సిరిపురపు రాము కుటుంబంతో... | Siripuram Ramu Family meet with ys jagan | Sakshi
Sakshi News home page

సిరిపురపు రాము కుటుంబంతో...

Published Wed, Jul 16 2014 4:18 AM | Last Updated on Wed, Jul 25 2018 4:09 PM

సిరిపురపు రాము కుటుంబంతో... - Sakshi

సిరిపురపు రాము కుటుంబంతో...

దత్తిరాజేరు మండలం కె.కృష్ణాపురానికి చెందిన సిరిపురపు రాము చెన్నై ఘటనలో మృతి చెందారు. ఆయన భార్యాపిల్లలు అనాథలయ్యారు.

దత్తిరాజేరు మండలం కె.కృష్ణాపురానికి చెందిన సిరిపురపు రాము చెన్నై ఘటనలో మృతి చెందారు. ఆయన భార్యాపిల్లలు అనాథలయ్యారు. ఆ కుటుంబాన్ని వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పరామర్శించి ఓదార్చారు. వివరాలు అడిగితెలుసుకున్నారు. ఆ సంభాషణ ఇలా సాగింది.  
 
 జగన్: తల్లీ నీ పేరేంటి?
 బాధితురాలు: నా పేరు లక్ష్మి అండి.
 
 జగన్:ఎంతమంది పిల్లలమ్మా నీకు?
 బాధితురాలు: ఇద్దరు పిల్లలు.
 
 జగన్: అక్కడ ఎంత కూలి ఇచ్చేవారు?
 బాధితురాలు: నాకు తెలీదండి. అంతా ఆయనే చూసుకొనేవారు.
 
 జగన్: తమిళనాడు ప్రభుత్వం మీకు ఏమైనా సాయం చేసిందా?
 బాధితురాలు: నాకు తెలీదండి.
 
 జగన్: తమిళనాడు బిల్డర్ మీతో ఏమైనా మాట్లాడారా?
 బాధితురాలు:మాతో ఎవరూ మాట్లాడలేదండి.
 
 జగన్: కోర్టులో కేసు వేయండి వాళ్లే రాజీకి వస్తారు. మీకు డబ్బులు ఇస్తారుగా.
 బాధితురాలు:నాకు ఏటీ తెలీదు సారూ.
 
 జగన్: అక్కడ మన తెలుగు ఎంపీలు ఉన్నారు. వారి ద్వారా మీకు న్యాయం జరిగే విధంగా చూస్తాను.
 బాధితురాలు: అంతా మీ దయండి.
 
 జగన్: పిల్లలను బాగా చదివించు తల్లి. (అంటూ పిల్లలు వేదశ్రీ, ఐశ్వర్యలను పలకరించారు).
 బాధితురాలు: అలాగేనండి. బాగా చదివించుకుంటానండి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement