రామవరప్పాడు : ఐదుగురికి అవయవాలు దానం చేసి పునర్జన్మ ప్రసాదించిన మణికంఠ భౌతికకాయం శనివారం రామవరప్పాడులోని నెహ్రూనగర్‌కు చేరుకుంది. గుండె, ఊపిరితి త్తులు, కాలేయం, కిడ్నీలు, కళ్లును దానం చేయడానికి బ్రెయిన్‌డెడ్‌కు గురైన మణికంఠ కుటుంబీకులు ముందుకొచ్చిన విషయం విదితమే. మణికంఠ భౌతికకాయాన్ని స్నేహితులు, అభిమానులు, బంధువులు కడసారి వీడ్కోలు పలికేందుకు భారీ సంఖ్యలో మణికంఠ నివాసానికి చేరుకుని కన్నీటి వీడ్కోలు పలికారు. అంత్యక్రియలు నిమిత్తం అంబులెన్స్‌లో స్మశానానికి బయలుదేరిన భౌతికకాయానికి దారి పొడవునా పుష్పాలను చల్లారు. అంత్యక్రియలు ఘనంగా నిర్వహించారు.
పలువురి ఆర్థిక సాయం
ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న మణికంఠ కుటుంబానికి దాతలు సాయం చేయడానికి ముందు కొచ్చారు. విజయవాడ క్లబ్ సభ్యుడు చంద్రశేఖర్ రూ.50 వేలు, విజయవాడ క్లబ్ సభ్యుడు, గొల్లపూడి మాజీ సర్పంచ్ బొమ్మసాని సుబ్బారావు, ప్రసాదంపాడు ఉప సర్పంచ్ కొమ్మా కోటేశ్వరరావు, రామవరప్పాడు ఉప సర్పంచ్ కొల్లా ఆనంద్ కుమార్, చిట్టిబాబు, కొడాలి రాజేంద్రప్రసాద్‌లు మరో 50 వేలను మృతుడు తల్లి రాధమ్మకు అందజేశారు.
మణికంఠకు అంతిమ వీడ్కోలు
Published Sun, Mar 8 2015 2:33 AM | Last Updated on Sat, Sep 2 2017 10:28 PM
Advertisement
Advertisement