Real estate dealer
-
హనీట్రాప్ చేసి.. కత్తులతో పొడిచి
బంజారాహిల్స్ (హైదరాబాద్): పాత కక్షల నేపథ్యంలో ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారిని 10 మంది కలిసి దారుణంగా హత్య చేశారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం సింగోటం గ్రామానికి చెందిన పుట్టా రాము (36) గతంలో ఆటోడ్రైవర్‌గా పనిచేశాడు. ఇటీవల రియల్ ఎస్టేట్ రంగంలోకి దిగాడు. కొద్ది రోజులు కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన రాము ఇటీవల బీజేపీలో చేరి వివిధ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నాడు. హైదరాబాద్ చుట్టుపక్కల రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న సమయంలో రాముకు జీడిమెట్లకు చెందిన మణికంఠ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ కలిసి రియల్ఎస్టేట్ లావాదేవీలు చేసేవారు. అయితే వారి మధ్యలో వ్యాపారం విషయంలో గొడవలు జరిగి ఒకరిపై ఒకరు పోలీసు కేసులు కూడా పెట్టుకున్నారు. పరిస్థితులు ముదిరిపోవడంతో రాము హత్యకు మణికంఠ పథకం వేశాడు. గత రెండు రోజుల నుంచి రెక్కీ నిర్వహిస్తున్నాడు. ఈ నెల 5వ తేదీన రాము యూసుఫ్‌గూడలోని ఎల్‌ఎన్‌నగర్‌లో ఉంటున్న విషయం తెలుసుకున్న మణికంఠ బుధవారం రాత్రి 10 గంటల సమయంలో ఓ యువతితో ఫోన్ చేయించి హానీట్రాప్ చేయించాడు. ఆ యువతి ఫోన్‌కాల్ నమ్మిన రాము రాత్రి 10 గంటల సమయంలో ఎల్ఎన్నగర్లోని తన ఇంటికి వచ్చాడు. సరిగ్గా 11.15 గంటలకు మణికంఠతో పాటు బోరబండకు చెందిన జిలానీ అనే రౌడీïÙటర్, మరో ఎనిమిది మంది కలిసి ఇంట్లోకి చొరబడి రామును కత్తులతో 50 పోట్లు పొడిచారు. అరగంట పెనుగులాడిన అనంతరం రాము కన్నుమూశాడు. రామును మర్డర్ చేసిన తరువాత ఆ దృశ్యాలను మణికంఠ ఓ స్నేహితుడికి వీడియో కాల్ చేసి చూపించాడు. రామును హనీట్రాప్ చేసిన యువతిని జూబ్లీహి ల్స్ పోలీసులు విచారిస్తున్నారు. మణికంఠతో పాటు పారిపోయిన మిగతా నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మర్డర్ జరిగిన సమయంలో అక్కడ ఇద్దరు యువతులు కూడా ఉన్నట్లుగా పోలీసులు అను మానిస్తున్నారు. మృతుని భార్య, ఇద్దరు పిల్లలు స్వగ్రా మంలో ఉంటుండగా, విషయం తెలియగానే ఆమె గురువారం జూబ్లీహిల్స్పోలీస్స్టేషన్కు చేరుకుంది. ఆమె ఇచ్చి న ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. -
‘జగనన్నకు చెబుదాం’తో దిగొస్తున్న అధికారులు
పెనుకొండ/హనుమాన్‌జంక్షన్ రూరల్ : ‘జగనన్నకు చెబుదాం’కు ఫిర్యాదు చేసిన బాధితుల కోసం అధికారులు, పోలీసులు దిగొస్తున్నారు. ఫిర్యాదుదారుల నుంచి వివరాలు సేకరించి, ఆధారాలు తీసుకుని న్యాయం చేసేందుకు ఉపక్రమిస్తున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారి చేతిలో మోసపోయిన ఇద్దరు బాధితులు, వీఆర్వో నిర్లక్ష్యంతో ఇబ్బందిపడుతున్న మరో బాధితుడు 1902 నంబర్‌కు ఫోన్ చేయడంతో అధికారులు ఫిర్యాదుదారులను సంప్రదించి వారికి న్యాయం చేసేందుకు చర్యలు తీసుకున్నారు. మూడేళ్లుగా ముప్పుతిప్పలు శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల మండలం పాలసముద్రానికి చెందిన దిలీప్‌రెడ్డి మండలంలోని గొల్లపల్లి–చంద్రగిరి మధ్య రోడ్డు పక్కన ప్లాట్లు వేశాడు. తన వద్ద ప్లాట్లు కొనేవారికి బ్యాంకులోను కూడా తానే ఇప్పిస్తానని ప్రచారం చేశాడు. దీంతో పెనుకొండకు చెందిన గొల్ల గోపాల్, ఓబుళరెడ్డిలు ఆయన వద్ద ప్లాట్లు కొనుగోలు చేసేందుకు వెళ్లగా, ఒక్కో ప్లాట్ రూ.16 లక్షలుగా చెప్పాడు. ఒక్కో ప్లాట్‌కు రూ.4 లక్షల చొప్పున అడ్వాన్స్ ఇస్తే.. మిగతా మొత్తం తానే బ్యాంకు ద్వారా లోను ఇప్పిస్తానన్నాడు. దీంతో వారిద్దరూ 2020, జనవరిలో చెరో ప్లాట్ కోసం రూ.4 లక్షల చొప్పున దిలీప్‌రెడ్డికి ఇచ్చారు. ఆ తర్వాత దిలీప్‌రెడ్డి ముఖం చాటేశాడు. లోన్ సంగతి తర్వాత కనీసం తాము చెల్లించిన డబ్బులన్నా వెనక్కి ఇవ్వాలని కోరగా.. చెక్కులిచ్చాడు. వాటిని బ్యాంకులో వేయగా అవి బౌన్స్ అయ్యాయి. దీంతో బాధితులు కోర్టును ఆశ్రయించి నోటీసులు పంపగా.. దిలీప్‌రెడ్డి వాటిని తీసుకోలేదు. ఇలా మూడేళ్ల పాటు పోరాటం చేస్తున్న బాధితులు రెండు రోజుల కిందట ‘జగనన్నకు చెబుదాం’కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. 1902 కాల్ సెంటర్ వారు వివరాలన్నీ నమోదు చేసుకుని, సమీప పోలీస్‌స్టేషన్‌కు వివరాలు పంపారు. దీంతో బుధవారం ‘కియా’ పోలీస్ స్టేషన్ ఎస్ఐ వెంకటరమణ బాధితులకు ఫోన్ చేయగా గొల్ల గోపాల్ అందుబాటులోకి వచ్చాడు. అతన్ని స్టేషన్‌కు పిలిపించి వివరాలపై ఆరా తీసి, ఆధారాలు తీసుకున్నారు. అనంతరం దిలీప్‌పై కేసు నమోదు చేశారు. మరో బాధితుడు ఓబుళరెడ్డిని కూడా స్టేషన్‌కు పిలిపించి ఫిర్యాదు తీసుకుంటామని ఎస్ఐ తెలిపారు. మూడేళ్లుగా కనీసం కేసు కూడా నమోదు కాలేదని, 1902కు ఫోన్ చేయగానే పోలీసులే కేసు నమోదు చేశారని బాధితుడు గొల్ల గోపాల్ చెప్పారు. అర్జీదారు ఇంటికి ఆర్డీవో ఏలూరు జిల్లా నూజివీడు మండలం మీర్జాపురానికి చెందిన గోళ్ల రాణికి బాపులపాడు మండలం మల్లవల్లి గ్రామంలోని ఆర్ఎస్ నంబర్ 110–2లో రెండు ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. పట్టా భూమి అయినప్పటికీ కొన్నేళ్లుగా రెవెన్యూ అధికారులు 22ఏ కేటగిరీ కింద ప్రభుత్వ భూమిగా నమోదు చేశారు. అప్పటి నుంచి రాణితో పాటు ఆమె కుటుంబ సభ్యులు రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. అయితే వీఆర్వో సరిగ్గా స్పందించకపోవడంతో సమస్య పరిష్కారం కాలేదు. విసుగుచెందిన గోళ్ల రాణి కుటుంబ సభ్యులు ఈ నెల 13వ తేదీన ‘జగనన్నకు చెబుదాం’లో ఫిర్యాదు చేశారు. స్పందించిన గుడివాడ ఆర్డీవో పి.పద్మావతి, బాపులపాడు తహసీల్దార్ సీహెచ్ నరసింహారావు, మల్లవల్లి వీఆర్వో ప్రసాద్‌ను వెంటపెట్టుకుని బుధవారం మీర్జాపురంలోని గోళ్ల రాణి ఇంటికి వెళ్లారు. మల్లవల్లి వ్యవసాయ భూములకు సంబంధించిన ప్రభుత్వ రికార్డులను తనిఖీ చేయడంతో పాటుగా, గోళ్ల రాణి వద్ద ఉన్న పత్రాలను కూడా ఆర్డీవో పద్మావతి పరిశీలించారు. సమస్య పరిష్కరించకుండా పదే పదే అర్జీదారులను తిప్పుకోవడం తగదని వీఆర్వో ప్రసాద్‌ను ఆర్డీవో మందలించారు. దీర్ఘకాలంగా ఉన్న మల్లవల్లి ఆర్ఎస్ నంబర్ 110–2 సెక్షన్ 22ఏ సమస్యను తక్షణమే పరిష్కరించి న్యాయం చేస్తామని ఆర్డీవో హామీ ఇచ్చారు. -
కుటుంబ సభ్యులనే బలిగొన్న కారు
- పార్కు చేస్తుండగా బ్రేక్‌కు బదులు ఎక్స్‌లేటర్ తొక్కడంతో ప్రమాదం - తల్లీకూతురు దుర్మరణం రామచంద్రాపురం: ఓ వ్యక్తి నిర్లక్ష్యం తన కుటుంబ సభ్యులిద్దరి ప్రాణాలను బలిగొంది. కారును ఇంట్లో పార్కు చేస్తున్న క్రమంలో జరిగిన పొరపాటుకు అతని తల్లి, చెల్లి బలయ్యారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలం తెల్లాపూర్‌లో గురువారం రాత్రి చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన సత్యనారాయణ రియల్ ఎస్టేట్ వ్యాపారి. ఇటీవల కారు కొనుగోలు చేశాడు. ఉగాది నాడు తన తండ్రి సంవత్సరీకం ఉండడంతో కంది మండలం అల్లూర్‌లో ఉండే అతని చెల్లెలు పద్మ(25) పుట్టింటికి వచ్చింది. గురువారం సత్యనారాయణ, అతని బావ బుచ్చిరాజులు కలసి కారులో బయటకు వెళ్లి రాత్రి ఇంటికి వచ్చారు. సత్యనారాయణ తన కారును ఇంట్లో పార్క్ చేసేందుకు ప్రయత్నించాడు. బ్రేక్ వేయాల్సిన క్రమంలో ఎక్స్‌లేటర్ తొక్కాడు. దీంతో ఆ పక్కనే ఉన్న సత్యనారాయణ తల్లి సత్తమ్మ (65), చెల్లెలు పద్మ (25)పైకి కారు దూసుకెళ్లింది. తీవ్ర గాయాలైన వారిని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతి చెందారు.