Donation of organs
-
రాకేశ్ మాస్టర్ కుటుంబం గొప్ప నిర్ణయం!
ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేశ్ మాస్టర్ అనారోగ్య సమస్యలతో సడన్ గా చనిపోయారు. ఒకప్పటి జనరేషన్ కు డ్యాన్స్ మాస్టర్ గా తెలిసిన ఆయన.. ఇప్పటి జనరేషన్ కి మాత్రం యూట్యూబ్ వీడియోలతో బాగా పరిచయం. పలు ఫన్నీ ఇంటర్వ్యూలతో సోషల్ మీడియాలో చాలామంది హ్యాపీనెస్ కు కారణమయ్యారు. అలాంటిది రాకేశ్ మాస్టర్ ఇలా అకస్మాత్తుగా మరణించడం ఆయన కుటుంబానికి తీరని శోకాన్ని మిగిల్చింది. ఇలాంటి టైంలోనూ వాళ్లు గుండె నిబ్బరం చేసుకుని ఓ గొప్ప నిర్ణయం తీసుకున్నారు. తిరుపతికి చెందిన రాకేశ్ మాస్టర్ ప్రస్తుతం హైదరాబాద్ లో ఉంటున్నారు. ఆదివారం ఉదయం తీవ్ర అనారోగ్యానికి గురికావడంతో సికింద్రాబాద్ లోని గాంధీ ఆస్పత్రిలో ఈయన్ని చేర్చారు. అలా చికిత్స పొందుతూ సాయంత్రం 5 గంటల సమయంలో చనిపోయారు. అయితే తను చనిపోతానని కొన్నిరోజుల ముందే పసిగట్టిన రాకేశ్ మాస్టర్.. తన అవయవాల్లో పనికొచ్చే వాటిని దానం చేయాలని సూచించారట. ఈ విషయాన్ని ఆయన అసిస్టెంట్ సాజిద్ బయటపెట్టాడు. ఇదే విషయాన్ని డాక్టర్లకు చెప్పిన సాజిద్.. పోస్టుమార్టం చేసి, బాడీపార్ట్స్ తీసుకున్న తర్వాత తమకు అప్పజెప్పాలని, దహన సంస్కారాలు చేసుకుంటామని వాళ్లకు చెప్పినట్లు పేర్కొన్నాడు. ఇక చూపులేని వారికి రాకేశ్ మాస్టర్ కళ్లని దానం చేసేందుకు ఆయన కుటుంబ సభ్యులు కూడా అంగీకరించినట్లు సాజిద్ క్లారిటీ ఇచ్చాడు. ఇలా తన అవయవాలని దానం చేయాలనే గొప్ప మనసు రాకేశ్ మాస్టర్ కు ఉందని తెలిసి నెటిజన్స్ మెచ్చుకుంటున్నారు. (ఇదీ చదవండి: నా శరీరంలో మార్పులు వస్తున్నాయి.. రాకేశ్ మాస్టర్ లాస్ట్ వీడియో) -
మణికంఠకు అంతిమ వీడ్కోలు
రామవరప్పాడు : ఐదుగురికి అవయవాలు దానం చేసి పునర్జన్మ ప్రసాదించిన మణికంఠ భౌతికకాయం శనివారం రామవరప్పాడులోని నెహ్రూనగర్‌కు చేరుకుంది. గుండె, ఊపిరితి త్తులు, కాలేయం, కిడ్నీలు, కళ్లును దానం చేయడానికి బ్రెయిన్‌డెడ్‌కు గురైన మణికంఠ కుటుంబీకులు ముందుకొచ్చిన విషయం విదితమే. మణికంఠ భౌతికకాయాన్ని స్నేహితులు, అభిమానులు, బంధువులు కడసారి వీడ్కోలు పలికేందుకు భారీ సంఖ్యలో మణికంఠ నివాసానికి చేరుకుని కన్నీటి వీడ్కోలు పలికారు. అంత్యక్రియలు నిమిత్తం అంబులెన్స్‌లో స్మశానానికి బయలుదేరిన భౌతికకాయానికి దారి పొడవునా పుష్పాలను చల్లారు. అంత్యక్రియలు ఘనంగా నిర్వహించారు. పలువురి ఆర్థిక సాయం ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న మణికంఠ కుటుంబానికి దాతలు సాయం చేయడానికి ముందు కొచ్చారు. విజయవాడ క్లబ్ సభ్యుడు చంద్రశేఖర్ రూ.50 వేలు, విజయవాడ క్లబ్ సభ్యుడు, గొల్లపూడి మాజీ సర్పంచ్ బొమ్మసాని సుబ్బారావు, ప్రసాదంపాడు ఉప సర్పంచ్ కొమ్మా కోటేశ్వరరావు, రామవరప్పాడు ఉప సర్పంచ్ కొల్లా ఆనంద్ కుమార్, చిట్టిబాబు, కొడాలి రాజేంద్రప్రసాద్‌లు మరో 50 వేలను మృతుడు తల్లి రాధమ్మకు అందజేశారు.