పిల్లనివ్వలేదని హతమార్చాడు
- మేనమామను కొడవలితో నరికి ...
- తుపాకీతో పోలీసులపైనే ఎదురు దాడి
- ఇన్‌స్పెక్టర్ కాల్పుల్లో మృతి
కోలారు : కూతురును తన కిచ్చి వివాహం చేయలేదని ఆగ్రహించిన మేనల్లుడు.. కొడవలితో మేనమామపై దాడి చేసి హతమార్చాడు. అరెస్ట్ చేయడానికి వచ్చిన పోలీసులపైనే దాడి చేశాడు. వారి వద్ద ఉన్న తుపాకీని లాక్కొని.. వారినే బెదిరించాడు. పరిస్థితి అదుపు తప్పకూడదని పోలీసులు జరిపిన కాల్పుల్లో ఆ నిందితుడు మరణించాడు. ఈ సంఘటన ఆదివారం రాత్రి తాలూకాలోని నపరసాపురం ఫిర్కాలో చోటుచేసుకుంది.
ఖాజీకల్లహళ్లి గ్రామానికి చెందిన రాము (28) కూలి కార్మికుడి. కుమార్తెను తనకిచ్చి వివాహం చేయాల్సిందిగా తన మేమమామ మునియప్ప(60)ను తరచుగా వేధిస్తూండేవాడు. మగపిల్లలకు పెళ్లి చేసిన అనంతరం కూతురు పెళ్లి చేస్తానని మునియప్ప దాటవేస్తూ వచ్చేవాడు. ఆదివారం రాత్రి రాము తన అత్తమామలను ఓ గదిలో ఉంచి తన వివాహ విషయం తేల్చాలని డిమాండ్ చేశాడు.
ఈ సమయంలో వారిమధ్య వాగ్వాదం జరిగింది. సహనం కోల్పోయిన రాము కొడవలితో మేనమామపై దాడికి చేశాడు. దీంతో మేనత్త వెంకటమ్మ బిగ్గరగా అరవడంతో గది బయట ఉన్న మునియప్ప కుమారులు పోలీసులకు ఫోన్ చేశారు. వెంటనే కోలారు రూరల్ ఇన్‌స్పెక్టర్ తన సిబ్బందితో ఆ గ్రామానికి చేరుకున్నారు. అప్పటికే మునియప్ప చనిపోయాడు.
గది నుంచి బయటకు రావాల్సిందిగా రాముకు పోలీసులు కోరారు. అయితే వెంకటమ్మను అడ్డు పెట్టుకొని.. రాము బెదిరించసాగాడు. దీంతో పోలీసులు ఆ గది కిటికీ తలుపులు పగులగొట్టి.. బాష్పవాయు గోళాలను ప్రయోగించా రు. అనంతరం గది తలుపులు పగులగొట్టి లోనికి వెళ్లిన ఓ కానిస్టేబుల్‌పై రాము దాడి చేశాడు. కానిస్టేబుల్ చేతిలోని తుపాకీని లాక్కొని దాడి చేశా డు.
ఈ సంఘటనలో రూరల్ ఎస్‌ఐ మహదేవప్ప, కానిస్టేబుల్ డీఎఆర్ నారాయణస్వామి, రూరల్ కానిస్టేబుల్ నారాయణస్వామి కూడా గాయపడ్డారు. తన దగ్గరకు వస్తే కాల్చేస్తానంటూ రాము పోలీసులనే బెదిరించాడు. దీంతో రూరల్ ఇన్‌స్పెక్టర్ ఏబీ సుధాకర్ తన రివాల్వర్‌తో రాముపై కాల్పులు జరిపాడు.
గాయపడిన రామును పోలీసులు కోలా రు ఆర్‌ఎల్ జాలప్ప ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం బెంగుళూరు విక్టోరియా ఆస్పత్రికి తరలించగా.. కోలుకోలేక సోమవారం ఉదయం రాము మరణించినట్లు వైద్యులు తెలిపారు. ఘటనా స్థలానికి ఎస్పీ అజయ్‌హిలోరి, డీఎస్పీ అశోక్‌కుమార్ పరిశీలించారు.