Ramu
-
అబ్రకదబ్ర లోనూ ఆమె ముద్ర
‘నీపై నీకు నమ్మకం ఉంటే అద్భుతం సాధ్యం అవుతుంది’ అనే మాట మెజిషియన్ లక్ష్మికి తెలియనిదేమీ కాదు. ఆ నమ్మకం వల్లే గానం నుంచి ఇంద్రజాలం వరకు ఎన్నో విద్యల్లో ప్రావీణ్యం సాధించింది ‘ఆహా!’ అనిపిస్తుంది...అయిదు అంగుళాల పదునైన మేకును సుత్తితో ముక్కు లోనికి పంపుతూ లక్ష్మి చేసే సాహసం చూసి ప్రేక్షకుల ఒళ్లు గగుర్పొడుస్తుంది. అటూ ఇటూ కదులుతూ చేతిలోని గొడుగును ఆడిస్తూ ఒకదాని తరువాత ఒకటి చొప్పున అలవోకగా 30 కు పైగా గొడుగులు, స్వింగ్ఫ్లవర్స్ తీయడం చూస్తే ఔరా అనిపిస్తుంది. నంబర్స్‌తో మెంటలిజం మ్యాజిక్ చేసి అవాక్కు చేయడమే కాదు, వస్తువుల్ని మాయం చేయడం, పుట్టించడం, మనిషిని రెండు భాగాలు చేసినట్టు భ్రమింప చేయడం... ఇలా ఆమె చేసే ఇంద్రజాలం ప్రేక్షకులని కట్టిపడేస్తుంది.ఇంద్రజాలంతోనే కాదు తన గానంతో కూడా ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తోంది లక్ష్మి. పశ్చిమగోదావరి జిల్లా తణుకుకు చెందిన దండ లక్ష్మీప్రసన్నదేవి భర్త రాము సింగర్, డ్యాన్సర్, మిమిక్రీ ఆర్టిస్టు, మెజీషియ¯Œ , ఎంటర్టైనర్గా సుపరిచితుడు. భర్తతోపాటు ఎన్నో ప్రాంతాలకు వెళుతుండేది లక్ష్మి. అలా వెళ్లడం ద్వారా వివిధ కళా రూపాలకు ప్రేక్షకుల నుంచి వచ్చే అపురూప స్పందనను ప్రత్యక్షంగా చూసే అవకాశం వచ్చింది.రెండేళ్ల క్రితం భర్తతో కలిసి కేరళలో జరిగిన మ్యాజిక్పోటీలకు వెళ్లింది లక్ష్మి. ఆపోటీలలో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఒక్క మహిళ కూడా లేకపోవడం గమనించింది. మహిళలు కనిపించని ఆ లోటే తనను మ్యాజిక్‌పై ఆసక్తి పెంచుకునేలా చేసింది. ‘నేను మ్యాజిక్ నేర్చుకోవాలనుకుంటున్నాను’ తన మనసులో మాటను భర్తకు చెప్పింది.అతడు ఎగతాళిగా నవ్వి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదోగానీ ‘భేషుగ్గా నేర్చుకోవచ్చు’ అనడమే కాదు ఇల్లే పాఠశాలగా ఇంద్రజాల విద్య నేర్పడం మొదలుపెట్టాడు. భర్త నుంచి మ్యాజిక్ ట్రిక్స్ నేర్చుకున్న లక్ష్మి చేసిన మొదటి మ్యాజిక్ షోకు మంచి స్పందన వచ్చింది. తనమీద తనకు నమ్మకం వచ్చింది.ఇక అప్పటి నుంచి ‘మ్యాజిక్’ తని ఇంటి పేరుగా మారింది. బర్త్‌డే పార్టీల నుంచి మ్యారేజ్ వరకు రకరకాల ఫంక్షన్లలో ఇప్పటివరకు వందకు పైగా ప్రదర్శనలు ఇచ్చింది. గుంటూరులో జరిగిన ‘అమరావతి మ్యాజిక్ ఫెస్టివల్’ రాష్ట్రస్థాయిపోటీల్లో ప్రథమ బహుమతిని గెలుచుకుంది. తాజ్ మ్యాజిక్ సొసైటీ ఆగ్రాలో నిర్వహించిన జాతీయస్థాయిపోటీల్లో ద్వితీయ బహుమతి గెలుచుకుంది.దేశవ్యాప్తంగా మేకు మ్యాజిక్ చేస్తున్న ఏడుగురు మెజిషీయన్లలో ఏకైక మహిళను తానే అంటుంది లక్ష్మి. పాటలు పాడటంలో నైపుణ్యాన్ని సాధించిన లక్ష్మి యాంకర్‌గా, సింగర్‌గా వెయ్యికి పైగా షోలు చేసింది. ‘ఇంకా ఎన్నో కళలు నేర్చుకోవాలని ఉంది. దేశవ్యాప్తంగా ప్రదర్శనలు ఇవ్వాలని ఉంది’ అంటుంది లక్ష్మీప్రసన్నదేవి.ఆ చప్పట్లు చాలు...ప్రేక్షకులలో ఒకరిగా ఎంతోమంది కళాకారుల ప్రదర్శనలను చూసి చప్పట్లు కొట్టాను. ఇప్పుడు నేను ప్రదర్శన చేస్తుంటే అలాంటి చప్పట్లు వినడం అపురూపంగా ఉంది. లక్షలు, కోట్లు అక్కర్లేదు. ఆ చప్పట్లు చాలు కళాకారుడిలో నిత్య ఉత్సాహం నింపడానికి. కళకు ప్రాంతం, జెండర్ అనే తేడా తెలియదు. కళాకారులలో ఏ కొంచెం ప్రతిభ ఉన్నా ప్రపంచం సొంతం చేసుకుంటుంది. గృహిణిగా బాధ్యతలు నిర్వహిస్తున్న నేను ‘ఇప్పుడు ఇవన్నీ ఎందుకు!’ అనుకోలేదు. ‘నేను ఎందుకు నేర్చుకోకూడదు’ అని మాత్రమే అనుకున్నాను. అలా అనుకోవడం వల్లే మెజీషియన్‌గా, సింగర్‌గా, యాంకర్‌గా నాకంటూ ఎంతో కొంత గుర్తింపు వచ్చింది. మరిన్ని కళలు నేర్చుకొని, దేశవ్యాప్తంగా మరిన్ని ప్రదర్శనలు ఇవ్వాలనుకుంటున్నాను.– దండ లక్ష్మీప్రసన్నదేవి – పెనుపోతుల విజయ్‌కుమార్, సాక్షి, భీమవరం ఫొటోలు: బడేటి తిరుపతి వెంకటేశ్వరరావు -
హరిత భవనాలే రక్ష!
జనాభాతో పాటుగా ఇంటి నిర్మాణాలు పెరిగి పర్యావరణ సమస్యలు ఎక్కువవుతున్నాయి. ఈ సమస్యలను నివారించడానికి ఆహ్లాదకరమైన, ఆరోగ్యవంతమైన, పర్యావరణ అనుకూల జీవన శైలిని కొనసాగించడానికి హరిత భవనాలు ఎంతో ఉపయోగపడతాయి. పర్యావరణ అనుకూల మెటీరియల్, డిజైన్‌తో భవనాన్ని నిర్మించి, పర్యావరణ అనుకూలంగా ఏ భవనాలనైతే నిర్వహిస్తారో వాటిని ‘హరిత భవనాలు’ అంటారు.ఈ భవన నిర్మాణంలో స్థలం ఎంపికకూ ప్రాధాన్యం ఉంది. అంటే పర్యావరణ సున్నితమైన ప్రదేశాలలో హరిత భవనాలను నిర్మించరాదు. ఉదాహరణకు అధిక మొత్తంలో వ్యవసాయ దిగుబడిని ఇచ్చే సారవంతమైన వ్యవసాయ భూములను హరిత భవనాల నిర్మాణాల కోసం వాడరాదు. దీని వలన మనం ప్రకృతి సిద్ధంగా లభించిన విలువైన వ్యవసాయ భూమిని కోల్పోతాము. ఇది ఆహార ఉత్పత్తిపై ప్రభావం చూపుతుంది.సహజసిద్ధంగా గాలి, వెలుతురు వచ్చే విధంగా వీటి నిర్మాణాన్ని చేపడతారు. వెలుతురు బాగా ఉండే గదులలో చదివే విద్యార్థులు నేర్చుకునే సామర్థ్యం, వెలుతురు సరిగ్గా లేని గదిలో చదివే విద్యార్థుల కన్నా 20 నుండి 26 శాతం ఎక్కువగా ఉంటుందని పరిశోధనలలో తేలింది. హానికర రసాయన పదార్థాలు కలిగిన లెడ్ పెయింట్లు భవనాల లోపల గాలి నాణ్యతను హానికరంగా మారుస్తాయి కావున వాటి స్థానంలో సహజ సిద్ధమైన రంగులను వాడతారు. ఇండోర్ ప్లాంట్స్ ఏర్పాటు కూడా ఈ భవనాలలో ఉంటుంది. దీనివలన భవనాల లోపల గాలి నాణ్యత పెరుగుతుంది.తక్కువ విద్యుత్‌ను వినియోగించే ఎల్ఈడీ బల్బ్‌లను, ఇతరత్రా తక్కువ విద్యుత్‌ను వినియోగించుకొనే ఎలక్ట్రానిక్ పరికరాలను వాడటం వలన ఈ భవనాలలో తక్కువగా విద్యుత్ ఖర్చవుతుంది. అదేవిధంగా సోలార్, పవన విద్యుత్ వంటి పునరుత్పాదక విద్యుత్‌ను వాడటం వలన గ్లోబల్ వార్మింగ్‌ను తగ్గించడంలో హరిత భవనాలు కీలక పాత్ర వహిస్తాయి. హరిత భవన పైకప్పులో కాంతిని రిఫ్లెక్ట్ చేసే పదార్థాలను వాడటం వల్ల ఇంటి పైకప్పు వేడి తగ్గుతుంది. పైకప్పు భాగంలో చిన్న, చిన్న మొక్కలను పెంచడం వలన వాతావరణంలోని కార్బన్ డై ఆక్సైడ్ వాయువులను ఇవి గ్రహిస్తాయి. అదేవిధంగా ఇంటి పై కప్పు భాగంలో జీవ వైవిధ్యం పెరిగి సీతాకోకచిలుకలు, పక్షులు వంటి వాటిని ఆకర్షించడం వలన భవనం ఆకర్షణీయంగా మారుతుంది.ఈ భవనాలలో సేంద్రియ వ్యర్థ పదార్థాలను బయో గ్యాస్‌గా మార్చడం లేదా సేంద్రియ ఎరువుగా మార్చి ఉపయోగించే ఏర్పాట్లు ఉంటాయి. వాడిన నీటిని శుద్ధిచేసి తిరిగి గార్డెనింగ్, ఇతరత్రా పనులకు వినియోగించడం వలన నీరు వృథా కాదు. ఈ నిర్మాణాలలో వర్షపు నీరును పట్టి భూమిలోకి ఇంకిపోయేలా చేసే ఏర్పాట్లు ఉండడం వల్ల భూగర్భ జలాలు పెరుగుతాయి. ఇన్ని ప్రయోజనాలు ఉన్న హరిత భవనాలు వాతావరణ మార్పుల నుండి మానవాళిని రక్షించగలుగుతాయి అనడం అతిశయోక్తి కాదు. – డా. శ్రీధరాల రాము, ఫ్యాకల్టీ ఆఫ్ కెమిస్ట్రీ అండ్ ఎన్విరాన్మెంటల్ సైన్సెస్, హైదరాబాద్ -
Hyderabad: తవ్వినకొద్దీ తల్లీకూతుళ్ల లీలలు
బంజారాహిల్స్: రియల్ ఎస్టేట్ వ్యాపారి పుట్టా రాము హత్య కేసులో నిందితులైన తల్లీకూతుళ్లు హిమాంబీ, నసీమా లీలలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. తల్లీ కూతుళ్ల అరాచకాలకు చాలామంది బలికాగా, ప్రస్తుతం వ్యభిచార గృహం నిర్వహిస్తున్న నిందితురాలు హిమాంబీ ఆ ఇంటిని దౌర్జన్యంగా ఆక్రమించి యజమానిపై తప్పుడు కేసులు బనాయించింది. ఇటువైపు తొంగిచూస్తే తమపై అత్యాచారం చేశావంటూ కేసు పెడతానని బెదిరిస్తుండడంతో ఇంటి యజమాని అటువైపు తొంగి చూడడం లేదు. ఇదే అదనుగా హిమాంబీ, ఆమె కూతురు నసీమా ఇద్దరూ ఈ ఇంటిని వ్యభిచార కూపంగా మార్చారు. జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని యూసుఫ్‌గూడ ఎల్‌ఎన్‌నగర్‌లో ఇటీవల రియల్టర్ పుట్టా రామును 11 మంది కత్తులతో దాడి చేసి హత్య చేసిన విషయం తెలిసిందే. నసీమా హనీట్రాప్ చేసి రామును ఇంటికి పిలిపించి ఈ విషయాన్ని ప్రధాన నిందితుడు మణికంఠకు మెసేజ్ చేసి హత్య కుట్ర కారణమై జైలు పాలైంది. హిమాంబీపై ఇప్పటికే బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మేడిపల్లి తదితర పోలీస్స్టేషన్లలో ఐదు ఎఫ్ఐఆర్లు నమోదై ఉన్నాయి. బెయిల్‌పై వస్తూ.. 2017 జూన్‌లో హిమాంబీ.. ఓ యువతితో వ్యభిచారం చేయిస్తూ బంజారాహిల్స్ పోలీసులకు పట్టుబడింది. 2018లో మరో అమ్మాయితోనూ వ్యభిచారం చేయిస్తూ అరెస్టయ్యింది. 2020లో జూబ్లీహిల్స్‌లోని వెంకటగిరిలో వ్యభిచార గృహంపై దాడి చేయగా పోలీసులకు మరోసారి పట్టుబడింది. 2017లో విష్ణుకాంత్ అనే వ్యక్తి నుంచి బ్లాక్మెయిల్ చేసి రూ.3 లక్షలు వసూలు చేసింది. 2019లో తన కూతురు నసీమాను రాజు అనే వ్యక్తి కిడ్నాప్ చేశాడంటూ తప్పుడు కేసు పెట్టింది. పోలీసులకు పట్టుబడిన ప్రతిసారీ బెయిల్‌పై వస్తూ.. కూతురు నసీమాను ఎరగా వేసి ఏడేళ్లుగా హిమాంబీ స్థానికంగా అరాచకాలకు, బ్లాక్మెయిల్ వ్యవహారాలకు, కుట్రలు, కుతంత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచింది. కానిస్టేబుల్‌పైనే కేసులు పెట్టించి.. ఓ కానిస్టేబుల్‌కు చెందిన ఈ ఇంటిని అద్దెకు తీసుకుని అతడిపైనా తప్పుడు కేసులు పెట్టి బ్లాక్మెయిల్ చేసింది. ఇంటిని ఖాళీ చేయించాలంటూ కోర్టు ఆర్డర్ ఉన్నా హిమాంబీ పట్టించుకోకుండా పోలీసుల పైనే తిరగబడింది. మహిళ కావడంతో పోలీసులు కూడా ఆచితూచి వ్యవహరిస్తూ తమకెందుకులే అని పెద్దగా పట్టించుకోకపోవడంతో హిమాంబీ అరాచకాలు రోజురోజుకు పెరిగిపోయాయి. ఇతర ప్రాంతాల నుంచి అమ్మాయిలను తీసుకువచ్చి కబ్జా చేసిన ఇంట్లోనే దర్జాగా వ్యభిచార గృహాన్ని నిర్వహించింది. పుట్టా రాము హత్యతో తల్లీకూతుళ్ల గుట్టు రట్టయ్యింది. -
హనీట్రాప్ చేసి.. కత్తులతో పొడిచి
బంజారాహిల్స్ (హైదరాబాద్): పాత కక్షల నేపథ్యంలో ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారిని 10 మంది కలిసి దారుణంగా హత్య చేశారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం సింగోటం గ్రామానికి చెందిన పుట్టా రాము (36) గతంలో ఆటోడ్రైవర్‌గా పనిచేశాడు. ఇటీవల రియల్ ఎస్టేట్ రంగంలోకి దిగాడు. కొద్ది రోజులు కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన రాము ఇటీవల బీజేపీలో చేరి వివిధ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నాడు. హైదరాబాద్ చుట్టుపక్కల రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న సమయంలో రాముకు జీడిమెట్లకు చెందిన మణికంఠ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ కలిసి రియల్ఎస్టేట్ లావాదేవీలు చేసేవారు. అయితే వారి మధ్యలో వ్యాపారం విషయంలో గొడవలు జరిగి ఒకరిపై ఒకరు పోలీసు కేసులు కూడా పెట్టుకున్నారు. పరిస్థితులు ముదిరిపోవడంతో రాము హత్యకు మణికంఠ పథకం వేశాడు. గత రెండు రోజుల నుంచి రెక్కీ నిర్వహిస్తున్నాడు. ఈ నెల 5వ తేదీన రాము యూసుఫ్‌గూడలోని ఎల్‌ఎన్‌నగర్‌లో ఉంటున్న విషయం తెలుసుకున్న మణికంఠ బుధవారం రాత్రి 10 గంటల సమయంలో ఓ యువతితో ఫోన్ చేయించి హానీట్రాప్ చేయించాడు. ఆ యువతి ఫోన్‌కాల్ నమ్మిన రాము రాత్రి 10 గంటల సమయంలో ఎల్ఎన్నగర్లోని తన ఇంటికి వచ్చాడు. సరిగ్గా 11.15 గంటలకు మణికంఠతో పాటు బోరబండకు చెందిన జిలానీ అనే రౌడీïÙటర్, మరో ఎనిమిది మంది కలిసి ఇంట్లోకి చొరబడి రామును కత్తులతో 50 పోట్లు పొడిచారు. అరగంట పెనుగులాడిన అనంతరం రాము కన్నుమూశాడు. రామును మర్డర్ చేసిన తరువాత ఆ దృశ్యాలను మణికంఠ ఓ స్నేహితుడికి వీడియో కాల్ చేసి చూపించాడు. రామును హనీట్రాప్ చేసిన యువతిని జూబ్లీహి ల్స్ పోలీసులు విచారిస్తున్నారు. మణికంఠతో పాటు పారిపోయిన మిగతా నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మర్డర్ జరిగిన సమయంలో అక్కడ ఇద్దరు యువతులు కూడా ఉన్నట్లుగా పోలీసులు అను మానిస్తున్నారు. మృతుని భార్య, ఇద్దరు పిల్లలు స్వగ్రా మంలో ఉంటుండగా, విషయం తెలియగానే ఆమె గురువారం జూబ్లీహిల్స్పోలీస్స్టేషన్కు చేరుకుంది. ఆమె ఇచ్చి న ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. -
ఇరవై ఏళ్లకు నా కల నెరవేరింది
‘‘ఒకసారి ఫ్రెండ్స్‌తో కలిసి సినిమా చూస్తున్నప్పుడు నాకు ‘దీపావళి’ కథ ఆలోచన పుట్టింది. పల్లెటూరు, అక్కడి ఓ ముసలి వ్యక్తి, మనవడు, వారు ప్రేమగా పెంచుకునే మేక పిల్ల.. ఈ అంశాలను కనెక్ట్ చేస్తూ భావోద్వేగాలతో ‘దీపావళి’ తీశాను’’ అని దర్శకుడు ఆర్ఏ వెంకట్ అన్నారు. ‘స్రవంతి’ రవికిశోర్ తొలిసారి తమిళంలో నిర్మించిన చిత్రం ‘కీడా’. తెలుగులో ‘దీపావళి’ పేరుతో అనువదించారు. పూ రాము, కాళీ వెంకట్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం ఈ నెల 11న తెలుగు, తమిళ భాషల్లో విడుదలవుతోంది. ఈ సందర్భంగా చిత్రదర్శకుడు ఆర్ఏ వెంకట్ మాట్లాడుతూ– ‘‘మాది తమిళనాడు. 2003లో చెన్నైలో ఆఫీస్ బాయ్‌గా నా జీవితం ప్రారంభించి, అసిస్టెంట్, అసోసియేట్ డైరెక్టర్‌గా చేశాను. దర్శకునిగా ‘దీపావళి’ నా తొలి సినిమా. 20 ఏళ్ల తర్వాత నా కల నిజమైంది. రవికిశోర్‌గారి తొలి తమిళ సినిమాకు నేనే డైరెక్టర్ అని చెప్పుకోవటం ఎంతో గర్వంగా ఉంది. నా తర్వాతి సినిమా కోసం ఎమోషనల్ పాయింట్‌తోనే ఓ కథను సిద్ధం చేస్తున్నాను. రవికిశోర్‌గారికి నచ్చింది. ఈ సినిమాని ఓ స్టార్ హీరోతో చేసే ఆలోచనలో ఉన్నాం’’ అన్నారు. -
ఎంతపని చేశావ్ దేవుడా..! తీవ్ర విషాదం..!!
వికారాబాద్: ఏడుగురు కూతుళ్ల తర్వాత పుట్టిన ఒక్కగానొక్క కుమారుడిని విద్యుత్ ప్రమాదం పొట్టన పెట్టుకున్న విషాదకర సంఘటన వికారాబాద్ జిల్లా దోమ పీఎస్ పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దతండాకు చెందిన నేనావత్ చందర్, జెమినీబాయి దంపతులకు ఏడుగురు కూతుళ్లు, ఒక కుమారుడు సంతానం. కూతుళ్ల వివాహాలను ఘనంగా చేసిన ఆయన.. అందరిలో చిన్నవాడైన కొడుకు రాము(22) పెళ్లి జరిపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాడు. ఇందులో భాగంగా బ్రాహ్మణపల్లిలో కుమారుడి కోసం నూతన గృహాన్ని నిర్మిస్తున్నాడు. ఈ క్రమంలో రాము ఇంటిపై ఉన్న స్టీల్‌రాడ్‌ను కిందికి తీసుకువస్తుండగా పైనున్న హైటెన్షన్ తీగలకు తగిలి విద్యుదాఘాతానికి గురయ్యాడు. క్షణాల్లో ప్రాణాలు విడిచి విగతజీవిగా పడిపోయాడు. చిన్ననాటి నుంచి అల్లారుముద్దుగా చూసుకుంటున్న తమ కుమారుడి మరణాన్ని తట్టుకోలేని చందర్ దంపతులు ఎంత పని చేశావ్ దేవుడా.. అంటూ కన్నీరుమున్నీరయ్యారు. పోస్టుమార్టం నిమిత్తం రాము మృతదేహాన్ని పరిగి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రవిగౌడ్ తెలిపారు. -
స్మశాన వాటికలో పెరిగిన ఓ యువకుడి ప్రేమకథే 'రుద్రంకోట'
అనిల్ ఆర్క కండవల్లి హీరోగా నటించి, నిర్మించిన చిత్రం ‘రుద్రంకోట’. నటి జయలలిత ఓ కీలక పాత్రలో నటించి, చిత్ర సమర్పకురాలిగా వ్యవహరించారు. రాము కోన దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విభీష, రియా హీరోయిన్లు. ఏఆర్కే విజువల్స్ పతాకంపై రూపొందిన ఈ సినిమాని ఈ నెల 22న స్క్రీన్ మాక్స్ పిక్చర్స్ సంస్థ ద్వారా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. హీరో, నిర్మాత అనిల్ ఆర్క కండవల్లి మాట్లాడుతూ– ‘‘స్మశాన వాటికలో పెరిగిన ఓ యువకుడి ప్రేమకథా చిత్రమిది.భద్రాచలం దగ్గర రుద్రంకోట అనే ఊరి నేపథ్యంలో కథ నడుస్తుంది. ప్రముఖ సంగీత దర్శకుడు కోటిగారు మా చిత్రానికి అద్భుతమైన నేపథ్య సంగీతం అందించారు’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: ఆదిమల్ల సంజీవ్, సంగీతం: సుభాష్ ఆనంద్, నిరంజన్. -
ఆటోను ఫైనాన్స్ బాధ్యులు తీసుకువెళ్లారని.. తీవ్ర నిర్ణయం..
భద్రాద్రి: తన ఆటోను ఫైనాన్స్ కంపెనీ బాధ్యులు తీసుకువెళ్లడంతో మనస్తాపానికి గురైన యువకుడు ఉరి వేసు కుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన ఆదివారం మండలంలోని మహదేవపురంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కనపర్తి రాము (22) ఫైనాన్స్ కంపెనీలో ఆటో కొని మహదేవపురం నుంచి మధిర నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అతడికి సుమారు 2 నెలల కిందట వివాహమైంది. ఆటో సరిగా నడవకపోవడం, ఫైనాన్స్ కంపెనీ కిస్తీలు చెల్లించకపోవడంతో వారు ఆటోను తీసుకువెళ్లారు. దీంతో మనస్తాపానికి గురైన రాము ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంటి బయట ఉన్న దూలానికి ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై మధిర టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
హీరోయిన్గా ఎంట్రీ ఇస్తున్న నటి మాలాశ్రీ కూతురు
ప్రముఖ నిర్మాత దివంగత రాము, సీనియర్ నటి మాలా శ్రీ కుమార్తె రాథనా రామ్ హీరోయిన్గా ఎంట్రీ ఇస్తుంది.'చాలెంజింగ్ స్టార్' దర్శన్‌తో కలిసి D56 వర్కింగ్ టైటిల్‌తో పాన్ ఇండియా మూవీగా ఈ సినిమా తెరకెక్కుతుంది.ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత రాక్‌లైన్ వెంకటేష్ తన రాక్‌లైన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. తెలుగు,కన్నడ , మలయాళం, తమిళం, హిందీ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి 'రాబర్ట్' ఫేమ్ తరుణ్ సుధీర రచన, దర్శకత్వం వహిస్తున్నారు. బెంగళూరులోని శ్రీ రవిశంకర్ గురూజీ ఆశ్రమంలో ఈ సినిమాను ప్రారంభించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. కాగా తెలుగులో అనేక సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన మాలాశ్రీ తన అందం, అభినయంతో ఎంతోమంది అభిమానుల్ని సంపాదించుకున్నారు. లేడీ ఓరియెంటెండ్ చిత్రాలతోనూ మెప్పించారు. ఇప్పుడు మాలాశ్రీ కుమార్తె హీరోయిన్గా ఎంట్రీ ఇస్తుండటంతో ఆసక్తి నెలకొంది. ఈ సందర్భంగా మాలాశ్రీ మాట్లాడుతూ.. 'రాధనాకు శుభాకాంక్షలు. ఆమెకు ప్రేక్షకుల ఆశీర్వాదాలు ఉండాలి. రాక్‌లైన్ నా సినిమాతో ప్రొడక్షన్లోని అడుగుపెట్టారు. ఇప్పుడు రాక్‌లైన్ వెంకటేష్ నిర్మిస్తున్న సినిమాతో నా కూతురు నటిగా అరంగేట్రం చేస్తోంది. మంచి టీమ్‌తో ఆమె అరంగేట్రం చేస్తున్నందుకు సంతోషంగా ఉంది. చిన్నప్పటి నుంచి నటి కావాలనుకుంది. ముంబైలో నటన, డ్యాన్స్ నేర్చుకుంది. ఆమె గత కొన్నేళ్లుగా చాలా కష్టపడి పని చేసింది . నా కూతురిగానే కాకుండా తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఏర్పరుచుకోవాలని కోరుకుంటున్నాను' అని పేర్కొన్నారు. -
సమర్థ భావ ప్రసారం.. ఇప్పుడు ప్రాణావసరం!
అర్థవంతమైన కమ్యూనికేషన్ మంచి కాఫీ లాంటిది. ఎందుకంటే, ఆ తర్వాత అది నిద్రపోనివ్వదని పాశ్చాత్యుడన్నా, నిత్య సంచలనశీలికి నిద్రలో కూడా నిద్రపట్టదని మన కవులన్నా అవి ప్రజాభిప్రాయానికి మూలమైన కమ్యూనికేషన్ ప్రభావానికి దర్పణం పట్టే మాటలే. కరోనా విలయతాండవం చేస్తున్న తరుణంలో ప్రాణాలను పణంగా పెట్టి సేవలందిస్తున్న వారికి అభినందపూర్వకంగా కొట్టిన చప్పట్లు, సకారాత్మక భావోద్వేగాలు వెల్లివిరియడానికి వెలిగించిన దీపాలు ఒక వ్యక్తి మదిలో ఆలోచనగా అంకురించి, చిగురించి, మొగ్గతొడిగి, వికసించి అద్భుతమైన భావప్రసారం ద్వారా కోట్లమంది భారతీయులను కర్తవ్యోన్ముఖులను చేశాయి. యావత్ ప్రపంచాన్ని స్తంభింపజేసిన కరోనా వైరస్ వల్ల మానవాళి ప్రాణభయంతో బిక్కుబిక్కున బతుకుతున్న సమయాన ప్రభావశీలమైన ’కమ్యూనికేషన్’ గురించి మాట్లాడుకోవడం సముచితం. విద్యావిషయకంగా చూస్తే విస్తృతార్థంలో కమ్యూనికేషన్ నాలుగు రకాలుగా ఉంటుంది. అవి: ఇంట్రా పర్సనల్ కమ్యూనికేషన్ (వ్యక్తి మనసు లేదా మస్తిష్కం లోలోపల జరిగేది), ఇంటర్ పర్సనల్ (ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగేది), గ్రూప్ (ఒక సమూహపు సభ్యుల మధ్య), మాస్ (జనబాహుళ్యానికి ఉద్దేశించినది). కరోనా కరాళనృత్యం నేపథ్యంలో, ఈ నాలుగు రకాల కమ్యూనికేషన్ ప్రక్రియలను వినియోగించుకోవడం ద్వారా మన శారీ రక, మానసిక ఆరోగ్యాలను కాపాడుకోవడంతో పాటు మన కుటుంబం, సమాజం భయాందోళనల నుంచి బైటపడి మహమ్మారిపై పోరాటంలో విజ యం సాధించడానికి ఉపకరించవచ్చు. ఈ లాక్డౌన్ తెచ్చిన ఖాళీ సమయంలో ఎప్పుడేమి ఉపద్రవం సృష్టిస్తుందో తెలియని మందులేని కరోనా, ధనిక దేశాల్లో సైతం పిట్టల్లా రాలుతున్న జనం, మనదగ్గరా పెరుగుతున్న కేసుల సంఖ్య అందరినీ లోలోపల భయంకరంగా వణికిస్తున్నాయి. అంబులెన్స్ వచ్చినట్లు, ప్రభుత్వం నిర్దేశించిన ఆసుపత్రికి తీసుకుపోయినట్లు, అయినవారికి దూరంగా 14 రోజులు ఆసుపత్రిలో ఉన్నట్లు, వైద్యుల ప్రయత్నాలు విఫలమయినట్లు, ఒకరిద్దరి మధ్యనే అంటరానివాడిగా అంతిమ సంస్కారం జరిగినట్లు...వివిధ భావనలు మస్తిష్కంలో రీలులా తిరగని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. చావు భయం అధికంగా ఉన్నవారికి కరోనా లాంటి పరిస్థితులు మరీ ప్రమాదకరంగా పరిణమించి లేనిపోని రుగ్మతలకు దారితీస్తాయి. అందుకే, ఇలాంటి సమయాల్లో ఎక్కువసేపు ఒంటరిగా ఉండకపోవడం మంచిది. పుస్తక పఠనం, సంగీతం, నాట్యం వంటి ఇష్టమొచ్చిన వ్యాపకంపై దృష్టి మరల్చే ప్రయత్నం చేయాలి. విపరీతమైన నెగెటివ్ వార్తల ప్రభావంతో మనసులో పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తుంటే...తమ అత్యంత సన్నిహితులతో వాటిని పంచుకుని వారి నుంచి ఊరట పొందవచ్చు. ఒంటరిగా ఏదో ఆలోచిస్తూ, శూన్యంలోకి చూస్తూ గడపడాన్ని ఈ సమయంలో తేలిగ్గా తీసుకోకూడదని నిపుణులు సూచి స్తున్నారు. ఒక వ్యక్తి దగ్గర మొదలైన సమాచారం ఒకరి నుంచి మరొకరికి, అక్కడినుంచి మరొకరికి వెళ్ళేసరికి భావ, అర్థ, తాత్పర్యాలు మార్చుకుని వేరే రూపు సంతరించుకుంటుందని కమ్యూనికేషన్ పరి శోధనలు స్పష్టం చేస్తున్నాయి. ఇప్పుడు ఏ ఇద్దరు కలిసినా, చాట్ చేసుకున్నా అప్రయత్నంగా కరోనా గురించి మాట్లాడుకుంటున్నారు. ఇప్పటికే వివిధ దేశాల నుంచి వస్తున్న భయానక సమాచారంతో ఉన్న మనం అప్రయత్నంగా ఆ సమాచారం మన మిత్రుడితో, సహచరుడితో పంచుకోవాలనుకుంటాం. మనవల్ల వేరే వాడిలో నిస్పృహ పెరగకూడదన్న నియమం పెట్టుకుంటే ఏ చింతా ఉండదు. కరోనా వ్యాప్తికి ఒక మతాన్ని తప్పుపట్టడం, వదంతులు వ్యాపింపజేయడం వంటి విద్వేషకారక భావాలను టెలిఫోన్ లేదా సోషల్ మీడియా మాధ్యమంగా సంభాషణ చేసేవారు విశాల సమాజ హితం దృష్ట్యా మొగ్గలోనే తుంచివేయాలి. గ్రూప్ కమ్యూనికేషన్‌తోనే విప్లవాలు వచ్చాయి. సరైన సమయంలో సరైన పదాలతో మాట్లాడే శక్తిసామర్థ్యాలు ఉన్నవారు సమాజంలోని వ్యక్తులను శక్తులుగా మలిచారు, కర్తవ్యోన్ముఖులను చేశారు. ఇప్పుడు వాట్సాప్, పేస్బుక్ వంటి మాధ్యమాల వల్ల గ్రూపులు కట్టడం తేలికైపోయింది. ఫ్యామిలీ, ఫ్రెండ్స్, స్కూల్ మేట్స్, కాలేజ్‌మేట్స్, కొలీగ్స్‌తో పాటు ఒకే అభిరుచి ఉన్నవారు సైతం ఒక గ్రూపుగా ఏర్పడి నిరంతరాయంగా భావ విని మయం సాగిస్తున్నారు. గ్రూప్ మొత్తానికి ఉత్తేజపూరితమైన, ఉత్సాహకారకమైన, ఉల్లాసభరితమైన సమాచారం పంచుకోవడం అభిలషణీయం. సకారాత్మక ఒక ఆలోచన లేదా ఒక సృజనాత్మక కథనం మొత్తం గ్రూపు సభ్యుల మనసుకు ఊరట కలిగించవచ్చు. పెను విషాదాన్ని మానవాళి మౌనంగా భరిస్తున్న దుర్భర రోజులివి. ఈ కాలంలో తిమిర సమానమైన నిరాశానిస్పృహలను పారదోలి విషాదంలో మునిగి ఉన్న ప్రజలకు వెలుగు దివ్వెలు చూపాలనే సత్సంకల్పం ముఖ్యం. అందుకే తెలం గాణ ముఖ్యమంత్రి ప్రజల కోసం రచనలు చేయండని కవిలోకాన్ని ప్రత్యేకంగా అభ్యర్థించారు. ఇప్పటికే పత్రికల్లో, సోషల్ మీడియా వేదికల్లో అనేక కవితలు జనం ముంగిటికి వచ్చాయి. కళాకారులు రాగయుక్తంగా ప్రజలకు బోధలు చేస్తూ, సంఘ సేవకులను ప్రస్తుతిస్తూ వీడియోలు రిలీజ్ చేస్తూ చైతన్యపరుస్తున్నారు. ఈ కరోనా కాలంలో మంచి రచనలు జన బాహుళ్యానికి ఉత్సాహం, ఉత్తేజం ఇస్తాయి. ఈ వైరస్ మిగిల్చే విషాదం ఇంకా కొన్ని నెలలు ఉంటుంది. మంచి సాహిత్యం అవసరం ఎప్పుడూ ఉంటుంది. ఒక్క మంచి మాట వెయ్యిన్నొక్క మస్తిష్కాలకు ఉత్ప్రేరకమని అంటారు. కరోనా పీడిత పలు దేశాల్లో ప్రజల మానసిక ఆరోగ్యం బాగా దెబ్బతిని, భీతావహులైన సున్నిత మనస్కులను ఆత్మహత్యలవైపు పురికొల్పుతున్నదని వస్తున్న బాధాకర వార్తల నేపథ్యంలో విద్యావంతుడైన ప్రతి వ్యక్తీ బాధ్యతతో ఈ నాలుగు రకాల భావ ప్రసరణ విధానాలను సమాజ సాంత్వన సాధనాలుగా వాడుకోవాలి. బాధ్యతాయుతమైన భావ ప్రసారం....ఇప్పుడు తక్షణావసరమే కాదు ప్రాణావసరం కూడా. డాక్టర్ ఎస్.రాము వ్యాసకర్త అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియాలో శిక్షకుడు -
ఆక్టోపస్ పోలీసుల వీరంగం, ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్ :ఆదిభట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఆక్టోపస్ పోలీసులు మద్యం మత్తులో గతరాత్రి వీరంగం సృష్టించారు. తినేందుకు హోటల్‌కు వచ్చిన కానిస్టేబుల్స్.. పక్క టేబుల్‌పై ఉన్న రాము అనే యువకుడిపై అకారణంగా దాడికి పాల్పడ్డారు. తనను ఎందుకు వేధిస్తున్నారంటూ ఆ యువకుడు ప్రశ్నించగా, తమనే ప్రశ్నిస్తావా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రతాపం చూపించారు. అంతేకాకుండా అడ్డు వచ్చినవారిని కూడా... కానిస్టేబుల్స్ చితకబాదారు. ఈ ఘటనపై బాధితుడు ఆదిభట్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. అయితే ఇప్పటివరకూ పోలీసులు వారిపై కేసు నమోదు చేయలేదని రాము ఆరోపిస్తున్నాడు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
మద్యం మత్తులో డ్రెయిన్‌లో దూకేశాడు..
పశ్చిమగోదావరి ,భీమవరం టౌన్: ఉధృతంగా ప్రవహిస్తున్న యనమదుర్రు డ్రెయిన్‌లోకి భీమవరంలోని చిన్నవంతెన పైనుంచి మద్యం మత్తులో నక్కా రాము అనే వ్యక్తి ఆదివారం ఉదయం సుమారు 11 గంటల సమయంలో దూకేశాడు. ఇది చూసిన స్థానికులు వెంటనే అగ్నిమాపక దళ కేంద్రానికి సమాచారం అందించారు. ఫైర్ ఆఫీసర్ ఎస్కే జాన్అహ్మద్ ఆధ్వర్యంలో సిబ్బంది బాల ఏసు, సుబ్బారావు, వెంకటరత్నం, వై.సుబ్బరాజు అక్కడికి చేరుకున్నారు. తాడు సహాయంతో రామును బయటకు తీసుకువచ్చేందుకు శ్రమించారు. మద్యం మత్తులో ఉన్న అతను తాడును పట్టుకుని కొంతమేర పైకి లాగిన తర్వాత వదిలేయడంతో మళ్లీ అతన్ని రక్షించేందుకు అగ్నిమాపక సిబ్బంది చెమటోడ్చారు. ఎట్టకేలకు రక్షించగలిగారు. డీఎన్నార్ కాలువగట్టు సమీపంలో నివశిస్తున్న అతను తనకు ఏవో కష్టాలు ఉన్నాయని మద్యం మత్తులో ఉండి చెబుతున్నాడు. చివరకు అతన్ని కుటుంబ సభ్యులకు అప్పగించి ఊపిరి పీల్చుకున్నారు. -
ఈ రాముడు..ఏకలవ్యుడు
కంక బొంగులకు ప్రాణం పోస్తే.. సిమెంటు, ఇసుకకు ఓ ఆకృతినిస్తే.. బొమ్మలు మాట్లాడుతాయి.. ప్రతిమలు మనుసులను ఆకర్షిస్తాయి. ఏకలవ్యుడి చేతిలో ప్రాణం పోసుకున్న కళాకృతుల్ని చూస్తే అబ్బా ఏం కళ అనకుండా ఉండరంటే నమ్మండి. అంత కళ ఉన్నప్పటికీ కొలాం గిరిజన యువకుడికి తగిన ప్రోత్సాహం లభించట్లేదు. తగిన ప్రోత్సామందిస్తే మరింతమందికి ఉపాధి కల్పిస్తానని ఆ యువకుడు పేర్కొంటున్నాడు. నార్నూర్(ఆసిఫాబాద్): నార్నూర్ మండలం ఖైర్‌డట్వా గ్రామ పంచాయతీ పరిధిలోని నడ్డంగూడ గ్రామానికి చెందిన మాడవి రాము అద్భుతమైన కళాకృతులకు ప్రాణం పోస్తూ స్ఫూర్తిగా నిలుస్తున్నారు. రాము పదో తరగతి వరకు నార్నూర్ మండలంలోనే అభ్యసించాడు. అనంతరం ఆర్థిక స్థోమత లేక ఉన్నత విద్యను అభ్యసించలేదు. తల్లిదండ్రులతో అడవికి వెళ్లి వెదురు తెచ్చుకుని వారు తయారు చేసే చాపలు, బుట్టలు, తడకలు తదితర రూపాలను రాము సైతం నేర్చుకున్నాడు. ప్రతిభ బయటికొచ్చిందిలా.. కొన్నేళ్ల క్రితం పొలాల అమావాస్య నాడు ఎడ్ల పూజలకు రకరకాల అలంకార వస్తువులను రాము తల్లిదండ్రులు తీసుకువచ్చారు. ఆ కాగితాలు, దేవుళ్ల చిత్రాలను రాము అందంగా తయారు చేశాడు. అదే సమయంలో కట్టెలతో తయారు చేసిన ఎడ్ల జత ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గ్రామంలోని దేవాలయంలో తాను తయారు చేసిన ఎడ్ల జతను దేవాలయంలో ప్రదర్శనకు ఉంచాడు. అంతే కాకుండా దేవాలయంలోని గోడలపై వివిధ బొమ్మలు వేశాడు. అతడి ప్రతిభ గుర్తించిన ఇరుగు పొరుగు తమ ఇళ్లకు కూడా బొమ్మలు వేయాలని ఆఫర్ ఇచ్చారు. ఆ రోజు నుంచే తన జీవితం మారిపోయిందని రాము చెప్పకొస్తున్నాడు. మరుసటి రోజు నుంచే అలా ఇళ్ల గోడలపై బొమ్మలు వేయడం ప్రారంభించానని, భరతమాత, గాంధీజీ, అంబేద్కర్, బుద్ధుడు, శ్రీరాముడు, బాలాజీ, శివుడు ఇలా చిత్రాలు వేసి రోజుకు రూ. 500 చొప్పున కూలీ సంపాదించానని రాము చెబుతున్నాడు. విగ్రహాల తయారీతో ఉపాధి.. రాముకు ఒక ఆలోచన రావడంతో సుత్తితో హనుమంతుడిని చిన్న ప్రతిమ చెక్కడం మొదలు పెట్టాడు. దాన్ని చూసిన ఖండోరాంపూర్ గ్రామానికి చెందిన నాగోరావు అనే రేషన్ డీలర్ మాకు సంత్ తుక్డోజీ మహారాజ్, గాంధీజీ విగ్రహాలు కావాలని కోరడంతో సిమెంట్, కాంక్రిట్, ఇనుప చువ్వలతో రెండు విగ్రహాలను తయారు చేసి రాము రూ, 10 వేలు పారితోషికం పొందాడు. అప్పటి నుంచి రాము ప్రతిమల్ని తయారు చేయడం ప్రారంభించాడు. తాను ఎవరి దగ్గరా శిక్షణ తీసుకోకుండా ఏకలవ్యుడిగా పేరు తెచ్చుకున్నాడు. అర్డర్లు చాలానే వస్తున్నాయని, కొన్ని విగ్రహాలకు కావాల్సిన పని ముట్లు, మిషన్లు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని రాము పేర్కొంటున్నాడు. వెదురుతో క్రాప్ట్:నడ్డంగూడ గ్రామానికి చెందిన వికలాంగుడు ఆత్రం జలపత్రావు సహాయంతో రాము వెదురుతో రకరకాల వస్తువులను తయారు చేస్తున్నారు. ఇంట్లో వాడే దగ్గరి నుంచి కూర్చీలు వరకు వెదురుతో తయారు చేసి అందరికీ అదర్శంగా నిలుస్తున్నారు. ఆయన దగ్గర ఎలాంటి సామగ్రి లేకున్న సొంత తెలివితేటలతో వస్తువులను తయారు చేస్తున్నాడు. వెదురుతో ఎడ్ల బండి, ఎద్దులు, తాజ్‌మహాల్, స్టాండ్లు, బొమ్మలు, సెల్‌ఫోన్ స్టాండ్లు తదితర వస్తువులను తయారు చేస్తున్నారు. వీటిని ఆదిలాబాద్ లేదా హైదరబాద్ తీసుకెళ్లి అమ్ముతున్నారు. వసువులు తయారీకై ఎలాంటి పనిముట్లు తమ వద్ద లేవని, ఐటీడీఏ ద్వారా సామగ్రిని అందజేస్తే మరింత మందికి ఉపాధి కల్పిస్తామని ఆయన అంటున్నారు. ఐటీడీఏ అధికారులతో పాటు కలెక్టర్ స్పందించి కొలాం గిరిజనులను ప్రోత్సహించాలని వారు కోరుతున్నారు. యువతకు నేర్పిస్తా నేను స్యయంగా నేర్చుకుని శిల్పా కళతో కుటుంబాన్ని పోషిస్తున్నా. శిల్పాలను సుత్తితో చెక్కడం చాలా కష్టంగా ఉంది. ఐటీడీఏ ద్వారా ప్రభుత్వం ఏదైనా సహాయం చేస్తే మిషన్లు కొనుక్కుని తక్కువ సమయంలో అందమైన శిల్పాలను చెక్కుతా. నేను ఉపాధి పొందుతూ మరో పది మందికి ఉపాధి కల్పిస్తా.– మాడవి రాము, నడ్డంగూడ, నార్నూర్ -
యడ్లపాడులో విషాదం
యడ్లపాడు: గుంటూరు జిల్లా యడ్లపాడులో విషాదం చోటు చేసుకుంది. తన ఇద్దరు కుమారులతో ఓ తల్లి యడ్లపాడు పరిధిలో ఎన్ఎస్పీ కాలువ సమీపంలోని బావిలో ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ కలహాల కారణంగానే పసిబిడ్డలతో కలసి ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఘటనాస్ధలికి చేరుకున్న పోలీసులు.. మృతులను కోడిరెక్క భూలక్ష్మి(25), ఆమె కుమారుడు రాము(4), కుమార్తె అఖిల(3)లుగా గుర్తించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. -
మరణంలోన వీడని బంధం
- రోడ్డు ప్రమాదంలో మామా, అల్లుడి దుర్మరణం - మరొకరికి తీవ్ర గాయాలు, పరిస్థితి విషమం - బైక్‌పై వెళ్తుండగా స్కార్పియో ఢీకొన్న ఫలితం మరణంలోన వీడని బంధం నిజమే. దానికి బంధాలు.. అనుబంధాలతో పని లేదు. ఎవరిని ఎప్పుడు ఎలా ఏ రూపంలో కబళిస్తుందో అంతుబట్టదు. ఇప్పుడు అదే జరిగింది. బైక్‌పై బయలుదేరిన మామా అల్లుడ్ని స్కార్పియో రూపంలో మృత్యువు కబళించింది. ఒకేసారి ఇద్దర్ని బలిగొంది. దీంతో రెండు కుటుంబాల్లో అంతులేని విషాదం నెలకొంది. - సోమందేపల్లి (పెనుకొండ) హైదరాబాద్ - బెంగళూరు 44వ నంబర్ జాతీయ రహదారిలోని సోమందేపల్లి మండలం పేటకుంట సమీపంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గోరంట్ల మండలం బెల్లాలచెరువుకు చెందిన అంజనరాజు(32), అతని మామ రాము(50) దుర్మరణం చెందగా, జానకిరాముడు(30) తీవ్రంగా గాయపడ్డారు. పైన పేర్కొన్న ముగ్గురూ కలసి బైక్‌లో సోమందేపల్లికి బయలుదేరగా తమిళనాడు రాష్ట్రం తిరువూరుకు చెందిన స్కార్పియో వాహనం అనంతపురం వైపు వస్తూ బైక్‌ను వెనుక వైపు నుంచి ఢీకొంది. దీంతో బైక్ డివైడర్‌ను ఢీకొని 20 అడుగుల దూరంలోకి దూసుకెళ్లింది. ఘటనలో అంజనరాజు అక్కడికక్కడే మరణించగా, రామును బెంగళూరుకు తరలిస్తుండగా మృతి చెందినట్లు ఎస్ఐ ప్రసాద్ తెలిపారు. జానకిరాముడు తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నాడు. అతని పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు సమాచారం. మామను వదిలొద్దామని బయలుదేరి... సోమందేపల్లికి చెందిన రాము చేనేత కార్మికుడు. తన కుమార్తె శిరీషను ఏడాదిన్నర కిందట అంజనరాజుకు ఇచ్చి పెళ్లి చేశాడు. ఆమె పుట్టింటికి వచ్చింది. సొంత పనిపై బెల్లాలచెరువుకు వెళ్లిన రాము అక్కడ పని ముగించుకుని సోమందేపల్లికి బయలుదేరాడు. దీంతో మామను ఇంట్లో వదిలి, తరువాత తన భార్యను పిల్చుకొద్దామని భావించిన అంజనరాజు మామతో పాటు జానకిరాముడుతో కలసి బైక్‌లో బయలుదేరారు. ఊహించని విధంగా మార్గమధ్యంలో స్కార్పియో రూపంలో మృత్యువు మామా అల్లుడ్ని మృత్యు ఒడికి చేర్చింది. ఒకేసారి ఇద్దరిని కోల్పోయిన ఆ కుటుంబాలు తల్లడిల్లిపోయాయి. కాగా అనంతరాజుకు 7 నెలల బాబు ఉన్నాడు. -
పిల్లలందరికీ ‘అల్బెండజోల్’ అందించాలి
► జిల్లా వైద్యాధికారి జలపతినాయక్ ► నేడు జిల్లావ్యాప్తంగా మాత్రల పంపిణీ నిర్మల్ రూరల్ : జాతీయ నులిపురుగుల నిర్మూలన దినం సందర్భంగా శుక్రవారం జిల్లాలో నులిపురుగులను నివారిం చేందుకు పిల్లలందరికీ అల్బెండజోల్ మాత్రలు అందిస్తున్నామని డీఎంహెచ్‌వో జలపతినాయక్ అన్నారు. స్థానిక జిల్లా వైద్యశాఖాధికారి కార్యాలయంలో ఆయన గురువారం విలేకరులతో మాట్లాడారు. తప్పనిసరిగా పిల్లలందరికీ ఈ మాత్రలు చేరేలా ఏర్పాట్లు పూర్తి చేశామన్నా రు. ఇప్పటికే సిబ్బందికి శిక్షణ ఇచ్చామని చెప్పారు. 19ఏళ్ల లోపు వారికి.. ప్రతీ 100మంది పిల్లలో 68మంది పిల్లలు నులిపురుగులతో బాధపడుతున్నారని జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి (డీఐఓ) రాము తెలిపారు. కలుషిత ఆహారం, తాగునీరు తీసుకోవడం, తినేముందు, మలమూత్ర విసర్జనల తర్వాత చేతులు సబ్బుతో శుభ్రం చేసుకోకపోవడంతో పిల్లల కడుపులో నులిపురుగులు, నట్టలు తయారవుతాయన్నారు. వీటితో పిల్లలు శారీరకంగా, మానసికంగా ఎదగరని, ఎప్పుడూ సుస్తిగా ఉంటారన్నారు. వీటితో రక్తహీనత, ఎదుగుదల లోపం కూడా ఉంటుందన్నారు. ఒక ఏడాది నుంచి 19ఏళ్ల పిల్లల వరకు ఇవి కనిపిస్తాయని చెప్పారు. వీటి నివారణకు అల్బెండజోల్ మాత్రను ప్రతీ ఆరునెలలకొకటి చప్పరిస్తే సరిపోతుందన్నారు. ఎవరికీ ఎలా అంటే.. నులిపురుగుల నిర్మూలనకు అల్బెండజోల్ మాత్రను మధ్యాహ్న భోజనం తర్వాత చప్పరించాలని డీఐవో పేర్కొన్నారు. ఆర్నెళ్లకోసారి ఒక మాత్రను మాత్రమే చప్పరించాలన్నారు. రెండేళ్లలోపు పిల్లలకు సగం మాత్రను దంచి పొడిగా చేసి గ్లాసు నీళ్లలో కలిపి తాగించాలన్నారు. రెండేళ్లపై నుంచి 19ఏళ్ల వరకు పిల్లలకు ఒక మాత్ర ఇవ్వాలన్నారు. వీటిని మింగకుండా చప్పరించేలా చూడాలని స్పష్టంచేశారు. జాతీయ నులిపురుగుల నిర్మూలన దినంలో భాగంగా శుక్రవారం జిల్లాలో 2లక్షల 14వేల 500మంది పిల్లలకు మాత్రలు అందిస్తున్నామన్నారు. ఇప్పటికే అన్ని పాఠశాలలు, అంగన్ వాడీలు, కళాశాలలకు మాత్రలను చేరవేశామని చెప్పారు. శుక్రవారం వేసుకోని పిల్లలకు ఈనెల 15న వేయించాలని పేర్కొన్నారు. -
డీఎస్పీ ఆఫీసు ఎదుట ఒకరి ఆత్మహత్యాయత్నం
ఫిర్యాదును ఎస్ఐ పట్టించుకోవడంలేదని.. అనంతగిరి: వికారాబాద్ డీఎస్పీ కార్యాలయం ఎదుట ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటన సోమవారం మధ్యాహ్నం జరిగింది. వికారాబాద్ జిల్లా యాలాల మండలం రాస్నం గ్రామానికి చెందిన రాములుకు అదే గ్రామానికి చెందిన కొందరితో పదిరోజుల క్రితం గొడవ జరిగింది. ఈ ఘటనలో ఆయన గాయపడ్డాడు. ఈ విషయమై రాములు యాలాల ఠాణాలో ఫిర్యాదు చేయడానికి వెళ్తే సంబంధిత ఎస్ఐ పట్టించుకోకుండా దుర్భాషలాడాడు. దీంతో మనస్తాపం చెందిన రాములు సోమవారం మధ్యాహ్నం వికారాబాద్ డీఎస్పీ కార్యాలయానికి వచ్చాడు. తన సమస్యను డీఎస్పీ దృష్టికి తీసుకెళ్లకుండానే అక్కడ సిబ్బంది చూస్తుండగా తనతో తెచ్చుకున్న పురుగులమందు తాగాడు. గమనించిన సిబ్బంది విషయం డీఎస్పీ స్వామి దృష్టికి తీసుకెళ్లారు. ఆయన సూచన మేరకు వెంటనే అతడిని వికారాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. రాములును చికిత్స అనంతరం ఇంటికి పంపించారు. -
హెచ్ఎల్సీలో బాలుడి గల్లంతు
గార్లదిన్నె : గార్లదిన్నె మండలం పెనకచర్ల డ్యాం గ్రామానికి చెందిన చాకలి లక్ష్మిదేవి, నరసింహులు దంపతుల కుమారుడు రాము(16) హెచ్ఎల్సీలో పడి గల్లంతయ్యాడు. పోలీసుల కథనం ప్రకారం... తల్లిదండ్రులతో కలసి హెచ్ఎల్సీ కాలువలో దుస్తులు ఉతికేందుకు బుధవారం వెళ్లిన బాలుడు ప్రమాదవశాత్తు కాలుజారి కాలువలో పడి, నీటి ప్రవాహానికి కొట్టుకుపోయాడు. అవతలి వైపు గట్టునున్న పశువుల కాపర్లు గమనించి గట్టిగా కేకలు వేయడంతో రాము తల్లిదండ్రులు అప్రమత్తమయ్యారు. అందరూ కలసి రాము కోసం గాలించారు. అయినా అతని ఆచూకీ దొరకలేదు. ఉన్న ఏకైక కుమారుడు ఇలా కళ్లెదుటే నీటిలో కొట్టుకుపోవడంతో ఆ వృద్ధ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. తమ బిడ్డ ఆచూకీ తెలపాలని అందరినీ వేడుకున్నారు. సమాచారం అందుకున్న ఎస్ఐ శ్రీనివాసులు వెంటనే ఈతగాళ్లతో కాలువ వద్దకు చేరుకున్నారు. సాయంత్రం వరకు గాలించినా బాలుడిని కనుగొనలేకపోయారు. -
సెల్ఫీ సరదా.... ముంచేసింది!
మెదక్: సెల్ఫీ సరదా కోసం యువకులు ప్రాణాలను సైతం లెక్కచేయడం లేదు. ప్రమాదమని తెలిసినా సరదా కోసం సెల్ఫీలు దిగడం, అనంతరం సెల్ఫీ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేయడం ఇటీవల సర్వసాధారణమైపోయింది. సెల్ఫీపై మోజుతో ఇద్దరు యవకులు ఉధృతంగా ఉన్న నీటి ప్రవాహంలో గల్లంతైన ఘటనలు పటాన్‌చెరులోని పెద్దవాగు, జిన్నారంలోని అక్కమ్మ చెరువు అలుగు వద్ద బుధవారం చోటుచేసుకున్నాయి. పెద్దవాగులో వేణు అనే యువకుడు చిక్కుకపోగా, జిన్నారంలోని అక్కమ్మ చెరువు అలుగు వద్ద సెల్ఫీ దిగుతుండగా రాము (24) అనే యువకుడు కొట్టుకపోయాడు. స్థానికుల సమాచారంతో అధికారులు వేణుని రక్షించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. హెలికాప్టర్ తెప్పించేందుకు అధికారులు ప్రయత్నాలు ప్రారంభించారు. గల్లంతైన రాము అనే యువకుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. -
కుత్బుల్లాపూర్ లో యువకుడి ఆత్మహత్య
- తండ్రి మందలించడంతో ప్రాణాలు తీసుకున్న యువకుడు కుత్బుల్లాపూర్ తాగి ఇంటికి వస్తున్న కొడుకును తండ్రి మందలించడంతో మనస్తాపానికి గురై ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన పేట్ బషీరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. కొంపల్లి లంబాడీ బస్తీలో నివాసముండే రాము కుమారుడు రాజేష్(20) హమాలీ పనులు చేస్తుంటాడు. ప్రతినిత్యం తాగి ఇంటికి వస్తుండడంతో తండ్రి అతన్ని మందలించాడు. దీంతో మనస్తాపానికి గురైన రాజేష్ మంగళవారం రాత్రి 7.30 గంటల సమయంలో తలుపులు వేసుకుని ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అర్ధరాత్రి విషయాన్ని గమనించిన తల్లిదండ్రులు తలుపులు బద్దలకొట్టి లోనికి వెళ్లి చూడగా అప్పటికే మృతి చెంది ఉన్నాడు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
పచ్చకామెర్లతో దంపతుల మృతి
-
రాములు సేవలు చిరస్మరణీయం
కోహీర్: వీఆర్వోగా రాములు మండల ప్రజలకు అందించిన సేవలు చిరస్మరణీయమని పలువురు వక్తలు కొనియాడారు. కోహీర్ పట్టణంలోని భారత్ ఫంక్షన్హాల్లో ఆదివారం సాయంత్రం నిర్వహించిన ఉద్యోగ విరమణ వీడ్కోలు సమావేశంలో ఆయనను శాలువాలు పూలమాలలతో సన్మానం చేశారు. తహశీల్దార్ బి.గీత మాట్లాడుతూ రాములు అకింతభావంతో పనిచేసి ఇతర వీఆర్వోలకు ఆదర్శవంతంగా నిలిచారని పేర్కొన్నారు. ఎంపీపీ జంపాల అనిత మాట్లాడుతూ విధుల విషయంలో రాజీపడలేదన్నారు. పేద ప్రజలకు ఎన్నో సేవలు అందించారన్నారు. అనంతరం ఆత్మ కమిటీ చైర్మన్ రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ కోహీర్ మండలం ఖానాపూర్ గ్రామానికి చెందిన రాములు ఆయన పూర్తి కాలం మండల ప్రజలకు సేవలు అందించి ఇక్కడే పదవి విరమణ పొందడం అరుదైన సంఘటనగా అభివర్ణించారు. కార్యక్రమానికి డిప్యూటీ తహసీల్దార్ చంద్రశేఖర్‌రావు అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో ఎంపీపీ ఉపాధ్యక్షులు ఎస్కే జావేద్, కోఆప్షన్ సభ్యులు అశ్రఫ్, మాజీ జెడ్పీటీసీలు అరవింద్‌రెడ్డి, నర్సింహులు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రామలింగారెడ్డి, కోహీర్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శంశీర్ అలీ, సర్పంచ్‌లు అడివి రెడ్డి, రాందాస్, అంజయ్య, ఎంపీటీసీలు రాజు, సురేందర్, సీనియర్ నాయకులు బస్వరాజ్ పాటిల్, గోవర్ధన్‌రెడ్డి, సాయిలు, సురేందర్‌రెడ్డి, అనిల్‌కుమార్, రెవెన్యూ సంఘాల నాయకులు, మండల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. -
హత్య కేసులో ముగ్గురికి యావజ్జీవం
కర్నూలు జిల్లా బండిఆత్మకూరు మండలం పడమటూరు గ్రామానికి చెందిన ఒక యువకుడి హత్య కేసులో ముగ్గురికి యావజ్జీవ జైలు శిక్ష పడింది. పోలీసుల కథనం.. గ్రామానికి చెందిన మనోహర్ అనే యువకుడితో బోయ రాములు కుమార్తె సన్నిహితంగా ఉంటోంది. ఇది నచ్చని రాములు మనోహర్‌ను చంపేందుకు పథకం పన్నాడు. ఈ మేరకు 2013లో మార్చి 2వ తేదీన అతడిని పొలం వద్దకు పిలిపించాడు. రాములుతోపాటు గ్రామానికి చెందిన సుబ్బారాయుడు, విజయ్ కలిసి మనోహర్‌ను విపరీతంగా కొట్టి చంపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు కోర్టులో చార్జిషీటు దాఖలు చేశారు. విచారణ చేపట్టిన నంద్యాల మూడో అదనపు జిల్లా జడ్జి ప్రియదర్శిని నేరం రుజువు కావటంతో నిందితులు ముగ్గురికీ యావజ్జీవ జైలు శిక్ష ఖరారు చేస్తూ బుధవారం సాయంత్రం తీర్పునిచ్చారు. -
పెళ్లి వాహనం ఢీకొని వ్యక్తి మృతి
రంగారెడ్డి జిల్లా కుల్కచర్ల మండలం రాంపూర్ గ్రామం వద్ద పెళ్లి కుమార్తె వాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. రాంపూర్ గ్రామానికి చెందిన ఓ యువతికి పక్కనే ఉన్న మరో గ్రామ యువకుడితో శుక్రవారం వివాహం జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో వధువును గురువారం అర్ధరాత్రి సమయంలో కారులో బంధు, మిత్రుల నృత్యం మధ్య తీసుకెళుతున్నారు. ఈ క్రమంలో డ్రైవర్ కారును నిలిపి కిందకు దిగి తాను కూడా డ్యాన్స్ వేయడం ప్రారంభించాడు. ఇదే సమయంలో మద్యం సేవించి ఉన్న ఒక వ్యక్తి కారులోకి ఎక్కి దాన్ని ఒక్కసారిగా ముందుకు పోనిచ్చాడు. తిరుపతి అనే వ్యక్తిపైకి దూసుకుపోవడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. రాములు, వెంకటయ్య అనే ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. -
నల్లగొండ జిల్లాలో దారుణ హత్య
నల్లగొండలో దారుణం చోటుచేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో అల్లుడే మామను రోకలి బండతో మోది చంపాడు. ఈ సంఘటన జిల్లాలోని మఠంపల్లి మండలం ఉమ్లాతండాలో చోటుచేసుకుంది. తండాకు చెందిన భూక్య రాములు(60) కూతురికి జామ్లతండాకు చెందిన భానోతు సైదులుతో కొన్నేళ్ల క్రితం వివాహమైంది. గత కొన్ని రోజులుగా మామా అల్లుళ్ల మధ్య వివాదాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఈ రోజు రాములు తన అల్లుడు సైదులు ఇంటి ఎదురుగా నిలబడి.. దూషిస్తూ.. అతని ఇంటిపై రాళ్లు విసిరాడు. దీంతో కోపోద్రిక్తుడైన సైదులు పక్కనే ఉన్న రోకలిబండతో అతని తలపై బలంగా మోదాడు. దీంతో అతను అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
విద్యుదాఘాతంతో ఇద్దరి మృతి
మెదక్ జిల్లా కోహిర్ మండలం నాగిరెడ్డిపల్లి గ్రామంలో బుధవారం విద్యుదాఘాతంతో ఇద్దరు మృతి చెందారు. గ్రామం శివారులో ఓ వ్యక్తి పొలంలో మోటార్ చెడిపోయింది. దాన్ని బాగు చేసే క్రమంలో రాములు (30), మంగలి లక్ష్మయ్య (25) బొరుబావి నుంచి పైపులను పైకి తీస్తున్నారు. ఆ పైపులు పైనుంచి వెళుతున్న విద్యుత్ తీగలను తాకడంతో విద్యుత్ ప్రసారమై షాక్‌తో మృతి చెందారు. -
మహిళ అదృశ్యం
హైదరాబాద్ నగరం కుషాయిగూడలో ఓ మహిళ అదృశ్యమైంది. ఈమేరకు ఆమె తండ్రి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. హెచ్ బీ కాలనీకి చెందిన శ్రీదివ్య కనిపించ కుండా పోయింది. దీంతో తండ్రి రాములు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదుచేసుకుని విచారణ చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
కొడుకుతో కలిసి భర్తకు నిప్పు పెట్టింది...
రంగారెడ్డి జిల్లా యాలాల మండలం అక్కంపల్లి గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. బుధవారం రాత్రి 12 గంటల సమయంలో ఇంట్లో నిద్రిస్తున్న రాములు(60) అనే వృద్ధుడిపై అతని భార్య సావిత్రమ్మ, కుమారుడు ఆంజేయులు కలిసి కిరోసిన్ పోసి నిప్పంటించారు. తీవ్రగాయాలపాలైన రాములు అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సావిత్రమ్మను, ఆంజనేయులను అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కాగా.. హత్యకు గల కారణాలు తెలియరాలేదు. -
విద్యుదాఘాతానికి రైతు బలి
ట్రాన్స్ ఫార్మర్ పై ఫీజ్ వేయడానికి ప్రయత్నించిన రైతు విద్యుదాఘాతానికి గురై మృతిచెందాడు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా తుంగతూర్తి మండలం బండరామారం గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రాములు(45) అనే వ్యక్తి వ్యవసాయ బావి వద్ద ఉన్న ట్రాన్స్ ఫార్మర్ ఫీజ్ వేయడానికి యత్నిస్తుండగా.. ప్రమాద వశాత్తు షాక్ కొట్టింది. దీంతో రైతు అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
నల్గొండ జిల్లా డిండి మండలం వావిలకూరు గ్రామానికి చెందిన రాములు(42) అనే రైతు అప్పులబాధతో ఆత్మహత్య చేసుకున్నాడు. వరుసగా పంట నష్టం వస్తుండడంతో అప్పులోళ్ల వత్తిడి ఎక్కువై సోమవారం ఉదయం ఇంట్లోనే పురుగులమందు తాగి ఆత్మహ్త్య చేసుకున్నాడు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. -
మిస్టరీగా మారిన మెడికో ఆత్మహత్య
-
మిస్టరీగా మారిన మెడికో ఆత్మహత్య
► సినిమా కథను తలపిస్తున్న మెడికో కేసు ► అన్నీ అంతుబట్టని రహస్యాలే అనంతపురం: అనంతపురం శ్రీనివాసనగర్‌లో జరిగిన మెడికో మీనాక్షి(అసలు పేరు మంజుల)ఆత్మహత్య కేసు మిస్టరీగా మారింది. ఈ కేసులో ఎన్నో చిక్కుముడులు.. అచ్చం సినిమా కథను పోలిన ఈ ఉదంతంలో లోతుగా పోయేకొద్దీ విస్తుపోయే అంశాలు వెలుగు చూస్తున్నాయి. అందరినీ ఆశ్చర్యానికి, విస్మయానికి గురి చేస్తున్నాయి. ఎవరీ మంజుల..? బెంగళూరుకు చెందిన మీనాక్షిగా భావించిన ఆమె అసలు పేరు మంజుల అని తెలిసింది. ఆమెది బెంగళూరు కాదని, పుట్టపర్తి మండలం బత్తలపల్లికి చెందిన వడ్డే రంగమ్మ, మారెన్న దంపతుల మూడో సంతానంగా వెల్లడైంది. ఐదేళ్ల కిందట అదే గ్రామానికి చెందిన రాము చౌదరి అనే వ్యక్తి మంజులను ప్రేమించి ఇంటి నుంచి తీసుకొచ్చాడు. అప్పటి నుంచి మూడేళ్ల వరకు మంజుల ఆచూకీ కుటుంబ సభ్యులకు కూడా తెలియదు. ఆ తరువాత తాను బెంగళూరులో డాక్టర్ కోర్సు(మెడిసిన్) చదువుతున్నాని మంజుల తల్లిదండ్రులకు ఫోన్లో తెలిపింది. త్వరలో ఇంటికొస్తానని కూడా చెప్పినట్లు తమతో చెప్పినట్లు ఆమె తండ్రి తెలిపారు. అసలీ శ్రీనివాస్ చౌదరి ఎవరంటే? పుట్టపర్తి మండలం రాయలవారిపల్లికి చెందిన సుబ్బమ్మ, వెంకటప్ప దంపతుల కుమారుడే శ్రీనివాస్ చౌదరి. 