బంజారాహిల్స్ (హైదరాబాద్): పాత కక్షల నేపథ్యంలో ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారిని 10 మంది కలిసి దారుణంగా హత్య చేశారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం సింగోటం గ్రామానికి చెందిన పుట్టా రాము (36) గతంలో ఆటోడ్రైవర్‌గా పనిచేశాడు. ఇటీవల రియల్ ఎస్టేట్ రంగంలోకి దిగాడు. కొద్ది రోజులు కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన రాము ఇటీవల బీజేపీలో చేరి వివిధ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నాడు.
హైదరాబాద్ చుట్టుపక్కల రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న సమయంలో రాముకు జీడిమెట్లకు చెందిన మణికంఠ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ కలిసి రియల్‌ఎస్టేట్ లావాదేవీలు చేసేవారు. అయితే వారి మధ్యలో వ్యాపారం విషయంలో గొడవలు జరిగి ఒకరిపై ఒకరు పోలీసు కేసులు కూడా పెట్టుకున్నారు. పరిస్థితులు ముదిరిపోవడంతో రాము హత్యకు మణికంఠ పథకం వేశాడు. గత రెండు రోజుల నుంచి రెక్కీ నిర్వహిస్తున్నాడు. ఈ నెల 5వ తేదీన రాము యూసుఫ్‌గూడలోని ఎల్‌ఎన్‌నగర్‌లో ఉంటున్న విషయం తెలుసుకున్న మణికంఠ బుధవారం రాత్రి 10 గంటల సమయంలో ఓ యువతితో ఫోన్ చేయించి హానీట్రాప్ చేయించాడు.
ఆ యువతి ఫోన్‌కాల్ నమ్మిన రాము రాత్రి 10 గంటల సమయంలో ఎల్‌ఎన్‌నగర్‌లోని తన ఇంటికి వచ్చాడు. సరిగ్గా 11.15 గంటలకు మణికంఠతో పాటు బోరబండకు చెందిన జిలానీ అనే రౌడీïÙటర్, మరో ఎనిమిది మంది కలిసి ఇంట్లోకి చొరబడి రామును కత్తులతో 50 పోట్లు పొడిచారు. అరగంట పెనుగులాడిన అనంతరం రాము కన్నుమూశాడు. రామును మర్డర్ చేసిన తరువాత ఆ దృశ్యాలను మణికంఠ ఓ స్నేహితుడికి వీడియో కాల్ చేసి చూపించాడు. రామును హనీట్రాప్ చేసిన యువతిని జూబ్లీహి ల్స్ పోలీసులు విచారిస్తున్నారు.
మణికంఠతో పాటు పారిపోయిన మిగతా నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మర్డర్ జరిగిన సమయంలో అక్కడ ఇద్దరు యువతులు కూడా ఉన్నట్లుగా పోలీసులు అను మానిస్తున్నారు. మృతుని భార్య, ఇద్దరు పిల్లలు స్వగ్రా మంలో ఉంటుండగా, విషయం తెలియగానే ఆమె గురువారం జూబ్లీహిల్స్‌పోలీస్‌స్టేషన్‌కు చేరుకుంది. ఆమె ఇచ్చి న ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment