సమ్మన్న (ఫైల్)
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: తండ్రి చనిపోయాడనే దిగులుతో మనస్తాపానికి గురై కుమారుడు పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన ములకలపల్లి మండలంలోని మాధారం గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన, కూలి పనులు చేసుకుని జీవించే కొమ్మడి ముత్తయ్య నెల రోజుల కిందట అనారోగ్యంతో మృతి చెందాడు. తండ్రి చనిపోయిన నాటి నుంచి కుమారుడు కొమ్మిడి సమ్మన్న (21) తీవ్రంగా కలత చెందాడు.
పలుమార్లు తల్లి రమాదేవి, భార్య నాగేశ్వరి ధైర్యం చెప్పినా పదేపదే తండ్రిని గుర్తుచేసుకుంటూ బాధపడుతుండేవాడు. ఈ క్రమంలో గురువారం ఇంట్లో ఎవరూలేని సమయంలో సమ్మన్న పురుగులమందు తాగాడు. గమనించిన కుటుంబీకులు 108 వాహనంలో కొత్తగూడెం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం ఖమ్మం తరలించారు. సమ్మన్న చికిత్స పొందుతూ శుక్రవారం మధ్యాహ్నం మృతి చెందాడు. మృతుడి తల్లి రమాదేవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌హెచ్‌ఓ తిరుమల్‌రావు తెలిపారు.
ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com
ఇవి చదవండి: న్యూడ్ ఫొటోలుగా మార్చి.. పలువురికి పంపించి బెదిరించడంతో..
Comments
Please login to add a commentAdd a comment