20 ఏళ్ల కిందట అతను బతుకుదెరువు కోసం అనంతపురానికి వచ్చాడు. మొదట ఆర్టీసీ బస్టాండ్‌లో క్యాంటిన్ నిర్వహించేవాడు. తర్వాత రైల్వేస్టేషన్లో క్యాంటిన్ ఏర్పాటు చేసుకున్నాడు. ఈ క్రమంలోనే అతను అనేక మంది మహిళలతో వివాహేతర సంబంధాలు కొనసాగిస్తున్నట్లు సమాచారం. మంజులతో వెళ్లిపోయిన రాము, శ్రీనివాస్ చౌదరికి సమీప బంధువే. వారిద్దరితో పాటు మంజుల కలసి మూడేళ్లుగా అనంతపురంలోని శ్రీనివాస్‌నగర్‌లో కలసి ఉంటున్నారు. రెండేళ్ల కిందట శ్రీనివాస్ చౌదరికి మంజులతో వివాహమైంది. అప్పటి నుంచి మంజుల ఇంట్లో ఉండగానే రోజుకో మహిళను శ్రీనివాస్ తన ఇంటికి పిలిపించుకునేవాడని చెబుతున్నారు. ఈ విషయంగా వారిద్దరి మధ్య తరచూ ఘర్షణ కూడా జరిగేందంటున్నారు. రాము ఏమయ్యాడో..? ఆరేళ్ల కిందట మంజులను పిల్చుకెళ్లిన రాము ఇప్పుడు ఏమయ్యాడో అంతుబట్టడం లేదు. శ్రీనివాస్ చౌదరితో మంజుల వివాహం ఎలా అయిందనే విషయం పెద్ద మిస్టరీగా మారింది. శ్రీనివాస్ చౌదరికి పోలీసుల అండదండలు సోమవారం రాత్రి 10 గంటలకు మంజుల తన నాలుగు నెలల చిన్నారితో కలసి ఇంట్లో పడుకుంది. ఆ సమయంలో శ్రీనివాస్ మరో మహిళను ఇంటికి పిల్చుకువచ్చాడు. దీంతో వారిద్దరూ గొడవ పడ్డారు. ఆమె ఉరికి వేలాడింది. ఈ విషయాన్ని వెంటనే అతను మూడో పట్టణ పోలీసు స్టేషన్‌కు వెళ్లి.. రాత్రి విధి నిర్వహణలో ఉన్న ఓ ఏఎస్ఐకి విషయం చెప్పాడు. అతను ఈ విషయాన్ని ఓ ఎస్ఐకి సమాచారాన్ని అందించడంతో ఎక్కడికైనా వెళ్లి తలదాచుకోవాలని, మిగిలిన విషయాలన్నీ తాను చూసుకుంటానని అభయమిచ్చినట్లు తెలిసింది. ఎస్ఐ డెరైక్షన్ మేరకు మంజుల (మీనాక్షి) మృతదేహాన్ని శ్రీనివాస్ మరొసటి రోజు అర్ధరాత్రి 2 గంటలకు కారులో నేరుగా సర్వజనాస్పత్రికి తీసుకెళ్లాడు. ఈ విషయం అన్ని పత్రికల్లో రావడంతో స్పందించిన జిల్లా పోలీసు ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారని సమాచారం. దీంతో శ్రీనివాస్చౌదరిని అదుపులోకి తీసుకున్నారు. వెంటనే త్రీటౌన్ సీఐ ఆంజినేయులు, ఎస్ఐ తమీమ్ అహమ్మద్ శ్రీనివాస్‌నగర్‌లోని శ్రీనివాస్ చౌదరి ఇంట్లో సోదాలు నిర్వహించి పలు కీలక అంశాలు తెలుసుకున్నారు. శ్రీనివాస్‌చౌదరి ఇప్పటికే ముగ్గురు అమ్మాయిలను వివాహం చేసుకుని వదిలేసినట్లు తెలిసింది. కేసు తారుమారుకు యత్నం రాష్ట్రస్థాయి పోలీస్ శాఖలోని ఓ కీలక ఉన్నతాధికారికి తాను సమీప బంధువునంటూ శ్రీనివాస్ చౌదరి ప్రచారం చేసుకునేవాడు. దీంతో పోలీసులు సైతం అదే స్థాయిలో అతనికి రాచమర్యాదలు చేయడం గమనార్హం. ఇప్పటికే మంజుల మృతిని పక్కదావ పట్టించడానికి పెద్దమనుషులుగా చెలామణి అవుతున్న కొందరు దుప్పటి పంచాయితీ చేయడానికి రంగంలోకి దిగారు. నిత్య పెళ్లికొడుకుగా మారిన శ్రీనివాస్ వెనుక ఉన్న రాజకీయ నేతల అండదండలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. శ్రీనివాస్ ఎవరో మాకు తెలియదు ' అసలు ఈ శ్రీనివాస్ చౌదరి ఎవరో..? తమ బిడ్డను ఎప్పుడు పెళ్లి చేసుకున్నాడో మాకు తెలియదు. మా కూతురు ఆరేళ్ల కిందట రాము అనే వ్యక్తితో వెళ్లిపోయింది. అతన్నే పెళ్లి చేసుకుంటానని కూడా చెప్పింది. ఇప్పుడేమో శ్రీనివాస్ చౌదరి పెళ్లి చేసుకున్నట్లు, వారికి నాలుగు నెలల బాబు ఉన్నట్లు అంటున్నారు. ఈ విషయం ఇంతవరకు మాకు తెలియదు. అసలు రాము ఏమయ్యాడో తెలియడం లేదు. మా బిడ్డ మరణంపై అనేక అనుమానాలు ఉన్నాయి. నిష్పక్షపాతంగా విచారణ చేస్తే నిజాలు బయటకు వస్తాయి ' అని మంజుల తండ్రి వడ్డే మారన్న చెప్పుతున్నారు. -
ఆటోడ్రైవర్‌పైనే అనుమానాలు
ప్రియయాంకతో కలిసి మూడుసార్లుసినిమాకు వెళ్లిన రాము ! మొదట్లో విచారించి వదిలేసిన పోలీసులు పర్వతగిరి : వరంగల్ జిల్లాలో కంబాలకుంట తండా బాలికలు బానోత్ భూమిక, బానోత్ ప్రియాంక మృతిపై మిస్టరీ ఇంకా వీడడం లేదు. ఇటీవల జరిగిన కొన్ని పరిణామాలు చూస్తే.. విద్యార్థినుల మృతితో ఓ ఆటోడ్రైవర్‌కు సంబంధముందనే అనుమానాలు వస్తున్నాయి. ఇదే మండలంలోని నారాయణపురం గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ జేరిపోతుల రాము నవంబర్ 10న రోజువారీ ఫైనాన్స్‌లో రూ.15 వేలు రుణం తీసుకున్నాడు. అంతకు ముందురోజైన దీపావళినాడు సెలవు ఉండడంతో కోసం ప్రియాంక ఇంటికి వచ్చింది. రాము, ప్రియూంక కలిసి నవంబర్ 22 వరకు రెండు, మూడు సార్లు నెక్కొండ సినిమా థియేటర్‌కు వచ్చినట్లు ఓ విద్యార్థిని చెప్పడం అనుమానాలకు బలాన్నిస్తోంది. 23న వారిద్దరు మరోసారి నెక్కొండలో కలుసుకున్నారని తెలుస్తోంది. ఇదిలా ఉండగా నవంబర్ 11వ తేదీ నుంచి 22వ తేదీ వరకు రోజుకు రూ.150 చొప్పున గిరిగిరి డబ్బులు చెల్లించిన రాము 23వ తేదీ నుంచి కనిపించకుండా పోయూడు. దీన్ని బట్టి రాము ప్రియూంకతో ఉన్నట్లు ఆటో డ్రైవర్లు అనుమానిస్తున్నారు. 23న సినిమాకు వెళ్లిన వారిలో రాము కూడా ఉన్నట్లు సమాచారం. భూమిక కోసం రాముతో కలిసి మూడు వెంకన్న అనే వ్యక్తి వచ్చేవాడని అదే హాస్టల్లో చదువుతున్న విద్యార్థిని చెప్పడం గమనార్హం. కాగా 10 నెలల క్రితమే రాముకు పెళ్లి కాగా రెండు నెలలకే భార్యతో గొడవపెట్టుకుని కట్నం కావాలని ఆమెను పుట్టింటికి పంపినట్లు స్థానికులు తెలిపారు. రోజూ అర్ధరాత్రి ఒంటి గంటకు ఇంటికి వచ్చేవాడని వెల్లడించారు. నవంబర్ 25న ప్రియాంక, భూమిక తప్పిపోయినట్లు తెలుసుకున్న తల్లిదండ్రులు 27న పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటి వరకు రాము, వెంకన్న కూడా ఊర్లో లేరు. నవంబర్ 29వ తేదీ నుంచి డిసెంబర్ 1వ తేదీ వరకు రామును పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారించగా ప్రియాంకతో కలిసి మూడుసార్లు సిని మాకు వెళ్లిన విషయూన్ని వెల్లడించినట్లు తెలి సింది. అరుుతే ఇప్పుడు ఆమె ఎక్కడ ఉందో తెలియదని చెప్పడంతో వదిలేశారు. అప్పటి నుంచి అతడు స్వగ్రామాన్ని వదిలేసి వేరొక ఊర్లో భార్యతో కలిసి ఉంటున్నట్లు సమాచారం. పూర్తి స్థాయిలో విచారణ జరిపి ఉంటే.. పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ జరిపి ఉంటే ఇంత దారుణం జరిగి ఉండేది కాదని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఆటో డ్రైవర్ అనేక విషయూలను చెప్పినా నామమాత్రంగా కేసు నమోదు చేశారు. ప్రియాంక, భూమిక తల్లిదండ్రులు మాత్రం పోలీసులు ఏ మాత్రం సహకరించలేదని తీవ్రంగా ఆరోపిస్తున్నారు. ములు గు, నల్లబెల్లి, పర్వతగిరి పోలీసులు ఎవరికి వారే దర్యాప్తులో నిర్లక్ష్యం ప్రదర్శించారు. -
ఆటో, బైక్ ఢీ..ఒకరి మృతి
మదనపల్లి: చిత్తూరు జిల్లా మదనపల్లి సబ్‌కలెక్టరేట్ కార్యాలయం సమీపంలో సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఆటో, బైక్‌ను ఢీకొట్టిడంతో కత్తి రాము(30) అనే రైతు తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రుడిని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా.. చికిత్సపొందుతూ మంగళవారం మరణించాడు. -
విద్యార్థిని చితకబాది పరారైన వాచ్‌మన్
విజయవాడ : హాస్టల్లో విద్యార్థిని వాచ్‌మన్ చితకబాదాడు. దాంతో తీవ్ర గాయాలతో కుప్పకూలిపోయాడు. అనంతరం వాచ్‌మన్ అక్కడి నుంచి పరారైయ్యాడు. దాంతో తోటి విద్యార్థులు... బాధితుడిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లిలోని ఎస్సీ సంక్షేమ హాస్టల్లో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. విద్యార్థుల కథనం ప్రకారం... మంగళవారం 8-9 గంటల మధ్య హాస్టల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఆ సమయంలో కొందరు విద్యార్థులు బిగ్గరగా కేకలు వేశారు. 7వ తరగతి చదువుతున్న రాము గట్టిగా అరిచాడని వాచ్‌మన్ రవికుమార్ భావించాడు. ఆ క్రమంలో కర్రతో రామును తీవ్రంగా కొట్టాడు. దాంతో అతడికి తీవ్రంగా గాయపడ్డాడు. అనంతరం భయంతో రవికుమార్ అక్కడి నుంచి పరారైయ్యాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న ఎంఈవో, ఎంపీడీవో హాస్టల్‌కి వెళ్లి విచారించారు. అనంతరం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థి రామును పరామర్శించారు. ఈ ఘటనకు బాధ్యుడైన వాచ్‌మన్ రవికుమార్‌పై కఠిన చర్యలు తీసుకుంటామని వారు విద్యార్థులకు హామీ ఇచ్చారు. -
బిడ్డలను రోడ్డుపై విడిచి చెక్కేసిన తండ్రి
తల్లి జాడ తెలియని వైనం టూటౌన్ పోలీసుల చొరవతో చైల్డ్‌లైన్ చెంతకు.. ఒంగోలు క్రైం: తల్లి వద్ద నుంచి తన ఇద్దరు కుమారులను రెండు నెలల క్రితం నెల్లూరులో ఉంటున్న తండ్రి తీసుకొని వెళ్లాడు. అంతవరకు బాగానే ఉంది. తిరిగి బిడ్డలను భార్య వద్ద వదిలి పెట్టకుండా ఆమె ఒంగోలులో లేకుండా చూసి ఓ సినిమా హాలు వద్ద వదిలేసి వెళ్లిపోయాడు. ఒంగోలు రైలుపేటలో నివాసం ఉంటున్న కగ్గా శ్రీను, నాగమణికి ఇద్దరు కుమారులు. కగ్గా గోపి (11), కగ్గా రాము(9). అయితే భార్య, భర్త మధ్య మనస్పర్థలు వచ్చాయి. ఇద్దరు వేర్వేరుగా ఉంటున్నారు. ఈ క్రమంలో రెండు నెలల క్రితం ఇంటికి వచ్చి ఇద్దరు బిడ్డల్ని తీసుకెళ్లిన తండ్రి ఆ తర్వాత ఏమి జరిగిందో ఏమో.. ఉన్నట్టుండి మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో శ్రీనివాసా థియేటర్ వద్ద ఇద్దరు బిడ్డలను వదిలేసి, వారికి రూ.150 ఇచ్చి సినిమాకు వెళ్లమని చెప్పి వెళ్లిపోయాడు. దీంతో ఆ చిన్నారులు థియేటర్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతుండగా టూటౌన్ హెడ్ కానిస్టేబుల్ శీనప్ప, కానిస్టేబుల్ ఎస్కే మస్తాన్ వలి గమనించారు. వివరాలు అడిగి తెలుసుకున్నారు. రైలుపేటలోని వారి ఇంటి వద్దకు తీసుకెళ్లారు. అయితే ఇంటి వద్ద ఆ చిన్నారుల తల్లి నాగమణి లేదు. స్థానికులను విచారణ చేశారు. ఎక్కడికి వెళ్లిందో తెలియలేదు. దీంతో పోలీసులు చైల్డ్‌లైన్-1098 ప్రతినిధి బీవీ సాగర్‌కు సమాచారం ఇచ్చారు. రాత్రి 11.30 గంటల సమయంలో సాగర్ వచ్చి ఆ చిన్నారులను బొమ్మరిల్లు హోంలో చేర్పించారు. బాలల సంక్షేమ మండలి ముందు బుధవారం హాజరు పరిచారు. వారి ఆదేశాల మేరకు ఇద్దరు పిల్లలను అదే హోంలో చేర్పించారు. -
విద్యుత్ షాక్‌తో యువరైతు మృతి
కర్నూలు: విద్యుత్ షాక్ తగిలి యువరైతు మృతిచెందిన సంఘటన కర్నూలు జిల్లా పెద్దకడగూరు మండలం కలకుంట గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రాము(26) అనే రైతు పొలాన్ని చదును చేయడానికి ఈ రోజు ఉదయం ట్రాక్టర్‌ను తీసుకెళ్లాడు. ఆ సమయంలో.. సోమవారం రాత్రి వీచిన భారీ గాలులకు పొలంలో వెదురు బొంగులతో ఏర్పాటు చేసుకున్న విద్యుత్ తీగలు తెగి పడ్డాయి. దీంతో వాటిని తొలగించడానికి ప్రయత్నించిన రాము విద్యుదాఘాతంతో మృతిచెందాడు. మృతునికి భార్య, కుమార్తె ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
పండుగకు వెళుతూ.. పరలోకాలకు..
రాఘవాపురం(పాలకుర్తి) : తండాలో జరుగుతున్న పండుగకు వెళుతూ ఇద్దరు మృత్యు ఒడికి చేరారు. కారు అదుపుతప్పి బోల్తాపడడంతో కానరానిలోకాలకు చేరారు. ఈ సంఘటన పాలకుర్తి -హన్మకొండ రహదారిపై రాఘవాపురం స్టేజీ సమీపంలో మంగళవారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం... రాయపర్తి మండలం కేశవాపురం గ్రామ శివారు పీతల తండాకు చెందిన మాలోతు స్వరూప, మాలోతు యాకూబ్ దంపతులు కాజీపేట ప్రశాంత్‌నగర్‌లో నివాసముంటున్నారు. ఇదే తండాకు చెందిన మాలోత్ రాము(32), రజిత దంపతులు కాజీపేటలోని ఫాతిమానగర్‌లో ఉంటున్నారు. యూకూబ్ ట్రాక్టర్ డ్రైవర్‌గా, రాము కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. పాలకుర్తి మండలం బమ్మెర శివారు ఎల్లమ్మగడ్డ తండాలో స్వరూప తల్లిగారింట్లో పండుగ చేసుకుంటుండడంతో ఆమె భర్త యూకూబ్, కుమార్తెలు ఇందూ(6), బిందుతో కలిసి రాము కారును అద్దెకు మాట్లాడుకుని బయల్దేరారు. ఈ క్రమంలో రాఘవాపురం గ్రామం స్టేజీ దాటిన తర్వాత ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోగా కారు అదుపుతప్పి రోడ్డు పక్కన చెట్టును ఢీకొని బోల్తాపడింది. దీంతో తీవ్రగాయూలపాలైన డ్రైవర్ రాము(32)తోపాటు చిన్నారి ఇందూ(6) సంఘటన స్థలంలోనే మృతిచెందారు. మృతుడు రాముకు కొన్నాళ్ల క్రితమే వివాహ మైందని, అతడి భార్య ప్రస్తుతం నాలుగు నెలల గర్భవతి అని బంధువులు తెలిపారు. అలాగే స్వరూప, యాకూబ్, వారి చిన్నకూతురు మాలోతు బిందుకు తీవ్ర గాయాలయ్యూరుు. వారిని మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స చేసిన అనంతరం జిల్లా కేంద్రంలోని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న ఎల్లమ్మగడ్డ తండా వాసులు, బంధువులు సంఘటన స్థలానికి చేరుకుని కన్నీరుమున్నీరయ్యారు. రాము, ఇందూ మృతితో ఎల్లమ్మగడ్డ తండా, పీతల తండాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సంఘటన స్థలాన్ని పాలకుర్తి సీఐ తిరుపతి, ఎస్సై ఉస్మాన్ షరీఫ్ సందర్శించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఈత సరదాకు విద్యార్థి బలి
మరిపెడ : స్నేహితులతో ఈత కోసమని సరదాగా వెళ్లిన విద్యార్థుల్లో ఒకరు మృతిచెందిన సంఘటన మరిపెడ మండలంలోని పురుషోత్తమాయగూడెలో శనివారం చోటుచేసుకుం ది. పోలీసుల కథనం ప్రకారం... మండల కేంద్రంలోని సీతారాంపురం వీధికి చెందిన గడ్డం మల్సూర్, రాములమ్మ దంపతుల ఏకైక కుమారుడురాము(13) ఇదే వీధిలోని సీతారాంపురం హైస్కూల్లో 8వ తరగతి చదువుతున్నాడు. పాఠశాలలో త్రైమాసిక పరీక్షలు రాసిన తర్వాత తన తరగతి స్నేహితులైన గుండా సాయి, ఎల్లుట్ల లోకేష్, బాలం సం దీప్, ప్రశాంత్, గణేష్‌తో కలిసి ఆటోలో పురుషోత్తమాయ గూడేనికి చెందిన నూకల నరేష్ రెడ్డి మామిడితోటలో ఉన్న నీటి పంపింగ్ స్టోరేజ్ కొలనులో ఈత కొట్టేందుకు వెళ్లాడు. మెట్లు దిగుతున్న క్రమంలో ప్రమాదవశాత్తు రాము కొలనులో పడి మునిగిపోయూడు. దీంతో మిగతా విద్యార్థులు భయంతో పరుగులు తీశారు. వారిని గమనించిన తోట కాపరి బోధ్య వారిని పట్టుకునేందుకు ప్రయత్నించాడు. ముగ్గురు విద్యార్థులు చేతికి దొరకగా... విషయం అడగడంతో రాము నీటమునిగినట్లు వారు చెప్పారు. అతడి సమాచారంతో కురవి సీఐ కరుణసాగర్‌రెడ్డి, మరిపెడ ఎస్సై నాగభూషణం సంఘటన స్థలానికి చేరుకుని శవపంచనామా చేశారు. కేసు నమోదు చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మహబూబాబాద్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో మృతుడి తల్లిదండ్రులు, ముగ్గురు అక్కచెళ్లెల్లు శోకసంద్రంలో మునిగిపోయారు. -
కుగ్రామం నుంచి కామన్వెల్త్కు...క్రీడా శిఖరం
మారుమూల గ్రామం.. క్రీడా వసతులు శూన్యం.. తండ్రి జూట్‌మిల్ కార్మికుడు.. కుటుంబం గడవడమే కష్టం.. ఇక ఆ వెయిట్ లిఫ్టర్‌కు పౌష్టికాహారం ఎలా? శిక్షణ లేకున్నా సంకల్పం ఉంది.. కండ బలానికి గుండె బలం తోడైంది.. పతకాలు ప్రోత్సాహమందించాయి.. ఆ స్ఫూర్తే ఆమెను కామన్వెల్త్ రజత పతక విజేతగా నిలిపింది. ఆమే ఉత్తరాంధ్ర క్రీడా శిఖరం మత్స సంతోషి.. విశాఖపట్నం: ఇటీవలి కామన్వెల్త్ గేమ్స్‌కు ముందు సంతోషి ఎవరో చాలామందికి తెలీదు. ఉత్తరాంధ్రకే ఆమె ఎవరో పరిచయం లేదు. పతకం సాధించాక.. సన్మానాలే సన్మానాలు. జీరో స్థాయి నుంచి అత్యున్నత స్థాయికి ఎదిగేలోగా... ఆ మధ్యలో ఆమె కఠోర శ్రమ, సంఘర్షణ ఎంతో ఉంది. సాంకేతిక శిక్షణ లేకున్నా సహజమైన ప్రతిభతో ఎదిగారామె. ఆర్ధిక వెసులుబాటు లేకున్నా శక్తికి మించి బరువులనెత్తి పతకాన్ని సొంతం చేసుకున్నారు. అంతర్జాతీయంగా ఏడో పతకమైనా తన కెరీర్లో కామన్వెల్త్ మెడల్ బెస్ట్ అంటారామె. ఒలింపిక్స్ పతకమే తన లక్ష్యమంటున్న సంతోషి మనోగతం ఆమె మాటల్లోనే... సరదాగా ఆటల్లో... ఆరో తరగతి చదువుతున్నప్పుడు ఓసారి స్వాతంత్య్ర వేడుకల్లో భాగంగా స్కూల్లో జరిగిన ఆటల పోటీల్లో పాల్గొన్నాను. చక్కటి ప్రతిభ కనబరచడంతో చదువు నుంచి ఆటల్లోకి మారాను. రాము వద్ద శిక్షణతోనే ఈ స్థాయికి వచ్చాను. అమ్మా నాన్నలను ఆయనే ఒప్పించి వెయిట్ లిఫ్టింగ్‌కు తీసుకువచ్చారు. కుగ్రామం నుంచే... విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలంలోని ఓ చిన్న గ్రామం కొండ వెలగాడ. అక్కడ ఆటలకు ఎటువంటి వసతులు లేవు. నాన్న అక్కడి జూట్‌మిల్‌లో వర్కర్. ఇద్దరు అక్కలు, ఓ అన్నయ్య మా కుటుంబం. అమ్మ ఇంటిదగ్గరే ఉంటుంది. అంతర్జాతీయంగా పతకం సాధించినా ఆనందించడమే తప్ప వారికేమీ తెలీదు. విశాఖలో అరంగేట్రం... 2005లో విశాఖలోని ఏయూలో జరిగిన పోటీల్లోనే తొలిసారిగా పాల్గొన్నాను. అది స్టేట్ వెయిట్ లిఫ్టింగ్ చాంపియన్‌షిప్. చక్కటి ప్రతిభతో 48 కేజీల వెయిట్ విభాగంలో స్వర్ణాన్నే సాధించాను. అదే నేను సాధించిన తొలి పతకం. ప్రస్తుతం 53 కేజీల్లో... ఇటీవల జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో 53 కేజీల వెయిట్‌లోనే కాంస్యం సాధించాను. 2010 వరకు 48 కేజీల్లోనే చేసినా ఇంజరీస్ కాకుండా నిలువరించుకునేందుకు 53కేజీల్లో తలపడుతున్నాను. డైట్ ఖర్చే నెలకు రూ.40 వేలు... శిక్షణకే ఎక్కువ మొత్తంలో ఖర్చవుతుంది. నెలకు దాదాపుగా 40 వేలు ఖర్చంటే నాకు కాస్త ఆర్ధికంగా కష్టమే. రోజూ 12 గుడ్లు, నాలుగు లీటర్ల పాలు, ఒక కేజీ చికెన్ లాగించేస్తాను. ఒక డ్రై ఫ్రూట్స్లాంటి సప్లిమెంటరీ తప్పనిసరి. నేషనల్ క్యాంప్స్లో మూడేసి నెల లు పాల్గొంటాను. అంతర్జాతీయంగా ఏడు పతకాలు... అంతర్జాతీయ స్థాయిలో పదమూడు టోర్నీల్లో పాల్గొని ఏడుసార్లు పతకాలు అందుకున్నాను. వీటిలో కామన్వెల్త్ క్రీడల్లో అందుకున్న రజత పతకమే కెరీర్ బెస్ట్. సబ్ జూనియర్, జూనియర్లతోపాటు సీనియర్స్‌తోనూ తలపడి పతకాలు సాధించాను. ఆసియన్ చాంపియన్‌షిప్‌లోనూ పతకాలందుకున్నాను. ఉద్యోగం అడిగా... ఆర్థికంగా గతంలో పెద్దగా ప్రోత్సాహం లేకున్నా ప్రస్తుతం బాగుంది. కామన్వెల్త్ పతకంతో రాష్ట్ర ప్రభుత్వం పదిహేను లక్షలు ప్రకటిస్తే,..కేంద్ర ప్రభుత్వం పది లక్షలు ఇచ్చింది. కలెక్టర్ స్థానికంగా స్థలం ఇస్తామన్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వాన్ని నాకో ఉద్యోగమివ్వండి అని అడిగాను. నిన్ననే ఏయూ వీసీ ఉద్యోగమిస్తానన్నారు. ఎక్కడ బాగుంటే అక్కడ చేస్తాను. ఆర్ధికంగా వెసులుబాటు ఉండాలి. శిక్షణకు అనువైన ప్రాంతమై ఉండాలి. ఆ అనుభవంతోనే.. 1993లో మా మండలానికి శర్మ అనే కోచ్ వచ్చారు. ఆయన వద్దకు మా చెల్లెల్ని శిక్షణకు తీసుకువెళ్లాను. అప్పుడు ఆయన వద్ద కొన్ని మెళకువల్ని నేర్చుకున్నాను. ఆయన వెళ్లిపోయిన తర్వాత నేనే కొందరికి శిక్షణనిస్తూ సంతోషిని ఈ స్థాయికి చేర్చాను. సంతోషి ఉదయం రెండు గంటలు, సాయంత్రం మూడు గంటలు సాధన చేస్తుంది. -రాము, సంతోషి కోచ్ -
సిరిపురపు రాము కుటుంబంతో...
దత్తిరాజేరు మండలం కె.కృష్ణాపురానికి చెందిన సిరిపురపు రాము చెన్నై ఘటనలో మృతి చెందారు. ఆయన భార్యాపిల్లలు అనాథలయ్యారు. ఆ కుటుంబాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించి ఓదార్చారు. వివరాలు అడిగితెలుసుకున్నారు. ఆ సంభాషణ ఇలా సాగింది. జగన్: తల్లీ నీ పేరేంటి? బాధితురాలు: నా పేరు లక్ష్మి అండి. జగన్:ఎంతమంది పిల్లలమ్మా నీకు? బాధితురాలు: ఇద్దరు పిల్లలు. జగన్: అక్కడ ఎంత కూలి ఇచ్చేవారు? బాధితురాలు: నాకు తెలీదండి. అంతా ఆయనే చూసుకొనేవారు. జగన్: తమిళనాడు ప్రభుత్వం మీకు ఏమైనా సాయం చేసిందా? బాధితురాలు: నాకు తెలీదండి. జగన్: తమిళనాడు బిల్డర్ మీతో ఏమైనా మాట్లాడారా? బాధితురాలు:మాతో ఎవరూ మాట్లాడలేదండి. జగన్: కోర్టులో కేసు వేయండి వాళ్లే రాజీకి వస్తారు. మీకు డబ్బులు ఇస్తారుగా. బాధితురాలు:నాకు ఏటీ తెలీదు సారూ. జగన్: అక్కడ మన తెలుగు ఎంపీలు ఉన్నారు. వారి ద్వారా మీకు న్యాయం జరిగే విధంగా చూస్తాను. బాధితురాలు: అంతా మీ దయండి. జగన్: పిల్లలను బాగా చదివించు తల్లి. (అంటూ పిల్లలు వేదశ్రీ, ఐశ్వర్యలను పలకరించారు). బాధితురాలు: అలాగేనండి. బాగా చదివించుకుంటానండి. -
పొట్టకూటి కోసం వచ్చి..
తాండూరు రూరల్: పొట్టకూటి కోసం వచ్చిన ఓ యువకుడిని టిప్పర్ రూపంలో ఉన్న మృత్యువు కబళించింది. సంఘటన తాండూరు మండలంలోని మల్కాపూర్ గనుల్లో శనివారం చోటు చేసుకుంది. గని కార్మికులు, కరన్‌కోట్ ఎస్ఐ ప్రకాష్‌గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబ్‌నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలం పల్లమర్రి గ్రామానికి చెందిన రాము(18) చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయాడు. దీంతో హైదరాబాద్‌లోని బోడుప్పల్లో ఉంటున్న తన మేనమామ వెంకటన్న వద్ద ఉండి 9వ తరగతి వరకు చదువుకున్నాడు. ఆర్థిక పరిస్థితి బాగలేకపోవడంతో చదువు మానేసి స్థానికంగా కూలీపనులు చేస్తుండేవాడు. ఇదిలా ఉండగా రాము మూడు వారాల క్రితం తాండూరు మండలం మల్కాపూర్ గనుల్లో పని చేస్తున్న తన పెద్ద నాన్న కొడుకు నాగేష్ వద్దకు వచ్చాడు. ఇక్కడే టిప్పర్(కేఏ 01 పీ 3501) వాహనంపైన క్లీనర్‌గా పనికి కుదిరాడు. శుక్రవారం రాత్రి 10 గంటల సమయంలో నాపరాతి గనిలో రాతిముక్కలను టిప్పర్లోకి లోడ్ చేశారు. టిప్పర్ ర్యాంప్ ఎక్కుతుండగా రాము వెనుకాల ఉండి డ్రైవర్‌కు సైడ్ చూపిస్తున్నాడు. టిప్పర్ ప్రమాదవశాత్తు ఒక్కసారిగా వెనక్కి దూసుకొచ్చింది. రాము వాహనం కిందపడిపోవడంతో తీవ్రంగా గాయపడ్డాడు. గని కార్మికులు గమనించి వెంటనే తాండూరులోని జిల్లా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో రాము అర్ధరాత్రి తర్వాత మృతిచెందాడు. పోలీసులు శనివారం పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించారు. మృతుడి అక్క అంజమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా ప్రమాదానికి కారణమైన టిప్పర్ డ్రైవర్ పరారీలో ఉన్నాడు. -
పిల్లనివ్వలేదని హతమార్చాడు
మేనమామను కొడవలితో నరికి ... తుపాకీతో పోలీసులపైనే ఎదురు దాడి ఇన్స్పెక్టర్ కాల్పుల్లో మృతి కోలారు : కూతురును తన కిచ్చి వివాహం చేయలేదని ఆగ్రహించిన మేనల్లుడు.. కొడవలితో మేనమామపై దాడి చేసి హతమార్చాడు. అరెస్ట్ చేయడానికి వచ్చిన పోలీసులపైనే దాడి చేశాడు. వారి వద్ద ఉన్న తుపాకీని లాక్కొని.. వారినే బెదిరించాడు. పరిస్థితి అదుపు తప్పకూడదని పోలీసులు జరిపిన కాల్పుల్లో ఆ నిందితుడు మరణించాడు. ఈ సంఘటన ఆదివారం రాత్రి తాలూకాలోని నపరసాపురం ఫిర్కాలో చోటుచేసుకుంది. ఖాజీకల్లహళ్లి గ్రామానికి చెందిన రాము (28) కూలి కార్మికుడి. కుమార్తెను తనకిచ్చి వివాహం చేయాల్సిందిగా తన మేమమామ మునియప్ప(60)ను తరచుగా వేధిస్తూండేవాడు. మగపిల్లలకు పెళ్లి చేసిన అనంతరం కూతురు పెళ్లి చేస్తానని మునియప్ప దాటవేస్తూ వచ్చేవాడు. ఆదివారం రాత్రి రాము తన అత్తమామలను ఓ గదిలో ఉంచి తన వివాహ విషయం తేల్చాలని డిమాండ్ చేశాడు. ఈ సమయంలో వారిమధ్య వాగ్వాదం జరిగింది. సహనం కోల్పోయిన రాము కొడవలితో మేనమామపై దాడికి చేశాడు. దీంతో మేనత్త వెంకటమ్మ బిగ్గరగా అరవడంతో గది బయట ఉన్న మునియప్ప కుమారులు పోలీసులకు ఫోన్ చేశారు. వెంటనే కోలారు రూరల్ ఇన్స్పెక్టర్ తన సిబ్బందితో ఆ గ్రామానికి చేరుకున్నారు. అప్పటికే మునియప్ప చనిపోయాడు. గది నుంచి బయటకు రావాల్సిందిగా రాముకు పోలీసులు కోరారు. అయితే వెంకటమ్మను అడ్డు పెట్టుకొని.. రాము బెదిరించసాగాడు. దీంతో పోలీసులు ఆ గది కిటికీ తలుపులు పగులగొట్టి.. బాష్పవాయు గోళాలను ప్రయోగించా రు. అనంతరం గది తలుపులు పగులగొట్టి లోనికి వెళ్లిన ఓ కానిస్టేబుల్‌పై రాము దాడి చేశాడు. కానిస్టేబుల్ చేతిలోని తుపాకీని లాక్కొని దాడి చేశా డు. ఈ సంఘటనలో రూరల్ ఎస్ఐ మహదేవప్ప, కానిస్టేబుల్ డీఎఆర్ నారాయణస్వామి, రూరల్ కానిస్టేబుల్ నారాయణస్వామి కూడా గాయపడ్డారు. తన దగ్గరకు వస్తే కాల్చేస్తానంటూ రాము పోలీసులనే బెదిరించాడు. దీంతో రూరల్ ఇన్స్పెక్టర్ ఏబీ సుధాకర్ తన రివాల్వర్‌తో రాముపై కాల్పులు జరిపాడు. గాయపడిన రామును పోలీసులు కోలా రు ఆర్ఎల్ జాలప్ప ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం బెంగుళూరు విక్టోరియా ఆస్పత్రికి తరలించగా.. కోలుకోలేక సోమవారం ఉదయం రాము మరణించినట్లు వైద్యులు తెలిపారు. ఘటనా స్థలానికి ఎస్పీ అజయ్హిలోరి, డీఎస్పీ అశోక్‌కుమార్ పరిశీలించారు. కోలారు : కూతురును తన కిచ్చి వివాహం చేయలేదని ఆగ్రహించిన మేనల్లుడు.. కొడవలితో మేనమామపై దాడి చేసి హతమార్చాడు. అరెస్ట్ చేయడానికి వచ్చిన పోలీసులపైనే దాడి చేశాడు. వారి వద్ద ఉన్న తుపాకీని లాక్కొని.. వారినే బెదిరించాడు. పరిస్థితి అదుపు తప్పకూడదని పోలీసులు జరిపిన కాల్పుల్లో ఆ నిందితుడు మరణించాడు. ఈ సంఘటన ఆదివారం రాత్రి తాలూకాలోని నపరసాపురం ఫిర్కాలో చోటుచేసుకుంది. ఖాజీకల్లహళ్లి గ్రామానికి చెందిన రాము (28) కూలి కార్మికుడి. కుమార్తెను తనకిచ్చి వివాహం చేయాల్సిందిగా తన మేమమామ మునియప్ప(60)ను తరచుగా వేధిస్తూండేవాడు. మగపిల్లలకు పెళ్లి చేసిన అనంతరం కూతురు పెళ్లి చేస్తానని మునియప్ప దాటవేస్తూ వచ్చేవాడు. ఆదివారం రాత్రి రాము తన అత్తమామలను ఓ గదిలో ఉంచి తన వివాహ విషయం తేల్చాలని డిమాండ్ చేశాడు. ఈ సమయంలో వారిమధ్య వాగ్వాదం జరిగింది. సహనం కోల్పోయిన రాము కొడవలితో మేనమామపై దాడికి చేశాడు. దీంతో మేనత్త వెంకటమ్మ బిగ్గరగా అరవడంతో గది బయట ఉన్న మునియప్ప కుమారులు పోలీసులకు ఫోన్ చేశారు. వెంటనే కోలారు రూరల్ ఇన్స్పెక్టర్ తన సిబ్బందితో ఆ గ్రామానికి చేరుకున్నారు. అప్పటికే మునియప్ప చనిపోయాడు. గది నుంచి బయటకు రావాల్సిందిగా రాముకు పోలీసులు కోరారు. అయితే వెంకటమ్మను అడ్డు పెట్టుకొని.. రాము బెదిరించసాగాడు. దీంతో పోలీసులు ఆ గది కిటికీ తలుపులు పగులగొట్టి.. బాష్పవాయు గోళాలను ప్రయోగించా రు. అనంతరం గది తలుపులు పగులగొట్టి లోనికి వెళ్లిన ఓ కానిస్టేబుల్‌పై రాము దాడి చేశాడు. కానిస్టేబుల్ చేతిలోని తుపాకీని లాక్కొని దాడి చేశా డు. ఈ సంఘటనలో రూరల్ ఎస్ఐ మహదేవప్ప, కానిస్టేబుల్ డీఎఆర్ నారాయణస్వామి, రూరల్ కానిస్టేబుల్ నారాయణస్వామి కూడా గాయపడ్డారు. తన దగ్గరకు వస్తే కాల్చేస్తానంటూ రాము పోలీసులనే బెదిరించాడు. దీంతో రూరల్ ఇన్స్పెక్టర్ ఏబీ సుధాకర్ తన రివాల్వర్‌తో రాముపై కాల్పులు జరిపాడు. గాయపడిన రామును పోలీసులు కోలా రు ఆర్ఎల్ జాలప్ప ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం బెంగుళూరు విక్టోరియా ఆస్పత్రికి తరలించగా.. కోలుకోలేక సోమవారం ఉదయం రాము మరణించినట్లు వైద్యులు తెలిపారు. ఘటనా స్థలానికి ఎస్పీ అజయ్హిలోరి, డీఎస్పీ అశోక్‌కుమార్ పరిశీలించారు. -
విశ్వదృక్పథం
సర్వేంద్రియాల్లో నయనం ప్రధానమే. కానీ నయనమే ప్రధానం కాదు. ఆ విషయం ‘విశ్వదృక్’ బృందంలో ఉన్న ఏ ఒక్కరిని చూసినా అర్థమవుతుంది. ఎందుకో ఏమో... భగవంతుడు వారి జీవిత చిత్రానికి నలుపురంగును పూశాడు. కానీ దానికి వాళ్లు చింతించలేదు. తమలోని ప్రతిభతో మరికొన్ని రంగులను అద్దుకున్నారు. తమ జీవితాలను అందమైన హరివిల్లులుగా మలచుకున్నారు. అందరితో ‘శభాష్’ అనిపించుకుంటున్నారు. ఎన్ని వేల మైళ్ల పయనమైనా... ఒక్క అడుగుతోనే మొదలవుతుంది. ఎంత గొప్ప లక్ష్యమైనా... చిన్న ఆలోచన నుంచే పుడుతుంది. విశ్వదృక్ ఫౌండేషన్ స్థాపనకు బీజం వేసింది... ఓ అతి సామాన్యమైన వ్యక్తి మదిలో మెదిలిన ఆలోచన. అక్టోబర్ 2, 2005. గాంధీజయంతి సందర్భంగా పాటల పోటీ జరుగుతోంది. ఆ పోటీలో ఓ చూపులేని యువతి కూడా పాల్గొంది. తన కళ్లలో ఉన్న చీకటి తన మనసులో లేదని తన పాట ద్వారా చెప్పే ప్రయత్నం చేసింది. ఆమె పాటలోని శృతిశుద్ధతకి ఆడియెన్స్‌లో ఉన్న ఒక వ్యక్తి గుండె లయ తప్పింది. ఏ వైకల్యం లేని ఎంతోమంది సింగర్స్ కంటే అద్భుతంగా పాడిన ఆమెపై ఆయనకు ఎంతో గౌరవం కలిగింది. అందుకే ఆమెతో పరిచయం చేసుకున్నారు. స్నేహహస్తాన్ని అందించారు. ఆ వ్యక్తి సందిపగు రాము... ఆవిడ పేరు మాధవి. ఆ ఇద్దరి పరిచయమే... ‘విశ్వదృక్ ఫౌండేషన్’కి పునాదిరాయి వేసింది. రాము పరిచయమయ్యాక తనకు చూపు లేదన్న విషయాన్ని పూర్తిగా మర్చిపోయారు మాధవి. ఆమె పాటల పోగ్రాములకు సంబంధించిన ఏర్పాట్లు రాముయే చూసుకునేవారు. ఒక్కమాటలో చెప్పాలంటే, ఆయన ఆమెకు తోడునీడగా సాగారు. అప్పుడే ఆయనలో ఓ ఆలోచన పుట్టింది. మాధవి లాంటి వారు చాలామంది ఉంటారు. వాళ్లలోనూ ఏదో ఒక ప్రతిభ ఉండే ఉంటుంది. కానీ వాళ్లకు తనలాంటి ఒక వ్యక్తి ఎవరైనా తోడుగా ఉండి ఉంటారా? ఉండకపోవచ్చు. మాధవికి తోడుగా ఉన్న తాను, అలాంటి వారందరికీ తోడుగా ఉండలేనా? ఈ ఆలోచన రాముని ఓ పెద్ద లక్ష్యం వైపు అడుగులు వేయించింది. ఐదుగురితో మొదలు... ఆలోచించినంత తేలిక కాదు ఆచరించడం. ఎక్కడో ప్రకాశం జిల్లానుంచి జీవనోపాధికై హైదరాబాద్ వచ్చిన రాముకి, ఊరు కాని ఊరిలో అనుకున్నది సాధించడం ఎంత కష్టమో తెలియంది కాదు. అదే సమయంలో ఇంటి యజమానురాలు నస్రీన్ దారి చూపించారు రాముకి. ఆవిడ ఇచ్చిన లక్ష రూపాయలతోనే రాము అడుగులు మొదలయ్యాయి. హైదరాబాద్‌లోని అంధుల పాఠశాలలు, కళాశాలలు, హాస్టళ్లు తిరిగారు. టాలెంట్ ఉన్నవాళ్ల కోసం వెతికారు. మొదటి ప్రయత్నంలో ఓ అయిదుగురిని కనుగొన్నారు. ఆ అయిదుగురితోనే 2007, జూలైలో ‘విశ్వదృక్’ ఏర్పడింది. ఆ సంస్థ తలుపులు అంధుల కోసం నేటివరకూ తెరచుకునే ఉన్నాయి. విశ్వదృక్ స్థాపించిన కొన్ని నెలలకు మాధవిని వివాహం చేసుకున్నారు రాము. ఇద్దరు పిల్లలతో సంతోషంగా కాపురం చేస్తూనే... ఇన్నేళ్లలో ఎంతోమంది చూపులేని పిల్లలను చేరదీశారు ఈ దంపతులు. వారి ప్రతిభకు సానబట్టారు. వారినో ట్రూపులా ఏర్పరచి, ప్రదర్శనలు ఇప్పిస్తున్నారు (ప్రపంచ వికలాంగుల దినోత్సవం సందర్భంగా ఈ రోజు సాయంత్రం సికింద్రాబాద్‌లోని హరిహర కళాభవన్‌లో ప్రదర్శన ఇవ్వనున్నారు) ఆ వచ్చే కొద్దిపాటి పారితోషికంతో అందరినీ చదివిస్తున్నారు. ఏ లోటూ లేకుండా చూస్తున్నారు. అయితే వారికి తిండి పెట్టడం, ఆశ్రయమివ్వడం రాము లక్ష్యం కాదు. ఎవరి మీదా ఆధార పడకుండా, వారు తమ ప్రతిభతో ఉన్నత శిఖరాలను అందుకునేలా చేయాలన్నదే ఆయన తపన. దాన్ని చాలా వరకూ సాధించారు. అయితే ఇవన్నీ తన ఒక్కడివల్లా సాధ్యం కాలేదంటారాయన. ఈ ప్రయాణంలో, ప్రయత్నంలో తన వెంట నిలబడిన ఏ ఒక్కరినీ ఆయన మర్చిపోరు. యద్దనపూడి సులోచనరాణిగారు, ఐఏఎస్ అధికారి రమణాచారిగారితో పాటు తేజేశ్వరరావు, కనకరాజు, శోభ, శశి, లక్ష్మి, విజయ, సునీత... ఇలా ఎందరో మనసున్న మనుషుల తోడ్పాటు లేనిదే తన విశ్వదృక్ లేదంటారు. అయితే ప్రభుత్వం కూడా ముందుకొచ్చి ఆ పిల్లలకు ఓ సొంత గూడు ఏర్పరిచేందుకు కాసింత స్థలాన్ని, ప్రదర్శనలకు తీసుకెళ్లడానికి ఓ వాహనాన్ని ఇస్తే చాలని అంటున్నారు. ఆలోచన గొప్పదైనప్పుడు, ఆచరణకు మార్గాలు తెరచుకుంటాయి. లక్ష్యం ఉన్నతమైనదైనప్పుడు... దాని ఫలితాలు కూడా అద్భుతంగానే ఉంటాయి. రాము ఆలోచన గొప్పది. ఆయన లక్ష్యం ఉన్నతమైనది. అందుకే ఆయన సాక్షిగా... కొన్ని నయనాలకు వెలుగు వచ్చింది. నిరాశ నిండిన కొందరి జీవితాలకు అర్థం ఏర్పడింది. విశ్వదృక్ పేరు... పదిమంది నోట పలుకుతోంది. ముందు ముందు దేశమంతటా మోగుతుంది! - సమీర నేలపూడి -
రాము కోసం లైఫ్ లైన్