బండి నడవక పోవడంతో పుట్టెడు దుఃఖంలోనూ మణికంఠ చదువు మాని కిరాణా దుకాణంలో పనికి చేరాడు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఆ కుటుంబాన్ని ఆదుకోవాలంటూ ‘విధి వంచితులు’ శీర్షికన ఈ నెల 16న సాక్షి మానవీయ కథనాన్ని ప్రచురించిన సంగతి తెలిసిందే. అయితే విధికి ఆ కుటుంబంపై ఇంకా పగ చల్లారినట్టు లేదు. తల్లిదండ్రులను కోల్పోయి, మానసికంగా ఆందోళనకు గురైన మణికంఠ తీవ్ర అనారోగ్యంతో మంగళవారం ఆకస్మికంగా మృతి చెందాడు. దీంతో ఆ చెల్లెలు ఒంటరిదైంది. నాయనమ్మతో పాటు అంజలి కన్నీరుమున్నీరవుతోంది. ఆమె విషాదాన్ని చూసి చుట్టాలు, బంధువులే కాదు... గ్రామస్తులూ కంటతడి పెడుతున్నారు. ఇలాంటి కష్టం మరెవ్వరికీ రాకూడదంటూ నిట్టూరుస్తున్నారు. అయిన వారిని కోల్పోయిన అంజలిని ఆదుకోవాలని అంతా కోరుతున్నారు.