Telangana Crime News:ఆటోను ఫైనాన్స్‌ బాధ్యులు తీసుకువెళ్లారని.. తీవ్ర నిర్ణయం..
Sakshi News home page

ఆటోను ఫైనాన్స్‌ బాధ్యులు తీసుకువెళ్లారని.. తీవ్ర నిర్ణయం..

Published Mon, Aug 14 2023 12:06 AM | Last Updated on Mon, Aug 14 2023 2:26 PM

- - Sakshi

భద్రాద్రి: తన ఆటోను ఫైనాన్స్‌ కంపెనీ బాధ్యులు తీసుకువెళ్లడంతో మనస్తాపానికి గురైన యువకుడు ఉరి వేసు కుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన ఆదివారం మండలంలోని మహదేవపురంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కనపర్తి రాము (22) ఫైనాన్స్‌ కంపెనీలో ఆటో కొని మహదేవపురం నుంచి మధిర నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.

అతడికి సుమారు 2 నెలల కిందట వివాహమైంది. ఆటో సరిగా నడవకపోవడం, ఫైనాన్స్‌ కంపెనీ కిస్తీలు చెల్లించకపోవడంతో వారు ఆటోను తీసుకువెళ్లారు. దీంతో మనస్తాపానికి గురైన రాము ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంటి బయట ఉన్న దూలానికి ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై మధిర టౌన్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement